Rifle shooting
-
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు ఇషా సింగ్
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత రైఫిల్, పిస్టల్ షూటింగ్ జట్టును మంగళవారం ప్రకటించారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 15 మంది షూటర్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో పోటీపడనుంది. గత ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల ఇషా సింగ్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది.ఇటీవల నిర్వహించిన ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఈ బృందాన్ని ఎంపిక చేశారు. షూటింగ్ క్రీడాంశంలో అందుబాటులో ఉన్న 24 బెర్త్‌లకుగాను భారత షూటర్లు 21 బెర్త్‌లు గెల్చుకున్నారు. షాట్‌గన్ విభాగంలో పాల్గొనే భారత జట్టును జూన్ 18న ఇటలీలో ప్రపంచకప్ ముగిశాక ప్రకటిస్తారు. చదవండి: 5000 మీటర్లలో గుల్వీర్ కొత్త జాతీయ రికార్డు -
ఆల్ ఇండియా రైఫిల్ షూటింగ్‌కు ‘ఇందూరు’ రేఖారాణి
నిజామాబాద్, నాగారం/సాక్షి: ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఇందూరు(నిజామాబాద్)వాసి ఎంపికైంది. నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుంచి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు. 2002 లో ఉద్యోగంలో చేరిన రేఖారాణి.. ఫుట్‌బాల్, మాస్టర్ అథ్లెటిక్స్‌లో సైతం రాణించి పతకాలు సాధించారు. ఆమె ఎంపికపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో పతకం
Sift Kaur Samra-Ashi Chouksey - Manini Kaushik: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో భారత మహిళా జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. షూటింగ్ త్రయం సిఫ్ట్‌కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీ తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం అందించారు. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో బుధవారం నాటి 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఆతిథ్య జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరు చేసి వెండి పతకం గెలవగా.. . పబ్లిక్ ఆఫ్ కొరియా 1756 స్కోరు సాధించి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక తాజా విజయంతో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఐదు సిల్వర్, ఏడు కాంస్యాలు సాధించారు. 🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈 Incredible marksmanship on display! 🎯👏 Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women's Team event! 🥈👩🎯 Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz — SAI Media (@Media_SAI) September 27, 2023 -
ISSF World cup 2022: స్వర్ణంతో ముగింపు...
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత జట్టు స్వర్ణ పతకంతో ముగించింది. శనివారం జరిగిన భారత్ చివరి ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వప్నిల్ కుసలె–ఆశి చౌక్సీ జంట బంగారు పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో స్వప్నిల్–ఆశి చౌక్సీ ద్వయం 16–12తో సెరీ కులిష్–దరియా టిఖోవా (ఉక్రెయిన్) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. -
ISSF World Cup: అమ్మాయిలు అదరగొట్టారు.. పసిడి పతకంతో..
బాకు(అజర్బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ బంగారు బోనీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలరివన్, రమిత, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో టీమిండియా 12-5 పాయింట్ల తేడాతో అనా నీల్సన్, ఎమ్మా కోచ్, రిక్కీ మెంగ్ ఇస్బెన్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. ఇదిలా ఉంటే.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, రుద్రాక్ష్, పార్థ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక పోరులో 10-16తో క్రొయేషియా జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1కు ఘోర పరాజయం -
ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!
Ukrainian Grandmother Pick UP AK 47 Rifle: రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉక్రెయిన్ వాసులకు అమాంతం యుద్ధ భయాన్ని పెంచేసింది. ఓ పక్క అమెరికా రష్యాని హెచ్చరిస్తూ వస్తోంది. దీంతో ఉక్రెయిన్ తమ దేశంలోని పెద్దల నుంచి పిల్లల వరకు తమని తాము రక్షించుకోవడమే కాక దేశాన్ని కూడా రక్షించుకుకోనేలా శిక్షణ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అయితే అందుకు పిల్లలు, పెద్దలు కూడా ఏ మాత్రం భయందోళనలకు గురికాకుండా సైనిక శిక్షణ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే వాలెంటైనా కాన్‌స్టాంటినోవ్‌స్కా అనే 79 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ ఏకే 47 గన్ని పట్టుకుని సైనిక శిక్షణ తీసుకుంటోంది. ఈ మేరకు ఆమె తూర్పు ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో జాతీయ గార్డు సాయంతో 79 ఏళ్ల వృద్ధ మహిళ అసాల్ట్ రైఫిల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చకుంటోంది. అయితే అక్కడ స్థానిక మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే.. "ఆమె ఈ పని నేను మాత్రమే కాదు మీ అమ్మ అందరూ కచ్చితంగా నేర్చుకునేందుకు సన్నద్దమవుతారు. ఎందుకంటే వారు తమ పిల్లలను, దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై సమయం ఆసన్నమైంది" అని చెప్పింది. సరిహద్దుల వద్ద రష్యా దళాల ఉద్రిక్తలు కొనసాగుతున్నందున ప్రజలకు ప్రాథమిక సైనిక పద్ధతులను నేర్పడం ఈ శిక్షణ లక్ష్యం. రాగ్-ట్యాగ్ సైన్యాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక కసరత్తులలో ఇది ఒకటి. అందులో భాగంగానే ఈ బామ్మ సైనికి బెటాలియన్లోకి చేరి సైనిక కసరత్తులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను హీరో అంటూ ప్రశంసంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Ukrainian great grandmother, Valentina Constantinovska, on an Ak-47, training to defend against a possible Russian attack. “Your mother would do it too,” she told me. pic.twitter.com/PnojqRir4K — Richard Engel (@RichardEngel) February 13, 2022 -
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్. -
3కి.మీ దూరంలోని శత్రువు చంపేసే తుపాకీ
న్యూఢిల్లీ : మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన స్నైపర్ తుపాకీని రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్ కనిపెట్టింది. ఎస్‌వీఎల్‌కే–14ఎస్‌గా వ్యవహరించే పది కిలోల బరువుగల ఇది తుపాకుల విభాగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ఈ తుపాకీలో నుంచి బుల్లెట్ సెకండ్‌కు 900 మీటర్ల దూరం చొప్పున అంటే, ధ్వని వేగంకన్నా మూడు రెట్లు ఎక్కువ. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 29 లక్షల రూపాయలు. (‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’ ) ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడు సెంటీమీటర్ల మందం గల ఇనుప దిమ్మ నుంచి దూసుకుపోతుందని, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించిన వ్యక్తి కూడా ఈ బుల్లెట్ తగిలితే మరణించాల్సిందేనని ఈ తుపాకీని తయారు చేసిన కంపెనీ చీఫ్ ఇంజనీరు యూరి సించ్కిన్ తెలిపారు. ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని, గురి తప్పకుండా ఉండాలంటే మూడు కిలోమీటర్లకు మించి లక్ష్యం ఉండరాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్రిటీష్ సైన్యం ఉపయోగిస్తున్న ‘ఎల్115ఏ3’ తుపాకీ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇదే ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాకీగా చెలామణి అవుతోంది. (ధోనికి ఎలా చోటిస్తారు..? ) -
రైఫిల్ షూట్ పోటీల్లో ఫైనల్‌కు అజిత్
పెరంబూరు : నటుడు అజిత్ రైఫిల్ షూట్ ఫోటీల్లో ఫైనల్‌కు చేరుకున్నారు.అజిత్ నటుడిగానే కాకుండా పలు రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారనే విషయం తెలిసిందే. ఈయన మంచి నలభీముడు, ముఖ్యంగా బిర్యాని వండడంలో దిట్ట. షూటింగ్‌ల్లో తాను చేసిన బిర్యానీతో చిత్ర యూనిట్‌ను ఆహా అనిపిస్తారు. ఇక కారు, బైక్ రేసుల్లోనూ పాల్గొంటుంటారు. అదే విధంగా ఎరో మోడలింగ్ వంటి వాటిలో పరిజ్ఞానం కలిగివ వ్యక్తి. మ్యాన్ పవర్ లేని బుల్లి విమానాలను తయారు చేసే ఎంఐటీకి చెందిన దక్ష అనే విద్యార్థుల టీమ్‌కు సలహాదారుడిగానూ వ్యహరిస్తున్నారు. ఇక చాలా కాలంగా రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే విమానాల తయారీలోనూ దృష్టి సారిస్తున్నారు. కాగా తాజాగా రైఫిల్ షూట్ పోటీలకు సిద్ధం అయ్యారు. ఇటీవల కోవైలోని పోలీస్ అకాడమీ మైదానంలో జరిగిన జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో తమిళనాడు రైఫిల్ షూట్ సంఘం తరఫున పాల్గొని ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా డిసెంబరు నెలలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఫైనల్ రైఫిల్ షూట్ పోటీల్లో అజిత్ పాల్గొననున్నారు. -
రై.. రై... రైఫిల్
వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ‘సైరా’ టీమ్ భావిస్తున్నట్లుంది. ఇటీవల జార్జియాలో క్లైమాక్స్‌ను కంప్లీట్ చేసిన ‘సైరా’ టీమ్ పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరంజీవి రైఫిల్ షూట్ నేర్చుకుంటున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో రేపటి నుంచి నయనతార పాల్గొంటారని సమాచారం. అలాగే ఈ నెల 15న తమన్నా సెట్లో జాయిన్ అవుతారని వినికిడి. మరి సినిమాలో నయనతార, తమన్నా కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుందని టాక్. -
రైఫిల్ షూటింగ్లో రాకెట్లా..
దూసుకుపోతున్న చాగల్నాడు కుర్రాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవసం నరేంద్రపురం (రాజానగరం) : ఫ్రీ నేషనల్స్ పాయింట్ 22 స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్స్ (50 మీటర్లు) సీనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన వడ్డి శ్రీనా«థ్ ముత్యాలురావు థర్డ్ ప్లేస్‌లో నిలిచి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. ది నేషనల్ రైఫిల్ అసోసియేష¯ŒS ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ముంబయ్‌లో జరిగిన 26వ ఆల్ ఇండియా జీవీ మావలంకర్ షూటింగ్ చాంపియ¯ŒS షిప్ రైఫిల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న శ్రీనాథ్ స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్ ఫ్రో¯ŒS (ఎ¯ŒSఆర్) చాంపియ¯ŒS షిప్, 50 మీటర్లు(మె¯ŒS) సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో 600 స్కోర్‌కిగాను 574 స్కోర్‌తో వీటిని సొంతం చేసుకున్నాడు. అలాగే గత అక్టోబర్ 20 నుంచి 25 వరకు మధురైలో జరిగిన సౌత్ జో¯ŒS ఈవెంట్స్‌లో పాయింట్ 22 ఫ్రో¯ŒSలో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు పూణెలో జరిగే నేషనల్ లెవెల్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఇండియ¯ŒS టీమ్ (టాప్–8)కి అర్హత సాధిస్తాడనే ఆశాభావాన్ని ఆయన తండ్రి వడ్డి సూర్యప్రకాశరావు వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిండమే లక్ష్యం 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధిండమే తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ ముత్యాలురావు చెబుతున్నాడు. తన తండ్రి సూర్యప్రకాశరావు ప్రోత్సాహంతోనే తాను రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు. -
రైఫిల్ షూటింగ్లో ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 రైఫిల్ షూటింగ్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పతకాలు సాధించారు. యక్కలూరి శ్రీనిత్య బాలికల పిప్ సైట్ ఈవెంట్లో, ఎం.రిషిత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో , బాలుర ఎయిర్ రైఫిల్ విభాగంలో హర్షవర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మంగళవారం స్కూల్ గేమ్స్ కార్యదర్శి ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.సంజీవరెడ్డి, డీబీఈఓ రామకృష్ణ పరమహంస అభినందించారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు భాష్యం విద్యార్థులు ఎంపికయ్యారని భాష్యం విద్యాసంస్థల సీఈఓ భాష్యం హనుమంతరావు తెలిపారు. స్థానిక చంద్రమౌళి నగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. అండర్–19 విభాగంలో వై.శ్రీనిత్య (సీనియర్ బైపిసీ), ఎం.రిషిత (సీనియర్ ఎంపీసీ), వి.హర్షవర్ధన్ రెడ్డి(జూనియర్ బైపీసీ), ఎన్.వెంకట వరుణ్ సాయి(సీనియర్ ఎంపీసీ) ఎంపికైనట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. -
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి
కొత్తపేట : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి, ఎన్సీసీ ఆర్మీ కేడెట్ యెల్లమిల్లి చార్లెస్ కుమార్ జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు జి.సూర్యప్రకాశరావు గురువారం తెలిపారు. ఈ నెల 6న కాకినాడలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలకు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యాన ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఎనిమిదో తరగతి విద్యార్థి చార్లెస్‌కుమార్ అండర్–14 రైఫిల్ షూటింగ్లో విజయం సాధించాడు. తద్వారా ఈ నెలాఖరున కడపలో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు. తొలి అడుగులోనే విజయబావుటా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలకు సుమారు 30 ఏళ్లకు పూర్వమే ఎన్సీసీ యూనిట్ ఉండేది. అప్పట్లో ఎందరో ఎన్సీసీ విద్యార్థులు వివిధ ఉద్యోగాలు పొందారు. తరువాతి కాలంలో వివిధ కారణాలవల్ల పాఠశాలలో ఎ¯Œæసీసీ యూనిట్‌ను రద్దు చేశారు. కాగా, ఎన్íసీసీ ఆర్మీ చీఫ్ ఆఫీసర్ అయిన గణిత ఉపాధ్యాయుడు ఉప్పలపాటి మాచిరాజు కృషి మేరకు ఈ విద్యా సంవత్సరం ఎన్సీసీ యూనిట్ మంజూరైంది. 25 మంది విద్యార్థులను యూనిట్లో జాయిన్ చేసుకుని శిక్షణ ప్రారంభించారు. మొట్టమొదటగా జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లగా చార్లెస్‌కుమార్ విజయం సాధించి, తొలి అడుగులోనే విజయ బావుటా ఎగురవేశాడు. ఈ సందర్భంగా కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయం సాధిస్థానని విశ్వాçÜం వ్యక్తం చేశాడు. అతడిని డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని, ఎంఈఓ వై.సత్తిరాజు, ఎ¯Œæసీసీ 18వ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ మొనీష్గౌర్, హెచ్ఎం సూర్యప్రకాశరావు, పీడీ బి.అప్పాజీ, పీఈటీ జ్యోతి అభినందించారు. -
ముగిసిన రైఫిల్ షూటింగ్
నేటితో ఎన్సీసీ శిక్షణ శిబిరం పూర్తి తుని రూరల్ : సంయుక్త వార్షిక ఎన్సీసీ శిక్షణ శిబిరం సోమవారంతో ముగుస్తుందని 18వ ఆంధ్రా బెటాలియన్ కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న రాజుపేట శ్రీప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 16, 17, 18 బెటాలియన్ల జూనియర్, సీనియర్ క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ శిబిరానికి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు చెందిన 610 మంది బాలురు, 48 మంది బాలికలు వచ్చారన్నారు. ఆదివారంతో రైఫిల్ షూటింగ్ ముగిసిందని, సోమవారం శిక్షణ శిబిరం పూర్తవుతుందని చెప్పారు. శ్రీప్రకాష్ ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ ఎం.సతీష్, లెఫ్టినెంట్ రమణబాబు, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎం.కృష్ణారావు పాల్గొన్నారు. -
ఎన్‌సీసీతో బంగారు భవిత
18వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నర్ మోనీష్ గౌర్ తుని రూరల్: ఎన్‌సీసీతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్ గౌర్ అన్నారు. మంగళవారం తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మచిలిపట్నం, విజయవాడ, కాకినాడ 16, 17, 18 బెటాలియన్ ఎన్సీసీకి చెందిన 658 విద్యార్థినీవిద్యార్థులకు రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎన్సీసీకి ప్రత్యేక కోటా ఉందన్నారు. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో సీట్లు సాధిస్తున్నారని, ఉద్యోగాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారన్నారు. 18 ఆంధ్రా బెటాలియన్ తరఫున పెద్దాపురం మహారాణి కళాశాలకు చెందిన సీనియర్ అండర్ ఆఫీసర్ యు.మీనుసారిక దిల్లీలోని రిపబ్లిక్ డేలో పాల్గొని ప్రధాని మోదీ నుంచి పతకాలు అందుకున్నట్టు తెలిపారు. ఆర్మీ విభాగంలో లాగే డ్రిల్, యోగా, పరుగు, ఆయుధ వినియోగం, రైఫిల్ షూటింగ్, ఫైరింగ్‌కు ముందు తీసుకోవలసిన జగ్రత్తలు, స్పోర్ట్స్, రీడింగ్, సివిల్ డిఫెన్స్, సాంస్కృతిక, వ్యక్తిత్వ, నాయకత్వ, ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో ఎనిమిది మంది అసోసియేట్ అధికారులు, కెప్టెన్ ఎం.వి.చౌదరి, జేసీఓ రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రమణబాబు, శిక్షణ అధికారి లెఫ్టినెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్ఆర్పీ నాగర్కోటి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, మేజర్ జోగీందర్ సింగ్, సూపరిండెంట్ గుమ్మడి అనిల్‌కుమార్, సుబేదార్ రాంకుమార్, థర్డ్ ఆఫీసర్లు ఎం.సతీష్, టి.రాంబాబు కేడెట్లు పాల్గొన్నారు. -
ఐఎస్ఎస్ఎఫ్ సభ్యుడిగా రణ్‌ధీర్
న్యూఢిల్లీ: భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. మ్యూనిచ్‌లో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో రణ్‌ధీర్‌కు 25 ఓట్లకు గాను 22 ఓట్లు పడ్డాయి. ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లో కూడా రణ్‌ధీర్ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మొత్తం 293 ఓట్లలో 145 ఓట్లు సాధించారు. -
రాష్ర్ట స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో రాష్ర్టస్థాయి బాలబాలికల అండర్ 14, 17 రైఫిల్ షూటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమేనని, గెలుపొందిన వారు ఎక్కువ, ఓడిన వారు తక్కువ కాదని చెప్పారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యం సంపాదించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని సూచించారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలో ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ముందంజలో ఉందన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని హాజీబీ జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చడం అభినందనీయమని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాఘవను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉప క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్లో రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయి రైఫిల్ పోటీలలో అండర్-14లో గోల్డ్‌మెడల్ సాధించిన టీ అతిథిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ క్రీడాకారిణికి కమలాపురం ఏపీసోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమ్మ రూ.50వేలు నగదు బహుమతి అందించారు. ఎంపీపీ రాజారాంరెడ్డి, నిర్వాహక కమిటీ అధ్యక్షులు, డీబీసీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వైఎస్ జబివుల్లా, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్‌కుమార్‌రెడ్డి, నిర్వాహక కార్యదర్శి రాఘవ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నడిగడ్డ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.