Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Vikram Mistry Says About Bharat Pakistan War After Trump Tweet1
కాల్పుల విరమణ అమల్లోకి: విక్రమ్ మిస్రీ

భారత్ - పాక్‌ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.➤ Foreign Secretary Vikram Misri confirms the implementation of ceasefire during the Press Briefing on #OperationSindoor Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours, earlier this afternoon. It… pic.twitter.com/vECdAsBUYo— PIB India (@PIB_India) May 10, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించినట్లు, కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక రెండు దేశాలు కాల్పుల విరమణపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025

Indian Army Briefing On India Operation Sindoor2
దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ

న్యూఢిల్లీ: భారత్‍, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్‌-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్‌ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్‌ ఆశ్రయించడంతో ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్‌ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది.

US President Donald Trump Tweet About India Pakistan War3
భారత్ - పాక్ యుద్దానికి బ్రేక్!.. ట్రంప్ సంచలన ప్రకటన

భారత్ - పాక్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించినంటూ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. దీనిలో భాగంగా భారత్‌- పాక్‌లతో రాత్రంతా చర్చలు జరిపినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాము. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్‌ సైతం ధృవీకరించింది. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్‌ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు.pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025

Asaduddin Owaisi Sensational Comments On Pakistan4
పాకిస్థాన్‌పై అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. భారత్‌ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్‌ దాడులకు మించి భారత్‌ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్‌ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.పాకిస్థాన్‌ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్‌ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్‌ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్‌ అన్నారు.

Bride Sends Soldier Husband to Duty With Emotional Tribute5
వార్‌ జోన్‌.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం

పాకిస్తాన్‌ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్‌ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్‌ పాటిల్‌ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్‌ పాటిల్‌ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025

AP Police Over Action on Vidadala Rajini6
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం

పల్నాడు జిల్లా: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట​ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలానే విడదల రజినిపై కూడా అనేక అక్రమ కేసుల్ని బనాయించారు పోలీసులు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంపై ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు ఏపీలో పాలనను గాలికొదిలేసి కేవలం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

 Rishad Hossain reveals PSL 2025 chaos after IND-PAK high tensions7
'అత‌డు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. మ‌రి ఎప్పుడూ పాక్‌కు రానున్నాడు'

భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ప్ర‌స్తుతం యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్ర‌తీకారం తీర్చ‌కునేందుకు భార‌త్.. ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్ట‌డంతో ఇరు దేశాల మ‌ధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. తొలుత మంగ‌ళవారం పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భార‌త సైన్యం క్షిపణి దాడులు చేసింది.దీంతో పాకిస్తాన్ సరిహద్దుల వెంబ‌డి కాల్పులకు తెగ‌బ‌డుతోంది. అంతేకాకుండా సరిహద్దులో ఉన్న న‌గ‌రాల‌పై డ్రోన్ దాడి చేయ‌డానికి య‌త్నించింది. కానీ భార‌త్ మాత్రం ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉప‌యోగించి డ్రోన్స్‌ను, క్షిపణులను గాల్లోనే నేల‌కూల్చి దాయాదికి ధీటుగా స‌మాధ‌నం చెబుతోంది. భార‌త్ కూడా పాక్‌పై డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది.ఈ క్ర‌మంలో భార‌త్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ను పీసీబీ ఆకస్మికంగా నిల‌పివేసింది. ఈ టోర్నీలో భాగంగా మే 8(గురువారం) రావ‌ల్పిండి వేదిక‌గా పెషావర్‌ జల్మీ, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డాల్సింది. కానీ మ్యాచ్‌కు ముందు రోజు రావ‌ల్పిండి స్టేడియం స‌మీపంలో డ్రోన్ కూలిపోవ‌డంతో పీసీబీ అప్ర‌మ‌త్త‌మైంది. వెంట‌నే ఆ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌ల‌ను కూడా వాయిదా వేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో ఆడేందుకు వ‌చ్చిన విదేశీ ఆట‌గాళ్లు సైతం తీవ్ర ఆందోళ‌న చెందారు. ఈ నేప‌థ్యంలో పీఎస్ఎల్ సస్పెన్ష‌న్‌కు ముందు త‌మ ప‌రిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వివ‌రించాడు. రెండు రోజుల పాటు భ‌యందోళ‌న‌కు గురైన‌ట్లు రిషద్ హుస్సేన్ తెలిపాడు."ఆ దేవుడు ద‌య‌వ‌ల్ల తీవ్ర ఉద్రిక్త‌ల న‌డుమ‌ మేము దుబాయ్‌కు చేరుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేము ల‌హోర్ నుంచి బ‌య‌లు దేరిన 20 నిమిషాల తర్వాత విమానాశ్రయంపై మిస్సైల్ ఎటాక్ జ‌రిగింద‌ని దుబాయ్‌లో దిగాక తెలిసింది. ఆ వార్త విని మేము చాలా భ‌య‌ప‌డ్డాము. నా కుటుంబ స‌భ్యులు నిద్రలేని రాత్రులు గ‌డిపారు. బాంబు పేలుళ్లు, క్షిపణి దాడుల గురించి వారు తీవ్ర‌ ఆందోళన చెందారు. నిరంతంరం మా ఫ్యామిలీతో టచ్‌లో ఉండేవాడిని. నా స‌హ‌చ‌ర ఆట‌గాడు నహిద్ రాణా చాలా భ‌య‌ప‌డ్డాడు. నేను అత‌డికి టెన్ష‌న్ ప‌డొద్దు అంటూ చెప్పుకుంటూ వ‌చ్చాను. ఏదేమైన‌ప్ప‌టికి మేము దుబాయ్‌కి సురక్షితంగా చేరుకున్నాము. న‌హిద్ మాత్ర‌మే కాదు ఇత‌ర విదేశీ ఆట‌గాళ్లు సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ సైతం చాలా భ‌య‌ప‌డ్డారు. మ‌రోసారి పాకిస్తాన్‌కు తాను తిరిగి రాన‌ని మిచెల్ నాతో చెప్పాడు. టామ్ కుర్రాన్ ఓ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఎయిర్‌పోర్ట్ మూసివేయబడింది. దీంతో అత‌డు చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. అత‌డిని మేమంద‌రం ఓదార్చాము అని రిషద్ హుస్సేన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

specialties about SAMAR, AD Gun, Pechora in india8
ఇండియా ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్స్‌.. శ‌త్రువులకు సింహ‌స్వ‌ప్నం!

పాక్‌ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్‌–400, ఆకాశ్‌ ఎన్‌జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్‌ కాలంనాటి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ (ఎస్‌ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్‌–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్‌ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్‌ ఆధారిత మిసైల్‌ లాంచర్, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్‌ యాంటెన్నాలతో కూడిన 4ఆర్‌90 యత్నాగన్‌ రాడార్‌ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్‌ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ (సీఏయూఎస్‌). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్‌ గ్రిడ్‌ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్‌ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్‌ డిటెక్షన్, సాఫ్ట్‌/హార్డ్‌ కిల్‌ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్‌ (ఎలక్ట్రో–ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్‌ కిల్‌ (డ్రోన్ల కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ జామింగ్‌), హార్డ్‌ కిల్‌ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ ఫర్‌ అష్యూర్డ్‌ రిటాలియేషన్‌ (సమర్‌). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్‌ కమాండ్‌ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్‌ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్‌–1 వ్యవస్థ ఆర్‌–73ఈ, సమర్‌–2 ఆర్‌–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్‌–73ఈ మిసైళ్ల రేంజ్‌ 8 కి.మీ. ఆర్‌–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్‌–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్‌. తొలుత స్వీడిష్‌ కంపెనీ బోఫోర్స్‌ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్‌ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటివాటి ద్వారా ఎల్‌–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్‌. షిల్కా అనేది వీటి రష్యన్‌ నిక్‌నేమ్‌. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Jagadeka Veerudu Athiloka sundari Re Release Box Office Collections9
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?

టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల పాత హిట్‌ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రీరిలీజులు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka sundari ) మళ్లీ థియేటర్‌లో విడుదలైంది. ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్‌ చేశారు. దీనికోసం వైజయంతీ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 8 కోట్లవరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమేచేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్‌ వెల్లడించారు. వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్‌కి ఈ స్థాయి కలెక్షన్స్‌ రావడం పట్ల మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజై సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

Virat Kohli Wanted Captaincy But BCCI Refused: Rumours Goes Viral10
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్‌ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 సీజన్‌ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్‌ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్‌ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల బ్యాటింగ్‌ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్‌ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్‌ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్‌ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు రోహిత్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్‌ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్‌ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్‌ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్‌ గిల్‌ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్‌ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్‌ గంభీర్‌ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్‌ వంటి మేటి జట్టుతో సిరీస్‌ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్‌ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా ‍వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్‌!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement