musical event
-
రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోరిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. 2018లో A.R. రెహమాన్ ఒక సంగీత కచేరీని నిర్వహించారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సందర్భంలో, రెహమాన్ తనకు ఇచ్చిన రూ.29.50 లక్షలను తిరిగి ఇవ్వమని కోరగా, రెహమాన్ ముందస్తు తేదీ ఉన్న చెక్కును అందించారు. కానీ బ్యాంకులో డబ్బు లేనందునా అది బౌన్స్ అయింది. రెహమాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సర్జన్ అసోసియేషన్ చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆపై లాయర్ షబ్నం భాను ద్వారా ఏఆర్ రెహమాన్‌కు నోటీసు పంపించింది. (ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు') ఈ మేరకు మద్రాస్ హైకోర్టు న్యాయవాది నర్మదా సంపత్ కూడా ఏఆర్ రెహమాన్ తరఫున వారికి రిప్లై నోటీసులు పంపారు. అందులో AR రెహమాన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నందకు కుట్రపన్నుతున్నారని ఆయన తెలిపారు. చీప్ పబ్లిసిటీ కోసం రెహమాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెహమాన్‌కు వారు ఇచ్చిన డబ్బు అందలేదని ఆయన తెలిపారు. రెహమాన్‌కు సంబంధంలేని మూడో వ్యక్తికి డబ్బు ఇచ్చిన ఇండియన్ సర్జన్స్ అసోసియేషన్ అనవసరంగా ఆయన పేరును ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రూ.10 కోట్ల నష్టపరిహారానికి నోటీసు రెహమాన్‌కు సర్జన్ అసోసియేషన్ పంపిన నోటీసును 3 రోజుల్లో ఉపసంహరించుకోవాలని, అంతేకాకుండా ఆయనకు జరిగిన పరువునష్టానికి క్షమాపణలు చెప్పాలని రెహమాన్ లాయర్ వారికి నోటీసులు జారీ చేశారు. సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఏఆర్ రెహమాన్‌కు రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని నోటీసులో ఆయన కోరారు.లేని పక్షంలో చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. -
బంగార్రాజు మ్యూజికల్ నైట్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత, కారణం ఇదే..
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ గాయని.. తాజాగా అభిమానులకు క్షమాపణ చెప్పింది. దానికి కారణం తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం. అసలు విషయంలోకి వెళ్లే... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. అందులో సునీతతో పాటు గీతామాధురి, రమ్య, అనురాగ్ కులకర్ణి, సాహితి, రేవంత్ శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ విషయాన్ని సింగర్ సునీత సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పింది. ‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన మణిశర్మ మెగా మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని క్యాన్సిల్ చేశారు. స్టే సేఫ్’ అంటూ శనివారం తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది సునీత. -
అనాథల కోసం జూక్ బాక్స్ మ్యూజికల్ ఈవెంట్
నార్త్ కరోలినా: కరోనా సమయంలో అంతా ఆన్లైన్ అవుతున్న క్రమంలో తాజాగా జూక్ బాక్స్ జామ్ నైట్ మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. అనాథలకు అండగా నిలిచే ఆశ్రీ అనే సంస్థకు సహాయం కోసం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత విభావరి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్)తో పాటు అనేక ఇతర తెలుగు సంస్థల మద్దతు అందించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు గురు.కె.రామాచారి నేతృత్వంలో జూక్ బాక్స్ జామ్ నైట్ మ్యూజికల్ ఈవెంట్ వీనులవిందుగా సాగింది. అటు అమెరికాలో ఉంటున్న రామాచారి శిష్య బృందం ఈ సంగీత విభావరిలో తమ టాలెంట్ చూపెట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ ఈవెంట్‌ను వేల మంది వీక్షించారు. అమెరికాలో ఉండే తెలుగు కళాకారులను ప్రోత్సాహించి వారి ప్రతిభ ప్రదర్శనకు వేదికలా ఈ జూక్ బాక్స్ జామ్ మ్యూజికల్ ఈవెంట్ దోహాదపడింది. ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా ఇలాంటి సరికొత్త ఆలోచనకు ఊపిరిపోస్తే.. సంజీవని కల్చరల్ సోసైటీ, ఈవెంట్స్ అన్ లిమిటెడ్ సంస్థలు ప్రధాన బాధ్యతతో ఈ ఈవెంట్ నిర్వహాణలో పాలుపంచుకున్నాయి. నాట్స్‌తో పాటు మరికొన్ని స్థానిక తెలుగు సంస్థలు ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశాయి. రామచారితో పాటు ప్రముఖ గాయనీ గాయకులు సాకేత్, పృద్వీ చంద్ర, రమ్య బెహరా, ఐశ్వర్య దరూరి, హరికా నారాయణ్ తదితరులు తమ పాటలతో ఆద్యంతం అందరిని అలరించారు. ఇమిటేషన్ రాజు... మిమిక్రీతో నవ్వులు పూయించారు. తెలుగు సినిమా పాటల ప్రవాహాన్ని వీక్షకులు ఆన్లైన్ ద్వారా వీక్షించి తమ హార్షాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలియచేసారు -
ది ఫర్గాటన్ ఆర్మీ.. గిన్నిస్ రికార్డు
ముంబై: ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్‌లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు. -
ఈసారి కళ తప్పుతున్న ‘పుదుచ్ఛేరి’
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి పుదుచ్చేరిలో జరిగే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న పర్యాటకులకు ఆశాభంగం తప్పదు. పుదుచ్ఛేరి హోటళ్లు ఈసారి ఆడంబరంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం లేదు. ముఖ్యంగా సంగీత విభావరి లాంటి కార్యక్రమాలకు స్వస్తి చెబుతున్నాయి. అందుకు కారణం వాటిపైన 25 శాతం వినోద పన్నును వేయడమే కాకుండా 28 శాతం జీఎస్టీని వసూలు చేయడం. అంతేకాకుండా మ్యూజిక్ లైసెన్సింగ్ కంపెనీలు సంగీత విభావరి నిర్వహించే ప్రతి హోటల్ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ షరతు పెట్టడం కూడా కారణమే. ఈ చట్టాలు కొత్తగా వచ్చినవేవి కావు. కానీ ఈ సారి చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడమే హోటళ్ల యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. గతంలో ప్రేక్షకుల ఎంట్రీ టిక్కెట్‌ను ఆహారానికి ఇంత, మద్యానికి ఇంత, వినోదానికి ఇంత అని విభజించి, వినోదానికయ్యే మొత్తంపైనే పన్ను కట్టేవాళ్లట. ఇక ఆ పప్పులు ఉడకవని, ప్రేక్షకుడి ఎంట్రీ టిక్కెట్ మొత్తంపైన వినోద పన్ను, జీఎస్టీలు కట్టాలని కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడమే కారణమట. ఈ విషయాన్ని షేన్‌బాగ హోటల్ మేనేజర్ విమల్ తెలిపారు. ఈ పన్నులు కడితే తమకు మిగిలేది ఏమీ ఉండదని సన్వే మనోర్ హోటల్స్ ఉపాధ్యక్షుడు డీ. లారెన్స్ చెప్పారు. సాధారణ సమయాల్లోకెల్లా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డీజేలు తమ ఫీజును పదింతలు పెంచుతారని ఆయన అన్నారు. తాము నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా కూడా ఈ సారి ఎలాంటి సంగీత కార్యక్రమాలను నిర్వహించదల్చుకోలేదని ఆయన తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుదుచ్చేరి ఒకటి. గతేడాది 16.63 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, వారిలో 15.31 లక్షల మంది భారతీయులే ఉన్నారని టూరిజం విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి. -
అతడిపై నోట్ల వర్షం కురిసింది...
అహ్మదాబాద్ : అభిమానానికి హద్దే ఉండదనేది మరోసారి నిరూపితమైంది. గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదన్ గధ్విపై మరోసారి అభిమానం నోట్ల రూపంలో వెల్లువెత్తింది. గాయకుడి గానామృతానికి మంత్రముగ్ధులైన శ్రోతలు అతడిపై నోట్ల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో కీర్తిదన్ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు. ఇంకేముంది ఆయన ఉన్న వేదికపైకి కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా కీర్తిదన్‌పై నోట్ల తుఫాను కురిసిన విషయం విదితమే. -
ఆ సింగర్‌పై లక్షల రూపాయలు వెదజల్లారు
-
రూ. 40 లక్షల 10, 20 నోట్లను విసిరారు!
అహ్మదాబాద్: నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. గంటల కొద్ది క్యూలలో నిలుచున్న తరువాత ఒక పెద్ద నోటు చేతికి దొరికినా దానికి చిల్లర దొరకడం కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితి అందరి విషయంలో ఒకేలా లేదని ఈ వీడియో చూస్తే మీకు అర్ధమౌతుంది. గుజరాత్‌లోని నవ్సారిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో సుమారు 40 లక్షల రూపాయల విలువచేసే.. 10, 20 రూపాయల నోట్లను సంగీతకారులపై విసిరారు. సంగీత కార్యక్రమంలో గాయకుల వద్దకు చేరుకున్న మహిళలు, పురుషులు పోటీపడి డబ్బులు విసురుతున్న దృశ్యాలు చూస్తే.. ఇంత మొత్తంలో చిల్లర డబ్బు వీరి చేతికి ఎలా చేరింది అనే సందేహం కలుగక మానదు! Approximately Rs 40 Lakhs (in Rs 10 & Rs 20 notes) showered on folk singers in a musical event in Navsari, Gujarat pic.twitter.com/Z7xByQ1toL — ANI (@ANI_news) 26 December 2016