ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
తెనాలి టౌన్: ఆత్మరక్షణకు, మనోధైర్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్‌యార్డు ఆవరణలో రాష్ట్రస్థాయి టాంగ్‌సూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెనాలిలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణరావు మాట్లాడారు. గుంటూరు జిల్లాకు బంగారు, వెండి, రజత పతకాలు లభించినట్లు పోటీల చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ నాగరాజు, ఆర్గనైజర్ కె.శ్రీనివాసరావు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, క్రీడాకారులు, 10 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.