martial arts
-
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్‌లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్‌గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్‌తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్‌కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్‌తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్‌సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్‌గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
కుంగ్ ఫూ శిక్షణ..ఆత్మరక్షణ కుర్రకారులో భారీ క్రేజ్
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్ నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఆ‘శక్తి’ని గమనించి.. కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు. చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! పలు పోటీల్లో... నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి.. మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!కుంగ్ ఫూతో మేలు.. కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. – కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు మాస్టర్ల ప్రోత్సాహమే.. కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే. – వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు -
తగ్గేదే లేదు.. ఒగ్గేదే లేదు!
‘నీ ప్రయాణంలో కరాటే అనేది వెలిగే కాగడాలా ఉండాలి’ అంటాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్. పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల దారి ΄పొడుగునా ఆ వెలుగును కాపాడుకోవడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. తండ్రి పక్కనపెట్టిన కాగడా పట్టుకొని కరాటేలో విజయపథంలో దూసుకుపోతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మన్యం బిడ్డ కొండపల్లి చందన.కాస్త సరదాగా చెప్పుకోవాలంటే చందన వాళ్ల ఇంట్లో ‘కరాటే’ అనేది పాత చుట్టంలాంటిది. తండ్రి కొండపల్లి జంపన్నకు కరాటే అంటే ఎంతో ఇష్టం. ఎన్నో కలలు కన్నాడు. బ్లాక్‌బెల్ట్ వరకు వెళ్లాడు. తెల్లవారుజామునే ‘హా’ ‘హూ’ అంటూ తండ్రి సాధన చేస్తుంటే ఆ శబ్దాలు నిద్రలో ఉన్న చందన చెవుల్లో పడేవి. ఆ శబ్దాల సుప్రభాతంతోనే నిద్ర లేచేది. నాన్న సాధన చేస్తుంటే ఆసక్తిగా చూసేది. ఆ తరువాత సరదాగా తాను కూడా సాధన చేసేది. అలా కరాటేతో పరిచయం మొదలైంది.చిన్నప్పటి నుంచే ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న చందనను తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయిని సుధకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇతర ఆటలతో పాటు కరాటే కూడా విద్యార్థులతో సా«ధన చేయించేది. స్కూలు మొత్తంలో ఓ పదిమంది విద్యార్థినులు కరాటేలో ప్రతిభ చూపిస్తుండటంతో ఆ శిక్షణను కొనసాగిస్తూనే వివిధ పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లేవారు. ఎనిమిదో తరగతి నుంచే కరాటే పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుస్తూ వచ్చింది చందన.విరామం కాదు ఆరంభ సంకేతంవరంగల్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం గెలుచుకోవడంతో చందన విజయపరంపర మొదలైంది. విశాఖపట్నం, ఖమ్మంలలో జరిగిన పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, దిల్లీలో జరిగిన పోటీల్లోనూ పతకాలు సా«ధించింది. అయితే పదోతరగతి తర్వాత ఆటలతోపాటు చదువు ముఖ్యం అంటూ కుటుంబంపై వచ్చిన ఒత్తిడి కారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి హన్మకొండలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్లో చేరింది. ‘ఇక కరాటే ఆపేసిట్లేనా!’ అడిగే వాళ్లు చాలామంది. అయితే ఆ విరామం మరిన్ని విలువైన విజయాలు సాధించడానికి ఆరంభ సంకేతం అనేది చాలామందితోపాటు చందనకు కూడా తెలియదు.ఇప్పటికీ కలగానే ఉంది!కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందనను వదులుకోవడానికి గురుకుల పాఠశాల వారు ఇష్టపడలేదు. ఆమె వేరేచోట చదువుతున్నా తమ స్కూల్ తరఫున పోటీలకు పంపడం ప్రారంభించారు. గత నెల గోవాలో జరిగిన అండర్ 18, వరల్డ్‌కప్ చాంపియన్ షిప్లో చందన పాల్గొంది. తొలిరౌండ్లో కర్ణాటక అమ్మాయిపై గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్రికా, చైనాలకు చెందిన అమ్మాయిలపై విజయం సాధించింది. ‘గోవాకు వెళ్లేప్పటికి నాకు తెలుగు తప్ప మరో భాష రాదు. అక్కడంతా బాగా పాష్‌గా కనిపించడంతో కొంత తడబడ్డాను. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ చాంపియన్లతో పోటీపడి నెగ్గగలనా అని సందేహించాను. కర్ణాటక అమ్మాయితో త్వరగానే గేమ్ ముగిసింది. ఆ తర్వాత నాకంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న ఆఫ్రికన్ అమ్మాయితో పోటీ పడ్డాను. ఇక్కడే నా పని అయిపోతుందనుకున్నా. గేమ్నే నమ్ముకుని గెలిచాను. చిన్నప్పటి నుంచి కరాటే అంటే చైనానే గుర్తుకు వస్తుంది. అలాంటిది చివరగా చైనా అమ్మాయిపై విజయం సాధించడం ఇప్పటికీ కలగానే ఉంది’ అంటుంది చందన.గోవా విజయంతో 2025 జనవరిలో మలేషియాలో జరగబోయే పోటీలకు అర్హత సాధించింది. కనే కల విజయాన్ని పరిచయం చేస్తుంది. ఆ విజయం ఎప్పుడూ మనతో చెలిమి చేయాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు. లక్ష్యసాధన కోసం బాగా కష్టపడే గుణం కూడా ఉండాలి. కొండపల్లి చందనలో ఆ గుణం కొండంత ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.అదే నా లక్ష్యంనాన్నకు కరాటే అంటేప్రాణం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనకు ఎన్నో కలలు ఉండేవి. స్కూల్లో నేను కరాటే బాగాప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరో చెబితే నాన్న ఎంతో సంతోషించారు. దీంతో మరింత ఇష్టం, పట్టుదలతో కరాటే సాధన చేశాను. ‘ఆడపిల్లకు కరాటేలు ఎందుకు! చక్కగా చదివించక’ అంటుండేవారు ఇరుగు ΄పొగురు, బంధువులు. అయితే వారి మాటలతో అమ్మానాన్నలు ప్రభావితం కాలేదు. అమ్మ శారద నా వెన్నంటే నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవాలన్నదే నా లక్ష్యం. అయితే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. చేయూత అందిస్తే నా ప్రయాణం సులువు అవుతుంది.– చందన– కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఫొటోలు : యాసారపు యాకయ్య -
యుద్ధ విద్యల జమానా.. కోనసీమ చెడీ తాలింఖానా
కోనసీమ.. మైమరపించే ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మిక సౌరభాలకు.. సంస్థానాల పాలనకు.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఇక్కడ జరిగే సంక్రాంతి.. దసరా పండగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ప్రభల తీర్థాలతోపాటు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే చెడీ తాలింఖానా ప్రదర్శన సైతం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది. బ్రిటిష్ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది. తరువాత కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా మారింది. నాటినుంచి నేటి వరకు దశాబ్దాల కాలంగా ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది. ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ నెల 12న దసరా రోజున రాత్రి చెడీ తాలింఖానా ప్రదర్శనలు అమలాపురంలో వీధుల్లో రోమాంచితం కానున్నాయి. – సాక్షి, అమలాపురంబర్మాలో శిక్షణ పొంది.. చెడీ తాలింఖానా బర్మా (మయన్మార్)కు చెందిన విద్య. ఉమ్మడి గోదావరి జిల్లాలోని సంస్థానాల్లో పనిచేసే సైనికులకు, యువతకు యుద్ధ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమలాపురం పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు (తొలి తరం వ్యక్తి) బర్మా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. పిఠాపురం, పెద్దాపురం, మొగల్తూరు తదితర సంస్థానాల నుంచి, స్థానిక యువకులు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకునేవారు. స్వాతం్రత్యానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయులలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఊరేగింపులలో జాతీయ సమైక్యత చాటాలని ఆయన ఇచ్చిన పిలుపుతో దసరా ఉత్సవాలలో చెడీ తాలింఖానా ప్రదర్శన ఒక భాగమైంది. దసరా ఉత్సవాల్లో ఇది ప్రారంభమై 168 ఏళ్లు అయ్యింది. అమలాపురం పట్టణంలో దసరా రోజు సాయంత్రం నుంచి ఏడు వీధులకు చెందినవారు దసరా వాహనాలను ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో చెడీ తాలింఖానా, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. నాలుగు తరాలుగా.. అమలాపురానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానాకు అంకురార్పణ చేశారు. తరువాత ఆయన కుమారుడు అబ్బిరెడ్డి నరసింహరావు (రెండవ తరం వ్యక్తి) ఈ వీర విద్యను ప్రోత్సహించారు. అబ్బిరెడ్డి రామదాసు (మూడవ తరం) తాత బాటలో ఈ విద్యకు రాష్ట్రస్థాయి గుర్తింపును తీసుకువచ్చారు. అబ్బిరెడ్డి మల్లేశ్వరస్వామి (మల్లేష్–నాల్గవ తరం) తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మల్లేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా యూఎస్‌లోని టెక్సాస్‌లో పనిచేస్తున్నారు. దసరా సమయంలో ముందుగానే ఇక్కడకు వచ్చి స్థానికులకు శిక్షణ ఇస్తుంటారు. కత్తులు దూస్తూ.. బళ్లేలు తిప్పుతూ.. దసరా వస్తుందంటే చాలు అమలాపురంలో సంప్రదాయ చెడీ తాలింఖానా ప్రదర్శనకు సిద్ధమయ్యే యువతీ యువకులు ఎందరో. దసరా సందర్భంగా వీధుల్లో అమ్మవారు వివిధ రకాల రథాలపై కొలువై ఊరేగింపుగా వెళతారు. దీనికి ముందే ఏడు వీధులకు చెందిన యువకులు పట్టా కత్తులకు పదును పెడతారు. బళ్లేలు, బాణా కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తారు. రాచరిక యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు దసరా రోజు రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి శరీరంపైన, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గి బరాటాలు, లేడి కొమ్ములు, పట్టా కత్తులను చురుగ్గా కదిలిస్తూ యువకులు చేసే విన్యాసాలు యుద్ధ సన్నివేశాలను తలపిస్తాయి. ప్రదర్శన ఆసాంతం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఊరేగిస్తారు. త్వరలో వెబ్సైట్ చెడీ తాలింఖానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే నా ధ్యేయం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం తీసుకువస్తున్నాం. త్వరలోనే తాలింఖానాకు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేస్తాం. – అబ్బిరెడ్డి మల్లేష్, అమలాపురం -
అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దని చెప్పారు : హీరోయిన్ రితికా సింగ్
తనను తాను రక్షించుకోవాడానికే బాక్సింగ్, కరాటే నేర్చుకున్నానని చెబుతోంది హీరోయిన్ రితికా సింగ్. ‘గురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాక్సింగ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు,తమిళ, మలయాళ సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘వేట్టయాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రితికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఎందుకు కరాటే, బాక్సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పింది. ‘మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వాటిని తట్టుకొని నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలు బయటకు వెళ్తే దురదృష్టవశాత్తు ఏమైనా జరగొచ్చు. నన్ను నేను రక్షించుకోవడానికే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే..కొంతమంది వద్దని చెప్పారు. ‘నీ కరాటే వీడియోలు చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వాటిని షేర్ చేయకండి’ అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం షేర్ చేయడం ఆపలేదు. కరాటే వీడియోలే కాదు.. శారీ ఫోటో షూట్, డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను. ఒక నటిగా నేను ఏం చేయగలనో అన్ని చేశాను. అయినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాటని పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారనని నా ట్రైనింగ్ మానుకోలేదు. ఇప్పటికే కరాటే, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది నాకు ఇష్టమైన పని. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? నేను బయటకు వెళ్లినప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రక్షిస్తారు? నన్ను నేను రక్షించుకోవడానికే మార్షల్ ఆర్ట్స్‌లో బేసిక్స్ నేర్చుకున్నాను. అలా అని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగితే ధైర్యంగా మన గళాన్ని వినిపించాలి. మన వాయిసే ఒక ఆయుధం కావాలి’ అని రితికా చెప్పుకొచ్చింది. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
పూజా తోమర్ ఘనత
కెంటకీ: భారత్‌కు చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి పూజా తోమర్ చరిత్ర లిఖించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్íÙప్ (యూఎఫ్‌సీ)లో విజయం అందుకున్న తొలి భారతీయ ఫైటర్‌గా రికార్డు నెలకొల్పింది. లూయిస్‌విలెలో జరిగిన ఈ పోటీల్లో పూజ 52 కేజీల స్ట్రా–వెయిట్ కేటగిరీలో 30–27, 27–30, 29–28తో బ్రెజిల్‌కు చెందిన రేయాన్నెపై గెలిచింది. గట్టి పోటీ ఉండే యూఎఫ్‌సీలో ఇప్పటివరకు మన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులెవరూ కనీసం ఒకసారి కూడా నెగ్గలేకపోయారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల పూజ గతేడాది యూఎఫ్సీతో కాంట్రాక్టు కుదుర్చుకోవడంతోనే అతిపెద్ద మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో పోటీపడే అవకాశం పొందిన తొలి భారత మహిళగా ఘనత వహించింది. గతంలో పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన అన్షుల్ జూబ్లీ, భరత్ ప్రపంచ స్థాయి యూఎఫ్‌సీలో పోటీ పడ్డారు. -
మిలాన్ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: యుద్ధ నౌకల సమాహారం.. ప్రపంచ నౌకాదళాల సమన్వయం ‘మిలాన్–2024’ విశాఖ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసాల ప్రదర్శన ‘మిలాన్–2024’లో 58 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్‌గార్డ్ బృందాలు, యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, సబ్మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్–2024లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం మారీటైమ్ వార్ఫేర్ సెంటర్లో వివిధ దేశాల మధ్య ప్రీ సెయిల్ డిస్కషన్స్ జరిగాయి. హార్బర్ ఫేజ్ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాత్రికి ఐస్ బ్రేకర్ డిన్నర్ ఏర్పాటు చేసి అన్ని దేశాల అధికారులు, సిబ్బందికి భారత నౌకాదళం ఆతిథ్య విందు ఇవ్వనుంది. కాగా, 22వ తేదీన జరిగే ప్రతిష్టాత్మక సిటీ పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్ సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో అద్భుతంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం జరిగే తుది రిహార్సల్స్‌కు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ విశాఖ చేరుకున్న యుద్ధ నౌకల వివరాలు సీ షెల్ నుంచి కోస్ట్‌గార్డ్‌కు చెందిన పీఎస్ జొరాస్టర్ డిస్ట్రాయర్, శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ సయురాలా యుద్ధనౌక, మయన్మార్ నుంచి యూఎంఎస్ కింగ్సిన్పీసిన్ యుద్ధ నౌక, ఇండొనేషియా నుంచి కేఆర్ఐ సుల్తాన్ ఇస్కందర్ ముదా యుద్ధ నౌక, రాయల్ ఆస్ట్రేలియా నేవీ నుంచి హెచ్ఎంఏఎస్ వార్మూంగా వెసల్, జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి జేఎస్ సజనామీ యుద్ధ నౌక వచ్చాయి. వీటితోపాటు రాయల్ థాయ్ నేవీ నుంచి హెచ్‌టీఎంఎస్ ప్రచువాప్ ఖిర్కీఖాన్ వార్ఫేర్, వియత్నాం పీపుల్స్ నేవీ నుంచి కార్వెట్టీ 20 డిస్ట్రాయర్, యూఎస్ నేవీ నుంచి యూఎస్ఎస్ హాల్సే యుద్ధ నౌక, బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్ఎస్ ధలేశ్వరి యుద్ధ నౌక, రాయల్ మలేషియా నుంచి కేడీ లేకిర్ యుద్ధ నౌక, రష్యన్ నేవీ నుంచి మార్షల్ షాపోష్నికోవ్ వార్ షిప్, వర్యాగ్ గైడెడ్ మిసైల్ షిప్ కూడా విశాఖ చేరుకున్నాయి. -
ఇవన్నీ చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: కింగ్ ఆఫ్ కోత హీరోయిన్
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు. ఆ తర్వాతే ఆమె నటిగా పరిచయమైంది. సుధా కొంగర తన దర్శకత్వంలోని ఇరుది సుట్రులో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో గురు, హిందీలో సాలా ఖడూస్‌గా రీమేక్ చేశారు. దీంతో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాల్లో నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్‌తో వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ చాలారోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ జతగా కింగ్ ఆఫ్ కొత్త అంటూ వెండితెరపై సందడి చేసింది. (ఇది చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రితికా సింగ్.. మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళల కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలాసార్లు ప్రస్తావించింది. అదే తరహాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయని ఆరోపించింది. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయంటూ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. ఇలాంటి మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలని రితికా సింగ్ రాసుకొచ్చారు. ఇలాంటి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ.. వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందేనని సూచించారు. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
లైంగిక వేధింపులు ధైర్యంగా ఎదుర్కోవాలి
బంజారాహిల్స్ (హైదరాబాద్)/సాక్షి, కామారెడ్డి: క్రీడారంగంలోనైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టైతే ఆడపిల్లలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి క్రీడాకారిణి సూచించారు. అదే సమయంలో క్రీడారంగంలోకి ఎంతో ఇష్టంగా వస్తున్న ఆడపిల్లలను వేధిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించకపోగా, కొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లలు ఎందులోనూ త క్కువ కాదని, వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రీడాకారిణులు, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వ్యవహరించినట్టైతే వేధింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పవచ్చని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే తాను గట్టిగా హెచ్చరించి వేధింపుల నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలో పని చేసే ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నువ్వు క్యూట్‌గా ఉన్నావు..ఎప్పుడు కలుద్దాం అన్నాడు ‘బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో నివసించే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేషీలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేందర్ తాను మంత్రి పీఏనని నాకు చెప్పాడు. నాకు 2022 నవంబర్‌లో తైక్వాండ్‌లో సిల్వర్, చెస్ బాక్సింగ్‌లో బంగారు పతకం లభించాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పాల్సిందిగా సురేందర్‌కు మెసేజ్ చేశా. గత ఏడాది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయానికి సంబంధించిన సిఫార్సు లేఖ ఇవ్వడానికి మరోసారి మంత్రి క్వార్టర్స్‌కు వెళ్లా. ఇంగ్లాండ్‌లో జరిగిన పోటీలో పతకం లభించినప్పుడు కూడా మెసేజ్ చేశా. ఆయా సందర్భాల్లో సురేందర్ ‘నువ్వు చాలా అందంగా (క్యూట్‌గా) ఉంటావు. మనం ఎక్కడ కలుసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయం పక్కన పెట్టి క్యూట్‌గా ఉన్నావు.. నన్ను కలుస్తావా..? నీ వయస్సెంత? అంటూ మెసేజ్‌లు పంపాడు. రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇక లాభం లేదనుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. తాను మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిని అని, నాతో పెట్టుకుంటే బాగుండదని, బాడీలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకుండా కొడతానని తీవ్రస్థాయిలో హెచ్చరించా. దీంతో సురేందర్ దారికొచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పట్నుంచీ నాతో మర్యాదగానే ప్రవర్తించాడు..’ అని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఓ చానెల్లో మాత్రం (సాక్షి కాదు) తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కథనం ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్‌కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్‌కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్‌కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్‌లో... హీరో మహేశ్‌బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్‌బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్‌కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్‌లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అకాల మరణం.. 18 ఏళ్లకే..!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) భవిష్యత్ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్లో పుట్టిన ఈ అప్‌కమింగ్ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్‌షిప్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్‌గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. View this post on Instagram A post shared by Angela Lee Pucci (@angelaleemma) లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్‌మీడియా సందేశాన్ని పెట్టింది. View this post on Instagram A post shared by ONE Championship (@onechampionship) విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెస్నర్ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ రింగ్‌లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్‌లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్‌స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్‌స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్‌స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్‌స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్‌స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్‌లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్‌లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్‌లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
గోల్డ్ మెడల్‌తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో
వెనమ్(VenoM), మ్యాడ్మాక్స్ ఫ్యూరీ రోడ్.. ఫేమ్ హాలీవుడ్ హీరో టామ్ హార్డీ(ఎడ్వర్డ్ థామస్) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. హీరోగా పేరు తెచ్చుకొని మళ్లీ పాపులర్ అవడం ఏంటని డౌట్ వద్దు. విషయంలోకి వెళితే.. మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొన్న టామ్ హార్డీ ఏకంగా గోల్డ్ మెడల్ కొల్లగొట్టడం విశేషం. 45 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్‌లోకి ఎంటరైన టామ్ హార్డీ 2022 బ్రెజిలియన్ జియు-జిట్సు ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 17న అల్టిమేట్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్‌లోని ఓక్గ్రోవ్ స్కూల్లో ఈ పోటీని నిర్వహించారు. నీలిరంగు దుస్తులు ధరించిన టామ్ హార్డీ.. తన అసలు పేరు ఎడ్వర్డ్ థామస్‌గా బరిలోకి దిగడం విశేషం. కాగా పోటీలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని టామ్ హార్డీ పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టామ్ హార్డీ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో పాల్గొనడంపై మ్యాచ్ నిర్వాహకులు స్పందించారు. టామ్ హార్డీ చాలా మంచి వ్యక్తి. అతని యాక్టింగ్ తెలిసిన ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. మేం పిలిచిన వెంటనే ఒక గెస్ట్‌గా హాజరవడమే గాక మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడం అతని మంచి మనుసును తెలియజేస్తుంది. ఇలాంటి ఈవెంట్‌కు టామ హార్డీ రావడం మా అదృష్టం అని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం గోల్డ్ మెడల్‌తో పాటు సర్టిఫికేట్ పొందిన టామ్ హార్డీ మాట్లాడాడు. ''ఈ విజయం వర్ణించలేనిది.. ఎందుకంటే నేనింకా షాక్‌లోనే ఉన్నా.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Tom Hardy just casually submitting people at 45 years old pic.twitter.com/pLpYvH1Rj4 — Out Of Context MMA (@oocmma) September 21, 2022 View this post on Instagram A post shared by 𝗧𝗮𝗽𝗲𝗱 𝗙𝗶𝗻𝗴𝗲𝗿𝘀 (@taped_fingers) -
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
గోల్డెన్...ఫైట్
సాక్షి, హైదరాబాద్: ఆమె కరాటే సాధన ప్రారంభించే సమయానికి వయసు 12ఏళ్లు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనే సమయానికి 13ఏళ్లు. ‘తొలుత ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మా నాన్న చాలా సంకోచించారు. అయితే నా పట్టుదల చూసి వెన్ను తట్టారు. ఇప్పుడు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు సయ్యదా. సాధన తప్పదు..గాయాలూ తప్పవు ‘టోర్నమెంట్‌కు ముందు రోజుకి కనీసం 4 నుంచి 5 గంటల పాటు శిక్షణ తప్పనిసరి. మిగిలిన రోజుల్లో కూడా రెండు పూటలా ఫిట్నెస్ కాపాడుకునే వ్యాయామాలు చేయాల్సిందే’ నని చెప్పారు సయ్యదా. ‘ఏ విజయం కూడా సునాయాసంగా రాదు. పురుషులకైనా, మహిళలకైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే కష్టం అనిపించదు’ అంటారు. కామన్వెల్త్ ఛాంపియన్ షిప్కి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉందనగా సరిగ్గా 2 నెలల ముందు కాలికి తీవ్ర గాయంతో కదలలేకుండా పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ... ఇవన్నీ ఆటలో భాగం అంటారామె. డైట్...రైట్..రైట్ సాధనకు తగ్గట్టుగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైన డైట్ తీసుకుంటానని చెబుతున్నారామె. రోజువారీగా వ్యాయామం తప్పదు. అందుకే రంజాన్ వంటి అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భాల్లో ఆమె మరింత జాగ్రత్తగా తన సాధనను దినచర్యను బ్యాలెన్స్ చేసుకుంటారామె. రాజకీయ శాస్త్రంలో పట్టా సాధించి, ప్రస్తుతం లా కోర్సు చేస్తున్న సయ్యదా... తాజాగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం విశేషం. రాజకీయాల్లో క్రీడాభివృద్ధికి మాత్రమే కాక మహిళల స్వయం సాధికారత కోసం కూడా తాను కృషి చేస్తానని అంటున్నారామె. (చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై) -
వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే
తిరువనంతపురం: కొన్ని ఏళ్ల క్రితం మగ పిల్లలు ఆడే ఆటలపై అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా కరాటే, బాక్సింగ్ వంటి క్రీడలవైపు వెళ్లాలంటే అమ్మాయిలతో పాటు.. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇష్టపడేవారు కారు. ప్రస్తుతం ఈ ఆలోచన ధోరణి మారుతోంది. ఆటలకు ఆడా..మగా తేడా ఏంటని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు క్రీడాంశాల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అయితే వీరు కూడా ఆధునిక క్రీడలవైపే మొగ్గు చూపుతున్నారు కానీ మన సంప్రదాయ ఆటలపై ఆసక్తి కనపర్చడం లేదు. ఈ క్రమంలో కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ మన దేశ పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టులో పరాక్రమం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్‌ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. (చదవండి: Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా) ‘‘రోజు ఉదయం పేపర్ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్ ఆర్ట్ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి. ‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు. (చదవండి: అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. చదవండి: విద్యుత్ జమాల్.. కలరిపయట్టు -
అకీరా కర్రసాము వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్
-
అకీరా నందన్ అద్భుత విన్యాసం: నెటిజనుల సందడి, వైరల్
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనయుడు అకిరా నందన్ తన టాలెంట్‌తో మరో సారి వార్తల్లో నిలిచారు. మార్టల్ ఆర్ట్స్‌లో ఇప్పటికే తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను రేణూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అకీరా ఒడుపుగా కర్రసాము చేస్తున్న వీడియోకి రేణూ పాప్ స్టార్ మైకేల్ జాన్స్ బిల్లీ జీన్ సాంగ్‌ను యాడ్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కాగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అకీరా ఎంట్రీపై ఇపుడు తానేమీ చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రేణూ దేశాయ్ అకీరా తెరంగేట్రం ఊహాగానాలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో అకీరా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. @PawanKalyan ❤️🙏 దేవర తండ్రికి తగ్గ 🔥 తనయుడు #AkiraNandan 😍🥰@ganeshbandla #PawanKalyan #HariHaraVeeraMallu #BheemlaNayak #PSPKRanaMovie #ProductionNo12 #PSPK28 pic.twitter.com/5IpG7bNDJV — SHOBAN NAIDU (@pagadalapavan00) August 3, 2021 -
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్. -
మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ
నటుడిగా మోహన్‌లాల్ ప్రతిభ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది విస్మయ గురించి. మోహన్‌లాల్ కూతురైన విస్మయ థాయ్ మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి ‘ఆహా!’ అనిపించింది. చక్కగా కవిత్వం రాస్తుంది. అంతే చక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. తన కవిత్వం, బొమ్మలతో తాజాగా ‘గ్రేన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పేరుతో పుస్తకం తీసుకువచ్చింది. ఆమె సృజనాత్మక ప్రయాణం నిరంతరం కొనసాగాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆశీర్వదించారు. T 3823 - MohanLal , superstar pf Malayalam Cinema and one that I have immense admiration of , sends me a book, "Grains of Stardust", written & illustrated by his daughter Vismaya .. A most creative sensitive journey of poems and paintings .. Talent is hereditary ! My best wishes pic.twitter.com/KPmojUbxhk — Amitabh Bachchan (@SrBachchan) February 23, 2021 -
విద్యుత్ జమాల్.. కలరిపయట్టు
‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అని ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు అంటారు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ కూడా ఇలాంటి మాటే అంటున్నారు. ‘మెదడు గుడ్డిది అయితే కళ్లు ఉన్నా ఉపయోగం లేదు’ అంటున్నారు ఆయన. వీలున్నప్పుడల్లా తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శిస్తూ ఉంటారాయన. అలానే తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను పంచుకున్నారు. కళ్లకు మైనం వేసుకొని దాని మీద ఓ బట్టతో కళ్లు కట్టేసుకున్నారు. కత్తి తీసుకుని పండ్లను నేర్పుగా కట్ చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. ‘‘ఈ ఆర్ట్ వల్ల మన ఫోకస్ మొత్తం ఒక పని మీద పెట్టడం అలవర్చుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు విద్యుత్ జమాల్. -
ఆత్మరక్షణ: ప్రతిరోజూ పోరాటమే!
యానీయా భరద్వాజ్ బాలీవుడ్ నటి, మోడల్, వెబ్‌స్టార్. ‘మేడ్ ఇన్ హెవెన్’ సీరిస్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పట్టణ, గ్రామీణ భారతీయ బాలికలు నన్చాకు(జపనీస్ మార్షల్ ఆర్ట్ వెపన్), కత్తి విద్యలను తప్పనిసరి నేర్చుకోవాలని ఇటీవల ట్విటర్ వేదికగా కోరింది. యానీయా లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ హిమాచల్ ప్రదేశ్‌లో నన్చాకు, కత్తి పోరాటాలలో కఠిణ శిక్షణ తీసుకుంటోంది. ‘భారతీయ అమ్మాయిలు తమ మనుగడకు ప్రతిరోజూ పోరాటం చేయాల్సిందే. అందుకు ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణకు పోరాట పఠిమను పెంచే విద్యలలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అవసరం’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చింది యానీయా – ‘అమ్మాయి అనగానే అందం, సున్నితత్వం అనే అంశాలకు మాత్రమే మనదగ్గర ప్రాధాన్యమిస్తారు. చిన్ననాటి నుంచీ అలాగే పెంచుతారు. అందుకే, చాలామంది అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పాళ్లు తక్కువ. ప్రపంచ సినిమా, అంతర్జాతీయ వినోద ప్రాజెక్టులలో ఔత్సాహిక నటిగా ఎదగడానికి ముందు నేను ధైర్యంగా ఉండటం అవసరమని భావించాను. అప్పుడే నన్చాక్స్, కత్తులు నన్ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేను వాటితో కనెక్ట్ అయ్యానని బలంగా నమ్ముతున్నాను. నన్చాకు ను ఉపయోగిస్తూ హృతిక్ రోషన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించాను. అప్పుడే దాని ప్రాముఖ్యం తెలిసింది. అందుకే నన్చాకులో శిక్షణ పొందాను. నన్చాక్తో నైపుణ్యం శరీరం ఫిట్‌గా ఉండటానికీ తోడ్పడుతుంది. ఇప్పుడు కత్తితో ప్రాక్టీస్ చేయడాన్ని బాగా ఇష్టపడుతున్నాను. రక్షణ విద్యలు అవసరం పట్టణ, గ్రామీణ భారతదేశంలోని భారతీయ బాలికలు అందరూ నన్చాకు, కత్తి నైపుణ్యాలను తప్పక నేర్చుకోవాలి. తమను తాము రక్షించుకోవడానికి ఈ విద్యలు చాలా అవసరం. హిమాచల్ ప్రదేశ్‌లోని కొందరు గ్రామస్తులు నా సాధనకు అరుదైన చారిత్రాత్మక కళాఖండ ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చారు. ఆ సమయంలో ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఈ నైపుణ్యాలతో ఒక నటిగా నన్ను నేను నిలబెట్టుకోగలను అనే నమ్మకం మరింతగా బలపడింది. ఇటీవల రిలీజైన అంతర్జాతీయ వెబ్ సీరీస్లలో ‘కర్స్డ్’ , ’ది విట్చర్’ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సీరీస్లలో నటీమణులు కత్తి, ఆయుధాలను వాడి తమ ప్రతిభను చాటుకున్నారు. కత్తి పోరాట సామర్ధ్యాలతో రాణించే మొదటి భారతీయ నటి నేను కావాలని శ్రమిస్తున్నాను. మొదట నేను చేయబోయే సినిమా కోసమే ఈ విద్య నామమాత్రంగా నేర్చుకోవాలనుకున్నాను. కానీ, ఈ విద్య నాలో తెలియని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. అందుకే కఠిన శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించింది యానియా. అంతేకాదు కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యానీయా హిమాచల్‌ప్రదేశ్‌లో తన ఫోటోగ్రఫీ అభిరుచికి పదును పెట్టింది. వెలుతురు–చీకటి, నలుపు–తెలపులలో తీసిన ఫొటోలు యానీయా దృష్టి ప్రత్యేకతను చాటుతున్నాయి. సినిమా తారలు అంటే అందానికే కాదు ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ రంగంలో రాణించడానికి నటనలోనే కాదు పోరాట నైపుణ్యాల కృషికీ శ్రమిస్తున్నారు. అమ్మాయిలలో స్ఫూర్తిని నింపుతున్నారు. -
కూటి కోసం
-
విజయ్ థాయ్‌లాండ్‌లో ఏం చేస్తున్నాడంటే..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే విజయ్ థాయ్‌లాండ్ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం విజయ్ చాలా కఠోర సాధన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు సంబంధించి ఛార్మి.. ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ట్రైనర్ మాట్లాడుతూ.. విజయ్ రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ట్రైనింగ్ ఎలా సాగుతుందో వివరించాడు. అంతేకాకుండా జనవరి 20న ముంబైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు ఛార్మి వెల్లడించారు. మరోవైపు విజయ్ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకులు మందుకు రానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో.. విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఎజిబెల్లా, రాశీ ఖన్నా నటిస్తున్నారు. -
ఇస్తానన్నాను.. ఇచ్చాను
చైనా రాజధాని బీజింగ్‌లో ఎం.ఎం.ఎ. పోటీలు జరుగుతున్నాయి. ఎం.ఎం.ఎ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’. శనివారం రితు ఫొగాట్, నామ్ హీ కిమ్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య జరుగుతున్నది ‘టెక్నికల్ నాకౌట్’ పోటీ. రితు ఇండియా అమ్మాయి. నామ్ హీ కిమ్ దక్షిణ కొరియా అమ్మాయి. కుస్తీ మొదలైంది. మూడంటే మూడే నిముషాల్లో ఆట తేలిపోయింది. ఫలితం ఏమై ఉంటుంది? బరి బయట ప్రేక్షకులలో కూర్చుని ఉత్కంఠగా ఆట చూస్తున్నవారికి ఎలాగూ కళ్లెదుటే ఫలితం తెలిసిపోతుంది. అయితే ప్రేక్షకులలో కూర్చొని, ఆట చూడకుండా సెల్‌ఫోన్ చూసుకుంటున్న వారికి కూడా తెలిసిపోయింది!! ఎలా? అకస్మాత్తుగా ఎ.ఆర్.రెహమాన్ గొంతు.. ‘వందే మాతరం’ అని ఉవ్వెత్తున ఎగసింది. అర్థమైపోదా.. రితు గెలిచిందని!! ఎం.ఎం.ఎ. ఆడటం రితుకూ ఇదే మొదటిసారి. అందులోని ‘ఆటమ్వెయిట్’ కేటగిరీలో పాల్గొని మూడు నిముషాల్లో ప్రత్యర్థిని నాకౌట్ చేసేసింది! 49, అంతకన్నా తక్కువ బరువు ఉన్నవారు ఆటమ్ వెయిట్ కేటగిరీలో ఆడతారు. రితు ఇప్పుడు గెలిచింది ఎం.ఎం.ఎ. లోని ‘వన్ చాంపియన్‌షిప్’ని! 2016 కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచి తొలిసారి ప్రపంచ క్రీడారంగం దృష్టిలో పడిన రితు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుస్తీకి స్వస్తి చెప్పి, ఎం.ఎం.ఎ. ఫైటర్ అవడం కోసం శిక్షణ తీసుకుంది. రింగ్‌లోంచి బయటికి వచ్చాక రితు అన్నమాట : ‘‘వందశాతం ఇస్తానన్నాను. ఇచ్చాను’’ అని! -
సత్తా చూపిస్తా
కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశారు హీరోయిన్ అదా శర్మ. తాజాగా ‘కమాండో 3’ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారామె. దాని గురించి అదా మాట్లాడుతూ– ‘‘కమాండో 3’లో పోలీసాఫీసర్ భావనా రెడ్డి పాత్రలో నటించాను. నా పాత్రలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. కేరళలో కళరియపట్టు, తమిళనాడులో సిలంబం వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత సంపాదించాను. నాన్చాక్ కూడా సాధన చేశా. నా కో–స్టార్ విద్యుత్ జమాల్ ఈ విషయంలో నాకు కొంతమేర సహాయం చేశారు. కానీ, నా శిక్షణ మొత్తాన్ని మా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో భావన సత్తా ఏంటో వెండితెరపై చూపిస్తా’’ అని పేర్కొన్నారు. విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
85 ఏళ్ల కాజల్!
‘ఇండియన్ 2’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేయడానికి కథానాయిక కాజల్ అగర్వాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాకముందు ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో వృద్ధ కమల్‌హాసన్ (సేనాపతి)కి జోడీగా నటిస్తున్నారట కాజల్. అది కూడా 85 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతున్నారని టాక్. మరి.. వృద్ధురాలి పాత్ర అంటే మార్షల్ ఆర్ట్స్ సాధ్యపడదు. ఒకవేళ యంగ్ క్యారెక్టర్లో కనిపించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందేమోననే ఊహాగానాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాలో కమల్‌హాసన్ 90ఏళ్ల వృద్ధుడి పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోంది. ఓ పొలిటికల్ ర్యాలీ, లోకల్ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఈ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారు. భోపాల్ షెడ్యూల్ తర్వాత గ్వాలియర్‌లో కీలక సన్నివేశాలు తీస్తారు. ఆ తర్వాత తైవాన్‌లో చిత్రీకరణ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రవీణ్‌కు స్వర్ణం
షాంఘై (చైనా): ప్రపంచ వుషు (మార్షల్ ఆర్ట్స్) చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచాడు. బుధవారం జరిగిన 48 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో ప్రవీణ్ 2–1తో దియాజ్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గాడు. మహిళల సాండా ఈవెంట్లో పూనమ్ (75 కేజీలు), సనతోయ్ దేవి (52 కేజీలు) రజతాలు... పురుషుల 60 కేజీల ఈవెంట్లో విక్రాంత్ కాంస్యం సాధించారు. -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్‌లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్‌లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
తెలంగాణ రాష్ట్ర మార్షల్ ఆర్ట్స్ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎంఎంఏఎఫ్) ఆధ్వర్యంలో జరుగనున్న ఇంటర్నేషనల్ హెల్త్ స్పోర్ట్స్, ఫిట్నెస్ ఫెస్టివల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టులో తెలంగాణ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (టీఎంఎంఏఎఫ్)కు చెందిన ఏడుగురు క్రీడాకారులకు చోటు దక్కింది. ఫుర్కాన్ జునైదీ (57–61), రిషిరాజ్ (61–66), మీర్జా అస్లామ్ బేగ్ (57–61), మహేశ్ (74–44), సలేహ్ అల్ సాదీ (52–54), అవైజ్ ఖాన్ (52–54), సౌద్ అల్ ఖులాఖీ (66–70) రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టుకు మేనేజర్‌గా సయ్యద్ జలాలుద్దీన్ జఫర్ వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. -
ధీరమణులు!
సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్‌కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజునే.. పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు వహ్వా.. ఫరీహా..! ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది. -
మంత్రముగ్ధుల్ని చేసిన నారీ నృత్యరూపకం
-
అభద్రతాభావమే అందుకు కారణం
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది. అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్. -
‘అప్పుడు నా సంపాదన నెలకు రూ.5 వేలు’
కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది అంటున్నారు బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్ కుమార్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇప్పటికి దాదాపు 130 దాకా సినిమాలు చేసి ఉంటాను. కానీ కెరియర్ తొలినాళ్లలో కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేశాను. దర్శకులు, నిర్మాతలు కేవలం నన్నో యాక్షన్ హీరోగా మాత్రమే గుర్తించేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యాంకాక్ వెళ్లి ఐదేళ్ల పాటు థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నాను అన్నారు. తరువాత ‘ముంబై వచ్చి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ర్గా నెలకు రూ. 5000 సంపాదించేవాడిని. నా పర్సనాలిటీ చూసిన కొందరు నన్ను మోడల్‌గా ప్రయత్నించమన్నారు. వారి సలహాతో నేను మోడలింగ్ ప్రయత్నాలు ప్రారంభించాను. తొలుత నేను ఓ ఫర్నిచర్ కంపెనీ యాడ్‌లో నటించాను. కేవలం రెండు గంటల పనికే నాకు రూ. 21,000 ఇచ్చారు. అలా నెమ్మదిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. కెరీర్ తొలినాళ్లలో దాదాపు 10 -11 సంవత్సరాలు యాక్షన్ సినిమాలే చేశాను. ఆ తర్వాత నెమ్మదిగా కామెడీ, రొమాంటిక్ సినిమాలు చేయడం ప్రారంభించాను’ అన్నారు. 1991లో ‘సౌగంధ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అక్షయ్ కానీ మరుసటి ఏడాది వచ్చిన ‘ఖిలాడి’ సినిమా అక్షయ్ కెరియర్ను మలుపు తిప్పింది. డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు అక్షయ్. 2018లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరారు ఈ ఖిలాడీ హీరో. ప్రస్తుతం అక్షయ్ విలన్‌గా నటించిన 2. ఓ విడుదలకు సిద్ధంగా ఉండగా.. హౌస్‌ఫుల్ 4, కేసరి చిత్రాలకు సైన్ చేశారు. -
మార్షల్ ఆర్ట్స్‌లో చిచ్చర పిడుగు
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: నేర్చుకోవాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలైనా మనముందు తలొంచాల్సిందే.. మన పట్టుదల ముందు ఎంతటి ప్రతిభైనా మోకరిల్లాల్సిందే.. అందుకు ఉదాహరణే మార్షల్ ఆర్ట్స్‌లో రాటుదేలుతున్న కోటిపల్లి చరణ్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్‌కు ఊహ తెలిసేటప్పటికీ తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. తణుకుకు చెందిన పెద్దమ్మ, పెద్ద నాన్నలే చేరదీశారు. అనుకోకుండా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ చూసి ఆకర్షితుడయ్యాడు. అతన్ని గురువు ఆదరించి శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు. చరణ్ ఆసక్తిని గమనించి.. తణుకు సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి వేదికగా మార్షల్ ఆర్ట్స్ గురువు డీడీ సత్య ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఉదయం సమయంలో ఈ శిక్షణను గేటు బయట నుంచే చరణ్ గమనించేవాడు. ఆ విషయం తెలుసుకున్న గురువు సత్య.. నేర్చుకుంటావా? అని ప్రశ్నించగా చరణ్ వెంటనే తలూపాడు. అప్పటి నుంచి ఉచితంగా శిక్షణ తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చూపుతున్నాడు. ఒకసారి చెబితే పంచ్‌లను ఇట్టే పట్టేస్తాడు. సజ్జాపురం ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చరణ్ చదువులోను తెలివైన విద్యార్థే. చిన్నవాడైనా తన కంటే పెద్దవారితో సమానంగా ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ రెండు పతకాలు సాధించాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన కరాటే టోర్నమెంట్లో బంగారు పతకం, విశాఖపట్నంలో జరిగిన వాకో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఇంటర్నెట్లో చూసి కాగితాలు, ఇతర వ్యర్థాలతో రకరకాల బొమ్మలు చేస్తూ ఆకట్టుకుంటాడని ఉపాధ్యాయులు చెబు తున్నారు. పెద్దమ్మ, పెదనాన్నలు కోటిపల్లి దుర్గా భవాని, వెంకటేశ్వరరావులు చరణ్, అతని అన్న సామ్యేల్ బాధ్యతను తీసుకున్నాడు. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ, పెదనాన్నల ప్రోత్సాహం, గురువు సత్య ఉచిత శిక్షణతో మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నాను. సొంత డబ్బులతో మా గురువే టోర్నమెంట్లకు తీసుకువెళ్తున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది నా కోరిక.– కోటిపల్లి చరణ్, తణుకు స్పాన్సర్లు కావాలి.. మార్షల్ ఆర్ట్స్‌లో చరణ్‌కు మంచి నైపుణ్యం ఉన్నా.. ఖరీదైన క్రీడ కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రీడల్లో రాణించాలంటే మంచి పోషకాహారం అవసరం. పేదరికం కారణంగా చరణ్‌కు ఆ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. స్పాన్సర్లు అండగా నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫైటర్ అవుతాడు. ఎటైనా వంగే శరీర తత్వం అతనిది. మరింత ప్రోత్సహిస్తే విజయాలు సాధించడం ఖాయం. – డీడీ సత్య, మార్షల్ ఆర్ట్స్ గురువు చదువులోను చురుకే చరణ్ చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.– జి.రుద్రమదేవి, ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, తణుకు -
వయసు 11.. మెడల్స్ 11
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటుతున్నాడు తణుకు మండలం మండపాకకు చెందిన బుడతడు పురాల్ రాకేష్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా 5వ తరగతి చదువుతున్న రాకేష్ 11 ఏళ్ల వయస్సులో జాతీయ, రాష్ట్రస్థాయిలో 11 మెడల్స్ సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ మెడల్స్‌లో 10 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ ఉండటం విశేషం. వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా కుంగ్ ఫు ఫైట్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నాడు. వెళ్లిన ప్రతి పోటీలోనూ మెడల్ సాధిస్తూ క్రీడాభిమానం ఉన్న వారందరి చూపూ తనవైపు తిప్పుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా కరాటేలో ప్రావీణ్యం ఉండడంతో వారి ప్రోత్సాహంతో మార్షల్ ఆర్ట్స్‌లోని పెన్కాక్ సిలాట్, కుంగ్ ఫూ, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంశాల్లో శిక్షణ పొందుతున్నాడు. మండపాక చదలవాడ ఇంగ్లిషు మీడియం స్కూలులో చదువుతున్న రాకేష్ ఇటు చదువులోనూ మొదటి ర్యాంకులో నిలుస్తున్నాడు. గురువు సత్య శిక్షణలో.. తణుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి భవనంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ షావొలిన్ కుంగ్ ఫు డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు–డు మాస్టర్ డీడీ సత్య శిక్షణలో గత ఏడాదిన్నరగా రాకేష్ రాటుదేలుతున్నాడు. రాకేష్ తండ్రి పురాల్ వెంకటేష్ మండపాకలో చిన్న టిఫిన్ హోటల్ నిర్వహిస్తుండగా తల్లి కనకదుర్గ కూడా భర్తకు సహాయంగా ఉంటారు. చెల్లి జ్యోతి 4వ తరగతి చదువుతోంది. ప్రోత్సాహం కరువు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఖరీదైన క్రీడ. శిక్షణతో పాటు ఏ టోర్నమెంట్‌కు వెళ్లాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చినట్టు రాకేష్ తండ్రి వెంకటేష్ చెప్పారు. -
బస్తీల నుంచే బడా బాక్సర్లు
ముంబై: మురికివాడల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే పెద్ద పెద్ద బాక్సర్లుగా ఎదిగారని మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ చెప్పాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కుమిటే–1 లీగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌కు విచ్చేసిన ఈ బాక్సింగ్ దిగ్గజం మీడియాతో మాట్లాడుతూ ‘నాతో సహ చాలా మంది బాక్సర్లు మురికివాడల నుంచి కష్టపడి వచ్చినవాళ్లే! వాళ్లంతా ఇప్పుడు మేటి బాక్సర్లయ్యారు. ప్రస్తుతమున్న టాప్ బాక్సర్లు కూడా బస్తీలకు చెందిన వారే’ అని అన్నాడు. 52 ఏళ్ల మాజీ బాక్సర్ 2005లో రిటైరయ్యాడు. అతను 1988లో 20 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి యువ బాక్సర్‌గా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో 50 విజయాలు సాధించగా... ఇందులో 44 నాకౌట్లుండటం విశేషం. కేవలం ఆరు బౌట్లలో మాత్రం ఓటమి పాలయ్యాడు. గొప్ప విజయాలే కాకుండా వివాదాలూ టైసన్ వెంట నడిచాయి. 1991లో ‘మిస్ బ్లాక్ రోడ్ ఐలాండ్’ డిజైరీ వాషింగ్టన్‌పై అత్యాచారం చేసి ఆరేళ్ల శిక్షకు గురయ్యాడు. అనంతరం 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన బౌట్లో హోలీఫీల్డ్ చెవిని కొరికి డిస్క్వాలిఫై అయ్యాడు. భారత పర్యటనలో అతను ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిని, అలాగే ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ సందర్భంగా టైసన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నేనూ పేదవాణ్నే. మురికివాడలోనే పుట్టిపెరిగా. వాడల నుంచి బయటపడాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. అనుకున్నది సాధించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను. ఎవరైనా సరే చెమటోడ్చితే అక్కడ్నించి బయటపడొచ్చు. ఎంతో బాగా ఎదగొచ్చు’ అని టైసన్ చెప్పాడు. తనకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్అంటే చాలా ఇష్టమన్నాడు. లాస్ వెగాస్‌లో జరిగే యూఎఫ్‌సీ పోటీలను తిలకించేవాడినని చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈ ఆట తనకు తెలుసని బేస్బాల్లా ఉంటుందని, బ్యాట్‌తో బంతిని బాదే ఆటే క్రికెట్ అని చెప్పాడు. ఎమ్ఎమ్ఏ కుమిటే–1 లీగ్‌లో భాగంగా శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. -
తొలిసారి భారత్‌కు రానున్న దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ వచ్చే నెలలో భారత్‌కు విచ్చేయనున్నారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లీగ్ ప్రాచుర్య కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 29న ఈ వివాదాస్పద బాక్సర్... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఈవెంట్ అయిన కుమిటే–1 లీగ్‌ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్ వర్గాలు తెలిపాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్ తమ తొలి బౌట్లో యూఏఈని ఎదుర్కొంటుంది. లీగ్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్ కోసం ప్రపంచ మాజీ చాంపియన్ రానుండటం ఆనందంగా ఉందన్నారు. -
బాలీవుడ్ నటుడికి అరుదైన గౌరవం
తెలుగులో శక్తి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్ తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ పోరాట కళ కలరియపట్టులో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యుత్ జమ్వాల్ ప్రపంచంలోని టాప్ సిక్స్ మార్షల్ ఆర్ట్స్ కళాకరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అమెరికాకు చెందిన లూపర్ అనే వెబ్ సైట్ ఈ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో విద్యుత్ జమ్వాల్‌తో పాటు స్కాట్ అడ్కిన్స్, అతీఫ్ క్రౌడర్, ఇల్రామ్ చోయి, మార్కో జిరోర్, యు జింగ్, జానీ ట్రిగ్యుయెన్ లు ఉన్నారు. ‘గొప్ప మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు అంటే తెలుసుకోవాల్సింది ప్రత్యర్థిపై దాడి చేయటం కాదు, ఓపికగా ప్రత్యర్థిని దెబ్బతీయటం తెలుసుకోవాల’న్నారు విద్యుత్ జమ్వాల్. ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువ కళాకారుడు బాలీవుడ్ చిత్రాల్లో హీరోగానూ రాణిస్తున్నాడు. -
ముందు స్టూడెంట్... తర్వాత టీచర్
ఒక స్టూడెంట్ టీచర్‌గా మారాలంటే బోలెడంత టైమ్ పడుతుంది. కానీ సమంత మాత్రం తక్కువ టైమ్‌లోనే స్టూడెంట్ నుంచి టీచర్ స్థాయికి ఎదిగారు. కానీ ఆషామాషీ టీచర్‌గా కాదు. తేడా వస్తే తాట తీసే కర్రసాము టీచర్ అట. శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘సీమరాజా’. ఇందులో కర్రసాము నేర్పించే టీచర్ సుదందిరదేవి పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్లారట. అంటే ముందు స్టూడెంట్‌గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్‌గా మారారు. ఇందులో నటి సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘సీమరాజా’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... పవన్‌కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘యు టర్న్’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
తెలంగాణకు 8 స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. బ్రూస్లీ జీత్ కున్–డో స్పోర్ట్స్ ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో 8 స్వర్ణాలతో మెరిశారు. నగరానికి చెందిన డ్రాగన్ షాడో కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ (డీఎస్‌కేఎంఏ)కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఈ స్వర్ణాలను సాధించడం విశేషం. 18 ఏళ్లు పైబడిన విభాగంలో సబియా ఫాతిమా (ఆరెంజ్ బెల్ట్), మలీహ బేగం (ఆరెంజ్ బెల్ట్), సానియా బేగం (వైట్ బెల్ట్) స్వర్ణాలను గెలుచుకున్నారు. అండర్–17 కేటగిరీలో షిఫా బేగం (ఎల్లో బెల్ట్), షఫికా బేగం (ఎల్లో బెల్ట్), అక్సా ఫాతిమా (ఎల్లో బెల్ట్), ఫిర్దౌస్ బేగం (వైట్ బెల్ట్), మేరాజ్ ఇర్ఫానా (ఎల్లో బెల్ట్) పసిడి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా డీఎస్‌కేఎంఏ కోచ్ సయ్యద్ అన్సార్ అలీ జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తమ విద్యార్థులను అభినందించారు. -
ఆకాష్‌తో మరో సినిమా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో పూరికి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. అయితే పూరి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ మెహబూబా షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. చిత్రయూనిట్ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మెహబూబా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు పూరి. అంతేకాదు తన తదుపరి చిత్రాన్ని ఆకాష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. రిలీజ్‌కు రెడీ అవుతున్న మెహబూబా ఇంటెన్స్ లవ్ స్టోరి కాగా.. నెక్ట్స్ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాను కూడా పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ లోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పూరి టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఆత్మరక్షణ విద్యలు ఇతివృత్తంగా ‘ఎళుమిన్’
తమిళసినిమా: హాస్యనటుడు వివేక్‌కు కథానాయకుడిగా రాణించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా నాన్దా బాలా అనే ఒక్క చిత్రం మాత్రమే తెరపైకి వచ్చినా, అదీ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ఎళుమిన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివేక్‌కు భార్యగా నటి దేవయాని నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, శ్రీజిత్, వినీత్, సుఖేశ్, కీర్తిక, దీపిక, అళగం పెరుమాళ్, ప్రేమ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీపీ.విజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైఎం మీడియాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, సంగీతాన్ని గణేశ్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు వీపీ.విజీ తెలుపుతూ ఆత్మరక్షణ విద్యలపై ఆసక్తి కలిగిన ఐదుగురు చిన్నారులు ఆ విద్యల్లో ఘనత సాధించడమే ఎళుమిన్ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. విశ్వనాథన్ అనే వ్యక్తి కొడుకు అర్జున్ మరో ఐదుగురు పిల్లలు మంచి స్నేహితులని, ఈ పిల్లలు ఆత్మరక్షణ విద్యలు కుంగ్‌ఫూ, కరాటే, బాక్సింగ్, కర్రసాముల్లో శిక్షణ పొందుతారన్నారు. అయితే ఆర్థిక స్తోమత లేని ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రుల నుంచే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి సమయంలో అర్జున్ తల్లిదండ్రులు వారికి అండగా నిలుస్తారని తెలిపారు. ఇందులో విశ్వనాథన్గా నటుడు వివేక్, ఆయన భార్యగా దేవయాని నటిస్తున్నారని చెప్పారు. ఈ ఐదుగురు పిల్లలు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, పరిస్థితుల ప్రభావాలను అధిగమించి వారి లక్ష్యాన్ని ఎలా సాధించారన్నదే ఎళుమిన్ చిత్ర కథ అని తెలిపారు. ఇందులో రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో కూడా చిన్నారులు అద్భుతంగా నటించారని చెప్పారు. వీరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందారని దర్శకుడు తెలిపారు. -
విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్
-
బాలికలకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలను నిరోధించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలనే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే యువతులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పించాలని ఆయన స్పస్టం చేశారు. కరాటే వంటి విద్యలు నేర్చుకుంటే అత్యాచారాలు, ఇతర ప్రమాదాలనుంచి నుంచి యువతులు తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అత్యాచారాలకు సంబంధించి కీలక బిల్లును ఆమోదించింనందుకు కృతజ్ఞతగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మహిళలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించి చట్టపరమైన రక్షణల గురించి ప్రకటనలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా అందరికీ తెలియజేయాలని కోరారు. మైనర్లపై అత్యాచారం చేసిన వ్యక్తులు జీవించేందుకు అర్హత లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. -
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
సాక్షి, యాదాద్రి: మహిళలపై అఘాయిత్యా లను ఎదురించేందుకు ఉన్నత పాఠశాల స్థాయిలోనే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాలల్లోని పీడీ, పీఈటీలకు శిక్షణ ఇచ్చింది. వీరితోపాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన మాస్టర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తుంది. దీనికి విద్యాశాఖ ఆర్‌ఎంఎస్‌ఏ సంయుక్తంగా మూడు నెలల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. 31 జిల్లాల్లో 5,111 ఉన్నత పాఠశాలలకు నిధులను మంజూరు చేసింది. ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.8,500 చొప్పు న రూ.4.34 కోట్లను మంజూరు చేసింది. ఇలా శిక్షణ ఇవ్వాలి.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాలికల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ శిక్షణను ఇస్తారు. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఈటీలు, పీడీలు, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ జరగాలి. స్వయం ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వాలి. పాఠశాల గేమ్స్ పిరియడ్‌లో మాత్రమే వీటిని పీఈటీల ఆధ్వర్యంలో నిర్వహించాలి. శిక్షణ పొందిన బాలికలకు 15 రోజులు లేదా నెల రోజులకోసారి అంతర్ పాఠశాలల స్థాయి, మండల స్థాయిలో వీరికి పోటీలు నిర్వహిం చాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యాలయాలకు వాట్సాప్‌లో మెసేజ్ పంపాలి. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు. -
కర్ర , కత్తి.. ఏదైనా.. రాహుల్.. హూహా..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇన్నాళ్లూ మనకు తెలిసిన రాహుల్ వేరు.. ఇప్పుడు వేరు.. మార్షల్ ఆర్ట్స్‌లో రాహుల్‌కు మంచి నైపుణ్యం ఉందన్న విషయం వెల్లడైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ సంఖ్య పెరిగిందట. జపాన్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో తనకు బ్లాక్ బెల్ట్ ఉన్నట్లు ఇటీవల రాహుల్ తెలిపారు. అంతేనా.. కత్తి తిప్పడంలోనూ కర్రసాము చేయడంలోనూ రాహుల్ మేటి అని ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు సెన్సె పరిటోస్ చెప్పారు. ‘2009లో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశాను. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాను. రాహుల్ తన ఇద్దరు స్నేహితులతో కలసి ఢిల్లీలోని తుగ్లక్ లేన్ హౌజ్లోఉన్న తన నివాసంలో ప్రాక్టీస్ చేసేవారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ వాద్రా అప్పుడప్పుడు వచ్చి చూసేవారు’ అని పేర్కొన్నారు. 2013లో జపాన్ నుంచి ఐకిడో మాస్టర్ భారత్ వచ్చినప్పుడు రాహుల్ సంబంధిత పరీక్షలో కూడా పాల్గొని బ్లాక్ బెల్ట్ సాధించారని చెప్పారు. రాహుల్ లండన్‌లో ఉన్నప్పుడు బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ జీ–జిట్సు కూడా నేర్చుకున్నారని తెలిపారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
దెబోరాకు మూడో పతకం
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో శుక్రవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. మహిళల ట్రాక్ సైక్లింగ్ ఆరు ల్యాప్‌ల కిరిన్ ఈవెంట్లో దెబోరా హెరాల్డ్ రజత పతకాన్ని సాధించింది. ఈ క్రీడల్లో దెబోరాకిది మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 200 మీటర్ల వ్యక్తిగత, టీమ్ స్ప్రింట్ విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. మహిళల అండర్ – 48 కురాష్ ఈవెంట్లో మాలప్రభ యెల్లప్ప జాదవ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సాధించింది. -
భారత్‌కు నాలుగు పతకాలు
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్లో పూర్ణిమా హెంబ్రామ్ బంగారు పతకం నెగ్గింది. ఐదు ఈవెంట్ల ఈ పోటీలో ఆమె 4,062 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్, మహిళల 3000 మీ. పరుగులో సంజీవని జాదవ్ చెరో రజతం గెలిచారు. మహిళల లాంగ్ జంప్‌లో నీనా వారకిల్ కాంస్యం నెగ్గింది. -
చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్‌లో సత్కారం
నల్గొండకు చెందిన ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ చేరపల్లి వివేక్ తేజను తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వివేక్ తేజ మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకు 27 బంగారు, 18 రజిత, 16 కాంస్య పతాకాలు గెలుపొందారు. ప్రపంచ స్థాయిలో ఇంకా రాణించి భారతదేశం పేరు మారు మ్రోగించాలని టీసీఎస్ఎస్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ నెల 12న ఇండో నేషియాలో జరగబోయే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా అక్కడ విజయ కేతనం ఎగురవేసి తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి ఎల్లా రామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, శివ రామ్, చెట్టి పల్లి మహేష్, ఆర్.సి.రెడ్డి, దామోదర్ ఇతర సభ్యులు గొనె నరేందర్, అనుపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హైస్కూళ్లలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5,111 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మస్థైర్యా న్ని పెంచేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) కింద ఈ శిక్షణ ఇవ్వనుంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కాగానే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను జారీ చేయనుంది. ఒక్కో స్కూల్‌కు రూ.8,500 చొప్పున మొత్తం రూ.4.34 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీనికి సంబంధించి జిల్లాల వారీ వివరాలతో డీఈవో లకు ఆర్‌ఎంఎస్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నిజమాబాద్‌లో 277 స్కూళ్లలో, తక్కువగా కుమ్రం భీం జిల్లాలో 70 స్కూళ్లలో ఈ శిక్షణ ఇవ్వనుంది. -
మహిళా పోలీసులకు హప్కిడో శిక్షణ
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోనిమహిళా పోలీసుల సిబ్బందికి కొరియన్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని 175 మందికి బుధవారం హప్కిడో అనే యుద్ధ విద్యను నేర్పారు. హోంగార్డు నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు ఇందులో పాల్గొన్నట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేష్ ఎం భగవత్ తెలిపారు. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందిన సినీనటి ఇషాకొప్పికర్, ఆమె మాస్టర్ సర్దార్ ఎండీ షేక్‌తో కలిసి ఈ శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా పోలీసులకు ఆత్మరక్షణ మెలకువలతోపాటు విధి నిర్వహణలో భాగంగా నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్పినట్లు ఆయన తలిపారు. నేరగాళ్లను పట్టుకోవటం, చైన్ స్నాచర్లు, ఈవ్ టీజర్లు వంటి నిందితులను అరెస్టు చేయటానికి హప్కిడో విశేషంగా ఉపయోగపడుతుందని కమిషనర్ వివరించారు. ఒక పోలీసు అధికారి విధి నిర్వహణలో విజయవంతం కావటానికి ముందుగా ఆత్మరక్షణ చాలా కీలకమైన అంశమని భగవత్ తెలిపారు. -
ఆకాశమే హద్దుగా..
-
ఆ హీరోకి నేను ఫీమేల్ వెర్షన్: నటి
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా ఒకరు. యాక్షన్-రొమాన్స్ మేలవింపుతో సింగ్ సాబ్ ద గ్రేట్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. యమహా ఫాసినో మిస్ దివా 2015- మిస్ యూనివర్స్ ఇండియా కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితురాలు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుంది. థైక్వాండో, జిమ్నాస్టిక్స్ లలో శిక్షణ తీసుకుంటానని చెప్పిన ఊర్వశీ.. తాను అక్షయ్ కుమార్ ఫిమెల్ వెర్షన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నట్లు పేర్కొంది. అక్షయ్ ని స్ఫూర్తిగా తీసుకుని మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధిస్తానంటోంది. ప్రస్తుతం టీ సిరీస్ తో మూడు మూవీల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఈ అందాల భామ ఆ పనిలో బిజీగా ఉన్ననని చెప్పింది. 'గాల్ బాన్ గాయి' అనే సాంగ్ లో తాను భాగస్వామిని అయ్యానని దీంతో గ్రేట్ సింగర్ సుఖ్ బిర్ తో పనిచేయాలన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. తనకు యాక్షన్ మూవీలలో నటించడమంటే ఎంతో ఇష్టమని.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ తరహా సినిమాలు చేయాలనుందని తెలిపింది. -
ఆత్మరక్షణకు శిక్షణ
ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నానంటోంది నటి తాప్సీ. ఈ బ్యూటీ ఇటీవల ఎక్కువగా సెల్ఫ్ ప్రచారం చేసుకోవడానికి తెగ తంటాలు పడుతోందనిపిస్తోంది. ఆ మధ్య తాను ఢిల్లీ భామను, తనకు ధైర్యం ఎక్కువ అని డబ్బా కొట్టుకుంది. హిందీ చిత్రం పింక్‌లో అత్యాచారానికి గురైన యువతి పాత్రల్లో నటించిన తాప్సీ ఇటీవల తాను నిజ జీవితంలో పోకిరిల దురాఘతాలకు గురయ్యానని చెప్పుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నానంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తాను నటించనున్న చిత్రంలోని పాత్ర పోషణ కోసం ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నట్లు తాప్సీ పేర్కొంది. కోలీవుడ్‌లో ఆడుగళం, కాంచన-2 వంటి రెండు మూడు విజయాలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగమ్మకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే లక్కీగా హిందీలో జాక్‌పాట్ లాంటి అవకాశాన్ని కొట్టేసింది. అక్కడ బిగ్‌బీ అమితాబ్‌తో పింక్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్లో చిన్నగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా నామ్ షబానా అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం కోసమే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతోందట. దీని గురించి తను తెలుపుతూ పింక్ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అంది. ప్రస్తుతం నామ్ షబానా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది తాను ఇంతకు ముందు నటించిన బేబి చిత్రానికి సీక్వెల్ అని చెప్పింది. ఇందులోని పాత్ర కోసం క్రావ్ మగా అనబడే ఇజ్రాయిల్ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆత్మరక్షణ విద్యతో పాటు అయికిడో అనే జపాన్ ఆత్మరక్షణ విద్య తదితర మూడు రకాల విద్యలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకోసం నిత్యం గంటన్నర సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపింది. కథా పాత్రకు అవసరం అవ్వడంతో ఈ విద్యల్లో శిక్షణ పొందుతున్నట్లు వివరించింది. ఇందులో నటుడు అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటించనున్నారని, ఆయనకు తనకు మధ్య యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకంటాయా అన్నది తెలియదని అంది. మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారని తాప్సీ తెలిపింది. -
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
తెనాలి టౌన్: ఆత్మరక్షణకు, మనోధైర్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్‌యార్డు ఆవరణలో రాష్ట్రస్థాయి టాంగ్‌సూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెనాలిలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణరావు మాట్లాడారు. గుంటూరు జిల్లాకు బంగారు, వెండి, రజత పతకాలు లభించినట్లు పోటీల చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ నాగరాజు, ఆర్గనైజర్ కె.శ్రీనివాసరావు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, క్రీడాకారులు, 10 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇక్కడ అంతా వింతే!
చదివింత భూటాన్ రాజకుమారుడు పుట్టినప్పుడు... ఆ దేశస్థులంతా మొక్కలు నాటి కొత్త తరహాలో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ రోజున వాళ్లు మొత్తం లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటారట. పర్యావరణం పట్ల ఇంత శ్రద్ధ ఉండబట్టే భూటాన్ ప్రపంచంలోనే ‘మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ కంట్రీ’గా గుర్తింపు పొందింది! ఉక్రెయిన్‌లో కొందరు మహిళలు కలిసి అస్గర్దా అనే గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీళ్ల లక్ష్యం ఒక్కటే... మగవాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా, వాళ్ల మీద ఆధార పడకుండా జీవించడం. అందుకే వీళ్లంతా ఒక కొండ ప్రాంతానికి వెళ్లి పోయి నివసిస్తున్నారు. తమ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటలీలో విగనెల్లా అనే ప్రదేశం ఉంది. దాని చుట్టూ ఉన్న కొండల కారణంగా చలికాలంలో 83 రోజుల పాటు సూర్యకాంతి లేక ఊరంతా చీకటిగా అయిపోతుంది. దాంతో అక్కడి ప్రజలంతా కలిసి కొండ అంచున ఓ పెద్ద అద్దాన్ని అమర్చి, సూర్యకాంతి దానిపై పడి ఊరి మీదికి రిఫ్లెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. మెక్సికోలోని పల్మిటాస్ పట్టణానికి చెందిన యువత... తమ టౌన్‌ని అందంగా మార్చేందుకు అనుమతి ఇవ్వమంటూ వెళ్లి ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు వందలకు పైగా ఇళ్లకు గ్రాఫిటీ ఆర్ట్‌తో కొత్త రంగులు అద్దింది. ఫలితంగా ఆ పట్టణం ఇప్పుడిలా ఉంది. అమెరికాకు చెందిన స్టీవ్ ఫ్యుగేట్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. ఒకరేమో ఆత్మహత్య చేసుకుంటే... మరొకరు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించారు. ఆ బాధ తట్టుకోలేని స్టీవ్, మరెవరి విషయంలోనూ అలా జరగకూడదన్న ఉద్దేశంతో ‘లవ్ లైఫ్’ (జీవితాన్ని ప్రేమించు) అన్న బోర్డు పట్టుకుని పన్నెండేళ్లుగా అమెరికా అంతటా సంచరిస్తూనే ఉన్నాడు. 1961లో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ వాళ్లు నార్త్ కరొలినా ప్రాంతంలో పొరపాటున రెండు న్యూక్లియర్ బాంబుల్ని జారవిడిచారు. ఇవి ఒక్కోటీ హిరోషిమా బాంబు కంటే 250 రెట్ల విధ్వంసక శక్తి ఉన్నవి. అయితే అదృష్టవశాత్తూ అవి పేలలేదు. దాంతో పడినచోటే వాటిని భూస్థాపితం చేసేశారు. ఘోర ప్రమాదం తప్పింది కదా! అయామ్ సెమానీ అనేది అరుదైన కోడి జాతి. ఈ కోళ్లు అత్యంత నల్లగా ఉంటాయి. ఒంట్లో తెలుపన్నదే కనిపించదు. ఈకలు, చర్మం మాత్రమే కాదు... వాటి మాంసం, ఎముకలు, రక్తంతో పాటు అవి పెట్టే గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి! మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌కి బ్లూ కలర్ ఎందుకు పెట్టాడో తెలుసా? అతనికి కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఎరుపు, ఆకుపచ్చ అస్సలు కనబడవు. నీలిరంగు అయితే బాగా కనిపిస్తుంది. అందుకే కావాలని ఫేస్‌బుక్‌కి ఆ రంగు పెట్టాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టర్కీ కోడి తెలుసుగా? దీన్ని మనం టర్కీ కోడి అంటాం. టర్కీ వాళ్లేమో ‘హిందీ’ అంటారు. అరేబియాలో దీని పేరు గ్రీక్ చికెన్. గ్రీకులేమో దీన్ని ఫ్రెంచ్ చికెన్ అంటారు. ఫ్రెంచ్‌వాళ్లు ఇండియన్ చికెన్ అంటారు. దాంతో పాపమది ఏ ప్రాంతానికి చెందినదో ఎవరికీ తెలియకుండా పోయింది. 1986లో విడుదలైన ‘స్టాండ్ బై మి’ అనే ఆంగ్ల చిత్రంలో ఓ పిల్లాడు సిగరెట్ తాగే సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత నిజం తెలిసి చల్లబడ్డారు. ఆ నిజం ఏమిటంటే... ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతుందని ముందే ఊహించిన దర్శకుడు క్యాబేజీ ఆకులతో సిగరెట్ తయారు చేయించి, దాన్ని కాల్పించాడట. -
మున్నాభాయ్ ఈజ్ బ్యాక్!
సంజయ్‌దత్ జైలు నుంచి విడుదలై మూడు నెలలైంది. మరి... కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారు? అని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. చకచకా సినిమాలు చేసేయాలని సంజయ్ దత్ ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో సంజయ్‌దత్‌కు మంచి ఫైట్లు ఉన్నాయట. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం సంజయ్‌దత్ ఎన్ఎస్జీ కమాండో తరహాలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈలోగా ఆయన ఓ యాడ్‌లో కనిపించే అవకాశం ఉంది. ముంబైలోని మధ్ దీవిలో జరుగుతున్న ఈ యాడ్ షూటింగ్ కోసం కెమెరా ముందుకు వచ్చారు సంజయ్. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారిపోయింది. అక్కడి స్థానికులు తమ ప్రాంతానికి సంజయ్‌దత్ వచ్చారని తెలిసి, ఆయన్ను చూడటానికి పోటీ పడ్డారు. సంజయ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, వాళ్లతో ఫొటోలు దిగి, ఆనందపరిచారట. కొంత విరామం తర్వాత సంజయ్ నటుడిగా మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఆయన అభిమానులు ‘మున్నాభాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ సంబరపడిపోతున్నారు. -
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
కాకినాడ సిటీ : తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ఇన్చార్జ్ జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారిణి జీఎస్ వరలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆండాళ్లమ్మ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తైక్వాండో వేసవి శిక్షణా శిబిరాన్ని డీఎస్డీఓ వరలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తైక్వాండో వంటి క్రీడల్లో శిక్షణ పొందడం ద్వారా వ్యాయామంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు మాట్లాడుతూ స్వీయక్రమశిక్షణ-బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, ఆరు సంవత్సరాల వయస్సు నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. జిల్లాలో క్రీడాభివృద్ధి మండలి, తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలుప్రాంతాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ నెల 31 వరకు నిర్వహించే శిక్షణ ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవిరాజ్, తైక్వోండో అసోసియేన్ అధ్యక్షులు మధుసూదనరావు, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు, ట్రజరర్ వై.సత్యనారాయణ, కోచ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
జాకీ ఏరిపారేశాడు!
మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీ చాన్ ప్రస్తుతం ఇడియాలో ఉన్న విషయం తెలిసిందే. ఇండో-చైనీస్ సంయుక్త సమర్పణలో జాకీ చాన్ హీరోగా రూపొందుతున్న ‘కుంగ్ ఫూ యోగా’ చిత్రం షూటింగ్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఇందులో మన భారతీయ నటీనటులు అమైరా దస్తర్, సోనూ సూద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ పోరాట దృశ్యం చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న నటుడు జాకీతో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో అని ఇక్కడి టెక్నికల్ టీమ్ అనుకున్నారట. కానీ, జాకీ అందరితో కలిసిపోయి, చాలా సరదాగా షూటింగ్ చేస్తున్నారట. షాట్ గ్యాప్‌లో అమైరాతో ఈల వేసి, గోల చేస్తున్నారట కూడా. అది మాత్రమే కాదు.. షూటింగ్ లొకేషన్లో చిత్తు కాగితాలు కనిపిస్తే ఏరిపారేస్తున్నారని సమాచారం. జాకీ చాన్ అంతటి గొప్ప వ్యక్తే ఆ పని చేస్తుంటే, తామెందుకు చేయకూడదని అమైరా, సోనూ వంటి తారలు, ఇతర సాంకేతిక బృందం కూడా కంటికి కనిపించిన చెత్తను ఏరిపారేస్తున్నారట. -
ప్రియాంక... కెజుకెన్బో!
సినిమాల్లో తమ పాత్రల కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుని, వాటికి వన్నె తెచ్చే నటీమణుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ఆ మధ్య ప్రియాంక నటించిన ‘మేరీ కోమ్’ చిత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మేరీ కోమ్ పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకుని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారామె. ఆ సినిమాలో అనేక రిస్కీ షాట్స్ చేసి భేష్ అనిపించుకున్నారు. తాజాగా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రం కోసం ప్రియాంక ఓ మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. కరాటే, బాక్సింగ్, జూడో లాంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ అనే విషయం తెలిసిందే. అయితే, ప్రియాంక ‘బేవాచ్’ కోసం ‘కెజుకెన్బో’ అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. ఇది అమెరికాలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్. కరాటే, కొరియన్ కరాటే, జూడో, కెన్బో, వెస్ట్రన్, చైనీస్ బాక్సింగ్ లాంటి ఆరు మార్షల్ ఆర్ట్స్ కలిపిన విశేషమైన యుద్ధవిద్య ‘కెజుకెన్బో’. ఇది నేర్చుకోవాలంటే చిన్న విషయం మాత్రం కాదట. అయినప్పటికీ ప్రియాంకా చోప్రా వెనకడుగు వేయలేదని సమాచారం. ‘బేవాచ్’లో తాను చేస్తున్న విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే ఎంత రిస్కీ మార్షల్ ఆర్ట్ అయినా నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారట. హీరో డ్వేన్ జాన్సన్‌కు దీటుగా ఉండే ఆమె పాత్రకు కెజుకెన్బో వస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు సేథ్ గోర్డన్ సూచించారట. అందుకే అమెరికాలో ఈ విద్యలో ప్రసిద్ధిగాంచిన ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో నేర్చుకోవడానికి ప్రియాంక సై అన్నారు. మరి.. ప్రియాంకానా... మజాకానా! -
జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జాకీచాన్ స్టెప్పులు!
దుబాయ్: మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తారలు 'లోఫర్' ఫేమ్ దిశా పాట్నీ, 'అనేకుడు' ఫేమ్ అమైరా దస్తర్ కథానాయికలు కాగా, విలన్ గా సోనూ సూద్ చేస్తున్నాడు. 'కుంగ్ ఫూ యోగా' మూవీ షూటింగ్ లో భాగంగా జాకీచాన్ సోమవారం (మార్చి 21న) భారత్ కు రానున్నాడు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డులు 2016లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ... జాకీచాన్ తో కలిసి తాను నటిస్తున్నానని, ఆ మూవీ కోసం ఆయన భారత్ కు రానున్నారని తెలిపాడు. గతంలో 'ద మిత్' మూవీలో బాలీవుడ్ ఐటమ్ బాంబు మల్లికా షెరావత్, జాకీచాన్ తో కలిసి నటించింది. 2013లోనూ మూవీ షూటింగ్ కోసం జాకీచాన్ భారత్ కు వచ్చాడు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ తో మూడు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో కుంగ్ ఫూ యోగా ఒకటి. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ 21న జాకీచాన్ ఇందు కోసం ఇండియా రానున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను మూడు వారాల పాటు చిత్రీకరిస్తారని సోనూ సూద్ వివరించాడు. -
ఇండియాలో... జాకీచాన్ డ్యాన్స్!
మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ గురించి సినీ అభిమానులకు పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఫైట్స్ చేస్తూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ సూపర్‌స్టార్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అదీ మన బాలీవుడ్ స్టయిల్ పాటకు! ప్రస్తుతం జాకీచాన్ ఆ సన్నాహాల్లోనే ఉన్నారని సమాచారం. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందు తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు దిశా పాట్నీ (‘లోఫర్’ ఫేమ్), అమైరా దస్తర్ (‘అనేకుడు’ ఫేమ్) కథానాయికలు కాగా, సోనూ సూద్ విలన్. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ నెల 20న జాకీచాన్ దీని కోసం ఇండియా రానున్నారట. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను గ్రాండియర్‌గా మూడు వారాల పాటు చిత్రీకరించనున్నారు. -
నా వద్ద తోక జాడించడం కుదరదు
నా వద్ద తోక జాడించడం ఎవరి వల్లా కాదంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీలో దైర్యం మాత్రమే కాదు ఇంకేదో ఉంది. అదేమిటో చూద్దాం. తాప్సీకి కోలీవుడ్‌లో తొలి చిత్రం ఆడుగళం విజయవంతమైన చిత్రంగా అమరింది. అయినా ఆమె కెరీర్ ఇక్కడ హీట్ ఎక్కలేదు. అవకాశాలు అడపాదడపానే రావడం గమనార్హం. ఆ మధ్య లారెన్స్ సరసన నటించిన కాంచన-2 చిత్రం విజయం సాధించడంతోపాటు తాప్సీకి నటనలో మంచి మార్కులు పడ్డాయి. దీంతో తనకు కోలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది అనుకున్న వారు లేకపోలేదు. ఊహించినట్లు గానే ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో వైరాజావై చిత్రంతో పాటు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన ఖాన్ చిత్రంలో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే వైరాజావై చిత్రం విడుదలైనా తాప్సీకి ఏమంత పేరు రాలేదు. ఇక ఖాన్ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది తాప్సీని చాలా నిరాశ పరచిందనే చెప్పాలి. నటిగా తాప్సీ పరిస్థితి అలా ఉంటే వ్యక్తిగతంగా తాను చాలా బలమైన వ్యక్తినంటోందామె. ఆ మధ్య హిందీలో అక్షయ్‌కుమార్ సరసన బేబి అనే చిత్రంలో నటించింది. అందులో పోరాట సన్నివేశాల్లో కూడా నటించింది. అందుకు తగిన శిక్షణ తీసుకుందట. అయితే ఆ చిత్రం తరువాత కూడా తను ఆ శిక్షణను కొనసాగిస్తోందట. అంతే కాదు అదనంగా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందిందట. అందువల్లే తాప్సీ ఎక్కడికైనా ఒంటరిగానే వెళుతుంది.చాలా మంది హీరోయిన్లు తమకు రక్షణగా కొందర్ని వెంట తెచ్చుకుంటుంటారు. ఈ విషయాన్ని తాప్సీ వద్ద ప్రస్తావిస్తే ‘నేనెక్కడికైనా ఒంటరిగానే వెళ్తాను. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనే సత్తా నాకుంది. నా ముందు ఎవరూ తోక జాడించలేరు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. -
రణవిద్యలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదు
* నెల్లూరు కరాటే మాస్టర్ ప్రభాకర్ అరుదైన ఫీట్ * నిమిషంలో బొటన వేళ్లపై 63 పుషప్స్.. 103 క్లాప్స్ పుషప్స్ నెల్లూరు (బృందావనం): నెల్లూరు కరాటే మాస్టర్ ప్రభాకర్ తనదైన రీతిలో విన్యాసాలను ప్రదర్శించారు. నెల్లూరు మినీబైపాస్‌రోడ్డులోని ఓ ఆడిటోరియంలో బుధవారం ఒకే వేదికపై రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పారు. ఒక నిమిషంలో రెండు బొటన వేళ్లపై 63 పుషప్స్‌ను తీశారు. అలాగే పుషప్ప్ విత్ క్లాప్స్ను ఒక నిమిషంలో 103 దిగ్విజయంగా ప్రదర్శించారు. ప్రపంచంలో ఇప్పటివరకు రెండు బొటనవేళ్లతో 35 పుషప్స్ గిన్నిస్ రికార్డుగా ఉందని ప్రభాకర్ తెలిపారు. అలాగే పుషప్స్ విత్క్లాప్స్ ఇప్పటి వరకు 90 మాత్రమే రికార్డుగా ఉందన్నారు. ఈ రెండు రికార్డులను అధిగమించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభాకర్ తెలిపారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పంపిన నియమ నిబంధనలతో రికార్డు చేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు, రికార్డులు నమోదు చేసేందుకు స్థానిక ప్రాగ్జ్యోతి స్కూల్ కరస్పాండెంట్ లీలాకృష్ణ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎం.వి.సునీల్‌కుమార్, హరి, ఈఎస్ జగదీష్, కె.గిరికుమార్, ఓ.ప్రేమ్‌కుమార్, సోనాథ్, మల్లికార్జున్ హాజరయ్యారు. రికార్డుకు సంబంధించి తీసిన వీడియో, ఫొటోగ్రాఫ్‌లను గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు పంపనున్నట్లు ప్రభాకర్ తెలిపారు. కాగా వివిధ రణవిద్య ప్రదర్శనలతో ఇప్పటికే నాలుగు గిన్నిస్ రికార్డులను పొందినట్లు ప్రభాకర్ వివరించారు. -
అట్టహాసంగా విజయనగరం ఉత్సవాలు
విజయనగరం ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్ వద్ద ర్యాలీతో ఉత్సవాలను కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రారంభించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని రకాల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రాచీన యుద్ధ విద్యలతో అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలతో పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విజయనగరం సందడిగా మారింది. -
ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను!
బాలీవుడ్ హీరోయిన్స్‌లో ప్రియాంకా చోప్రా సమ్‌థింగ్ స్పెషల్. ఎప్పుడూ కూల్ అండ్ కామ్గోయింగ్గా కనిపించే ఈ వర్క్‌హాలిక్ గురించి ఆసక్తికరమైన పది విషయాలు... ప్రియాంకా చోప్రా ఇంజినీర్ లేక క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకున్నారు. అయితే, ఈ రెండూ కాకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడం, పెద్ద స్టార్ అయిపోవడం తెలిసిందే.కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అలాగే, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, కథక్ కూడా నేర్చుకున్నారు. ప్రియాంక చోప్రా తండ్రి ఆర్మీలో పని చేసేవారు. ఆయనకు పాడడమంటే ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతోనే ప్రియాంక పాటలు పాడడం నేర్చుకున్నారు.ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రియాంకను ముద్దుగా ‘సన్‌షైన్’ అని, ‘మిమీ’ అని పిలుస్తారు. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ‘పిగ్గీ చాప్స్’, ‘పీసీ’ అని పిలుస్తుంటారు. అభిషేక్ బచ్చన్ అయితే ఆమెను ‘బ్లఫ్ మాస్టర్’ అని సరదాగా పిలుస్తారు. చిన్నప్పుడు ప్రియాంక ఆస్త్మా వ్యాధితో చాలా బాధపడేవారట. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేనని పెద్దయ్యాక పలు సందర్భాల్లో ప్రియాంక పేర్కొన్నారు.జంక్ ఫుడ్స్‌లో ప్రియాంకకు పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అలాగే, చాక్లెట్స్ అంటే చాలా ప్రీతి. బయటికెళ్లేప్పుడు బ్యాగులో అవి ఉండేలా చూసుకుంటారు.అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించిన ‘హమ్రాజ్’ చిత్రం ద్వారా ప్రియాంక హిందీ రంగప్రవేశం చేయాల్సింది. కానీ, ‘కహో నా ప్యార్ హై’ విజయంతో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్న అమీషా పటేల్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నారు. ఆ తర్వాత ‘ది హీరో’ చిత్రం ద్వారా ఆమె కథానాయిక అయ్యారు. అంతకు ముందే ‘తమిళన్’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారామె. మూగజీవాలంటే ప్రియాంకకు ఎంతో మమకారం. అందుకే, రాంచీలోని బిర్సా బయాలజికల్ పార్క్‌లోని సుందరి అనే సింహాన్నీ, దుర్గ అనే పులినీ దత్తత తీసుకున్నారామె. వాటి ఆహారం, ఆరోగ్యం ఇత్యాది ఖర్చులన్నీ ప్రియాంకే భరిస్తారు.ఫొటోగ్రఫీ అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఎప్పుడో ముచ్చటపడి నికాన్-డి90 కెమేరా కొనుక్కున్నారు. అవుట్డోర్ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు కంటికి నచ్చిన ప్రతి దృశ్యాన్నీ తన కెమేరాలో బంధిస్తారామె. తాత, అమ్మమ్మ, నాయనమ్మ... ఇలా నాటి తరం నుంచి నేటి తరంలో తన కుటుంబానికి చెందిన అందరి ఫొటోలనూ భద్రంగా దాచుకోవడం ప్రియాంక అలవాటు. ‘వక్త్: ది రేస్ ఎగైన్ట్స్ టైమ్’ సినిమా కోసం ‘డూ మీ ఎ ఫేవర్... లెటజ్ ప్లే హోలీ..’ అనే పాట కోసం డ్యాన్స్ చేస్తున్నప్పుడు పొరపాటున ప్రియాంక కరెంటు తీగ మీద కాలేశారు. షాక్ కొట్టడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఆ రోజంతా ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ షాక్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెబుతుంటారు. ఇటలీలోని ‘సాల్వటోర్ ఫైమో మ్యూజియమ్’లో ప్రియాంక ముద్రలు ఉన్నాయి. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి ప్రియాంకే కావడం విశేషం. హాలీవుడ్ తారలు మార్లిన్ మన్రో, డ్రూ బ్యారీమోర్ తదితరుల పాదముద్రలు ఆ మ్యూజియమ్‌లో ఉన్నాయి. ఇలా పాదముద్రలు భద్రపరిచిన ప్రముఖులకు ఆ మ్యూజియమ్వారు ప్రత్యేకంగా పాదరక్షలు తయారు చేసి ఇస్తారు. అది లిమిటెడ్ ఎడిషన్. ఆ పాదరక్షలను పోలినవి ప్రపంచంలో ఎక్కడా ఉండవు. -
జీవిత లక్ష్యం నెరవేర్చుకున్నాడు
బీజింగ్: మార్షల్ ఆర్ట్స్ ప్రముఖ హీరో జాకీ చాన్ కొత్తగా యాక్టింగ్ స్కూల్(ఫిల్మ్ అండ్ టెలివిజన్)ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సినా అనే వెబ్ పోర్టల్ తెలిపింది. ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. వుహాన్ అనే నగరంలో ఈ స్కూల్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించినట్లు తెలిసింది. తన జీవిత కాలంలో యాక్టింగ్ స్కూల్‌ను స్థాపించడంలో ఒక భారీ లక్ష్యమని, దానిని ఆయన నెరవేర్చుకున్నారని మీడియా సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ నటులందరితో కలిసి ఆయన స్కూల్ ప్రారంభకార్యక్రమానికి విచ్చేరని ప్రముఖ దర్శకుడు జియాగాంగ్, నటుడు లిబింగ్ బింగ్ కూడా హాజరయ్యారు. ఈ స్కూల్ లో నటన, యానిమేషన్, డిజిటల్ మీడియా పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. -
త్వరలో ఇండియా వస్తా!
వయసు పెరుగుతోంది... ఇక యాక్షన్ చిత్రాల్లో నటించగలుగుతానో లేదో? ఆ శక్తి ఉంటుందో లేదో? అని ఆ మధ్య ఓ సందర్భంలో జాకీ చాన్ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకునిగా ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. వయసు పెరుగుతోందని ఆయన సరదాగా అన్నారు కానీ, ఆరు పదుల వయసులోనూ జాకీ చాన్ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘డ్రాగన్ బ్లేడ్’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ‘స్కిప్ ట్రేస్’, ‘కుంగ్‌ఫూ పాండా 3’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అలాగే, ‘కుంగ్‌ఫూ యోగా’ అనే చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియ-చైనాకు సంబంధించిన సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. ఈ కలయికలో రూపొందనున్న తొలి చిత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను బట్టి చైనీస్ మార్షల్ ఆర్ట్ కుంగ్‌ఫూ, భారతీయ యోగా నేపథ్యంలో కథ సాగుతుందని ఊహించవచ్చు. కథానుసారం ఈ చిత్రం షూటింగ్ ఇండియాలో కూడా చేయాల్సి ఉంటుందని, త్వరలో ఇక్కడికి వస్తానని జాకీ చాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఓ పని మీద ఆయన ఇండియా వచ్చారు. ఇండియా తనకు చాలా నచ్చుతుందని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితం జాకీ చాన్ నటించిన ‘ది మిత్’లో హిందీ భామ మల్లికా శెరావత్ నటించారు. మరి... హిందీ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు - ‘‘ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు. మంచి కథ దొరికితే అప్పుడాలోచిస్తా. ప్రస్తుతానికి చైనా-భారతీయ నేపథ్యంలో చేయబోతున్న ‘కుంగ్‌ఫూ యోగా’ పైనే దృష్టి సారిస్తున్నా’’ అని జాకీచాన్ చెప్పారు. -
మందుబాబులకు చెంపదెబ్బ
నటి ధన్సిక మార్షల్ ఆర్ట్స్‌తో తన తడాఖా చూపించింది. ఆత్మరక్షణకు ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో నిరూపించి ఆడది అబల కాదు సబల అని వాస్తవంగా చాటింది. వివరాల్లో కెళితే...పేరాణై్మ చిత్రంతో నటన తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు పరదేశి తదితర చిత్రాలతో చక్కని ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకుంది. స్వతహాగా ధన్సిక మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. తాజాగా ఈమె నటిస్తున్న కాత్తాడి చిత్రం షూటింగ్ కేరళ రాష్ట్రంలోని వాగమన్ అనే ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ చిత్ర పాట చిత్రీకరణలో పాల్గొనడానికి ధన్సిక, తన మేనేజర్‌తో కలసి వెళ్లారు. ఆ ప్రాంతానికి పలువురు వీక్షకులు వచ్చారు. వారిలో ఒక గ్రూప్ క్యారవాన్ వ్యాన్‌లో వున్న ధన్సికను చూసి ఆమెతో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. అయితే వారు మద్యం తాగి వుండటం గ్రహించిన మేనేజర్ వారిని నివారించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ గుంపులో ఒక వ్యక్తి మేనేజర్ మెడపై కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. ఇదంతా క్యారవాన్ వ్యాన్‌లో నుంచి చూస్తున్న ధన్సిక వెంటనే కిందికి దిగి తను ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌కు పని చెప్పింది. ఆమెపై దురుసుగా ప్రవర్తించిన వారి చెంపలు చెళ్లుమనిపించింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కల్యాణ్ తెలుపుతూ షూటింగ్ చూడటానికివచ్చిన వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తించగా, ధన్సిక బుద్ధి చెప్పినట్లు తెలిపారు. దీంతో చిత్ర యూనిట్ పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ అల్లరి మూకను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదలి పెట్టారని కల్యాణ్ వెల్లడించారు. -
బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్
మార్షల్ ఆర్ట్స్.. ఈ పదం వింటే చాలు యువకుల పిడికిళ్లు బిగుసుకుపోతాయి.. వెన్ను నిటారుగా నిలుస్తుంది.. కాళ్లు అవకాశం కోసం గాల్లో తేలుతుంటాయి. చురకత్తుల్లాంటి చూపులు.. చాకుల్లాంటి చేతులు.. మార్షల్ ఆర్ట్స్‌కి అదనపు ఆకర్షణ. ఈ కళలో ఆరితేరాలంటే శారీరకంగా చిరుతలా చురుగ్గా ఉండాలి.. మానసికంగా వె య్యి ఏనుగుల బలం ఉండాలి. అన్నింటికి మించి నేను ఏదైనా చేయగలనన్న కసి ఉండాలి. ఆ బలమే ఓ కాటికాపరిని.. తైక్వాండోలో కింగ్‌ని చేసింది. పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మన్నె శ్రీరంగ కిక్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఆ విజయం వెనుకున్న విషయాలు ఆయన మాటల్లో వింటేనే మనసుకెక్కుతాయి. తైక్వాండో కిక్స్‌లో ఐర్లాండ్ రికార్డు.. 30 నిమిషాల్లో యాైభె వేల కిక్స్ కొట్టడం. దాన్ని ఢీ కొట్టడానికి కొన్నేళ్లుగా సాధన చేశాను. ఇరవై ఏళ్ల నా కల నేటికి నెరవేరింది. కేవలం 15 నిమిషాల్లో 50,614 కిక్స్ కొట్టాను. ఆ పోటీలకు మన దేశం నుంచి 50 మంది మార్షల్ ఆర్ట్స్ ప్రొఫెషనల్స్ వచ్చారు. అందరూ ఉన్నవారే.. చదువుకున్నవారే. నా దగ్గర ఆ రెండూ లేవు. కేవలం గెలవాలన్న కసి తప్ప. నా ఒంట్లో బలానికంటే ఎక్కువ కసే ఉంది. అందుకే ఆ రికార్డును బద్దలు కొట్టాను. ఈనెల రెండో తేదీన డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సత్కారాన్ని పొందాను. తెల్లవారి వార్తాపత్రికల్లో వచ్చిన నా ఫొటోలు చూసి ఇరుగుపొరుగు మా అమ్మను మెచ్చుకున్నారు. నాకైతే నేను పని చేసే శ్మశానవాటికలో తెలిసినవారు, తెలియనివారు సన్మానం చేసినంత పని చేశారు. తొమ్మిదో వాడిని.. పుట్టుక నుంచి నా జీవితం శ్మశానంలోనే గడిచింది. నాన్న ఎక్తయ్య కాటి కాపరి. అమ్మ బాలమణి నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేది. ఐదుగురు మగ పిల్లలు, నలుగురు అమ్మాయిలు. నేను తొమ్మిదో సంతానాన్ని. నాన్న, అన్నలు, నేను అందరం సైదాబాద్ శ్మశానవాటికలో పనిచేసుకుంటూ బతికేవాళ్లం. ఇంట్లో చిన్నవాడ్ని కావడంతో నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోగలిగాను. పాఠశాల విద్యతోనే చదువు సరి పెట్టాను. చిన్ననాటి నుంచి కరాటే అంటే ప్రాణం. రూపాయి రూపాయి పోగేసి కర్మాన్‌ఘాట్ దగ్గరున్న మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్లో చేరాను. కాటికాపరిగా పనిచేస్తూనే కరాటే ప్రాక్టీస్ చేశాను. శ్మశానవాటికలోనే... ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు శ్మశానవాటికలో మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన రకరకాల వ్యాయామాలు ప్రాక్టీస్ చేసేవాడిని. 1991లో మొదలైన నా సాధనకు ఫలితం 1997లో దక్కింది. ఆ ఏడాది మద్రాసులో జరిగిన కరాటే పోటీలో విజయం వరించింది. ఇక అప్పటి నుంచి తైక్వాండోలోని రకరకాల కిక్‌లపై ప్రత్యేక సాధన మొదలుపెట్టాను. శిక్షణ.. అంటే మామూలుగా కోచింగ్ సెంటర్లలోనే ఉంటుంది. కానీ మాస్టార్లు చెప్పిన విద్యను ఒడిసిపట్టి.. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే ఈ స్థానాన్ని పొందగలిగాను. ప్రశాంతమైన స్థలం దొరకక నా తోటి వారెందరో ప్రాక్టీస్‌కు రోజుల తరబడి దూరమవుతుంటారు. నాకు మాత్రం ఆ చింత లేదు. రోజు ఉదయాన్నే శ్మశానవాటికలోని చెట్ల కిందకు వెళ్లి సాధన చేసే వాడిని. ప్రాక్టీస్‌తో పాటు మేం ఎందులోనూ తక్కువ కాదని పదిమందికీ చాటి చెప్పాలనే తపన దానికి తోడైంది. కొలువు కోసం కలలు ‘ఓ కాటికాపరి తనకు సంబంధం లేని విద్యలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం బహుశా ఇదే తొలిసారేమో..’అంటూ ఓ పెద్దాయన నా భుజం తట్టి ఓ మాట చెప్పాడు. ‘కన్నీరుకు మాత్రమే నెలవైన ఈ శ్మశానవాటికలో ఆనందబాష్పాలు తెప్పించే ఈ విజయం ప్రతి ఒక్క పేదవాడికి పాఠం కావాలి’ అని అన్నాడు. మా అమ్మ మాత్రం.. చిన్నప్పటి నుంచి ఒకటే మాట పలుకుతుంది.‘ఒక్క బిడ్డకైనా సర్కారు కొలువొస్తే బాగుండు. వీడు కాటికాపరిగానే ఉంటాడో ఏందో..’ అంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇదే మాట. అమ్మా...గిన్నిస్ బుక్‌ల ఎక్కిననే అంటే...‘అంత గొప్పదారా అది. అయితే కొలువు ఇప్పిస్తదా’ అంటది. నా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సహకరిస్తే మా అమ్మ కల నెరవేరుతుంది. మా జీవితాలు బాగుపడత యి. - భువనేశ్వరి -
మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోండి
న్యూఢిల్లీ: మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ప్రముఖ గాయని ఆశాభోస్లే హితవు పలికారు. మహిళల భద్రతకు ఇది దోహదం చేస్తుందన్నారు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనివార్యమైందన్నారు. వ్యకి ్తగత జీవితానికీ, వృత్తికీ మధ్య సమతుల్యం పాటించాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లడం ఎంతమాత్రం సురక్షితం కాదు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనేది ఓ అవసరంగా మారిపోయింది’ అని అన్నారు. ఫిక్కి మహిళా విభాగం నగరంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. స్వీయరక్షణ కోసం తన మనవరాలు జినాయ్ని యుద్ధవిద్యలు నేర్చుకుందంటూ ఈ సందర్భంగా ఓ ఉదాహ రణ చెప్పారు. చిన్నారులు కూడా నేర్చుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు ఎక్కువశాతం మంది మహిళలు తమ భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ‘ఎక్కువ శాతం సమయం రికార్డింగ్ స్టూడియోల్లో కాలం గడిపే నేను అలసిపోయి ఇంటికెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకోను. నేరుగా వంటగదిలోకే వెళతా. నా కుమారుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక వంటకం చేస్తా’ అని తన మనసులో మాట చెప్పారు. కాగా మూస పాటలను పాడడానికి ఇష్టపడని ఆశాభోంస్లే రకరకాల పాటలను ఆలపించారు. ‘నయాదౌర్’ సినిమాలో ‘మాంగ్కేసాత్ తుమ్హారా’ అనే మెలోడీ పాటతోపాటు దమ్ మారో దమ్, మెహబూబా.. మెహబూబా, పియా తూ అబ్తో ఆజా వంటి డిస్కో గీతాలను ఆలపించి గానంలో తన నైపుణ్యంతో అందరినీ అబ్బురపరిచారు. -
శారీరక పనికి ప్రాధాన్యత ఇవ్వండి
హెల్త్ టాక్ జిమ్‌కు వెళ్లడాన్ని మీ దినచర్యలో భాగంగా చూసుకోండి. పని ఒత్తిడి అనే నెపంతో జిమ్‌కు డుమ్మా కొట్టొద్దు. జిమ్‌లో రోజూ కనీసం రెండు గంటలు ఉండాలి. ‘టార్గెట్ వెయిట్’ను నిర్ణయించుకొని దాని ప్రకారం వర్కవుట్‌ను ప్లాన్ చేసుకోండి. వర్కవుట్‌లో షోల్డర్స్, ఆర్మ్స్, చెస్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. బాడీ యాక్టివిటీకి మార్షల్ ఆర్ట్స్, యోగా ఉపయోగపడతాయి. వాటిని వీలైనంత తర్వగా నేర్చుకోండి. స్వీట్లు, సాఫ్ట్డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండండి. రోజుకు కనీసం ఒక్క పండైనా తినండి. పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. హార్మోన్ల అసమతూకానికి కారణమయ్యే స్టెరాయిడ్లకు చాలా దూరంగా ఉండండి. ఈత, పరుగు, ఔట్‌డోర్ గేమ్స్... మొదలైన వాటి ద్వారా ‘ఫిజికల్ యాక్టివిటీ’కి ప్రాధాన్యం ఇవ్వండి. -
అలాంటివి ఆశించొద్దు
సంస్కృతి సంప్రదాయ ప్రవర్తనలను నా నుంచి ఆశించొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది బెంగాలీ భామ నీతూ చంద్ర. తమిళంలో యావరుం నలం చిత్రం ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత జయం రవి సరసన ఆదిభగవాన్, యుద్ధం సెయ్ చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్ లాంటివి చేసేసి పాపులర్ అయ్యింది. ఈ మధ్య గ్రీక్ చిత్రం ఒకటి చేసిన నీతుచంద్ర ఏ విషయంలో అయినా చాలా బోల్డ్‌గా ఉంటుంది. తమిళంలో ఎక్కువ చిత్రాలు చెయ్యడం లేదే అన్న ప్రశ్నకు తాను నటిని మాత్రమే కాదు. నిర్మాతను కూడా. బెంగాలీలో మంచి కథా చిత్రాలను నిర్మించి నిర్మాతగా రాణించాలని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అలాగే వైవిద్యభరిత పాత్ర అనిపిస్తే మాత్రమే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పింది. మూస పాత్రలు చెయ్యదలచుకోలేదని స్పష్టం చేసింది. తన తల్లి తనను సూపర్ స్టార్‌గా భావిస్తారని ఆమె కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మహిళలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందడం అరుదని పేర్కొంది. అలాంటిది తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మూడు సార్లు భారత దేశం తరపున అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. ఒక సారి నటుడు జాకీచాన్ నుంచి అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపింది. అయినా తన తల్లి అంటే చాలా భయం అని అంది. తాను తరచూ పద్ధతిగా ప్రవర్తించాలంటూ హెచ్చరిస్తుంటారని చెప్పింది. సమాజంలో స్త్రీలకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని గుర్తు చేస్తుంటారని పేర్కొంది. అయితే సంస్కృతి, సంప్రదాయాలను తన నుంచి ఎదురుచూడటం ఆశనిపాతమేనని నీతూచంద్ర అంటోంది. ఈ విషయాలను ఇంత నిర్భయంగా చెప్పడంలోనే ఈ అమ్మాయి ఎంత ఫాస్టో అర్థం అవుతోంది. -
తైక్వాండోతో ఆత్మరక్షణ
వేసవి శిక్షణపై బాలబాలికల ఆసక్తి శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడే క్రీడ. దీనిని నేర్చుకునేందుకు జిల్లాలోని బాలబాలికలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరుగుతుండటంతో తైక్వాండో నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. జిల్లాలోని రెండు వేర్వేరు సంఘాలు వందలాది మందికి శిక్షణ ఇస్తున్నాయి. మరోవైపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఈ ఏడాది నాలుగు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసక్తిగల బాలబాలికలు ఆయా కేంద్రాల పర్యవేక్షకులను సంప్రదించి శిక్షణ పొందవచ్చు. -
యుద్ధవిద్యలు అనివార్యం
న్యూఢిల్లీ: ఆత్మరక్షణకు యుద్ధవిద్యలు (మార్షల్ఆర్ట్స్) కీలకం కాబట్టి అన్ని పాఠశాలల్లో వీటిని తప్పకుండా నేర్పేలా చూడాలని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరాడు. అక్కీ థాయ్‌లాండ్ వెళ్లి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నాడు కూడా. ‘బాలలకు యుద్ధవిద్యలు నేర్పించడం తప్పనిసరి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరాను. ప్రతి విద్యార్థి కనీసం మూడేళ్లపాటు యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకొనే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. క్రికెట్ కంటే మార్షల్‌ఆర్ట్స్‌కు ప్రాధాన్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పాడు. ముంబైలో సోమవారం నిర్వహించిన రష్యన్ కత్తిపోరాటాల (టాల్ఫర్) శిక్షణా కార్యక్రమానికి వచ్చిన ఇతడు పైవిధంగా అన్నాడు. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో యుద్ధవిద్యల శిక్షణ తప్పనిసరిగా ఉంటుందని, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంటారని అక్షయ్ తెలిపాడు. ముంబై పోలీసులు, బాల్‌ఠాక్రే కోడలు స్మితాఠాక్రే అధీనంలోని ఎన్జీఓ ముక్తి సహకారంతో కొందరు రష్యన్ యుద్ధవిద్యల నిపుణులు నాయిగావ్ పోలీసు స్టేషన్ మైదానంలో టాల్ఫర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 35 మంది మహిళా పోలీసులు, ముక్తికి చెందిన 12 మంది మహిళా కార్యకర్తలు ఈ శిక్షణ తీసుకున్నారు. ‘మహిళ తనను తానే రక్షించుకోవాలి. కత్తులతో చేసే పోరాటాలకు కండబలం అవసరం లేదు. కావాల్సింది బుద్ధిబలమే. టాల్ఫర్ శిక్షణ పొందిన వారికి ఆ విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని చెప్పిన అక్షయ్ టాల్ఫర్ నిపుణులతోనూ కాసేపు గడిపాడు. టాల్ఫర్ మెళకువలనూ కాసేపు సాధన చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి హిమాంశు రాయ్ మాట్లాడుతూ మహిళలకు స్వీయరక్షణ తప్పనిసరి అన్నారు. రష్యన్ టాల్ఫర్ నిపుణులు చాలా దేశాల్లో పోలీసులు, సైన్యానికి ఈ యుద్ధవిద్యలో శిక్షణ ఇస్తున్నారు. -
మహిళా.. మేలుకో..
మార్షల్ ఆర్ట్స్‌పై యలమంచిలి యువకుడి ప్రచారం హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏదో ఓ మూల రోజుకో ఘోరం. ఆడ పిల్లలపై అఘాయిత్యం. పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి సంఘటనలు చూసి సమాజం ఏమైపోతోందని ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన. అయితే ఆ కుర్రాడు ఆవేదన పడి ఊరుకోలేదు. తనవంతుగా ఏం చేయగలనా? అని ఆలోచించాడు. మహిళలను మేల్కొలపడానికి హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ ఒకటి రెండు చోట్ల ఆత్మరక్షణపై విద్యార్థినుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నించాడు. అతడే యలమంచిలికి చెందిన సతీష్‌కుమార్ వెలగ. 10 రోజులు.. 650 కిలోమీటర్లు సతీష్ హైదరాబాద్‌లోని జీఈ కాపిటల్స్లో ప్రాసెస్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిన సంఘటనతో చలించిపోయాడు. శారీరకంగా బలహీనులైన మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే తమను తాము రక్షించుకోగలరని, ఆ దిశగా ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ‘ఆడపిల్లల ఆత్మ రక్షణ-భావి తరాలకు రక్షణ’ నినాదంతో ఈ నెల 17న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పది రోజులు ప్రయాణించి సోమవారం విశాఖ చేరుకున్నాడు. సాగరతీరంలో తన యాత్రను ముగించాడు. మధ్యలో తనకు తారసపడిన ప్రతి నగరం, పట్టణంలోని కళాశాలల వద్దకెళ్లి మహిళ ఆత్మ రక్షణపై తనకు తెలిసింది వివరించాడు. వారితో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కృషి చేశాడు. మార్షల్ ఆర్ట్స్ బీమాలాంటిది జీవితానికి బీమా ఎలాంటిదో.. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కూడా అలాంటివే. టెక్నాలజీని అమ్మాయిలు వాడుకోవాలి. GoSafe, bSafe, Fightback, Life 360 తదితర అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒంటరిగా వెళ్లేటప్పుడు ప్రయాణించే వాహనం నంబర్, ఫొటో తదితర వివరాలు వాట్స్ప్లాంటి సౌకర్యాల ద్వారా తల్లిదండ్రులు, బంధువులకు చేరే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిసేటట్టు వ్యవహరిస్తే.. వారు అనుచితంగా వ్యవహరించడానికి భయపడతారు. - సతీష్‌కుమార్ వెలగ -
బాలికలకు ఆత్మ‘రక్షణ’!
ముంబై: ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ముందడుగు వేసింది. ఆమ్వే ఇండియా కంపెనీ సహకారంతో నగరంలోని ఎంసీజీఎం కింద నడుస్తున్న మున్సిపల్ పాఠశాలల విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పించేందుకు నిశ్చయించింది. నమూనా ప్రాజెక్టుగా నగరంలోని రెండు పాఠశాలల్లో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై బుధవారం ఎంసీజీఎం, ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సంతకాలు చేశాయి. తూర్పు అంధేరిలోని ఆర్.కె.మార్గ్ మున్సిపల్ స్కూల్, చకల మున్సిపల్ స్కూల్లో చదువుతున్న 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థినులకు మొదటి దఫా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్(విద్య) మాట్లాడుతూ..‘ ప్రస్తుత సమాజంలో మహిళలపై వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు సర్వసాధారణమైపోయాయి. ఇటువంటివాటిని అరికట్టాలంటే మొదట మహిళలు తమను తాము రక్షించుకునేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరాటే, కుంఫూ, కిక్ బాక్సింగ్ వంటి విద్యల్లో వారికి శిక్షణ ఇస్తే ఎటువంటి విపత్కర పరిస్థితుల నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వారికి లభిస్తుంది.. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న వేలాదిమంది కౌమార విద్యార్థినులకు ఆత్మరక్షణ నిమిత్తం మార్షల్ ఆర్ట్స్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంసీజీఎం పర్యవేక్షిస్తుంది..’ అని తెలిపారు. ‘మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడమే కాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టాం. బాలికల భవిష్యత్తును కాపాడటం మన నైతిక బాధ్యత. ఈ బృహత్తర కార్యక్రమంలో ఆమ్వే ఇండియా సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం..’ అని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ‘ఆమ్వే వంటి కంపెనీలు సహకారం ఇలాగే ఉంటే మున్ముందు ఎంసీజీఎం మహిళల, బాలికల రక్షణకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుంది..’ అని అసిస్టెంట్ కమిషనర్ (ప్లానింగ్ ) ప్రాచి జంభేకర్ అన్నారు. ఆమ్వే ఇండియా పశ్చిమ విభాగ అధికారి సందీప్ ప్రకాశ్ మాట్లాడుతూ బాలికల రక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం బాధ్యతగా గుర్తించి తమ కంపెనీ ఎంసీజీఎంతో అవగాహనకు వచ్చిందని తెలిపారు. ‘ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మేం కూడా పాలుపంచుకోవడం గర్వంగా ఉంది. నేడు మహిళలు అన్నివిధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సమాజంలో రక్షణ మృగ్యమైపోతోంది. ఏ రంగంలోనూ వారు పురుషులతో సమానంగా హక్కులను పొందలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా సంస్థలో 60 శాతానికి పైగా పంపిణీదారులు మహిళలేనని చెప్పడానికి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో మహిళలు స్వయంసమృద్ధి సాధించడమేకాక తమను తాము రక్షించుకునేవిధంగా వారికి తగిన రక్షణ, శిక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..’ అని సందీప్ అన్నారు. ఇదిలా ఉండగా ఎంసీజీఎంలోని సామాజిక బాధ్యత విభాగం నగరంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఏర్పడింది. దీనికి ఎటువంటి నిధుల కేటాయింపు లేకపోయినా, వివిధ సంస్థల సహకారంతో కార్యక్రమాలను చేపడుతోంది. -
ఒక చేత వెన్నముద్ద ఒక చేత యుద్ధవిద్య
నిరుడు ఇదే సమయానికి - ఈ కొయ్యబారిన చలిరోజుల్లో... యావద్దేశం సలసల మరిగిపోతున్న రక్తంతో ‘నిర్భయ’ కోసం నినదిస్తూ ఉంది. ఆమె బతకాలని క్షణం విరామం లేకుండా ప్రార్థిస్తూనే ఉంది! ఇప్పుడు నిర్భయ లేదు. నిర్భయ చట్టం ఉంది. చట్టం ఉంది. కానీ నిశ్చింత లేదు! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఘటన! పార్లమెంటు చట్టం చేస్తుంది కానీ... పాఠశాల వరకూ తోడు రాలేదు. పోలీస్స్టేషన్లు ఉంటాయి కానీ... ఆఫీస్‌లో పక్కనే వచ్చి కూర్చోవు. ఎలా మరి? చదువు కోసం, కొలువుల కోసం ఆడపిల్లలు బయటికి వెళ్లిరావడం ఎలా? ఏ కవచాలు వారిని కాపాడతాయి? కవచాలు అక్కర్లేదు... కరములు చాలు అంటోంది బాలల హక్కుల సంఘం. అనడం మాత్రమే కాదు... స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతోంది. అంతకన్నా ముందు... ధైర్యమే మీ తొలి ఆయుధం అని నూరిపోస్తోంది. కనీసం వెయ్యి విద్యాలయాలలో బాలికలకు, యువతులకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలని కంకణం కట్టుకున్న ఈ హక్కుల సంఘం బృహత్తర ప్రయత్నమే ఈవారం ‘జనహితం’. ఆడపిల్ల బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయంభయంగా ఎదురుచూసే రోజులివి. వారి భయం ‘ఆమె’ను మరింత బలహీనురాలిగా మారుస్తుంది. అదే ఆత్మరక్షణ విద్య నేర్పితే ‘ఆమె’ ధైర్యంగా ఎదుగుతుంది. ఇంటిల్లిపాదీ నిబ్బరంగా ఉంటారు. ఈ ఆలోచన తో రాష్ట్ర బాలల హక్కుల సంఘం ‘అమ్మాయిలకు ఆత్మరక్షణ’ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందుకు గాను ఐఎమ్ఎఫ్ కరాటే మాస్టర్ నరేందర్‌తో కలిసి 1000 స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లోని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ప్రతి అమ్మాయి బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి చిన్ననాటినుంచే నేర్పించాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలను సాధన చేయించాలి. ఎవరైనా తమపై దాడి జరపగలరన్న అనుమానం వచ్చిన వెంటనే అలెర్ట్ అవగలిగే అవగాహన వారిలో పెంచాలి. తమ దగ్గర ఉండే సాధారణమైన సాధనాలతోనే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి..’ అంటూ ఈ సూచనలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆత్మరక్షణ పద్ధతుల్లో చెప్పే ప్రధాన అంశాలు మార్షల్ ఆర్ట్స్ అనేది చిట్టచివరి అధ్యాయం. ముందు కనీస జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకోవడం అవసరం. పెద్దలూ వారికి ఇవి సూచించాలి... ఇంట్లో నుంచి అమ్మాయి బయటకెళ్లేటప్పుడు వెంట మొబైల్ తీసుకెళ్లాలి. అందులో ఇంటి నెంబర్లు, పోలీసుస్టేషన్ నెంబర్లు ఉంచుకోవాలి, అమ్మాయిలు చాలావరకు రోడ్లపై మొబైల్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, కబుర్లు చెబుతూ వెళుతుంటారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దాడికి గురిచేసే అవకాశం ఉండవచ్చు. అందుకని రోడ్లమీద ఫోన్ కబుర్లకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. వెంట విజిల్ తీసుకువెళ్లడం, కీ చెయిన్‌కు ఒక చిన్న కత్తిలాంటివి తగిలించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగంతకులు తమ నోరు మూస్తే వారి చేతి పైన పిన్‌తో గాని, కీతో గాని గుచ్చడం... వంటివి చే సి దాడి నుంచి తప్పించుకోవచ్చు. కొందరు బస్సులలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో శరీర భాగాలను తగులుతుంటారు. అలాంటప్పుడు తమ వెంట ఉండే వస్తువులతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో తెలుసుకోవచ్చు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. కరాటే నేర్చుకున్న అమ్మాయిలు కూడా కొంత అమాయకంగా ఆలోచిస్తుంటారు. తమపై దాడి చేసిన వారిని గట్టిగా కొడితే చచ్చిపోతారేమో అని భయపడుతుంటారు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెనుకంజ వేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైనా తమపై దాడికి దిగినప్పుడు వారిని తరమవచ్చు అని ‘నిర్భయ చట్టం’ చెబుతోంది. ఆడపిల్లలు చిన్నప్పటినుంచే ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పట్ల అవగాహన పెంచుకోవాలి. టీచర్లు, దగ్గరి బంధువులు మెచ్చుకోలు కోసం భుజాలు తట్టడం, నొక్కడం చేస్తుంటారు. వీటిలో ఆ ‘టచ్’ పట్ల ఆలోచన చేసే జ్ఞానం అలవర్చుకోవాలి. ‘తేడా’గా అనిపిస్తే ప్రిన్సిపాల్‌కు చెప్పడం లేదా నలుగురిలో నిలదీయడం, ఇంట్లో వారికి చెప్పడం చేయాలి. లేదంటే వారు మరింత చనువు తీసుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లల శారీరక అవయవాల గురించి చెబుతూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు ఆడపిల్లలు సిగ్గుపడుతూ గుంభనంగా ఉండిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సదరు వ్యక్తి మరింత అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారి గురించి నలుగురికీ తెలియజేయడం అవసరం. ఆగంతకులు ఎవరైనా వెనక నుంచి పట్టుకుంటే ముఖంపై కొట్టాలి, ముక్కుపై గుద్దాలి, విడిపించుకునే క్రమంలో ఎలా ఉండాలో కనీస అవగాహన పెంపొందించాలి. నెగిటివ్, పాజిటివ్ అంశాలకు తేడా తెలుసుకోవాలి. నిలదీసే ధైర్యం పెంచుకోవాలి. చదువుతోపాటు చిన్ననాటి నుంచి అబ్బాయిలకూ సంస్కారం నేర్పాలి. ఈ ముందు జాగ్రత్తలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలకు ఎంతవరకు అవసరమో తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివమల్లాల భయం పోయింది కరాటే నేర్చుకోకముందు ఓ సారి బస్‌లో నా మెడలో చైన్‌ను లాగారెవరో! ఆ సమయంలో అరవడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల వరకు ఆ భయం పోలేదు. ఆ సంఘటన తర్వాత కరాటే నేర్చుకున్నాను. కిందటేడాది కాలేజీ నుంచి వస్తుంటే దారిలో ఆగంతుకులు దాడి చేయబోయారు. వారిని ధైర్యంగా ఎదుర్కోగలిగాను. - పి.శాలిని, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత