రెహమాన్‌ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే | AR Rahman Bassist Mohini Dey Comments On Relationship With Him, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Mohini Dey On AR Rahman: రెహమాన్‌ నాకు తండ్రి లాంటి వ్యక్తి

Published Tue, Nov 26 2024 11:52 AM | Last Updated on Tue, Nov 26 2024 12:26 PM

Mohini Dey Comments On AR Rahman

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్‌ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్‌ నిర్ణయానికి లింక్‌ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్‌ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.

రెహమాన్‌ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్‌ అయింది. రెహమాన్‌ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్‌  గోప్యతను గౌరవించాలని కోరింది.

మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్‌ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో   8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. 

అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement