personal
-
వ్యక్తిగత ప్రపంచం
‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో అక్షతామూర్తి (బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్ భార్య) సంభాషిస్తూ తల్లికీ, తండ్రి (నారాయణ మూర్తి)కీ విడి పర్సనల్ లైబ్రరీలు ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్ మూర్తి పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్’ కుటుంబం పర్సనల్ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికీ, సౌకర్యానికీ అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పిన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్ సోంటాగ్ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా– కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే! అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటక మీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు గత పాతికేళ్లుగా చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేశాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతు న్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్ రచయితల పేర్లు బయటికి చదువు కోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో తెలుస్తుంది.ఇటాలియన్ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పె వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్–అమెరికన్ వ్యాసకర్త నసీమ్ నికోలస్ తలాబ్. ఒక్క క్లిక్ దూరంలో వందల ఈ–బుక్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం. -
యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?! -
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్‌కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
విస్మరిస్తే చంపెయ్యాలి: ధన్‌ఖడ్
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు. -
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
సుజనా చౌదరి దివాలా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. -
ఈ మినీ ఎలక్ట్రిక్ మేకర్ వెరైటీల గురించి మీకు తెలుసా..!
హైక్వాలిటీతో రూపొందిన ఈ మినీ మేకర్.. చాలా వెరైటీలను నిమిషాల్లో రెడీ చేస్తుంది. నూడుల్స్, పాస్తా, రైస్ ఐటమ్స్, పాన్ కేక్స్, కుకీస్, కట్లెట్స్, కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివెన్నో వండుకోవచ్చు. ఇందులో ఉడికించుకోవడం, గ్రిల్ చేసుకోవడం రెండూ సులభమే. అవసరాన్ని బట్టి ఈ డివైస్‌ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పైనున్న హ్యాండిల్ పాన్‌తో పాటు.. అడుగున ఉన్న నాన్‌స్టిక్ అటాచ్డ్ బౌల్లో కూడా ఫుడ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లో సరే.. క్యాంపింగ్లకూ చక్కగా యూజ్ అవుతుంది. దీనికి ప్రీహీట్ ఇండికేటర్ లైట్ ఉండటంతో ఏ వంటకాన్నయినా ఇట్టే చేసేయొచ్చు. ఈ మినీ పర్సనల్ ఎలక్ట్రిక్ మేకర్ ధర 14 డాలర్లు (రూ.1,161). ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా.. -
పర్సనల్ జెట్‌ప్యాక్‌లు వచ్చేస్తున్నాయి..
ప్రస్తుతం కారు ఉండటం అనేది చాలా సాధరణం అయిపోయింది. అదే కారు లాగే ‘పర్సనల్ ఫ్లైట్’ ఉంటే... అమ్మో అది రూ. కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంబానీ వంటి అపర కుబేరులకే అది సాధ్యమవుతుంది కానీ ఇతరులకెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? పర్సనల్ వాహన రంగంలో సరికొత్త శకం రాబోతోంది. కారు కొన్నంత సులువుగా, కారు ధరకే ‘పర్సనల్ ఫ్లైట్’లు కొనుక్కునే కాలం ఎంతో దూరంలో లేదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టేసింది ఓ విదేశీ ఏవియేషన్ స్టార్టప్ కంపెనీ. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. అంటే ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. ఇందు కోసం ప్రముఖ సెలబ్రిటీ ఆర్టిస్ట్, టెక్ విజనరీ విలియమ్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సైతం పొందింది. కారు కంటే వేగంగా.. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇది ఆకాశ ఫార్ములా వన్ రేసింగ్ కారు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో దీన్ని తయారు చేశారు. ఇందులో ఎనిమిది శక్తివంతమైన మోటర్లు ఉంటాయి. ఇవి సమాన మొత్తంలో ప్రొపెల్లర్లను నడుపుతాయి. చూడటానికి డ్రోన్లాగా ఉండే ఈ వాహనాలను ఇటీవల అమెరికాలో పరీక్షించారు. అక్కడ వీటిని నడపడానికి పైలట్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఆర్డర్ల స్వీకరణ జెట్సన్ వన్ పర్సనల్ జెట్ప్యాక్లకు ఈ కంపెనీ ఆర్డర్లు స్వీకరిస్తోంది. వీటి కోసం ఇప్పటికే 300 మంది ఆర్డర్ చేశారు. ఇందు కోసం ఒక్కొక్కదానికి 98,000 డాలర్లు (సుమారు రూ.81.5 లక్షలు) చెల్లించారు. అంటే ఒక ప్రీమియం కారు ధర కంటే తక్కువే. -
టీడీపీని, చంద్రబాబును పవన్ ఎన్నోసార్లు తిట్టాడు
-
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
మంచి మాట: దాటవలసిన మనోభావాలు
సత్యాలు వేరు; మనోభావాలు వేరు. ఎవరి మనోభావాలు వాళ్లవి. మనోభావాలు వ్యక్తులకు సంబంధించినవి; మనోభావాలు లేకుండా ఎవరూ ఉండరు. మనిషి అన్నాక మనోభావాలు తప్పకుండా ఉంటాయి. మనోభావాలు అనేవి వ్యక్తిగతమైనవి మాత్రమే. సత్యాలు సార్వజనీనమైనవి. మనోభావాల మత్తులో సత్యాల్ని కాదనుకోవడం, అందుకోలేకపోవడం, వదిలేసుకోవడం అనర్థదాయకం, అపాయకరం. మనోభావాలు కాదు సత్యాలు మాత్రమే అవసరమైనవి ఆపై ప్రయోజనకరమైనవి. మనోభావాలు దెబ్బతింటాయి లేదా దెబ్బతింటున్నాయి అనే మాటను మనం వింటూ ఉంటాం. మనోభావాలు దెబ్బతినడం అంటూ ఉండదు. వ్యక్తులలో ఉండే మనోభావాలు ఉన్నంత కాలం ఉంటాయి. కాలక్రమంలో పోతూ ఉంటాయి. మనోభావాలు అనేవి ప్రతి వ్యక్తికి వయసుతోపాటు మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఐదేళ్లప్పుడు ఉన్న మనోభావాలు పదేళ్లప్పుడు ఉండవు. పదేళ్లప్పటివి ఇరవై యేళ్లప్పుడు ఉండవు. వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, తెలివిని బట్టి, తెలివిడిని బట్టి మనోభావాలు అన్నవి వేరువేరుగా ఉంటాయి. విద్య, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాల్లోనూ, కళల్లోనూ, సార్వత్రికమైన విషయాల్లోనూ మనోభావాలు అనేవి అవసరం అయినవి కావు. సంఘ, ప్రపంచ ప్రయోజనాలపరంగా మనోభావాలు అనేవి ఎంత మాత్రమూ పనికిరావు. మానవ ప్రయోజనాలపరంగా సత్యాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలు చర్చనీయమూ, పరిగణనీయమూ అవవు. ఒక వ్యక్తి మనోభావాలు మరో వ్యక్తికి, సమాజానికి అక్కర్లేనివి. మనోభావాలు, మనోభావాలు అని అంటూ ఉండడమూ, తమ మనోభావాలు ముఖ్యమైనవి లేదా విలువైనవి అని అనుకుంటూ ఉండడం మధ్యతరగతి జాడ్యం. మనోభావాలు ప్రాతిపదికగా వ్యవహారాలు, సంఘం, ప్రపంచం నడవవు. ఈ విజ్ఞత ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. మనం మన మనోభావాలవల్ల మనకు, సంఘానికి సమస్యలం కాకూడదు. మన మనోభావాలు మనల్నే అడ్డగించే గోడలుకాకూడదు. మన మనోభావాలకు మనమే గుద్దుకోకూడదు. మనోభావాలు మనుగడ మునుసాగడాన్ని ఆపెయ్యకూడదు. మనిషి జీవితంలో ఒక మేరకు వరకే మనోభావాలకు స్థానాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనోభావాలకు అతీతంగా మనుగడను ముందుకు తీసుకువెళ్లడం మనిషి నేర్చుకోవాలి. మనోభావాలకు కట్టుబడి ఉండడం ఒక మనిషి జీవనంలో జరుగుతున్న తప్పుల్లో ప్రధానమైంది. స్వేచ్ఛగా సత్యాల్లోకి వెళ్లడం, వాటివల్ల స్వేచ్ఛను పొందడం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం. సత్యాలవల్ల వచ్చే స్వేచ్ఛ దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. తమ మనోభావాల్ని అధిగమించినవాళ్లే సత్యాలలోకి వెళ్లగలరు. సత్యాలను ఆకళింపు చేసుకోగలిగితే మనోభావాలు, మనోభావాలవల్ల కలిగే కష్ట, నష్టాలు చెరిగిపోతాయి. మతం, కులం, ప్రాంతీయత, ఉగ్రవాదం వంటివాటివల్ల జరుగుతున్న హానికి, అల్లకల్లోలానికి మనోభావాలే కారణం. మనిషికి సత్యాలపై తెలివిడి వచ్చేస్తే ఈ తరహా దుస్థితి, దుర్గతి ఉండవు. హిట్లర్ మనోభావాల కారణంగా ప్రపంచయుద్ధమే వచ్చి ప్రపంచానికి పెనుచేటు జరిగింది. మనోభావాలకు అతీతంగా సత్యాలపై ఆలోచన, అవగాహన హిట్లర్‌కు, మరికొంతమందికి ఉండి ఉంటే రెండో ప్రపంచయుద్ధం జరిగేదే కాదు. మనోభావాలవల్ల కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో దారుణాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి, జరుగుతున్నాయి. చరిత్రను, సమాజాన్ని, మనపక్కన ఉన్న కుటుంబాల్ని పరిశీలిస్తే ఈ సంగతి తెలియవస్తుంది. మన మనోభావాలను మనవరకే మనం పరిమితం చేసుకోవాలి. మన మనోభావాలకు తగ్గట్టు విషయాల్ని, ఇతరుల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. మన మనోభావాల ప్రాధాన్యతకు ఉన్న హద్దుల్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. మనోభావాలను దాటి సత్యాల ఆవశ్యకతను తెలుసుకుందాం; సత్యాలను ఆకళింపు చేసుకుందాం; సత్యాలవల్ల సత్ఫలితాలను పొందుదాం. సత్యాల సత్వంతో సరైన, సఫలమైన జీవనం చేస్తూ ఉందాం. – రోచిష్మాన్ -
వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అది రాజ్యాంగమే గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించేందుకు వీల్లేని హక్కు. దానికి విఘాతం కలిగిందంటూ వచ్చే విన్నపాలను ఆలకించడం మా రాజ్యాంగపరమైన విధి. అది మా బాధ్యత కూడా’’ అని స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర విద్యుత్ శాఖ పరికరాలు దొంగిలించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితునికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 అభియోగాల్లో ఒక్కోదానికి రెండేళ్ల చొప్పున అతనికి విధించిన జైలు శిక్షను మొత్తంగా రెండేళ్లకు కుదించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేస్తున్నట్టు? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు! అలాంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తుంటాయి. సుప్రీంకోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రాలే స్ఫూర్తి’’ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఏ కేసు కూడా సుప్రీంకోర్టు విచారించకూడనంత చిన్నది కాదు, కాబోదు’’ అని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు కొండంత పేరుకుపోయిన నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని ప్రజాప్రయోజన వ్యాజ్యాల వంటివాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించొద్దని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు రెండు రోజుల క్రితం అభిప్రాయపడటం తెలిసిందే. అంతేగాక కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య కొంతకాలంగా ఉప్పూనిప్పు మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వేశ్య గృహంలో రెండు వారాలు గడిపిన సీతా రామం హీరోయిన్
-
సైబర్ క్రైమ్: పిల్లలు ఏం చూస్తున్నారు?
సురేష్ ఇంటికి వస్తూనే వందన మీద కేకేశాడు ‘మన పర్సనల్ ఫొటోలు సోషల్‌మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావ’ని. వందన తన ఫోన్ తీసుకొని చెక్ చేసింది. భర్త చెప్పింది నిజమే. కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటానని అదేపనిగా విసిగిస్తుంటే తన మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఎని మిదేళ్ల కొడుకు చేసిన నిర్వాకానికి తలకొట్టేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఫొటోలు తొలగించి ఊపిరి పీల్చుకుంది. ఎందుకలా చేశావని అడిగితే తనకేమీ తెలియదని ఆటలో మునిగిపోయిన కొడుకును చూస్తూ ‘ఇక నుంచి వీడిని ఫోన్ ముట్టకోనివ్వకూడద’ ని గట్టిగా నిర్ణయించుకుంది. (పేర్లు మార్చడమైది). సురేశ్, వందన విషయంలోనే కాదు పిల్లలున్న ప్రతి ఇంట్లో డిజిటల్ వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఊహ తెలియని పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో... అనే ఆందోళన ఎక్కువయ్యింది. బడి పాఠాలు కూడా డిజిటల్లోకి మారాక ఇంటర్నెట్ వాడకం పిల్లల్లోనూ పెరిగింది. ఇలాంటప్పుడు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు తప్పక ఉంది. డిజిటల్ శ్రేయస్సు... ఈ రోజుల్లో పిల్లల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం కష్టమైన పనే. 7నుంచి 13 ఏళ్ల పిల్లలు చాలా రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ శ్రేయస్సు విషయంలో అన్ని వయసుల వారికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మన దగ్గరి డేటా.. మన దేశంలో 2021లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య దాదాపు 1.39 బిలియన్ల జనాభా ఉంది. 1.10 బిలియన్లకు మొబైల్ కనెక్షన్‌కి యాక్సెస్ ఉంది. వీరిలో 624 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు. 448 మిలియన్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు. సగటు ఇంటర్నెట్ వినియోగం రోజుకు 6.36 గంటలు అయితే సోషల్ మీడియా వినియోగం 2.25 గంటలు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినడానికి వెచ్చించిన సగటు సమయం 1.53 గంటలు. గేమింగ్‌లో గడిపే సగటు సమయం 1.20 గంటలు. 16 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో 92.8% మంది వీడియో గేమ్‌లు ఆడుతున్నారని నివేదికలు ఉన్నాయి. మార్గదర్శకాలు తప్పనిసరి... ఈ రోజుల్లో పిల్లలు సెకండరీ స్కూల్‌కి వెళ్లడంతోనే మరింత స్వతంత్రులు అవుతున్నారు. వైవిధ్యమైన అలవాట్లతో మరింత నమ్మకంగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలతో తరచూ ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడాలి. పిల్లలకు వ్యక్తిగతం కాకుండా కుటుంబ ఇ–మెయిల్‌ను సెట్ చేయాలి. వీడియోగేమ్‌ల రేటింగ్, వయసు బార్లను తనిఖీ చేయాలి. పెద్దలకు చిట్కాలు... ∙పిల్లలు స్క్రీన్‌ని ఎక్కువగా వాడుతున్నారని టెక్నాలజీ యాక్సెస్‌ను బ్లాక్ చేయవద్దు. అంటే, ఫోన్లు లాగేసుకోవడం, ఇంటర్నెట్ కట్ చేయడం.. చేయకూడదు. ∙ పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్లపై మీరూ ఆసక్తి చూపండి. ∙కొన్ని పరిమితులను సెట్ చేయడానికి కంటెంట్ ఫిల్టర్ సాఫ్ట్వేర్లను వాడచ్చు. ∙పడకగది, భోజన సమయం, ప్రయాణంలో.. ఇంటర్నెట్ను వాడద్దని కుటుంబమంతటికీ పరిమితిని నిర్ణయంచండి. ∙ఆన్లైన్లో ఏ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయ కూడదో/ఓవర్షేర్ చేయకూడదో తప్పనిసరిగా నేర్పించాలి. ∙ఆఫ్ స్క్రీన్ సమయం, ఆన్‌స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పాలి. ∙వయసు పరిమితులు (ఉదా: 18 ఏళ్లు) ఉన్న సైట్లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దు. అవసరం, అవగాహన లేని సమాచారం ఇవ్వాలనుకోకూడదు. పెద్దలు వేసుకోదగిన ప్రశ్నలు ► మీ పిల్లలు ఆన్లైన్ ద్వారా ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎందుకు జరుపుతున్నారో, ఈ పరస్పరచర్య నుండి వారు ఏం పొందుతున్నారో .. తెలుసుకోవడం ముఖ్యం. ► ఆన్లైన్లో ఏ సమాచారం గురించి వెతుకుతున్నారు. అందుకు వారు ఉపయోగించే సాధనాలు ఏమిటి, వాటి మూలాలు ఏమిటి.. తనిఖీ చేయడం అవసరం. ► మీ డిజిటల్ కార్యకలాపాల మంచి, చెడు తెలిసే విధానం ఏమిటి, వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ∙పిల్లలు తమ చుట్టూ ఉన్నంత సురక్షితంగా, ఆన్లైన్ వేదికల్లో ఉన్నారా. ఈ తరహా డిజిటల్ శ్రేయస్సుపై అవగాహన, అభ్యాసం ఎప్పుడూ ఆగిపోకూడదు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
Cyber Crime: అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది..
శిరీష (పేరు మార్చడమైంది) నిద్రలేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. కాసేపు ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ చూసి, విసుగనిపించి గదిలోనుంచి బయటకు వచ్చేసింది. నెల రోజులుగా ఇదే తంతు. చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉంటే గడిచే రోజులు కావు. ఆలోచిస్తూనే తల్లి ఇచ్చిన టిఫిన్‌ను ముగించి, తిరిగి ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్ కావడంతో ఎవరై ఉంటారనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. ఆ వచ్చిన ఫోన్ కాల్‌తో శిరీష్ ముఖం వెలిగిపోయింది. ఆన్లైన్లో వచ్చిన జాబ్ ఆఫర్‌కి రాత్రే అప్లై చేసింది. తెల్లవారుజామునే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యినట్టు ఫోన్ వచ్చింది. నాలుగు రోజులు గడిచాయి. ఎంత పిలిచినా శిరీష గది దాటి రావడం లేదు. దాంతో తల్లే తన గదిలోకి వెళ్లి భోజనం పెట్టి వస్తూ ఉంది. ‘ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడ్డావు. ఇప్పుడేమయ్యింది. ఇలా ఎందుకున్నావ్’ అంటూ తల్లి అడుగుతూనే ఉంది. కానీ, శిరీష మౌనంగా ఉంటోంది. ‘ఉద్యోగం లేదన్నారేమో.. అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది’ అనుకుంటూ.. కూతురును సముదాయించింది తల్లి. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన తల్లికి ఉరేసుకుంటూ కనిపించిన కూతుర్ని చూసి గుండెలదిరాయి. భర్తను లేపి, శిరీషను ముప్పు నుంచి తప్పించింది. విషయమేంటని నిలదీస్తే.. శిరీష చెప్పింది విని తల్లీతండ్రి తలలు పట్టుకున్నారు. పర్సనల్ ఫొటోలు పంపిస్తే.. ఫోన్ ఇంటర్వ్యూలోనే జాబ్‌కి ఎంపిక చేస్తారని రవి (పేరు మార్చడమైంది) అనే వ్యక్తి రోజూ ఫోన్ చేస్తుండేవాడు. కాల్ వచ్చిన ప్రతీసారి రిప్లై ఇవ్వమంటూ కోరాడు. చేసేది ఫ్రంట్ ఆఫీస్ జాబ్ కాబట్టి, అందంగా ఉండాలని చెప్పేవాడు. శిరీష అందంగా హీరోయిన్గా ఉండటం వల్లే ఈ జాబ్‌కి ఎంపిక చేసినట్టుగా చెప్పేవాడు. తక్కువ వ్యవధిలో బాగా తెలిసిన వ్యక్తిలా ఫోన్లోనే పరిచయం పెంచుకున్నాడు రవి. పర్సనల్ ఫొటోలు షేర్చేయమని చెప్పాడు. జాబ్ వస్తుందనే గ్యారెంటీ మీద రవి మీద నమ్మకంతో అతడు అడిగిన విధంగా ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేసింది శిరీష. ఆ మరుసటి రోజు నుంచే ఫొటోలను అడ్డు పెట్టుకొని రవి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శిరీష పంపించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో విధి లేక అతను అడిగిన డబ్బును కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చింది. కానీ, ఇంటి పరిస్థితి బాగోలేకపోవడం, తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వాళ్లేమవుతారో అని భయపడి చనిపోదామని నిర్ణయించుకుంది. 16 రాష్ట్రాలు.. 600 మంది యువతులు రిక్రూటర్‌గా నటించి దేశవ్యాప్తంగా 600 మంది మహిళలను మోసం చేసిన చెన్నైకి చెందిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. రాజ్ చెజియాన్ అనే వ్యక్తి రిక్రూటర్‌గా నటించి, 16 రాష్ట్రాలకు చెందిన యువతులను ఆకర్షించి, ఉద్యోగం నెపంతో వారి నగ్న, ప్రైవేట్ చిత్రాలను అతనితో పంచుకునేలా చేశాడు. ఎంక్వైరీలో మోసపోయిన యువతుల్లో హైదరాబాద్ నుండి కూడా 60 మంది ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. అతను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం మహిళలు అప్లై చేసుకున్న పోర్టల్‌ను చూసేవాడు. మహిళా ఉద్యోగుల అప్లికేషన్లు పెరుగుతుండటం గ్రహించి, ఈ పథకం వేశాడు. తప్పుడు పేరుతో ఫోన్ కాల్స్.. చేజియాన్ ఫైవ్ స్టార్ హోటల్ డైరెక్టర్ ప్రదీప్‌గా నటిస్తూ యువతులకు ఫోన్ కాల్స్ చేసేవాడు. మహిళలను ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ నుండి పిలుపు కోసం ఎదురుచూడమని చెప్పేవాడు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం కాబట్టి అభ్యర్థి శరీర ఆకృతి గురించి సంస్థ నిబంధనలు పొందిపరిచి ఉందని, అందుకు వాట్సాప్ ద్వారా మహిళలను పలు కోణాల నుండి నగ్న చిత్రాలను పంచుకోవాలని కోరేవాడు. వీడియో కాల్ చేసి, సదరు మహిళను నగ్నంగా ఉండమని, ఆ దృశ్యాలను రికార్డు చేసేవాడు. చివరకు సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్దనున్న ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో మహిళల నగ్న ఫోటోలు భద్రపరచి ఉండటం గమనించారు. ఈ చిత్రాలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. ఉద్యోగ మోసాలు గుర్తించండిలా... ►అర్హత లేకపోయినా సులువుగా ఉద్యోగం ఇస్తాం అనే విషయాన్ని నమ్మకూడదు. ►వర్క్‌ఫ్రమ్ పేరుతో అధిక ఆదాయం ఎర చూపి, అర్హత లేకపోయినా ఇచ్చే ఉద్యోగాలు దాదాపుగా మోసపూరితమైనవే అని గుర్తించాలి. తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు అని అనుమానించాలి. ►సోషల్ మీడియా మోసాలు అధిక ఆదాయానికి బదులుగా కొన్ని సరళమైన పనులు (ఫాలో, లైక్, షేర్, కామెంట్.. వంటివి) చేయటానికి ఆఫర్ ద్వారా బాధితుడు ఆకర్షితుడవుతాడు. ఇది కూడా తగదని గుర్తించాలి. ►కెరీర్ కన్సల్టింగ్ మోసాలలో రెజ్యూమ్ రైటింగ్, ఫార్వర్డింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదా ఇతర వృత్తి సంబంధిత సేవలను ఆఫర్ చేస్తుంటారు. ►ఇంటర్వ్యూ అయిన వెంటనే సదరు ‘ఇంటర్వ్యూయర్’ మిమ్మల్ని సంప్రదించడం, ఆఫర్లు చెప్పడం చేస్తారు. ►ఇ–మెయిళ్ళు, టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అవతలి వారికి షేర్ చేయకూడదు. ►సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగమైనా చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయమని కోరండి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫేండేషన్ ఫౌండర్ -
నేను బతుకుతానో లేదోనని బాధపడ్డారు
సాక్షి, హైదరాబాద్: ‘పాతికేళ్ల కింద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నా కుటుంబంలో తీరని విషాదం నింపింది. హైదరాబాద్‌లో ప్రమాదకర మలుపు వద్ద నా మిత్రుడు కారును డివైడర్‌ను ఎక్కించాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కళ్లు దెబ్బతినడంతో 6 నెలల పాటు చూపు కోల్పోయాను. చాలారోజులు స్పృహలో లేను. చాలా ఆపరేషన్ల తర్వాత నాకు చూపు వచ్చింది. నేను బతుకుతానో లేదో అని నా కుటుంబం తీవ్రఒత్తిడికి గురైంది. నాకు ప్రమాదం జరిగినప్పుడు నా భార్య గర్భవతి. నాకు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆమె ఆరోగ్యంపై పడింది. ఫలితంగా నా కూతురు ‘సెరబ్రెల్ పాల్సి’తో జన్మించింది. 10 ఏళ్ల తరువాత నా కూతురు మరణించింది’ అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన విషాద గతాన్ని వెల్లడించారు. సోమవారం ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని మైదానంలో జరిగిన 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన పువ్వాడ తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో 44 బ్లాక్స్పాట్లు: సీఎస్ అతివేగం, డ్రంకెన్‌డ్రైవ్‌ల కారణంగా అనేక ప్రమాదా లు జరుగుతున్నాయని ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో 44 బ్లాక్స్పాట్లను గుర్తించామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్‌సేఫ్టీ విభాగం ఏడీజీ సందీప్ సాండి ల్య, రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, నగర సీపీ అంజనీకుమార్, సినీ నటి ఈషా రెబ్బా పాల్గొన్నారు. నిర్లక్ష్యం పనికిరాదు ‘పాతికేళ్ల కిందట ఇంతటి అవగాహన లేదు, ఇన్ని సదుపాయాలు లేవు. ఇప్పుడు అలా కాదు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం జర గాల్సిన అవసరముంది..’ అని పువ్వాడ అన్నారు. రోడ్డు మీద నిర్లక్ష్యం పనికిరాదని, మీ నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై అనేక కుటుంబాలు రోడ్డున పడతాయనే విషయం మర్చిపోవద్దని సూచించారు. -
సర్కార్ సొమ్ము బాబుగారి దుబారా
-
నువ్వేం రాణిస్తావన్నారు..?
తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఆమెది ప్రత్యేక స్థానం. తెలంగాణ సాధనలో పురుషులతో సమానంగా ఉద్యమించిన సాహసి. రాజకీయ నేపథ్యం లేకున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్న నాయకురాలు ఆమె. అసెంబ్లీని సజావుగా నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఉపసభాపతి.. ఆమె.. మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి. మహిళగా ఆమె రాజకీయ ప్రస్థానం భావితరాల మహిళలకు స్ఫూర్తిదాయకం. మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయరంగ ప్రవేశం తదితర అంశాలను తెలియజేస్తూనే మహిళా సాధికారత సాధన, స్త్రీ పురుష అసమానతలు, గృహహింస, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తదితర అంశాలపై సాక్షి తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి ప్రజాప్రతినిధులు ఉసన్యాసాలు ఇవ్వడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయినా మహిళ సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు సంబంధించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. మహిళా హక్కుల సాధనలో అమెరికా, యూరప్‌లాంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. మహిళా హక్కుల సాధనలో ఆదేశాల సరసన మనమూ నిలబడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు, మగ పిల్లల మధ్య తల్లిదండ్రులు అసమానతలను చూపించటం నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి. వారి మనోభావాలను గౌరవించాలి. మగ పిల్లలతో సమానంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణం, అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లలు ఎదగటంలో తల్లిదండ్రులతే కీలకపాత్ర. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రగులు గుర్తెరగాలని నా మనవి. అసమానతలు, వివక్షకు గురయ్యే మహిళలు దైర్యంగా ఎదుర్కొని తిప్పకొట్టాల్సిన అవసరం ఉంది. మహిళలు రాజకీయాల్లో రావాలి.. ఆకాశంలో సగ భాగమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోంది. అలాగే రాజకీయరంగంలోనూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజకీయ రంగం అంటరానిదేమి కాదు. చదువుకున్న యువతులు, సామాజిక స్ప్రహా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మహిళలు తమంతట తాము రాజకీయాల్లోకి వచ్చే సానుకూల పరిస్థితులు దేశంలో లేవు. ఈ పరిస్థితి మారాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మహిళలు రాజకీయాల్లోకి రావడం ఆరంభమైంది. ప్రస్తుతం తెలంగాణలోని మహిళా శాసనసభ్యులు తమ నియోజకవర్గ అభివృద్ధికి పాలుపడుతూనే మహిళా సమస్యలపైనా స్పందిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా శాసనసభ్యులు తమవంతు పాత్ర పోషించటం ముదావాహం. ధైర్యం ముందుకు సాగాను మహిళవు నువ్వు రాజకీయాల్లో ఏం రాణిస్తావని మొదట కొంత మంది నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నా భర్త దేవేందర్‌రెడ్డి, మా అమ్మ నన్ను రాజకీయాల్లో ప్రవేశించేలా ప్రోత్సహించారు. రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేను ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. అయినా ఎక్కడా వెరవలేదు. ధైర్యం ముందుకు సాగాను. ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాను. నా పోరాటస్ఫూర్తి నచ్చి ప్రజలను మూడు పర్యాయాలు నన్ను శాసనసభకు పంపారు. ప్రత్యేక మహిళా పోలీస్టేషన్లతో.. మహిళలను గౌరవించాలన్న ఆలోచనను కన్నతల్లి మగపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ‘షీ టీమ్స్’ ఏర్పాటుతో మహిళలపై వేధింపులు, దాడులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్టేషన్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటం సంతోషదాయకం. ప్రతీ ఆడపల్లిను తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం మానుకోవాలి. మహిళలు ఆత్మన్యూనతను వీడి పురుషులతో సమానంగా పోటీ పడాలి. విద్య, ఆర్థిక స్వావలంభనతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ప్రతి ఆడపల్లి ఉన్నత చదువులు చదవాలి. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ధైర్యం నూరిపోయాలి. తెలంగాణ సాధనలోనూ కీలకపాత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మా దేవేందర్ రెడ్డి(ఫైల్ ఫోటో) తెలంగాణ సాధనలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా ఉద్యోగినులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మానసంపదను కాపాడుకోవాలన్న తలంపుతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. బాలింత, బిడ్డ సంక్షేమం కోసం రూ.13వేలు అందజేస్తోంది. ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తోంది. ఆడపిల్లల చదువులకోసం కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నడపుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని, నీటి కష్టాలను తీర్చేందుకు మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉపసభాపతిగా అసెంబ్లీలో నిష్ఫక్షపాతంగా వ్యవహరిస్తాను. మహిళా సభ్యులు మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇస్తాను. -
సప్తవర్ణప్రేమ
కొండాకోనల లోయల్లో ప్రవహిస్తూ అనేక ఆకుపచ్చని వర్ణాలని, పూలసౌగంధాన్ని కమ్ముకొస్తున్న భగీరథి గాలి గోల్డెన్ లిల్లీ పువ్వుల్లోని లోలోపలి రేకుల వొల్తైన పరిమళాన్ని వాగ్దానం చేస్తున్నంత నమ్మకంగా తన చూపులని పదేపదే డిస్టర్బ్ చేస్తుంటే ‘యెవరితను... యెక్కడో చూసినట్టు అనిపిస్తుంది... చిరపరిచిత ముఖం...’ అని తన టైంలైన్ మెమరీని మనసులోనే సెర్చ్ చేస్తుండగా అతను ‘‘యెక్కడ తెలుసా అని ఆలోచిస్తున్నట్టున్నారు? మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్‌మి’’ నవ్వుతూ అన్నాడు.‘‘రోహన్’’ అంది తుళ్ళింత చిరునవ్వుతో.‘‘రైట్... మిహిక’’ నవ్వుతూ అన్నాడతను. ‘‘భలే కలిసాం యీ భగీరథి తీరాన’’ అందామె. ‘‘అవును మీరెప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే వుంటారు. మీ పరిచయమే గమ్మత్తు. ఆ రోజు వుదయం పిక్చర్స్‌ని నా పేజ్‌లో క్యాప్షన్ లేకుండానే పోస్ట్ చేసేశాను. కొన్ని పిక్స్ మేగజైన్కి పంపాలి. సరైన క్యాప్షన్ రావటం లేదు. యింతలో మీరు నా పేజ్‌లో ఆ పిక్స్‌కి కామెంట్ పోస్ట్ చేసారు. భలే నచ్చింది. అదే మొదటిసారి మిమ్మల్ని గమనించటం’’ అన్నాడు రోహన్. ‘‘ఆ రోజు తెల్లార్నే తెలివొచ్చి, యెప్పటిలానే ఫేస్బుక్ వోపెన్ చేసా. సరస్వతీ కుండ్ ట్రెక్కింగ్ వివరాలు అడిగిన తన ఫ్రెండ్‌కి మీ పేజ్ని రిఫర్ చేసిన నా ఫ్రెండ్ కామెంట్ కనిపించింది. నేషనల్ జియోగ్రాఫ్ఫీ మేగజైన్లో ప్రింట్ అయిన మీ ఫోటో వొకటి నాలో స్ట్రాంగ్‌గా ముద్రించుకుపోయింది. వెంటనే మీ పేజ్ చూసా’’ అందామె. ‘‘యేది’’ ఆసక్తిగా అడిగాడు.‘‘పర్వతాల మధ్యనున్న వో నది పారుతూ చిన్నిచిన్ని అలలుగా యెగుస్తున్నప్పుడే అవి ఫ్రీజ్ అయిన ఫొటో. అప్పటివరకు మీకు ఫేస్బుక్లో పేజ్ వుందని తెలీదు. చూస్తే అందులో అదే పిక్చర్‌ని మీరు పెయింట్ చేసి మీ పేజ్‌లో పోస్ట్ చేసారు. అప్పుడే మీ పేజ్ని లైక్ చేసా. అప్పట్నుంచి మీ పేజ్ని తరచూ చూస్తుంటాను’’ ‘‘మీకెందుకు అంతలా నచ్చింది?’’‘‘నిజంగానే గొప్ప క్లిక్. అదీకాకుండా అప్పుడు నేనున్న మెంటల్ కండీషన్ వల్ల కూడా కావొచ్చేమో’’ అందామె.అప్పుడు మీ మెంటల్ కండీషన్ యేంటని అతను అడగకపోవటంతో లైన్ క్రాస్ చెయ్యకూడదనే విషయం అతనికి తెలుసని ఆమె గుర్తించింది. ‘‘పదేపదే మీరెలా యిలా ప్రకృతి వెంట వెళతారు’’ అడిగింది మిహిక. ‘‘బిట్ అఫ్ లక్ అండ్ బిట్ అఫ్ లైట్’’ చిరునవ్వుతో అన్నాడు. ‘యిదిగో యిలా అందంగా చెప్పటం వల్లే యితని పేజ్ తనని యెట్రాక్ట్ చేసింది’ అనుకుంది మిహిక.‘‘మీరు సౌత్ వారా... భాష’’ అడిగాడు. ‘‘తెలుగు’’‘‘నైస్. మాదీ తెలుగే. కానీ పుట్టి పెరిగిందంతా ఢిల్లీ. ఫొటోగ్రఫీ యిష్టం. అదే వృత్తి కూడా. భలే కలిసాం’’ అన్నాడు.‘‘నీలాంగ్ చూడాలని రెండేళ్ళుగా అనుకొంటున్నా. పరీక్షల వెంట పరీక్షలు. అవి రాయకుండా యెప్పుడూ కొండలు యెక్కుతానంటే యింట్లో వొప్పుకోరు. చదువు విషయంలోఅమ్మానాన్నగారు చెప్పినవి కాదనలేను. అదిగో అదే వెహికిల్ అనుకొంటా. వెళుతున్నాను. తిరిగొచ్చాక కలుస్తాను’’ ‘‘యిద్దరం కలిసే చూడబోతున్నాం’’ నవ్వుతూ అన్నాడు.‘‘వావ్... మీతో కలిసి నీలాంగ్ని చూడటం భలే లక్కీ’’ అంది సంబరంగా.యిద్దరూ వెహికిల్‌లో కూర్చున్నారు. వూరిని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళీ వెళ్ళగానే అప్పటివరకు ప్రయాణించిన దారి మొత్తం మారిపోయింది. వెనక్కి చూస్తూ ‘‘అరే... మనమొచ్చిన వూరు ఆ దారి యేమయింది’’ మిహిక ఆశ్చర్యపోతూ అడిగింది.‘‘వొక వూరిని దగ్గరగా ఆనుకొని వున్న యీ ప్రాంతంలో వొక్కసారే యింత మార్పు యెలా సాధ్యమయిందని మొదటిసారొచ్చినప్పుడు నేనూ మీలానే ఆశ్చర్యపోయా. ప్రకృతి యిచ్చేటన్ని అందమైన ఆశ్చర్యాలు యింకెవరికీ సాధ్యం కాదేమో’’ అన్నాడు రోహన్. వో వైపంతా యెత్తుపల్లాల కొండా. మరో వైపు కిందగా ప్రవహిస్తున్న భాగీరథిని చూస్తూ ‘‘నదీ ప్రవాహాన్ని యిలా బండిలో కూర్చుని చూడటం... ప్చ్... నదిని తాకాలి కదా’’ అందామె.ఆమె వైపు నుంచి లోయలోకి కిటికీలోంచి రోహన్ తదేకంగా చూస్తున్నాడు. యింతకు ముందెప్పుడూ చూడని ఆ దారిని బండిలోని వారంతా దిగ్భ్రాంతితో ఆనందంగా చూస్తున్నారు.అతను లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. బండి వేగం మెల్లగా తగ్గి ఆగింది. రోహన్ ఆమెని దిగమన్నాడు. అయోమయంగా చూస్తోన్న ఆమెని దిగమని తొందర చేసాడు. ఆమె దిగింది అంతే అయోమయంతో. బండి ముందుకి వెళ్ళింది. లోయలోకి దిగుతోన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ‘‘యిటెక్కడికి’’ అని అడిగింది. జవాబు చెప్పకుండా నవ్వుతూ వెళ్ళుతోన్న అతన్ని వెంబడించింది. లోయలో నడవటానికి ఆమెకి అతను మధ్యమధ్యలో అవసరమైన చోట చెయ్యి అందించి సహాయపడుతున్నాడు. వాలులో వో చిన్ని మలుపు. మలుపు తిరిగీ తిరగ్గాన్నే భగీరథి.అతని వైపు నిశ్శబ్దంగా చూసిందామె. ‘యెవరితను... తనన్న మాటని సీరియస్‌గా తీసుకొని అతనికున్న అనుభవంతో తనని యీ లోయలోంచి జాగ్రత్తగా నదీ ప్రవాహం దగ్గరకి తీసుకొచ్చాడు. యిలా అర్థం చేసుకొనే వొక తోడు తనతో నిరంతరం వుంటే... కానీ అది అత్యాశ. స్నేహంలో యెంతో అర్థవంతంగా వుండే అబ్బాయిలు తమ జీవితాన్ని పంచుకోడానికి వచ్చే అమ్మాయిని మాత్రం మళ్ళీ అదే పూర్వపు మూస బాటలోనే వుండాలని కోరుకుంటారు. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు అలా కోరుకోరుగా... వాళ్ళ యిష్టాలు, ఆకాంక్షలు, వృత్తి, ప్రవృత్తి యేదీ మార్చుకోమని చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను అడగరు. వాళ్ళని వాళ్ళగానే వుండనిస్తారు’. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అతను చూడకూడదనుకొంటూ అలల వైపు వెళ్ళింది. ఆ సజల నయనాల చెమ్మపొర అతన్ని తాకింది కొత్త చిగురు రహస్య పరిమళంలా. ‘‘వాక్ కి వస్తారా’’ తెల్లార్నే రోహన్ నుంచి మెసేజ్. మిహిక ‘యెస్’ అని మెసేజ్ చేసింది.శరత్కాలపు ప్రారంభపు లేతచలి కొత్త ప్రేమలా తనువుల్ని స్పర్శిస్తుంటే నిలువెత్తు కొండల సమూహం నుంచి వారిద్దరు నడుస్తున్నారు. కర్పూర పరిమళం అంతటా ఆవరించేట్టు అతని శ్వాస ఆమెని కమ్ముకొంటుంటే ‘‘మీకే రంగు యిష్టం’’ అని మిహిక అడిగింది.‘‘ఆర్టిస్ట్‌ని అడగాల్సిన ప్రశ్నేనా? వున్న మూడు వర్ణాలన్నేయిష్టపడతాను. నా ప్రపంచాన్ని ఆ బేసిక్ రంగులోంచే చూస్తాను’’ కొంటెగా అన్నాడు రోహన్. ‘‘యీ వూరొచ్చిన ప్రతిసారి యీ రోడ్లో వీలైనప్పుడంతా వాక్‌కి వస్తా. యిక్కడికి వచ్చిన వాళ్ళు పరిచయం అవుతారుగా. వాళ్ళల్లో కాస్త యింట్రస్టింగ్గా వున్నవాళ్ళని వాక్‌కి రమ్మంటాను. యీ దారి చూపించొచ్చని’’ అన్నాడు. ‘‘వో... అయితే యింట్రస్టింగ్గా వున్నానా?’’ కుతూహలంగా అడిగింది.‘‘అస్సలు లేరు’’ చిలిపి అల్లరి అతని స్వరంలో. ‘‘లేనా?’’ అలిగిన చూపులతో, ‘‘మరెందుకు రమ్మన్నారు’’ అంది. ‘‘నాకు లేళ్ళలంటే భయం. తోడుంటారని’’ సీరియస్‌గా అన్నాడు.ఆమె చప్పున నవ్వేస్తూ ‘‘నాకూ భయమే... సో రాంగ్ ఛాయిస్’’ అంది.‘‘నో నెవ్వర్... మారథాన్ ప్రేమికుడిని కదా. అపరిచిత దారుల్లో యెదురైన వాళ్ళని అంచనా వెయ్యటంలో యెప్పుడో కానీ పొరపాటు చెయ్యను’’ అన్నాడు. ఆమె నవ్వి ‘‘సో కాన్ఫిడెంట్’’ అంది.తరువాత నిశ్శబ్దం. మౌనంగా నడుస్తున్నారు. ఆ నడక వుల్లాసంగా, శాంతిగా అనిపించటం, వొకరి సమక్షం మరొకరికి నచ్చటం వల్లేనని యిద్దరికీ తట్టింది. నడుస్తూనే వున్నారు. సాయంకాలం కాబోతోన్న వేళ రోహన్‌ని వెతుక్కుంటూ హోటల్ ముందున్న గార్డెన్ రెస్టారెంట్లోకి వచ్చింది మిహిక. గుండ్రని టేబుల్ మీద లాప్టాప్. పక్కనే కాఫీ కప్. పని చేసుకొంటున్నాడు. అతని యెదురుగా నిలబడిన ఆమె వైపు తలెత్తి చూడకుండానే ‘టీ’ అడిగాడు.‘‘మీరేదో పనిలో వున్నట్టున్నారు’’ అంది.‘‘నిన్నటి పిక్చర్స్ మేగజైన్కి పంపిస్తున్నా... విత్ రైట్ అప్’’ అన్నాడు.‘‘మీ పని అయ్యాక వుదయం నడిచిన దారిలో నడుద్దాం. వస్తారా’’ అడిగింది.‘‘మళ్ళీ నడుస్తారా... మళ్ళీ అదే దారిలో యెందుకు నడవాలనిపిస్తుంది?’’‘‘న్యూ సూపర్ మూన్ కోసం’’అతను తలెత్తి ఆమె వైపు చూసేలోగ ‘‘యే మిహిక... వాట్ యే ప్లెసెంట్ సర్ప్రైజ్’’ çసంతోషంతో దాదాపు అరుస్తున్నట్టే మిహికని పలరించింది కోమలి. రోహన్‌ని కోమలికి మిహిక పరిచయం చేసింది. వాళ్ళిద్దరినీ అడిగి వాళ్ళకోసం గ్రీన్ టీని రోహన్ ఆర్డర్ చేశాడు. యీ మధ్య చేసిన ప్రయాణాలు, యిప్పుడు నీలాంగ్ చూడటానికి వచ్చిన విషయం చెపుతూ ‘‘మా యిద్దరం యూత్ హాస్టల్ వాళ్ళు యేర్పాటు చేసిన ట్రెక్కింగ్‌లో రెండుసార్లు కలిసాం. ఆ తరువాత మళ్ళీ యిప్పుడే కలవటం. ఫేస్బుక్ ఫ్రెండ్స్‌మే కానీ యిప్పటివరకు వొక్కసారి కూడా చాట్ చెయ్యలేదు. గత కొన్నాళ్ళుగా నా చాట్ టైం అంతా నా బ్రేకప్స్ గురించి మాటాడుకోడానికే అయిపోతోంది’’ చిన్న నిట్టూర్పుతో అంది కోమలి. మిహిక చిన్నగా నవ్వింది. ‘‘అవును... అప్పుడెప్పుడో యెంగేజ్మెంట్ పిక్స్ అభయ్ పోస్ట్ చేసాడు కదా... పెళ్లి యెప్పుడు’’ కోమలి ఆ పిక్స్‌ను గుర్తుచేసుకొంటూ మిహికాని అడిగింది.‘‘బ్రేకప్’’‘‘వో సారి...’’ నొచ్చుకొంటూ అంది కోమలి.‘‘యెందుకు?’’‘‘పెయిన్ఫుల్ కదా’’‘‘పర్సనల్ విషయాలు పోస్ట్ చెయ్యటం నాకలవాటు లేదు. కానీ అభయ్‌కి అలాంటి పట్టింపులేదు. ఆ పిక్స్‌ని అభయ్ పబ్లిక్ పోస్ట్ చేస్తూ నాకు ట్యాగ్ చేసారు. నా టైంలైన్లోకి నే అలో చెయ్యలేదు. అభయ్ వొక్కరే కాదు, ఆ యీవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు వొక్కరని కాదు అంతా పిక్స్ పోస్ట్ చేసారు. కొద్ది మంది మధ్యే వుండాల్సిన పర్సనల్ విషయాలు అలా ప్రపంచమంతా తిరిగాయి. అంతా బాగుంటే అన్నీ బానే వుంటాయి. కానీ యేదైనా తేడా వస్తే అందరికీ సమాధానం చెప్పుకోవాలి. అభయ్ నీ ఫేస్బుక్ ఫ్రెండ్ కదా?’’ అడిగింది మిహిక.‘‘అవును. అతని స్టేటస్ యిప్పుడేం వుందో నే గమనించ లేదు’’ అంటూ ఫోన్లో ఎఫ్బీ చూస్తూ ‘‘అసలు బ్రేకప్స్ యెలాయెలా అవుతాయో తెలుసుకోవటం నాకలవాటుగా మారిపోయింది. మూడు బ్రేకప్‌లు నావి. రెండు నే చెప్పా. వొకటి అతను చెప్పాడు. వొక్కోసారి వొక్కో కారణం. అవి చెపితే యిందుకే విడిపోతారా అంటారు యిళ్ళల్లో, చుట్టూ వున్న పెద్దవాళ్ళు. కానీ అది మనకి విడిపోయేంత పెద్ద విషయమే. యింతకీ నీ బ్రేకప్‌కి కారణం?’’ కుతూహలంగా అడిగింది కోమలి. ఆమె భలే నిర్మొహమాటమైన మనిషి. యే విషయాన్నైనా సూటిగానే అడుగుతుంది. వాళ్ళిద్దరూ పూర్తిగా వ్యక్తిగత సంభాషణలో మునిగిపోవటం చూసి తన పని తను చేసుకొంటూనే రోహన్ కాస్త తటపటాయింపుగా కుర్చీలో కదిలాడు. అక్కడ నుంచి వెళ్ళితే బాగుంటుందని ‘‘యెక్స్ క్యూజ్ మీ’’ అన్నాడు. ‘‘నో యిష్యూస్... కాసేపే... నే వెళ్లిపోవాలి... కూర్చోండి’’ హడావిడిగా అంది కోమలి. ‘రోహన్ ముందు యివి మాటాడటం యెంత వరకు సమంజసం?’ అని ఆలోచిస్తూనే ‘అంత మాటాడకూడని విషయం కూడా కాదు కదా... అయినా తనకి లోపలెక్కడో తన విషయాలు అతనికి చెప్పాలనే కోరికా వున్నట్టే వుంది’ అనుకొంది మిహిక. ‘‘మా అమ్మగారు, అభయ్ అమ్మగారు చిన్నప్పుడు క్లాస్మేట్స్. హైస్కూల్‌కి వచ్చాక విడిపోయారు. చాలా సంవత్సరాల తరువాత ఎఫ్‌బిలో కలిసారు. అభయ్ ట్రావెల్ ఛానల్లో దేశదేశాల టూరిస్ట్ ప్లేసెస్‌పై కథనాలు యిస్తారు. అలా వాళ్ళు మా యిద్దరి పెళ్లి మాటలు మాటాడారు. మమ్మల్ని అడిగారు. వొకే అన్నాం. మూడాలని, మంచి ముహూర్తాలని చివరికి యెంగేజ్మెంట్ అయిన ఆరు నెలల తరువాత పెళ్లి ముహూర్తం పెట్టారు. నేనో ట్రెక్కింగ్‌కి వెళ్ళే ముందు, ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వున్నా. వీడియో కాల్ చెయ్యనా’ అని అభయ్ పంపిన మెసేజ్ వచ్చింది. నేను ఫుల్ యెక్సైటెడ్. అలా రియల్ టైంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసా. మాటల్లో ట్రెక్కింగ్‌కి వెళుతున్నానని చెప్పా. ‘‘లాస్ట్ ట్రెక్కింగ్ కదా. యెంజాయ్’’ అన్నారు అభయ్. అర్థం కాలేదు. కాస్త అయోమయంగా అనిపించింది. అప్పుడు అతను పనిలో వున్నాడు. మాటాడటం వీలుకాలేదు’’ అని ఆగింది మిహిక.కాసేపు నిశ్శబ్దం. ‘‘వూ... తరువాత’’ అడిగింది కోమలి.‘‘వీలుచూసుకొని అభయ్‌తో మాటాడితే నాకు ట్రావెలింగ్ యిష్టం. దానినే వృత్తిగా యెంచుకొన్నా. నీది పేషన్. పెళ్లి అయ్యాక నువ్వు వొకే చోట వుండే వుద్యోగం చేస్తావు కదా. నేను పని మీద వెళ్లి వచ్చే సరికి నువ్వు యింట్లో వుండాలి. అలానే నేను పని మీద బయటకి వెళ్ళినప్పుడూ నువ్వే యిల్లు చూసుకోవాలి కదా. యింక నీకు ట్రెక్కింగ్‌కి వెళ్ళే అవకాశం వుండదని అలా అన్నానన్నారు అభయ్’’‘‘పెళ్లి తరువాత ట్రెక్కింగ్ మానాలని అనుకోలేదు. అదీకాక దానినే కెరీర్‌గా తీసుకోవాలని వుందని చెప్పా. మరి నువ్వు యంబియే చదువుతున్నావ్గా అన్నారు అభయ్. మా అమ్మగారికి నేను యంబియే చెయ్యాలనే కోరిక. తనపై ప్రేమతో చదువుతున్నా, ఆ డిగ్రీతో వుద్యోగం చెయ్యాలని మా అమ్మగారు అడిగినా చెయ్యను. నా ఆసక్తి పర్వతాల్ని యెక్కటమే. యెక్కించటమే అని చెప్పాను అతనికి. 24/7 హోం పార్ట్నర్ అభయ్‌కి కావాలి. నేనలా వుండలేనని బ్రేకప్’’ అంది మిహిక.‘‘ప్చ్... మనకి పెళ్ళికి ముందు యేవేవి మాటాడుకోవాలో తెలిసే అనుభవం పెద్దగా వుండదు. పెళ్ళి తరువాత వాళ్ళని వాళ్ళలానే వొప్పుకోడానికి మనం, స్టీరియోటైప్నే సహజం అనుకోడానికి అలవాటు పడి వుంటారు వాళ్ళు. చాలా విషయాలు వాళ్ళు, మనం కూడా టేకిట్ గ్రాంటెడ్గానే చూస్తామనుకుంటా. గ్లాడ్... ముందే తెలిసింది. లేకపోతే మీరిద్దరూ చాలా హింస పడేవాళ్ళు. యిప్పుడు నీ స్టేటస్?’’ అడిగింది కోమలి. ‘‘సింగిల్. ఆ డిస్టర్బెన్స్ భయం కూడా పూర్తిగా పోలేదు’’ అంది మిహిక.‘‘మూవాన్ మిహిక. నే మా గ్రూప్‌తో బయటకి వెళ్ళే ప్రోగ్రాం వుంది. బై’’ అని కోమలి వెళ్ళిపోయింది. తామిద్దరి మధ్యా నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ‘‘సూపర్ మూన్ చూడాలన్నారు’’ అన్నాడు రోహన్. యిద్దరూ బయలుదేరారు. అవే చెట్లు. అవే కొండలు. అదే దారి. కానీ వుదయం వున్న వెలుగు లేదు. లేత చీకటి. యిద్దరి శ్వాసకి తమతమ మొహమాటపు సెగ తగుల్తూనే వుంది. ‘కానీ యిదంతా తన భ్రమాస్వప్నమేమో... ఆమెకి స్నేహానికి మించిన ఆసక్తి లేదేమో... మేల్ అండ్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ తనకి తెలుసు. యిప్పుడు తనే ముందు చొరవ చూపించి కొన్ని విషయాలు మాటాడితే ఆమెని డిస్టబ్ చేసినవాడినవుతానా’ అనే బాధ్యతపు తెరలో వుక్కిరిబిక్కిరవుతున్నాడు రోహన్. ‘యిదంతా మేల్ ఫ్రెండ్షిప్ ఫీలింగ్‌లా లేదు. అతని సాహచర్యాన్ని, సాన్నిధ్యాన్ని తను కోరుకుంటుందా... అదెలా సాధ్యం. నిన్న కనిపించిన అతను తనని యెందుకిలా కమ్ము కొంటున్నారు’ ఆలోచనలే ఆలోచనలు మిహికలో.గూళ్ళల్లో సర్దుకొని నిద్రలోకి జారుకున్నాయేమో... పక్షుల స్వర అలికిడి మెల్లగా మాయమయింది.‘యెలాంటి లైఫ్ పార్ట్నర్æ కావాలని ఆలోచించినప్పుడు చాలా అనుకున్నా. యిద్దరి ఆకాంక్షలు వొకటయి తనతో పాటు ప్రయాణించే అమ్మాయి కావాలని... యిలా యేవేవో అనుకున్నా. అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు. కానీ కోమలి, మిహిక సంభాషణ చాలా విషయాల్లో తనకి కాస్త మెరుగైన స్పష్టత నిచ్చాయి’ ఆలోచిస్తూ నడుస్తోన్న రోహన్ చుట్టూ చూస్తూ తనలోకి తాను తరిచి చూసుకొంటున్నాడు.మౌనంగా నడుస్తోన్న మిహికాకి తను అతన్ని అడగాలనుకొన్న విషయం గుర్తొచ్చి ‘‘యింతకీ మీకు ఫోటోగ్రఫీ యిష్టమా, పెయింటింగ్ యిష్టమా’’ అని చప్పున ఆసక్తిగా అడిగింది.ఆలోచనల నుంచి బయటకి వచ్చి ఆమెని కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ ‘‘యెందుకు’’ అని రోహన్ అడిగాడు. ‘‘ఘనీభవించిన చిన్నిచిన్ని మంచు అలలన్ని ఫోటో తీసారు కదా... తిరిగి ఆ ఫొటోనే పెయింట్ చేసారుగా. వొకే విజువల్న్ని రెండు ఫామ్స్‌లో క్రియేట్ చేసినప్పుడు మీ మనసుకు యేది దగ్గరగా వుంటుందనే క్యూరియాసిటీ’’ అందామె. ‘‘వొకే విజువల్‌ని తిరిగి క్రియేట్ చెయ్యటం చూసారు కదా... అందులో మీకేది బాగా నచ్చింది’’ అని అడిగాడు. ‘‘చిక్కు ప్రశ్నే. దేని అస్తిత్వం దానిదే. రెండూ నచ్చాయి’’‘‘రీ క్రియేట్ చెయ్యటంలో యేదీ మిస్ కాలేదా?’’‘‘నాకలా అనిపించలేదు. దేనికదే బాగుంది’’ ‘‘జీవితం కూడా దేనికదే బాగుంటుంది. మీరెందుకా విషయాన్ని ఆలోచించరు’’ అని నిదానంగా అడిగాడు.చిలకరించబోయిన రంగులు మాయమైపోయిన ఖాళీ కాన్వాస్‌లా వొక్కసారే ఆమె పెదవులపై నవ్వులు బోసిపోయాయి. అతనికి తెలుసు యిది ఆమె వూహించని ప్రశ్న అని. ఆమె మాటాడటానికి సమయం పడుతుందని.యిదేమిటి యిలా అడిగేసారు... యెందుకడిగుంటారు... అనే ఆలోచనలు ఆమెని ముసురుకొన్నాయి.మెల్లమెల్లగా వికసిస్తున్న పూర్ణబింబం. అతనివైపు చూసింది. వెన్నెల చిమ్ముతోన్న కళ్ళు. మోహపు వెచ్చదనంతో మత్తిల్లిన చూపులని రెప్పల కింద దాచుకొంటూ కనురెప్పలు వాల్చిందామె. రసైక శ్వాస జనించిన మహత్తర క్షణమది. వొకరిలోకొకరు యేకం కావాలనే సౌందర్య జ్వాల చెలరేగకుండా జాగ్రత్త పడుతూ ‘‘నేను నాలానే వుండాలనుకొంటున్నా’’ అందామె. ‘‘నేనూ నాలానే వుండాలనుకొంటున్నా’’ అన్నాడతను. ‘‘మరి మనిద్దరం యెలా కలిసి వుండగలం’’ అడిగిందామె.‘‘యిద్దరం యిద్దరిలానే వుంటూనే వొక్కరిలా కూడా కలిసి వుండొచ్చేమో’’ అన్నాడతను.పక్కపక్కనే నడుస్తున్నారు. ఆమె అప్రయత్నంగా అతని చేతిని అందుకొంది. తమలపాకుల మెత్తదనపు గిలిగింత అతని చేతుల్లో. అతని చేతి చుట్టూ బిగుసుకొంటున్న ఆమె చేతివేళ్ళు. సాన్నిధ్యపు స్పర్శా వెచ్చదనాన్ని ఆమె చేతివేళ్ళకి పరిచయం చేస్తున్నాడతను. స్పర్శ మాత్రమే సత్యం.‘‘యిప్పుడీ పూలశిఖరం పక్కనుండగా ట్రెక్కింగ్ అనే ఆలోచనే నన్ను ప్రతిరోజూ యెవరెస్ట్పై వుంచుతుంది. థాంక్ యూ మిహిక’’‘‘నిజంగా నన్ను నన్నులా వుండనిస్తారా... మరోలా అనుకోకండి... కాస్త దెబ్బతిని వున్నా కదా... అప్పుడే మీ మంచు అలల పిక్ చూసింది... నా మానసిక స్థితికి ప్రతి రూపంగా అనిపించిందా పిక్’’ అంది కాస్త ముఖం పైకెత్తి. వసంతతుమ్మెదలా సుకుమారంగా తన పెదవులని ఆమె మల్లెమొగ్గ పెదవులపై ఆన్చబోతూ ‘‘మీకేమైనా అభ్యంతరమా?’’ అడిగాడు రోహన్.‘చాలామంది జ్ఞానవంతులు తాము చెప్పేవి, రాసేవి అనేక విషయాలని తమ మససులోకి, నడవడిలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోరు. అవి తమని మహావ్యక్తులుగా నిలబెట్టటమే వారికి కావాల్సింది. రోజువారి జీవితంలో యింటా బయటా అన్ని రకాల అసూయరాజకీయాలని నిర్మోహమాటంగా ప్రదర్శిస్తూనే వుంటారు’ అనుకుంటూ ఆమె అతనివైపు గౌరవంగా చూస్తూ – ‘ప్రతికూల వాతావరణంలో అనుకూల వాతావరణం వచ్చేవరకు సహనంగా, ధైర్యంగా యెదురు చూడటం ట్రెక్కింగ్ చేసేవారి శ్వాసలో మమేకం అయిపోతుంది. అతనా విషయాన్ని తన అంతరంగ ఆకాంక్షకీ అనువదించుకొన్నాడు. యిటువంటి వ్యక్తిని తను యెందుకు వదులుకోవాలి...’ అనుకుంటూ ఆమె అతనికి మరింత చేరువగా వచ్చి, అతని భుజాల చుట్టూ తన రెండు చేతుల్నీ వేసి, అతని కుడి బుగ్గమీద ముద్దు పెట్టింది.మంచు వెన్నెల తేటగా, ఆ విశాల కొండల మైదానంలో చుక్కలాకాశం కింద వారి పంచేంద్రియాల సప్తవర్ణప్రేమ మోహపూలయేరులై వారివారి హృదయాలలో ప్రవహించాయి మృదుస్థిమితంగా. - కుప్పిలి పద్మ -
అందుబాటులోకి పర్సనల్ థియేటర్
-
థియేటర్లోకి తలదూర్చి సినిమాను చూడొచ్చు..
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లలో నచ్చిన సినిమాలను చూడడం నేడు చాలా మందికి అలవాటు. వెలుతురు మధ్య కళ్లు చిట్లించుకొని తదేకంగా చూడడం వల్ల కళ్లే కాకుండా మెడ నరాలు నొప్పి లేస్తాయి. మొబైల్ ఫోన్‌ను పట్టుకొని చేతులు లాగుతుంటాయి. ఇలాంటి బాధలు లేకుండా సినిమాను బాగా చూడడానికి, బాగా ఎంజయ్ చేయడానికి చిన్న పాప్ థియేటర్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ థియేటర్లో సినిమా చూడాలంటే కాళ్లు చాపుకుని పడుకునేంత స్థలం కావాలి. గుండ్రటి డ్రమ్స్ ఆకృతిలో నల్లటి దుస్తులతో ఈ పాప్ థియేటర్ ఉంటుంది. థియేటర్పైన మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఆ చిన్న థియేటర్లోకి తలదూర్చి సినిమాను చూసేందుకు ఏర్పాటు ఉంటుంది. థియేటర్ ఎఫెక్ట్ రావడానికి అదనంగా సౌండ్ బాక్సులు, వాటిని ఆపరేట్ చేసేందుకు ఓ రిమోట్ ఉంటుంది. ఈ థియేటర్‌ను మడిచి చంకలోనో, బ్యాగులోనే పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా ఓ యూనివర్శిటీ విద్యార్థి తయారు చేశారు. దీన్ని పెద్ద ఎత్తున మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఈ థియేటర్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు. -
ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం అవాస్తవం
-పర్సనల్‌లా జాగృతిసభలో ముస్లిం ప్రముఖులు రాజమహేంద్రవరం కల్చరల్ : ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం వాస్తవదూరమని జమాతె ఇస్లామీ హింద్ జాతీయ సలహామండలి సభ్యుడు సయ్యద్ అమీనుల్ హసన్ పేర్కొన్నారు. జమాతె ఇస్లామీ హింద్, నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనం కళాకేంద్రంలో జరిగిన ముస్లిం పర్సనల్‌లా జాగృతిసభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లిం వివాహాలలో వరుడు వధువుకు వివాహసమయంలో అందరి ఎదుటా ‘మెహెర్’ రూపేణా పెద్ద మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుందన్నారు. నాటినుంచి భార్య సంరక్షణ బాధ్యత తనదేనని భర్త అందరిఎదుటా చెప్పడం ఒక లక్ష్యమైతే, ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు విడిపోతే, మెహెర్ ఒక విధమైన సామాజిక భద్రతను కలిగించడం మరోలక్ష్యమని అన్నారు. వివాహానికి ముందు వధువు తండ్రి కుమార్తెకు వివాహం సమ్మతమవునో, కాదో తెలుసుకోవాలని ముస్లిం పర్సనల్ లా చెబుతుందన్నారు. 2011 సెన్సస్ ప్రకారం ముస్లింలలో తలాఖ్ ద్వారా విడాకులు పొందినవారి శాతం 0.5 శాతం కాగా, హిందువులలో ఇది 3.7 శాతం ఉందన్నారు. భార్యాభర్తలమధ్య తేడాలు వస్తే, ముస్లిం పెద్దలు పరిష్కారం చేస్తారని, ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదని అన్నారు. మహిళావిభాగం జాతీయ కార్యదర్శి డాక్టర్ అతియా సిద్ధిఖి సాహెబా మాట్లాడుతూ ముస్లిం పర్సనల్ లాపై అవగాహన కలిగించేందుకు గతనెల 23నుంచి ఈనెల 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామన్నారు. దివ్యఖురాన్లో ప్రవక్త చెప్పిన అంశాలను మార్చడం తగని పని అని అన్నారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకుడు మహ్మద్ అరీఫ్ మాట్లాడుతూ భర్త మద్యానికి బానిస అయినా, కనపడకపోయినా, ఖులా ద్వారా భార్య కూడా విడాకులు పొందే వెసులుబాటు ఇస్లాం కల్పించిందని తెలిపారు. మహమ్మద్ రఫీక్, ఇందాదుల్లాహుస్సేన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఇంతజార్ అహమ్మద్, రిజ్వాన్ఖాస్మిసాహెబ్, మెహఫిజ్ రెహమాన్, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’
రాజమహేంద్రవరం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమం ఆదివారం నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జమాతె ఇస్లామీ హింద్ నాయకుడు మహ్మద్ రఫీద్ వెల్లడించారు. ఇటీవల తరచు ముస్లిం పర్సనల్ లా, తలాక్ వంటి విషయాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో మొసలికన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు ఈ జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. మేధావులను, మానతావాదులను కలసి పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. బహిరంగసభలు, కరపత్రాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. ముస్లింలు వివాహం, విడాకులు, ఆస్తిపంపకాలు, మనోవర్తి తదితర అంశాలకు ప్రాతిపదిక బ్రిటిష్ ప్రభుత్వం 1937లో చేసిన షరీయత్ అప్లికేషన్ చట్టమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ముస్లిం పర్సనల్ లాలోని అంశాలకు మూలం మానవనిర్మిత చట్టాలు కావని, సృష్టికర్త ఉపదేశం ప్రకారమే రూపొందించనవని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న ఉమ్మడిపౌరసత్వం గురించి పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగం 25,26 అధికరణాలలో ఇచ్చిన సమానత్వం గురించి, మత స్వేచ్ఛను గురించి మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశంతో జరిగిన విడాకులు మొత్తం విడాకులలో 0.05 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు మే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జమాతె ఇస్లామీ హింద్ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పర్సనల్‌లాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, ముస్లిం పర్సనల్ లాపై సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ముస్లిం ప్రముఖులు ఆవిష్కరించారు. ముస్లిం పర్సనల్‌లా విషయంలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో ముస్లిం మహిళలు తెలిపారు. జమాతె ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ముస్తాఫా షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అన్సార్ అహమ్మద్, ది యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్‌ఖాన్, వివిధ మసీదుల అధ్యక్షులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
రెండు రోజుల సెలవులో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రెండు రోజుల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. సోమవారం సాయంత్రమే ఆయన కర్నూలు నుంచి బయలుదేరి కాకినాడకు వెళ్లినట్లు సమాచారం. మంగళ, బుధవారాల్లో జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారు. -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది. -
తలాక్ పద్ధతిపై ముస్లిం మహిళల పోరాటం!
న్యూఢిల్లీః తలాక్ సిస్టమ్ ను తొలగించాలంటూ దేశంలోని ఏభై వేలకుపైగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. మూడుసార్లు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా లోని ఆచారానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటివరకూ సుమారు 50 వేల సంతకాలు సేకరించారు. భారతీయ ముస్లిం మహిళల (బీఎంఎంఏ) సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని కోరుతూ పోరాటం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్ కు మద్దతివ్వాలని కోరుతున్న సంఘం.. జాతీయ మహిళా కమిషన్ కూడ తమకు సహకరించాలని, ముస్లిం మతంలో ఉన్న తలాక్ పద్ధతి నిషేధించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పిటిషన్ కు మద్దతుకోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకులు జికియా సోమన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏభై వేల సంతకాలు సేకరించామని, మతంలోని కొందరు పురుషులు సైతం తమకు మద్దతిస్తున్నారని అన్నారు. ముస్లిం మతంలోని తలాక్ పద్ధతిపై చేపట్టిన సర్వేలో 90 శాతం పైగా మహిళలు తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమకు మద్దతునిచ్చేవారినుంచి మరిన్ని సంతకాలు సేకరించి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంస్థ సభ్యురాలు నూర్జహా సాఫియా తెలిపారు. ఖురాన్ లో కూడ ఎక్కడా ఇటువంటి తలాక్ పద్ధతి అమల్లో ఉన్న దాఖలాలు లేవని, నేషనల్ ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ లలిత కుమార మంగళమ్ కు పంపించే లేఖలో కూడ బీఎంఎంఏ పేర్కొంది. ఈ విషయంలో ముస్టిం మత పెద్దలను, అధికారులను సైతం కలసి, దేశంలో ఇతర మహిళలకు అమలౌతున్న న్యాయమైన నిబంధనలే తమకు అమలయ్యేట్లు కోరుతామని బీఎంఎంఏ పేర్కొంది. అయితే ముస్లిం పర్సనల్ లా ను పూర్తిగా మార్చాలంటే సమయం పడుతుందని, కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో లక్షలమంది ముస్టిం మహిళలకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తమ పోరాటాన్ని కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారని, వారు తలాక్ ను అల్లా విధించిన చట్టంగా నమ్ముతారని మహిళలు అంటున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. -
ఇల్లు మారుతున్నారా?
బదిలీల వేళ... ప్రత్యేక కథనం.. బదిలీల కాలం షురూ అయింది. స్కూళ్లు తిరిగి తెరిచేలోపల బదిలీ అయిన చోట స్థిరపడాలన్నది ఉద్యోగుల ఉద్దేశం. అందుకోసం ఇల్లు వెతుక్కోవటం, సరైనది ఎంచుకుని అడ్వాన్సివ్వటం అన్నీ ఒకెత్తయితే... ఉన్న ఇంటి నుంచి ఆ ఇంటికి సామాన్లు చేరవేయటం, అక్కడ సర్దుకోవటం మరో ఎత్తు. ఉన్న ఊళ్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి... ఒక ఊరి నుంచి మరో ఊరికి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి... ఇలా దూరం పెరిగేకొద్దీ కష్టాలూ పెరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి ఏ అమరావతికో వెళ్లాలంటే రాష్ట్రం మారినట్లే. కాకపోతే వాహనాల రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేకపోవటం వంటి అంశాలు కలిసొస్తాయి. ఇతర రాష్ట్రాలు అయితే ఈ కష్టాలూ తోడవుతాయి. ఈ నేపథ్యంలో... ఇల్లు మారేటపుడు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాల్ని వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం * సరైన ప్యాకర్స్ను వెతకటంతో పని షురూ * గ్యాస్ నుంచి బ్యాంకు ఖాతా వరకూ బదిలీ తప్పనిసరి * చాలా పనులు ఆన్లైన్లోనే ముగించుకోవచ్చు రవి ఇటీవలే బదిలీ అయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మారాడు. రవి అనుభవం ఆయన మాటల్లోనే... ‘‘మొదట ఇల్లు, పాపకు స్కూలు చూసుకున్నా. తరవాత బాగా తెలిసిన ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ను సంప్రదించా. వారు నా వ్యాగన్-ఆర్ కారుతో కలిపి ఫర్నిచర్ అంతటినీ మొదట అంచనా వేసుకుని... 24 గంటల్లో తర లించేశారు. చార్జీలు రూ.35 వేల వరకూ అయ్యాయి. కొత్త ప్రాంతానికి వచ్చాక మొబైల్ నంబరు మార్చలేదు. బ్యాంకు, పెట్టుబడులు, బీమా సంస్థల మార్పు సులభంగా జరిగింది. కానీ కొంత సమయం పట్టింది. బ్యాంకులో అడ్రస్‌ను అప్డేట్ చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ పొందవచ్చు’’ అయితే దీనికోసం ముందుగా రవి ఏమేం చూసుకున్నాడో తెలుసా...!! ఎంపిక: సామాన్లను భద్రంగా చేరవేయడానికి మొదట నమ్మకమైన ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను ఎంచుకోవాలి. తెలిసిన సంస్థో, మిత్రులు రిఫర్ చేసిన సంస్థో అయితే చార్జీలు, భద్రత విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. చార్జీలు: సామాన్లు తరలించటమే ప్రధానం. అసలు కొత్త ఇంటికయ్యే అద్దె, పిల్లల స్కూల్ అడ్మిషన్ చార్జీలు వంటి వాటికంటే సామగ్రిని తరలించడానికయ్యే మొత్తమే కాస్త ఎక్కువగా ఉంటుంది. తరలింపునకయ్యే ఖర్చుల్లో ప్రధానంగా 60-70 శాతం రవాణాకు, 20-25 శాతం ప్యాకింగ్‌కు, మిగతాది సామాన్లను లోడ్, అన్లోడ్ చేయడానికి, కొత్త ఇంట్లో సర్దడానికి అవుతుంది. ఉంటున్న నగరం పరిధిలోనే మారితే రవాణా ఖర్చు 80 శాతం ఉంటుంది. ప్యాకింగ్ ఖర్చు తగ్గుతుంది. సున్నితమైన వస్తువులుంటే మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువుల పరిమాణం, తరలించాల్సిన దూరం బట్టి సిటీ పరిధిలో అయితే సగటున రూ.6 వేల దాకా అవుతుంది. వేరే ప్రాంతాలకైతే రూ.35 వేలపైనే అవుతుంది. అనుకోని కారణాల రీత్యా తరలింపు సమయంలో ప్రమాదం జరిగితే బీమా వెసులుబాటు కూడా ఉంది. అన్ని రకాల ఘటనలకూ వర్తించే ఈ బీమా ఆప్షనల్ మాత్రమే. కటింగ్ ధర: ఇల్లు మారేటపుడు వ్యయమే ప్రధాన సమస్య. అవసరంలేని పాత ఫర్నిచర్‌ను అమ్మేయటం ద్వారా సమస్య కొంత తీరుతుంది. పాత ఇనుము, స్టీలును విక్రయించినా కొంత సొమ్ము వస్తుంది. దీనివల్ల ఫర్నిచర్ తరలించటానికి మొత్తం ట్రక్కును బుక్ చేసుకోవాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది సామగ్రిని వేరొక భాగస్వామితో కలిసి తరలించొచ్చు. ‘‘ కానీ షేరింగ్ వల్ల ఫర్నిచర్‌ను చేరవేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై మధ్య రవాణాకు నాలుగు రోజుల సమయం పడితే, షేరింగ్ వల్ల అదే దూరానికి 10-12 రోజుల సమయం పడుతుంది’’ అని పీఎం రీలొకేషన్స్ సీఈవో, చైర్మన్ ఆకాంక్ష భార్గవ చెప్పారు. వారాంతపు రోజుల్లో కంటే వారం మధ్యలో రవాణాకు కొన్ని సంస్థలు తక్కువ చార్జీ వసూలు చేస్తున్నాయి. నెలలో చివరి శనివారమైతే బుకింగ్‌లు ఎక్కువగా ఉంటాయి కనక చార్జీలూ అధికంగానే ఉంటాయి. బ్యాంకింగ్, పెట్టుబడులు, బీమా: క్రెడిట్ కార్డుంటే కంపెనీకి అడ్రస్ మారుతున్నట్లు తెలియజేయాలి. బ్యాంకయితే హోం బ్రాంచ్‌ను మార్చాల్సిందిగా సంబంధిత బ్యాంకు అధికారులను కోరాలి. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది తప్పనిసరి. సొంత బ్రాంచ్‌కి వెళ్లి మారుతున్న అడ్రస్ వివరాలు వెల్లడిస్తే చాలు. పెట్టుబడులు, బీమాలకైతే సంబంధిత సంస్థలకు నూతన అడ్రస్ పత్రాలను అందించాలి. మొబైల్ ఫోన్, డీటీహెచ్: వేరే రాష్ట్రానికి మొబైల్ నంబరు మార్చాలనుకుంటే ముందు బకాయిలు చెల్లించి, సర్వీసు ప్రొవైడర్‌కు వెరిఫికేషన్ కోసం అడ్రస్, ఇతర పత్రాలను అందజేయాలి. కొత్త సిటీకి నంబరు మారడానికి కొంత సమయం పడుతుంది. ఇదే విధంగా డీటీహెచ్ ను కూడా తరలించవచ్చు. కనెక్షన్ తొలగించటానికైనా, కొత్త కనెక్షన్ కోసమైనా రూ.300-400 ఖర్చు అవుతుంది. మరి కారు తీసుకెళ్లాలంటే...? కార్లను డ్రైవ్ చెయ్యకుండా రవాణా చేసుకోవాలంటే ఆ అవకాశమూ ఉంటుంది. అయితే ఎస్యూవీలకైతే ఉదాహరణకు బెంగళూరు- ఢిల్లీ మధ్య తరలించ టానికి రూ.18-20 వేలు ఖర్చవుతుంది. చిన్న కార్లకైతే రూ.10-13 వేలు వ్యయమవుతుంది. అయితే రాష్ట్రం మారినపుడు ఆ వాహనాన్ని స్థానిక ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇదంతా గజిబిజి ప్రక్రియ. దానికంటే వాహనాన్ని అమ్మేయడమే ఉత్తమం. ఒకవేళ కారు గనక రుణం తీసుకుని కొన్నదైతే... రెండు, మూడేళ్ల కన్నా పాతదైతే ఎంట్రీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వంటి అదనపు పన్నులు చెల్లించాలి. మహారాష్ట్ర వంటి చోట్లయితే 8 రకాల పన్నులు వసూలు చేస్తారు. అత్యవసర సామగ్రి వంట గ్యాస్‌కు సంబంధించి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే తొలగించాలి. అలా తొలగించినపుడు బకాయిలన్నీ చెల్లించి... సదరు కంపెనీ దగ్గర లిఖితపూర్వకంగా రసీదు తీసుకోవాలి. ఒకవేళ సిలిండర్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ అయితే... ఒరిజినల్ సబ్ స్క్రిప్షన్ వోచర్‌తో పాటు రెగ్యులేటర్, సిలిండర్‌ను అప్పటిదాకా సిలిండర్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్‌కు అందజేయాలి. టెర్మినేషన్ వోచర్, రిఫండబుల్ డి పాజిట్ రూ.1,450 వెనక్కి తీసుకోవాలి. కొత్త ప్రాంతంలో సదరు టెర్మినేషన్ వోచర్‌ను, అడ్రస్ వివరాలను స్థానిక పంపిణీదారుడికి అందజేయాలి. సెక్యూరిటీ కోసం మళ్లీ రూ. 1,450 , రెగ్యులేటర్ కోసం రూ. 150 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
APPకీ కహానీ... స్పెండీ
పర్సనల్ ఫైనాన్షియల్ కార్యకలాపాలను మేనేజ్ చేయడానికి ఈ ‘స్పెండీ’ చక్కగా పనికొస్తుంది. ఇది యూజర్ల ఆదాయ, వ్యయాలను విశ్లేషిస్తుంది. వారు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ ఎక్కువ ఖర్చులవుతున్నాయి? తదితర అంశాల్ని తెలియజేస్తూ మార్గదర్శకత్వం చేస్తుంది. అనువైన ఇంటర్ఫేస్, చక్కని ఇన్ఫోగ్రాఫిక్స్ ఈ యాప్ సొంతం. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు - రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే దీన్ని వాడుకోవచ్చు - యూజర్ల అభిరుచులకు అనువైన ఆప్షన్లు - భిన్నమైన అవసరాలకు తగ్గట్టు పలు రకాల వాలెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిక్కొంత ప్రీమియం (నెలకు 2 డాలర్లు, ఏడాదికి 15 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాలెట్‌నూ మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు కూడా. - చేసే ప్రతి చెల్లింపూ ఏ ప్రదేశంలో చేస్తున్నామనేది యాడ్ చేసుకోవచ్చు. - మీరు ఒకవేళ ప్రతి నెలా ఒకరికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉందనుకోండి. ఈ విషయాన్ని మీరు యాప్ రిమైండర్లో పెట్టుకోవచ్చు. - ఈ వారంలో, ఈ నెలలో, మూడు నెలల్లో, ఏడాదిలో ఎంత మొత్తాన్ని ఖర్చు చేశామనే విషయాలను ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు. -
గూగుల్ స్థానంలో ‘భువన్’
భువన్ మ్యాప్‌ల ఆధారంగా పేదల ఇళ్లకు జియో ట్యాగింగ్ ఆధార్‌తోనూ ఇళ్ల వివరాలను అనుసంధానించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గూగుల్ మ్యాప్‌లకు బదులు దేశీయంగా రూపొందించిన భౌగోళిక సమాచార వ్యవస్థ ‘భువన్’ను ఇకపై విస్తృతంగా వినియోగించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశ భౌగోళిక సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) తయారు చేసిన ‘భువన్’ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వ పథకాలను భువన్ మ్యాపులతో అనుసంధానించే ప్రక్రియ మొదలవుతోంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల వివరాలను ఈ పోర్టల్ ఆధారంగా ‘జియో ట్యాగింగ్’ చేయబోతున్నా రు. ప్రతి ఇల్లు ఉన్న ప్రదేశాన్ని ఆక్షాంశరేఖాంశాల ఆధారంగా గుర్తించి ఈ ప్రక్రియను చేపడతారు. సర్వే నంబర్, లబ్ధిదారుడి ఫొటో, వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తి మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సీఐడీ విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ‘భువన్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించడంతో గూగుల్ సాఫ్ట్‌వేర్‌ను పక్కనబెట్టనున్నారు. ఒక్కో ఇంటి వివరాలను జియో ట్యాగింగ్‌లో నమోదు చేయడానికి రూ. 27 చొప్పున ప్రైవేట్ సంస్థకు చెల్లించాల్సి వస్తుండటంతో.. ఇకపై సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. జియో ట్యాగింగ్ చేసే ప్రతి ఇంటి వివరాలను ఆధార్ తోనూ అనుసంధానించాలని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను పాత పథకం కిందనే పూర్తి చేయాలని, రెండు పడకగదుల ఇళ్ల పథకాన్ని కొత్త దరఖాస్తులతో ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి సూచించారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన స్వగృహ ఇళ్ల ధరలను తగ్గించాలన్నారు. జవహర్‌నగర్ ప్రాజెక్టులోని ఇళ్లను సీఆర్పీఎఫ్కు కేటాయించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం
ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత విషయూలని అంటోంది నటి పార్వతి మీనన్. ఈ మలయాళి కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయినా ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం అప్పట్లో గ్లామర్‌కు అంగీకరించక పోవడం, ఈత దుస్తులు ధరించను లాంటి పలు షరతులు విధించడ. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడి దరిదాపులకు పోలేదని టాక్ ప్రచారంలో ఉంది. ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కమల్‌హాసన్ సరసన ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి పార్వతి వెల్లడిస్తూ ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని తెలిపింది. కమల్‌హాసన్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవమని పేర్కొంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అంది. మరియాన్ చిత్రంలో తన నటనకు పలువురి ప్రశంసలు లభించాయని పేర్కొంది. ధనుష్ మంచి నటుడని కితాబిచ్చింది. ఆయనను సహ కళాకారుడిగానే భావించి కలిసి నటించానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే ఈ సోషల్ నెట్వర్క్ అంటే తనకు అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది. ఇటీవలే ఫేల్బుక్లో చేరానని చెప్పింది. అందులో అనవసర విషయాలకు తావివ్వకుండా తన సినిమాల వివరాలు, ఫొటోలను మాత్రమే పోస్టు చేస్తానని తెలిపింది. ఎవరినైనా ప్రేమిం చారా అన్న ప్రశ్నకు ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత విషయాలని, సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పింది. మంచి అవకాశాలు లభించకపోతే ఖాళీగా కూర్చుంటానని పేర్కొం ది. ఎన్ని చిత్రాల చేశామన్నది ముఖ్యం కాదని, పది కాలాలు గుర్తుండిపోయే పాత్ర లు చెయ్యాలని ఆశిస్తున్నానని పార్వతి అం టోంది.