రాబోయ్ ఇండియన్ ఐడెల్‌లో ఆమె పాట కు ఏ.ఆర్.రెహమాన్ పియానో వాయించాడు. గత వారం ‘ఇండియన్ ఐడెల్’ ఎపిసోడ్‌లో రేఖ పాల్గొని మన వైజాగ్ అమ్మాయి షణ్ముఖ ప్రియ పాట తర్వాత తెలుగులో ‘అమ్మాయ్... చింపి.. చింపి.. చింపి.. చంపి పడేశావ్’ అని పొగడ్తలతో ముంచెత్తింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏకంగా ఏ.ఆర్.రెహమాన్ షణ్ముఖ ప్రియ పాడుతుంటే పియానో వాయించాడు. ఈ వారం ప్రసారం కావాల్సిన ఇండియన్ ఐడెల్‌లో రెహమాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.
షణ్ముఖ ప్రియ స్టేజ్ మీదకొచ్చి ‘ఉడి ఉడి’ (సఖి), ముకాబలా (ప్రేమికుడు) హిందీ వెర్షన్‌లు పాడింది. రెహమాన్ ఆ పాటలకు స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చాడు. అంతే కాదు ఉడి ఉడిని మళ్లీ పాడించి దానికి తానే స్వయంగా పియానో వాయించాడు. ‘ఇంతకు మించి ఏం కావాలి’ అని షణ్ముఖప్రియ తబ్బిబ్బవుతోంది. మొత్తానికి షణ్ముఖ ప్రియ పాట విరిగి నేతిలో పడ్డట్టుగానే ఉంది. ఇండియన్ ఐడెల్ ప్రారంభమైనప్పటి నుంచి సెలబ్రిటీల ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న షణ్ముఖ ప్రియ ప్రస్తుతం టాప్ 9లో ఉంది. ఆమె టాప్ 5లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment