సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌కు తండ్రీకొడుకు రెండేసిసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు గెలిచిన పువ్వాడ 1989లో పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.దుర్గానర్సింహారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో సీపీఐ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జహీర్‌అలీ మహ్మద్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.
మూడోసారి బరిలో అజయ్ పువ్వాడ అజయ్‌కుమార్ 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి..టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల మెజారిట్టీతో గెలిచారు. 2018లోఇదే స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో సారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ చరిత్రలో మంత్రి పదవి సైతం పువ్వాడ అజయ్‌కుమార్‌నే వరించింది.
Comments
Please login to add a commentAdd a comment