
Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.
మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్‌లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సరబ్‌జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.
అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. 28 ఏళ్ల స్వప్నిల్ గురించి ఆసక్తికర అంశాలు..
👉మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో గల కంబల్వాడీ గ్రామంలోని రైతు కుటుంబంలో జననం
👉2009 నాటి క్రీడా ప్రభోదిని ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన స్వప్నిల్
👉షూటింగ్‌పై మక్కువతో కఠిన సవాళ్లకు ఎదురీదిన స్వప్నిల్
👉ఆసియా షూటింగ్ చాంపియన్స్(జూనియర్ కేటగిరీ) 2015లో స్వర్ణం
👉59వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గగన్ నారంగ్‌ను ఓడించిన స్వప్నిల్
👉61వ నేషనల్ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన స్వప్నిల్
Comments
Please login to add a commentAdd a comment