![Kabir Khan is The Forgotten Army makes Guinness World Record - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/26/the-for.jpg.webp?itok=FfKxaAkx)
ముంబై: ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్‌గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్‌లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment