ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment