ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. 2018లో A.R. రెహమాన్ ఒక సంగీత కచేరీని నిర్వహించారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సందర్భంలో, రెహమాన్ తనకు ఇచ్చిన రూ.29.50 లక్షలను తిరిగి ఇవ్వమని కోరగా, రెహమాన్ ముందస్తు తేదీ ఉన్న చెక్కును అందించారు. కానీ బ్యాంకులో డబ్బు లేనందునా అది బౌన్స్ అయింది. రెహమాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సర్జన్ అసోసియేషన్ చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆపై లాయర్ షబ్నం భాను ద్వారా ఏఆర్ రెహమాన్‌కు నోటీసు పంపించింది.
(ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు')
ఈ మేరకు మద్రాస్ హైకోర్టు న్యాయవాది నర్మదా సంపత్ కూడా ఏఆర్ రెహమాన్ తరఫున వారికి రిప్లై నోటీసులు పంపారు. అందులో AR రెహమాన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నందకు కుట్రపన్నుతున్నారని ఆయన తెలిపారు. చీప్ పబ్లిసిటీ కోసం రెహమాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెహమాన్‌కు వారు ఇచ్చిన డబ్బు అందలేదని ఆయన తెలిపారు. రెహమాన్‌కు సంబంధంలేని మూడో వ్యక్తికి డబ్బు ఇచ్చిన ఇండియన్ సర్జన్స్ అసోసియేషన్ అనవసరంగా ఆయన పేరును ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
రూ.10 కోట్ల నష్టపరిహారానికి నోటీసు
రెహమాన్‌కు సర్జన్ అసోసియేషన్ పంపిన నోటీసును 3 రోజుల్లో ఉపసంహరించుకోవాలని, అంతేకాకుండా ఆయనకు జరిగిన పరువునష్టానికి క్షమాపణలు చెప్పాలని రెహమాన్ లాయర్ వారికి నోటీసులు జారీ చేశారు. సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఏఆర్ రెహమాన్‌కు రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని నోటీసులో ఆయన కోరారు.లేని పక్షంలో చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment