ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం | Love, wedding, personal | Sakshi
Sakshi News home page

ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం

Published Tue, Oct 14 2014 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం - Sakshi

ప్రేమ, పెళ్లి వ్యక్తిగతం

 ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత విషయూలని అంటోంది నటి పార్వతి మీనన్. ఈ మలయాళి కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయినా ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం అప్పట్లో గ్లామర్‌కు అంగీకరించక పోవడం, ఈత దుస్తులు ధరించను లాంటి పలు షరతులు విధించడ. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడి దరిదాపులకు పోలేదని టాక్ ప్రచారంలో ఉంది. ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కమల్‌హాసన్ సరసన ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం లభించింది.
 
 ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి పార్వతి వెల్లడిస్తూ ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని తెలిపింది. కమల్‌హాసన్‌తో కలిసి నటించడం  చాలా మంచి అనుభవమని పేర్కొంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అంది. మరియాన్ చిత్రంలో తన నటనకు పలువురి ప్రశంసలు లభించాయని పేర్కొంది. ధనుష్ మంచి నటుడని కితాబిచ్చింది. ఆయనను సహ కళాకారుడిగానే భావించి కలిసి నటించానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే ఈ సోషల్ నెట్‌వర్క్ అంటే తనకు అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది.
 
 ఇటీవలే ఫేల్‌బుక్‌లో చేరానని చెప్పింది. అందులో అనవసర విషయాలకు తావివ్వకుండా తన సినిమాల వివరాలు, ఫొటోలను మాత్రమే పోస్టు చేస్తానని తెలిపింది. ఎవరినైనా ప్రేమిం చారా అన్న ప్రశ్నకు ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత విషయాలని, సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పింది. మంచి అవకాశాలు లభించకపోతే ఖాళీగా కూర్చుంటానని పేర్కొం ది. ఎన్ని చిత్రాల చేశామన్నది ముఖ్యం కాదని, పది కాలాలు గుర్తుండిపోయే పాత్ర లు చెయ్యాలని ఆశిస్తున్నానని పార్వతి అం టోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement