A. R. Rahman
-
'లాల్ సలామ్' పాటలో ఆ దివంగత సింగర్స్ గాత్రం
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'తిమిరి ఎలుదా' అనే పాటను ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. ఈ పాటలో దివంగత గాయకులు షాహుల్ హమీద్, బాంబ భక్య స్వరాలను ఉపయోగించడంతో ఆ పాటపై అందరిలో ఆసక్తి నెలకొంది. సంగీత ప్రపంచంలో ఇదొక అద్భుతం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇదెలా సాధ్యం అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తాజాగా ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చారు. లాల్ సలామ్ ఆడియోను కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలోని పాటలకు మంచి టాక్ వచ్చింది. కానీ ఇందులోని తిమిరి ఎలుదా అనే పాట కోసం గతంలో మరణించిన వారి వాయిస్ ఉపయోగించడంతో ఆయనపై కొంతమేరకు విమర్శలు వచ్చాయి. 'గతంలో మరణించిన ఆ ఇద్దరి సింగర్స్ వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నాము. అందుకు గాను ఆ కుటుంబాలకు తగినంత పారితోషకాన్ని కూడా అందించడం జరిగింది. మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడంలో ఎలాంటి తప్పులేదు.' అని రెహమాన్ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. మరణించిన సింగర్స్ వాయిస్‌తో పాటలు రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 1990లలో తన మ్యాజికల్ వాయిస్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన షాహుల్ హమీద్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో పలు సాంగ్స్ పాడటం జరిగింది. 1997లో ఆయన తుది శ్వాస విడిచారు. బాంబ భక్య కూడా రెహమాన్ మ్యూజిక్‌లో పాటలు పాడారు. ముఖ్యంగా రోబో, బిగిల్,పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాల్లో ఆయన గాత్రం పాపులర్ అయింది. 2022లో ఆయన కూడా మరణించిన విషయం తెలిసిందే. అమ అభిమాన సింగర్స్ గాత్రాన్ని ఏఐ టెక్నాలజీతో మళ్లీ మరోసారి వినేలా చేసిన రెహమాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక లాల్ సలామ్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఇందులో నటించారు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. -
బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!
బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో అది నిజమైంది కూడా.. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఊహించని అవకాశం దక్కింది. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపైకి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చాడు బుచ్చిబాబు... తను రామ్ చరణ్‌తో తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అర్జున్ ఎగిరిగంతేశాడు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్ ఆట తీరును మెచ్చుకున్నారు. తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్. 'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్‌కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్‌బాస్‌కు రావాల్సి వచ్చింది' అని అర్జున్ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్ చరణ్ సర్ మూవీలో నువ్వొక సూపర్ పాత్ర చేయబోతున్నావ్. ఫిక్స్ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. గేమ్ చేంజర్ తర్వాత RC 16 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ కూడా పలు సీరియల్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్ధనారి, సుందరి వంటి సీరియల్స్లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా గోపీచంద్ 'సౌఖ్యం'లో విలన్‌గానూ మెప్పించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న రామ్ చరణ్ సినిమాలో అర్జున్‌కు ఛాన్స్ దక్కడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు. -
రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోరిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. 2018లో A.R. రెహమాన్ ఒక సంగీత కచేరీని నిర్వహించారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సందర్భంలో, రెహమాన్ తనకు ఇచ్చిన రూ.29.50 లక్షలను తిరిగి ఇవ్వమని కోరగా, రెహమాన్ ముందస్తు తేదీ ఉన్న చెక్కును అందించారు. కానీ బ్యాంకులో డబ్బు లేనందునా అది బౌన్స్ అయింది. రెహమాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సర్జన్ అసోసియేషన్ చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆపై లాయర్ షబ్నం భాను ద్వారా ఏఆర్ రెహమాన్‌కు నోటీసు పంపించింది. (ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు') ఈ మేరకు మద్రాస్ హైకోర్టు న్యాయవాది నర్మదా సంపత్ కూడా ఏఆర్ రెహమాన్ తరఫున వారికి రిప్లై నోటీసులు పంపారు. అందులో AR రెహమాన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నందకు కుట్రపన్నుతున్నారని ఆయన తెలిపారు. చీప్ పబ్లిసిటీ కోసం రెహమాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెహమాన్‌కు వారు ఇచ్చిన డబ్బు అందలేదని ఆయన తెలిపారు. రెహమాన్‌కు సంబంధంలేని మూడో వ్యక్తికి డబ్బు ఇచ్చిన ఇండియన్ సర్జన్స్ అసోసియేషన్ అనవసరంగా ఆయన పేరును ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రూ.10 కోట్ల నష్టపరిహారానికి నోటీసు రెహమాన్‌కు సర్జన్ అసోసియేషన్ పంపిన నోటీసును 3 రోజుల్లో ఉపసంహరించుకోవాలని, అంతేకాకుండా ఆయనకు జరిగిన పరువునష్టానికి క్షమాపణలు చెప్పాలని రెహమాన్ లాయర్ వారికి నోటీసులు జారీ చేశారు. సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఏఆర్ రెహమాన్‌కు రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని నోటీసులో ఆయన కోరారు.లేని పక్షంలో చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. -
రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్ రెహ్మాన్‌తో ఒక సంగీత కచ్చేరిని నిర్వహించ తలపెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రహ్మాన్‌కు రూ.29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది. కాగా రెహ్మాన్‌కు ఇచ్చిన అడ్వాన్స్ నగదును తమకు తిగిరి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య నిపుణుల సంఘం నిర్వాహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏఆర్.రెహ్మాన్ చైన్నెలో నిర్వహించిన సంగీత కచ్చెరీ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో) పరిమితికి మించిన టిక్కెట్లు విక్రయించడం వల్ల టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది సంగీత కచ్చేరి ఆవరణలోకి వెళ్లలేక అసంతృప్తితో వెనుదిరిగారు. ఈ వ్యవహారం పోలీసుల విచారణ వరకూ వెళ్లింది. ఆ సంఘటనపై ఏఆర్.రెహ్మాన్ క్షమాపణ చెప్పినా చాలా మంది సంగీత ప్రియులు ఆయనపై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. -
'మీ అభిమానిగా మేం సిగ్గుపడుతున్నాం.' ఏఆర్ రెహమాన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు. ఓ సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్యరామ్ ప్యాలెస్‌లో 'మరాకుమా నెంజమ్' అనే పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. అయితే కచేరీకి ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ కచేరీకి దాదాపు 50,000 మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది రెహమాన్ కెరీర్లోనే అత్యంత చెత్త కచేరీ అని అభిమానులు మండిపడుతున్నారు. ఆర్గనెజర్స్ పరిమితికి మించి టికెట్స్ విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే తీవ్ర నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్ నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్నామని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. ఈ కచేరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్దస్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. స్పందించిన రెహమాన్ ప్రియమైన చెన్నై అభిమానులారా.. మీలో టిక్కెట్లు కొనుగోలు చేసి.. దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఈవెంట్లో పాల్గొనలేకపోయారు. దయచేసి మీ టిక్కెట్ కొనుగోలు కాపీని మీ ఫిర్యాదులతో పాటు మెయిల్‌కి షేర్ చేయండి. మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. Dearest Chennai Makkale, those of you who purchased tickets and weren’t able to enter owing to unfortunate circumstances, please do share a copy of your ticket purchase to arr4chennai@btos.in along with your grievances. Our team will respond asap🙏@BToSproductions @actcevents — A.R.Rahman (@arrahman) September 11, 2023 ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఏఆర్ రెహమాన్ రాస్తూ..'కొంతమంది నన్ను G.O.A.T(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తున్నారు. ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి . చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వర్ధిల్లాలి. టూరిజంలో పెరుగుదల, నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం .. పిల్లలు, మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. People are saying #ARRahmanConcert is scam of the year, listen to this gentleman.#ARRahman | #ARRConcert | #MarakkumaNenjam pic.twitter.com/3VybS9eEsN — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 11, 2023 మండిపడుతున్న నెటిజన్స్ అయితే రెహమాన్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. మీ పోస్ట్‌లో క్షమాపణ ఎక్కడ ఉంది? సిగ్గుపడండి సార్.. ప్రజలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. మీరు క్షమాపణ చెప్పడం మీకు నిజంగానే కష్టంగా కనిపిస్తోంది.' అంటూ విమర్శించారు. మరొకరు రాస్తూ.. “మేము ఎల్లప్పుడూ మీ అభిమానులమే...కానీ దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు... ఇది పెద్ద స్కామ్... కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ టికెట్స్ అమ్ముకున్నారంటూ రాసుకొచ్చారు. మరో అభిమాని రాస్తూ..'ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి చెన్నై అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆర్గనైజింగ్ టీమ్ ఈవెంట్ సామర్థ్యం గురించి పట్టించుకోలేదు. నిన్నటి దాకా మీ అభిమానులం అయినందుకు మేం బలి మేకలం. మీ పోస్ట్ చదివిన తర్వాత నేను మీ అభిమాని అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.' అంటూ రెహమాన్‌పై మండిపడుతున్నారు. It was worst concert ever in the History #ARRahman #Scam2023 by #ACTC. Respect Humanity. 30 Years of the Fan in me died today Mr. #ARRAHMAN. #MarakkumaNenjam Marakkavey Mudiyathu, . A performer in the stage can’t never see what’s happening at other areas just watch it. pic.twitter.com/AkDqrlNrLD — Navaneeth Nagarajan (@NavzTweet) September 10, 2023 HORROR Story of a family who paid 30K RS for #ARRahmanConcert : “If I had stood for 2 more min, they would have squeezed & killed my child, we would have died, Are they even human beings” - Affected Family#ARRahman #marakumanenjam #Arr pic.twitter.com/nAaqREoFtx — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 10, 2023 -
తమిళంలో మాట్లాడాలన్న ఏఆర్ రెహమాన్.. నెటిజన్స్ ఫైర్!
ఏఆర్ రెహమాన్.. ఆయన పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై ప్రపంచస్థాయిలో తన సత్తా చాటారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత రెహమాన్‌కే సొంతం. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్- 2022 అవార్డ్ ఫంక్షన్‌కు తన భార్య సైరా భానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా భానును హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరాడు. (ఇది చదవండి: ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?) అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని.. సారీ చెబుతూ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం. అది చూసే ప్రేమలో పడ్డాను' అంటూ మాట్లాడింది. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్‌ను తప్పుబడుతున్నారు. మరికొందరేమో హీందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని.. తమిళంలో కూడా హిందీ సాంగ్స్ ఫేమస్ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய் ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID — black cat (@Cat__offi) April 25, 2023 -
నార్త్ ఇండియన్స్ గురించి అలా అన్నారు : ఏఆర్ రెహమాన్
తమిళ భాషే తీయనైనది.. అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి ఉద్ఘాటించారు. ఆంగ్ల భాషకు బదులు హిందీ భాష మాట్లాడాలి అన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హిందీ భాషేతర రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా గట్టిగానే బదులిచ్చారు. కాగా చెన్నైలో సీఐఐ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు స్థానిక నందంబాక్కంలో సౌత్ ఇండియా మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను ఐకాన్ అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్యఅతిథి, పెప్సీ, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం మలేషియాలో కలిసిన చైనాకు చెందిన వ్యక్తి మీరు ఇండియనా అని అడిగారు అన్నారు. తనకు నార్త్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అని, చాలా అందంగా ఉంటారని, వారు నటించిన చిత్రాలు బ్రహ్మాండంగా ఉంటాయని అన్నారని, చైనాలో బహుశా ఆయన దక్షిణాది చిత్రాలు చూసి ఉంటారా అన్నది తెలియదన్నారు. అయితే ఆయన చెప్పింది తనను చాలా బాధించిందన్నారు. తనవరకు ఉత్తరాది చిత్రాలు, దక్షిణాది చిత్రాలన్న బేధం లేదని పేర్కొన్నారు. అనంతరం అమిత్ షా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు తమిళ్ భాషే తీయనైనదని ఏఆర్ రెహమాన్ మరోసారి ఉద్ఘాటించారు. -
మహేశ్ బాబు ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్
A R Rahman Responds To Mahesh Babu Tweet: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే కావడంతో థియేటర్లకు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ సైతం ప్రధాన పాత్ర పోషించింది. సినిమా విడుదలకు ముందే లవ్‌స్టోరీ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం లవ్‌స్టోరీ మూవీ టీంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలసిందే. 'రెహమాన్ సార్ శిష్యుడు పవన్ మ్యూజిక్ సంచలనమని, రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ మహేశ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ ట్వీట్‌కి ఏ.ఆర్.రెహమాన్ స్పందించారు. 'అవును మహేశ్. పవన్ సూపర్ టాలెంటెడ్ అండ్ హంబుల్. మేమందరం అతన్ని చూసి గర్వపడుతున్నాం' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ Yes @urstrulyMahesh he is super talented and humble …all of us at @KMMC_Chennai are really proud of his success! EPI https://t.co/XCxzuqWrbZ — A.R.Rahman #99Songs 😷 (@arrahman) September 26, 2021 -
'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్'
రాబోయ్ ఇండియన్ ఐడెల్‌లో ఆమె పాట కు ఏ.ఆర్.రెహమాన్ పియానో వాయించాడు. గత వారం ‘ఇండియన్ ఐడెల్’ ఎపిసోడ్లో రేఖ పాల్గొని మన వైజాగ్ అమ్మాయి షణ్ముఖ ప్రియ పాట తర్వాత తెలుగులో ‘అమ్మాయ్... చింపి.. చింపి.. చింపి.. చంపి పడేశావ్’ అని పొగడ్తలతో ముంచెత్తింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏకంగా ఏ.ఆర్.రెహమాన్ షణ్ముఖ ప్రియ పాడుతుంటే పియానో వాయించాడు. ఈ వారం ప్రసారం కావాల్సిన ఇండియన్ ఐడెల్‌లో రెహమాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. షణ్ముఖ ప్రియ స్టేజ్ మీదకొచ్చి ‘ఉడి ఉడి’ (సఖి), ముకాబలా (ప్రేమికుడు) హిందీ వెర్షన్లు పాడింది. రెహమాన్ ఆ పాటలకు స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చాడు. అంతే కాదు ఉడి ఉడిని మళ్లీ పాడించి దానికి తానే స్వయంగా పియానో వాయించాడు. ‘ఇంతకు మించి ఏం కావాలి’ అని షణ్ముఖప్రియ తబ్బిబ్బవుతోంది. మొత్తానికి షణ్ముఖ ప్రియ పాట విరిగి నేతిలో పడ్డట్టుగానే ఉంది. ఇండియన్ ఐడెల్ ప్రారంభమైనప్పటి నుంచి సెలబ్రిటీల ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న షణ్ముఖ ప్రియ ప్రస్తుతం టాప్ 9లో ఉంది. ఆమె టాప్ 5లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. -
ఎ.ఆర్.రెహమాన్ మ్యూజికల్ జర్ని
-
హార్మోని విత్ ఏఆర్ రెహ్మాన్
పెరంబూరు: సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ చేయి మీటితే చాలు సంగీత వాయిద్యాలు సంగతులు పలుకుతాయి. ఆయన సంగీతంలో ఎలాంటి గీతం అయినా అమృత రాగంగా మారుతుంది. నిత్య ప్రయోగసృష్టి కర్త, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్రెహ్మాన్. ఈయన తాజాగా చేసిని మరో అద్భుత ప్రయోగం హర్మోని విత్ ఏఆర్ రెహ్మాన్. దర్శక శిఖరం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కవితాలయ సంస్థ వ్వవస్థాపకుడు, దివంగత దర్శక దిగ్గజం కే.బాలచందర్‌కు మానసపుత్రుడు ఏఆర్ రెహ్మాన్ అని చెప్పవచ్చు. ఆ సంస్థ నిర్మించిన రోజా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇంతింతై వటుడింతైన సామెత మాదిరి ప్రపంచ సంగీతం గర్వించే స్థాయికి ఎదిగారు. తాజాగా కమితా లయా సంస్థ ఆధ్వర్యంలో హార్మోని విత్ ఏఆర్ రెహ్మాన్ అనే సంగీత ఆల్బంను రూపొందించారు. ఆయన ఒక స్టూడియోలో కూర్చుని ఆల్బంకి సంగీత బాణీలు కట్టలేదు. అసలు ఇది సాదాసీదా సంగీత ఆల్బం కాదు. దేశంలోని పలు రాష్ట్రాల సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి, ప్రకృతిని ఆస్వాదిస్తూ బాణీలు కట్టి రూపొందించిన ఆల్బం హార్మోణి విత్ ఏఆర్ రెహ్మాన్. ఐదు భాగాలుగా రూపొం దించిన ఆల్బంలో కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లోని అందమైన ప్రకృతి భావాలు, సంగీత కళాకారుల అనుభవాలు, వారి సంప్రదాయ సంగీతాలను రస రమ్యంగా ఆవిష్కరించారు. ఆయా రాష్ట్రసంగీత కళాకారులు ఎలా కష్టపడి పైకొచ్చారు? సొంతంగా సంగీత వాయిద్యాలను తయారు చేసుకుని సంగీతంలో సాధన చేసిన వారి నిరంతర కృషి వంటి అంశాలను అద్భుతంగా పొందుపరిచారు. 21 నిమిషాల నిడివి.. ఐదో భాగంలో అన్ని సంప్రదాయ వాయిద్యాల మేలుకలయికతో 21 నిమిషాల నిడివితో రూపొందించిన గీతం అద్భుతం అనిపిస్తుంది. ఈ గీతానికి ఏఆర్ రెహ్మాన్ చెన్నైలోని వైఎం.స్టూడియోలో బాణీలు కంపోజ్చేశారు. ఆ సంగీత సమ్మేళనం వీనుల విందు, కనులకు కమనీయంగా ఉంటుంది. రెండు దశాబ్దాల పాటు భారతీయ సినిమాను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం కే.బాలచందర్ కవితాలయ సంస్థ, బుల్లితెరపైనా తన దైన ముద్ర వేసుకుంది. తాజాగా డిజిటల్ రంగంలోకి ప్రవేశించి హార్మోని విత్ ఏఆర్ రెహ్మాన్ అనే సంప్రదాయ సంగీతాల సమ్మేళంతో ఒక కొత్త ప్రయోగం చేసింది. ఈ ఆల్బంను మంగళవారం సాయంత్రం కమితాలయ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, కే.బాలచందర్ వారసురాలు పుష్పా కందస్వామి, ఆమె జీవిత భాగస్వామి కందస్వామి భరతన్, యూనిట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హార్మోని విత్ ఏఆర్ రెహ్మాన్ సంప్రదాయ సంగీత ఆల్బంతో డిజిటల్ యుగంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని పుష్పా కందస్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో నటి కుష్బూ, నటుడు వివేక్ అతిథులుగా పాల్గొని కవితాలయ సంస్థతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సంగీత అల్బం బుధవారం నుంచి అమేజాన్ ప్రైమ్ విడియో యాప్‌లో ప్రసారం అవుతోంది. -
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
దుబాయ్‌లో ఘనంగా ‘2.ఓ’ ఆడియో విడుదల వేడుక
-
రేపు తెరపైకి ఆరు చిత్రాలు
శుక్రవారం అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. వాటిలో మణిరత్నం, కార్తీల కాట్రువెలియిడై, చాయ, విరుదాచలం,సెంజిట్టాలే ఎన్ కాదల, 8 తట్టాక్కల్, జూలియుం 4 పేరుం చిత్రాలు ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం తాజా సృష్టి కాట్రువెలియిడై. కార్తీ, బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీత మాత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించారు. ఈ చిత్రం చెలియ పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో తెరపైకి రానుంది. కశ్మీర్ ప్రాంతంలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ కాట్రు వెలియిడై. ఇకపోతే సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించిన చిత్రం ఛాయ. ఈ చిత్రానికి వీఎస్.పళనివేల్ దర్శకుడు. నిజానికి ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావలసి ఉంది. థియేటర్ల కొరత కారణంగా వాయిదా పడింది.మూడో చిత్రం విరుదాచలం. లక్ష్మీఅమ్మాళ్ ఫిలింస్ పతాకంపై పి.సెంథిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విరుదగిరి, శ్వేత, సమీర నాయికానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని రతన్గణపతి నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీరామ్ సంగీతాన్ని అందించారు. నాలుగవ చిత్రం చెంజిటాళే ఎన్ కాదల. ఎస్బీ.ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ఎస్.బాలసుబ్రయణియన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎళిల్దురై దర్శకుడు, కథానాయకుడు మధుమిల, అభినయ కథానాయికలుగా నటించారు. ఎఫ్.రాజ్‌భరత్ సంగీతం అందించిన ఇది విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరపైకి రానుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం 8 తోట్టాక్కల్. శ్రీగణేశ్ దర్శకత్వం వహించిన ఇందులో వెట్ట్రి, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. ఆరవ చిత్రం జూలియుం 4 పేరుం. సువేదదేవి నిర్మించిన ఈ చిత్రానికి సతీశ్ దర్శకుడు. అమిధవన్, అల్యా మానస హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రఘు శ్రావణ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 14న నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన పవర్‌పాండి, పి.వాసు దర్శకత్వంలో లారెన్స్, రితికాసింగ్ జంటగా నటించిన శివలింగ, ఆర్య నటించిన కడంబన్ వంటి భారీ చిత్రాలు విడుదల కావడం, అదే విధంగా 28వ తేదీన రాజమౌళి చిత్రం బాహుబలి–2 చిత్రం భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం కావడంతో చిన్న చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను శుక్రవారం విడుదల చేయడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం. -
అంబాసిడర్’ ప్రతిపాదన రాలేదు: రెహమాన్
ముంబై: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని తనను ఎవరూ కోరలేదని మ్యూజిక్ డెరైక్టర్ ఎ.ఆర్.రెహమాన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. ‘గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారని నేను వార్తల్లోనే విన్నా. అన్ని చోట్ల ఇదే విషయాన్ని అడుగుతున్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి మెయిల్స్ రాలేదు. ఈ విషయం మేనేజ్మెంట్కు తెలిసుండొచ్చు. నాకు కాదు’ అని సాకర్ దిగ్గజం ‘పీలే’ సినిమా ట్రెయిలర్ విడుదల సందర్భంగా రెహమాన్ వ్యాఖ్యానించారు. -
ఐశ్వర్య ధనుష్, రెహ్మాన్ కాంబినేషన్లో సినిమావీరన్
ఐశ్వర్య ఆర్.ధనుష్, ఏఆర్.రెహ్మాన్‌ల అరుదైన కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. నటుడు ధనుష్ అర్ధాంగి, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు ఐశర్య ఆర్.ధనుష్ 3 చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అందులోని వై దిస్ కొలెవైరి డీ పాట అనూహ్యంగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకు ప్రధాన కారణం ఆ చిత్రంలో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనిరుద్‌నే అని చెప్పక తప్పదు. ఈయన ఐశ్వర్య కుటుంబానికి దగ్గర బంధువు అన్నది గమనార్హం. ఐశ్వర్య ఆర్.ధనుష్ తరుపరి చిత్రం వై రాజా వై కి అనిరుద్‌నే సంగీతం అందించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా హిట్ అయ్యింది. ఐశ్వర్య ఆర్.ధనుష్ కొత్త చిత్రానికి రెడీ అయ్యారని సమాచారం. దీనికి సినిమావీరన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలి సింది. ఇది సినీ స్టంట్ కళాకారుడి ఇతివృత్తంతో తెరకెక్కించనున్న చిత్రం అని సమాచారం. చిత్రాల్లో హీరోలు పలు వీరోచిత సాహసాలు చేసి అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఆ సాహసాల వెనుక స్టంట్ కళాకారుల జీవన్మరణ పోరాటాలు ఉంటాయి. వాటిని ఆవిష్కరించే చిత్రంగా సినామా వీరన్ ఉంటుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పూర్వ ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు టాక్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారని కోడంబాక్కమ్ టాక్. ఇప్పటికే బీప్ సాంగ్ వ్యవహారం తరువాత నటుడు ధనుష్ అనిరుద్‌ను పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఐశ్వర్య ఆర్.ధనుష్, ఏఆర్.రెహ్మాన్ కాంబినేషన్లో చిత్రం అంటే ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
కావ్య తలైవన్ చిత్రంలో సిద్దార్థ గెటప్స్
-
విభిన్నపాత్రలతో ఆలరించిన సిద్ధార్థ్
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. జిగర్ తాండ్ (చిక్కడు దొరకడు) చిత్రంతో ఓ డిఫరెంట్ లుక్, విభిన్నమైన పాత్రను పోషించి వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జిగర్ తాండ తర్వాత కావ్య తలైవన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కావ్య తలైవన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. కావ్య తలైవన్ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఆ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావ్య తలైవన్ చిత్రంలోని సిద్దార్థ గెటప్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వివిధ గెటప్ లో ఉన్న స్టిల్స్ నటుడిగా సిద్ధార్థను కొత్త ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రహ్మన్ అందిస్తున్నారు. సిద్ధార్థ తోపాటు పృథ్వీరాజ్, నాజర్, వేదిక, అనైక సోటిలు నటిస్తున్నారు. -
హాలీవుడ్లో ఊర్వశీ... ఊర్వశీ...
‘ఊర్వశీ.. ఊర్వశీ... టేకీటీజీ పాలసీ...’ అనే పాట వినగానే, ఓ ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లిపోతాం. ప్రభుదేవా, నగ్మా నటించిన ‘ప్రేమికుడు’లోని ఈ పాటను ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటే. ఇప్పటికీ ఈ పాటకున్న క్రేజ్ తగ్గలేదు. అందుకు ఓ ఉదాహరణ చెప్పాలంటే.. ప్రపంచ సంగీతప్రియులకు సుపరిచితుడైన రాపర్ విల్.ఎ.యామ్ ‘ఊర్వశి...’ పాటను ఆదర్శంగా తీసుకుని, ‘బర్త్‌డే..’ అనే పాట తయారు చేశారు. దీని గురించి రహమాన్ మాట్లా డుతూ -‘‘విల్.ఐ.యామ్‌తో కలిసి ‘ఊర్వశి...’ పాట ట్యూన్‌ని పునసృష్టించడం ఆనందంగా ఉంది. కొత్త ఫ్లేవర్‌లో ఈ ట్యూన్ సాగుతుంది’’ అన్నారు. స్వతహాగా రచయిత అయిన విల్.ఎ.యామ్‌తో కలిసి ఈ ‘బర్త్‌డే’ పాటను రహమాన్ రాశారు. ఈ పాట ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. జూలై 6 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహ్మాన్
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు మజార్‌ను దర్శించుకుని పూలచాదర్ సమర్పించి ఫాతెహా నిర్వహించారు. దర్గాలో రాత్రి ఖవ్వాలీ నిర్వహించారు. ఏఆర్ రెహ్మాన్ ప్రార్థనలు శుక్రవారం ఉదయం 2 గంటలకు దర్గాలో జరిగిన ఉత్సవానికి సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన పీఠాధిపతి స్వయంగా తెచ్చిన గంధాన్ని మజార్‌వద్ద సమర్పించారు. -
మలయాళంలో రెహమాన్ సోదరి సంగీతం
ఆస్కార్ అవార్డ్గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సోదరి ఎ.ఆర్. రిహానా గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో పలు చిత్రాలకు పాటలు పాడిన రిహానా మూడు, నాలుగు చిత్రాలకు పాటలు కూడా స్వరపరిచారు. అయితే ఆ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో రిహానా పాటలు వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. సముద్రఖని ముఖ్య పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వసంతత్తింటె కనల్వళిగలిల్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అనిల్ నాగేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రిహానా ఇటీవల ఓ బాణీ సమకూర్చారు. ఇతర బాణీలను సమకూర్చే పని మీద ఉన్నారామె. -
నేనెప్పుడూ సామాన్యుడినే : ఏ.ఆర్.రెహమాన్
న్యూఢిల్లీ: ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడమంటే ఏంటో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌ను చూస్తే తెలుస్తుంది. డబ్బు, కీర్తి తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని ఈ 48 ఏళ్ల సంగీత మాంత్రికుడు అంటున్నాడు. రెండు ఆస్కార్లతోపాటు గోల్డెన్‌గ్లోబ్, గ్రామీ అవ్డాలను భారత్‌కు తీసుకువచ్చిన ఘనతనూ రెహమాన్ సొంతం చే సుకున్నాడు. ‘నిజాయతీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో మనం ఏదైనా పనిచేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి కోసం అన్ని త్యాగం చేయగలిగిన వాళ్లకే విజయం దక్కుతుంది. విజేతగా నిలబడాలంటే వినమ్రత చాలా అవసరం. డబ్బు, కీర్తిని తలకెక్కించుకోకూడదు. నేను ఎప్పుడూ సామాన్యుడినే. ఇక నుంచి కూడా అలాగే ఉంటాను’ అని రెహమాన్ వివరించాడు. 1992లో రోజా సినిమాతో సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించిన రెహమాన్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి సినిమాలోని ‘దిల్‌హై చోటా సా’, ‘యే హసీ వాదియా’ వంటి పాటలకు విశేష స్పందన రావడంతో ఇతడి కెరీర్ దూసుకుపోయింది. ఇటీవల రాంఝనాకు కూడా సంగీతం అందించడం తెలిసిందే. కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించినా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాడు. ‘నేను సంగీత సాధన చేస్తున్నకొద్దీ.. ఈ రంగంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. నాకంతా తెలుసని అనుకుంటే, మనం గతంలో చేసిందే మళ్లీ వస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడూ తాజా సంగీతాన్నే కోరుకుంటారు. అందుకే నేను తరచూ ప్రయోగాలు చేస్తుంటాను’ అని రెహమాన్ వివరించాడు. ప్రస్తుతం మనోడు ‘రెహమాన్ఇష్క్’ పేరుతో వివిధ నగరాల్లో కచ్చేరీలు ఇస్తున్నాడు. ‘ప్రత్యక్షంగా నా అభిమానుల వద్దకు వెళ్లడానికి ఇదొక మంచి అవకాశం. వాళ్ల కళ్లలోకి చూస్తూ సంగీతాన్ని వినిపించడం మధురానుభూతి. ఇందులో కొత్త, పాత స్వరాలు మేళవించి సంగీతాన్ని వినిపిస్తాం. ఈ ప్రయత్నం శ్రోతలను ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నాం’ అని ఏఆర్ రెహమాన్ వివరించాడు. -
హిందీ చిత్రానికి నిర్మాతగా - ఎ.ఆర్.రెహమాన్
సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఇటీవలే చెన్నయ్‌లో కేఎం కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు. మరోవైపు సంగీతదర్శకుడిగా అటు భారతీయ చిత్రాలతో ఇటు విదేశీ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ఇంత బిజీలో కూడా మరో బాధ్యతను తలకెత్తుకున్నారు రెహమాన్. అదే నిర్మాణ బాధ్యత. అవును. త్వరలో ఆయన నిర్మాతగా మారనున్నారు. ‘వైఎమ్ మూవీస్’ పేరుతో ఓ బేనర్ కూడా స్థాపించారు రెహమాన్. తొలి ప్రయత్నంగా ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓ హిందీ సినిమా నిర్మించబోతున్నారు. కొంతమంది రచయితలతో కలిసి ఈ చిత్రానికి రెహమాన్ కథ తయారు చేశారు. ఇంకా దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులను, నటీనటులను ఎంపిక చేయలేదు. ఈ చిత్రానికి సంగీతం కూడా రెహమానే అందిస్తారు. ఈరోస్‌తో పదహారేళ్లుగా అనుబంధం కొసాగుతోందని ఈ సందర్భంగా రెహమాన్ పేర్కొన్నారు. సినిమాటిక్ అంశాలతో పాటు కళాత్మక అంశాలతో ఈ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. అందరికీ వినోదాన్ని పంచడమే వైఎమ్ మూవీస్ ముఖ్యోద్దేశమని రెహమాన్ అన్నారు. రెహమాన్‌లాంటి జీనియస్‌తో సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని, ఈ సినిమా తమ సంస్థకు ప్రత్యేకమని ఈరోస్ ప్రతినిధి చెప్పారు.