vanasthalipuram
-
HYD: టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో బుధవారం సాయంత్రంగ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్గమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు -
హైదరాబాద్ వనస్థలిపురంలో పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
-
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
sreeleela : వనస్థలిపురంలో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
-
భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం
-
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్
-
హైదరాబాద్ వనస్థలీపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
Hyderabad: పరోటాలో ప్లాస్టిక్ కవర్.. ఇదేమని అడిగితే!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారం తిందామని హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డర్ ఇస్తే అందులో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి.గణేష్ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో పరోటా ఆర్డర్ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. -
Hyderabad: స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. కస్టమర్లు, యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: స్పాసెంటర్పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముగ్గురు కస్టమర్లు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం నాగోలు మమతానగర్‌కు చెందిన నాగోజు విగ్నేష్‌రాజు(32) వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఫ్యూజియన్ హునిక్స్ స్పాసెలూన్ నిర్వహిస్తున్నాడు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసి అత్తాపూర్‌కు చెందిన ఎల్లమద్ది నగేశ్(27) జగదీష్Ù(37) అశోక్(40)తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఈ సెంటర్‌పై కేసు నమోదైందని, అయినా వారు నిబందనలు పాటించకపోవడంతో మరోసారి ఎస్వోటీ పోలీసులు దాడి చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పాసెంటర్‌ను తక్షణమే ఖాళీ చేయించాలని, లేదంటే ఆ అంతస్తును సీజ్ చేయిస్తామని భవన యజమానిని వనస్థలిపురం సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
హైదరాబాద్: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం
-
మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా
హస్తినాపురం(హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శారదానగర్ కాలనీ ఫేజ్–3లో ఉండే వరదవాణి(60) తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆ మహిళ వ్యభిచారం చేస్తుండగా, పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. -
Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్‌గూడకు చెందిన వినోద్‌కుమార్ (40)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి. దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్
సాక్షి, హస్తినాపురం: వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్ గ్రామానికి చెందిన పి.జగదీష్ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు బయలుదేరాడు. చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్ సోదరుడు వెల్లడించారు. చదవండి: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. టైర్ నడుముపై నుంచి వెళ్లడంతో -
వనస్థలిపురం లో రేడియోటవర్ ఎక్కిన వ్యక్తి
-
అంతయ్య మృతదేహం లభ్యం
-
లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్
సాక్షి, వనస్థలిపురం: లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కుంటలోని మనోహర్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109పై దాడి చేయగా అందులో ఓ వ్యక్తి, మహిళను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం.. -
విక్టోరియా హోమ్‌లో కరోనా కలకలం
-
హైదరాబాద్: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం
-
వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి మహిళ మృతి
సాక్షి, వనస్థలిపురం: వెన్నుపూసకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం వనస్థలిపురం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ అప్పలమ్మగూడంకు చెందిన సిరసవాడ నాగేష్, నాగమణి (27) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగమణి కొంతకాలంగా నడుం, వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆపరేషన్ నిమిత్తం బుధవారం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం నాగమణి ఆరోగ్యం క్షీణించడంతో మధ్యరాత్రి ఆమె మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగమణి మృతి చెందిందని ఆపరేషన్ సమయంలో ఆసుపత్రిలో రక్తం నిల్వలు కూడా లేవని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత నాగమణికి కాళ్లు పని చేయక పోవచ్చు అని చెప్పిన వైద్యులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆమె భర్త నాగేష్ రోధిస్తూ తెలిపాడు. వైద్యులు హడావిడిగా ఆపరేషన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారని బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు బాధితుల తరపున ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందేలా చేయడంతో గొడవ సద్దుమణిగింది. మా నిర్లక్ష్యం లేదు: ఆసుపత్రి నిర్వాహకులు నాగమణికి ఆపరేషన్ నిర్వహించిన తర్వాత సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు మెరుగైన చికిత్సను అందించామని వైద్యులు వేణుగోపాల్ తదితరులు తెలిపారు. ఒకేసారి హార్ట్ మీద ప్రెషర్ పడటంతో ఆమె మృతి చెందిందన్నారు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని వారు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు పేర్కొన్నారు. -
మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్!
సాక్షి, హస్తినాపురం: బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు కిడ్నాప్‌కు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వనస్థలిపురం ఎస్సై చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలంలోని కేసీఆర్‌కాలనీకి చెందిన సంకు శ్రీసౌమ్య ఆటోనగర్‌లోని నవతా ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తూ మన్సురాబాద్‌లోని చిత్రసీమకాలనీలో అద్దెకు ఉంటోంది. రెండు నెలల నుంచి తన చెల్లెలు సంకు శ్రీదేవి(17) తన దగ్గరే ఉంటుండగా ఈనెల 24రోజున భద్రాచలం గ్రామానికి చెందిన చెట్ల తరున్‌కుమార్ (20) మాయమాటలు చెప్పి కిడ్నాప్‌కు చేశాడని సౌమ్య వనస్థలిపురం పోలీసులకు 25న ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌కు గురైన శ్రీదేవి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని తెలిపారు. గతంలో కూడా తరున్‌కుమార్‌పై భద్రాచలం పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య మాడ్గుల: ఓ మైనర్ బాలిక (16).. తండ్రి మందలించాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై బద్యానాయక్ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని కూబ్యాతండాకు చెందిన మైనర్‌బాలిక అదే తండాకు చెందిన ఓ యువకుడితో మాట్లాడినందుకు గాను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్ కలకలం -
భర్త హత్య.. నౌసిన్‌కు సహకరించింది అతడే!
హస్తినాపురం: ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తను హత్య చేసి పూడ్చి పెట్టిన కేసులో నిందితురాలైన అతడి భార్య నౌసీన్బేగంను వనస్థలిపురం పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఆమెకు సహకరించిన మరో నిందితుడు సునీల్ తివారీ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అతడిని పురానాపూల్ ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మురళీమోహన్ తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నౌసిన్ బేగం అలియాస్ మరియాద అగర్వాల్ (32), గగన్ అగర్వాల్ (38) భార్యాభర్తలు. నౌసిన్‌కు గతంలోనే పెళ్లయి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్తతో గొడవలు కావడంతో విడాకులు ఇచ్చి వేరుగా ఉంటున్న ఆమెకు గగన్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో అప్పటికే భార్యతో విడాకులు తీసుకున్న అతడు, నౌసిన్‌ను ప్రేమించి గతేడాది ఏడాది జూన్‌లో మతాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వివేకానందనగర్ కాలనీలోని గగన్ అగర్వాల్ సొంతింటిలో కాపురం పెట్టారు. ఎనిమిది నెలలుగా బాగానే సాగిన వీరి కాపురంలో, ఆ తర్వాత కలతలు చెలరేగాయి. ఈ క్రమంలో గత నెల 8న గగన్, నౌసిన్ మధ్య తీవ్ర ఘర్షణ జరగగా, నౌసిన్ ఆగ్రహంతో కత్తి తీసుకొచ్చి గగన్ గొంతులో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో గగన్ మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు నౌసిన్ అంగీకరించింది. చదవండి: దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య విషాదం.. నవ దంపతుల దుర్మరణం -
ఇంట్లోని కుళాయి గుంతలో మృతదేహాన్ని పూడ్చిన మహిళ
-
భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య
సాక్షి, హస్తినాపురం: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏదో చిన్నగొడవ అయితే ఆవేశం పట్టలేకపోయింది.. భర్తను కత్తితో పొడిచి చంపేసింది.. ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో పెట్టి పూడ్చేసింది. ఏమీ తెలియనట్టుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో గట్టిగా ప్రశ్నించడంతో తానే చంపేసినట్టు ఒప్పేసుకుంది. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ పరిధి వివేకానందనగర్ కాలనీ ఫేజ్–2లో ఈ ఘటన జరిగింది. ఆ మహిళను అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు మొత్తం వివరాలను బుధవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నౌసిన్ బేగం అలియాస్ మరియాద అగర్వాల్ (32)కు గతంలోనే పెళ్లయి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్తతో గొడవలు కావడంతో విడాకులు ఇచ్చి వేరుగా ఉంటోంది. మరోవైపు గగన్ అగర్వాల్ (38) అనే వ్యక్తి కూడా అప్పటికే పెళ్లయి భార్యకు విడాకులు ఇచ్చాడు. అతను యాకుత్‌పురాలో నివాసం ఉంటున్న క్రమంలో నౌసిన్తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వారు గత ఏడాది జూన్‌లో మతాంతర వివాహం చేసుకుని వివేకానందనగర్ కాలనీలోని గగన్ అగర్వాల్ సొంతింటిలో కాపురం పెట్టారు. ఎనిమిది నెలలుగా బాగానే ఉన్నారు. అయితే గత నెల 8న గగన్, నౌసిన్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నౌసిన్ ఆగ్రహంతో కత్తి తీసుకొచ్చి గగన్ గొంతులో పొడవడంతో కిందపడిపోయాడు. అప్పటికీ విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే నౌసిన్ ఈ విషయం బయటపడకుండా ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో గగన్ మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. మరుసటి రోజు గగన్ సోదరుడు ఆకాశ్ అగర్వాల్ అక్కడికి వచ్చాడు. గగన్ ముందురోజే ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదని నౌసిన్ చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి గగన్ అదృశ్యమైనట్టు గత నెల 9న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు ఘటన జరిగింది తమ పరిధికాకపోవడంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అక్కడ గత నెల 24న కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మన్సూరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. చివరికి అనుమానంతో నౌసిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తు సందర్భంగా తానే గగన్‌ను హత్యచేసినట్టు నౌసిన్ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యలో ఆకాశ్ అగర్వాల్ పాత్ర ఏమైనా ఉందా, మరెవరికైనా సంబంధం ఉందా అన్న కోణంçలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం -
‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’
సాక్షి, హైదరాబాద్: గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ చేసి వివాహితతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. వేరే వారికి ఆమె నంబర్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాలు.. ఆదిభట్ల మున్సిపాలిటిలోని పటేల్ గూడకు చెందిన గడుసు నరసింహ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఆమెకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ‘‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’’ అంటూ అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ.. వేధింపులకు గురి చేసేవాడు. అంతటితో ఊరుకోక ఇతరులకు వివాహిత నంబర్ ఇచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడిని నరసింహంగగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నరసింహంతో పాటు అతడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మరో షాకింగ్ అంశం ఏంటంటే నరసింహం గత జూలైలో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికి అతడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. చదవండి: కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ.. -
వనస్థలిపురంలో కారు బీభత్సం, సీసీటీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. గౌతమ్ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు (నెంబర్: TS05FH2356)) డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. గౌతమ్‌తో పాటు కారులో వెనకాల సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం -
ఈ కారుకు నిబంధనలు వర్తించవా?!
మీర్‌పేట: ఈ కారుకు మోటార్ వాహన చట్టం నిబంధనలు వర్తించవా.? కొన్ని నెలలుగా నంబర్ ప్లేటు లేకుండానే రోడ్డెక్కుతున్న కారు. మీర్‌పేట కార్పొరేషన్ జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్ తనయుడు మోటారు వాహన చట్టం నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఇన్నోవా కారుకు నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడు. నంబర్ ప్లేటులోని ఓ నంబర్ సరిగ్గా కనిపించకపోతేనే వాహనాన్ని ఆపి మరీ జరిమానాలు విధించే ట్రాఫిక్ అధికారులకు గత కొన్ని నెలలుగా అసలు నంబర్ ప్లేటు పూర్తిగా లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్న ఈ వాహనం కనిపించడం లేదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జరిమానా విధిస్తాం... ఈ విషయంపై వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ బద్యానాయక్‌ను వివరణ కోరగా నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడిపితే జరిమానాలు విధిస్తాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. -
కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఎస్సైలను బ్లాక్మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ లతా రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన లతా రెడ్డి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించింది. పోలీసు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేదాన్నని తెలిపింది. వివరాలు.. టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. -
కేసీఆర్ ఇంట్లో ఉండే లిఫ్ట్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు!
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.28 కోట్లతో3 బ్లాక్‌ల్లో 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అయిదేళ్ల క్రితం జై భవాని నగర్లో గుడిసెలు ఉండేవని, ఇక్కడున్న వారి కోసం ఆనాడు వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే లిఫ్ట్ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఏర్పాటు చేశామని తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో పేదవారి ఆత్మగౌరనికి ఈ డబుల్ బెడ్ రూమ్‌లు ప్రతీక అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 40 నుంచి 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎక్కడ తక్కువ కాకుండా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నీ ప్రైవేట్ గేటెడ్ కమ్మునిటీ ని తలపిస్తున్నాయి. ఉచితంగా ఇల్లు పొందిన ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. -
ఏరియా ఆసుపత్రిలో దారుణం
సాక్షి, వనస్థలిపురం(హైదరాబాద్): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు. చదవండి: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి! అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్‌కు రిఫర్ చేశామని చెప్పారు. చదవండి: పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు కొత్త విధానం బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్‌పేట కార్పొరేటర్ రాజ్‌కుమార్, తదితరులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. -
వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఎసీపీ జయరాం సస్పెన్షన్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. బాధితులతో కలసి స్పెషల్ టీం సభ్యులు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 81నుంచి 200 మద్య లోని 400 ఎకరాలను అధికారులు పరిశీలించారు. సానా సతీష్ ఆదీనంలోని ఈ 147ఎకారాల్లోని వేలకోట్ల విలువైన భూమి వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ భూమిపై కలకత్తా ఫైనాన్స్ కంపెనీ నుంచి సానా సతీష్ భారీగా రుణం తీసుకోగా.. కలకత్తా కంపెనీ హైపొతికేషన్ పేరుతో భూముల్లో బోర్డ్‌లు పాతారు. (కీసర ఇంచార్జ్ తహశీల్దార్‌గా గౌతమ్ కుమార్) అయితే టెనెంట్స్‌కు , యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు అవ్వడంతో ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుటుంబం అని రుజువైంది. సానసతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఏమ్మార్వో ,వీఆర్వో సస్పెన్షన్.. విజయారెడ్డి అనే ఎమ్మార్వో దారుణ హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌తో పాటు తాజాగా సానాసతీష్ అనుచరులకు జయరాం సహకరిస్తున్నాడన్న ఆరోపణలతో ఏసీపీపై బాధితులు అధికారులకు పిర్యాదు చేశారు. (బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) -
అంత్యక్రియలపై వివాదం.. కేటీఆర్‌కు ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటుచేసుకుంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా తన భర్త అంత్యక్రియలు నిర్వహించారని జీహెచ్ఎంసీ, గాంధీ ఆస్పత్రిపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్.. కరోనాతో ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే ఆ వ్యక్తి మరణించాడని, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? వనస్థలిపురంలోని మధుసూదన్ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకున్న మిగతా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ కేటీఆర్‌కు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. @KTRTRS Missing case of my husband at Gandhi hospital.... Hello K. Taraka Rama Rao sir, Myself madhavi w/o Madhusudhan(age:42) living with two daughters in vanasthalipuram. As our family members being suffering from corona had admitted in Gandhi hospital & we all had — Alampally Madhavi (@AlampallyMadha3) May 20, 2020 స్పందించిన మంత్రి ఈటల కరోనా బారిన పడి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలపై చెలరేగిన వివాదంపై మంత్రి ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ‘వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కుటుంబం మొత్తానికి కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈశ్వరయ్య చనిపోయారు. అయన కుమారుడు మధుసూదన్ అదే రోజు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 1వ తేదీన చనిపోయారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పాము, అయితే తన భర్త చనిపోయాడని భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు, మరొకరి మృతి గురించి చెబితే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా అన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలోనే ఉండటంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసింది. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేద’ని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. చదవండి: తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం ఇంట్లో నాగన్న.. బయట కరోనా -
కరోనా.. వనస్థలిపురంలో 8 కంటైన్మెంట్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో కరోనా కలకం రేపుతోంది. ఈ ప్రాంతంలో ఇటీవల కరోనా కేసులు నమోదు కావడంతో.. అధికారులు 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. కంటైన్మెంట్ జోన్లలో సోమవారం నుంచి వారం రోజుల పాటు రాకపోకలను బంద్ చేయనున్నారు. అలాగే ఈ 8 కాలనీల పరిసరాల్లో కఠిన అంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వనస్థలిపురంలో మొత్తం 169 కుటుంబాలు హోం క్వారంటైన్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వనస్థలిపురం హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయ నగర్, ఎస్కేడీ నగర్, రైతుబజార్-సాహెబ్‌నగర్ రహదారిని కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించినట్టుగా అధికారులు తెలిపారు. కాగా, వనస్థలిపురం పరిధిలోని మూడు కుటుంబాలు కరోనా బారినపడగా.. ఇప్పటివరకు 9 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చదవండి : కరోనా నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్‌లో శ్రీదుర్గ బార్‌పై కేసు నమోదు.. -
కరోనా: వనస్థలిపురంలో ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో అధికారులు కరోనా వచ్చిన ఇంటి పరసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతంలో ఎవరూ సంచరించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయించారు. వివరాలలోకి వెళితే... గడ్డిఅన్నారం డివిజన్ శారదానగర్‌కు చెందిన వ్యక్తి(50) మలక్‌పేట గంజిలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. జ్వరంతో బాధపడుతూ వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే సోదరుడు ఇంటికి వచ్చి అతడి సహాయంతో స్థానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో ఈ నెల 22 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు చికిత్స పొందాడు. అయితే అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించి, అతడి సోదరుడి కుటుంబ సభ్యులను ఇంటిలోనే క్వారంటైన్ చేశారు. ఈ క్రమంలో అతడి సోదరుడి తండ్రి(70)కి కూడా కోవిడ్ సోకింది. అప్పటికే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధుడిని మంగళవారం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మొదట కరోనా పాజిటివ్‌గా తేలిన నూనె వ్యాపారి నుంచి అతడి భార్యకు, సోదరుడికి, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లకూ వైరస్ సంక్రమించించింది. వనస్థలిపురంలో అధికారుల పర్యటన వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ భీమానాయక్, ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, ఏసీపీ జయరాం తదితరులు కాలనీని సందర్శించారు. కాలనీలో కొంతమేర రెడ్ జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. (కేసుల్లో దాపరికం లేదు: ఈటల) ప్రైవేటు ఆసుపత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వనస్థలిపురంలోని జీవన్‌సాయి ప్రైవేటు ఆసుపత్రి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నూనె వ్యాపారికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికి అధికారులకు తెలపకుండా డబ్బులకోసం వైద్యం చేసిన ఆసుపత్రి తీరును వారు దుయ్యబడుతున్నారు. కరోనా బాధితుడి నుంచి అతడి సోదరుడి కుటుంబంలోని అందరికీ కరోనా వైరస్ సోకడం.. సోదరుడి తండ్రి చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా కిరాణా, పాల వ్యాపారం నిర్వహిస్తున్న కరోనా బాధితుడి సోదరుడి నుంచి బయటి వారికి ఎవరికైనా కరోనా సోకిందా అనే దానిపై వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. జీహెచ్ఎంసీ: అంతు చిక్కని వైరస్.. మూలాలు ఎక్కడ? -
ప్రాణం మీదకు తెచ్చిన ‘చాక్లెట్ గొడవ’
హస్తినాపురం: నోరూరించే చాక్లెట్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. డీమార్ట్‌లో చాక్లెట్ తీసుకొని డబ్బులు చెల్లించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడగడంతో ఆదివారం సాయంత్రం షాపింగ్ వచ్చిన సతీష్ (18) భయంతో కుప్పకూలాడని ఆ సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యా?.. లేక ఆకస్మిక మరణమా అనేది తేలనుంది. డీమార్ట్‌లో షాపింగ్ చేసి బయటకు వచ్చేంత వరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, బయటకొచ్చాక అతడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీమార్ట్ ఎంట్రెన్స్‌కు 40 మీటర్ల దూరంలో పడిపోయిన సతీష్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ సందర్శించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట జిల్లా జగ్గు తండాకు చెందిన లౌడ్య బాలాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్(18) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. 10 మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఔటింగ్‌కు వెళ్లారు. సతీష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 8.10కి వనస్థలిపురం డీమార్ట్‌లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్ డైరీ మిల్క్ చాక్లెట్ జేబులో వేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే ఎగ్జిట్ గేట్ దాటి బయటకు వచ్చిన సతీష్‌ను సెక్యూరిటీ సిబ్బం ది పిలవడంతో చాక్లెట్‌ను జేబులో నుంచి కిందపడేశాడు. అప్పటికే చెమటలు పట్టిన సతీష్ ఒక్కసారిగా కుప్పకూలడంతో మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారి పోయారు. మరణవార్త తెలుసుకొని వచ్చిన సతీష్ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వి ద్యార్థి సతీష్‌ను బంధువుల అనుమతితోనే ఔటింగ్‌కు పం పామని కళాశాల ప్రిన్సిపల్ స్నేహలత తెలిపారు. ఇంటర్ విద్యార్థిని దొంగతనం నెపంతో కొట్టి హతమార్చిన డీమా ర్ట్ యాజమాన్యంపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని లంబాడ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆ సంస్థ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. డీమార్ట్‌ను మూసివేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
భర్త ఇంటిముందు భార్య ధర్నా!
సాక్షి, హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందని ఓ ప్రబుద్ధుడు భార్య ఇంటి నుంచి గెంటేశాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తానంటూ షరతులు పెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం వంతపాడారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు తన చిన్నారితో కలిసి ఓ మహిళ మౌనపోరాటానికి దిగింది. పసిపాపతో కలిసి ధర్నా చేపట్టింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్‌లో జరిగింది. సహారా ఎస్టేట్‌లో ఉంటున్న మౌనిక, ఉదయ్‌కుమార్ దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది నుంచి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అత్తమామలే కాదు మరిది కూడా తనను కొట్టేవారని బాధితురాలు మౌనిక తెలిపారు. ఈ క్రమంలో ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి భర్త ఉదయ్ బయటకు పంపించాడని పేర్కొంటూ మౌనిక తన చిన్నారి కూతురితో కలిసి ధర్నా చేపట్టారు. అంతేకాకుండా సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా చేస్తున్న మౌనికను, ఆమె బిడ్డను భర్త, అత్తమామ ఇంట్లోకి తీసుకెళ్లారు. -
చింతలకుంటలో రష్మికా సందడి
-
వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు
-
వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గత నెల 26న వనస్థలిపురంలో గుడిసెకు నిప్పంటుకుని రమేష్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ విచారణలో మరో కోణం బయటపడింది. అతని భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా కుమ్మరిగడ్డకు చెందిన కన్నెబోయిన రమేశ్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ.. బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఎస్కేడి నగర్‌లోని ఖాళీ స్థలంలో గుడిసె వేసుకొని భార్య స్పప్నతో కలిసి నివాసముంటున్నాడు. కాగా, స్పప్న.. వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. వ్యవసాయ పనుల కోసమని చెప్పి స్వగ్రామం వెళ్లిన స్వప్న.. సెప్టెంబర్ 26న ప్రియుడు వెంకటయ్యతో కలిసి నగరానికి వచ్చింది. అదే రోజు రాత్రి.. వనస్థలిపురంలోని గుడిసెపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న రమేశ్ సజీవ దహనమయ్యాడు. గుర్తుతెలియన వ్యక్తి సజీవదహనం అయ్యాడని సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. స్పప్న, అతని ప్రియుడు వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో కలిసి టిక్‌టాక్ చేసి.. హత్యకు ముందు స్వప్న తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల.. వైకుంఠపురములోని‘ రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో... ’ అనే పాటకు సంతోషంగా స్టెప్పులేశారు. అంతలోనే తాను ఎంతో ప్రేమించే భార్యే తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. -
లంచ్ బాక్స్‌లో చికెన్.. అవన్నీ ఇంట్లో చెబుతావా..?
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లో జరిగే విషయాలు ఇంట్లో చెబుతావా అంటూ ప్రిన్సిపల్ చితకబాదటంతో విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలు.. సాత్విక్ అనే బాలుడు స్థానిక ఎన్నారై స్కూళ్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా లంచ్ బాక్స్‌లో చికెన్ తీసుకుని వెళ్లాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇతర తరగతుల విద్యార్థులు అతడి టిఫిన్ బాక్స్ లాక్కొని తినేశారు. ఈ విషయం గురించి సాత్విక్ ఇంట్లో చెప్పినట్లు గుర్తించిన ప్రిన్సిపాల్ కృష్ణవేణి.. శుక్రవారం అతడిని ఇష్టారీతిన కొట్టింది. ప్రిన్సిపాల్ తీరుతో బెంబేలెత్తిపోయిన సాత్విక్‌కు వాంతులు మొదలయ్యాయి. అదే విధంగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సాత్విక్ తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సాత్విక్ నానమ్మ, తాతయ్య ఎన్నారై స్కూల్ యాజమాన్యంపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. -
వనస్థలిపురంలో అగ్నిప్రమాదం
-
టైర్ల గోదాంలో ఎగిసిపడ్డ అగ్ని కీలలు
-
టైర్ల గోదాంలో ఎగిసిపడ్డ అగ్ని కీలలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ టైర్ల గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లలో ఘటనా స్థలానికి చేరుకొని అంతకంతకూ రెట్టింపవుతున్న మంటలను ఆర్పివేశారు. దీంతో గోదాం చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. గోదాం పక్కనే నివాముండే ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని అపార్ట్మెంట్లలోకి పరుగులు తీశారు. నల్లని పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియురాలిని కిందకు నెట్టేసిన ప్రియుడు
-
ప్రియురాలిని బిల్డింగ్ పైనుంచి నెట్టివేసాడు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి ప్రియురాలిని కిందకు నెట్టివేశాడు. తీవ్ర గాయలతో ఉన్న ఆ యువతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన సీమ, దిలీప్‌లు 15 రోజుల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురం శక్తినగర్‌లోని వాసవి నిలయం భవనం నిర్మాణం జరుగుతుంటే అందులో పనికి చేరారు. అయితే గురువారం సీమను దిలీప్ బిల్డింగ్‌పై నుంచి నెట్టివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
దోచుకుంది 58 లక్షలు.. రీకవరి 4 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఏటీఎం నుంచి రూ. 58 లక్షలను దొంగిలించి, ఆటోలో పరారైన కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ దోపిడీని చేసింది తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్ అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసి.. వారి నుంచి మొత్తం రూ. నాలుగు లక్షలు రికవరీ చేశారు. మే 7న వనస్థలిపురం పనామా దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన మనీ లోడింగ్ సిబ్బంది దృష్టి మరల్చి కొందరు దుండగులు రూ. 58 లక్షలను ఎత్తుకొని ఆటోలో పరారయ్యారు. కేసును సవాల్‌గా తీసుకొన్న రాచకొండ కమిషనర్, ఎల్బీ నగర్ పోలీసులు మూడు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో వాటి ఆధారంగానే ఈ కేసును చేధించినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, కొన్ని టెక్నీకల్ ఎవిడెన్స్‌ను బట్టి ఈ చోరీలో దీపక్, సత్యరాజు పేర్లు బయటకి రావడంతో నిందితులను గుర్తించామని గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. అంతేకాక రాంజీ నగర్ గ్యాంగ్ సభ్యుడు దీపక్ అలియాస్ దీపు ముఠాని పట్టుకున్నామని, నిందితుల నుంచి మొత్తం 4 లక్షలు నగదు, కారు, 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఏటీఎం చోరీ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారని చెప్పారు. అందులో 11 మంది తమిళనాడుకి చెందిన వారు కాగా, ముగ్గురిది పశ్చిమ బెంగాల్ అని, దొంగిలించిన తర్వాత దుండగులు అక్కడ నుంచి ట్రైన్లో తమిళనాడులోని వారి స్వస్థలాలకు వెళ్లారని తెలిపారు. వీరందరిది రాంజీ నగర్ అని, ఈ ఊరిలో చాలామంది ఇలాంటి నేరాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ వివరించారు. చెడ్డి గ్యాంగ్ తరహాలోనే రాంజీ గ్యాంగ్ కూడా దృష్టి మరల్చి చోరీలు చేస్తారని, ఇలాంటి గ్యాంగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. గతంలో ఓ కేసులో ఇన్ఫార్మర్ అనే నేపంతో ఓ వ్యక్తిని ఈ గ్యాంగ్ హత్య చేసిందని తెలిపారు. రాంజీ గ్యాంగ్ ప్రతి ఏడాది ఓ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటారని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారం, చార్ట్ గీసుకొని దోపిడీలు చేస్తారని గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. -
సులబ్ కాంప్లెక్స్‌లో డబ్బులపెట్టె పడేసి..
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చోరీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్‌గా గుర్తించారు. 8 ప్రత్యేక బృందాలతో పోలీసులు రాంజీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చోరీ అనంతరం మలక్‌పేట్‌లోని ఓ సులబ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి డబ్బును సంచుల్లోకి మార్చుకుని పెట్టును పడేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉన్న నిందితుల కోసం తమిళనాడుతో పాటు 5రాష్ట్రాలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. నగదు చోరీ తర్వాత రాంజీ గ్యాంగ్ సభ్యులు దిల్సుఖ్ నగర్ వరకు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. గతంలో రాంజీ గ్యాంగ్‌పై పలు కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రాంజీ గ్యాంగ్ పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్ దిట్ట. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. -
58.97 లక్షలు కొట్టేసిన కేసులో కీలక పురోగతి
-
దీపక్ గ్యాంగ్ పనేనా!
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పనామా గోడౌన్స్ వద్ద మంగళవారం పట్టపగలు రూ.58.97 లక్షలు ఎత్తుకుపోయింది తమిళనాడులోని రామ్‌జీనగర్‌కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కేంద్రంలోని మిషన్లలో నగదు నింపడానికి వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించిన ముఠా నగదు ఎత్తుకుపోయిన విషయం విదితమే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేరం చేయడానికి ముందు దుండగులు సమీపంలోని ఓ ఇరానీ హోటల్లో టీ తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ ఆధారంగా గుర్తించారు. ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు అనుమానితుల ఫొటోలు సేకరించారు. వీటిని ఇప్పటి వరకు ఈ తరహా దృష్టి మళ్లించి దోచుకుపోయే నేరాల్లో అరెస్టయిన పాత నిందితుల ఫొటోలతో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే ఇది రామ్‌జీనగర్‌కు చెందిన దీపక్ గ్యాంగ్ పనిగా తేలింది. ఈ ముఠాకు చెందిన అనేక మంది పాత నేరగాళ్ల ఫొటోలతో సీసీ కెమెరా ఫీడ్ నుంచి తీసినవి సరిపోలాయి. వీటిని పోలీసులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. రూ.1,650 వెదజల్లి.... మరోపక్క నగదు రవాణా వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించడానికి ఈ నేరగాళ్లు నగదు చల్లారు. ఆ వాహనం నుంచి కస్టోడియన్లు నగదు నింపడానికి వెళ్లిన ఏటీఎం కేంద్రం వరకు ఇలా చేశారు. ఈ మొత్తం రూ.1,650 అని లెక్కతేలింది. నేరగాళ్లు ఈ కరెన్సీ నోట్లతో పాటు కొంత మలేసియా కరెన్సీ కూడా కింద చల్లారు. దీన్ని బట్టి ఈ ముఠా ఇంతకు ముందు మరో నేరం చేసి ఆ డబ్బుతో మలేసియా వెళ్లి జల్సాలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నా రు. కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు భావిస్తున్నారు. వారం పాటు ఓ ప్రాంతంలో బస చేసి, పక్కా రెక్కీ అనంతరమే ఈ గ్యాంగ్ పంజా విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించడానికి మూడు కమిషనరేట్లలో ఉన్న లాడ్జీలు, హోటళ్ల నుంచి రాచకొండ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుని.... నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుసుకున్న నేరగాళ్లు తెలివిగా వ్యవహరించారు. రామ్జీనగర్ గ్యాంగ్ సొంత ద్విచక్ర వాహనాలు వాడుతుంది. ఈసారి మాత్రం ఘటనాస్థలి వరకు వేర్వేరు మార్గా ల్లో వచ్చిన నేరగాళ్లు నగదు ఉన్న ట్రంక్ పెట్టెను కొట్టేసిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించా రు. ఇలా చేస్తే తాము ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే లోపు వీలైనంత దూరం వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దృష్టి మళ్లించడం ద్వారా కాజేసిన డబ్బు పెట్టెతో రోడ్డు దాటిన నేరగాళ్లు అక్కడ ఉన్న ఓ సెవెన్ సీటర్ ఆటో ఎక్కి ఎల్బీనగర్ వరకు వెళ్లారు. ఈ ప్రయాణం సాగుతున్నంత సేపు ఆటోడ్రైవర్‌తో ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో ఆటోలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. వీరంతా ఒకే ముఠా వారని నిర్ధారించారు. ఎల్బీనగర్ లో ఆటో దిగి డ్రైవర్‌కు రూ.100 ఇచ్చి రూ.50 తిరిగి తీసుకున్నారు. అక్కడ నుంచి మరో ఆటో ఎక్కి దిల్సుఖ్నగర్ వరకు, అట్నుంచి వేరే ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీళ్ల కోసం వేటాడుతూ పోలీసులు రామ్జీనగర్ వరకు వెళ్లినా ఈ ముఠా ఇంకా అక్కడకు చేరలేదని తెలిసింది. మరోపక్క వనస్థలిపురం పోలీసులు ఈ నేరం జరిగిన తీరును అధ్యయనం చేస్తూ బుధవారం క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. -
వనస్థలిపురం దోపిడీ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడింది చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌గా గుర్తించారు. నగదు చోరీ తర్వాత దిల్సుఖ్ నగర్ వరకు దుండగులు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 20 బృందాలతో రాంజీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులు, టోల్గేట్లను పోలీసులు అలెర్ట్ చేశారు. గతంలో రాంజీ గ్యాంగ్‌పై పలు కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రాంజీ గ్యాంగ్ పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్ దిట్ట. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. -
58.97 లక్షలు కొట్టేశారు
హైదరాబాద్: పట్టపగలు.. జనసమ్మర్ద ప్రాంతం.. ఆ పక్కనే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.. అయినా దొంగలు అదురూబెదురూ లేకుండా చేతివాటం ప్రదర్శించారు. భారీ చోరీకి తెగబడ్డారు. పక్కా ప్రణాళికతో భారీ నగదు కాజేశారు. కాపలాదారు కన్నుగప్పి సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం నగర శివారులోని వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు విడుదల చేసిన అనుమానితుల చిత్రాలు డబ్బులు పడిపోయాయని నమ్మించి.. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఈ వాహనం నుంచే నగదు పెట్టెను కొట్టేశారు.. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ వెంకటయ్య సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నగదు ఎత్తుకెళ్లిన దొంగల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్రాష్ట ముఠా పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పనామా చౌరస్తా నుంచి దిల్సుఖ్నగర్ వైపునకు వెళ్లిన ప్యాసింజర్ ఆటోను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అయితే ప్యాసింజర్ ఆటోలో మరో నలుగురు ఉండటంతో ఈ దొంగతనంలో వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ, బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టోడియన్ మహ్మద్థా ఫిర్యాదు మేరకు పోలీçసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. -
వనస్థలిపురంలో వివాహితపై సామూహిక అత్యాచారం
-
అపార్ట్మెంట్ నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
-
పెళ్లైన 6 నెలలకే నవ వధువు ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : వనస్థలీపురంలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సుష్మసాయి నగర్లో ఆదివారం జరిగింది. మృతురాలిని నివేదితగా గుర్తించారు. భర్తతో రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితకే నివేదితకు వివాహం అయింది. -
వనస్థలిపురంలో ప్రణీత సందడి
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ ఇల్లాలి ఘాతుకం
సాక్షి, హైదరాబాద్ : కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు చిక్కింది ఓ ఇల్లాలు. భర్త ఉద్యోగంతో పాటు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన కేస్యా నాయక్, పద్మ భార్యాభర్తలు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాయక్ చనిపోతే, అతడి ఉద్యోగంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే దురాశతో భార్య పద్మ, మరో వ్యక్తి వినోద్ సాయంతో హత్య చేసింది. ముందుగా నాయక్‌కు ఊపిరాడకుండా చేసి, అనంతరం కారును ఓ ఎలక్ట్రిక్ పోల్‌కు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పద్మతోపాటు వినోద్ కూడా నేరం చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: అతి వేగంతో ఓ కారు రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్‌కు చెందిన భవ్యతేజారెడ్డి (27), రహీం(24)లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి కారు(టీఎస్08ఈహెచ్ 9995)ను అతి వేగంగా నడుపుతున్నారు. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వెళ్తుండగా ఆటోనగర్ జింకలపార్కు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో భవ్యాసింగ్ (34) అక్కడికక్కడే మృతి చెందగా, మాన్సింగ్ (25), ఈశ్వర్‌లాల్ (30), రాంసింగ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తితోపాటు గాయపడిన వారంతా రాజస్థాన్‌కు చెందిన వారని, వీరంతా బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారని స్థానికులు తెలిపారు. కారు నడుపుతున్న భవ్యతేజారెడ్డి, రహీంలు మద్యం మత్తులో ఉన్నారని, వారిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుధాకర్ రావు తెలిపారు. క్షతగాత్రుల్లో రాంసింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, తనతో సహజీవనం చేసిన వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టారు. అప్పు తిరిగి ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వనస్థలిపురం పీఎస్‌కు వచ్చారు. ఆమెతో పాటు అప్పు తీసుకున్న వ్యక్తిని పీఎస్‌కు తీసుకొచ్చారు. నువ్వేమైనా నా మొగుడివా అంటూ అతనిపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. -
హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేశాడు..
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని కత్తితో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. పనామా వద్ద ఓ రైతు చికెన్ బజార్, లైవ్ ఫిష్ షాపులో పనిచేస్తున్నాడు. గిరి అనే వ్యక్తి అతని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాసేపట్లో పెళ్లి..అంతలోనే విషాదం
-
వనస్థలిపురంలో రెండుచోట్ల చోరీలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల చోరీలు జరిగాయి. సహారా కాలనీ, వనస్థలి హిల్స్ కాలనీలలో దొంగతనాలు జరిగాయి. ఓ ఫోటో స్టూడియో, మరో రియల్ ఎస్టేట్ కార్యాలయంలో రూ.2 లక్షల విలువైన కెమెరాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు దొంగలు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం చైతన్య నగర్లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అంతయ్య(68) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నారు. అతడి బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈయన దేవరకొండ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. -
మృత్యు శకటాలు
-
అత్తింటి వారు వెళ్లగొట్టారని మహిళ ఆందోళన
-
హైదరాబాద్‌లో మరో ‘ఓలా’ దురాగతం
హైదరాబాద్ : మహిళా ప్రయాణికురాలిని తీవ్రంగా వేధించిన కేసులో మల్టీనేషనల్ కంపెనీ ఓలా క్యాబ్ డ్రైవర్ ఒకరు అరెస్టయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాబ్ డ్రైవర్ శివకుమార్(22)ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు వనస్థలిపురం పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాల్లోకివెళితే.. గచ్చిబౌలి సమీప గౌలిదొడ్డి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగానూ ఓ మహిళ ఓలా షేరింగ్ క్యాబ్‌ను బుక్ చేశారు. గౌలిదొడ్డిలో ఆమె కారు ఎక్కారు. కొద్ది దూరంలోనే మిగతా ప్యాసింజర్లంతా దిగిపోయారు. అదే డ్రైవర్.. ఒంటరి మహిళను వేధించడం మొదలుపెట్టి, మొబైల్నంబర్ ఇవ్వాల్సిందిగా బలవంతం చేశాడు. మాటల్లోనే కారును దారి మళ్లించి పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదకు తీసుకెళ్లాడు. అప్పటికే బెంబేలెత్తిన మహిళ.. గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దింపేసి పారిపోయాడు. అనంతరం ఆటోలో వనస్థలిపురంలోని ఇంటికి వెళ్లిన బాధితురాలు.. షీ టీమ్స్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదుచేసింది. క్యాబ్ డ్రైవర్ వివరాలు తీసుకున్న షీటీమ్స్.. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు, అటునుంచి కోర్టుకు తరలించారు. -
టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం
వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లాలోని ఇంజపూర్ లో ఓ టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. వనస్ధలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్‌లో ఉన్న కృష్ణమ నాయుడు టైల్స్ కంపెనీలో టైల్స్ కట్ చేయడానికి ఉపయోగించే కెమికల్ డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి అక్కడే ఉన్న యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్ట్
-
వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా బ్రహ్మయ్య అనే వ్యక్తి సిద్దార్ధ పాలీ క్లినిక్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేయకుండానే కొంతమందికి స్వతహాగా చికిత్స చేస్తున్నాడు. శుక్రవారం ఓ మహిళకి చికిత్స చేస్తుండగా బ్రహ్మయ్య అడ్డంగా దొరికిపోయాడు. క్లినిక్ మరో వ్యక్తిపై రిజిస్టరై ఉంది. ఎటువంటి అనుభవం లేకుండా క్లినిక్ నడిపిస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వనస్థలిపురంలో దారుణం!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండలో కిడ్నాప్ చేసిన ఓ యువకుడిని వనస్థలిపురం తీసుకొచ్చి దుండగులు హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నల్లగొండలో శోభన్ అనే యువకుడిని బుధవారం రాత్రి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతన్ని వనస్థలిపురం సహారా ఎస్టేట్ వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకడిని రౌడీషీటర్ రాజేశ్‌గా గుర్తించారు. రాజేశ్‌పై గతంలో నాలుగు హత్యకేసులు ఉన్నాయి. శోభన్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం ఇంటినుంచి వెళ్లిన తమ కొడుకు గురువారం నాటికి హత్య గురికావడం కుటుంబసభ్యులను కలిచివేస్తున్నది. -
అధికారుల జోక్యంపై వివరణ ఇవ్వండి
- హోం శాఖ న్యాయవాదికి - హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్‌లో ఓ వ్యక్తిని అతని స్థలంలోకి వెళ్లకుండా వనస్థలిపురం సీఐ, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది (హోం)ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తుర్కయాంజల్‌లోని తన స్థలంలోకి వెళ్లకుండా వనస్థలిపురం సీఐ, రెవెన్యూ అధికారులు అడ్డుపడుతున్నారని.. దీనిపై స్పందించి చర్యలు తీసుకునేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ కె.లక్ష్మయ్యగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హోం శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. -
జాతీయ రహదారిపై పగిలిన పైప్
-
నగరంలోని మూడు దుకాణాల్లో చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న మూడు దుకాణాలలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. నగరంలోని వనస్థలిపురం కాలనీలో మంగళవారం రాత్రి మూడు దుకాణాల షట్టర్లు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణాల్లోని నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం
-
ఇంజాపూర్‌లో దొంగలు బీభత్సం
హైదరాబాద్: వనస్థలిపురం ఇంజాపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పురాతన శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో దొంగలు చోరీ చేశారు. ఆ క్రమంలో అడ్డువచ్చిన వాచ్మెన్పై దాడి చేశారు. పురాతన పంచలోహ విగ్రహాలను అపహరించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాలు చాలా పురాతనమైనవి అని స్థానికులు తెలిపారు. సొత్తు విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా ఇదే తరహాలో ఈ దేవాలయంలో చోరీలు జరిగాయని.. ఆ విగ్రహాలు ఇప్పటికీ రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు. -
లలిత్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు