Swapnil
-
రూ. 5 కోట్లు, ఫ్లాట్ ఇవ్వాలి: ఒలింపిక్ మెడలిస్ట్ తండ్రి డిమాండ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అథ్లెట్లను గౌరవించే విషయంలో హర్యానా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు.ప్యారిస్ వేదికగా ఈ ఏడాది ఆగష్టులో ముగిసిన ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో మూడోస్థానంలో నిలిచి ఈ పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ క్రీడాంశంలో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అది కూడా తన తొలి ప్రయత్నంలోనే పతక కలను అతడు సాకారం చేసుకోవడం విశేషం. ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పునఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయం గురించి స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే తాజాగా మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రభుత్వం ఒలింపిక్ మెడల్ గెలిచిన విజేతలకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చింది.అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన వారికి రూ. 2 కోట్ల నజరానా ఇవ్వాలనే కొత్త విధానం తీసుకువచ్చింది. మహారాష్ట్ర తరఫున విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో అథ్లెట్ స్వప్నిల్. అతడు మెడల్ గెలిచినపుడే ఇలాంటి పాలసీ ఎందుకు తీసుకువచ్చారు?ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత పతకాలు వస్తే.. అందులో హర్యానా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి స్వప్నిల్ ఒక్కడే ఉన్నాడు. మహారాష్ట్రతో పోలిస్తే హర్యానా చిన్న రాష్ట్రం. అయినా.. మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇక్కడి కంటే భారీ నజరానాలు, ప్రోత్సహకాలు ఇస్తోంది.ఇక మా ప్రభుత్వం గోల్డ్ గెలిస్తే రూ. 5 కోట్లు, వెండి పతకం అందుకుంటే రూ. 3 కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు ఇస్తామని ప్రకటించింది. సుదీర్ఘకాలంగా మహారాష్ట్రకు వ్యక్తిగత విభాగంలో రెండే పతకాలు వచ్చినా ఇలాంటి పద్ధతి అవలంభించడం దేనికి? క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి.ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటేస్వప్నిల్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. ఒకవేళ అతడు ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటే ఇదే రివార్డు ఇచ్చేవారా? నిజానికి స్వప్నిల్‌కు రూ. 5 కోట్ల నగదు అవార్డుతో పాటు బెలేవాడిలోని స్పోర్ట్స్ స్టేడియానికి సమీపంలో ఒక ఫ్లాట్ ఇవ్వాలి. అంతేకాదు.. 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలి’’ అని సురేశ్ కుసాలే డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే.. ఒలింపిక్ పతకం గెలిచిన తర్వాత రైల్వే శాఖ స్వప్నిల్‌కు పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలేను ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే! -
స్వప్నం సాకారం
గత రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారత తుపాకీ ‘పారిస్’లో మాత్రం గర్జిస్తోంది. తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయకుండా షూటర్లు భారత్‌కు మూడో పతకాన్ని అందించారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు.క్వాలిఫయింగ్‌లో నిలకడగా లక్ష్యంపై గురి పెట్టి పాయింట్లు గెలిచిన స్వప్నిల్ పతకాన్ని ఖరారు చేసే ఫైనల్స్‌లోనూ దానిని కొనసాగించాడు. ఫలితంగా గతంలో ఏ క్రీడాంశంలోనూ నమోదుకాని అద్భుతాన్ని భారత షూటర్లు నిజం చేసి చూపించారు. ఒకే ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే ప్రథమం. ‘పారిస్’లో ఇప్పటికే రెండు కాంస్యాలు సాధించిన మనూ భాకర్ మరో ఈవెంట్లో పోటీపడనుండటంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరే అవకాశాలున్నాయి. పారిస్: గతంలో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరని ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తీవ్రమైన పోటీఉండే విశ్వ క్రీడల్లో క్వాలిఫయింగ్తో పోలిస్తే అసలు సిసలు సత్తా ఫైనల్లో చూపిస్తేనే పతకాలు ఖరారవుతాయి. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతుండటంతో స్వప్నిల్ పతకం సాధిస్తాడని పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ తన నైపుణ్యంపై అపార నమ్మకమున్న స్వప్నిల్ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేశాడు.షూటింగ్లో ఎంతో క్లిష్టమైన ఈవెంట్‌గా పేరున్న 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్) స్వప్నిల్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో 28 ఏళ్ల స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ 451.4 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్టేజ్–1లో త్రీ పొజిషన్స్‌లో భాగంగా నీలింగ్ స్టేజ్ ముగిశాక స్వప్నిల్ 153.3 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రోన్ స్టేజ్ పూర్తయ్యాక స్వప్నిల్ 310.1 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఎలిమినేషన్‌ను నిర్ణయించే చివరి స్టేజ్ స్టాండింగ్‌లో స్వప్నిల్ నిలకడగా పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.2012 నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వప్నిల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలిసారే పతకాన్ని గెలిచి తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. లియు యుకున్ (చైనా; 463.6 పాయింట్లు) స్వర్ణం, సెరీ కులిష్ (ఉక్రెయిన్; 461.3 పాయింట్లు) రజతం సాధించారు. సిఫ్ట్ కౌర్, అంజుమ్ విఫలం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు తనే పేరిట లిఖించుకున్న భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా, సీనియర్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్ కౌర్ 575 పాయింట్లు స్కోరు చేసి 31వ స్థానంలో నిలువగా... అంజుమ్ 584 పాయింట్లు సాధించి 18వ స్థానాన్ని దక్కించుకుంది. కేవలం టాప్–8లో నిలిచిన షూటర్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ‘ఒక్కడే’ గెలిచి చూపించాడు! ఈతరం కుర్రాళ్లు, స్టార్ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్ లైన్లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్ కుసాలే తన వెన్నెముక భాగం మొత్తం ‘మహా మృత్యుంజయ మంత్రం’ టాటూగా ముద్రించుకున్నాడు. మానసికంగా తనకు కావాల్సిన బలాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చలించని దృఢత్వాన్ని ఆ రుగ్వేద మంత్రం తనకు ఇస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే కావచ్చు సుదీర్ఘకాలం పాటు షూటింగ్ సర్క్యూట్లో ఉంటూ గొప్ప ఫలితాలు రాకపోయినా అతను ఎప్పుడూ స్థైర్యాన్ని కోల్పోలేదు. నిజంగా కూడా కుసాలే కెరీర్‌ను చూస్తే చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 14 ఏళ్ల వయసులో షూటింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్న స్వప్నిల్ మూడేళ్ల తర్వాత తన తొలి అంతర్జాతీయ పోటీలో బరిలోకి దిగాడు. కానీ అతను తొలి ఒలింపిక్స్ ఆడేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో అతని పేరు కనీసం పరిశీలనలో కూడా లేకపోగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కొన్నాళ్ల ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోవడంతో టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. అయితే స్వప్నిల్ సుదీర్ఘ కాలం పాటు తన ఆటనే నమ్ముకున్నాడు. అవకాశం వ చ్చిన ప్రతీసారి విజయాన్ని అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి 28 ఏళ్ల వయసులో అతను మొదటిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగడమే కాకుండా కాంస్యంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. అవరోధాలను దాటి... మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి స్వప్నిల్ స్వస్థలం. తండ్రి సురేశ్ కుసాలే పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి అనిత ప్రస్తుతం సర్పంచ్‌గా పని చేస్తోంది. షూటింగ్ సర్క్యూట్లో ఉన్న చాలా మందితో పోలిస్తే స్వప్నిల్ నేపథ్యం సామాన్యమైనదే. తండ్రికి ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకు స్కూల్లో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ‘క్రీడా ప్రబోధిని’లో చేర్పించాడు. నిబంధనల ప్రకారం వారంతా ఒకే తరహాలో ఫిట్నెస్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా క్రీడాంశం ఎంచుకునే అవకాశం ఇస్తారు. అందులో స్వప్నిల్ షూటింగ్‌ను ఎంచుకున్నాడు. నాసిక్‌లోని భోన్సాలా మిలిటరీ స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో ఓనమాలు నేర్చుకున్న స్వప్నిల్ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అయితే సహజంగానే ఖర్చుతో కూడుతున్న క్రీడ కావడంతో వేర్వేరు దశల్లో ఆర్థి క ఇబ్బందులు తప్పలేదు. తండ్రి బ్యాంకులో అప్పు చేసి మరీ సొంత రైఫిల్ కొనివ్వాల్సి వచ్చింది. దీంతో పాటు ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్లు కూడా చాలా ఖరీదైనవి కావడం వల్ల చాలా జాగ్రత్తగా వాడుకుంటూ సాధన చేయాల్సి వచ్చేది. గగన్ నారంగ్‌ను ఓడించి... 18 ఏళ్ల వయసులో స్వప్నిల్ ప్రతిభను ‘లక్ష్య స్పోర్ట్స్’ సంస్థ గుర్తించింది. వారి ఆర్థిక సహాయంతో పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలో భారత జాతీయ క్యాంప్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చూపించిన ప్రదర్శనకుగాను భారత రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం లభించడంతో పరిస్థితి మరింత మెరుగైంది. 2015లో ఆసియా జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3లో కేటగిరీలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారి అతనికి గుర్తింపు దక్కింది.రెండేళ్ల తర్వాత జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ తన ఆటతో అందరి దృష్టిలో పడ్డాడు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తన ఆరాధ్య షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత గగన్ నారంగ్, మరో సీనియర్ చయన్ సింగ్‌లను దాటి స్వర్ణం గెలుచుకున్న స్వప్నిల్ సంచలనం సృష్టించాడు. అతని ఎదుగుదలలో కోచ్‌గా భారత మాజీ షూటర్ దీపాలీ దేశ్‌పాండే కీలకపాత్ర పోషించింది. సందేహాలను పటాపంచలు చేస్తూ... చాలా కాలం క్రితమే 2022 అక్టోబరులోనే కైరోలో జరిగిన వరల్డ్ షూటింగ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలవడంతో స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ కేటగిరీలో భారత్‌కు కోటా ఖాయం చేశాడు. కొన్నాళ్ల క్రితం నిర్వహించిన ట్రయల్స్‌లో కూడా రాణించడంతో ఈ విభాగంలో భారత్ తరఫున పోటీ పడేందుకు అతనికే అవకాశం దక్కింది. అయినా సరే... స్వప్నిల్ పతకం సాధించడంపై పెద్దగా ఆశలు లేవు. దానికి కారణం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు ముందు అతను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, వరల్డ్ కప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. ఇవన్నీ కూడా టీమ్ ఈవెంట్లలో గెలిచిన పతకాలే! వ్యక్తిగత విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు చేయలేదు. దాంతో గెలుపుపై సందేహాలు. కానీ స్వప్నిల్ తన పట్టుదలతో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య ఆటతో ఒలింపిక్స్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచాడు. 1 ఒకే ఒలింపిక్స్ ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే తొలిసారి. గతంలో రెజ్లింగ్‌లో రెండుసార్లు రెండు పతకాల చొప్పున రాగా... షూటింగ్లో ఒకసారి, అథ్లెటిక్స్‌లో ఒకసారి రెండేసి పతకాలు లభించాయి. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియా అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు గెలిచాడు.2012 లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్ షూటింగ్లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా రజతం, బజరంగ్ పూనియా కాంస్యం సాధించారు. ఈవెంట్‌కు ముందు గుండెవేగం పెరిగింది. దేవుడిని ప్రార్థిస్తూ నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా నాకు తెలిసిన ఆటనే ప్రదర్శించాను. పోటీ జరుగుతున్న సమయంలో స్కోరుబోర్డు వైపు అస్సలు చూడలేదు. ఇన్నేళ్ల నా కష్టం మాత్రం గుర్చుకొచ్చి0ది. తల్లిలాంటి కోచ్ దీపాలీతో పాటు ఇతర సహాయక సిబ్బంది నన్ను మానసికంగా దృఢంగా ఉంచారు. ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండటం నా ఆటలో కీలకం. ఈ విషయంలో నేను ఎమ్మెస్ ధోనిని అభిమానిస్తాను. కాంస్యం గెలవడం సంతృప్తినచ్చి0ది. అయితే నాకు నేను ఒక మాట (స్వర్ణం గెలవడం కావచ్చు) ఇచ్చుకున్నాను. అది మాత్రం ఇంకా పూర్తి కాలేదని అనుకుంటున్నా. –స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచిన స్వప్నిల్ కుసాలేకు హృదయపూర్వక అభినందనలు. షూటింగ్లో ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచి షూటర్లు భారత్ గర్వపడేలా చేశారు. స్వప్నిల్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిస్వప్నిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనికి శుభాకాంక్షలు. పోటీలో చక్కటి ఆటతో పాటు ఎంతో పట్టుదల కనబర్చిన అతను ప్రతీ భారతీయుడిని సంతోషంలో ముంచెత్తాడు. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ఈ విభాగంలో భారత షూటర్లెవరూ ఎందుకు పతకం సాధించడం లేదని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు స్వప్నిల్ దానిని చేసి చూపించాడు. అతడిపై అంచనాలు లేకపోయినా బాగా ఆడగలడని నేను నమ్మేవాడిని. ఈ కాంస్యం బంగారంకంటే విలువైంది. –గగన్ నారంగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం అందించిన స్వప్నిల్ కుసాలేకు అభినందనలు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ దేశవాసులందరూ గర్వపడేలాచేశాడు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం -
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాల్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో పతకం సాధించిన స్వప్నిల్‌కు అభినందనలు తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.My best wishes and congratulations to Swapnil Kusale on bringing home yet another medal at the Olympics. Kudos to Swapnil on being the first Indian to win a medal in the Men’s 50m Rifle 3 Positions category. You have filled the entire nation with great pride! #2024Olympics pic.twitter.com/rN3ereS7B9— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2024 ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు.పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. -
Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం
Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. 28 ఏళ్ల స్వప్నిల్ గురించి ఆసక్తికర అంశాలు..👉మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో గల కంబల్వాడీ గ్రామంలోని రైతు కుటుంబంలో జననం👉2009 నాటి క్రీడా ప్రభోదిని ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన స్వప్నిల్👉షూటింగ్‌పై మక్కువతో కఠిన సవాళ్లకు ఎదురీదిన స్వప్నిల్👉ఆసియా షూటింగ్ చాంపియన్స్(జూనియర్ కేటగిరీ) 2015లో స్వర్ణం👉59వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గగన్ నారంగ్‌ను ఓడించిన స్వప్నిల్👉61వ నేషనల్ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన స్వప్నిల్ -
గురి కుదిరితే మరో పతకం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు అందించారు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు భారత్ ఖాతాలో షూటింగ్ ద్వారా మూడో పతకం చేరుతుంది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ బరిలోకి దిగారు. స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారిస్: అంతగా అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అదరగొట్టాడు. ఆద్యంతం నిలకడగా పాయింట్లు సాధించి పతకం రేసులో నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల స్వప్నిల్ 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం 44 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కూడా క్వాలిఫయింగ్‌లో పాల్గొని 589 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు పొందాడు. ‘త్రీ పొజిషన్స్’ అని ఈవెంట్ పేరులో ఉన్నట్టే షూటర్లు వేర్వేరు మూడు భంగిమల్లో లక్ష్యం దిశగా షాట్లు సంధిస్తారు. తొలి సిరీస్‌లో షూటర్లు మోకాళ్లపై (నీలింగ్) కూర్చోని షూట్ చేస్తారు. రెండో సిరీస్‌లో సైనిక భంగిమ (ప్రోన్)లో షూట్ చేస్తారు. చివరిదైన మూడో సిరీస్‌లో నిల్చోని (స్టాండింగ్) లక్ష్యం వైపు షాట్లు కొడతారు. ఈ మూడు భంగిమల్లో స్కోరు చేసిన పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. అత్యధికంగా పాయింట్లు సాధించి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మహిళల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్, మహారాష్ట్రకే చెందిన తేజస్విని సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటున్న స్వప్నిల్ క్వాలిఫయింగ్‌లో సంయమనం కోల్పోకుండా, ఏకాగ్రతతో షూట్ చేశాడు. ముందుగా ‘నీలింగ్’ సిరీస్‌లో 198 పాయింట్లు... ‘ప్రోన్’ సిరీస్‌లో 197 పాయింట్లు... చివరిదైన ‘స్టాండింగ్’ సిరీస్‌లో 195 పాయింట్లు స్కోరు చేశాడు. స్వప్నిల్తోపాటు జిరీ ప్రివ్రత్స్కయ్ (చెక్ రిపబ్లిక్), పీటర్ నింబర్స్కయ్ (చెక్ రిపబ్లిక్) కూడా 590 పాయింట్లు స్కోరు చేశారు.అయితే ఈ ముగ్గురిలో 10 పాయింట్ల షాట్లు స్వప్నిల్ (38 సార్లు), జిరీ (35 సార్లు) ఎక్కువగా కొట్టడంతో ఏడు, ఎనిమిదో ర్యాంక్‌లతో ఫైనల్‌కు చేరగా... పీటర్ (32 సార్లు) తొమ్మిదో స్థానంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ‘నీలింగ్’లో 197 పాయింట్లు... ‘ప్రోన్’లో 193 పాయింట్లు... ‘స్టాండింగ్’లో 193 పాయింట్లు స్కోరు చేసి 589 పాయింట్లతో 11వ స్థానాన్ని సంపాదించాడు. లియు యుకున్ (చైనా; 594 పాయింట్లు), జాన్ హెర్మన్ హెగ్ (నార్వే; 593 పాయింట్లు), సెర్హీ కులిష్ (ఉక్రెయిన్; 592 పాయింట్లు), డెనిస్ బెర్నార్డ్ లుకాస్ (ఫ్రాన్స్; 592 పాయింట్లు), లాజర్ కొవాసెవిచ్ (సెర్బియా; 592 పాయింట్లు), టొమాస్ బార్ట్నిక్ (పోలాండ్; 591 పాయింట్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో నిలిచి స్వప్నిల్, జిరీలతో కలిసి నేడు జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీపడతారు. రాజేశ్వరి, శ్రేయసి విఫలం మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ బరిలోకి దిగారు. మొత్తం 30 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి, శ్రేయసి 113 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. రోయింగ్ సెమీస్‌లో బల్‌రాజ్‌కు ఆరో స్థానం భారత రోవర్ బల్రాజ్ పన్వర్ పారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు. బుధవారం జరిగిన పోటీల్లో పన్వర్ 7 నిమిషాల 4.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇక 19 నుంచి 24 స్థానాల కోసం శనివారం జరగనున్న పోటీలో బల్రాజ్ బరిలోకి దిగనున్నాడు. -
ISSF World Championships: స్వప్నిల్ గురికి ‘పారిస్’ బెర్త్ ఖరారు
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ ద్వారా భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శనివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె నాలుగో స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు షూటింగ్లో భారత్‌కు మూడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ట్రాప్ ఈవెంట్లో భౌనీష్ మెందిరత్త, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాం„Š పాటిల్ పారిస్ విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. -
ISSF World cup 2022: స్వర్ణంతో ముగింపు...
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత జట్టు స్వర్ణ పతకంతో ముగించింది. శనివారం జరిగిన భారత్ చివరి ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వప్నిల్ కుసలె–ఆశి చౌక్సీ జంట బంగారు పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో స్వప్నిల్–ఆశి చౌక్సీ ద్వయం 16–12తో సెరీ కులిష్–దరియా టిఖోవా (ఉక్రెయిన్) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. -
‘అబ్బాయిల వైపు ఆకర్షితుడిని అయ్యేవాడిని’
ముంబై: బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే తాను మహిళగా మారినట్లు ప్రకటించారు. తన పేరును సైషా షిండేగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘నేను గే కాదు.. ట్రాన్స్ వుమన్’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. బీ- టౌన్ సెలబ్రిటీలు దీపికా పదుకొనె, కరీనా కపూర్, శ్రద్ధ కపూర్, సన్నీ లియోన్, మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రా, భూమి ఫడ్నేకర్, హీనా ఖాన్ తదితరులకు స్వప్నిల్ డిజైనర్‌గా వ్యవహరించారు. సరికొత్త ఫ్యాషన్ డిజైన్లతో స్టార్ల మనసు దోచుకున్న స్వప్నిల్ గే అని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆయన.. ‘‘మనం ఎక్కడ ఉన్నామన్న అంశంతో సంబంధం లేకుండా బాల్యం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకువస్తూనే ఉంటాయి. నా గతం నేను ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గుర్తుచేస్తుంది. ఏకాంతంలో గడిపేలా నాపై ఒత్తిడి తెచ్చిన పరిస్థితులు గుర్తుకువస్తాయి. స్కూళ్లో, కాలేజీలో అబ్బాయిలంతా నన్ను కాస్త తేడాగా చూసేవారు. ఆ విషయం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నేను జీవిస్తున్న జీవితం నాది కాదు అనే భావన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. సమాజంలో ఉన్న హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజూ ప్రతిక్షణం మానసిక ఆందోళనకు గురయ్యాను. 20 ఏళ్ల వయస్సులో నిఫ్ట్‌లో చేరిన సమయంలో నా గురించి నాకు తెలిసిన నిజాన్ని నేను అంగీకరించాను. అప్పుడే వికసించాను. అబ్బాయిల వైపు ఆకర్షితుడిని అవుతున్న కారణంగా గే అనుకున్నాను. కానీ ఆరేళ్ల క్రితమే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను గే మాన్ కాదు.. ట్రాన్స్ వుమన్ను.. నా పేరు సైషా.. అంటే అర్థవంతమైన జీవితం అని అర్థం’’ అని సుదీర్ఘ పోస్టు ద్వారా తన మనోభావాలు వెల్లడించారు.(చదవండి: ‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’) View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialswapnilshinde) -
ది ఫర్గాటన్ ఆర్మీ.. గిన్నిస్ రికార్డు
ముంబై: ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్‌లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు. -
తొమ్మిదో అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి!
హైదరాబాద్: ఐఎస్బీకి చెందిన ఓ పరిశోధక విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చైతన్య బయాన్వాలా(26) ఐఎస్బీలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి. చైతన్య గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లో 12వ బ్లాక్‌లో నివాసం ఉండేవాడు. అయితే శనివారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో తొమ్మిదవ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. చైతన్య రూమ్మేట్స్ అయిన స్వప్నిల్, పియూష్ రాత్రి 10 గంటలకు షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లారు. కొద్ది సమయం తర్వాత అపార్ట్‌మెంట్‌కు రాగానే జరిగిన విషయాన్ని ఇతర ఫ్లాట్ వాళ్లు తమకు చెప్పారని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ చైతన్య బయాన్వాలాను చికిత్స నిమిత్తం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చైతన్య అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించారని సమాచారం. ఈ ఘటనపై చైతన్య రూమ్మేట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.