
శారీరక పనికి ప్రాధాన్యత ఇవ్వండి
హెల్త్ టాక్
జిమ్‌కు వెళ్లడాన్ని మీ దినచర్యలో భాగంగా చూసుకోండి. పని ఒత్తిడి అనే నెపంతో జిమ్‌కు డుమ్మా కొట్టొద్దు. జిమ్‌లో రోజూ కనీసం రెండు గంటలు ఉండాలి.
‘టార్గెట్ వెయిట్’ను నిర్ణయించుకొని దాని ప్రకారం వర్కవుట్‌ను ప్లాన్ చేసుకోండి.
వర్కవుట్‌లో షోల్డర్స్, ఆర్మ్స్, చెస్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి.
బాడీ యాక్టివిటీకి మార్షల్ ఆర్ట్స్, యోగా ఉపయోగపడతాయి. వాటిని వీలైనంత తర్వగా నేర్చుకోండి.
స్వీట్లు, సాఫ్ట్‌డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండండి.
రోజుకు కనీసం ఒక్క పండైనా తినండి.
పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి.
హార్మోన్ల అసమతూకానికి కారణమయ్యే స్టెరాయిడ్లకు చాలా దూరంగా ఉండండి.
ఈత, పరుగు, ఔట్‌డోర్ గేమ్స్... మొదలైన వాటి ద్వారా ‘ఫిజికల్ యాక్టివిటీ’కి ప్రాధాన్యం ఇవ్వండి.