అతడిపై నోట్ల వర్షం కురిసింది... | People Shower Wads Of Notes On Gujarati Singer | Sakshi
Sakshi News home page

అతడిపై నోట్ల వర్షం కురిసింది...

Published Sat, Apr 28 2018 4:52 PM | Last Updated on Sat, Apr 28 2018 8:20 PM

People Shower Wads Of Notes On Gujarati Singer - Sakshi

అహ్మదాబాద్‌ : అభిమానానికి హద్దే ఉండదనేది మరోసారి నిరూపితమైంది. గుజరాత్‌ జాన‌ప‌ద గాయ‌కుడు కీర్తిద‌న్‌ గధ్విపై మరోసారి అభిమానం నోట్ల రూపంలో వెల్లువెత్తింది. గాయకుడి గానామృతానికి మంత్రముగ్ధులైన శ్రోతలు అతడిపై నోట్ల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌లో కీర్తిదన్‌ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు. ఇంకేముంది ఆయన ఉన్న వేదిక‌పైకి క‌రెన్సీ నోట్లు కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చిప‌డ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా కీర్తిదన్‌పై నోట్ల తుఫాను కురిసిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement