టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ జంట తమ పెళ్లి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఢీ,దూకుడు, బాద్‌షా వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
ఈ మేరకు ఆయన భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం.చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, అయితే తాజాగా విడాకులు తీసుకునేందుకే సిద్దపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.
కాగా 2003 ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు. శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు రూపా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. దీంతో పాటు ఆమె స్వయంగా వేదిక్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తుంటుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment