శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment