మొబైల్ ఫోన్లలో నచ్చిన సినిమాలను చూడడం నేడు చాలా మందికి అలవాటు. వెలుతురు మధ్య కళ్లు చిట్లించుకొని తదేకంగా చూడడం వల్ల కళ్లే కాకుండా మెడ నరాలు నొప్పి లేస్తాయి. మొబైల్ ఫోన్‌ను పట్టుకొని చేతులు లాగుతుంటాయి. ఇలాంటి బాధలు లేకుండా సినిమాను బాగా చూడడానికి, బాగా ఎంజయ్ చేయడానికి చిన్న పాప్ థియేటర్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే కాళ్లు చాపుకుని పడుకునేంత స్థలం కావాలి.