పోలీసుగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలు, యోగాలో రాణిస్తున్నారు అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డి. కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్‌లో ఇంటలిజెన్స్ వింగ్ తరపున పాల్గొన్న వాసుదేవరెడ్డి యోగా విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పతకం అందుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివారు. 1996 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికై వేర్వేరు హోదాల్లో పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ, ఇంటలిజెన్స్ వింగ్‌లో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు.
గత 25 సంవత్సరాలుగా యోగాను క్రమం తప్పకుండా చేస్తోన్న వాసుదేవరెడ్డి.. ప్రతీ జూన్ 21న, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ యోగా డేలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక క్రమశిక్షణతో పాటు మానసిక సంసిద్ధత లభిస్తోందని అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు యోగాను అనుసరిస్తే.. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని చెప్పారు. యోగాలో తనకు పతకం లభించడం పట్ల వాసుదేవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment