సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, తనతో సహజీవనం చేసిన వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టారు. అప్పు తిరిగి ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వనస్థలిపురం పీఎస్‌కు వచ్చారు.
ఆమెతో పాటు అప్పు తీసుకున్న వ్యక్తిని పీఎస్‌కు తీసుకొచ్చారు. నువ్వేమైనా నా మొగుడివా అంటూ అతనిపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment