puvvada ajay kumar
-
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడంతో తెలంగాణ అధోగతి పాలైంది. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. సీఎం నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని ప్రతీ పనికి సంబంధించిన కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నాయి. కాంట్రాక్టుల మంత్రి ఇచ్చే కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక కారణాలతోనే బీఆర్ఎస్కు నష్టం‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అసాధారణ అభివృద్ధి జరిగినా అక్కడి ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వరదల సమయంలో ప్రజలకు పైసా ఉపయోగ పడలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా ఏడాది కాలంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.ఈ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది’ అని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.కేసీఆర్ పుట్టిన రోజున ‘వృక్షార్చన’బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రతీ ఒక్కరూ మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వృక్షార్చన’ పేరిట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు. -
కాంగ్రెస్ వల్లే ఖమ్మం వరదలు: పువ్వాడ అజయ్
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్‌లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్‌కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్‌కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్‌కుమార్ మండిపడ్డారు. -
పువ్వాడపై రాళ్ల దాడి..
-
ఖమ్మంలో ఎవరిదో పైచేయి?
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్‌ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్‌కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
అది నాకు సెంటిమెంట్.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ముస్లిం, మైనార్టీ సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లింల కోసం సీఎం రూ. 32 వందల కోట్లు ఖర్చు చేశారని.. అదే ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షలు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద వాడి కోసం పని చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని అన్నారు. షాదీముబారక్‌తో ముస్లిం మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. ‘నా తమ్ముడు అజయ్, ఆయన 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాడు. నా తమ్ముడికి తోడుగా మీరంతా ఉండాలి. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. హైదరాబాద్ వ్యక్తులు వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందింది. పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన నిధులు అడుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీవి మొత్తం మాటలే. ముసలి పార్టీని పట్టించుకునే వాడు లేడు. వీల్ చైర్లో తిరిగే ముసలి వాడు మీకు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా నిర్ణయించుకోండి. చదవండి: తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నియోజకవర్గం పట్ల అతనికి ఉన్న నిబద్దత ఇంకా ఎవరికి లేదు. ముస్లిం, క్రిస్టియన్లు ఇరువురు అన్నా దమ్ములు వారి పండుగ మేము, మా పండుగ వారు జరుపుకుంటారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు మీ ఓటు వృథా చేయకుండా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అజయ్ అన్నకు మరోసారి అవకాశం ఇవ్వండి. పోయినసారి కంటే భారీ మెజార్టీతో నా తమ్ముడు పువ్వాడ అజయ్‌ను గెలిపించండి’ అని హోంమంత్రి కోరారు. 2018 నవంబర్‌లో ఖమ్మం ప్రాంతంలో పెట్టిన మైనార్టీ సభ తనకు సెంటిమెంట్ సభ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. ఆయన వస్తే గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోందన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్ గుండెల్లో పదిలలంగా ఉంటుందన్నారు. -
తెలంగాణలో ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి: అజయ్
-
ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం పట్టుకుని తన నామినేషన్ తిరస్కరింపజేయాలని కుట్ర పన్నాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ధీరోదా త్తుడు ఽధైర్యంగా పోరాడుతాడని, పిరికివాడు వెన్నుపోటు పొడవాలని చూస్తాడని ఎద్దేవా చేశారు. 2014లో తనపై ఓడిపోయినప్పుడు, గత ఎన్నికల్లో పాలేరులో ఉపేందర్‌రెడ్డిపై కూడా ఇలాగే అధర్మ పోరాటం చేసినా విజయం దక్కలేదని తెలిపారు. ఇకనైనా ఆయన పిచ్చి ప్రయత్నాలు మానుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలి కారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తన నామినేషన్లో అన్ని వివరాలు పూర్తి చేశానని పువ్వాడ తెలిపారు. ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే స్క్రూటినీ రోజు ఉదయమే నోటీసు ఇస్తారని, అలాంటేదేమీ ఆర్ఓ నుంచి తనకు అందలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కాలమ్‌లో డిపెండెంట్ 1, 2, 3లో తనపై ఆధారపడే పిల్లలు ఎవరూ లేరని పేర్కొన్నానని, తన కుమారుడి వివాహమై ఉద్యోగం చేస్తున్నందునే అలా వెల్లడించానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కామారెడ్డి, కొడంగల్‌లో సమర్పించిన అఫిడవిట్లలో పోలీస్ కేసులు చెప్పాల్సిన ఫార్మెట్ మూడు బాక్సుల్లో, ఏడు బాక్సుల్లో వివరాలు రాశారని తెలిపారు. అఫిడవిట్లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరికై నా అపోహలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అసత్య ఆరోపణలను తుమ్మల ఇకనైనా మానుకోవాలని, ప్రజలు కూడా గుర్తించి ధర్మం వైపు నిలబడాలని పువ్వాడ కోరారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, మార్కెట్, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త గుండాల కృష్ణతోపాటు బచ్చు విజయ్‌కుమార్, శీలంశెట్టి వీరభద్రం, పగడాల నాగరాజు, ఖమర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..! -
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
హాట్ సీట్.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్!
వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్‌గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి. అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్‌కుమార్ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. -
నేనే గెలుస్తా..హ్యాట్రిక్ తీస్తా..
-
తుమ్మలపై పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్
-
మాజీ బాస్ సంఘీభావం చెప్పడానికి టీడీపీ ఆఫీస్‌కు తుమ్మల
-
తుమ్మల.. నీ వల్ల తెలంగాణ రాలేదు: మంత్రి పువ్వాడ ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి పువ్వాడ అజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదు. తుమ్మల నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం. గత ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికి తుమ్మల రిటైర్ అయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు తుమ్మల. నువ్వు లేకపోతే తెలంగాణ రాలేదా?. నీ వల్ల తెలంగాణ రాలేదు ఈ విషయం గుర్తు పెట్టకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వేమైనా సీఎంవా తుమ్మల? ఇదే సమయంలో, తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవు. టికెట్లు ఇప్పించడానికి నువ్వేమైనా పార్టీ అధినేతవా లేక ముఖ్యమంత్రివా?. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధ రహితం. కందాలకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం. మమతా ఆసుపత్రి మా కష్టార్జితం. కేటీఆర్, అజయ్‌లు గుండెలు కోసుకునేతం మిత్రులం. నీ ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వే పార్టీలు ఫిరాయించావు. ముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్‌లో చేరావు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి భక్త రామదాసును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తుమ్మల మనసాక్షికి తెలుసు.. మరోవైపు.. నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలకు కౌంటరిచ్చారు. శనివారం నామా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు దీవించారు. తుమ్మల గురించి ముఖ్యమంత్రి వందకు వంద శాతం నిజం చెప్పారు. తుమ్మల మనసాక్షికి అది తెలుసు. కేసీఆర్ నన్ను పిలిచి మరీ ఎంపీని చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. అందుకే నాకు ఎంపీ సీటు ఇచ్చారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అది కూడా నీ అకౌంట్లో వేసుకోవాలని చూస్తున్నావా తుమ్మల. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నా గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు. మా నాయకులు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నావ్. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకో’ అని అన్నారు. చర్చకు సిద్దమా.. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాపై ఆరోపణలు చేసే ముందు రుజువులు చూపించంది. అప్పుడు పాలేరు నుండి పోటీలో తప్పుకుంటాను. దీని కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో నో టికెట్.. పార్టీ మార్పుపై విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
తండ్రీ కొడుకు.. భిన్న నేపథ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌కు తండ్రీకొడుకు రెండేసిసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు గెలిచిన పువ్వాడ 1989లో పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.దుర్గానర్సింహారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో సీపీఐ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జహీర్‌అలీ మహ్మద్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మూడోసారి బరిలో అజయ్ పువ్వాడ అజయ్‌కుమార్ 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి..టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల మెజారిట్టీతో గెలిచారు. 2018లోఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ చరిత్రలో మంత్రి పదవి సైతం పువ్వాడ అజయ్కుమార్నే వరించింది. -
తుమ్మల వర్సెస్ పువ్వాడ..
వారంతా సీనియర్ నాయకులే. అనేక యుద్ధముల ఆరితేరినవారే. పలుసార్లు విజయం సాధించినవారే. ఇప్పుడందరికీ తాజా ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఓడితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలకు తాజా ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయనే చెప్పాలి. ఓడినవారికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీలక నేతలకు ఈ ఎన్నికలు రాజకీయంగా డూ ఆర్ డై అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తన 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో గెలుపే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ప్రచారంకు వెళ్లుతున్నారు తుమ్మల. ఇక జిల్లాలో మరో కీలక నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొటీ చేసి ఓడిపోయి.. పక్క నియోజకవర్గంకు వెళ్ళి అక్కడా ఓడిపోయిన నేత ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు పేరెత్తకుండా సెటైర్లు వేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ప్రజలు విజ్ణతతో ఆలోచించాలని కోరుతున్నారు మంత్రి అజయ్ కుమార్. ఖమ్మం నియోజకవర్గంలో 2 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు చేశానని చెప్పుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారయని చెప్పాలి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మొదటి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో..పాలేరు నియోజకవర్గంలో విజయం కోసం తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. పొంగులేటికి తోడుగా ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడ పాలేరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్‌రెడ్డి తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కందాల బీఆర్ఎస్ తరపున పాలేరు బరిలో దిగారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెంది...ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..ఇప్పటికే మొదటి విడత ప్రచారం సైతం పూర్తి చేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్‌లో ఉండే నేత భట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధిర నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిన విక్రమార్క నాలుగోసారి గెలవడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. కాని భారీ మెజారిటీ సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. భట్టి విక్కమార్కకు గతంలో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు మధిరలో భట్టిపై పోటీ చేసి ఇప్పటికి మూడుసార్లు ఓడిపోయిన ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మూడు సార్లు ఓడినా గులాబీ బాస్ నాలుగోసారి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా కమల్ రాజ్ ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుంది. అందుకే లింగాల కనకరాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగోసారైనా గెలిపించండని ప్రజల్ని ప్రాధేయపడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయని చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లోని ఆ నేతలు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. -
తుమ్మల ఫైర్.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అజయ్ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు.. -
కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
-
KCR అధికారంలోకి రాగానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు
-
అదే జరిగితే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయేమో!: పువ్వాడ
సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం మహిళ రిజర్వడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అయితయేమోనని అన్నారు. ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచిమెవరిని నిలబెట్టనని అన్నారు. పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు .మహిళల కోసం మనమంత ముందు పడాలని.. కేటిఆర్ చెప్పినట్లు తన స్థానం త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాను వదిలిపెట్టేది లేదన్నారు. ఎవరెవరో వచ్చి దండాలు పెట్టి మళ్లీ మాయమైపోతారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఖమ్మం అభివృద్దిని సాదుకోవాలో చంపుకోవాలో మీరు డిసైడ్ చేయండి. గతంలో ఇక్కడ గెలిపించిన ఏవరైన సరే రెండవసారి ఖమ్మంలో ఉండే ప్రయత్నం చేయలేదు. ఏవరిని గెలిపించిన అటో ఇటో చూసి పారిపోయారు. కాని అజయ్ అన్న మాత్రం ఇక్కడే ఉన్నాడు. కళ్లబొల్లి మాటలు చెప్పేవారు ఎన్నికలపుడే వస్తారు. ఎన్నికలు అయిపోతే మాయమైపోతారు. నిత్యం మీ వెంట ఉండేది అజయ్ అన్న మాత్రమే. మూడవసారి నన్ను గెలిపించుకొని మళ్లీ 5 ఏళ్లు మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ -
చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా
సాక్షి, ఖమ్మం, సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని మున్యానాయక్ తండాలో గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్త భానోతు రవి తాను కొనుగోలు చేసిన ఆటో ప్రారంభించాలని మంత్రిని కోరారు. వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి ఆటో నడుపుతూ శంకుస్థాపన చేయనున్న ఇంటి వరకు వెళ్లారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెయిట్ లిఫ్టింగ్ బార్‌ను సరదాగా ఎత్తి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. -
ఓడినా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నుంచి పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ కష్టపడి గెలిపించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తాను తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకసారి ఖమ్మం, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన తనది కాదని, తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తనతో పాటు ఖమ్మం ఎంపీగా, లోక్‌సభా పక్ష నాయకులుగా నామా నాగేశ్వరరావుకు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొండబాల కోటేశ్వరరావుకు, ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజకు.. ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తమకు ఎవరు మేలు చేశారో ఈ సామాజికవర్గం వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
TS Election 2023: గత ప్రభుత్వాలు ఖమ్మాన్ని పట్టించుకోలేదు!
ఖమ్మం: ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన ఆర్టీసీకి చెందిన 1.7 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఏసీ కన్వెన్షన్ హాల్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 72 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖమ్మంలో మరో బస్టాండ్ నిర్మాణానికి ఆలోచన చేయలేదని, నాటి పాలకులు, ప్రజాప్రతినిధులు దాని ఊసే ఎత్తలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తాను రవాణా శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత బస్టాండ్ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమించానని, కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టినా.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా బస్టాండ్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొందరు వస్తున్నారని, మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపుతామని, బంగాళాఖాతంలో కలుపుతామని మాట్లాడుతున్న వ్యక్తి ఖమ్మంలో ఏ ఒక్క అభివృద్ధి పనికై నా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. ఎక్కడైనా శిలాఫలకంపై ఆయన పేరు ఉందా అన్నారు. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడ వామపక్ష అభ్యుదయ భావాలతో ప్రజలు ఉన్నారని, వారంతా ఆలోచించాలని కోరారు. మంత్రిగా నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నామని, మరోసారి అవకాశం వస్తే మరింతగా అభివృద్ధి చేసే వీలు కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో రెండో ఆర్టీసీ కన్వెన్షన్ హాల్.. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన 1.7 ఎకరాల్లో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ హాల్ రాష్ట్రంలోనే రెండోదని మంత్రి పువ్వాడ అన్నారు. హైదరాబాద్‌లో కన్వెన్సన్ హాల్ ఉన్నా.. అది నాన్ ఏసీ అన్నారు. 2 వేల మంది కూర్చునేలా ఈ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సంస్థపై భారం తగ్గించేందుకు ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, సర్కారు ఖజానా నుంచి వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకుంటున్నారని కొందరు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఆస్తులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఒక్క ఖమ్మంలోనే నూతన బస్టాండ్ నిర్మాణం ద్వారా రూ.200 కోట్ల ఆస్తి సమకూరిందని, ఇక కన్వెన్షన్ హాల్ ద్వారా మరో రూ.100 కోట్ల ఆస్తి సమకూరనుందని తెలిపారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కరీంనగర్ ఈడీ వినోద్‌కుమార్, ఈడీ కమర్షియల్ కృష్ణకాంత్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమ జొహరా, ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
హాట్రిక్‌పై పువ్వాడ కన్ను.. ఖమ్మంలో రసవత్తర పోటీ!
ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హట్‌టాపిక్‌గా మారనుంది. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి పార్టీలు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా. 2004లో సిపిఏం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా ఆ తర్వాత టీఆర్ఏస్‌లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశం : ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరోవైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీసెంటర్ కాల్వడ్డు వంటి ప్రాంతాలను వర్షపు నీరు ముంచేత్తుతుంది. కాలనీలు చెరువులను తలపించే పరిస్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతు వస్తున్నారు...ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు కోరుతున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్లేదు. దీంతో 3 టౌన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి.. స్థానికంగా కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.. అంతేకాదు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న టాక్ సైతం లోకల్ గా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు అన్న ప్రచారం సైతం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చుపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్‌తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్‌తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్‌కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22కోట్ల రూపాయలతో లకారం ట్యాంక్ బండ్, 8కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు..తీగల వంతెన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 21కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, 25కోట్ల రూపాయలతో ఐటీ హబ్, 110 కోట్ల రూపాయలతో గొల్లపాడు ఛానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు. నూతన కార్పొరేషన్ భవనాన్ని ర్మించారు. దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం మూడు లక్షల పదకొండు వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సమాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఏక్కువగా ఉంటాయి. సిపిఏం, సిపిఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గం లో బలంగా ఉన్నాయి..అయితే వచ్చే ఎన్నికల్లో బీఅరెఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలో ఏవరితో పోత్తు పెట్టుకుంటారన్నది ఇంకా క్లారిటీ లేదు..వీరు ఏటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి కొంత కమ్యూనిస్ట్ ల ఓట్లు ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.. ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఖమ్మం సీటుపై కీలక నేతలు గురిపెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన పోటీ నెలకోనే అవకాశం ఉంది. ఇప్పిటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కే మరోసారి టికెట్ కట్టబెట్టింది. దాంతో ఆయన హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన డికొనడానికి కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు పొంగులేటి. పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నారట. అటు జావిద్ కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద టికెట్ ఆశిస్తున్నారు. వృత్తిపరంగా ఓటర్లు : పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఏక్కువగా ఉంటారు. రఘనాథపాలెం మండలంలో రైతులు ఏక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతు ఉంటారు.కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి. మతం/కులం పరంగా ఓటర్లు : యాదవులు 45 వేల ఓట్లు, కమ్మ 48వేల ఓట్లు, మైనార్టీ ఓట్లు 30వేలు ఉంటాయి. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు విరివే. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది.ఖమ్మం నగరంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు.ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు.పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్,చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది.ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. -
బస్సు నడిపిన పువ్వాడ..
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు. అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఖమ్మంలో పువ్వాడ హ్యాట్రిక్ కొడతారా?.. మంత్రిని ఢీకొట్టేది ఎవరు?
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్‌గా మారనుందా? తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పువ్వాడకు పోటీగా నిలిచి గట్టి అభ్యర్థి ఎవరు? బలమైన ప్రత్యర్థి బరిలో నిలిస్తే పువ్వాడకు ఇబ్బందేనా? అసలు ఖమ్మంలో మంత్రి మీద పోటీ చేయబోయేది ఎవరు? రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో సంచలనాలు సృష్టించబోతున్నాయి. పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. అటువంటి వాటిలో ఖమ్మం అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇప్పటికి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచేది తానే అంటూ ధీమాగా ఉన్నారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు.. ఖమ్మంలో చేసిన అభివృద్దిని చెప్పుకుంటు వచ్చే ఎన్నికల్లో తననే మరోసారి దీవించాలని కోరుతున్నారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం నగరాన్ని ఇంకా అభివృద్ది చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్ నుంచి పొటీ తీవ్రంగా ఉండబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి అనుచరులు ఆయనపై ఖమ్మంలో పొటీ గురించి తీవ్రస్తాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుకుంటున్నప్పటికీ... అనుచరుల ఒత్తిడి మేరకు ఖమ్మంలోనే నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. అనుచరబలం కూడ గట్టిగానే ఉంది. కొత్తగూడెంలో ఓటు బ్యాంక్ ఉన్నా అనుచరుల బలం అంతగా లేదని టాక్. దీంతో ఫైనల్ గా తన అనుచరుల అభిప్రాయం మేరకు పొంగులేటి ఖమ్మం సెగ్మెంట్‌నే తన ఎన్నికల రణ క్షేత్రంగా ఏంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కీలక నిర్ణయాలను అనుచరుల సూచన మేరకే పొంగులేటి తీసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి, ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిస్తే ఈ సెగ్మెంట్ హాట్ సీట్ గా మారనుంది. అజయ్ వర్సెస్ పొంగులేటి మధ్య సై అంటే సై అన్నట్లు రసవత్తరమైన పోరు కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఏస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఖమ్మం ఓటర్లు డిసైడ్ అయిపోయారు. చదవండి: గులాబీ బాస్ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే.. ఖమ్మంలో ప్రస్తుతం ఏ ఇద్దరిని కదిలించిన పొంగులేటి, పువ్వాడ అజయ్ పొటీ చేస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ పోటీ చేయడం అనేది ఖాయమైంది. మరి కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పేరు కూడా ఖరారైంతే ఇక ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. -
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
ప్రగతి రథచక్రాలు ఎన్నటికీ ఆగవు: పువ్వాడ
ఖమ్మం మయూరిసెంటర్: సీఎం కేసీఆర్ సారథ్యాన టీఎస్ ఆర్టీసీని బతికించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రగతి రథచక్రాలు ఇక ఎన్నటికీ ఆగవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం చేరుకున్న మంత్రి పువ్వాడకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టడమే కాక మున్నేరుకు ఇరువైపులా రూ.150 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మాణానికి కేబినెట్లో ఆమోదం పొందేలా కృషి చేసినందుకు మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, 43 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు కథ సుఖాంతమైంది. ఆదివారం ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు గవర్నర్ నుంచి ఈ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. కొన్ని అంశాలపై సూచనలు చేస్తూ.. గవర్నర్ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టగా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో పాటు బాన్సువాడ మున్సిపాలిటీ నుంచి కోయగుట్ట తండా వార్డును, ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెం వార్డును తొలగించి విడిగా గ్రామపంచాయతీలుగా చేస్తూ రెండు బిల్లులకు కూడా సభలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభ ముందు పెట్టారు. ఆర్టీసీ బిల్లుతో పాటు ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్టు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. ఆస్తులు యధాతథంగా కార్పొరేషన్లోనే ఉంటాయి : మంత్రి అజయ్ సంస్థ ఆస్తులు యధాతథంగా ఆర్టీసీ కార్పొరేషన్లోనే ఉంటాయని మంత్రి అజయ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంలో భాగంగా వారితో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించి త్వరలోనే నియమ, నిబంధనలను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి పీఆర్సి వర్తిస్తుందని, టీఎస్ఆర్టీ కార్పొరేషన్ అనేది కొనసాగుతున్నందున ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కార్పొరేషన్ చెలిస్తుందని, సీసీఎస్ బకాయిలు వంటివి దాని పరిధిలోకే వస్తాయని చెప్పారు. జీతభత్యాల వరకే ప్రభుత్వం చూస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ బిల్లు పాసయ్యాక వీలైనంత తొందరలో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ఆయా అంశాలపై ఉద్యోగులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్.. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్‌కు సంబంధించినదని, 240 మంది కాంట్రాక్ట్ డెయిలీవేజ్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్.. కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులో కొనసాగుతారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఐతే ఉద్యోగులకు భద్రత, సీసీఎస్ బకాయిలు, టీఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,డెయిలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో స్పష్టత నివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. వాటిపై స్పందిస్తూ మంత్రి అజయ్ వివరణనిచ్చారు. ఈ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్ మద్దతు తెలిపారు. -
ఖమ్మంలో హీట్ పుట్టిస్తున్న ‘వరద’ పాలిటిక్స్
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో వరద పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. వరద ముంపును ముందే అంచనా వేయకపోవడం వల్లే నష్టం తీవ్రత ఎక్కువ జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి వస్తాయా అంటూ భట్టి విక్రమార్కను పువ్వాడ ప్రశ్నించారు. అయినా ముందస్తుగా వరద ముంపు గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. చదవండి: కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరి తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. భద్రాచలంలో గోదావరి వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పువ్వాడ
-
ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ, హస్తం పార్టీలోకి కీలక నేతలు చేరుతున్న సందర్బంగా పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. పొంగులేటి ఖబడ్దార్ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది. మరోవైపు.. పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వ విజయబాబుకు వార్నింగ్ లేఖ కూడా వచ్చింది. ఇక, ఆ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్‌కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ బిగ్ షాక్ -
ఆ రోజే రాజకీయాల నుంచి వైదొలుగుతా: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: ఖమ్మానికి తన అవసరం తీరిన రోజు మాత్రమే రాజకీయాల నుంచి వైదొలుతానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణంలో ఎర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అనేక మంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కారణం మంత్రి కేటీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పేరు కేటీఆర్ అంటూ అజయ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిలిచిందని, ఐఏఎస్ పరిపాలన వచ్చిన తర్వాతనే ఖమ్మం అభివృద్ధి చెందిందన్నారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే -
ఖమ్మం పిట్టలదొర పొంగులేటి: పువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని.. చేసిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని మంత్రి అజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి, మంత్రి పువ్వాడ అజయ్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి పువ్వాడ ఆజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు... అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు పువ్వాడ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా. పిట్టల దొర కూడా. ఫ్రస్టేషన్లో ఉన్న పొంగులేటి.. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడు. అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదు నేను. ఖమ్మం లో తనపై బచ్చాగాడినెవిడైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడు. ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది’’ అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నువ్వు సీఎం అవుతావని మురిసిపోతున్నావు. నువ్వు సీఎం ఏంటయ్యా?.. సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలి. వందల కోట్లు దోచుకున్నావు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా? బిడ్డా అన్నీ ఇంకా ఉన్నాయి. ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు. డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం. ఖమ్మం రాజకీయ చరిత్ర లో పుట్టిన వాడే పువ్వాడ. ఆ పువ్వాడ కు పుట్టిన వాడే ఈ పువ్వాడ. నీ పక్కన ఉన్న అరాచక శక్తుల గురించి ముందు మాట్లాడు. ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుష్యులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?. నువ్వు ఎంపీగా ఖమ్మంకు చేసిన మేలు ఏంటో చెప్పగలవా?. పిచ్చోడా.. ఖమ్మం లో లైట్లు పెడితే అభివృద్దా? అంటున్నావు. ఒక్క లైట్లు కాదు అన్ని రంగాలలో అభివృద్ది చేశా. ఎవరో బచ్చాను నిలబెట్టి నాపై గెలిపిస్తా అంటున్నావు. రా.. ఎవడినైనా ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. నీ చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. మదన్ లాల్ ని నువ్వు ఓడించలేదా?. ప్రతీ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల కు వెన్నుపోటు పొడవలేదా? అంటూ పువ్వాడ, పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతిపెడతాం -
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ
ఖమ్మం మయూరిసెంటర్: దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. మరోపక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొదటి స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు తిండి గింజల కోసం పక్క రాష్ట్రాలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ముందుందన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందలేరని, అలాంటి వారి కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన 140 కంపెనీలతో 8,120 మందికి ఉద్యోగాలు ఇప్పించేలా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌తో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్..
ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలే మంటలు రేపుతున్నాయి. పంచ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని రేణుకకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. కారు, కాంగ్రెస్ సై అంటే సై అంటున్న ఖమ్మంలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మధ్య మంటలు రేగుతున్నాయి. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఖమ్మంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్న నిరుద్యోగ ర్యాలీలో మాట్లాడుతూ..మంత్రి అజయ్‌ను అరే అంటూ సంభోదిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అజయ్ కూడా రేణుకకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేణుకకు దమ్ముంటే ఖమ్మంలో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మీద రేణుక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మంత్రి అజయ్ సవాల్ చేశారు. రాష్ట్ర మంత్రి అజయ్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి..రాజకీయ విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగిపోయారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలతో ఖమ్మంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒరిజినల్‌గా బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటున్న ఇతరులంతా కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కినవారే. అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో రగలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటూ మైండ్ గేమ్‌కు తెర తీసారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ఖమ్మం జిల్లాకు గాని, నగరానికి గాని చేసిందేమీ లేదని, రేణుక అంటే పబ్బులు, గబ్బుల చరిత్రే గుర్తుకు వస్తుందని పువ్వాడ అజయ్ రివర్స్‌లో కౌంటర్ వేశారు. ఖమ్మం నుంచి రెండుసార్లు గులాబీ పార్టీ తరపున గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా తక్కువేమీ కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అజయ్‌ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకుని కసితో పనిచేస్తున్నారు. రేణుకకు దమ్ముంటే తనపైన ఖమ్మంలో పోటీ చేయాలంటూ పువ్వాడ అజయ్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ నేత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఓ వైపు..అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తారంటూ మరోవైపు కాంగ్రెస్‌లో టాక్ నడుస్తోంది. ఒకవేళ రేణుక బరిలో ఉంటే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. పువ్వాడ, రేణుక ఇద్దరూ ఒకే సామాజికవర్గం గనుక ఆ వర్గంలోనే చీలిక తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు పువ్వాడ అజయ్ సవాల్‌ను రేణుక ఎలా స్వీకరిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
రా చూసుకుందాం..హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్
-
రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే పోటీ చేసి గెలువ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి. అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను. అజయ్ కుమార్‌ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్.. -
ఎవడెన్ని ట్రిక్‌లు చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డిపాజిట్లు రాని బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటుందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలో కషాయ పార్టీకి ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థమైందన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్‌లు చేసిన తెలంగాణలో బీర్ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మంత్రి హరీష్ రావు సోమవారం శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేదని, నేడు కరువు అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు. చదవండి: ‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’ రాష్ట్రంలో వరిసాగు 14 లక్షల నుంచి 56 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దీనికి రైతు బీమా, సాగునీరు, 24 గంటలు కరెంటు తదితర పథకాలే కారణమన్నారు. పేపర్ లీకేజ్ కేసులో ఇరుకున్న దొంగలను, బెయిల్ మీద వచ్చిన వాళ్ళను పక్కన పెట్టుకొని దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలే హైకమాండ్‌గా పనిచేసే పార్టీ బిఅర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే లంచాలు, అవినీతి, పదవులు కోసం ఆలోచించే పార్టీ అని దుయ్యబట్టారు. అంతకముందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ... ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకుండా అబద్ధాలు ఆడుతూ కేంద్రం వివక్ష చూపుతుంది. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేస్తామని రెచ్చగొట్టేలా అమిత్‌షా మాట్లాడుతున్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి జిల్లాలో 10కి 10 స్థానాలను గెలిపించాలి’ అని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. -
ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు -
ఇద్దరిద్దరే
-
ఉమెన్స్ డే రోజున కవితకు నోటీసులివ్వడం దుర్మార్గం : పువ్వాడ అజయ్
-
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్‌ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్‌ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్‌పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్‌ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
ఉమ్మడి ఖమ్మంలో పాగా వేద్దాం! కేడర్ కారుదిగకుండా చూద్దాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అన్ని సీట్లను కైవసం చేసుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. జిల్లా పరిధి లో చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడం, నేతలందరినీ ఏకతాటిపై ఉంచడం, విస్తృతంగా సమావేశాలు నిర్వహించి పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా మిగతా 3వ పేజీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేయాలని, ఇందుకోసం వచ్చే పదిహేను రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేసిన పర్యటన, ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించాలని.. మాజీ ఎంపీ పొంగులేటి వెంట కేడర్ వెళ్లకుండా బ్రేక్ వేయాలనే అంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. సీఎం హామీలు ప్రచారం చేసేలా.. సీఎం కేసీఆర్ గతనెల 12న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్, పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించారు. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక గత నెల 18న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో.. ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున, తల్లాడ, కల్లూరు, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున.. 589 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా 15 రోజుల పాటు విస్తృతంగా పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు. నేతలంతా కలిసి ముందుకు.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం నేపథ్యంలో ఈ ఊపును కొనసాగించి అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా నాయకత్వం భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సీఎం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గాల్లో కలిసి తిరగాలని తీర్మానించినట్టు సమాచారం. కేడర్ కారు దిగకుండా.. బీఆర్ఎస్లో ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తిలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తిరుగుబావుటా ఎగురవేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. పార్టీపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. పొంగులేటి బాటలో నడిచిన వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మరికొందరు నేతలపై బీఆర్ఎస్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పొంగులేటి వెంట వెళ్లిన నేతలపై చర్యలు తీసుకోవాలని తాజా సమావేశంలో తీర్మానించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండలాల వారీగా ముఖ్య నేతలతో టచ్‌లో ఉండి నిత్యం పార్టీ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాసం, మరికొన్ని స్థానిక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీలో ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి షాక్! -
తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. -
‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’
వైరా: ‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ‘పార్టీ నిన్ను బహిష్కరిస్తే సానుభూతి పొందాలని చూస్తున్నావు.. చర్యలు తీసుకునే ఎజెండా మాది కాదు’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. పిల్లి ఊపులకు సీఎం కేసీఆర్ భయపడే రకం కాదన్నారు. కేసీఆర్ చేయి వదిలిన వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ జెండాను వదిలితే వారి బొంద వారే తవ్వుకున్నట్లు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. వైరా ఎమ్మెల్యేగా రాములునాయక్ ఉండగానే మరో వ్యక్తిని వైరా నియోజకవర్గ అభ్యర్థిగా ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, కేసీఆర్‌కు ద్రోహం తలపెట్టాలనుకునే వారు పార్టీ నుండి వెళ్లిపోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. -
వాడ వాడ పువ్వాడ! కానీ, రంగంలోకి పొంగులేటి వస్తే.. పరిస్థితి ఏంటి?
ఖమ్మం జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. జిల్లాలోని కీలక నేతలు ఖమ్మం సీటు మీదే గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యర్ధి ఎవరైనా బలంగా ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వాడ. కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మంత్రి వువ్వాడ అజయ్ గురించి ఖమ్మం ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ హాట్ సీట్ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారబోతోంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వాడ వాడ పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో జనంకి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదనే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు. బీజేపీ నుంచి ఒకవేళ గట్టి అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపోందే విధంగా పక్కా కార్యాచరణ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ..2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గెలుపొందారు. గత నాలుగు ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ, మైనార్టీ, కాపు వర్గాల్లో రెండు సామాజికవర్గాలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే విజయం దక్కుతుంది. కన్నేసిన పొంగులేటి ఇదిలా అంటే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పొంగులేటి బీఅర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినప్పటికీ... ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఏ పార్టీలో చేరతారన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే పొంగులేటి అనుచరుల్లో మెజారిటీ మాత్రం ఖమ్మం నుంచే పోటీ చేయాలని గట్టిగా సూచిస్తున్నారు. జనవరి ఒకటో తారీఖున నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా ఖమ్మం నుంచే పోటీ చేయాలని కోరారు. అందువల్ల ఖమ్మంకే తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. చేతి పార్టీలో ఎవరు? మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం నియోజవర్గంపై సీరియస్ గా గురిపెట్టింది. అయితే అజయ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. అందుకే మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఖమ్మంలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని కూడా రేణుక చౌదరి ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం.. లోకల్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం బలంగా ఉండటంతో రేణుక చౌదరి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో లోకల్ గా గ్రూపుల గొడవలు ఉండటంతో వ్యతిరేక వర్గం రేణుకకు ఏ మేర సపోర్ట్ చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి. కారుతో కమ్యూనిస్టుల జోడి ఇక బీజేపీకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరూ లేరు. ఇతర పార్టీల నుంచి నేతలు చేరితే తప్ప ఖమ్మంలో కాషాయపార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి బలం పెరిగే అవకాశం ఉంది. పొంగులేటి పోటీ చేస్తే అజయ్ కు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీఅర్ఎస్తో పొత్తు దాదాపు ఖరారైంది. ఇది గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ , 8 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నూతన బస్టాండ్, ఐటీ హబ్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ, నూతన కార్పొరేషన్ భవనం, సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు వంటివి అజయ్ కుమార్‌కు కలిసి వచ్చే అంశాలే. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంను ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్లకు విస్తరింపచేశారు. రఘునాధపాలెం మండలం సాగు నీటి సమస్య తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టు చేపట్టారు. కాని ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే వర్షాకాలం వరద ముంపు సమస్య పరిష్కారం అవుతుందని..అందువల్ల ఆ విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చదవండి: పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా? కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారన్న టాక్ సైతం లోకల్ గా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదనే వార్నింగ్‌లు ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు సైతం మంత్రికి ఇబ్బందులు తెస్తున్నాయి. కీలక నేతల చూపు ఖమ్మం అసెంబ్లీ సీటు వైపు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం హట్ సీట్ గా మారనుంది. ఏ పార్టీ అయినా ఖమ్మం అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలో దించితే దాని ఎఫెక్ట్ పాలేరు, వైరా స్థానాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్‌కు చెందిన డాక్టర్ నిఖిల్ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు.. -
బండి సంజయ్‌కు ‘కంటి వెలుగు’ పరీక్షలు అవసరం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ ద్వారా దేశ రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలు కూడా మారుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ నేతల సమన్వయంతో సభ విజయవంతమైందని, ఖమ్మం చరిత్రలో ఈ తరహా సభ ఎన్నడూ జరగలేదని అన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి గురువారం బీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో అజయ్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభ ఫ్లాప్ అయిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతటి భారీసభను కూడా చూడలేకపోయిన ఆయనకు కంటి వెలుగు పరీక్షలు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంటు గురించి సంజయ్‌కు సందేహాలు ఉంటే, రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ సుపారీ ఇచ్చారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సరిపోతారన్నారు. సభలో ఖమ్మం జిల్లాకు సీఎం నిధుల వరద పారించారని, అభివృద్ధికి గుమ్మంలా ఖమ్మం మారిందని పువ్వాడ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా 2001లో జరిగిన కరీంనగర్ సభ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసినట్లే, ఖమ్మం బీఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుందని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రగతిశీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగాన్ని బడా పారిశ్రామికవేత్త అదానికి కట్టబెట్టే కుట్రలను ప్రతిఘటించడంతోపాటు తెలంగాణ తరహాలో దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా తేలిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని రవిచంద్ర అన్నారు. -
ఖమ్మం సభ విజయవంతమైంది : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
-
కరెంట్ ఉందో లేదో అలా తెలుసుకో.. సంజయ్‌కు పువ్వాడ కౌంటర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. ఇక, కేసీఆర్ కామెంట్స్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా బండి సంజయ్ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కాబోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్ సూటి ప్రశ్న -
సీఎంలు ‘ఏమిటీ జనం?’ అని ఆశ్చర్యపోయారు..’శభాష్ అజయ్’
సాక్షి, ఖమ్మం: ‘శభాష్ అజయ్.. ఆవిర్భావ సభ సక్సెస్ చేశారు. ఖమ్మం చరిత్రలోనే ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదు. కమ్యూనిస్టు నాయకులు, మిగతా నేతలు అందరూ సభ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఏమిటీ జనం?’ అంటూ ఆశ్చర్యపోయారు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందించారు. సభావేదిక పైనే కాకుండా సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. హెలి కాప్టర్ నుంచి ముఖ్యమంత్రులు దారి పొడవునా ఉన్న జనాన్ని చూసి ‘ఇంతమంది జనమా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ ఉందంటూ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ ప్రకటన నాటి నుంచి మంత్రి అజయ్ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణకు కసరత్తు చేశారు. అంతేకాకుండా ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే వెయ్యి మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సభ ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ముగిసేలా చూశారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
ఖమ్మం గులాబీ వనం.. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సభ పురస్కరించుకుని నగరమంతా గులాబీ తోటలా మారింది. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ ఐదు రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల జాతీయ స్థాయి నేతలు హాజరవుతుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం, మెడికల్ కళాశాలకు శంకుస్థాపన, కంటివెలుగు రెండో దశ ప్రారంభ కార్యక్రమంలో కూడా అతిథులు పాల్గొంటారు. వీరంతా ప్రసంగించాక చివర్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడతో పాటు పలువురు ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా వేదికపైకి ఆహ్వానిస్తారు. 13 నియోజకవర్గాలు.. 5 లక్షల మంది ఖమ్మం సమీపాన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని వంద ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఖమ్మానికి తూర్పు, పశ్చిమం వైపు మొత్తం 20 పార్కింగ్ ప్రాంతాలకు 448 ఎకరాలు కేటాయించారు. సభ ప్రాంగణంలో 25 ఎల్ఈడీలు, లక్ష మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 12 లక్షల తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేశారు. సీనియర్, జూనియర్ ఐపీఎస్‌లు, పోలీసు సిబ్బంది కలిపి 5,200 మంది బందోబస్తులో పాల్గొంటుండగా, కలెక్టరేట్, సభా ప్రాంగణంలో 100కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ, వరంగల్ సీపీ ఏ.వీ.రంగనాథ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ బందోబస్తులో నిమగ్నమయ్యారు. సీఎంల పర్యటన షెడ్యూల్ ►పినరయి విజయన్ మినహా మిగతా ముగ్గురు సీఎంలు, ముఖ్య నేతలు బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరతారు. (పినరయి విజయన్ నేరుగా ఖమ్మంకు వెళ్తారు.) ►10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుని 10.40 గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేశారు. ►11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ►ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తో పాటు కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ►2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. ►2.30 నుంచి 5 గంటల వరకు సభలో పాల్గొంటారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ముగ్గురూ హెలీకాప్టర్‌లో విజయవాడ వెళ్లి అక్కడినుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు బయలుదేరతారు. ►సీఎం కేసీఆర్ ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేకంగా ప్రధాన వేదిక ప్రధాన వేదికను వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ జర్మనీ స్ట్రక్చర్ రూఫ్‌తో సిద్ధం చేయగా, గులాబీ రంగు జోడించారు. వేదికపై భారత్ రాష్ట్ర సమితి పేరు, వరుసగా సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డి.రాజా ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. 200 మంది కూర్చునేలా వేదికను నిర్మించారు. వేదిక వెనుక నాలుగు విశ్రాంతి గదులు, వేదిక ఎదురుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు కూర్చునేలా గ్యాలరీ సిద్ధం చేశారు. నగరంలోకి ప్రవేశించేది మొదలు చుట్టూరా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, జిల్లా నేతల ఫొటోలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి తదితరులు మంగళవారం సాయంత్రం సభా ప్రాంగణం, కలెక్టరేట్‌ను పరిశీలించారు. భారీ సభ దృష్ట్యా బుధవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మం వైపు వచ్చే సాధారణ, భారీ వాహనాలన్నింటినీ దారి మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వస్తూ సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లాల్సిన వాహనాలను కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు మళ్లిస్తారు. ఇలావుండగా టీఆర్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి భారీ ఎత్తున జరిగిన సభల జాబితాలో ఖమ్మం బీఆర్ఎస్ సభ కూడా చేరుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2016లో ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీ పరంగా ఇదే భారీ సభ కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు సభల ఏర్పాట్లను హైదరాబాద్‌కు చెందిన సుజాత సౌండ్స్ నిర్వాహకులే చూస్తుండడం మరో విశేషం. -
తప్పుడు ప్రచారం చేసేవారిని కూకటివేళ్లతో పీకేస్తా: మంత్రి పువ్వాడ
-
పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ ఉందంటూ మాజీ ఎంపీ పొంగులేటి వర్గాన్ని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూకట్పల్లి నుంచి పోటీ చేయడం లేదని, ఖమ్మంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. జనవరి 18న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం సన్నాహాక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలవదని మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారని విమర్శించారు. ‘అజయ్ అన్న కూకట్ పల్లి ఏం పీకటానికి పోతాడు. ఇక్కడి వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఉన్నాడు.. ఇంకా దంచాల్సిన వాళ్ళని దంచాకనే అజయ్ అన్న ఎటైనా పోతాడు.. అజయ్ అన్న సైన్యం చూసి ఎంత భయపడుతున్నారంటే.. అజయ్ అన్నను లోకల్ నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారన్నారు. అజయ్ అన్న ఖమ్మం ను అభివృద్ధి చేసిండు.. పాత బస్టాండ్ తీసి కొత్త బస్టాండ్ పెట్టిండు.. మళ్ళీ పాత బస్ స్టాండ్‌ను సిటీ బస్ స్టాండ్‌గా మార్చిండు అని ఈర్ష పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి గలగల నీళ్లు పారే విధంగా చేసిన.. అక్క చెల్లెళ్ల బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద సొట్టలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. రెండుసార్లకు ఇవన్నీ చేస్తే మూడోసారి మనకు ముప్పతిప్పలే అని ఈ అబద్దపు నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన ఖామ్మానికి కేసీఆర్ ఇచ్చారని, ఖమ్మం మీద గాని ఖమ్మం ప్రజల మీద గాని కేసీఆర్‌కి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మీరు వాట్సాప్ గ్రూప్‌లలో ఫేస్బుక్, ట్విట్టర్లు మీరు కూడా యాక్టివ్ ఉండాలి. ఖమ్మం సభను విజయవంతం చేయాలి’ అని పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. -
ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు ఆదాయం: పువ్వాడ
అఫ్జల్‌గంజ్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. సోమవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్‌కుమార్, యాదగిరి, ఆర్ఎం శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. -
ఖమ్మం పాలిటిక్స్‌లో కలకలం
నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నాం. కానీ పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? భవిష్యత్‌లో జరగబోతున్నది ఏమిటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు నా టీం సిద్ధంగా ఉంది.. – మాజీ ఎంపీ పొంగులేటి గతంలో నన్ను దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు. క్యారెక్టర్, గుణం అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరం.. – మంత్రి పువ్వాడ అజయ్ నా రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకు నేనేం చేశానో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశానో అందరికీ తెలుసు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తా. నా వెంట నిలిచేవారికి అండగా ఉంటా.. – మాజీ మంత్రి తుమ్మల ..ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి.. ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలే.. జిల్లాలో అనుచరులు, అభిమానగణం ఉన్నవారే.. పార్టీలో, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నవారు ఇద్దరు, ఆ అసంతృప్తిని దీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఆలోచనతో ఉన్నవారు మరొకరు.. మొత్తానికి ఆధిపత్యం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కార్యచరణకు పదును పెట్టుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు వేదికగా అనుచరులతో సమావేశాలు పెట్టి బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం మయూరి సెంటర్ తుమ్మల.. ఎన్నికల రిహార్సల్! మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నూతన సంవత్సర వేడుకల పేరిట ఖమ్మం రూరల్ మండలంలో తన అనుచరగణం, కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన తుమ్మల.. ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఏమేం చేశారో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశారో వివరించారు. అయితే ఈ కార్యక్రమం వచ్చే ఎన్నికలకు రిహార్సల్‌గా, బల ప్రదర్శనగా చెప్పవచ్చని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్పీడ్ పెంచారని అంటున్నారు. నన్ను దెబ్బతీసే ప్రయత్నాలు ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఆయన ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై నేరుగా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్లను తులనాడి, వారిపై విషప్రచారం చేసి తనకు నష్టం చేయాలని చూశారని పువ్వాడ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదని, క్యారెక్టర్, గుణం అవసరమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరమని.. ఆ విలువలకు కట్టుబడి ప్రజల అవసరాలు తీరుస్తూ ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకుపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నా టీమ్ పోటీ చేస్తుంది బీఆర్ఎస్లో జరిగిన గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కీలకనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది, తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ రోజు బీఆర్ఎస్లో ఉన్నామని, కానీ ఆ పార్టీలో జరిగిన గౌరవమేంటి? భవిష్యత్‌లో జరగబోతున్న గౌరవం ఏమిటనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శీనన్న (తన) టీమ్ అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీగా గెలిచి.. బీఆర్ఎస్లో చేరి.. వైఎస్సార్సీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులు, అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ తర్వాతి రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. ఈ క్రమంలో రాజకీయ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనైంది. సిట్టింగ్ అయిన ఆయనను కాదని.. నామా నాగేశ్వరరావుకు గులాబీ పార్టీ టికెట్ దక్కింది. ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని పొంగులేటి ఆశించినా ఫలితం రాలేదు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్‌కు ప్రాధాన్యం దక్కడం, తుమ్మల నాగేశ్వర్రావు తిరిగి పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. -
‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు. దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల డీజిల్ సెస్‌ను మాత్రమే సవరించామని, టికెట్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలారం, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్ ట్రాకింగ్ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్‌కుమార్, జీవన్‌ప్రసాద్, మోహన్(అశోక్ లేలాండ్), ఎంజీ ఆటోమోటివ్స్ ఎండీ అనిల్ ఎం కామత్ పాల్గొన్నారు. -
దశలవారీగా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలో సోమవారం రాత్రి జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్‌లు, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల తీర్మానాలను వెల్లడించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు మూడు డీఏలు మంజూరు చేయాలని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, 317 జీవోతో బదిలీపై వెళ్లిన భార్యాభర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్‌గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
Puvvada Ajay Kumar; అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి అనన్యం. ‘రైతుబంధు’ నేడు దేశానికే ఆదర్శవంతమైన పథకం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా తెలంగాణ నిలుస్తున్నది. ఒక నాడు ఎక్కడ చూసినా నెర్రెలు– మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ... ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? మీకు వ్యవసాయం వస్తదా? అని ప్రశ్నించిన నోళ్లతోనే మీకే వ్యవ సాయం వస్తదని చెప్పించాలంటే ఎంత సమర్థ వంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. అంత అద్భుతం జరిగింది కేసీఆర్ వల్లనే. దేశంలో 20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే ఎన్నో ఏండ్లు తీసుకుంటున్న సమయంలో 200 టీఎంసీల నిలువ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం పెరిగే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్ దక్షతకు నిదర్శనం. ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం సర్కారు అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయ బడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్ మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్‌పూర్, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా– కొరటా, సదర్మట్, సీతమ్మసాగర్, గట్టుప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగ రాస్తూ 11 నెలల్లోనే ఖమ్మంలో భక్త రామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోత లను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందు తుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది. తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ ప్రగతి అప్రతిహతంగా కొన సాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వా ములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహ కారం ప్రభుత్వానికి అందించాలి. ఈ నిలువెత్తు ప్రగతి విమర్శకులకు కనిపించదా? అవసరం కోసం, అవకాశాల కోసం రాజకీయాలు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు, కానీ బాధ్యతల్ని భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో! తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను జాతీయ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. జాతీయ స్థాయి పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగ బెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ, ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయ హోదాను ఇవ్వడం లేదు. ఆర్థిక సహాయం చేయడం లేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అట కెక్కింది. కాజీపేట వర్క్ షాపు కాగితాల్లో మురిగింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించి కానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణలో అందరికీ స్పష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్ఎస్కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువ లేదని ప్రజలకు స్పష్టమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్ఎస్కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మ గౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ట్రాల్లో రుజువైంది. తెలంగాణ అస్తి త్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది. ఇటీవల అందరూ తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బల మైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితి గతులను పెంచటానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్ఎస్ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీని ప్రతిపక్షాలు నమ్ముకుంటే, టీఆర్ఎస్ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలం గాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ధిచెప్పాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. (క్లిక్ చేయండి: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?) - పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
ఖమ్మం మయూరిసెంటర్: పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గొర్రె పిల్లలిచ్చింది కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులవారి జీవనోపాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పువ్వాడ చెప్పారు. నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లలను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మొదటిసారిగా వారికి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు. -
సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...
నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్‌గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!) కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి -
బండి సంజయ్ ఖమ్మం పర్యటన పై మంత్రి పువ్వాడ స్పందన
-
పోలవరం డ్యాం ఎత్తుతో భద్రాచలం మునగడమనేది హాస్యాస్పదం: పేర్ని నాని
-
1986లో పోలవరం లేదు.. అప్పుడు భద్రాచలం మునగలేదా?: పేర్నినాని
సాక్షి,విజయవాడ: పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునిగిందనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి అవుతుందని, ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ వారే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆధార్ కార్డులను ఏపీ అడ్రస్‌తో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 1986లో పోలవరం లేదని, అప్పుడు భద్రాచలం మునగలేదా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారోనని సందేహం వ్యక్తం చేశారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారని పేర్ని నాని ప్రశ్నించారు. 1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. యాదాద్రి నిర్మించినట్లే.. భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలంపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయాలని, తాము అభివృద్ధి చేసుకుంటామన్నారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణ నేతలు, మంత్రి పువ్వాడ పోలవరం డ్యాం గురించి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానేనని ప్రస్తావించిన పేర్ని నాని.. చంద్రబాబు చేసిన తప్పు వల్ల హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. చదవండి: పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి: బొత్స -
పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలి: మంత్రి బొత్స
-
మాకు న్యాయం చేయాలి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీరం వెంట ఉన్న పట్టణాలు, గ్రామాలను గడగడలాడించిన గోదావరి నెమ్మదించింది. అయితే అప్పటికే వరద తీవ్రత ధాటికి తీర ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయారు. వరద వెనక్కి మళ్లితే తప్ప నష్టం ఎంతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం ఇవ్వకుండా తీరని నష్టం కలిగించిన ప్రభుత్వాధికారులే తమను ఆదుకోవాలంటూ భద్రాచలంలో సుభాష్‌నగర్ కాలనీవాసులు శనివారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కూనవరం రోడ్డులో బైఠాయించారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండటంతో తమను ఆదుకుంటారనే ఆశల్లో వరద బాధితులు ఉన్నారు. భద్రాచలం దగ్గర నిర్మించిన కరకట్ట ఈ కాలనీ దగ్గర ముగుస్తుంది. దీంతో వరద తీవ్రత పెరగడంతో కరకట్ట చివర నుంచి నీళ్లు సుభాష్ కాలనీలోకి వచ్చాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు గురువారమే ఈ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సమయంలో వరద 64 అడుగుల ఎత్తుకు రావొచ్చని అంచనా వేశారు. దీంతో ఈ కాలనీ ప్రజలు వరద ఎత్తును దృష్టిలో ఉంచుకుని ఇంట్లోని మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర విలువైన సామాన్లను అటక మీద పెట్టడం, తాళ్లతో కట్టి పైకప్పు వరకు చేర్చి కేవలం కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు చేరుకున్నారు. అయితే వరద ఏకంగా 71 అడుగులకు చేరుకోవడంతో సామగ్రి నీట మునిగింది. ఇక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు రోజువారీ కూలీలే. చనిపోతామంటూ... తమకు న్యాయం చేయాలంటూ సుభాష్‌నగర్ కాలనీవాసులు గంటల తరబడి రోడ్డుపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ‘సర్వం కోల్పోయిన తాము బతడం దండగ’అంటూ తిరిగి వరద నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయకుంటే రాజకీయ నాయకులెవరూ ఓట్లు అడిగేందుకు తమ వాడకు రావొద్దంటూ నినాదాలు చేశారు. సుభాష్‌నగర్ ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. బురద సమస్య: గోదావరి వరదనీరు వెనక్కి తగ్గగానే ముంపు ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యలో బురద తొలగింపు ప్రధానమైనది. ఈ బురద కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పదిహేను మున్సిపాలిటీల నుంచి 195 మంది పారిశుధ్య కార్మికులను భద్రాచలం ఏజెన్సీకి తరలిస్తున్నారు. వీరితో జెట్టింగ్, ఫాగింగ్ మెషీన్లు, బురద తొలగించే యంత్రాలను తీసుకొస్తున్నారు. అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నీళ్లలోనే పంటపొలాలు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు తగ్గితేనే ఏజెన్సీ ప్రాంతాలు ముంపు నుంచి బయటపడతాయి. అయితే శనివారం అర్ధరాత్రి వరకు నీటిమట్టం 60 అడుగులకుపైనే ఉంది. ముఖ్యంగా కిన్నెరసాని, గోదావరి నదులు సంగమ ప్రదేశానికి సమీపాన ఉన్న బూర్గంపాడు పూర్తిగా ముంపునకు గురైంది. ఈ మండలంలో ఏకంగా 7,955 మంది పునరావాస కేంద్రాల్లోనే మగ్గుతున్నారు. వరదనీరు వెనక్కి మళ్లితేనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయాయి, ఎంత మేర రోడ్లు కొట్టుకుపోయాయి, ఎన్ని కాజ్‌వేలు దెబ్బతిన్నాయనే విషయం తేలుతుంది. -
పోటెత్తే.. గేట్లెత్తే!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదిలో వరద పోటెత్తింది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల ప్రవాహాలు కూడా కలిశాక మహోగ్ర రూపంతో పరుగు పెడుతోంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో 53 అడుగుల మట్టంతో ఉరకలెత్తుతోంది. మొత్తంగా ఎగువన ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాకా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై రెండో వారంలోనే ఈ స్థాయిలో గోదావరికి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల వానతోనే.. నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షా లు కురుస్తున్నాయి. దీనితో అటు మహారాష్ట్ర నుంచే గోదావరిలో వరద పోటెత్తి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. దానితో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు కడెం వాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెర సాని తదితర ఉప నదుల ప్రవాహాలూ చేరుతుండటంతో.. సోమవారం గోదావరిలో వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకుల గూడెం) బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడిక్కడ వాగులు, ఉప నదుల ప్రవాహాలు కలుస్తుండటంతో గోదావరిలో వరద పెరుగుతూ పోతోంది. లక్ష్మి బ్యారేజీ వద్ద నుంచి 8.68 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ నుంచి 11.82 లక్షల క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ నుంచి 14.30 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. భద్రాచలం గోదావరి మట్టం గంట గంటకూ పెరుగుతూ.. 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహాలు మొదలు.. ఎగువన కర్ణాటకలో వర్షాలతో కృష్ణా నదిలో వరద మొదలైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. మలప్రభ, ఘటప్రభ వంటి ఉప నదులపై ప్రాజెక్టులన్నీ నిండటంతో.. కృష్ణాలోకి భారీ వరద వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో ఆల్మట్టి డ్యామ్ నిండటానికి మరో 40 టీఎంసీలు అవసరమున్నా.. ముంపు ముప్పు తప్పించడానికి గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆ నీళ్లు నారాయణపూర్ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. సోమవారం రాత్రి ఇక్కడి నుంచి 61.9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా జూరాల వైపు పరుగెడుతోంది. ఒకట్రెండు రోజుల్లో వరద జూరాలకు చేరనుంది. వరద రానుండటంతో జూరాలలో సోమవారం రాత్రి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి 10,200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద చేరుకోగానే జూరాల గేట్లు ఎత్తనున్నట్టు వెల్లడించారు. మరోవైపు భారీగా ప్రవాహం వస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది. సోమవారం అర్ధరాత్రిగానీ, మంగళవారం ఉదయంగానీ తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీనితో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలవనుందని అధికారులు చెప్తున్నారు. చిన్న ప్రాజెక్టులూ నిండి.. ఎగువ నుంచి వరద వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి 5,622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో అప్రమత్తం గోదావరి ఉగ్రరూపం దాల్చడం, తీరం దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా గజ ఈతగాళ్లు, మరబోట్లను సిద్ధంగా ఉంచారు. 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం భద్రాచలం ఇప్పటికే చేరుకుంది. నేనూ వరద బాధితుడినే: మంత్రి పువ్వాడ గోదావరి వరదలు ఎలా ఉంటాయో, క్షణాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో తెలుసని.. తానూ వరద బాధితుడినేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. భద్రాచలంలో సోమవారం వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘నేను పుట్టి పెరిగింది కూనవరంలో. ఆ గ్రామంలో మాకు రెండు అంతస్తుల ఇల్లు ఉండేది. సాధారణంగా మొదటి అంతస్తులోకి నీళ్లు వస్తే.. రెండో అంతస్తులోకి లేదా ఇంటి పైకప్పు మీదికి వెళ్లేవాళ్లం. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్ తదితరులు ఓసారి గోదావరికి బాగా వరద వచ్చింది. మొదటి అంతస్తు ఖాళీ చేసి రెండో అంతస్తులోకి వెళ్లగా.. కొద్దిసేపట్లోనే రెండో అంతస్తులోకీ నీళ్లు రావడం మొదలైంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో భయపడ్డాం. సహాయక బృందాలు పడవల్లో వచ్చి మమ్మల్ని రక్షించాయి.’’అని తెలిపారు. -
సీఎం చెప్పినా పట్టించుకోరా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది. ఆవేదనతో చెబుతున్నా: వనమా పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్ పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ట్రెంచ్‌లు కొట్టొద్దు: పువ్వాడ పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్‌లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్‌లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు. -
కేంద్రం నిర్ణయంతో అగ్గి రాజుకుంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టాలన్న కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుందని, యువత రగిలిపోతున్నా రని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభు త్వం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి శనివారం తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికి.. ర్యాలీగా ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ఏర్పాటుచేసిన ‘కేసీఆర్‌కు కృతజ్ఞత సభ’కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ యువతను మోసం చేస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేసిన ఖమ్మం గడ్డను ఎప్పటికీ మరువబోనని అన్నారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ముఖ్య మంత్రిగా కేసీఆర్ సాధించిన ప్రగతి అద్భుత మని కొనియాడారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సభల్లో గత నాలుగు విడతలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను చదవడంతోపాటు.. చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పల్లెప్రగతి కార్యక్రమం కింద నియమించిన కమిటీలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి అభివృద్ధిపై ప్రణాళికలను సిద్ధం చేశాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులకు మోక్షం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంఛనంగా ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత రాయపర్తిలో, జనగామ జిల్లా కడవెండిలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొని.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించి మాట్లాడారు. ‘‘2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా స్థానిక సంస్థలకు రూ.9,560.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న రూ.474 కోట్లకు సంబంధించి త్వరలో టోకెన్/బిల్లులు/చెక్కులను క్లియర్ చేస్తాం.. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించే ప్రక్రియ తుది దశకు చేరిందని.. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిరసనలతో.. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల, మామకన్ను, పడుగోనిగూడెం, ముత్తాపురం సర్పంచులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. నిధుల్లేక ఇబ్బంది పడుతున్నామంటూ వార్డు సభ్యులతో కలిసి జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. ట్రాక్టర్ల రుణం కిస్తీ, డీజిల్, బ్లీచింగ్ కొనుగోలు బిల్లులు రావడం లేదని వాపోయారు. ♦హనుమకొండ జిల్లా ధర్మపురంలో, వరంగల్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో, జఫర్ఘడ్ మండలం రఘునాథపల్లిలో పల్లె ప్రగతి గ్రామసభలో గ్రామస్తులు పాల్గొనకుండా నిరసన తెలిపారు. ♦‘4వ విడత పల్లెప్రగతి పనుల నిమిత్తం రూ.8లక్షల అప్పులు తెచ్చిన. ఏడాదైనా బిల్లులు వత్తలెవ్వు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేది లేక ఉపాధి పనులకు పోతున్న. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించండి సారూ’ అంటూ హనుమకొండ జిల్లా విశ్వనాథకాలనీ సర్పంచ్ వల్లెపు అనిత కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. ♦పల్లె ప్రగతి తొలిరోజు కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో 59 మంది సర్పంచ్‌లు హాజరుకాలేదు. పెం డింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలంలోని 37 గ్రామాలు, అనుముల మండలంలోని 11 గ్రామాలు, చండూరు మండలంలోని 11 గ్రామాల సర్పంచులు గ్రామసభలను బహిష్కరించారు. పట్టణ ప్రగతి తీరు ఇదీ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో నాలుగో విడత పట్టణ ప్రగతి మొదలైంది. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, కొత్త పనులపై చర్చించారు. ♦ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. కలెక్టర్ గౌతమ్‌తో కలిసి ఉదయం ఆరు గంటల నుంచే సైకిల్‌పై తిరుగుతూ.. 53, 52, 41, 37 డివిజన్లలో పర్యటించారు. 41వ డివిజన్ డ్రైనేజీలో పిచ్చిమొక్కలను స్వయంగా తొలగించారు. -
మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేయలేనివారు, ఇరవై ఏళ్ల పాటు పదవులు అనుభవించి స్వలాభం చూసుకున్నవారు.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్న తన ను విమర్శించడం గర్హనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రూ.1.81 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 181 మంది లబ్ధిదారులకు సోమవా రం ఇక్కడ మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓ నాయకురాలు పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి గోల్మాల్ చేసి ఓ గిరిజన డాక్టర్ బతుకును ఆగం చేసి, రోడ్డుమీద పడే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద లెక్కకట్టాలని రవాణా శాఖలో ఓ చట్టం ఉందని, అలాగే రాజకీయాల్లో కూడా స్క్రాప్ పాలసీ తీసుకురావాలని అన్నారు. ఖమ్మం జిల్లా, నగరాభివృద్ధికి చేసిందేమీ లేకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు డ్రామాలు చేస్తూ, గాజులేసుకుని.. పెద్ద కళ్లజోళ్లు పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటూ ప్రదర్శనలు చేస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది -
తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఏడు రోజుల్లో!
సాక్షి, ఖమ్మం లీగల్: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్ ద్వారా ఆయన మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలనే దురుద్దేశంతో తీన్మార్ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని తెలిపారు. ఈమేరకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, దీంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. కాగా, ఏడు రోజుల్లోగా తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు నోటీసులో సూచించారు. చదవండి: VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా -
రాజకీయాల్లో రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి
ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో శనివారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్ కారులో తిరిగా... కానీ ఇప్పుడు పార్చునర్ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్ కారుకో పోతదో, స్కూటర్‌కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. -
చార్జీల పెంపుపై త్వరలో సీఎంను కలుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్ చార్జీల పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంప్రదిం చనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీపై రూ.వందల కోట్ల భారం పడుతోందని, అయినప్ప టికీ ఇప్పటి వరకు ఆ భారం ప్రజలపై పడకుండా ఆర్టీసీ భరించిందని అన్నారు. తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్న సంస్థను బలోపేతం చేసేందుకు చార్జీలు పెంచక తప్పనిపరిస్థితి నెలకొందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలను మంత్రి గురువారం ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 50 మంది విద్యార్థినులతో దీనిని మొదలు పెట్టారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, పలువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.