
బాకు (అజర్‌బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత జట్టు స్వర్ణ పతకంతో ముగించింది. శనివారం జరిగిన భారత్ చివరి ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసలె–ఆశి చౌక్సీ జంట బంగారు పతకం సొంతం చేసుకుంది.
ఫైనల్లో స్వప్నిల్–ఆశి చౌక్సీ ద్వయం 16–12తో సెరీ కులిష్–దరియా టిఖోవా (ఉక్రెయిన్) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.