మలయాళంలో రెహమాన్ సోదరి సంగీతం
ఆస్కార్ అవార్డ్‌గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సోదరి ఎ.ఆర్. రిహానా గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో పలు చిత్రాలకు పాటలు పాడిన రిహానా మూడు, నాలుగు చిత్రాలకు పాటలు కూడా స్వరపరిచారు.
అయితే ఆ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో రిహానా పాటలు వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. సముద్రఖని ముఖ్య పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వసంతత్తింటె కనల్‌వళిగలిల్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
అనిల్ నాగేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రిహానా ఇటీవల ఓ బాణీ సమకూర్చారు. ఇతర బాణీలను సమకూర్చే పని మీద ఉన్నారామె.