roopa
-
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
జలమార్గాన ప్రపంచయానం
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు. ‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు. గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు. నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్ఎస్–తరంగిణి, ఐఎన్ఎస్–సుదర్శిని, ఐఎన్ఎస్వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది. – న్యూఢిల్లీ -
Actress Roopa Koduvayur Photos: ఎరుపు చీరలో మెరుపులా మెరుస్తున్న రూప కొడువాయూర్ (ఫొటోలు)
-
IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్
యశవంతపుర: ఐఏఎస్ రోహిణి సింధూరి దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఐపీఎస్ అధికారి రూపకు కోర్టులో ముందస్తు బెయిల్ దొరికింది. రూప ఫేసుబుక్‌లో ఐఏఎస్ రోహిణి సింధూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రూప బెంగళూరు 24వ ఎసీఎంఎం కోర్టులో మంగళవారం హాజరై బెయిల్ తీసుకున్నారు. -
జుట్టుపై పిచ్చ కామెడీ.. నవ్వించి నవ్వించి చంపేస్తావా ఏంటి..
-
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
సక్సెస్ కోసం ఎన్నో అవమానాలు పడ్డాను..
-
ఏంటి లచ్చవ్వ లో ఈ యాంగిల్ కూడా ఉందా..!
-
ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. హైకోర్టులో రూపకు ఊరట.. ఆ ఆంక్షలు రద్దు
యశవంతపుర: ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారి డి.రూప పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేయరాదని కింది కోర్టు విధించిన ఆంక్షలను హైకోర్టు రద్దు చేసింది. తన వాదనలను వినకుండా ఆంక్షలను విధించారని రూప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస హరీశ్‌కుమార్ ధర్మాసనం ఈ మేరకు రద్దు చేసింది. కింది కోర్టు స్టే విధించిన తరువాత రోహిణి సింధూరి ఆ కోర్టులో సమర్పించిన పత్రాలను రూపకు అందించాలి. కానీ స్పీడ్ పోస్టులో పంపాం, స్టేని కొనసాగించాలని రోహిణి కోరారు. నోటీసులు పంపకుండా ఆంక్షలను అమలు చేస్తే అవి దానంతట అవే రద్దవుతాయని రూప తరఫున న్యాయవాది వాదనలు చేశారు. ఏమిటీ కేసు నెలన్నర కిందట రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. తరువాత ఇద్దరి మధ్య ప్రకటనల యుద్ధం నడిచింది. పత్రికలు, టీవీ చానెళ్లలో పతాక శీర్షికలకెక్కారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహించి ఇరువురికీ ఏ బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ రూపకు అనుకూలం అయ్యింది. -
అలాంటి పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు: బలగం ఫేమ్
ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తోంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం. పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు యెల్దండి. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారిపై టాలీవుడ్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. రూప లక్ష్మి మాట్లాడుతూ..'మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను లెక్చరర్‌కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను.' అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లి పాత్ర చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించటానికి ఎప్పుడు సిద్ధమే. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బంది లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించటానికి నేనేప్పుడు సిద్ధమే.' అని అన్నారు. కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్‌లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్‌లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు ఏకంగా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మరీ ఆ సినిమాను చూసేస్తున్నారు. (ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) -
డబుల్ స్ట్రోక్.. ఇద్దరు సివిల్ సర్వెంట్లకు బొమ్మ చూపించిన బొమ్మై సర్కార్
-
కర్ణాటకలో ఐఏఎస్ vs ఐపీఎస్
-
రూపా Vs రోహిణి.. ఇక ఊరుకోం, కళ్లు మూసుకుని కూర్చోలేదు, చర్యలు తప్పవు!
సాక్షి, బెంగళూరు: ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్– ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య మాటల పోట్లాట సోమవారం సర్కారు వద్దకు చేరింది. రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా రెండురోజులుగా తీవ్రమైన ఆరోపణల పరంపరను సాగించారు. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రూపా మానసిక వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగానికి రెండు కళ్ల వంటి ఐపీఎస్– ఐఏఎస్ అధికారులు, అందులోనూ ఇద్దరూ మహిళలు దూషణలకు దిగడంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా మేలుకుంది. వారిద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ సోమవారం విధానసౌధకు వేర్వేరుగా పిలిపించి వివరణలు తీసుకున్నారు. ఇకపై నోరు మెదపరాదని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూపావన్నీ తప్పుడు ఆరోపణలు: రోహిణి సీఎస్‌ను కలిసిన తరువాత ఐఏఎస్ రోహిణి విధానసౌధ బయట మీడియాతో మాట్లాడారు. రూపా గురించి సీఎస్‌కు 4 పేజీల ఫిర్యాదు లేఖను అందజేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా, మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారి రూపామౌద్గిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది, నేను సోషల్ మీడియాలో చురుకుగా లేను. వ్యక్తిగత ఆరోపణలు పట్ల నా భర్త మాట్లాడారని రోహిణి చెప్పారు. జాలహళ్లిలో ఉన్న ఆస్తి గురించి రూపా ప్రస్తావించారు, ఆ ఆస్తి నా భర్త తల్లికి చెందినదని, తమది కాదని పేర్కొన్నారు. సీఎస్‌ను కలిపిన రూపా ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్ కూడా సీఎస్ వందితా శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఐఏఎస్ రోహిణి సింధూరి అవినీతి అక్రమాలకు పాల్పడిందని రూపా ఫిర్యాదు చేశారు. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్బుక్లో తెలిపారు. ఐపీఎస్‌కు ఎంపీ మద్దతు ఐపీఎస్ అధికారిణి డి.రూపా అడిగిన ప్రశ్నలు నైతికంగా సరైనవేనని, వాటికి రోహిణి, ఆమె బంధువులు సమాధానం ఇవ్వాలని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. మైసూరులో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతాప్ సింహా మాట్లాడుతూ చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ బాధితులు మరణించారని, ఆ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత మైసూరు జిల్లాధికారిదని అన్నారు. ఆ సమయంలో జిల్లాధికారిగా ఉన్న రోహిణి సింధూరి దీనికి పూర్తి బాధ్యత వహించాలని, ఆమె బదులివ్వాలని అన్నారు. ఇక ఊరుకోం: న్యాయమంత్రి ఇద్దరు అధికారులూ ఇలాగే పరస్పర దూషణలకు దిగితే చర్యలు తప్పవని న్యాయ మంత్రి మాదుస్వామి విధానసౌధలో తెలిపారు. ఇప్పటివరకు వ్యక్తిగత విషయం అని ఊరుకున్నామని, విధానసౌధ వరకు వచ్చింది కాబట్టి ఇక మేము ఊరుకునేదిలేదని, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధానసౌధ వద్ద మీడియా ముందుకు వస్తున్న ఐఏఎస్ రోహిణి సింధూరి వదిలిపెట్టేది లేదు: రోహిణి ఈ విషయాన్ని వదిలిపెట్టేదిలేదని రోహిణి హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం తగదు, ఏదైనా ఉంటే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు, అన్ని చర్యలకూ సిద్దంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి కానీ పర్సనల్‌గా కాదన్నారు. రూప నాపై దుష్పచారం చేయడం తప్పు, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటానని తెలిపారు. గెట్ వెల్ సూన్ అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరిపైనా చర్యలు తప్పవు: హోంమంత్రి జ్ఞానేంద్ర ఐపీఎస్– ఐఏఎస్‌ల గొడవను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరు అధికారురూ హద్దుమీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి వ్యక్తిగత విషయం ఏమైనా చేసుకోని, కానీ మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, కానీ వారు ఆ హోదాలకు అవమానం చేశారని ఆయన అన్నారు. సీఎస్, డీజీపీ తో మాట్లాడానని, సీఎం బొమ్మై సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
విడాకులు కావాలి!.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్ భార్య
టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ జంట తమ పెళ్లి బంధానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఢీ,దూకుడు, బాద్షా వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ ఈ మేరకు ఆయన భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం.చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, అయితే తాజాగా విడాకులు తీసుకునేందుకే సిద్దపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. కాగా 2003 ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు. శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు రూపా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. దీంతో పాటు ఆమె స్వయంగా వేదిక్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తుంటుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్ -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
సోహైల్ సినిమా: హీరోయిన్గా డాక్టరమ్మ!
ఇస్మార్ట్ సోహైల్.. ఇప్పుడీ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టిన అతడు తన యాటిట్యూడ్, ఫ్రెండ్షిప్తో ఎంతో మంది మనసులను దోచుకున్నాడు. అదే సమయంలో తన కోపంతో తోటి కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకుని వ్యాఖ్యాత నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు. దీంతో తను కోపాన్ని వదిలేస్తానని నాగ్‌కు మాటిచ్చి, అదే మాట మీద షో ఎండింగ్ వరకు నిలబడి సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే హీరోగా తన తొలి సినిమాను ప్రకటించాడు సోహైల్. శ్రీనివాస్ వింజనంపతి దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మధ్యే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని సోహైల్ సరసన నటిస్తున్న హీరోయిన్ పేరును ప్రకటించారు. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'లో నటించిన నేచురల్ బ్యూటీ రూప కొడువాయర్ సోహైల్‌తో జోడీ కడుతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లు రొమాంటిక్‌గా పోజిచ్చిన ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ హీరోయిన్ రూప నిజ జీవితంలో డాక్టర్ కావడం విశేషం. జార్జి రెడ్డి, ప్రెషర్ కుక్కర్ చిత్ర నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) ఇక పైసా పారితోషికం తీసుకోకుండా సోహైల్ సినిమాలో నటిస్తానని ఆ మధ్య బ్రహ్మానందం మాటిచ్చాడు. అలాగే చిరంజీవి కూడా అతడి సినిమాలో చిన్న పాత్ర చేస్తానని చెప్పాడు. మరి వీళ్లిద్దరూ ఈ సినిమాలో కనిపిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. చదవండి: కొత్త కారు కొన్న సోహెల్.. కథ వేరుంటదని పోస్ట్ రాత్రి నడిరోడ్డు మీద కారు ఆపేసిన సన్నీలియోన్ భర్త -
డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్
ఇరవై ఏళ్లలో నలభై బదిలీలు ఉమాభారతి మాజీ సీఎం, మాజీ మంత్రి. హుబ్లీలో ఆమెను అరెస్టు చేయవలసి వచ్చింది! ఎవరున్నారు అరెస్ట్ చెయ్యడానికి?! రూప, ఐపీఎస్! శశికళ శక్తిమంతురాలైన ఖైదీ. పరప్పన జైల్లో ఆమెను వీవీఐపీలా చూస్తున్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టిందెవరు? రూప, ఐపీఎస్! బెంగళూరు ‘సేఫ్ సిటీ’.. వందల కోట్ల ప్రాజెక్ట్. టెండర్లలో గోల్మాల్ జరుగుతోంది. ఆ అవినీతి గుట్టును రట్టు చేసిందెవరు? రూప, ఐపీఎస్. ఏం పోలీస్ ఆఫీసర్! ఎంత పవర్ఫుల్!! ఆ పవర్‌కు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇరవై ఏళ్లలో నలభై ట్రాన్స్ఫర్లు!! జనవరి ఒకటిన మళ్లీ ఇంకో బదిలీ. నేరస్థులకు హ్యాండ్‌కఫ్స్ వేయవలసిన రూప..‘హ్యాండ్లూమ్స్’ ఎండీ సీట్లో కూర్చున్నారు. రూప 2000 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటక క్యాడర్. యూపీఎస్సీలో ఆలిండియాలో 5వ ర్యాంకు. హైదరాబాద్‌లోనే.. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషల్పోలీస్ అకాడమీ’లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఎం.ఎ. సైకాలజీ చేసి ఐపీఎస్ వైపు వచ్చారు. నేరాన్ని, అవినీతిని తేలిగ్గా పసిగట్టేయడం ఆమె సహజ నైజమేమో అనిపిస్తుంది. అందుకే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి దేశంలోనే తొలి లేడీ బాస్ అయ్యారు రూప! యువతలో స్ఫూర్తిని నింపడానికి తరచు ‘టెడెక్స్’ టాక్స్ (టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డిజైన్) కూడా ఇస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఇప్పటికీ కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లానే చురుగ్గా, వేగంగా ఉంటారు. ఉండకూడదని కాదు. ఇరవై ఏళ్లల్లో నలభైసార్లు ఆమె బదిలీ అయ్యారు. ప్రమోషన్ మీద కొన్నిసార్లు, ప్రమోషన్ పేరుతో చాలాసార్లు. ఆమె తెగింపు కొన్నిసార్లు ప్రభుత్వానికి ఉపయోగపడింది. చాలాసార్లు తలనొప్పి అయింది. హుబ్లీ అల్లర్ల కేసులో విచారణ కోసం వచ్చిన ఉమాభారతిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి రూప అవసరం అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీగా ఉన్నప్పుడు శశికళకు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయని బయటపెట్టినందుకు మాత్రం ప్రభుత్వానికి ఆమె తలనొప్పి అయ్యారు. నెల తిరగ్గానే అక్కడి నుంచి ఆమెను ‘ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ’ కమిషనర్‌గా బదిలీ చేశారు. తాజా ట్రాన్స్ఫర్ కూడా అటువంటిదే. నగర మహిళల భద్రత కోసం సౌకర్యాలు కల్పించే ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ టెండర్లో ఒక ఏసీపీ డబ్బు మూట కట్టుకుంటున్నాడని ఆరోపించినందుకు అతడిపై ఎంక్వయరీ చెయ్యకుండా (అతడిపై సీబీఐ చార్జిషీటు ఉన్నప్పటికీ) ఆమెను హస్తకళల వస్తూత్పత్తి విక్రయ కేంద్రానికి ఎండీగా బదిలీ చేశారు! బదలీకి ముందు ఆమె కర్ణాటక రాష్ట్రానికి తొలి మహిళా హోంశాఖ కార్యదర్శి! అంతెత్తు నుంచి కిందికి తోసేశారు. అయితే రూప ఎప్పుడూ హోదాలను ఉన్నత స్థానాలుగా భావించలేదు. ఎంత ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా మనిషిగా ఉండటం కన్నా పెద్ద డిజిగ్నేషన్ లేదంటారు ఆమె. ‘‘ప్రభుత్వం నియమించుకున్న ఒక ప్రజాసేవకురాలిని మాత్రమే నేను’ అంటారు. ఇరవై ఏళ్ల క్రితం ధార్వాడ్ జిల్లా ఎస్పీగా ప్రారంభమైన రూప కెరియర్ అనేక మలుపులు తిరుగుతూ, అనేక శాఖలను తాకుతూ ప్రస్తుతానికి కర్ణాటక హస్తకళాకేంద్రం ‘కావేరీ ఎంపోరియం’కి చేరుకుంది. ‘‘నేనేమీ చిన్నతనంగా భావించడం లేదు. బాధ్యత ఏదైనా బాధ్యతే. తక్కువ ఎక్కువ ఉండదు. కర్ణాటక హోయసల సాంస్కృతిక హస్త కళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. లక్షలాది మంది చందనశిల్ప, బిద్రీ లోహ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తాను’’ అంటున్నారు రూప. అయితే మరొకసారి ఆమెను బదిలీ చేయవలసిన అనివార్యతల్ని ప్రభుత్వం ఎదుర్కొనేలా ఉంది! రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు పొందిన ఈ పవర్ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను కక్ష సాధింపుగా మాత్రమే ప్రాధాన్యంలేని పోస్టులోకి మార్చారన్న అసంతృప్తి కర్ణాటక ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ వ్యక్తం అవుతూ ఉండటమే అందుకు కారణం. రూప, ఐపీఎస్ ఈ నెలలోనే తన పోలీస్ డ్యూటీలోకి తను మళ్లీ వెనక్కి వచ్చేయొచ్చు. ఈసారి మరింత శక్తిమంతంగా! మ్యూజిక్ ఇష్టం రూప తండ్రి దివాకర్ రిటైర్డ్ ఇంజినీర్. తల్లి హేమావతి గృహిణి. కర్ణాటకలోని దావణగెరె వారి స్వస్థలం. ఇద్దరే సంతానం. రూప, రోహిణి. ఆమె చెల్లెలు రోహిణి ఐఆర్ఎస్ ఆఫీసర్. రూప పెళ్లి 2003లో మునీష్ మౌద్గిల్‌తో జరిగింది. ఆయన ఐఎఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు అనఘ, రోషిల్. రూపకు మ్యూజిక్ అంటే ఇష్టం. లలిత సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. 2018లో మహిళా దినోత్సవం కోసం ఒక స్ఫూర్తిదాయకమైన మ్యూజిక్ వీడియోను కూడా రూపొందించారు. 2019 లో రిలీజ్ అయిన ‘బయలాతడ భీమన్న’ చిత్రంలో ‘కెంపానే సూర్య’ అనే పాట పాడారు. రూప, ఐపీఎస్ : చేనేత అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా పదవీ స్వీకారం -
చిన్నమ్మకు కొత్త చిక్కులు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కొత్త చిక్కులు తప్పవేమో అన్న ఆందోళన బయలు దేరింది. ఆమె విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మ శిబిరాన్ని కలవరంలో పెట్టే సమాచారం తాజాగా వెలువడడమే ఇందుకు కారణం. గతంలో జైలులో చిన్నమ్మ లగ్జరీ జీవితం గుట్టును రట్టు చేసిన ఐపీఎస్ అధికారి రూప తాజాగా ఆ రాష్ట్ర హోంశాక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పరిణామం చిన్నమ్మ విడుదల మీద పడేనా అన్న ఉత్కంఠ ఆమె శిబిరంలో కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైలులో ఉన్న విషయం తెలిసిందే. 2017 ఫిబ్రవరిలో జైలుకు చిన్నమ్మ వెళ్లారు. ఇప్పటికి రెండుసార్లు పెరోల్‌పై ఆమె బయటకు వచ్చారు. ఆ తదుపరి జైలుకే పరిమితం అయ్యారు. (త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం) ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా చిన్నమ్మ ముందస్తుగా విడుదల కాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వస్తున్నాయి. చిన్నమ్మ కోసం పోయేస్ గార్డెన్లో ఓ బంగ్లా సైతం రూపుదిద్దుకుంటోంది. త్వరలో చిన్నమ్మ బయటకు రావడమే ఖాయం అన్న ధీమాతో ఉన్న ఆమెప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలకు తాజాగా పెద్ద షాకే తగిలింది. ముందస్తు విడుదల మాట పక్కన పెట్టి, అస్సలు ఇప్పట్లో ఆమె బయటకు వచ్చేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం గతంలో ఆమె మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి రూప కర్ణాటక హోంశాఖ కార్యదర్శిగా నియమితులు కావడమే. (శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!) తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా 2017 చివర్లో తీవ్రచర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా అప్పట్లో పనిచేసిన రూప స్వయంగా ఈ లగ్జరీ వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ లగ్జరీ వ్యవహారం మీద రిటైర్డ్ ఐఏఎస్ వినయ్‌కుమార్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరిపి నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో రూప తరపు అనేక ఆధారాలు సమర్పించి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో లగ్జరీ ఆరోపణల తదుపరి రూపకు బదిలీలు, శాఖల మార్పు అంటూ చిక్కులు తప్పలేదు. ప్రస్తుతం బెంగళూరు డివిజన్ రైల్వే ఐజీగా ఉన్న ఆమెను హోంశాఖ కార్యదర్శిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. దీంతో చిన్నమ్మ లగ్జరీ వ్యవహారం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలకు ముందుగా రూప కీలక పదవిలోకి వచ్చి ఉండటంతో తెర మరుగున పడి ఉన్న లగ్జరీ విచారణ నివేదికను తవ్వే అవకాశాలు ఉన్నాయని, ఈ దృష్ట్యా, చిన్నమ్మ విడుదలకు చిక్కులు తప్పదేమో అన్న చర్చ తెర మీకు వచ్చింది. ఈ వ్యవహారం అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసింది. అదే సమయంలో చిన్నమ్మ విడుదల విషయంగా ముందుగా న్యాయ నిపుణులతో చర్చించి, రూప రూపంలో చిక్కులు ఎదురు కాకుండా అమ్మ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది -
ప్రేమికుల అడ్డా
అక్షయ్‌కుమార్, రూప, కవిత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమికుల అడ్డా’. ‘విడిపోయిన హృదయాలను కలుపుతుంది’ అనేది ఉపశీర్షిక. గేయరచయిత వేల్పుల వెంకటేష్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని వీవీ నాయుడు నిర్మిస్తున్నారు. ‘‘టైమ్‌పాస్ ప్రేమికులకు, నిజమైన ప్రేమికులకు మధ్య ఉండే తేడాను మా సినిమాలో చూపించబోతున్నాం. మంచి ప్రేమకథా చిత్రం. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు కెమెరా: శివరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నూకబోయిన వెంకట్రామ్. -
వ్యాపార రంగంలోకి దర్శకుడి భార్య
సినీ రంగంలో ఉన్న వారు ఇప్పుడు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పబ్‌లు, రెస్టారెంట్ ల లాంటి వ్యాపారాల్లో అడుగుపెట్టారు. తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూపా వైట్ల కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వేదిక్ పేరుతో వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించిన హీరోయిన్ కాజల్, వేదిక్ బ్రాండ్ ను లాంచ్ చేయటం ఆనందంగా ఉందన్నారు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాకు రూపావైట్ల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. తాజాగా ఆమె వేదిక్ ఉత్పత్తులను లాంచ్ చేపినందుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. Happy to launch @Vedic_Way by @roopavaitla pure, organic and pristine! Thank you for my wholesomeness 😊🤗 pic.twitter.com/qHDFAupnuV — Kajal Aggarwal (@MsKajalAggarwal) 23 March 2018 -
శశి'కళ'కు కత్తెర
► బెంగళూరు జైల్లో లగ్జరీ సౌకర్యాలకు లంగరు ► శశికళ జైలు జీవిత వీడియో, ఫొటోల హల్చల్ జైలు జీవితాన్ని సైతం కళకళగా మార్చుకున్న శశికళ లగ్జరీ జీవితానికి లంగరుపడింది. లోపాయికారితనంతో జైలు అధికారులు కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు ఉన్నతాధికారులు కత్తెరవేశారు. పరమపద సోపానపటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టుగా అసాధారణ స్థితినుంచి జారిపోయి సాధారణ ఖైదీగా మారిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జైల్లో రాజమర్యాదలు అనుభవించిన శశికళ చివరకు సాధారణ ఖైదీగా మారారని తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కథనాల మేరకు.. తమిళనాడు రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా వెలుగొందిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలును సైతం తన అగ్రహారంగా మార్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా జయలలిత వెన్నంటి ఉంటూ ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రాణం కావడంతో జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. కోటి రూపాయలు చూపిస్తే కొండమీద కోతైనా దిగివస్తుందనే సామెతను శశికళ ఆచరణలో పెట్టగా జైలు అధికారులు అక్షరాల అమలుచేశారు. జైలు నాలుగు గోడల మధ్య శశికళకు రహస్యంగా జరుగుతున్న రాచమర్యాదలను కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప బట్టబయలుచేసి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల్లో కలకలం రేపారు. జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన వంటగది, ములాఖత్ కింద వచ్చిన వారితో మాట్లాడేందుకు మరో గది, యోగా గది, టీవీ వీక్షణకు మరో రూం, బాత్రూం.. మొత్తం ఐదు గదులు, ఖరీదైన మంచం, సోఫా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఇలా అనేక గృహోపకరణాలు, హాయిగా నడయాడేందుకు పొడవాటి వరండా కేటాయించారు. ఈ సదుపాయల కల్పన కోసం మాజీ డీజీపీ సత్యనారాయణరావుకు రూ.2 కోట్లు లంచం ముట్టినట్లు రూప బహిరంగంగా చాటగా, అబ్బే అదేం లేదని డీజీపీ ఖండించారు. అయితే రూప ఆరోపణలు నిజమని నిరూపిస్తూ జైల్లోని చిన్నమ్మ లగ్జరీ జీవితం ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా బయటకు పొక్కింది. అంతేగాక, జైలు దుస్తుల్లో కాక ఖరీదైన నైటీలో చేతిలో బ్యాగ్‌తో శశికళ నడుస్తున్న వీడియో దృశ్యాలు తమిళనాడు, కర్ణాటక ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేశాయి. శశికళ వంట తదితర సేవల కోసం తుముకూరు జైలు నుంచి ఐదుగురు మహిళా ఖైదీలను సైతం రప్పించారు. వీరిలో మేరీ, రేఖ అనే ఇద్దరు కన్నడంతోపాటూ తమిళం కూడా మాట్లాడగలరు. అలాగే శశికళ కోసం ప్రత్యేక వైద్యుడిని నియమించారు. ఇలాంటి లగ్జరీ జీవితం కోసం వారానికి రూ.2.50 లక్షల చొప్పున శశికళ నుంచి రూ.2కోట్లు పుచ్చుకున్నట్లు రూప ఆరోపించారు. భారీ మొత్తంలో ముడుపులు ముట్టిన కారణంగా దినకరన్ తదితరులు జైలుకు వస్తే ప్రశ్నించకుండా లోనికి పంపేవార ని తెలుస్తోంది. తనకోసం వచ్చేవారికి టీ, కాఫీ తదితర మర్యాదలు చేసే విధంగా శశికళకు గార్డుగా ఉన్న మహిళా పోలీసు అధికారిణులే ఆదేశించేవారని సమాచారం. బెంగళూరు జైల్లో శశికళ కోసం ఏర్పాటు చేసిన లగ్జరీ వసతులు రూపతో శశికళ వాగ్వాదం జైలు తనిఖీ సమయంలో శశికళకు కల్పించిన సదుపాయాలను చూసి బిత్తరపోయిన రూప వాటిని సెల్ఫోన్లో చి త్రీకరించారు.ఆ సమయంలో రూపతో శశికళ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం నుంచి అందరూ తెలుసు, వారికి లేని అభ్యంతరం నీకెందుకు, వారం రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తా అని రూపను బెదిరించినట్లు సమాచారం. అయితే, ముందు జాగ్రత్త చర్యగా జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను సీసీ టీవీ కెమెరా నుం చి డౌన్లోడ్ చేసుకుని సీడీలో రికార్డు చేసుకున్న తరువాతనే మీడియా ముందుకు రూప వచ్చినట్లు సమాచారం. లోపాయి రాయితీలకు కోత ఇదిలా ఉండగా, డీఐజీ రూప ప్రకటన వల్ల జైల్లోని లోగు ట్టు రట్టుకావడంతో ప్రభుత్వం సోమవారం నుంచి సంస్కరణల బాట పట్టింది. రూప సహా నలుగురు అధికారులను బదిలీచేసింది. ముఖ్యంగా లోపాయికారిగా శశికళకు కల్పించిన సదుపాయాలను కోతవిధించింది. అధికారులు టీవీ కనెక్షన్‌ను తొలగించారు. వీఐపీగా చెలామణి అయిన శశికళ మంగళవారానికి సాధారణ ఖైదీగా మారిపోయారు. ఐదు గదుల నుంచి సాధారణ ఖైదీ గదికి ఆమెను మార్చారు. తన ప్రత్యేక వంట గదిలో ఇడ్లీ, దోసెలు, మాంసాహారం చేయించుకుని తినే శశికళ సోమవారం ఉదయం ఇతర ఖైదీలతోపాటూ నిమ్మకాయల అన్నం, మధ్యాహ్నం రాగిరొట్టె, పెరుగన్నం తిని టీ తాగారని తెలిసింది. ప్రతిరోజు రాత్రివేళ చపాతీ తినే శశికళకు సాంబారన్నం పెట్టారని సమాచారం. శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి తుమ్కూరు జైలుకు మార్చాలని రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఖరీదైన దుస్తుల్లో శశికళ (సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం) సీఎం, మంత్రులపై హైకోర్టులో పిటిషన్ పదవీ ప్రమాణం నియమ నిబంధలను పాటించకుండా జైలులో శశికళను కలుసుకున్న సీఎం ఎడపాడి, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజు, కామరాజ్‌లను ఆ పదవుల నుంచి డిస్మిస్ చేయాలని శ్రీవిల్లిపుత్తూరు మాజీ ఎమ్మెల్యే తామరకన్ని కుమారుడు ఆనళగన్ మధురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమా అనే అంశపై ఆగస్టు 1వ తేదీన నిర్ణయిస్తారు. డీఐజీ రూప నిజాయితీతో కూడిన దూకుడును కొనసాగించాలని పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపారు. బెంగళూరు జైల్లో శశికళకు ప్రత్యేక రాయితీలపై కర్ణాటక హైకోర్టు తానుగా ముందుకు వచ్చి విచారణ జరపాలని కొంగునాడు మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి ఈఆర్ ఈశ్వరన్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
శశికళకు ఎన్ని వసతులో!
బెంగళూరు : తమిళనాడు అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి ఒక్కొక్క విషయమే బయటికి వస్తోంది. తాజాగా సోమవారం ఆమెకు ఒక బ్యారెక్‌లోని మూడు– నాలుగు సెల్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక సెల్ కిచెన్‌గా, రెండో సెల్లో దుస్తులు, కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్‌బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో సెల్లో విజిటర్స్‌ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. మరోసెల్లో శశికళ నిద్రించడానికి వినియోగించేవారని సమాచారం. ఫ్యాన్, మస్కిటో కాయిల్స్ కూడా ఆమెకు కేటాయించినట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సెల్స్ ఉన్న బ్యారెక్‌లోకి ఎవరినీ పంపించేవారు కాదని ఇక సెల్స్‌కు తెర కూడా ఉండేదని దీని వల్ల లోపల ఉన్నవారు ఏమి చేస్తున్నారో బయటికి తెలిసేది కాదని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సమాచారం లీకేజీ చేస్తున్నారనే అనుమానంతో జైలులో ఉన్న దాదాపు 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు పంపిచేశారు. కాగా తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం, ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. -
రూప 2.0: వేటు పడినా తగ్గని డీఐజీ
బెంగళూరు: శశికళకు బెంగుళూరు జైలు అందుతున్న వీఐపీ ట్రీట్మెంట్ వివరాలను బయటపెట్టిన డీఐజీ రూపపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అయినా వెనక్కు తగ్గని ఆమె శశికళకు జైలులో అందుతున్న లగ్జరీలకు సంబంధించి రెండో రిపోర్టును సోమవారం సమర్పించారు. చట్ట విరుద్దంగా శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందని రిపోర్టులో ఆమె పేర్కొన్నారు. రిపోర్టులోని అంశాలు ఇలా .. శశికళ అవసరాల కోసం జైలులో ఐదు సెల్‌లకు తాళం వేయకుండా ఉంచారు. శశికళ నడవడానికి జైలులోని కారిడార్‌లో కొంతభాగం బారికేడ్‌లా నిర్మించారు. శశికళకు తెచ్చే ఆహారం ప్రత్యేక వాహనాల్లో వస్తుంది. ఆమెకు ప్రత్యేకంగా బెడ్‌తో పాటు సకల సదుపాయాలు జైలులో సమకూర్చారు. రూప సమర్పించిన మొదటి రిపోర్టు కర్ణాటక జైళ్ల శాఖను ఓ కుదుపు కుదిపింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎస్ఎన్ రావు ఆ రిపోర్టును నిరాకరించినా.. రూప మాత్రం పబ్లిక్‌గా రిపోర్టుపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య.. హైలెవల్ విచారణకు ఆదేశించారు. సోమవారం రూపపై బదిలీ వేటు కూడా పడింది. ఆమెను ట్రాఫిక్ వింగ్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూప బదిలీపై మాట్లాడిని సీఎం.. ఆమెను బదిలీ చేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. ఆమెను ఎందుకు బదిలీ చేయకుడదంటూ మీడియాను ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.