
యోగా
స్వీయక్రమశిక్షణ కోసం...
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి.
ప్రయోజనాలు
వ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి.
ఎలా చేయాలంటే...
క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు.
స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...
నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి
నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి
యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి.
జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
Comments
Please login to add a commentAdd a comment