
బైక్ నడుపుతున్న పువ్వాడ. చిత్రంలో సినీనటి ఈషా రెబ్బా
సాక్షి, హైదరాబాద్: ‘పాతికేళ్ల కింద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నా కుటుంబంలో తీరని విషాదం నింపింది. హైదరాబాద్‌లో ప్రమాదకర మలుపు వద్ద నా మిత్రుడు కారును డివైడర్‌ను ఎక్కించాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కళ్లు దెబ్బతినడంతో 6 నెలల పాటు చూపు కోల్పోయాను. చాలారోజులు స్పృహలో లేను. చాలా ఆపరేషన్ల తర్వాత నాకు చూపు వచ్చింది. నేను బతుకుతానో లేదో అని నా కుటుంబం తీవ్రఒత్తిడికి గురైంది.
నాకు ప్రమాదం జరిగినప్పుడు నా భార్య గర్భవతి. నాకు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆమె ఆరోగ్యంపై పడింది. ఫలితంగా నా కూతురు ‘సెరబ్రెల్ పాల్సి’తో జన్మించింది. 10 ఏళ్ల తరువాత నా కూతురు మరణించింది’ అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన విషాద గతాన్ని వెల్లడించారు. సోమవారం ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని మైదానంలో జరిగిన 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన పువ్వాడ తన అనుభవాలను పంచుకున్నారు.
రాష్ట్రంలో 44 బ్లాక్‌స్పాట్లు: సీఎస్
అతివేగం, డ్రంకెన్‌డ్రైవ్‌ల కారణంగా అనేక ప్రమాదా లు జరుగుతున్నాయని ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో 44 బ్లాక్‌స్పాట్లను గుర్తించామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్‌సేఫ్టీ విభాగం ఏడీజీ సందీప్ సాండి ల్య, రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, నగర సీపీ అంజనీకుమార్, సినీ నటి ఈషా రెబ్బా పాల్గొన్నారు.
నిర్లక్ష్యం పనికిరాదు
‘పాతికేళ్ల కిందట ఇంతటి అవగాహన లేదు, ఇన్ని సదుపాయాలు లేవు. ఇప్పుడు అలా కాదు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం జర గాల్సిన అవసరముంది..’ అని పువ్వాడ అన్నారు. రోడ్డు మీద నిర్లక్ష్యం పనికిరాదని, మీ నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై అనేక కుటుంబాలు రోడ్డున పడతాయనే విషయం మర్చిపోవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment