ట్రాన్స్‌పోర్టు ముసుగులో అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న గుట్టును వనస్థలిపురం సీసీఎస్ పోలీసులు బుధవారం గుట్టురట్టుచేశారు.
కాటేదాన్(హైదరాబాద్): ట్రాన్స్‌పోర్టు ముసుగులో అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న గుట్టును వనస్థలిపురం సీసీఎస్ పోలీసులు బుధవారం గుట్టురట్టుచేశారు. మిస్త్రీగంజ్ ప్రాంతానికి చెందిన జహీరొద్దీన్.. శివరాంపల్లి డివిజన్ హసన్‌నగర్ దానమ్మజోపిడీ ప్రాంతంలో సనాక్యూరీ పేరుతో ట్రాన్స్‌పోర్టును నడుపుతున్నాడు. అయితే, ఇతడు ముంబాయి నుంచి అక్రమంగా తన ట్రాన్స్‌పోర్టు ద్వారా లక్షల విలువచేసే గుట్కాను తెప్పించుకొని నగరంతోపాటు కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్త్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు ఈ స్థావరంపై దాడి చేసి వివిధ రకాలైన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లతోపాటు అక్కడున్న రెండు డీసీఎంలు , ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.