ముంబై: వరల్డ్‌కప్‌లో వరుసగా ఏడో విజయంపై దృష్టి పెట్టిన భారత జట్టు తమ సన్నాహకాలకు పదును పెట్టింది. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సోమవా రం టీమ్ సాధన కొనసాగింది. ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ కావడంతో రోహిత్, కోహ్లి, గిల్ దీనికి హాజరు కాలేదు. అయితే జట్టులోని ఇతర ప్రధాన ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమించారు.
కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా... జడేజా, అశ్విన్, శార్దుల్ కూడా తమ బౌలింగ్‌కు పదును పెట్టారు. అయితే అన్నింటికంటే కీలక సెషన్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌దే. ఆశించిన స్థాయిలో ఈ టోర్నీలో రాణించలేకపోతున్న అయ్యర్ పదే పదే షార్ట్ పిచ్ బంతులకు అవుటవుతూ తన బలహీనతను బయట పెట్టుకుంటున్నాడు. దీనిని సరిదిద్దే క్రమంలో అయ్యర్ ప్రాక్టీస్ సాగింది.
ఆరంభంలో స్థానిక నెట్ బౌలర్లు అతనికి బౌలింగ్ చేయగా... ఆ తర్వాత టీమ్ త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అతనికి పెద్ద సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరాడు. అయ్యర్ సాధనను పర్యవేక్షించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి తగిన సూచనలిస్తూ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేశారు. ముంబైకే చెందిన శ్రేయస్ సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment