
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని కత్తితో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. పనామా వద్ద ఓ రైతు చికెన్ బజార్, లైవ్ ఫిష్ షాపులో పనిచేస్తున్నాడు. గిరి అనే వ్యక్తి అతని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎల్‌బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment