సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్లగా, లోక్‌సభ ఎన్నికల వేళ సీపీఎం కూడా జతచేరనుందా? మొత్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తాయా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ధ్యేయంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు అధికారికంగా పొత్తు కుదుర్చుకోనున్నా యా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఇప్పటికే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు.. తెలంగాణలోనూ కలసి పనిచేస్తామని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుందని తెలుస్తోంది. ఇందుకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో రాష్ట్ర సీపీఎం నేతల భేటీ వేదికయిందనే చర్చ జరుగుతోంది.
కలసి పనిచేద్దాం..
సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు కల సిన సందర్భంగా యాధృచ్ఛికంగా ఈ చర్చ వచ్చిన ట్టు తెలుస్తోంది. తమతో కలసి పనిచేయనప్పటికీ.. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ సీపీఎం నేతలతో అన్నారని విశ్వసనీయ సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పనిచేయనంత మాత్రాన వేర్వేరు కాబోమని, లోక్‌సభ ఎన్నికల సమయంలో పొంచి ఉన్న బీజేపీ ప్రమాదాన్ని ఎదు ర్కొనేందుకు ఐక్యంగా పనిచేద్దామని ముఖ్యమంత్రి వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. ఇందుకు స్పందించిన సీపీఎం నేతలు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు వేరే ఆలోచన ఉండబోదని, అయితే కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అంశాన్ని పార్టీలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్టు సమా చారం.
అలాగే చేద్దామని, త్వరలోనే మళ్లీ కలసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని సీఎం రేవంత్ చెప్పడంతో మరోమారు సమావేశమవు దామని వారు ఈ చర్చను ముగించినట్టు తెలిసింది. సీపీఎం నాయకులు తనను కలసిన సందర్భంగా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని తెలుస్తోంది. సీపీఎంతో తెలంగాణలో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారని, ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఉభయ వామపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment