alliance
-
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలా ఉంటాయంటూ ఒమర్ అబ్దులా వ్యాఖ్యానించారు. రామాయణం వీడియోను ఆయన షేర్ చేశారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడిన కాంగ్రెస్.. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన ఆఖరి పోరాటం నిరాశే మిగిల్చింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారం చేసింది. కనీసం ఒక ఖాతా కూడా తెరవలేదు. 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆప్ షాక్ ఇచ్చింది. దీంతో ఒంటరి పోటీ విషయంలో కాంగ్రెస్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. -
‘పచ్చ’ తాలిబన్లు.. కూటమి గూండాల విధ్వంసకాండ
Updates:మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు. ⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు YSRCP ఫిర్యాదు
-
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొందరు మీడియా వ్యక్తులు మినహా మరెవరూ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు తెరవెనుక మైత్రిని సాగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పొసగలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అంటూ విమర్శించడం..ప్రతిగా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూట మి నుంచి బయటకు పంపించేయాలని ఇతర పార్టీలను కోరుతాననే దాకా వెళ్లింది. శనివారం ఫిరోజ్‌షా మార్గంలోని తన నివాసం ఎదుట పంజాబ్‌కు చెందిన మహిళలు నిరసనకు దిగడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘వీరు పంజాబ్ మహిళలు కారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. పంజాబ్ మహిళలకు ఆప్‌పై నమ్మకముంది. వాళ్లు మమ్మల్ని విశ్వసించారు’అని చెప్పారు. బీజేపీకి ఒక ఎజెండా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. నాపై విమర్శలు చేయడం ద్వారానే బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చీలిక దిశగా ఇండియా కూటమి -మమతకు పెరుగుతున్న మద్ధతు
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామన్న కేజ్రీవాల్
-
‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయి. అలాగే ఈ కూటమి నాయకత్వానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే నేపధ్యంలో ఇండియా కూటమి సారధ్యంపై అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.‘ఇండియా’ సారధ్యం ఎవరికి?కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు మమతకు తమ ఓటు వేశారు.రాహుల్ గాంధీ నాయకత్వ లోపంఅటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.మమతకు పెరుగుతున్న మద్దతుమమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడించారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.మమతా బెనర్జీ సత్తా ఇదే..మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.రాహుల్ గాంధీ అనుభవంయూపీలోని రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్‌బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఆయన అక్కడి ఎంపీగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి కాలేదు.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
ఇది వరకు కేవలం ప్రధాని అభ్యర్ధి ఎవరనే విషయంలోనే లుక లుకలు బయటపడేవి!
-
ఇండియా కూటమికి బీటలు? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పరిస్థితి ఇదే..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాలని భావించాయి. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. వాస్తవానికి 2023లో దేశంలోని 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ 26 ప్రధాన పార్టీల కలయికతో ఇండియా అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఏర్పాటయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారధ్యం వహిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ - కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్‌సభలో అవధేష్ ప్రసాద్‌ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.షాకిచ్చిన మమతా బెనర్జీఇండియా కూటమిలో కొనసాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తి మధ్య, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విపక్షాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ.. బెంగాల్ నుండే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్‌కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఒక ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సృష్టికర్త తానేనని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేమి చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు.కూటమిని వీడిన ఆమ్ ఆద్మీ పార్టీవచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. దీనికిముందు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీనిని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తోంది.మహారాష్ట్ర ఎన్నికల తర్వాత..లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 26 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూటమికి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం విచ్చిన్నం ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ -
ఉద్ధవ్‌కు ఎదురుదెబ్బ
ముంబై: హిందుత్వ ఫైర్‌బ్రాండ్ బాల్ ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్ ఠాక్రే అదే హిందుత్వకు దూరమై, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలో సరిగ్గా ఐదేళ్ల క్రితం బీజేపీతో జట్టుకట్టి, ముఖ్యమంత్రి కూడా అయిన ఉద్ధవ్ ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. మహా వికాసఅఘాడీ పేరిట చేసిన సెక్యులర్ ప్రయోగం ప్రయోజనం చేకూర్చలేదు. శివసేన సిద్ధాంతానికి సరిపడని కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో కలిసి కూటమి కట్టడం ఉద్ధవ్‌కు నష్టం చేకూర్చింది. కూటమి పొత్తులో భాగంగా 95 సీట్లలో పోటీకి దిగిన శివసేన(ఉద్ధవ్) 20 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఉద్ధవ్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సమాధానం చెప్పాల్సిందే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ బాల్ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ తొలుత సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. సీనియర్ నేత నారాయణ రాణేతోపాటు వరుసకు సోదరుడయ్యే రాజ్ ఠాక్రే నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ తండ్రి అండతో నిలదొక్కుకున్నారు. బీజేపీతో దశబ్దాలుగా కొనసాగుతున్న పొత్తు శివసేనకు లాభించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి నెగ్గింది. ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రి పదవి వరించింది. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో ఉద్ధవ్ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. సీఎం అయిన కొన్నాళ్లకే ఉద్ధవ్‌పై సొంత పారీ్టలో అసంతృప్తి బయలుదేరింది. శివసేనలో ఒక వర్గం నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 2022 జూన్‌లో శివసేనను ఏక్నాథ్ షిండే చీల్చేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయింది. మరోదారి లేక ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో పొత్తు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు పనిచేయలేదు. అసలైన శివసేన తమదేనని ఏక్నాథ్ షిండే శనివారం ఫలితాల తర్వాత ప్రకటించారు. ఉద్ధవ్‌ఠాక్రే వయసు64 ఏళ్లు. పారీ్టలో అరకొరగా మిగిలిన నేతలను, కార్యకర్తలను ఆయన ముందుకు నడిపించగలరా? పార్టీని సజీవంగా ఉంచగలరా? అనేదానిపై చర్చ మొదలైంది. శివసేన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఇప్పటికే ఏక్నాథ్ షిండే వర్గానికి దక్కాయి. వాటిని తిరిగి సాధించుకోవడం అనుకున్నంత సులభం కాదు. -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ రెండు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ మద్దతు ఎవరికి?
న్యూఢిల్లీ: త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆయన తన మిత్రపక్షం అయిన ఇండియా అలయన్స్‌తో పాటు ఇతర మిత్రపక్ష పార్టీలకు ప్రచారం చేయనున్నారు.కేజ్రీవాల్ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి (ఎంవీఏ) తరపున ప్రచారం చేయనున్నారు. పార్టీ వాలంటీర్లు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ రెండు రాష్ట్రాలలో ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్‌లో.. జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. అలాగే ఇండియా బ్లాక్‌లోని అర్బన్ స్థానాలకు ఆయన ప్రచారం చేయనున్నారు.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం వెలువడనుంది. మహారాష్ట్రలో ప్రధాన పోటీ ఎంఏవీ పాలక మహాయుతికి మధ్యనే ఉంది. అధికార మహా కూటమిలో బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్), శివసేన (ఏక్నాథ్ షిండే) ఉన్నాయి. రెండవ కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) ఉన్నాయి. రెండు కూటముల్లోనూ సీట్ల పంపకం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది.జార్ఖండ్‌లో నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. జార్ఖండ్‌లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులోకి దిగింది.ఇది కూడా చదవండి: ‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’ -
యూపీ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంట్లో ఎస్పీ నలుసు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీరు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 37 పార్లమెంట్ స్థానాలు కొల్లగొట్టామన్న అతివిశ్వాసంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాలదన్నుతోంది. ఎస్పీ ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. యూపీలో తమతో మాటైన చెప్పకుండా ఎస్పీ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. తాము పోటీలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో అభ్యర్థిని బరిలో దించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది. మహారాష్ట్రతో మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపొచ్చాలు పెరిగేలా 12 సీట్లు కోరుతూ కాంగ్రెస్‌కు ఎస్పీ ఇక్కట్లు తెస్తోంది. యూపీలో ఏకపక్షంగా..ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని ఎస్పీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. అయితే ఇంతవరకు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాలేదు. హరియాణా ఎన్నికల్లో అతి విశ్వాసం కారణంగా ఓటమిపాలైన కాంగ్రెస్‌తో పెట్టుకుంటే లాభం లేదని ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఏకపక్షంగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో తమ ఓటుబ్యాంకు పటిష్టంగా ఉందని బల్లగుద్ది చెబుతోంది. కాంగ్రెస్‌తో కనీస అవగాహనకు రాకుండానే సొంత అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం సైతం మొదలుపెట్టింది. ప్రకటించని మూడు స్థానాల్లో ఘజియాబాద్ సదర్, ఖైర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో ఘాజియాబాద్ సదర్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని కోరుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రాభల్యం బలంగా ఉంది. ఘజియాబాద్ సదర్‌లో దాదాపు 80వేల మంది దళితులు, 60వేల మంది బ్రాహ్మణులు, 40వేల మంది బనియాలు, 35వేల మంది ముస్లిం, 20వేల మంది ఠాకూర్లు ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ పోటీలో ఉండటంతో దళితుల ఓట్లు తనకు అనుకూలంగా మారతాయన్న నమ్మకం కాంగ్రెస్‌కు లేదు. ఠాకూర్లతో పాటు సంఖ్యాపరంగా ప్రాభల్యం ఉన్న బ్రాహ్మణ, బనియా వర్గాలు బీజేపీతో ఉండటంతో ఇక్కడ గెలుపు సులభం కాదని కాంగ్రెస్ అంచనావేస్తోంది. ఇక ఖైర్‌లో లక్ష ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాట్లు పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, 55,000 దళిత ఓట్లలో బీఎస్పీ చీలిక తెస్తుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. దీంతో ఎస్పీ ఇస్తామన్న రెండు సీట్లపై కాంగ్రెస్ అయిష్టత చూపుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో అసలు పొత్తులు ఉంటాయా? లేదంటే విడివిడిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న ఇరుపార్టీల శ్రేణుల్లో తలెత్తుతోంది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ రాజీనామా చేసిన బుద్నీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ను వీడి ఎస్పీలో చేరిన అర్జున్ ఆర్యను ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ బుద్నీలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అంశం సైతం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.మహారాష్ట్రలో అదే తీరుమహారాష్ట్రలో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్‌పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల మధ్య పొత్తు విషయంలో చర్చలపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈలోపే మధ్యలో దూరిన ఎస్పీ తమకు 12 సీట్లు కావాలని డిమాండ్‌చేస్తూ కొత్త పేచీలు మొదలెట్టింది. ఇప్పటికే రెండు స్థానాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆ అసెంబ్లీ స్థానాలకు చుట్టూ ఉన్న మరో 10 స్థానాలను తమకే కేటాయించాలని కోరుతోంది. ఇందులో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలపాలని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాయి. ఎస్పీ అంతటితో ఆగకుండా బుధవారం ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో ఎస్పీతో ఎలా డీల్ చేయాలో కాంగ్రెస్‌కు అంతుపట్టని వ్యవహారంగా తయారైంది. -
కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్
ఇటావా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకుగాను ఆరింటికి ఏకపక్షంగా టికెట్లు ఖరారు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ పరిణామంపై గురువారం స్పందించారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి ఉంటుంది. కాంగ్రెస్‌తో మా మైత్రి కూడా కొనసాగుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా’అని తెలిపారు. రాజకీయాలపై చర్చించేందుకు సమయం కాదంటూ సీట్ల ప్రకటన వ్యవహారాన్ని దాటవేశారు. హరియాణా, కశ్‌మ్రీŠ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల విషయం ప్రస్తావించగా మరోసారి మాట్లాడతానన్నారు. యూపీలో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐదింటిని డిమాండ్ చేస్తోంది. ఈ పది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంతో ఖాళీ అయ్యాయి. -
PM Narendra Modi: ఏ కష్టమొచ్చినా మేమున్నాం
న్యూఢిల్లీ: చైనా పంచన చేరి భారత్‌పై ద్వేషం పెంచుకున్న మాల్దీవులు ఇప్పుడు మళ్లీ భారత్‌తో మైత్రిబంధం బలోపేతానికి ముందడుగు వేసింది. పెట్టుబడులు, పర్యాటకం ద్వారా తమ ఆర్థికాభివృద్ధికి తోడ్పాడాలని స్నేహహస్తం అందించింది. నాలుగు నెలల వ్యవధిలోనే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌లో రెండోసారి పర్యటించడం ఈ పెనుమార్పుకు అద్దం పడుతోంది. స్నేహహస్తం అందించిన ఏ దేశానికైనా సాదర స్వాగతం పలికే భారత్ మరోసారి తన స్నేహశీలతను చాటుకుంది. వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం అందిస్తూనే మాల్దీవుల్లో సోమవారం రూపే కార్డు సేవలను ప్రారంభించింది. మాల్దీవుల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్ట్, ఇరుదేశాల మధ్య మరింత అనుసంధానత, పర్యాటకం వృద్ధి కోసం భారత ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు సమాలోచనలు జరిపారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వీరి ద్వైపాక్షిక భేటీకి వేదికైంది. తొలుత రాష్ట్రపతి భవన్లో ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలికారు. తర్వాత మోదీ, ముయిజ్జు ద్వైపాక్షిక చర్చలు జరిపాక ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు. మాల్దీవులకు దాదాపు రూ.3,360 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. సాయం చేసేందుకు సదా సిద్ధం ‘‘ మాల్దీవులు మాకు అత్యంత సమీప పొరుగుదేశం. భారత పొరుగుదేశాల విధానం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్(సాగర్) దార్శనికతలో మాల్దీవులు మాకు అత్యంత ప్రధానం. మాల్దీవులపై భారత్ ఎల్లప్పుడూ స్నేహభావాన్నే వెదజల్లింది. గతంలో ఎప్పుడు కష్టమొచ్చినా మొట్టమొదట ఆదుకునేందుకు భారతే ముందు కొచ్చింది. కోవిడ్ సంక్షోభకాలంలోనూ ఆదుకున్నాం. పొరుగుదేశంగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చాం. ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల్లో రూపే కార్డ్ సర్వీసులను మోదీ, ముయిజ్జులు వర్చువల్‌గా ప్రారంభించారు. 700 ఇళ్ల అప్పగింత రూ.3,000 కోట్ల విలువైన దిగుమతులను స్థానిక కరెన్సీల్లో చెల్లించేలా ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. హనీమధో ఎయిర్‌పోర్ట్‌లో నూతన రన్‌వేనూ ప్రారంభించారు. హల్హమేలో నిర్మించిన 700 ఇళ్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవుల్లో పోర్టులు, రోడ్ల నెట్వర్క్, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల్లో సాయపడేందుకు భారత్ అంగీకారం తెలిపింది. థాంక్యూ మోదీజీ: ముయిజ్జు ఆర్థిక సాయం ప్రకటించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ కష్టకాలంలో కీలక భాగస్వామిగా భారత్ మమ్మల్ని ఆదుకుంటోంది. పర్యాటకం అభివృద్ధికి భారత్ సాయపడాలి. ఎందుకంటే మాల్దీవుల్లో పర్యాటకానికి భారతే ప్రధాన వనరు. పెద్ద ఎత్తున భారతీయులు మా దేశంలో పర్యటించాలి’’ అని ముయిజ్జు అన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ముయిజ్జు కోరారు. మంగళవారం ఆగ్రా, ముంబైలో, బుధవారం బెంగళూరులో ముయిజ్జు పర్యటిస్తారు. -
పురందేశ్వరి ఉండబట్టే పొత్తు
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉండబట్టే ఆ పార్టీతో పొత్తు సాధ్యమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆమె స్థానంలో వేరే వారు ఉంటే ఏమయ్యేదో తెలియదని అన్నారు. కూటమిలోని మూడు పార్టీల స్వభావాలు వేరైనా, ఆలోచన ఒకటేనని అన్నారు. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని, వీలైతే ఆరోజే సిలిండర్లు ఇస్తామని చెప్పారు. వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.350 కోట్లు వచ్చాయని తెలిపారు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని అన్నారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ఎమ్మెల్యేలు తప్పులు చేయకూడదని, కక్ష సాధింపులకు దిగవద్దని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి చేయవచ్చని, ఆ నిధులు పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంలో పవన్ దగ్గరే ఎక్కువ నిధులున్నాయని చెప్పారు.అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే అప్పటి ముఖ్యమంత్రి అటు వైపే వెళ్లలేదని, పులిచింతల గేట్లు కొట్టుకుపోతే బిగించడానికి రెండు సీజన్లు పట్టిందని అన్నారు. కానీ కర్ణాటకలో తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే తాము వెళ్లి కన్నయ్యనాయుడు నేతృత్వంలో గేట్లు బిగించామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటుపై గత ఐదేళ్లలో నోరు మెదపని వైఎస్సార్సీపీ ఇప్పుడు గొడవ చేస్తోందని అన్నారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వంద రోజుల పాలనపై ఈ నెల 20 నుంచి ఆరు రోజులు ప్రచారం చేయాలని సూచించారు. త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని చెప్పారు. అప్పటి నా ప్రకటనకు వ్యూహమే లేదు : పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే తన ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరిక తప్ప వ్యూహమేమీ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు తాను షూటింగ్‌లకు కూడా వెళ్లలేదని అన్నారు. చంద్రబాబును చూసి తాను చాలా నేర్చుకున్నానని, ఆయనకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. -
కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం!
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.‘ఆప్ హర్యానా చీఫ్‌గా నేను 90 అసెంబ్లీ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నాను. పొత్తు గురించి పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈరోజు నిర్ణయం రాకపోతే, సాయంత్రంలోగా మొత్తం 90 స్థానాలకు మా జాబితాను విడుదల చేస్తాం’ అని గుప్తా తెలిపారు.కాగా హర్యాలో పోటీకి ఆప్ పూర్తిగా సిద్దంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై కొనసాగుతున్న తరుణంలో.. పార్టీ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ మాట్లాడుతూ.. పొత్తుపై సానుకూల ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారుఅక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పలువురు చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది. -
Canada: ట్రూడో ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ..
కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో కీలక మిత్రపక్షం జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ట్రూడో లిబరల్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది.ఈ మేరకు న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.. ‘ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ తేలికగా విజయం సాధిస్తుందని చూపుతున్నాయి. అయినప్పటికీ ప్రధాని ట్రూడో దీనిని గ్రహించలేకపోతున్నారు. ట్రూడో ప్రతీసారి కార్పొరేట్ దురాశకు గురవుతున్నారని పదే పదే రుజవవుతోంది. లిబరల్ పార్టీ నేతలను ప్రజలను నిరాశపరిచారు. కెనడియన్లు వారికి మరో అవకాశం ఇవ్వరు.ఒప్పందం పూర్తయింది. లిబరల్ నేతలు చాలా బలహీనంగా ఉన్నారు, చాలా స్వార్థపరులు. ప్రజల కోసం పోరాడాల్సింది పోయి కన్జర్వేటివ్‌లను, వారి ప్రణాళికలను అడ్డుకునేందుకు కార్పొరేట్ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తోంది ఈ ప్రభుత్వం. ఇక్కడ పెద్ద కంపెనీలు, వాటి సీఈవీలతో ప్రభుత్వం పనిచేస్తుంది.. పేద ప్రజల నుంచి సొమ్మును దోచి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోంది. వారు ప్రజలను నిరాశపరిచారు. కానీ ఇది ప్రజల సమయం. భవిష్యత్తులో పెద్ద యుద్ధం జరగబోతుంది. ఎన్డీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు.అయితే 2025 వరకు ట్రూడోకు తమ మద్దతు ఉంటుందని ఎన్డీపీ ఒప్పందం చేసుకుంది. కానీ వచ్చే ఎన్నికల్లో ట్రూడో పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతుండటంతో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2015 నుంచి కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో కొనసాగుతున్నారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్నప్పటికీ ట్రూడోకు తక్షణ ప్రమాదం ఏం లేదు. ప్రధాని పదవీవిరమణ చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాల్సిన రిస్క్ కూడా లేదు. కానీ ట్రూడో బడ్జెట్లను ఆమోదించాలంటే విశ్వాస ఓట్లను తట్టుకుని నిలబడాలంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్లోని ఇతర ప్రతిపక్ష శాసనసభ్యుల నుంచి మద్దతు సంపాదించాల్సి ఉంటుంది. The deal is done. The Liberals are too weak, too selfish and too beholden to corporate interests to stop the Conservatives and their plans to cut. But the NDP can. Big corporations and CEOs have had their governments. It's the people's time. pic.twitter.com/BsE9zT0CwF— Jagmeet Singh (@theJagmeetSingh) September 4, 2024 -
కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ఆప్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉండటంతో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. మిత్రపక్షాలను కలుపుకొని రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ ఆలోచనలకు పదును పెడుతోంది.ఈ క్రమంలో రాష్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆప్‌తో తొలి భేటీ అయ్యింది. అయితే ఆప్ దాదాపు 20 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు 20 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అగ్రనేత ఒకరు జాబితాను కాంగ్రెస్‌కు అందించినట్లు సమాచారం.అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కనబర్చిన మెరుగైన పనితీరు ఆధారంగా ఆప్ 20 సీట్లు డిమాండ్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల తమకు అసెంబ్లీ సీట్లలో దామాషా వాటా దక్కుతుందని ఆప్ విశ్వసిస్తోంది. కానీ ఇందుకు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ వెనుకాడుతోంది.ఇక అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆప్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్న హస్తం.. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకోవడం సవాల్‌గా మారింది. అయితే కూటమిలో భాగంగా ఆప్‌కు ఎన్ని సీట్లను కేటాయించాలన్న ప్రతిపాదనతో తిరిగి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ నాయకులను కోరినట్లు సమాచారం.కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్సీ- కాంగ్రెస్ పొత్తు?
జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీలు తహతహలాడుతున్నాయి.కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వివిధ పార్టీలు కూడా రాజకీయ సమీకరణలు ప్రారంభించాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడేందుకు ఉండే అవకాశాలపై చర్చించేందుకు శ్రీనగర్‌లో చర్చలు ప్రారంభించాయి. వీరి మధ్య సయోధ్య కుదిరితే మరో నాలుగైదు రోజుల్లో పొత్తులపై ప్రకటన వెలువడనున్నదని సమాచారం. ఇరుపక్షాల హైకమాండ్ ఆదేశాల మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా డీలిమిటేషన్ కారణంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల సమీకరణలు మారిపోయాయి. దీంతో సిట్టింగ్-గేటింగ్ ఫార్ములా అనుకూలంగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
దేశం దృష్టికి ఆటవిక పాలన.. నేడు ఢిల్లీలో ధర్నా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 50 రోజులుగా రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి.. వెంటాడి, వేటాడి హతమారుస్తూ.. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ.. ఆస్తులను ధ్వంసం చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న మారణహోమం, అరాచక, ఆటవిక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర శంఖం పూరించారు. కేవలం 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి దిగజారిన శాంతిభద్రతలను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా అక్కడే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు.. 11 కేసులు ఉంటే నన్ను కలవడానికి అనర్హులు.. 12 కంటే ఎక్కువ కేసులు ఉంటేనే తనను కలవడానికి అర్హులు అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరింత రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెప్పుతో కొట్టండి.. హాకీ స్టిక్‌లతో కొట్టండి.. అధఃపాతాళానికి తొక్కేయండి అంటూ కూటమి నేతలు పేట్రేగిపోయారు. వారి పిలుపునందుకున్న టీడీపీ శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 నుంచే అరాచకాలకు తెరతీశారు. బ్లడ్ బుక్‌గా రెడ్ బుక్ రూపాంతరం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను రెడ్ బుక్‌లో నమోదు చేసుకున్నానని.. అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తానని పాదయాత్రలో లోకేశ్ పదే పదే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో టీడీపీ శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో నరికి చంపేయడం కూటమి ప్రభుత్వం మోగిస్తున్న మరణ మృదంగానికి పరాకాష్ట. లోకేష్ రెడ్ బుక్ బ్లడ్ బుక్‌గా రూపాంతరం చెందిందనడానికి ఇదే నిదర్శనం. టీడీపీ శ్రేణుల చర్యలతో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బాధ్యతాయుతంగా స్పందించక పోవడం విభ్రాంతి కలిగిస్తోంది. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు ప్రయతి్నంచకపోగా, టీడీపీ మూకల విధ్వంసకాండను వెనుకేసుకొచ్చే రీతిలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారు. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశి్నంచలేదని మంత్రులను తప్పుపట్టారు. దారుణకాండపై పోరాటం టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతకు ముందు వినుకొండలో నడిరోడ్డుపై హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి దారుణాలన్నింటి గురించి వివరించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఏజెన్సీలతో విచారణ చేయించాలని కోరారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంసకాండపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు సాగిస్తోన్న మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.గన్నవరం విమానాశ్రయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకొన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై 24న నిరసన, ఫొటోగ్యాలరీ ఏర్పాటు సాక్షి, అమరావతి/విమానాశ్రయం(గన్నవరం)/సాక్షి, న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హింస, క్షీణిస్తోన్న శాంతి భద్రతలపై బుధవారం (24న) నిరసన కార్యక్రమంతో పాటు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన ద్వారా ఏపీలో జరుగుతోన్న అకృత్యాలను దేశ ప్రజలందరి దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకువెళ్లనుంది. వైఎస్ జగన్ వెంట ఢిల్లీకి వెళ్లిన వారిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యులు ఉన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వైఎస్ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికాయి. -
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్‌కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వారిని కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గత ప్రభుత్వ టైమ్‌లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి
వాషింగ్టన్: రష్యాతో భారత్ మైత్రి బంధం మరింత బలపడుతున్నా సరే తమకు మాత్రం వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతుందని అమెరికా పునరుద్ఘాటించింది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఇటీవలే రష్యాలో పర్యటించిన నేపథ్యంలో అమెరికా తాజాగా ఇలా స్పందించింది. వాషింగ్టన్లో మంగళవారం అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ ప్యాట్ రైడర్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘ భారత్ ఎప్పటికీ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామే. దీన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తుంటాం. ఇరుదేశాల సైనిక ఒప్పందాలు, సత్సంబంధాలు కొనసాగుతాయి’ అని స్పష్టంచేశారు. యుద్ధరంగంలో బాంబులు, బుల్లెట్ల నడుమ శాంతి స్థాపన సాధ్యంకాదని ఉక్రెయిన్ దురాక్రమణను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై రైడర్ స్పందించారు. ‘‘రష్యా దురాక్రమణను సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది’’ అని ఆయన అన్నారు. -
Big Question: అబద్ధాల శ్వేత పత్రాలపై ఉన్న శ్రద్ధ.. ఆడబిడ్డల రక్షణపై లేదా ?
-
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో అదృష్టవంతుడైన నేత అని చెప్పాలి. ఆయన ఎమ్మెల్యే అవడం నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు, అందులోను నాలుగుసార్లు సీఎంగా పగ్గాలు చేపట్టడం వరకు ఆయన అదృష్టం చెప్పలేనిది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేస్తే మంచిదే. అందుకు భిన్నంగా పాలన సాగిస్తే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆ దశలోనే ఉన్నారన్న అనుమానం కలుగుతోంది.గత మూడు టరమ్‌లలో కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతోంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, పాలన మరీ ఇంత అద్వాన్నంగా లేదని చెప్పాలి. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని వెరచేవారు. ఇప్పుడు చంద్రబాబులో ఆ వెరపు పోయినట్లయింది.జనాన్ని మాయచేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణిలోకి వెళ్లి ఉండాలి. లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా, మరీ ఇంతలా ప్రత్యర్దులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం.2024లో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో కాని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా? లేక టీడీపీ అరాచక శక్తుల పాలన సాగుతోందా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బహుశా పాలనలో తనకన్నా ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పెత్తనం బాగా పెరిగి ఉండాలి. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్రలో కాని, ఇతరత్రా కాని ఒక మాట అంటుండేవారు. తాను మూర్ఖుడనని, తన తండ్రి మాదిరి ఉదారంగా ఉండనని, రెడ్ బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని హెచ్చరిస్తుండేవారు. అలాగే తనకు నచ్చని, లేదా తనను విమర్శించేవారి పేర్లను ఆ బుక్‌లో రాస్తున్నట్లు చెబుతుండేవారు.అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద కేసు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని ఊరించేవారు. చంద్రబాబును మించి అరాచకంగా ఉపన్యాసాలు చేశారు. సరిగ్గా ప్రస్తుతం పాలన అలాగే నడుస్తోంది. కాలం కలిసి వచ్చి చంద్రబాబు, లోకేష్ లు పాలన పగ్గాలు చేపట్టారు. వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. పవన్‌ను వారు తమదారిలో పెట్టుకుని నోరు విప్పకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోబరుచుకోగలిగారు.దాడులు, విధ్వంసాలకు టీడీపీ నేతలు పాల్పడుతుంంటే, వారిపై కేసులు పెట్టడం లేదు కాని, వైఎస్సార్సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణం అయింది. కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ కూటమే అధికారంలో ఉంది కనుక ఇక్కడ నెలకొన్న అశాంతిపై బీజేపీ పెద్దలు ఎవరూ కిమ్మనడం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలు ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తమను తాము రక్షించుకోవలసి వస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తోందోనన్న భయం కలుగుతోంది.ఇవి చాలవన్నాట్లు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, మరికొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులపైన తప్పుడు కేసులు బనాయించడం. చివరికి ప్రభుత్వ వైద్యశాల అధికారులను కూడా వదలిపెట్ట లేదు. ఈ సదర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాట జరిగి ఇరవైతొమ్మిది మంది మరణించడం, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఇరవైమంది కూలీలను ఎన్ కౌంటర్ చేయడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వాటిని చంద్రబాబు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున మేనేజ్ చేసుకుని అవి తనకు చుట్టుకోకుండా జాగ్రత్తపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని తిరగదోడి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాని జగన్ ఆ పని చేయలేదు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో ఒక ఫిర్యాదు చేయించి, జగన్ పైన కేసు పెట్టిన తీరు చంద్రబాబు లేదా లోకేష్‌లు ఎంత కక్షపూరితంగా మారారో తెలియచేస్తున్నదని అంటున్నారు. ఆ కేసు పరిణామాలు ఏమి అవుతున్నాయన్నది ఇక్కడ చర్చకాదు.చంద్రబాబు పాలన అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరగా తీసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నప్పుడు కులాలు, మతాల మద్య దారుణమైన విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా ఉపన్యాసాలు చేస్తుంటే, సీఐడీ అన్ని ఆదారాలతో కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆ సమయంలో తనను హింసించారన్నది రాజు ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే ఎవరం అంగీకరించం. కాని ఆయన అప్పుడు వీరెవ్వరిపైన ఆరోపణ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కొట్టారని ఆరోపించారు. బహుశా బెయిల్ కోసం ఇలా అంటుండవచ్చులే అనుకున్నారు.న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వారు ఆయనను మొత్తం పరీక్షించి గాయలేవీ లేవని నిర్దారించారు. అందుకుగాను వారిపై కూడా రాజు ఇప్పుడు కేసు పెడుతున్నారు. తెలుగుదేశంకు న్యాయ వ్యవస్థలో ఉన్నపట్టు ఈయనకు బాగా ఉపయోగపడిందని అంతా అనుకునేవారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఈయనను మిలటరీ ఆస్పత్రిలో చేర్పించింది. వారి నివేదికలో సైతం ఆయనపై ఎవరో కొట్టిన గాయాలు ఉన్నట్లు తేల్చలేదు. పైగా ఈయన చెప్పాపెట్టకుండా ఆ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి సిబిఐ దర్యాప్తు అవసరం లేదని భావించింది. అయినా ఇప్పుడు రాజుతో చంద్రబాబో, లేక లోకేషో గుంటూరులో పోలీసు కేసు పెట్టించారు. ఇది కేవలం వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టడానికి, అధికారులను లొంగదీసుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతోంది. గత ప్రభుత్వ టైమ్‌లో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల స్కామ్‌లకు సంబంధించి సీఐడీ విచారణ చేసింది. ఆ సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ కోర్టులలో పెండింగులో ఉన్నాయి. ఆ కేసులలో ఈ అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడానికి గాను.. బెదిరించడానికి ఇలా ఏమైనా వారిపై బనాయించారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే సుప్రింకోర్టే తోసిపుచ్చిన కేసును ఇక్కడ తిరగతోడతారా? అన్న ప్రశ్న వస్తోంది.అదే టైమ్‌లో రఘురాజు ఎంత అరాచకంగా కుల విద్వేషం పెంచడానికి ప్రయత్నించింది అన్నదానిపై కూడా కేసు పెట్టి ఉంటే, పోనీలే రెండు విషయాలలోను ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందేమోలే అనుకునేవారు. అలా చేయకపోవడంతో ఇది ప్రతీకారేఛ్చతో రగులుతూ పెట్టిన కేసు అని అర్ధం అవుతుంది. లేదా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అయి ఉండాలి. ఒక్క వృద్దాప్య పెన్షన్లను మాత్రం చెప్పినట్లు చేశారు. ఇక మిగిలినవి వేటిపైన నిర్దిష్టంగా చేయడం లేదు.పెన్షన్ దారులలో అనర్హుల పేరిట ఇకపై కోతపెట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా పలు అంశాలలో జగన్ ప్రభుత్వ విదానాలనే ఏదో రకంగా పాలో కావల్సి వస్తోంది. ఉదాహరణకు తాజాగా వచ్చిన జీపీఎస్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఇవ్వడం ద్వారా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, ఇప్పుడు దానినే పాటిస్తున్నారు. బ్రేక్ వేశామని చెప్పారే తప్ప రద్దు చేయకపోవడం గమనార్హం. అంటే మోసం చేసింది జగన్ కాదు.. చంద్రబాబు, పవన్ లేనని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది.ఇసుక ఉచితం అంటే జనం అంతా నమ్మారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఇసుక గుట్టలలో సగభాగం టీడీపీ, జనసేన నేతల పరం అయిపోయింది. మిగిలిన ఇసుకకు పెద్ద ఎత్తున చార్జీల పేరుతో రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ జిఓ ఇవ్వడం, ఆ తర్వాత అది ఏదో వేరే పనికి జిఓ ఇచ్చామని చెప్పడం.. అంటే ప్రభుత్వ పనితీరు తెలియచేస్తుంది. వలంటీర్ల గురించి ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు. కొత్త ఉద్యోగాల సంగతేమో కాని వలంటీర్లకు వచ్చే గౌరవవేతనం కూడా అందేలా లేదు. ఆ రకంగా లక్షన్నర మందిని ఈ ప్రభుత్వం రోడ్డున పడవేసే సూచన కనిపిస్తోంది.ఉచిత గ్యాస్ బండలు వస్తాయో, రావోకాని మహిళలంతా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టాల్సివచ్చింది. జగన్ టైమ్‌లో మహిళలు మహరాణుల మాదిరి ఇళ్ల వద్ద కూర్చుని ఉంటే వలంటీర్ల ద్వారా దరఖాస్తులను తీసుకునేవారు. ఇప్పుడేమో రోడ్డుమీద క్యూలలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మినందుకు ప్రజలకు ఈ ప్రతిఫలం దక్కిందన్నమాట. శ్వేతపత్రాల పేరుతో జగన్ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, జనం వాటిని పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతల దాష్టికాలవల్ల కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘట్టాలు జరిగాయి. అలాగే బాలికలపై అఘాయిత్యాలు సాగుతున్నాయి.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాధాకర ఘటన వీటికి నిదర్శనం. పలు ఇతర చోట్ల కూడా నేరాలు పెరిగాయి. నేరాలు ఏ ప్రభుత్వ టైమ్‌లో అయినా జరుగుతుండవచ్చు. కాని అప్పట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గోరంతల్ని కొండంతలు చేసి ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ అయితే 2017లో టీడీపీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి కేసును జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దుష్ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క ఘటన జరగదని బీరాలు పలికారు.ఇప్పుడు ఇన్ని దుర్మార్గపు ఘటనలు, దారుణమైన నేరాలు జరుగుతున్నా పవన్ నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఆయన కోరుకున్న పదవి ఆయనకు వచ్చేసింది కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన సుద్దులు చెబుతున్నారు తప్ప, ప్రభుత్వ వైఫల్యాలపై జవాబు ఇవ్వడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ కారణంతో ఘర్షణలు జరిగినా, చంద్రబాబు నాయుడు నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికి కొంత భయపడేవారు. జనంలో దెబ్బతింటామేమో అన్న వెరపు ఉండేది. ఘర్షణలకు టీడీపీ వారు కారణమైతే కనీసం కోప్పడినట్లు నటించేవారు. కాని ఈసారి ఏకంగా నిందితులను ఆయనే కాపాడుతున్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు గురి అవుతున్నారు.ఉదాహరణకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను ఆయన మందలించకుండా పత్రికల ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పొద్దులే అని సలహా ఇచ్చి ఊరుకున్నారు. వైఎస్సార్సీపీ వారిపై వందల కొద్ది దాడులు జరిగినా, టీడీపీ వారు విధ్వంసాలకు పాల్పడుతున్నా, వాటిని అదుపు చేయకపోగా, వైఎస్సార్సీపీ వారే దాడులు చేస్తున్నారన్న భావన కలిగేలా మాట్లాడడం శోచనీయం. ఇవన్ని చూశాక ఏమనిపిస్తున్నందంటే చంద్రబాబే ఇలా విద్వేషపూరితంగా తయారయ్యారా? లేక ఆయన కుమారుడు లోకేష్ తాను అనుకున్నట్లు పోలీస్ రాజ్యాన్ని నడుపుతుంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబుకు అదృష్టం వచ్చి మళ్లీ సీఏం పదవిలోకి రావడం, తమ దురదృష్టమని ప్రజలు అనుకునేలా పరిస్థితి రాకూడదని కోరుకోవడం తప్పుకాదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు... 13 స్థానాలకు 10 చోట్ల గెలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Haryana: ఐఎన్ఎల్-బీఎస్పీ దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు
చండీగఢ్: ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌లో ఇరు పార్టీల ప్రతినిధులు పొత్తును అధికారికంగా ప్రకటించారు.హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఐఎన్ఎల్ 53 స్థానాల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇది మూడోసారి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య తొలి కూటమి ఏర్పడింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక లోక్‌సభ స్థానాన్ని, ఐఎన్ఎల్డీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.2018లోనూ ఐఎన్ఎల్, బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఐఎన్ఎల్డీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అభయ్ చౌతాలా మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీలో హర్యానాలో కూటమి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హర్యానాలో బహుజన్ సమాజ్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. -
French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?
పారిస్: ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ 30న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్పీఎఫ్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఎన్పీఎఫ్తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని పదవి కోసం ఎన్పీఎఫ్ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్పీఎఫ్లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్ అన్నారు. అప్పుడే కీచులాటలు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్ సిద్ధంగా ఉన్నా ఎన్పీఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ డిమాండ్ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. పలు మాక్రాన్ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్పీఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్ అన్»ౌడ్తో కలిసి పని చేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పీఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పీఎఫ్తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.ప్రధానీ పవర్‌ఫుల్లే... ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు. విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు. ఫలించని ముందస్తు... నేషనల్ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్ 9న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్»ౌడ్ వంటివి కలిసి కలిసి ఎన్పీఎఫ్గా ఏర్పడ్డాయి. నేషనల్ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్పీఎఫ్, సెంట్రిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించినా మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.దేశవ్యాప్త హింస... ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్పీఎఫ్ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతోంది. ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్ డ్రమానియన్ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం. ఏం జరగవచ్చు? సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
ఎన్డీఏ ఎప్పుడైనా ముక్కలు కావచ్చు: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.అందులోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విద్వేషపు ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ తాము పోరాడామన్నారు. -
చంద్రబాబు కూటమిపై రెచ్చిపోయిన పోతిన మహేష్
-
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్సైట్ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది. -
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలందరూ గురువారం సమావేశమయ్యారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని తెలిపారు. ఆప్ మంత్రి గోపాల్ రాయ్కాగా ఢిల్లీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ భారీ విజయాలను నమోదు చేసింది. బీజేపీ వరుసాగా మూడు, ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 13 ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించారు. అలాగే ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ నిమోజకవర్గంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏడు స్థానాలకు గానూ ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడుచోట్ల పోటీ చేశాయి. -
బీహార్ లో NDA కూటమికి షాక్
-
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
కరమా ?..కమలమా ?
-
కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
-
కేజ్రీవాల్‌కు బెయిల్.. ఇండియా కూటమికి ఎంత లాభం?
2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల ఓటింగ్ పూర్తియ్యింది. ఇంతలో ఇండియా అలయన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి శుభవార్త వినిపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో స్కామ్ ఆరోపణలపై 40 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ బెయిల్ సమయంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపిరి అందినట్లయ్యింది. భారత కూటమిలోనూ ఉత్సాహం నెలకొంది. అయితే ఇది ఇండియా కూటమికి ఎంతవరకూ లాభం చేకూరుస్తుందనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కేజ్రీవాల్ ప్రచారంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేజ్రీవాల్ విడుదల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని 18 లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపనుంది. మే 25న ఢిల్లీ, హర్యానాలలో ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. కాగా పంజాబ్‌లో జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఆ రోజుతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగియనుంది.బెయిల్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని నాలుగు ఆప్ స్థానాలలో ప్రచారం చేయడమే కాకుండా, పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడిన మూడు స్థానాలలో కూడా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఇక్కడ ఆప్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అటువంటి పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంతో ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ కూడా లాభపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. -
మోదీ సభలో నోరెత్తగలవా? చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ! ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో జత కడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూ ఎన్డీఏలో కొనసాగుతానంటాడు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? – నెల్లూరు సభలో సీఎం జగన్మండుటెండలోనూ పలమనేరులో చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతోపాటు ఈ వర్షం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. విజయం మనదే. – పలమనేరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి నెల్లూరు, సాక్షి, తిరుపతి, సాక్షి, పుట్టపర్తి: ‘నేను ఈరోజు.. ధైర్యంగా చెబుతున్నా. ఆరునూరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెబుతున్నాడు. ఇది మీ జగన్ మాట. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా పోరాడతా. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలడా? ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? ఎందుకీ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ.. మరోవైపు వాళ్లు 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వారితోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు? సమాధానం చెప్పు చంద్రబాబూ..!’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా నిలదీశారు. శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు..ఇక్కడ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు, సయ్యద్‌లకు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు. ఇవాళ నేను ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని, బీజేపీని అడుగుతున్నా. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు. అన్ని మతాల్లో కూడా బీసీలు, ఓసీలున్నారు. అవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.మైనార్టీలకు మీ జగనన్న భరోసా..నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడు, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా. మీకు 4 శాతం రిజర్వేషన్ల విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా.. మీ మనోభావాలకు, ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు. మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా లాంటి వాటితో అండగా నిలిచాం. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నా మైనార్టీ సోదరుడు ఒకరిని డిప్యూటీ సీఎంగా, మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించి గౌరవించాం. మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం దాకా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం కల్పించి సాదరంగా పక్కన పెట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెబుతున్నా. మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో 7 స్థానాలు మైనార్టీలకే ఇవ్వడం ద్వారా వారికి రాజకీయంగానూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయింది. అలా ఇచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీనే అని గర్వంగా చెబుతున్నా.ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఐదేళ్ల పాటు మీ రక్తం తాగుతుంది. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో జమ చేశాడు. గతంలో రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నాడు. మీ బిడ్డ ఐదేళ్లలో చేసిన మంచినే చూపిస్తున్నాడు. నలుగురిలో నిలబడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు. ఒక మనిషి 14ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసుండీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మనం చేసిన అభివృద్ధి...నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తిచేసి జాతికి అంకితం చేసింది మన ప్రభుత్వమే. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి చిత్రావతి, గండికోట, పులిచింతల రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశాం. వెలిగొండలో రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తిచేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకెళుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పైప్‌లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయి అందించి తోడుగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని వరుసగా నెంబర్ వన్‌గా నిలబెట్టాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి కావచ్చాయి. గడగడా చెబుతాగవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి లాంటివి గతంలో ఉన్నాయా? పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా? నా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగేలా ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3,000 పెన్షన్, రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతు భరోసా లాంటివి గతంలో ఉన్నాయా? రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా? సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు, తోడు, లాయర్లకు లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా?ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా ద్వారా కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా అండగా నిలిచాం. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు ప్రజలకు గడప వద్దే అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయి. నాడు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లోకెళ్లింది? పిండి కొద్దీ రొట్టె సామెత మనకు తెలుసు. కానీ,పిండీ.. రొట్టె మొత్తం తినేసే బ్యాచ్‌కు లీడర్ చంద్రబాబు! తన 14 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్కటైనా మంచిపనిగానీ, ఖాతాల్లోకి ఒక్క రూపాయిగానీ జమ చేశాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లో జమ చేశారో నిలదీసి అడగండి. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంతిచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయింది?మన అభ్యర్థులను దీవించండిపలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి æదీపికమ్మ, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. 2014లో బాబు ముఖ్యమైన విఫల హామీలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని నమ్మబలికి రూపాయి అయినా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశాడా? » సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు.» మళ్లీ ఇప్పుడు అదే కూటమి పేరుతో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యారు.ఇంటికే పెన్షన్లను అడ్డుకున్న బాబు..చంద్రబాబు మొన్న అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పింఛన్‌ను అడ్డుకున్నారు. ఇవాళ బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వలంటీర్లు ఇంటికి రాకూడదు, వాళ్లు పెన్షన్లు ఇవ్వకూడదంటూ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లెటర్ రాశాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్‌పై వేయాలని ప్రయత్నించడం సిగ్గు చేటు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. జగనన్న వచ్చాడు.. వర్షాన్ని తెచ్చాడుహిందూపురంలో పర్యటన ముగించుకుని సీఎం జగన్ పలమనేరు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే క్లాక్ టవర్ వద్దకు జన ప్రవాహం మొదలైంది. అందరిలో హర్షం వెల్లివిరిసేలా సీఎం జగన్‌తో పాటు వరుణ దేవుడు తోడుగా వచ్చాడు. దాదాపు 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. జగన్ వస్తే వానొస్తుందంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. -
పేదలపై చంద్రబాబు కూటమి మరో కుట్ర
సాక్షి, విజయవాడ: పేదల పథకాలపై చంద్రబాబు కూటమి మరో కుట్రకు తెరలేపింది. పేదలకు పథకాలు అందకుండా పరోక్ష ఫిర్యాదులు చేస్తోంది. ఇన్‌ఫుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపులను కూటమి అడ్డుకుంటోంది. డీబీటీ చివరి దశ చెల్లింపులకు మోకాలడ్డుతోంది.డీబీటీ చివరి దశ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమతి కోసం ఇప్పటికే ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతి ఇవ్వకుండా ఈసీపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారు.పెన్షన్లు అడ్డుకున్న తరహాలోనే పథకాల అమలును టీడీపీ కూటమి అడ్డుకుంటోంది. బీజేపీతో టీడీపీ పొత్తు తర్వాత పరిస్థితులు మారాయి. లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అమల్లో ఉన్న పథకాలకు కోడ్ అడ్డంకి కాదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. లబ్ధిదారుల ఇబ్బందులను ప్రభుత్వం ఈసీ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. వెంటనే అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. -
కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..
-
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
బీజేపీ నిర్ణయాలతో కూటమి కుదేల్
భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను బతిమాలుకుని బామాలుకుని.. పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కూటమికి ఆ పొత్తు వల్ల ఎంత లాభమో తెలీదు కానీ.. కోలుకోలేనంత నష్టం అయితే తప్పదని రాజకీయ పండితులు అంటున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్న బీజేపీతో జట్టు కట్టినందుకు విశాఖ జిల్లాలో కూటమిపై గుర్రుగా ఉన్నారు ప్రజలు. ఇక బీజేపీ కేంద్రమంత్రులు ముస్లిం రిజర్వేషన్లపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీని చావుదెబ్బ తీయడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ ఉన్న కూటమికి ముస్లింలు ఓటు వేసే పరిస్థితే ఉండదంటున్నారు.ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే తెలుగుదేశం పార్టీ మనుగడే కష్టమని భావిస్తోన్న చంద్రబాబు ఒంటరి పోరాటానికి ధైర్యం చేయలేకపోయారు. ముందుగా జనసేన పార్టీతో జట్టు కట్టారు. ఆ తర్వాత బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నాయకత్వానికి రాయబారాలు పంపారు. తమతో పొత్తు పెట్టుకుంటే అడిగిన ఎంపీ సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. చాలా కాలం పాటు టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటూ వచ్చిన కమల నాథులు మొత్తానికి చంద్రబాబు పార్టీతో పొత్తుకు సై అన్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు మత్రమే ఉన్నాయి. అయినా చంద్రబాబు పట్టుబట్టి పొత్తు పెట్టుకోడానికి వేరే కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు అయినా కూడా మూడు పార్టీల క్షేత్ర స్థాయి కార్యకర్తల మధ్య ఇంతవరకు సయోధ్య కుదరలేదని ఆయా పార్టీల నేతలే కంగారు పడుతూ వచ్చారు. మిత్ర పక్షాల కోసం పలు సీట్లలో అభ్యర్ధులను మార్చుకోవలసి వచ్చింది కూడా. మూడు పార్టీలు కలిసి బరిలో దిగినా కూడా శ్రేణుల్లో ఉండాల్సిన జోష్ ఇంకా రాలేదు. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. బీజేపీ-జనసేన పార్టీల్లో ఒరిజినల్ నేతలను పక్కన పెట్టి టిడిపి నేతలకే టికెట్లు ఇప్పించుకోవడం కూడా కూటమికి మైనస్సే అయ్యింది.ఈ తలనొప్పులతోనే సతమతమవుతూ ఉంటే బీజేపీ కేంద్ర మంత్రుల ప్రచారం టీడీపీ, జనసేనలను లాగి లెంపకాయ కొట్టింది. ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు. బీజేపీ విధానం కారణంగా టీడీపీకి ముస్లిం ఓట్లు పడే అవకాశాలు పూర్తిగా పోయాయి. చంద్రబాబు పాలనలో ముస్లింలను ఏనాడూ పట్టించుకోలేదన్ విమర్శలు ఎలానూ ఉన్నాయి. అవి చాలవన్నట్లు ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్లకు ఎసరు పెట్టే బీజేపీతో అంటకాగుతోన్న టీడీపీకి ముస్లింలు ఓటు వేసే పరిస్థితులు ఉండనే ఉండంటున్నారు ముస్లిం మేధావులు.ఇక ఉత్తరాంధ్రలోనూ ఓ సమస్య ఉంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు అయ్యల చేతుల్లో పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో ఆంధ్రులకు భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని.. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదని అందులో కోరారు జగన్. అంతే కాదు కర్మాగారం లాభసాటిగా నడవాలంటే ఏం చేయాలో కొన్ని సూచనలు, సిఫారసులను కూడా ఆ లేఖలో పొందు పర్చారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేశారు కూడా.బీజేపీ మిత్ర పక్షమైన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నోరు మెదపలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం తాను కేంద్రంతో మాట్లాడి కార్మికులను ఆదుకుంటానన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కాపాడతానన్నారు. అయితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ప్రయోజనాలను పరిరక్షిస్తారన్న నమ్మకం ఉక్కు కార్మికుల్లో లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. విశాఖ జిల్లాలో కనీసం ఆరేడు నియోజక వర్గాలపై ఉక్కు కార్మికుల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ-జనసేనలకు భారీ నష్టం తప్పదంటున్నారు రాజకీయ పండితులు.-సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
బాబు అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకుని మాయమాటలు చెబుతున్నాడని, ఆయన అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. చంద్రబాబు తీరును తప్పుబడుతూ మునీర్ అహ్మద్ మంగళవారం సాక్షితో మాట్లాడారు. సొంత అవసరం, అవకాశాన్ని బట్టి పార్టీలతో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు ముస్లిం మైనార్టీలను మాయమాటలతో మోసం చేస్తూ వచ్చారన్నారు. ప్రతిసారి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, ఇంకెప్పుడూ మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోనని నమ్మబలకడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని సిగ్గులేకుండా జనం ముందుకు వస్తున్నాడన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం నైతిక విలువలు లేని స్వార్థ రాజకీయ చరిత్రేనని చెప్పారు. ఈ అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు తొలినుంచి ముస్లిం ఓట్లు రాబట్టుకుని వారిని ధోకా (మోసం) చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు వివక్షపూరిత స్వభావం కలిగిన సీఏఏ బిల్లుకు మద్దతు తెలపడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. మైనారిటీలకు పదవులు ఇవ్వలేదని ప్రశ్నించిన ముస్లిం సోదరులపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించిన దురాగతాలను ముస్లిం సమాజం మరచిపోలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల కోసం రూ.3,495 కోట్లు కేటాయిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.23 వేల కోట్లు ముస్లిం సంక్షేమానికి ఖర్చు చేసిందని చెప్పారు. ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లను కొనసాగిస్తున్న సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను దగాచేయడానికి జట్టుకట్టారని మండిపడ్డారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌తోపాటు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన సీఎం జగన్ ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ముస్లింలలో వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు కొందర్ని చుట్టూ పెట్టుకుని మళ్లీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజం చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మేస్థితిలో లేదని, సీఎం జగన్‌కే ముస్లింల మద్దతు దక్కుతుందని మునీర్ అహ్మద్ స్పష్టం చేశారు. -
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. -
మా స్థానాలు, అభ్యర్థుల మార్పులుండవు
సాక్షి, అమరావతి: పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ఆయా స్థానాలకు ఇప్పటికే పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీట్లు మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన నరసాపురం లోక్‌సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిపై సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత
అధికారంకోసం అడ్డదారులు తొక్కడం... అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడం... రోజుకో ఎత్తు గడతో నాలుక మడతేసేయడం... బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం... మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాల్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వ్యక్తులనైనా బోల్తాకొట్టించగల సమర్థుడాయన. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాట్లు పడ్డారు. అంతేనా...మరో అడుగు ముందుకేసి ఆయన సోదరినే పావుగా వాడుకున్నాడు. అదీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా... చెల్లెళ్లిద్దరూ కలసి నాటక మాడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంకోసం ఎంతకైనా తెగించగలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జనం సైతం ఛీకొడుతున్నారు. సాక్షి, అమరావతి: రాజకీయంలో ఎలాంటి కుట్రలకైనా వెరవకూడదనీ.. అబద్ధాలు అలవోకగా ఆడేయొచ్చని.. ఎలాంటి విషయాన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అ్రస్తాలను ఎక్కుపెట్టారు. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి చివరి ప్రయత్నంగా మహానేత వైఎస్ కుటుంబాన్ని చీల్చి.. సీఎం జగన్‌పై సోదరి షర్మిలను ప్రయోగించారు. సోదరికే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలరని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబే.. ఆమెకు జనస్పందన లభించకపోవడం, తాను అనుకున్న ప్రయోజనాలు లభించే అవకాశాలు కన్పించకపోవడంతో మరోసారి మాట మార్చారు. శనివారం పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని.. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ఇప్పుడు కొత్తగా ప్రశ్నించారు. అంతేగాదు... పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందంటూ ఆరోపించారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని మరో ప్రచారానికి దిగారు. దీనిని బట్టి ఆయన రంగులు మార్చడంలో ఊసరవెల్లికి కూడా మించిపోతారని రాజకీయ విశ్లేషకులు వ్యంగోక్తులు విసురుతున్నారు. పావులా మారిన షర్మిల తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్సార్సీపీని షర్మిల స్థాపించారు. తన బతుకైనా చావైనా తెలంగాణలోనేని ఆమె అప్పట్లో ప్రతిజæ్ఞ చేశారు. కానీ.. గతేడాది చివర్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీలోని తన ఏజెంట్, ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్‌కు ఇం‘ధనం’ చేకూర్చి.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నాక ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే ప్రయాణించారు.ఇప్పటికీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే.. ఆమె భర్త అనిల్ టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. షర్మిలను సీఎం జగన్‌పై ఉసిగొలిపి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక చంద్రబాబు, ఎల్లో పత్రికలు సీఎం జగన్‌పై చిమ్ముతున్న విషాన్నే పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వల్లెవేయించారు. మరో అడుగు ముందుకేసి కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచేలా చక్రం తిప్పారు. షర్మిలకు తోడుగా వివేకా కూతరు సునీతను రంగంలోకి దించారు. వారిద్దరి ద్వారా వివేకా హత్యపై దుష్ప్రచారం చేయించి.. దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. కానీ.. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకు దారితీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్‌సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాస్పందన కన్పించలేదు. తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిలపైనా నిందలు మొదలుపెట్టేశారు. వారిద్దరూ కలసి ఎనీ్టయే ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నారు. అధికారంకోసం జిత్తులమారి ఎత్తులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేని చంద్రబాబు జనసేన, బీజేపీతో జతకలిశారు. మరో వైపు వివేకానందరెడ్డి కూతురు సునీతను చేరదీశారు. వివేకా హత్యపై సునీతతో దుష్ప్రచారం చేయిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. అంతేగాకుండా జగన్ సోదరి షర్మిలను వాడుకునేందుకు కొత్త ప్రణాళికను అమలు పర్చారు. -
Visakha: కూటమిలో పోస్టర్ల కలకలం
విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది. కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్‌కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్‌కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్‌కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది. -
ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు?
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎంపీలోని ప్రముఖ ఖజురహో స్థానం నుండి ఇండియా అలయన్స్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఖజురహో లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించింది. ఇప్పుడు సమాజ్‌వాదీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇండియా కూటమికి నష్టమని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీడి శర్మ ఖజురహో స్థానం నుండి గిలిచి ఎంపీ అయ్యారు. ఈ విధంగా చూస్తే ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది. ఇండియా అలయన్స్ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ సహా నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పన్నా సురేష్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ పత్రాలలో సంతకాలు లేవన్నారు. అలాగే ఓటరు జాబితా కాపీ కూడా లేదన్నారు. పలు కారణాలతో ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొత్తం నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయని తెలిపారు. ఖజురహో సీటుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులను మార్చింది. మొదట మనోజ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత మనోజ్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీరా యాదవ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మీరా యాదవ్ నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్, ఎస్పీల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్‌బెంగాల్‌లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్‌ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
జనసేనను చిదిమేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి! ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేశారు. పొత్తుల పేరుతో ఆ పార్టీని రెండు ఉమ్మడి జిల్లాలకే పరిమితం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఓ బొమ్మలా మార్చేసుకొని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 మాత్రమే ఇచ్చి, మమ అనిపించేశారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంలో ఎక్కువ మంది రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అలాంటి పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బతీసి, పొత్తుల పేరుతో ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా, జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు తిరుపతి, రైల్వే కోడూరు మాత్రమే. ఉమ్మడి శ్రీకాకళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.. ఈ ఆరు జిల్లాల పరిధిలో 74 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 4 మాత్రమే జనసేనకు వచ్చాయి. ఈ నాలుగింటిలోనూ నెల్లిమర్ల, తెనాలి సీట్లను మాత్రమే జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇంకా పాతపట్నం, అవనిగడ్డ స్థానాలు జనసేనకే అని చెబుతున్నప్పటికీ, అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇలా 126 స్థానాలు (70 శాతానికి పైగా అసెంబ్లీ స్థానాలు) ఉన్న ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో జనసేనకు వచ్చిన నియోజకవర్గాలు ఆరు మాత్రమే. అంటే.. కనీసం జిల్లాకు ఒకటి కూడా ఇవ్వలేదు. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 స్థానాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో 12 చోట్ల జనసేన పోటీ చేస్తోంది. ఈ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చింది ఈ రెండు జిల్లాల్లోనే. అదీ.. ఉన్న సీట్లలో మూడో వంతుకంటే తక్కువే. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాల్లో మూడు చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. అంటే ఐదో వంతు స్థానాలతో సరిపెట్టారు. నాయకుల గోడు పార్టీ అధినేత సైతం వినే పరిస్థితి లేక.. పొత్తులో జనసేన పార్టీకి దక్కినవే 21 అసెంబ్లీ సీట్లు. వీటిలోనూ జనసేన నేతలకు అన్యాయమే జరిగింది. ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఈ స్థానాల్లో ఎక్కువ భాగం దక్కాయి. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి 2019 ఎన్నికల్లో పవన్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేతే కావడం గమనార్హం. మరోవైపు జనసేన పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించగా, అందులో మచిలీపట్నం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బాలÔౌరి రెండు నెలల క్రితమే పార్టీలో చేరారు. ఇలా సీట్ల సంఖ్యలోనే కాదు.. పార్టీ నేతలకు న్యాయం చేయడంలోనూ జనసేన దెబ్బతింది. దీంతో పార్టీలో నియోజకవర్గ, ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇంతకాలం పార్టీకి పనిచేస్తే తమకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటూ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, నాయకులు మౌనం వహిస్తున్నారు. 2019లో 24,248 ఓట్లు వచ్చిన భీమిలి నియోజకవర్గంలో ఈసారి జనసేన ఎందుకు పోటీ చేయడంలేదని అక్కడ టికెట్ ఆశించిన నాయకుడిని స్థానిక కార్యకర్తలు ఓ సమావేశంలో నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ఆయన సమావేశం కొనసాగినంత సేపు తలదించుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా హల్చల్ చేస్తోంది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు గత ఎన్నికల్లో 22 వేలకు పైగానే ఓట్లు వచ్చాయి. ఆ స్థానంలో అప్పుడు పోటీ చేసిన నాయకుడే మరోసారి పోటీ చేయాలని భావించారు. పొత్తులో ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో గత 15 రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేశారు. అయినా, పార్టీ నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో ‘ఇంకేమి చేయాలి. ఎంత ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోకపోతే చివరకు ఆ ఏసుక్రీస్తుకే చెవిలో బాధ చెప్పుకున్నా’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తమ గోడును కనీసం పార్టీ అధినేత పవన్ కూడా వినే పరిస్థితి లేక చాలా నియోజకవర్గాల్లో నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొంటున్నారు. మిత్రపక్షాలను మింగే అనకొండ.. అవకాశం ఉంటే... తెలుగుదేశం పార్టీ అంటే మిత్రపక్షాలను మింగే అనకొండ అన్నది అందరికీ తెలిసిన విషయమే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచిందని.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 12 లోకసభ స్థానాలు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలోనూ ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడు సార్లు బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేశాయి. అయితే, 1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ, ఉమ్మడి ఏపీలో 18 శాతానికి ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా రెండు విడతలు టీడీపీతో పొత్తు పెట్టుకొని, 2009 కల్లా మూడు శాతం ఓట్లకు దిగజారిపోయిందని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఐదేళ్ల విరామం అనంతరం 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఒక శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని ఆ నాయకులు తెలిపారు. పలుసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టులు సైతం రాష్ట్రంలో ప్రతి ఎన్నికలకు తమ ఓటు బ్యాంకు కోల్పోయారని విశ్లేíÙస్తున్నారు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని, అధికారంలోకి వచ్చాక ఆ మిత్రపక్ష పార్టీలను వారికి సైతం తెలియకుండా మింగేసే చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఇప్పుడు పొత్తులకు ముందే జనసేనను రెండు మూడు జిల్లాల ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత ఆ జిల్లాల్లోనూ జనసేనకు ఉనికే లేకుండా చేసే పరిస్థితే ఉంటుందని ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీసీలకు బాబు పోటు
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలపై మొసలి కన్నీళ్లు కురిపించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పొత్తులో టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 34 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించారు. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 32 సీట్లు ఇచ్చారు. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం. ఇక మైనారిటీలకు నామమాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు కేవలం 9 సీట్లు మాత్రమే వారికి కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నా సీట్లు మాత్రం ఇవ్వలేదు. ఎంపీ సీట్లలోనూ అదే తీరు.. ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇవ్వగా తన సొంత సామాజిక వర్గానికీ ఆరు సీట్లు ఇచ్చారు. పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీన్నిబట్టి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. తన ప్రసంగాల్లో పేదల గురించి, సామాజిక న్యాయం గురించి డప్పు కొట్టే చంద్రబాబు రాజకీయంగా మాత్రం వారిని అణగదొక్కుతూనే ఉన్నట్లు మరోసారి తేలిపోయింది. -
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్‌కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్‌కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్‌ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్‌కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్‌ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
India Alliance: బిహార్‌లో కాంగ్రెస్ పోటీ చేసే సీట్లు ఎన్నంటే..
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్ఏఎమ్ ఒక సీటు, ఆర్ఎల్ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ -
కూటమి విచ్ఛిన్నం.. ఒంటరిగానే జేజేపీ పోటీ
Haryana: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. “రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జననాయక్ జనతా పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చౌతాలా ఏఎన్ఐకి చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP-JJP) కూటమి విచ్ఛిన్నమైన కొన్ని రోజులలోనే జేజేపీ నుంచి ఒంటరి పోటీ నిర్ణయం వచ్చింది. ఈ కూటమి విచ్ఛిన్నం మార్చి 12న మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాకు దారితీసింది. నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సైనీ కురుక్షేత్ర నుండి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఆప్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన జేజేపీ పోటీ చేసిన 7 స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాగా హర్యానాలో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 25న ఆరో దశలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్‌ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్‌ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్‌ఖాన్‌తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్‌ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్‌పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్‌ను కలిశారు. టికెట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్‌గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్‌లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్‌ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్‌కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్‌జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్‌కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
బీజేపీలో సీనియర్లకు సీటులేదు!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, ఇద్దరు మాజీమంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటుదక్కింది. కానీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర నిరాశే మిగిలింది. మొన్న పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రిక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు.. నిన్న మొన్నటి వరకు పార్టీతో సంబంధంలేని వారికి టికెట్లు ఇప్పించుకున్నారని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. నిజానికి.. బీజేపీ జాబితాలో బద్వేలు అభ్యర్థిగా ప్రకటించిన రోశన్న అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందే పార్టీలో చేరారని వారు చెప్పారు. అలాగే, రెండు మూడ్రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడిగా కొనసాగారని.. అసలు పొత్తులో బద్వేలు స్థానాన్ని బీజేపీ ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందో.. టీడీపీ నేతను హడావుడిగా పార్టీలో చేర్చుకుని అతనికెందుకు సీటు ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర పార్టీలో చాలామందికి అంతుబట్టడంలేదు. ఇప్పుడు బీజేపీలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి.. చాలా నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నాయకులు రెండు మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కష్టపడిన వారి స్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు ఇస్తామన్న స్థానాల్లో తనకు అనుకూలమైన వారి పేర్లను పురందేశ్వరి జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపారని వారు ఆరోపిస్తున్నారు. పదిలో ఆరుగురు వలస నేతలే.. ఇక 2019 ఎన్నికలు వరకు తెలుగుదేశంలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన చంద్రబాబు సొంత మనుషులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి నాయకులు పొత్తులో బీజేపీకి దక్కిన స్థానాల్లో సీట్లు ఎగరేసుకెళ్లారని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మరో నమ్మినబంటు కామినేని శ్రీనివాస్ సైతం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ–టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమల దళంలో చేరి ఆ ఎన్నికల్లో గెలుపొందాక ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారన్నారు. అలాగే.. 2019లో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తులేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరఫున పోటీచేసేందుకు విముఖత వ్యక్తంచేసి ఎన్నికలకు దూరంగా ఉన్నారని తాజాగా సీట్లు దక్కని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక పార్టీ ప్రకటించిన పది స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులు కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయమని స్పష్టంగా తెలిసిన తర్వాత పదేళ్ల క్రితం పార్టీలో చేరిన నాయకులని చెబుతున్నారు. ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ మొదట నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తి. అప్పట్లో ఆయన అసలు పార్టీ నాయకుడిగా పనిచేయలేదని, ఒకవేళ అతణ్ణి మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తిగా పరిగణించినా మిగిలిన ఆరుగురు వలస నేతలేనని బీజేపీలో చర్చ సాగుతోంది. -
టీడీపీ, బీజేపీ పొత్తుకు అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
-
తమ్ముళ్ల తిరుగుబాటు
అవనిగడ్డ/పెందుర్తి/పెద్దతిప్పసముద్రం/ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఎన్నో ఏళ్లుగా సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ కార్యక్రమాలకోసం డబ్బు తగలేసుకుని, కష్టకాలంలో జెండా మోస్తే తీరా ఎన్నికలు వచ్చేసరికి పొత్తులో భాగంగా వేరొకరికి ఇస్తామంటే ఎందుకు సహకరించాలని వారు నిలదీస్తున్నారు. అక్కడ టికెట్ దక్కించుకున్నవారికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోనైతే ఒక అడుగు ముందుకేసి 30మంది నాయకులు తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీనామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు అక్కడి టికెట్ కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ 30 మంది పార్టీ నాయకులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసి, ఆ లేఖలను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నియోజకవర్గంలో గెలిచే సత్తా బుద్ధప్రసాద్‌కే ఉందని, పొత్తుని పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారనీ, కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనకు కనీసం టికెట్ గురించి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. రాజీనామా చేసిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, అశ్వరావుపాలెం సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, క్లస్టర్ ఇన్చార్జి బండే రాఘవ, మాజీ ఉపసర్పంచ్లు ఘంటసాల కన్నయ్య, అడపా శ్రీనివాసరావు తదితరులున్నారు.కాగా పొత్తు ధర్మం పాటిస్తామంటూనే టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడటంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు అన్యాయంపై రగులుతున్న కేడర్ 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన బండారు సత్యనారాయణమూర్తిని కాదని ఎక్కడి నుంచో పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి పెందుర్తి టికెట్ ఇస్తారా అంటూ అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ కేడర్ మండిపడుతోంది. టీడీపీ నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడి జనసేన అభ్యర్థి పంచకర్ల తలకిందులుగా తపస్సు చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దానికి ప్రతిగా జనసేన నాయకులు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు సహకరించడం న్యాయమని భావిస్తున్నాం. తామేమీ టీడీపీ నాయకుల ఓట్ల మీద ఆధారపడి పోటీ చేయడం లేదని సమాధానమిస్తున్నారు. మొత్తమ్మీద పెందుర్తిలో కూటమి వికటిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులైన బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు కలసి పనిచేయడం ఇక కల్లే అని అక్కడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ధర్మంలో జనసేనకే టికెట్ ఇవ్వవలసి వస్తే టి.శివశంకర్‌కు టికెట్ ఇవ్వాలని, పంచకర్లకు వద్దని మొదటినుంచీ చెబుతున్నారు. కానీ వారి డిమాండ్‌ను జనసేన అధినేత పట్టించుకోకపోవడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి చుక్కెదురు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. సోమవారం రాత్రి ఆయన మండలంలోని బూర్లపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఇంటింటా తిరిగి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఇదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కు మద్దతుగా జై శంకర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో జయచంద్రరెడ్డి తీవ్ర అసహనానికి లోనై వెను తిరిగారు. గిద్దలూరు జనసేనకుఇవ్వాల్సిందే ఒంగోలు జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు, కాపు సంఘం జిల్లా అ«ధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కల్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతం కాపు జనాభా ఉన్నారని, వైఎస్సార్సీపీ 31 సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తెనాలిలో జనసేనకు కేటాయించినా అది కాపు సామాజిక వర్గం కాదన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టికెట్ కేటాయించలేదని, ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు కేటాయించాల్సిందేనన్నారు. ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాల్సిందే అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి మనసు మార్చుకుని గిద్దలూరు టికెట్‌ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు(కొండపి), బి.బ్రహ్మయ్య(అద్దంకి), ఆర్.శ్రీనివాసరావు(పర్చూరు) తదితరులు పాల్గొన్నారు. -
పొత్తు కోసం నేను వెళ్లలేదు
సాక్షి, తిరుపతి: బీజేపీ కోరితేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నానని, పొత్తును తాను కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం కుప్పంలో ముస్లింలు, యువత, ఆ తర్వాత హంద్రీ నీవా వద్ద జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ముస్లింలతో సమావేశం సందర్భంగా బీజేపీ కోరితేనే పొత్తు పెట్టుకున్నట్లు మాట్లాడారు. ‘పొత్తు కావాలని నేను వెళ్ళలేదు. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ ఆ సమావేశానికి వచ్చిన వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్డీయే ఉన్నప్పుడు, లేనప్పుడు మైనార్టీలకు అండగా నిలిచింది తామేనని చెప్పారు. పొత్తు సీట్ల కోసం కాదని అన్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్ళు నింపుతానని, కుప్పాన్ని బెస్ట్ టౌన్‌గా చేస్తానని అన్నారు. వైఎస్సార్సీపీ వాళ్లు ఒక ట్యాంకర్లో నీళ్లు తెచ్చి సినిమా సెట్టింగులు వేసి కుప్పానికి నీళ్ళిచ్చేశానంటూ ప్రజలను ఏమార్చారని ఆరోపించారు. తెచ్చిపోసిన నీళ్ళు తెల్లారేసరికి ఇంకిపోయాయని, అద్దె గేట్లు సాయంత్రం ఎత్తుకెళ్ళారని విమర్శలు చేశారు. త్వరలో డ్రామా కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారని, దాని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు. వారి వద్ద ఉన్న డేటాను ఈసీ కలెక్ట్ చేసుకోవాలని కోరతామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయలేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హంద్రీ–నీవా కాలువకు నీటిని తీసుకువస్తామన్నారు. ఇప్పటి వరకు కుప్పంను అభివృద్ధి చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతారని రెండు హెలిక్యాప్టర్లలో తిరిగారని సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లపై సీఎం జగన్ ఫోటో పెట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పడు ఇజ్రాయిల్ టెక్నాలజీ నిలిపివేశారని, ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశారని విమర్శించారు. గుండిశెట్టిపల్లి వద్ద మన్యం భూములు కొట్టేయాలని చూస్తున్నారని అన్నారు. నేర సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డి వరల్డ్ ఫిగర్ అని, తప్పులు చేసి ఎదుటి వారిని నిందిస్తుంటారని అన్నారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్ యువతతో జరిగిన సమావేశంలో బాబు గొప్పలను యువకులు నిలదీశారు. కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానిని చంద్రబాబు దశాబ్దాలుగా హామీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఇటుకరాయి ముక్క వేయలేదు. పైగా, ‘కుప్పం ఎయిర్పోర్ట్ ద్వారా పండ్లు, కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తా’ అంటూ మరోసారి అదే హామీ ఇచ్చారు. దీంతో ఓ యువకుడు లేచి ‘కుప్పం నుంచి కూరగాయలు ఇతర దిగుబడులను విదేశాలకు ఎగుమతులు చేస్తానని చెబుతున్నారు. మీరు గతంలోనూ పలుసందర్భాల్లో కుప్పంలో విమానాశ్రయం నిర్మిస్తానని చెప్పారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్’ అని చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో ఓ క్షణం నివ్వెరబోయిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విమానాశ్రయాన్ని నిర్మిస్తానని అని ఆ అంశాన్ని ముగించారు. బాబును నిలదీసిన వృద్ధురాలు కుప్పం పట్టణం బాబునగర్‌లో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ఓ వృద్ధురాలి నుంచి ఎదురైన ప్రశ్నతో షాక్ తిన్నారు. టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణలో తన ఇల్లు కొట్టేశారని, ఇల్లు ఎప్పుడు కట్టిస్తారంటూ వెంకటమ్మ అనే వృద్ధురాలు బాబును నిలదీసింది. ఈ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని ఆరు ఇళ్లు మాత్రమే తిరిగి 20 నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని ముగించి రామకుప్పం మండలం రాజుపేటకు వెళ్లిపోయారు. -
దిక్కుతోచని ‘కూటమి’!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. తొలుత రాఘవరెడ్డి పేరు.. టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డం పడింది. దాంతో రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేయగా తీహార్ జైలులో కొంతకాలం రిమాండ్‌లో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమానంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే. మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్ స్కాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే. ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ, ఎన్డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలుకల చందంగా ఉంటే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు జహంగీర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
కూటమిలో టిక్కెట్ల పంచాయితీ
-
బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం
సాక్షి, అమరావతి: టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు చంద్రబాబు ఇచ్చిందే ప్రాప్తం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తానంటే అవే మహా ప్రసాదంగా, ఏ సీటు ఇస్తానంటే దానినే పవన్‌కళ్యాణ్ స్వీకరించే పరిస్థితి కొనసాగుతోంది. నెల కిత్రం టీడీపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన పి. గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని ఇప్పుడు చంద్రబాబు వద్దనుకొని, జనసేనకు కేటాయించారు. ఆ స్థానంలో ప్రకటించిన టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడ తప్పనిసరిగా పార్టీ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు పి.గన్నవరం సీటును జనసేనకు ఇచ్చేశారు. అదీ అదనంగా కాదు.. అంతకు ముందు కేటాయించిన 21లో దీనినీ ఒకటిగా చేశారు. మరోవైపు.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు బలంగా కోరుకుంటున్న స్థానాలను మాత్రం ఆ పార్టీకి కేటాయించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. వాటిపై ఎటూ తేల్చడంలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలో ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాని భీమిలి, విజయవాడ వెస్ట్ వంటి స్థానాల కోసం జనసేన నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జనసేన టికెట్టు కోరుకుంటున్న నాయకులే గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేశారు. పొత్తులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావాలని బీజేపీ కోరితే, చంద్రబాబు అది కాకుండా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి ఇచ్చి, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టారు. భీమిలి స్థానాన్ని జనసేన గట్టిగా కోరుకుంటున్నా, చంద్రబాబు తేల్చడంలేదు. ఇలా జనసేన గానీ, పవన్ గానీ కోరుతున్న సీట్లను కాకుండా కేవలం టీడీపీ వద్దనుకునే సీట్లను మాత్రమే మిత్రపక్షాలుకు కేటాయిస్తున్నారని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఇంకా తేల్చని స్థానాలు 19 బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలతో కలిపి కూటమిలో ఇప్పటికీ 19 స్థానాలపై అస్పష్టత నెలకొంది. బీజేపీకి ఏ స్థానాలన్నది ఇప్పటికీ తేలలేదు. పాలకొండ, ఎచ్చెర్ల, పాడేరు, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ఆదోని, ధర్మవరం స్థానాలు బీజేపీకి కేటాయించారన్న ప్రచారం సాగుతోంది. అయితే, ఈ స్థానాల్లో కనీసం రెండింటిలో మార్పులు ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇంకా.. చీపురుపల్లి, భీమిలి, అవనిగడ్డ, దర్శి, అలూరు, గుంతకల్లు, రైల్వే కోడూరు, రాజంపేట, అనంతపురం అర్చన్ స్థానాల్లో ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందన్నదీ తేలాల్సి ఉంది. వీటిలో చీపురుపల్లిలో టీడీపీనే పోటీ చేస్తుందని ఖాయంగా పార్టీ వర్గాలు చెబుతుంటే.. అవనిగడ్డలో జనసేనే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కూటమిలో ఎవరికేమిటో తేలింది 156 సీట్లే.. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. టీడీపీ మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34, మూడో జాబితాలో మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, మొదట ప్రకటించిన పి. గన్నవరం స్థానాన్ని ఇప్పుడు జనసేనకు కేటాయించింది. జనసేన 21 స్థానాల్లో ఏడింటికి అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. అనధికారికంగా మరో 11 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. గత నెల 24న చంద్రబాబుతో కలిసి నెల్లిమర్ల, తెనాలి, అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్‌కు జనసేన అభ్యర్థులను పవన్ అధికారికంగా ప్రకటించారు. తర్వాత నిడదవోలుకు అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. విశాఖ దక్షిణ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పెందుర్తి, యలమంచిలి, ఉంగుటూరు, తిరపతి, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను అనధికారికంగా నిర్ణయించి, వారికి మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ లెటర్ హెడ్‌పై పవన్ సంతకం చేసిన లెటర్లు అందజేశారు. కొత్తగా జనసేనకు వచ్చిన పి. గన్నవరానికి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ఖరారు చేసి, ఆయన్ని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారు. పోలవరం స్థానంలోనూ జనసేనే పోటీ చేస్తుందని చెప్పి, అక్కడ చిర్రి బాలరాజును ఖరారు చేసి, ఆయనకూ ఎన్నికల నియమావళి, నిబంధనల పత్రాలను పవన్ శనివారం అందజేశారు. దీంతో జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో ఇంకా మూడు స్థానాలు, వాటిలో అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ ప్రకటించిన 138 స్థానాలకు, జనసేన అధికారికంగా, అనధికారికంగా ఖరారు చేసిన 18 స్థానాలు కలిపి మొత్తం 156 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. -
ఒంటరిగానే బరిలోకి సీపీఎం!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి గానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరి లోకి దిగాలని సీపీఎం భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. బుధారం జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హైదరాబాద్‌లో విలేకరుల కు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండల్లో తమకు బలముందని, భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్ ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.జహంగీర్ భువ నగిరి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశా రని చెప్పారు. మూసీ సమస్యను పరిష్కరించాలంటూ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. తమ్మినేనికి బదులు వీరయ్య నిర్ణయాలు అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బదు లుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా జహంగీర్ పేరును కూడా వీరయ్యే ప్రకటించారు. ఇలావుండగా రాష్ట్రంలో పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో సీట్ల సర్దుబాటు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే ప్రతిపాదించామని చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రగులుతున్న పొత్తు కుంపట్లు
సాక్షి, చిత్తూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షిప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తలు, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటనా ఇంకా కాలేదు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలోనూ మూడు పార్టీలూ ఏకతాటిపైకి రావడం లేదు. బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ చేతులెత్తేసింది. ఇక్కడ టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరిన నేతలు ఇప్పుడు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పూతలపట్టు, నగరి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు పట్టుకోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్‌రావుతోపాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వెంకటరమణా.. ఎంపీ సీటూ గోవిందా! రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధరేశ్వరి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీడని బీజేపీ ‘సీటు’ముడి శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, ఎచ్చెర్లలో ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ‘కొండ’ఎక్కిన సీటు ఆశలు తెలుగుదేశం పార్టీలో కాకినాడ సిటీ సీటు పంచాయితీ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఆశలు కొండెక్కాయనే ప్రచారం జరుగుతోంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకు ఇంటిపోరు ఎదురుకావడంతోపాటు పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతోంది. పశ్చిమలో పోరు పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో సెగ రగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడముఖంపెడముఖంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలిక తెచ్చింది. తణుకు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు జనసేన టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు , రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కస్థానాన్నీ ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్సార్ సీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. పోలవరం, గోపాలపురం అసెంబ్లీ స్థానాలతోపాటు, నరసాపురం ఎంపీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది. -
‘‘2 సీట్ల కోసం పొత్తా..? సొంతగానే గెలుస్తాం’’
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు. మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడులో బీజేపీ వ్యూ హం -
తేలని సీట్లు.. బాబుకు పాట్లు
అధికారంకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కి టిక్కెట్ల ఖరారులో విఫలమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ 16 స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక్క సతమతమవుతున్నారు. ఇప్పటికే తాము గెలవలే మని నిర్ణయించు కున్న స్థానాలు మిత్ర ధర్మం అంటూ జనసేన, బీజేపీకి అప్పగించిన ఆయన సొంత స్థానాలకు వచ్చేసరికి చతికిలబడుతున్నారు. రకరకాల సర్వేల పేరుతో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ... ఆశావహులను డోలాయమానంలో పడేస్తున్నారు. సాక్షి, అమరావతి: పొత్తుల ఎత్తుల్లో తలమునకలైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెండింగ్‌లో ఉన్న 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చెమటోడుస్తున్నారు. ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్సర్సైజ్ చేశానంటూ రెండో విడత అభ్యర్థుల ప్రకటన సమయంలో చెప్పుకున్న ఆ ఫార్టీ ఇండస్ట్రీస్ మిగిలిన స్థానాల ప్రకటనకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పొత్తులో సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడం, కొన్నిచోట్ల పార్టీ బలహీనంగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బీజేపీ, జనసేనకు 31 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన 144 స్థానాలకు 128 చోట్ల మాత్రమే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 16 సీట్ల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సీట్లలో టీడీపీ పోటీ చేసేవి ఏవన్న దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది. మిత్రులకు కేటాయించిన స్థానాల్లోనూ అభ్యర్థులు కరువవ్వడంతో ఆపసోపాలు పడుతున్నారు. సీనియర్లకే దిక్కులేదు ♦ శ్రీకాకుళం, ఎచ్చెర్లలో ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ స్థాయి నాయకుడికే దిక్కు లేకపోతే ఎలాగని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ♦ పాతపట్నం, పలాస సీట్లపై అయోమయం రాజ్యమేలుతోంది. పలాస సీటుపై మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష గట్టిగా పట్టుబడుతున్నా ఆమెకు ఖరారు చేయలేదు. పాతపట్నం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. పొత్తుల్లో పోటీ చేసే సీట్లపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ సీట్ల సంగతి తేలేలా కనిపించడంలేదు. జటిలంగా మారిన చీపురుపల్లి ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానం టీడీపీకి కత్తిమీద సాములా మారింది. అక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ తరఫున ఎవరూ ముందుకు రావడంలేదు. ఓడిపోయే సీటు కావడంతో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి నేతలూ అక్కడకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. ♦ ఎస్ కోట సీటు కోసం కోళ్ల లలితకుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పోటీ పడుతుండగా... పొత్తులో ఆ స్థానాన్ని వదులుకోవాల్సివస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్‌లో పెట్టారు. భీమిలిస్థానంపై గంటా పట్టుపడుతున్నా... దానిని జనసేనకు కేటాయించాల్సి ఉంటుందేమోనని దానిపైనా నానుస్తున్నారు. సందిగ్ధంలో పెనమలూరు, మైలవరం ♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లపైనా సందిగ్ధం వీడటంలేదు. మైలవరం సీటు కోసం దేవినేని ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టు పడుతుండడంతో వలస నేత వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఇరకాటంగా మారింది. వీరిద్దరిలో ఒకరిని పెనమలూరు పంపుతారనే ప్రచారం జరుగుతుండడంతో అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ♦ నర్సరావుపేట, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో సరైన నేతలు దొరకలేదు. ధన బలం ఉన్నవారికోసం అక్కడ వెదుకులాడుతున్నారు. వెంటాడుతున్న సోమిరెడ్డి భయం ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి సీటు విషయం పెండింగ్‌లో ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోతామన్న భయం ఉంది. ఆ స్థానంలో ఆయన కుటుంబంలో ఎవరికైనా ఇవ్వాలా, బయట వ్యక్తులను చూడాలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ♦ ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు, బద్వేలు సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతో పెండింగ్‌లో పెట్టారు. జమ్మలమడుగు సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికే చెందిన భూపే‹Ùరెడ్డి మధ్య వివాదం నెలకొంది. రైల్వేకోడూరు, రాజంపేట సీట్ల విషయంలోనూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పొత్తులో వీటిలో ఒకదాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఒక నిర్ధారణకు రావడం లేదు. ♦ గుమ్మనూరు జయరాం టీడీపీలోకి మారడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆలూరు, గుంతకల్లు సీట్లపై అయోమయం నెలకొంది. ఆయనకు గుంతకల్లు సీటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అనంతపురం అర్బన్ సీటు పొత్తులో పోతుందనే అంచనాతో ఆ స్థానాన్ని ఖరారు చేయలేదు. దీనిపై అక్కడి నేత ప్రభాకర్ చౌదరి ఇతరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బాబు బలవంతం
-
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్‌లో కేసీఆర్‌తో ప్రవీణ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్‌తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్‌కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్‌కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
ఇది టీడీపీ మరో వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా ఓడిపోయే సీట్లనే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు. పొత్తులో భాగంగా ఎక్కువచోట్ల మొదట నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులకు కాకుండా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదికలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ వీరు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వీరు పొత్తు సందర్భంగా తమ దృష్టికొచ్చిన అంశాలను పేర్కొంటూ గురువారం జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ ప్రతులు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీరాణి ఆ లేఖలో సంతకాలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ నకళ్లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహరాలు పర్యవేక్షించే సంఘటనా కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు కూడా పంపారు. పొత్తులకు వ్యతిరేకం కాదు, కానీ.. నిజానికి.. కేంద్ర నాయకత్వంపై తమకు చాలా నమ్మకం ఉందని.. పొత్తు నిర్ణయాన్ని తామేమీ వ్యతిరేకించడంలేదని వారు ఆ లేఖలో స్పష్టంచేశారు. అందులో వారు ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ♦ తాము కూటమి ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కానీ, పొత్తుల పేరుతో జరుగుతున్న పరిణామాలతో మేం విభేదిస్తున్నాం. ♦ పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీనే కాదు టీడీపీ కూడా గెలిచే అవకాశంలేదు. ♦ బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ గెలవలేదు. అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లు మన పార్టీకి ఇచ్చారు. ♦ బీజేపీకి కేటాయించిన ఈ సీట్లు పరిశీలిస్తే టీడీపీ మరో విడత మన పార్టీకి వెన్నుపోటు పొడుస్తోందన్న అభిప్రాయమే కనిపిస్తోంది. ♦ పొత్తులో పార్టీకి కేటాయించిన సీట్లలోనూ అనేక దశాబ్దాలుగా పార్టీ భావజాలంతో పనిచేసి, గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ♦ బీజేపీ సీట్లకు అభ్యర్థుల పరిశీలనలో సైతం టీడీపీ ప్రభావమే ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ♦ టీడీపీ మన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఎజెండాతోనే ఆ పార్టీ నేతలను మన బీజేపీలోకి బదలాయించింది. తద్వారా ఇప్పుడు ఆ పార్టీ తమ నాయకులను సంతృప్తపరచడంతో పాటు మొదట నుంచి బీజేపీలో కొనసాగే నేతలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ♦ కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తిని దయతో పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అసలైన నేతలకే సీట్లు దక్కేలా చూడాలి.. నిజానికి.. బాధ్యతాయుతమైన పార్టీ నాయకులుగా పార్టీ నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడంలేదు. అయితే, గతంలో మనకున్న చేదు అనుభవాల దృష్ట్యా.. భవిష్యత్తులో మన పార్టీని పటిష్టం చేసేందుకు సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న హార్డ్‌కోర్ నాయకులకే అత్యధిక సీట్లు దక్కేలా చూడాలని మేం అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీ అభిమానులు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్న విషయం అధిష్టానానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు ఆ నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. -
వచ్చాడు జాదూగాడు
సాక్షి, అమరావతి: నక్క జిత్తులు, నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! జనసేనతో జత కట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయమైన ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయంటూ మొన్న సీ–ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్–18 నిన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కానున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పుంజుకున్నట్లు కృత్రిమ బలాన్ని చూపించి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే వైఎస్సార్సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 0–1 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని టౌమ్స్ నౌ, చాణక్య లాంటి ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని తేలింది. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరిన రెండు మూడు రోజుల్లోనే ఆ కూటమి గెలుస్తుందంటూ సీ–ఓటర్, న్యూస్–18 ఒపీనియన్ సర్వేలు ఆదరాబాదరాగా ప్రకటించడంపై రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ప్రజాభిప్రాయం ఎలా తారుమారు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి అవి నకిలీ సర్వేలన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు. 2019లోనే అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. సర్వేల పేరుతో చంద్రబాబు ఎన్ని మాయ వేషాలు వేసినా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని, వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పేర్కొంటున్నారు. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం చెప్పారు. గత 58 నెలల్లో 99 శాతం హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.65 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.44 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతను వినియోగించుకున్న పేదలు పేదరికాన్ని అధిగమించడమే ఇందుకు నిదర్శనం. 2015–16లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. గ్రామ వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో గత 58 నెలల్లో 2.13 లక్షల నియామకాలు చేపట్టడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్సీపీ గ్రాఫ్.. సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చాటి చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ 0–1 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉనికి కూడా చాటుకోలేవని మూడు నెలల క్రితం టౌమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. జీన్యూస్ మారిటైజ్, జీవనాధర్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్, చాణక్య లాంటి డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైంది. కేసుల భయంతో కాళ్ల బేరం.. ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని గ్రహించిన చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో జత కలిశారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేశారు. జెండా సభ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్లీ ఘెర పరాజయం తప్పదని ఆందోళన చెందిన చంద్రబాబు స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి భూకుంభకోణం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పాల్పడిన ఐఎంజీ భారత్ కుంభకోణం వరకూ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ పొత్తు కోసం పాకులాడారు. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపులు కాసి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నారు. బీజేపీతో జతకట్టినా డజను సర్వేలది ఒకే మాట ♦ బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ౖటౌమ్స్ నౌ–ఈటీజీ సంస్థ భారీ సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించింది. 49 శాతం ఓట్లతో 21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, 45 శాతం ఓట్లతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 3–4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. ♦ 48 శాతం ఓట్లతో 19 లోక్‌సభ, 133 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 44 శాతం ఓట్లతో 6 లోక్‌సభ, 42 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని జీన్యూస్–మారిటైజ్ సర్వే వెల్లడించింది. ♦ 49.5 శాతం ఓట్లతో 121 శాసనసభ (ఐదు అటూఇటుగా) స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 (ఐదు అటూఇటుగా) శాసనసభ స్థానాలతో సరి పెట్టుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ♦ రాష్ట్రంలో 49 శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకుంటుందని, 44 శాతం ఓట్లతో 8 లోక్‌సభ స్థానాలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చాణక్య సర్వే తేల్చింది. జనాధార్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ తదితర డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థల సర్వేలదీ అదే మాట. -
టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి
సాక్షి, విజయవాడ: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అలజడి రేగింది. టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడేని కార్యకర్తలు నిలదీశారు. ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రధానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు.. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు. బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు.. బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రశ్నలకు వినోద్ ధావడే ఉక్కిరిబిక్కిరి అయారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వినోద్ ధావడే.. రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తానని, అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభావాలను తీసుకెళ్తానన్నారు. కాగా, ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని సీనియర్లు వ్యూహాత్మకంగా లీక్ చేశారు. ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని సీనియర్లు లేఖలో పేర్కొన్నారు. ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో ప్రస్తావించారు. టీడీపీ నేతలను బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు.. బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలంటున్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకే నష్టమంటున్నారు. ఇదీ చదవండి: ఏపీ బీజేపీలో కొత్త ట్విస్ట్.. చిచ్చుపెట్టిన చంద్రబాబు! -
సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్ గాంధీ
నాసిక్: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్ వివరించారు. గురువారం మహారాష్ట్రలో చాంద్‌వడ్‌లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు. -
‘పొత్తు’కు పోతే ‘కత్తెర’ పడింది
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ పొత్తుకు మధ్యవర్తిత్వం చేస్తే మనమే సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో తన సినిమాల ప్రస్తావనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జనసేన సీట్లు తగ్గించుకోవాల్సి రావడంపై మాట్లాడుతూ.. పొత్తుల్లో రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తే ఏం నష్టపోతామో తనకు బాగా అర్థమైందన్నారు. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్నామని చెప్పారు. తన అన్న నాగబాబుకు మాట ఇచ్చిన లోక్‌సభ సీటును సైతం త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లో తనకు ఎదురు దెబ్బలు లేవని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలే తనకు శాపం అయిందని, పదేళ్లుగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయని చెప్పారు. 2019లో 30 స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నామని, అందరి బలవంతంపై అన్ని స్థానాల్లో పోటీ చేశామని చెప్పారు. అప్పుడు కొన్ని స్థానాల్లోనే పోటీ చేసి ఉంటే ఇప్పటికి జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా ఉండేదన్నారు. అధికారం జనసేనకు కనుచూపు మేరలో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ మనమేనన్నారు. పొత్తులో జనసేన అభ్యర్థులను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అప్పులు తెచ్చి సంక్షేమం చేసుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా శ్రీలంకలా మారే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కారణంగా అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదని, పార్టీ శ్రేణులు ప్రత్యర్థులను ఎందుకు తిడుతున్నామో సందేశాల్లో స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, తిరుపతి నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పోటీ చేస్తారని పవన్ చెప్పారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా లోక్‌సభకు కూడా పోటీపైపెద్దలతో చర్చించాక నిర్ణయం తాను ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అసెంబ్లీ స్థానంతో పాటు లోక్‌సభకు కూడా పోటీ చేసే విషయంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘చాలా మంది ఎమ్మెల్యే, ఎంపీ రెండింటికీ పోటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ రెండింటికీ పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్‌లు వంటివీ ఉంటాయని గందరగోళంలో ఉన్నా. నాకు మాత్రం ఎమ్మెల్యేగా ఉండాలనే ఉంది’ అని చెప్పారు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
బాబు బీజేపీకి లొంగిపోయాడు
-
ఎన్ని పోతులైన పెట్టుకోండి..ఎవడడ్డలు లేవు అంతా జగన్ అడ్డ..
-
ఓట్ల కోసం కొత్త వ్యూహం..
-
బండరాయి టీడీపీ..గునపం బీజేపీ..
-
టీడీపీ-జనసేన, బీజేపీ పోతులకి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
-
హర్యానా సీఎం రాజీనామా.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్‌తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్‌ను కలిశారని సమాచారం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫార్ములాపై బీజేపీ కసరత్తు చేసింది. మరోవైపు.. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది. అయితే.. హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చంద్రబాబు బీజేపీ పొత్తుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సెటైర్లు
-
భీమవరంలో చిచ్చు పెట్టిన టీడీపీ-జనసేన పొత్తు
-
బాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెడుతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: పార్టీల పొత్తుతో చంద్రబాబు.. ప్రజల బలమే బలంగా మనం తలబడబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభ వేదికగా వైఎస్సార్సీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఆదివారం 15 లక్షల మంది హాజరైన భారీ బహిరంగ సభలో ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై సీఎం జగన్ పంచ్‌లు గుప్పించారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. బాబు అండ్ కో.. వీళ్ల పొత్తుల గురించి కాసేపు మాట్లాతాను. వీళ్లందరి పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటువైపు ఉంది. వాళ్లు వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో, ఎత్తులతో వస్తున్నారు. నాకు చంద్రబాబులా నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.. అందుకే ఒంటరిగానే పోటీ కెళ్తున్నా. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నన్ను గెలిపించే స్టార్‌క్యాంపెయినర్లు ప్రతీ ఇంటా ఉన్నారు. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. గెలిపించాలని మనం. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగుతున్న యుద్ధం ఇది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ప్యాకేజీ స్టార్ బాబు ఎలా చెబితే అలా.. సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకే ప్రజలు ఆశీర్వదించడంతోనే మన ఫ్యాన్‌కు పవర్ వస్తోంది. కానీ, చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్ లేదు. చక్రాలు లేవు. తప్పు పట్టిన ఆ సైకిల్‌ను తోక్కడానికి ఆయనకు ఇతరులు కావాలి. అందుకోసమే ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నారు. ప్యాకేజీ స్టార్ సైకిల్ సీటు అడగడు. ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నాడని అడగడు. ప్యాకేజీ స్టార్ చంద్రబాబు సైకిల్ దిగమంటే దిగుతాడు.. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. చంద్రబాబు ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీ వెళ్లి దత్తపుత్రుడితో కలిసి మోకరిల్లారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తకపోయి ఉంటే.. ఇన్ని పొత్తుల కోసం ఎందుకు అగచాట్లు పడతారు. మన నేతలంతా గడపగడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి గురించి చెబుతాం. చంద్రబాబు చేసిన మోసాల గురించి వివరిద్దాం. జగన్ మార్క్ రాజకీయాంలో విశ్వసనీయత, విలువలు ఉంటాయి. 2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా వచ్చి.. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఈ సందర్భంగా సిద్ధం వేదిక సభ నుంచి చదివి వినిపించారు. అందులో హామీలు అమలు అయ్యాయా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల్ని దోచుకునేందుకు.. పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకి అధికారం కావాలి. నరక లోకానికి నారా లోకానికి ఎవరూ రారు కాబట్టి ఎంటట్రెన్స్లో స్వర్గం చూపించి.. లోపల నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు. మరోసారి మోసం చేసేందుకు వాగ్దానాలతో ముందుకు వస్తున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోకు.. శకుని పాచికలకు తేడా ఏం ఉంది?. ఈ మధ్య కాలంలో కిచిడీ వాగ్దానాలు కలిపారు చంద్రబాబుని ఉద్దేశించి.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. -
‘అభివృద్ధిని ఇండియా కూటమి ఓర్వలేదు’: ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్‌లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అజంగఢ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు. తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు. దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని, ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు. पूर्वी उत्तर प्रदेश समेत पूरे देश के परिवारजनों के जीवन को आसान बनाने के लिए हमारी सरकार दिन-रात काम रही है। आजमगढ़ में विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/fGxt3QsZt4 — Narendra Modi (@narendramodi) March 10, 2024 -
చంద్రబాబు దాసోహం..దిగజారిన బీజేపీ
-
తాను చేసిన అక్రమాలు, వాటిపై కేసులు నిజమే అంటున్న బాబు
-
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన దరిద్రుడు
-
నాడు టెర్రరిస్టు అన్నాడు..నేడు ఓటమి భయంతో కాళ్లు పట్టడు
-
ఒంటరిగా ఓడించలేక..
-
టీడీపీలో ఎగసిన ఆగ్రహ జ్వాలలు
పొత్తుల వ్యవహారం పలు జిల్లాల్లో చిచ్చురేపింది. ఇప్పటికే జనసేన పొత్తు ఖరారు కాగా.. తాజాగా బీజేపీ కూడా చేతులు కలపడం.. సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల శనివారం తమ అనుచరులతో నిరసన గళాలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతుంటే తమ ఆశలను నట్టేటా ముంచారని అధినేతపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పలు చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. యలమంచిలి రూరల్/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, పుట్టపర్తి/పాడేరు: పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జనసేనకు టికెట్ కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు తీవ్ర అన్యాయం చేశారని పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రగడ నాగేశ్వర్రావుకు మొండిచెయ్యి చూí³స్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సీనియర్లతోపాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. పోలవరంలో పొత్తు రగడ ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తు రగడ తారస్థాయికి చేరింది. టికెట్ జనసేనకు కేటాయించామని టీడీపీ నేతలకు పార్టీ స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం తెలుగుదేశం పార్టీలో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఏళ్ల తరబడి నుంచి టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించవద్దంటూ జిల్లా అధ్యక్షుడు మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ విన్నవించారు. కట్ చేస్తే.. ఈ సీటు జనసేనకు కేటాయించి.. పొత్తు ధర్మం పాటించండి అంటూ చంద్రబాబునాయుడు నుంచి ఫోన్ రావడంపై బొరగం శ్రీనివాస్ వర్గం మండిపడుతోంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ నేతృత్వంలో బుట్టాయగూడెంలో ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సీటు ఇవ్వకపోతే సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయోమయంలో టీడీపీ శ్రేణులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని సీటు వరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సారీ జనసేనకో, బీజేపీకో కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్‌నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ‘శంఖారావం’ను పట్టించుకోని నేతలు నారా లోకేశ్ చేపట్టిన శంఖారావ సభలు ‘శంకా’రావాలుగా మారిపోతున్నాయి. పుట్టపర్తి జిల్లాలో శంఖారావ సభలకు శుక్రవారం వచ్చిన లోకేశ్ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తారని స్థానిక టీడీపీ నేతలు భావించారు. కానీ ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఫలితంగా ధర్మవరం టికెట్ ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్, కదిరిపై ఆశలు పెట్టుకున్న వెంకటప్రసాద్, పుట్టపర్తి టికెట్ కోరుతున్న పల్లె రఘునాథరెడ్డి అలకబూనారని తెలిసింది. బీజేపీతో పొత్తులో భాగంగా హిందూపురం పార్లమెంటులో ఏ సీటు ఇస్తారనే దానిపై టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. లోకేశ్ శంఖారావం సభలను కీలక నేతలు పట్టించుకోలేదు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, పెనుకొండలో బీకే పార్థసారథి వర్గాలు లోకేశ్ సభలకు గైర్హాజరయ్యాయి. నాయకులు పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి లేకుండా ఫ్లెక్సీలు, పేపరు ప్రకటనలు రావడం గమనార్హం. పల్లెకు టికెట్ వద్దని కొందరు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది. -
టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు: మంత్రి అంబటి
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షాపై రాళ్లు వేసిన చరిత్ర చంద్రబాబుది. పాచిపోయిన లడ్డూ ఇచ్చారని కేంద్రాన్నిపవన్ విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారు’’ అని మండిపడ్డారు. ‘‘సీఎం జగన్ సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందరు కలిసి వచ్చినా గెలుపు వైఎస్సార్సీదే. చంద్రబాబు, లోకేష్ కలిసి పవన్‌ను పక్కనపెట్టారు. పవన్ ముఖ్యమంత్రి రేసులో ఇక లేరు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ అమిత్‌షా కాళ్లపై పడ్డారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు. హామీ ఇస్తే సీఎం జగన్ తప్పక నెరవేరుస్తారు. ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చరు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. CM CM అని అరిసిన ఓ కాపులారా! CM అంటే చీఫ్ మినిస్టరా? CM అంటే సెంట్రల్ మినిస్టరా? CM అంటే చంద్రబాబు మనిషా? CM అంటే చీటింగ్ మనిషా ?@ncbn @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) March 9, 2024 ఇదీ చదవండి: జగన్ ఏంటో చెప్పడానికి విశాఖ చాలదా! -
పొత్తు కోసం పడిగాపులు..కాయా పండా..?
-
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్‌హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‌తో కమల్‌హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు. ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది. సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్సార్సీపీకే ఓటు వేయండి’’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. Even if BJP joins the TDP-Jana Sena alliance, how will it be any different from all the deceit, lies, and unkept promises that AP witnessed between 2014-19? It is the same product with a different packaging, a chair with 3 legs is bound to fall. Vote for a stable govt., vote… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2024 కాగా, బీజేపీతో పొత్తు బేరసారాలకు అమిత్ షా ఇంటి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు పొత్తు "రాజీ"కీయం కొనసాగుతోంది. స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు.. సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీపడ్డారు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలికారు. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. -
దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఉమ్మడి భేటీలో కేసీఆర్ మాట్లా డారు. బీఎస్పీతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. శక్తులను కూడదీసుకోవాలి ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవడంతోపాటు కలసి వచ్చే భావసా రూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకొని ఉంది. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతాం. బీఎస్పీ కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుద్దాం. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విధివిధానాలను ఖరారు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో పార్టీ నేతలు ఏకీభవించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం ‘ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చు. అయినా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్‌కు లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలను కోవడం సరైన నిర్ణయం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీని వీడే వారి గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యలపై పోరాడదా మని పిలుపునిచ్చారు. డొల్లతనంతో కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలు ‘ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొత్తగా ఇచ్చే తెలివి లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేక పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టుకొని అభాసుపాలవు తోంది. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టు కుంది. అధికారం కోసం ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేతకాక అబద్ధాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోంది’ అని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన గెలుపు కోసం అను సరించాల్సిన కార్యాచరణౖపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. తక్షణమే మండలాలవారీగా ఎన్నికల సన్నాహక సమావేశాల ఏర్పాటుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఉంటాయని, త్వరలో మహబూ బ్‌నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్లడించారు. కాగా, ఉచిత ఎల్ఆర్ఎస్ బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం, శుక్ర వారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న భేటీలకు బీఆర్ ఎస్ 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా కేసీఆర్‌తో భేటీలు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం?
నేపాల్ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెగతెంపులు చేసుకున్నారు. ఇరు పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా నేపాలీ కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి ప్రచండ స్వస్తి పలికారు. మాజీ ప్రధాని కెపీ ఓలీ పార్టీతో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని ప్రచండ నిర్ణయించారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) నాయకుడు ఒకరు మాట్లాడుతూ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్), షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మధ్య పొత్తు ముగిసిందని, ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పారు. సీసీఎన్ (మావోయిస్ట్ సెంటర్) కార్యదర్శి గణేష్ షా మాట్లాడుతూ నేపాలీ కాంగ్రెస్ ప్రధానమంత్రికి సహకరించలేదు. అందుకే తాము కొత్త కూటమి కోసం చూడవలసి వచ్చిందన్నారు. కాగా నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో 2022, డిసెంబర్ 25న ప్రచండ నేపాల్ ప్రధాని అయ్యారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెంచుకున్న తర్వాత, ప్రచండ.. ఓలీ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. -
ఇండియా కూటమి ఎన్నికల భేరి
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు. రైల్వేపై రాహుల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు. -
టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి - జైరాం రమేష్
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీకి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఏకపక్షంగా 42 స్థానాలకు (పశ్చిమ బెంగాల్లో) పోటీ చేస్తానని ప్రకటించింది, కానీ మాకు సంబంధించినంతవరకు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, వారి కోసం తలుపులు తెరిచి ఉన్నాయని.. ఆఖరి మాట చెప్పేంత ఈ అవకాశం ఉంటుందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రదానం చేసిన వారం రోజుల తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) NDA కూటమిలో చేరింది. అలీఘర్‌లో యాత్రలో రాహుల్ గాంధీకి లోక్ దళ్ స్వాగతం పలికిందని రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం (కేరళలోని) నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ విషయం ప్రస్తుతం చర్చలో ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్..
సాక్షి, అమరావతి: ఒక రాజకీయ పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి.. స్వీయ నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ట్రబుల్ షూటర్ లక్షణాలు.. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు విలువివ్వడం.. ఇలాంటివన్నీ పుణికిపుచ్చుకోవాలి. కానీ, ఇవేవీ లేనివాళ్లను ఏమనాలి? జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అనాలి. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఆయన వేసే ప్రతీ అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తేనే జరుగుతోంది. ఇది ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శ కాదు.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాక్షాత్తు జనసేన శ్రేణులు వ్యక్తంచేస్తున్న నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే.. టీడీపీతో పొత్తులో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో ఇప్పటికీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన పవన్‌కళ్యాణ్, మిగిలిన 19 స్థానాల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఇందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నారట. ఇదే విషయం ఇప్పుడు జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రబాబు సూచన మేరకు రెండు, మూడు జాబితాలుగా వెలువడే అవకాశముందని జనసేన నేతలు చెబుతున్నారు. చివరకు.. పవన్ తాను పోటీచేసే స్థానంపై ఇరువురు నేతలు సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానిని అధికారికంగా ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ–జనసేనల సీట్ల కేటాయింపు ప్రకటనకు ముందే రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత ఈనెల 24న చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో గతంలో చంద్రబాబు ప్రకటించిన రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారుగానీ.. పవన్ ప్రకటించిన రెండింటిలో రాజోలు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టేశారు. అక్కడ పవన్‌కళ్యాణ్ ముందుగా అనుకున్న పేరుపై చంద్రబాబు అభ్యంతరం చెప్పిన కారణంగానే జనసేన తొలి జాబితాలో అదిలేదని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన.. జనసేన పోటీచేసే మిగిలిన 19 స్థానాల జనసేన అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు ఆమోదం కావాల్సి ఉంటుందని వారు స్పష్టంచేస్తున్నారు. అలాగే.. ఆయా స్థానాల్లో తమకు సీట్లు ఖాయమని ఇప్పటివరకూ అనుకుంటున్న జనసేన నేతలు కూడా తమ అభ్యర్థిత్వానికి టీడీపీ అధినేత ఎసరు పెడతారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలే కేటాయించడాన్ని కూడా పవన్ పవిత్ర గాయత్రీ మంత్రంతో గొప్పగా పోల్చుకున్నారని.. నిజానికి.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మంత్రాన్ని íచెవిలోనే ఉపదేశిస్తుంటారని.. ఈలెక్కన జనసేనకు కేటాయించిన ఆ 24 సీట్లలో ఎవరు పోటీచేయాలన్నది చంద్రబాబు పవన్ చెవిలో చెప్పిన తర్వాతే తమ అధినేత అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని జనసేన నాయకులే ఛలోక్తులు విసురుతున్నారు. బాబు చెప్పుచేతల్లో పవన్.. లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఇప్పటికే పవన్ మాటలకు విలువ లేకుండా చేశారని వారంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ అధినేతను ఆయన తన చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలో ఉన్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. తొమ్మిది నెలల క్రితం తణుకులో పవన్ అక్కడి స్థానిక పార్టీ ఇన్చార్జి వి. రామచంద్రరావుకు సీటు ఇస్తానని ఇచ్చిన మాటకు విలువలేకుండా ఆ స్థానంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని వారు ఉదహరిస్తున్నారు. అలాగే, సీట్ల కేటాయింపు ప్రకటనకు వారం రోజుల ముందే పవన్ రాజమండ్రి పర్యటనలో రూరల్ స్థానంలో జనసేనే పోటీచేసేలా చంద్రబాబును ఒప్పిస్తానని స్థానిక పార్టీ నేతలకు మాటిచ్చారు. కానీ, ఆ స్థానం ఇప్పటివరకూ అధికారికంగా ఖరారు కాకపోయినా, అనధికారికంగా ఆ స్థానం టీడీపీకి కేటాయించినట్లు ఇరు పార్టీలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు.. 2019 ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకుండా జనసేన వేరుగా పోటీచేసినప్పుడే పవన్ 30 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న పలు స్థానాలను కూడా ఇప్పుడు పొత్తులో జనసేనకు కేటాయించకుండా, ఏదో ఒక సాకుతో అక్కడ టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసేసి ఆ ఎన్నికలో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెల్లిమర్ల.. 11,988 ఓట్లే వచ్చిన అనకాపల్లి వంటి నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించారని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. -
కాపు కాయలేం
ఇన్నాళ్లూ ఓ అసమర్థుడి వెంట నడిచామన్న చేదు నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గు పడుతున్నాం. కాపులకు రాజ్యాధికారం అనే ఆశ మళ్లీ చిగురిస్తోందని సంబర పడుతున్న వేళ ఏమిటీ ప్రేలాపనలు? ఇదేం స్ట్రాటజీ? ఇవేం ఎత్తుగడలు? కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడతారా? ప్యాకేజీ స్టార్ అని వైసీపీ వాళ్లు అంటున్న మాట నిజమేనని ఆయన నోటే చెప్పకనే చెప్పారు. మా ఆశలను కూకటివేళ్లతో సహా పెకిలించేశారు. – సోషల్ మీడియాలో జనసేన అభిమానులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. వారందరిదీ అదే ఆవేదన గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గురువారం బహిరంగ లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ముద్రగడ.. తాజా రాజకీయ పరిణామాలపై తొలిసారి పవన్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కాపు ఉద్యమం సందర్భంగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపుల పైన, తన కుటుంబం పైన జరిపిన దాషీ్టకాలను సైతం దిగమింగుకుని పవన్‌కు మద్దతుగా నిలవాలని భావించానని చెప్పారు. అంతేకాకుండా ఆయనతో కలసి పని చేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని కలలుగన్న విషయాన్నీ తన లేఖలో ప్రస్తావించారు. పవన్ అభిమానులు ఆయనను ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే ఆయన మాత్రం 24 సీట్లకు మాత్రమే అంగీకరించడంపై ముద్రగడ విస్మయం వ్యక్తంచేశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం, ముందుగా రెండేళ్లు సీఎం, 80 అసెంబ్లీ సీట్లు కోరాల్సిందని ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టారు. బాబు మాటే పవన్‌కు శాసనం పవన్ తీరుతో మరో చారిత్రక తప్పిదం జరిగిపోయిందని కాపులు అంతర్మ«థనం చెందుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి భరోసా ఇవ్వడం ద్వారా బాబు పరపతి పెరగడానికి పరోక్షంగా పవనే కారకులయ్యారు. కానీ ఆ స్థాయిలో సీట్లు తీసుకు రాలేకపోవడంతో పవన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలై ఆ సామాజికవర్గంలో అంతర్మధనం మొదలైంది. సీట్లు, ఓట్లు బదిలీ, పవర్ షేరింగ్ కోసం అడుగుతున్న వారిపై పవన్ మాటలతో ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితుల్లో ఓటు షేరింగ్ ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. ఎలక్షన్ అంటే డబ్బుతో కూడుకున్న పని. అంత సత్తా మనకు ఉందా? కనీసం మనం భోజనాలు పెట్టించలేం..’ అని ప్రశ్నిస్తూ.. పవన్ తనకు తానుగానే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నిస్సత్తువ ఆవరించే పరిస్థితికి కారకులయ్యారని విశ్లేషిస్తున్నారు. అభిమానులు, ఆ సామాజికవర్గం మునుపటి మాదిరిగా ఉత్సాహంగా తాడేపల్లిగూడెం సభకు వెళ్లిన దాఖలాలు లేకపోవడానికి పవన్ నిర్ణయాలే కారణమని కాపు సామాజికవర్గ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటే పవన్‌కు శాసనమైందని వాపోతున్నారు. కనీసం 50 సీట్లు తీసుకుని ఉండాల్సింది పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నాలాంటి కాపు నాయకులకు ఇబ్బందిగా ఉంది. పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయికి తగినట్టుగా కనీసం 50 సీట్లు తీసుకుని ఉండుంటే మాకు సంతృప్తిగా ఉండేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ప్రయాణిస్తున్న క్రమంలో సీఎం పదవిలో కూడా షేరింగ్ ఉండుంటే మేమందరం ఆనందించే వాళ్లం. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఆవేదన కూడా ఇదే. – కల్వకొలను తాతాజీ, కాపు జేఏసీ నేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పవన్ నిర్ణయం సరికాదు పవన్ కాపు జాతిని నిరాశ పరిచారు. ఎన్నో ఏళ్లుగా కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ ద్వారా సాధ్యమవుతుందని కలలు కన్నాం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. ఇలాగైతే ఏ విధంగా సీఎం అవుతారు? చంద్రబాబుకు వత్తాసు పలకడానికే పవన్ ఉన్నట్టుంది. పవన్ నిర్ణయం సరికాదు. – కురుమళ్ల చిన్ని, కాపు నాయకుడు, కిర్లంపూడి, కాకినాడ జిల్లా 50–60 సీట్లు తీసుకోవాల్సింది రాష్ట్ర జనాభాలో 22 శాతం కాపులు ఉన్నారు. కాపు వర్గం వారు ఏ రోజైనా సీఎం అవుతారని ఊహించాం. టీడీపీతో పొత్తులో భాగంగా 50–60 సీట్లు వరకు తీసుకుంటారని ఆశించాం. కానీ 24 సీట్లకే పరిమితమవడం నిరుత్సాహానికి గురిచేసింది. – గుండాబత్తుల శ్రీను గోవిందరావు, మామిడికుదురు మండల కాపు నాడు అధ్యక్షుడు, కోనసీమ జిల్లా పవన్‌కు సీఎం పదవి ప్రకటిస్తారని ఆశించాం కోస్తా జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. పవన్ ద్వారా సీఎం పదవి వస్తుందని ఆశించాం. టీడీపీతో పొత్తు పేరిట 24 సీట్లకే పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా పవన్‌కు సీఎం పదవిని ఏడాదో, రెండేళ్లో ప్రకటిస్తారనుకున్నాం. ఆయన ఎందుకు తగ్గి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. – వెలుగుబండి సుబ్బారావు, కాపు నాయకుడు, వాకలపూడి, కాకినాడ జిల్లా -
పవన్ పొత్తులు..తన్నుకుంటున్న జనసేన టీడీపీ
-
టీడీపీతో బీజేపీ పొత్తు !..రాజ్ నాథ్ సింగ్ తో పురందేశ్వరి భేటీ
-
సైకిల్ సతమతం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: పొత్తు ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని నేతలతోపాటు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనసేనతో కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలు చోట్ల నేతలు భగ్గుమంటున్నారు. ♦ విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ టికెట్‌ను తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆదివారం గజపతినగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ♦ టీడీపీ బలోపేతం కోసం కష్టపడ్డ తనను అవమానించారని, ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రకటించారు. చంద్రబాబు తనకు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదన్నారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సీటును సవితకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం నిరసనలతో హోరెత్తిస్తోంది. ఆదివారం పెనుకొండలో పార్థసారథి అనుచరులు భారీ బైక్ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెళ్లి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని పార్ధసారథి ప్రకటించారు. కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. ♦ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌యాదవ్‌కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బి.కొత్తకోటలో నిరసన నిర్వహించారు. ♦ నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతోపాటు కుందుల సత్యనారాయణ వర్గాలు మండిపడుతున్నాయి. వారంతా టీడీపీకి మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. చిత్తూరులో బీసీలు భగ్గు టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు స్థానాలను మినహాయించి చిత్తూరు (కమ్మ), కుప్పం (కమ్మ), నగరి (కమ్మ), తంబళ్లపల్లె (రెడ్డి), పలమనేరు (రెడ్డి) స్థానాలను ఓసీలకు కేటాయించడంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్‌కు టీడీపీ మొండి చేయి చూపడంపై ఆయన సామాజిక వర్గం మండిపడుతోంది. శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కాపు నేతలు కటారి హేమలత, ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య, కాజూరు బాలాజీ తదితరులు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. జనసేనలోనూ మంటలు... ♦ తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ విడివాడ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అరిమిల్లి రాధాకృష్ణపై నిప్పులు కక్కుతున్నారు. తన ఇంటికి రావద్దంటూ అరిమిల్లిపై మండిపడ్డారు. విడివాడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి యోచనలో ఉన్నారు. ♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడాన్ని నిరసిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆలయాల్లో పూజలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 48 గంటల్లో అధినేత స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ గోకవరం మండలాధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం చెప్పారు. ♦ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, బి.రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించి రోడ్డుపై వేసి నిప్పంటించారు. అతి తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టడం దారుణమన్నారు. పదేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తే పార్టీని టీడీపీకి అప్పగించి తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ కాకినాడ జిల్లా పెద్దాపురం సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ♦ పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి»ొమ్మను కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు సమ్మెట బాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను గుడ్డిగా నమ్మామని అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారని తెలిపారు. -
బాబుకే భ'జనసేన'!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాటికి కేటాయించిన సీట్లతో పోల్చితే ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా జైలుకెళ్లి ఆయన్ను కలిసొచ్చిన తర్వాత అక్కడికక్కడే పొత్తు ప్రకటన చేసిన తీరుతో తమ పార్టీకి తప్పకుండా 40–45 స్థానాలకు మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని జనసేన శ్రేణులు భావించారు. కానీ, తీరా శనివారం కేవలం 24 అసెంబ్లీ స్థానాలేనని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో టీఆర్ఎస్కు మూడో వంతు సీట్లు గతంలో పొత్తుల పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీలకు టీడీపీ కేటాయించిన సీట్లకు ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్ల సంఖ్యకు పొంతనే లేదని అటు జనసేనలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉదా.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి పేరుతో ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న మొత్తం సీట్లలో మూడో వంతుకు పైగా కేటాయించింది. అంటే.. 119 సీట్లకు 45 సీట్లను కేటాయించగా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 32 సీట్లను కేటాయించింది. నిజానికి.. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటములు చవిచూసింది. అయినా, టీడీపీ ఆ పార్టీకి ఎక్కువ సీట్లను కేటాయించింది. అయితే, ఇప్పుడు ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం జనసేన బాగా పుంజుకుందని పవన్‌కళ్యాణ్ కొంతకాలంగా చెబుతున్నారు. అలాంటప్పుడు 175 సీట్లలో మూడో వంతు 33 శాతం సీట్లు కాకుండా కేవలం 13 శాతం సీట్లకే పవన్ అంగీకరించడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేక ఆయన్ను తూర్పారబడుతున్నారు. పవన్‌కు సీఎం పదవి అంతే సంగతులా!? ఇక పవన్‌కళ్యాణ్‌ను సీఎంగా చేయడమే తమందరి లక్ష్యమని ఆ పార్టీ శ్రేణులందరూ భావిస్తూ ఉంటారు. కానీ, ఈ పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడంతో పవన్ ఇక ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశాలను పూర్తిగా వదులుకున్నారని అటు జనసేన పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన మొదలైనప్పటి నుంచి సీఎం అభ్యరి్థత్వంపై పవన్ పార్టీ సమావేశాల్లో ‘పొత్తులు, ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి’ అంటూ పార్టీ శ్రేణులందర్నీ మభ్యపెట్టారు. అలాగే, గత ఎన్నికల్లో 30–40 సీట్లు గెలిచి ఉంటే సీఎం పదవిలో వాటా కావాలని అడిగే అవకాశం ఉంటుందని.. టీడీపీ అధినేత స్థానంలో తానున్నా జనసేనకు సీఎం పదవిలో వాటా ఇచ్చేవాడ్ని కాదని పవన్ పార్టీ సమావేశాల్లో అనేకసార్లు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే తీరులో వ్యాఖ్యానించారు. దీనికితోడు.. పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో సైతం వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే.. సీఎం పదవి వాటా చర్చకు ద్వారాలు మూసుకున్నట్లేనని స్పష్టమవుతోందని వారంటున్నారు. 2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లతో పోల్చినా.. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన పొత్తులో జనసేన ఒక్కచోట కూడా పోటీచేయలేదు. ఆ సమయంలో విభజిత ఏపీలోనే బీజేపీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాలను టీడీపీ కేటాయించింది. అప్పటికి రాష్ట్రంలో కేవలం 2–3 శాతం ఓట్లకే బీజేపీ పరిమితమైంది. కానీ, ఇప్పుడు జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు తమ పార్టీ ఓట్ల శాతం 15 శాతం ఉంటుందని పవన్‌కళ్యాణ్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24 అసెంబ్లీ సీట్లు, మూడు లోకసభ సీట్లు తీసుకోవడం చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు. బాబు కోసమే పవన్ ఆరాటం 2014 జనసేన ఏర్పాటు నుంచీ పరిశీలిస్తే.. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలన్నీ తన సొంత పార్టీ కంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆరాటపడి పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని జనసేన శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే.. ♦ పార్టీ ఏర్పాటుచేసి కూడా 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీచేయకుండా పూర్తిగా చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేశారు. ♦ ఆ ఎన్నికల్లో టీడీపీ అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకపోయినా పవన్ ఆయన్ను సమరి్థస్తూనే వచ్చారు. ♦ ఇక 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోగా, అది కూడా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే. ♦ ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్సీపీకి వెళ్లకుండా టీడీపీకి సహకరించారనే విమర్శలున్నాయి. ♦ తిరిగి 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి.. వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. అంటే.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని కారణంగా లాభపడే అవకాశం చంద్రబాబు ఒక్కరికే ఉంటుంది. అందుకే పవన్ ఇప్పుడు టీడీపీతోనే పొత్తుపెట్టుకున్నారు. ♦ మరోవైపు.. గత పదేళ్లుగా జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి పవన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా టీడీపీకి అనుకూలాంశమే. ఇవన్నీ బాబుకు భజన చేసేవేనని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నారు. -
హే..‘కృష్ణా’ .. ఇదేమి తంటా ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా హఠాత్తుగా దిగిపడుతున్న పారాచూట్ నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తుండటం టీడీపీలో తమ్ముళ్లను కకావికలం చేస్తోంది. జనసేన పొత్తుతోపాటు, బీజేపీతో కూడా ఖాయం అనుకుంటున్న పొత్తు టీడీపీ నేతల టికెట్ అవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సీనియర్ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొండి చెయ్యి మిగలనుందని స్పష్టం అవుతోంది. దీంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అన్న స్పష్టత లేక టీడీపీ తమ్ముళ్లు మరింత గందరగోళానికి గురవుతున్నారు. బొండా ఉమాకు సీటు గండం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేదని భావిస్తున్న బొండా ఉమాకు గడ్డుకాలం మొదలైంది. బీజేపీ పొత్తు రూపంలో ఆయనకు గండం పొంచి ఉంది. దీనికితోడు వంగవీటి రాధా సైతం తనకే సీటు కావాలని పట్టు పడుతుండటంతో విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరన్నది తేలక నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే బొండా టికెట్ గల్లంతు కావడం ఖాయం. తిరువూరు తెరపైకి రోజుకో అభ్యర్థి... తిరువూరు నియోజకవర్గంలో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్చార్జిగా శావల దేవదత్తు ఉన్నారు. ఆయనను కాదని కొలికిపూడి శ్రీనివాస్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తమదే టికెట్ అని చేసుకొంటున్న ప్రచారం అక్కడ తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా టీడీపీ తరఫున టికెట్ రేసులోకి వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఇక్కడికి పారాచూట్ నేతలను తీసుకొస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది. జగ్గయ్యపేట అభ్యర్థి నేనే‘నయా’ ఇప్పటికే చంద్రబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం పర్యటనలో పార్టీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్యను ప్రకటించారు. కానీ అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ పేరుతో ‘గెలిస్తే న్యాయం చేస్తా, ఓడినా సాయం చేస్తా, మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా’ అంటూ జగ్గయ్యపేటలో వెలిసిన ఫ్లెక్సీలు అక్కడ టికెట్‌పై కొత్త చర్చకు దారితీసేలా చేశాయి. చంద్రబాబు ఇప్పటికే ఇన్చార్జిలుగా ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం తమకు బీ ఫాం ఇచ్చే వరకు టికెట్ అనుమానమే అన్న భావనను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇది క్యాడర్లో తీవ్ర గందరగోళం రేపుతోంది. సీట్లు తన్నుకు పోతున్న పారాచూట్లు... ఇప్పటికే నూజివీడులో కొలుసు పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పారాచూట్లుగా వచ్చి టికెట్లు తన్నుకుపోయారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా పారాచూట్లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో పారీ్టకోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మైలవరంలో తెరపైకి కేశినేని చిన్ని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతో పొత్తు ఆయన సీటుకు ఎసరు పెట్టనుంది. ఎంపీ సీటుపై బీజేపీ కర్చిప్ వేసింది. ఈ నేపథ్యంలో చిన్నికి ఎక్కడైనా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ను మైలవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అదే జరిగితే మైలవరంపై ఆశలు పెట్టుకున్న వసంతకు ఆశాభంగమే. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పెనమలూరు టికెట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ బోడే ప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. మరోవైపు దేవినేని ఉమా పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మైలవరంలో టికెట్ ఆయనకు లేదని తేలిపోవడంతో పెనమలూరుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ బోడే వర్గంతోపాటు, వసంత పోటీకి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కన్ను పెనమలూరుపై పడిందని సమాచారం. అదే జరిగితే బోడే ప్రసాద్, వసంత, దేవినేని ఉమా ముగ్గురి సీట్లు గల్లంతయినట్టే. -
పారాచూట్ నేతలతో.. టీడీపీలో భగభగలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీలోకి వివిధ నియోజకవర్గాల్లో పారాచూట్ నాయకులు దిగిపోవడంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడ నుంచో ఉన్నట్టుండి నియోజకవర్గాల్లో దిగిన వారితో స్థానిక నేతలు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ఏమాత్రం పొసగడంలేదు. పైగా.. ఈ పారాచూట్ నేతలకు ఉన్న ధనబలం, హంగు ఆర్భాటాలకే చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం తాముపడ్డ కష్టాలు, చేసిన పనులన్నింటినీ మరచిపోయి ఇప్పుడు ఒక్కసారిగా బయట నుంచి ఎవరెవరినో తీసుకొస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వారిని ఏమాత్రం ఖాతరు చేయకుండా డబ్బున్న వారే తన దగ్గరకు రావాలని స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలను కూడా పక్కనపెట్టి ఈ పారాచూట్ నేతలను ఇన్ఛార్జిలుగా ప్రకటిస్తున్నారు. దీంతో వీరికి.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కాకినాడలో ‘సానా’ వర్సెస్ సీనియర్లు.. కాకినాడ ఎంపీ సీటు రేసులో వ్యాపారవేత్త సానా సతీష్ దూసు కురావడంతో సీని యర్ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక దాన్నుంచి పోటీచేసేందుకు రెడీగా ఉండడం, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మద్దతు ఆయనకే ఉండడం జ్యోతుల నెహ్రూ వర్గానికి మింగుడు పడడంలేదు. నెహ్రూ తన కుమారుడు నవీన్‌కుమార్‌తో ఎంపీగా పోటీచేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అసలు పార్టీలో సభ్యత్వం కూడా లేని సతీష్ అడ్డుపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను ఉన్నట్టుండి తీసుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న యనమలకు వరుసకు సోదరుడైన కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక దశలో ఆయన పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధమయ్యారు. దివ్యను వ్యతిరేకిస్తూ ఆమె వర్గానికి చెందిన యనమల రాజేష్‌పై కృష్ణుడు వర్గం దాడి కూడా చేసింది. ఈ విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ తెరపైకి రావడంతో ఇప్పటివరకు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న బాలయోగి తనయుడు గంటి హరీష్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏలూరు ఎంపీ సీటుపై సిగపట్లు.. ఇక ఏలూరు జిల్లా చింతల పూడి అసెంబ్లీ నియో జకవర్గ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌ను నియమించడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు భగ్గు మంటున్నారు. అలాగే, ఏలూరు పార్లమెంటు సీటు కోసం ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ ముందుకురావడంతో ఆ సీటు తమదేనని భావి స్తున్న మాగంటి బాబు, బోళ్ల కుటుంబీకులు ఆందోళనలో మునిగిపోయారు. గోపాల్ నాలుగు నెల లుగా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు సభలకు ఫుల్‌పేజీ యాడ్స్ ఇస్తూ హడావిడి చేస్తుండడం, పార్టీ నేతలతో సంబంధం లేకుండా విడిగా తన హంగు ప్రదర్శిస్తుండడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. గుడివాడ, గుంటూరులో గరం గరం.. మరోవైపు.. కృష్ణాజిల్లా గుడి వాడ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని నియమించడంతో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న రావి వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహంతో రగి లిపోతోంది. కేవలం ధన బలం ఉందనే కారణంతో నే రావిని కాదని వెనిగళ్లకు చంద్రబాబు సీటు ఖరా రుచేయడం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. అలా గే, గుంటూరు ఎంపీ సీటు రేసులో ఎన్ఆర్ఐ పెమ్మ సాని చంద్రశేఖర్‌ను చంద్రబాబు రంగంలోకి దింపడం అక్కడున్న నేతలకు మింగుడుపడడంలేదు. నాగబాబు ఎంట్రీతో అనకాపల్లిలో సీన్ రివర్స్.. ఇక అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సీనియర్లను కాదని బయట ప్రాంతం నుంచి వచ్చిన బైరా దిలీప్‌కుమార్ పేరును తెరపైకి తీసుకొ చ్చారు. టీడీపీ కార్యక్రమాలకు, లోకేశ్ యువగళం యాత్రకు భారీగా ఖర్చుచేసిన దిలీప్ టీడీపీ, జనసేన పొత్తులో పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టేలా పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోతోంది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు ఎన్ఆర్ఐ గొంప కృష్ణను దిగుమతి చేయడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం రగిలిపోతోంది. పార్వతీపురం అసెంబ్లీ ఇన్చార్జి కొత్తగా బోనెల విజయచంద్రను నియమించడంతో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పల్నాడులో భాష్యం ప్రవీణ్ హల్చల్.. పల్నాడు జిల్లాలో వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్ హడావుడితో సీనియర్ నేతలు మండిపడుతున్నారు. మొదట్లో ఆయన చిలకలూరిపేటపై దృష్టిపెట్టి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎసరు పెట్టడంతో పార్టీలో అలజడి రేగింది. కేడర్ ఆందోళనతో ప్రవీణ్‌ను చిల కలూరిపేట నుంచి తప్పించినా ప్రస్తుతం పెదకూరపాడు సీటును ఆయనకు ఇస్తామని చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో అక్కడి ఇన్‌ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్ ఆందోళన చెందుతూ తన వర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ ఏంచేయాలో చర్చిస్తున్నారు. ఎన్నికల ఫండ్ ఇచ్చిన వ్యక్తికి అందలం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌ను దాదాపు ఖరారు చేశారు. లోకేశ్ సన్నిహితుడిగా ఉన్న ఆయన ఎన్ఆర్ఐల నుంచి ఎన్నికల ఫండ్ సేకరించి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన దెబ్బకు ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు సీటు నిరాకరించడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కావలి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి దాదాపు ఖరారుచేయడంతో అక్కడి ఇన్‌ఛార్జి సుబ్బానాయుడు, సీనియర్ నేత బీద రవిచంద్రలు గుర్రుగా ఉన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవలే పార్టీలో తిరుగుతున్న డాక్టర్ థామస్‌కే సీటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో పలువురు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. కళ్యాణదుర్గం రేసులో కాంట్రాక్టర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుని పోటీకి దింపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుండడం సీనియర్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్న పేరును అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమైంది. -
కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులతో వెళ్లాలని భావిస్తోందన్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తమ్మినేని మాట్లాడుతూ.. పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్ పారీ్టనే తేల్చాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ఒకసారి ఆరు నెలలు, మరోసారి సంవత్సరంలో భర్తీ చేస్తామని అంటున్నారని, ఈ రెండు మాటల్లో మర్మమేంటని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అక్షింతలు ఓట్లుగా మారతాయా? బీజేపీకి ఓట్లేస్తారా? అనేది చూడాలన్నారు. బీజేపీపై రేవంత్‌రెడ్డి పోరాడాలి: బీవీ రాఘవులు కర్ణాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ఇక్కడ పోరాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్దిరోజుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ’’కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు కానీ నిజానికి కిషన్రెడ్డీ నువ్వే మూసీలో పడిపోతావు జాగ్రత్త’’అని రాఘవులు ఎద్దేవాచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
‘ఆప్’తో కాంగ్రెస్ పొత్తు ఖరారు.. సీట్ల లెక్కలివే..!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి అన్ని పార్టీల్లోనూ ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తాజాగా సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరాక ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిన నేపధ్యంలో ఈ రెండు పార్టీల మధ్య కూడా సీట్ల పంపకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గుజరాత్, అసోం, హర్యానాలలోని లోక్‌సభ స్థానాల టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. దీని ప్రకారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ రెండు సీట్లు ఇవ్వగా, హర్యానా, అసోంలో ఒక్కో సీటు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించారు. కాగా పంజాబ్‌లో పోటీకి సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య ఇంకా ఒక నిర్ణయం కుదరలేదని తెలుస్తోంది. ఇక్కడ రెండు పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఉనికి కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సీఎం వైఎస్ జగన్ మరింత పెంచుకున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం, నిత్యం జనంతో మమేకమవడం, ప్రజలకు మంచి చేయడం, మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరడమే సీఎం జగన్ సిద్ధాంతమని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మద్దతు తెలిపామని ఆయన చెప్పారు. సెక్యులర్ భావనకు విఘాతం కలిగించే ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులను వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రేపల్లె, వేమూరులో టీడీపీకి గట్టి షాక్ వైఎస్సార్సీపీలో చేరిన ఆ నియోజకవర్గాల టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. రేపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు, వేమూరు నియోజకవర్గం చుండూరు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాలకు చెందిన వందలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో లోక్‌సభ, శాసన సభ అభ్యర్థుల ఎంపికలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని తెలిపారు. వేమూరు ప్రజలు వరికూటి అశోక్‌బాబును గెలిపించాలని, ఆయన అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. ఎస్సీ సామాజికవర్గంలో వర్గ విభేదాలు సృష్టించేందుకు చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండే ఊవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలు గెలిపించాలని కోరారు. రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు మూడో అవకాశం ఇవ్వొద్దని కోరారు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని జూదం ఆడుకుంటాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని చెప్పారు. పార్టీ కోసం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారన్నారు. -
ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్ ?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇచ్చే స్థానాలపై సమాజ్‌వాద్ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్ షేరింగ్ చర్చల్లో మొరాదాబాద్ డివిజన్లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం -
పవన్ ఢిల్లీ డ్రామా.. జనసేనలో నైరాశ్యం!
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని 60 రోజులు కూడా లేదు. అయినా ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన తీసుకొచ్చారు. ‘రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తా..’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటన గురించి జనసేన అధికారిక సమాచారం ఇచ్చింది కాదు. విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో చర్చల సందర్భంగా కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలే మీడియాకు లీకయ్యాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారంగానే అర్థమవుతోంది. టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సీట్ల పంపకంపై ఎటూ తేల్చలేకపోయారు. ఓవైపు టీడీపీ ఏమో ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతోంది. మరోవైపు టీడీపీ నేతలు పవన్‌ను కలిసి తమ స్థానాల వైపు రావొద్దంటూ కోరుతున్నారు. ఇంకోవైపు.. జనసేన ఆశిస్తున్న స్థానాల్లోనూ టీడీపీ(అదనంగా అందులో వర్గపోరు కూడా) ముందుకొస్తోంది. ఈ తరుణంలో.. బాబు-పవన్‌లు వెనువెనుకే ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ.. ఫలితం లేనట్లు కనిపిస్తోంది. అందుకే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాతే ఇరు పార్టీల ఉమ్మడి సమావేశాలు రద్దు అయ్యాయి. పవన్ తన టూర్లు రద్దు చేసుకుని.. మంగళగిరి ఆఫీస్‌కే పరిమితం అయ్యారు. ఇప్పుడు ‘‘వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయి. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది’’ అంటూ త్యాగాలకి సిద్దం కావాలనే అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పినా.. పెదవి విరిచేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో.. టీడీపీలో కలకలం టీడీపీతో కలవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేనే ఒప్పించా.. అని కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు రాజకీయంపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో టీడీపీ కేడర్ నొచ్చుకుంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కనీసం పవన్‌కు ఆహ్వానం పలికేందుకు కూడా టీడీపీ నేతలు రాలేదని స్పష్టమవుతోంది. గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ ఢిల్లీ ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడం!. ఇవాళో, రేపో అపాయింట్మెంట్ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే.. గత నెలలోనూ ఇదే విధంగా పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి లీకులు ఇచ్చాడు. అప్పుడూ ఇదే తరహాలో అపాయింట్మెంట్ దొరకలేదు. -
త్వరలో ఢిల్లీకి కెసిఆర్.. ఏం చేయబోతున్నారు?
BRS అధ్యక్షుడు KCR మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్ చేస్తున్న మొదటిసారి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఅర్ఎస్, బిజెపి ల మద్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగినా.. పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్‌తో పాటు BRS పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు.! ఢిల్లీలో కెసిఆర్ రాజకీయ చర్చల కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. "మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా? బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు? బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీ." అన్నారు బాల్క సుమన్. పొత్తు ఊహగానాలకు అవకాశమిచ్చిందెవరు? సాధారణంగా బీఆర్ఎస్, బీజేపీ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. దానికి కొనసాగింపుగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. అలాగే ఎంపీ బండి సంజయ్ కూడా ఇదే అంశంపై ప్రకటన చేశాడు. ఇటీవల మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేదు" అన్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుపై మల్లారెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ఏమన్నాడంటే.. "ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు" అని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? మొత్తం 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30, 2023న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64, దాని మిత్రపక్షం సిపిఐకి 1, బీఆర్ఎస్కు 39 సీట్లు రాగా, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు నెలల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సారి పార్లమెంటు ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణంలో మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రెండు రోజుల్లో శుభవార్త వింటారు: కమల్ హాసన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్తానని ప్రకటించారు నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్. పార్లమెంట్ ఎన్నికల కోసం సద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్ హాసన్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన కమల్ సోమవారం చెన్నై తిరిగొచ్చారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో కమల్ ఎమ్ఎన్ఎమ్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్‌తో పోత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలకు మద్దతుగా కమల్ హాసన్ నిలిచారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే చిన్న పిల్లావాడిని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఇక 2018లో కమల్ హాసన్ ఎమ్ఎన్ఎమ్ పార్టీని స్థాపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అనంతరం గత ఏడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికల్లో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థికి ఎమ్ఎన్ఎమ్ మద్దతు ఇచ్చింది. చదవండి: యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’ -
బీఆర్ఎస్తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు -
‘ఉమ్మడి కృష్ణా’లో తారాస్థాయికి వివాదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లా తెలుగుదేశంలో జనసేనతో పొత్తు తీవ్ర కలవరం రేపుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మైలవరం, పెడన, అవనిగడ్డ.. ఈ ఐదు నియోజకవర్గాల్లో తమకు నాలుగు నియోజకవర్గాలు కేటాయించాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లో మూడు సీట్లకు తగ్గేది లేదని భీష్మించుకు కూర్చున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఆ మూడు సీట్లతో పాటు, ఎంపీ సీటుపైన టీడీపీ పూర్తి ఆశలు వదులుకుకోవాల్సిందేననే భావనలో టీడీపీ ఉంది. టికెట్ ఇచ్చినా ఓడిస్తాం.. మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా ఇవ్వడానికి వీలులేదని, టీడీపీ అధినేతపై ఒత్తిడి తేవాలని తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు. విజయవాడలో జనసేనాని సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టు ఏర్పడితే, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు విఘాతం అని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అనివార్యం అయితే ఒకటి, రెండు సీట్లు జనసేనకు ఇచ్చినా, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ ధ్యేయంగా పెట్టుకొంది. జనసేనకు గాని, ఆ పారీ్టకి దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ఎనీ్టఆర్ జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తుగడ. ఈ విషయం బయటికి పొక్కడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్ల వ్యవహారంపై తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు. టీడీపీ సైలెంట్.. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేయటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య టికెట్‌పై గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్‌లు తమకే టికెట్ వస్తుందని బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నారు. జనసేన సైతం పొత్తులో భాగంగా ఈ సీటు తమకే కేటాయిస్తారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ హడావుడి చేస్తున్నారు. ఇక్కడ టికెట్‌పై స్పష్టత లేకపోవడంతో.. అక్కడ అసలే అంతమాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్ ప్రచారం ముమ్మరం చేశారు. మండలికి మళ్లీ సారీ! ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీలో సైతం అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్‌కు ఈసారీ టికెట్ దక్కే అవకాశం లేదనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. బుద్ధ ప్రసాద్ కూడా సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తే, ఓటమి తప్పదని, టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. పెడన నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. టీడీపీ నేతలు కాగిత కృష్ణప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్‌పై ఎటూ తేలకపోవడంతో, టీడీపీ నేతలు అంటీ ముట్టనట్లు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పొత్తు ఖరారు కాకముందే కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించటాన్ని అక్కడ జనసేన పార్టీ శ్రేణులు జీరి్ణంచుకొలేకపోతున్నారు. గద్దె సీటుకు ఎసరు! తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటించడం లేదు. టికెట్ వస్తుందో రాదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జనసేన నాయకులు సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండు, మూడు సార్లు చుట్టేశారు. తాజాగా కుటుంబ సభ్యులందరితో కలిసి, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ, తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని వైఎస్సార్ సీపీ తరఫున పార్లమెంట్ ఇన్చార్జిగా ప్రకటించడం పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు కలిసొస్తోంది. తాజాగా మైలవరం జనసేనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. అక్కడ దేవినేని ఉమాకు టికెట్ లేదని టీడీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడంతోపాటు, అక్కడ అభ్యర్థి ఎవరో తేలక పోవడంతో దేశం శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది. -
తమ్ముళ్లూ.. త్యాగాలు..
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇవ్వలేనని, చాలామంది నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తోచక గగ్గోలు పెడుతున్నారు. పొత్తుల కోసం పాకులాడుతూ తమ గొంతు కోస్తున్నారని పలువురు నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు. అన్ని సీట్లు వదులుకున్నాక ఇక అధికారం ఎలా వస్తుందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 50కిపైగా ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు, బీజేపీకి 25 ఎమ్మెల్యే, ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వక తప్పదని టీడీపీలో పది రోజులుగా చర్చ జరుగుతోంది. మొత్తం 75 ఎమ్మెల్యే, పది ఎంపీ స్థానాలను టీడీపీ ఆ రెండు పార్టీలకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. వాటిలోనే నేతలు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని చంద్రబాబు శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో నాయకులందరికీ స్పష్టంగా చెప్పారు. మానసికంగా సిద్ధం చేస్తున్న బాబు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించినా... సీట్లపై నోరు మెదపలేదు. పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి అమిత్‌షా శరణు కోరిన తర్వాత బీజేపీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలను మానసికంగా సిద్ధం చేసేందుకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలిసారి సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వడం కుదరదని, సర్దుకుపోవాలని బాంబు పేల్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. జిల్లాల వారీగా ఎవరి సీట్లు ఎగిరిపోయే జాబితాలో ఉన్నాయో ఆరా తీస్తూ భగ్గుమంటున్నారు. బీజేపీ, జనసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారని వాపోతున్నారు. చంద్రబాబు తాను, తన కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని బీజేపీ కాళ్ల కింద పెడుతున్నారని, ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి, చంద్రబాబు నడుపుతున్న పార్టీకి సంబంధం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సీనియర్లకు ఎసరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని గతంలో చంద్రబాబు హామీ ఇవ్వటాన్ని సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పదేపదే మీడియా ఎదుట ప్రస్తావిస్తున్నారు. తన సీటుకు ఢోకా లేదని ఆయన చెప్పుకుంటున్నా... జనసేనకు కేటాయించి బుచ్చయ్యకు చంద్రబాబు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పలువురు మాజీ మంత్రుల సీట్లు కూడా ఎగిరిపోయే జాబితాలో ఉన్నాయి. భూమా అఖిలప్రియ, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆలపాటి రాజా, బొండా ఉమా తదితర నేతల సీట్లు గల్లంతు కానున్నాయి. ఎన్నో ఏళ్లుగా తాము పోటీ చేస్తున్న స్థానాలను వేరే పార్టీకి ఇవ్వడం తగదని సీనియర్ నేతలు వాపోతున్నారు. ఎన్నారై నేతల ఆందోళన సీట్లు ఆశ చూపించి కొందరు ఎన్నారై, పారిశ్రామికవేత్తలను రంగంలోకి దించిన చంద్రబాబు వారితో నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు చేయించారు. విజయవాడలో కేశినేని చిన్ని, గుంటూరులో ఉయ్యూరు శ్రీనివాస్, భాష్యం ప్రవీణ్, కాకినాడలో సానా సతీశ్, నెల్లిమర్లలో బంగర్రాజు తదితరులను పార్టీ కోసం వాడుకున్నారు. వారంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు చేశామని, ఇప్పుడు తమను నట్టేట ముంచవద్దని వేడుకుంటున్నారు. ఒంటరి పోరుకు ససేమిరా.. పొత్తులు లేకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందంటూ నేతలను చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని, బీజేపీ, జనసేన పార్టీలను కూడగడితేగానీ తలపడలేమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం అధినేత అభ్యర్థనను ఆలకించేందుకు నిరాకరిస్తున్నారు. -
తెలంగాణలో బీజేపీ పొత్తులు.. గుజ్జుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనతోనూ ఈసారి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోము. కొంతమంది జోకర్లు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం రెట్టింపయింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నాం’ అని ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ -
బ్రో’... డైలాగ్ మారింది
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన అంశం.. ప్రత్యేక హోదా విషయం.. పార్టీ లతో పొత్తుల వ్యవహారం.. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాటలు మార్చుతూ రాజకీయాల్లో ‘యూ టర్న్’ నాయకుడిగా చంద్రబాబు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చంద్రబాబు మాదిరే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని అంశాలలోనూ ఎప్పటికప్పుడు మాట మార్చుతూ తాను ‘నయా యూ టర్న్’ నేతనని నిరూపించుకుంటున్నారు. నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటే.. పార్టీ పెట్టి ఆరీ తీరీ పదేళ్లు కాకుండానే అన్ని పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు ఏ విషయంపై ఏం మాట్లాడుతారోనని రాజకీయ విశ్లేషకులే నిర్ఘాంతపోతున్నారు. గాలి వాటంగా వ్యవహరించే ఆయన ఎప్పుడు ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదంటున్నారు. పవన్ కేవలం ఒక్క వలంటీర్లకు సంబంధించిన అంశంలోనే కాదు.. అనేక సందర్భాల్లో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మార్చుతూ తనకు చాలా నాలుకలున్నాయని రుజువు చేస్తున్నారు. అమరావతి రాజధాని, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు అనేక కీలక అంశాలన్నింటిలోనూ జనసేనాని రాజకీయ వైఖరి పూర్తి యూ టర్న్ అన్న రీతినే సాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుపై 2014లో ఒకలా, 2019లో మరోలా, ఇప్పుడు ఇంకోలా మాట్లాడారు. తన కుటుంబాన్ని, తన తల్లిని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ నేతల సంగతి చెబుతానన్న పవన్.. ఇప్పుడు వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. పవన్ నాలుక మడత ఇలా.. ‘రాష్ట్రంలో మహిళల ఆదృశ్యాలకు వలంటీర్లే కారణం. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆ సమచారాన్ని కొంత మంది విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్లు కిడ్నాప్, ట్రాప్ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆదృశ్యమవుతున్నారు. నాతో సాక్షాత్తూ కేంద్ర నిఘా వర్గాలే ఈ మాటలు చెప్పాయి.’ – 2023 జులై 10వ తేదీన పవన్ ‘ఈ వలంటీర్ వ్యవస్థపై జనసేన కోర్టులో ఛాలెంజ్ చేస్తోంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఛాలెంజ్ చేయాలి జగన్.. నీ ఇష్టం. సై అంటే సై.. తేల్చుకుందాం. దేనికైనా రెడీ. వలంటీరు అనే సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకుండా, విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా సిద్ధం. అరెస్టు చేసుకోండి. చిత్రహింసలు పెట్టుకోండి. తప్పు జరిగితే కచ్చితంగా ఎత్తిచూపుతామని సవాల్ విసురుతున్నా’. – 2023 జులై 20న మరోసారి పవన్ ‘ఆడపిల్లలు వైఎస్సార్సీపీ వలంటీర్ల వల్లే ఆదృశ్యమై పోయారని నేను అన్నానట.. ముఖ్యమంత్రి అంటున్నారు.. దానికి వివరణ ఇస్తున్నా. నేను చెప్పింది మీ వలంటీర్లు సమాచారం సేకరించడం వల్ల, ఆ డేటా ఎటెటో వెళ్లి పోయిందని చెప్పాను. అంతే తప్ప, ఏ రోజూ వలంటీర్లే అంతా చేశారని నేను అనలేదు. వాళ్ల మీద గౌరవం ఉంది. వలంటీర్ల వ్యవస్థను నేను తప్పు పట్టలేదు. వలంటీర్లుగా పని చేస్తున్న వారి భవిష్యత్ కోసం మేమందరం సంపూర్ణంగా పని చేస్తాం’ – 2024 ఫిబ్రవరి 15 తేదీన తాజాగా పవన్ పలుకులు పవన్ నోట ఇంకా ఇలా.. ♦ 2014 తర్వాత మందడంలో చంద్రబాబుతో కలిసి సంకాంత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ‘అమరావతే ఆంధ్రప్రదశ్ రాజధాని. మన (టీడీపీ–జనసేన) ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో బంగారు రాజధానిని నిర్మించుకుందాం’ ♦ ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్యాపిటల్ కాదు. కేవలం కొద్ది మంది కోసమే. అది టీడీపీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్‌లా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఏమీలేని ఈ క్యాపిటల్‌కు రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు? వాళ్లు ఇక్కడకు వచ్చి ఎలా స్థిరపడతారు?’ అని గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2018లో వ్యాఖ్యానించారు. ♦ 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చామా.. అని బాధపడుతున్నా. యువతకు ఉపాధి, ఆడపడుచులకు రక్షణ ఉంటుందని ఆశిస్తే అవేవీ టీడీపీ పాలనలో లేవు. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులు చేయడంలోనే అభివృద్ధి చూపించారు. ♦ 2018 అక్టోబర్ 2న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సభలో ‘నాలుగేళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మిమ్మల్ని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి చంద్రబాబూ? మీరు చేసిన అద్భుతాలు ఇక చాలు. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉన్నవాటిని కూడా మూసేస్తున్నా పట్టించుకోవడం లేదు. మీ పాలన మాకొద్దని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.’ ♦ ‘దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో టీడీపీకి మద్దతు ఇవ్వలేకపోయా. అందుకే ఇప్పుడు మద్దతు ఇస్తున్నా’ అని గత డిసెంబరు 20వ తేడీన లోకేష్ యువగళం ముగింపు యాత్రలో వ్యాఖ్యానించారు. -
‘పొత్తు’లాటతో అంతర్యుద్ధం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్సీపీ దూసుకుపోతూ... ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో... భవిష్యత్తులో ఏం చేస్తామో... చెప్పుకోలేక... డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు... ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం... సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు. – సాక్షి నెట్వర్క్ బత్తులకు ఉత్తచెయ్యేనా... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభేదాలు బట్టబయలు శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం. పెనుకొండలో నియోజకవర్గ ఇన్చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది. వియ్యంకుల్లో ఒకరికేనట! పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల టికెట్ల కేటాయింపునకు బంధుత్వం అడ్డుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వియ్యంకులైన ఈ ఇద్దరిలో జీవీ వినుకొండ, కొమ్మాలపాటి పెదకూరపాడు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే కోరికతో వారు చంద్రబాబును ఇటీవల కలిశారట. అప్పుడు ఆయన ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చుకోండని వారిపైనే ఆ భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారట. పరోక్షంగా పెదకూరపాడులో డబ్బు దండిగా పెట్టగల భాష్యం ప్రవీణ్‌కు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పడంతో శ్రీధర్ తన వర్గీయులతో శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి తనకు అండగా నిలవాలని కోరారు. మిత్రత్వంలో శతృత్వం ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య టిక్కెట్ ఫైట్ తీవ్రంగా ఉంది. జనసేనకు టిక్కెట్ ఇస్తే కాపుకాసేది లేదని టీడీపీ నేతలు చెబుతుంటే... టీడీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకుంటే తాము సహకరించబోమని, పోటీలో కచ్చితంగా ఉంటామని జనసేన నేతలు బహిరంగంగా చెబుతున్నారు. పొత్తుల్లో ఈ స్థానం టీడీపీకి ఖరారైందని ఆ పార్టీ ఇన్చార్జి బడేటి చంటి ప్రచారం చేసుకుని ఏకంగా హోర్డింగులతో హడావుడి చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నాయకులు ‘మేము రెడీ.. టిక్కెట్ మాదే..’ అంటూ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. అంతేనా... ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడే అంటూ అతను నిర్వహించిన ఆతీ్మయ సమావేశంలో జిల్లా జనసేన నేతలే ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగా జనసేనలో అకస్మాత్తుగా తెరపైకి మరో కొత్త నేత వచ్చి తనకే టికెట్ అంటూ నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి దారితీశారు. అనంతపురంలో అంతర్గత పోరు అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి అసమ్మతి బెడద ఎక్కువైంది. ఆయన మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ పవన్‌కల్యాణ్ పోటీచేస్తే తాను తప్పుకుని ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్ చెబుతుండగా ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా!’ అని తెలుగుదేశం పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ‘తమ్ముళ్ల’ హడావుడితో జనసైనికుల ఆగ్రహం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. కానీ దానిని పట్టించుకోకుండా అమలాపురం టీడీపీ ఇన్చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి తేలాల్సి ఉంది. కొత్తపేట, ముమ్మిడివరంలో టీడీపీ ఇన్చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. యర్రగొండపాలెంలో డిష్యుం..డిష్యుం యర్రగొండపాలెంలో టీడీపీపై అసమ్మతి బుసలు కొడుతోంది. డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలవడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం చెబుతుండగా ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయనకు టికెట్ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోమని డాక్టర్ రవీంద్ర వర్గం కరాఖండీగా చెబుతోంది. -
కక్ష సాధింపు కోసమే అన్ని పార్టీలు దాడి చేస్తున్నాయి
-
కాంగ్రెస్ దెబ్బకు కూటమి అబ్బా!
'ఇండియా కూటమి' మధ్య ఐక్యత పెరగకపోగా, కూటమి విచ్ఛిన్నం దిశగా పయనం చేస్తోంది. రేపటి సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్ని పార్టీలు కలిసివుంటాయో? చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు పార్టీలు తప్ప, ఎవరూ కాంగ్రెస్ వెంట నడవడానికి ఇష్టపడడం లేదని ఈ పరిణామాలు బలంగా చెబుతున్నాయి. తాజాగా మరో పార్టీ బయటకు వచ్చేసింది. కూటమితో సంబంధం లేకుండా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా ప్రకటించారు. లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఏకకాలంలో ఎన్నికలు జరుగవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో బలమైన ఓటుబ్యాంక్ వున్న ప్రధాన పార్టీలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే ఫారూక్ బయటకు వచ్చేశారు. ఇదే అంశంతో పాటు మరికొన్ని విభేదాలతో ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు వస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్,కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్ లోని జెడీయు కూడా అదే బాట పట్టాయి. జెడీయు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎన్డీఏ గూటికి తిరిగి చేరింది.మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్,ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ ది కూడా దాదాపు అదే పరిస్థితి. 2019 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి కాంగ్రెస్ ను బలపరిచి,మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు పలికి,సహకారం అందించారని పేరుతెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఇండియా కూటమిలోకి చేరడానికి ఆసక్తి చూపడం లేదు.రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ,మోదీ వైరిపక్షంలో చేరడానికి బాబు భయపడుతున్నారని అనుకోవాలి. ప్రస్తుతం తమకున్న అవసరాల దృష్ట్యా ఎలాగైనా మళ్ళీ నరేంద్రమోదీతో జతకట్టడానికి బాబు వీరప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. బీజేపీ పెద్దలే బాబు పొత్తును కోరుకుంటున్నారని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా,జనం నమ్మడం లేదని, రేపటి ఎన్నికల అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ - టిడిపి పొత్తుకట్టినా,అది ధృతరాష్ట్రుడి కౌగిలింత వంటిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ యాత్రల పేరుతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ,ఇండియా కూటమిలో ఐక్యతను నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కూటమి శక్తివంతంగా నిర్మాణమవుతుందని గాంధీ త్రయం ( సోనియా, రాహుల్, ప్రియాంక) బలంగా విశ్వసించింది.కానీ, కర్ణాటక,హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్ గడ్,రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది.మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుపును ఆపలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ లో గిడుగు రుద్రరాజును మార్చి షర్మిలకు పగ్గాలు అప్పగించింది. గిడుగు రుద్రరాజు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వ్యక్తి. కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి,పల్లంరాజు వంటి అనేకమంది సీనియర్ నాయకులు ఉండగా,వారందరినీ పక్కన పెట్టి, వై ఎస్ తనయ షర్మిలకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీకి జవసత్వాలు పెరుగుతాయని కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న విశ్వాసం ఎంతవరకూ ఫలవంతమవుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి తేరుకోలేదు. కేవలం రెండు మూడు నెలల వ్యవధి ముందు పార్టీ బాధ్యులను మార్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పైకి లేస్తుందన్నది ఒట్టిమాటే. ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన ప్రయోగాలు ఎక్కువ శాతం బెడిసికొట్టాయి. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఎదురుదెబ్బలుగా మిగిలాయి. ఈరోజు ఇండియా కూటమి బలోపేతం కాకపోవడం, విచ్ఛినం దిశగా ప్రయాణం చేయడానికి మూలం కాంగ్రెస్ విధానాలే.పంజాబ్ లో అమరేంద్ర సింగ్ ను తప్పించి,నవజ్యోత్ సింగ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మొదలు ప్రతి రాష్ట్రంలో తప్పటడుగులు వేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను అడ్డం పెట్టుకొని పంజాబ్ లో ఆమ్ అద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఢిల్లీలోనూ పాగా వేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, శ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుదేలైపోయింది. నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీ విషయంలో కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పు చేసింది. కాంగ్రెస్ విధానాల వల్లనే మేం నష్టపోయామని ఆ నాయకులు పదే పదే వాపోయారు. కేజ్రీవాల్ మొదటి నుంచీ కాంగ్రెస్ తో జతకట్టడానికి పెద్దగా ఇష్టపడడంలేదు. ఇండియా కూటమి నిర్వహించిన అనేక సమావేశాలకు ఆయన ఎగ్గొట్టారు కూడా. రాహుల్ గాంధీ తీరు పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి గుర్రుమని వున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ ది కూడా ఇంచుమించు అదే తీరు. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో లోక్ సభ లో బలాన్ని పెంచుకోక పోగా, ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని, పొత్తులను కూడా కోల్పోతూ వచ్చింది. పాండిచ్చేరి వంటి చిన్న రాష్ట్రంలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పాండిచ్చేరిలో కూటమిలో ముసలం పుట్టిన వేళ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడే వున్నారు. తమిళనాడులో స్టాలిన్ తో స్నేహం కొనసాగుతూ ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో ఆయన కేటాయించిన అరకొర సీట్లతో సర్దుకోవాల్సిన దుస్థితి అప్పట్లో కాంగ్రెస్ కు పట్టింది. ఇప్పటికీ అదే పరిస్థితి.మొత్తంగా చూస్తే,ఇండియా కూటమి వైఫల్యానికి వున్న ప్రధాన కారణాలలో కాంగ్రెస్ విధానమే ముఖ్యమైన కారణం. ఇంకొక పక్క ఎన్డీఏ తన కూటమిని బలోపేతం చేసే పనిలో పడిపోయింది. నితీశ్ కుమార్ మొదలు అకాలీదళ్ బీజేపీ పంచకు చేరాయి. లాభనష్టాలు, పరిణామాలు ఎలా వున్నా, టీడీపీ కూడా అదే బాట పట్టింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మోదీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి తటస్థంగానే వున్నారు. 370-400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామంటూ బీజేపీ మంచి ఊపులో వుంది. ఇండియా కూటమిని నిలుపుకోడం సంగతి అటుంచి,కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తనకున్న లోక్ సభ స్థానాలను సైతం ఏ మాత్రం నిలబెట్టుకుంటుందో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాయకత్వ పటిమను పెంచుకొని, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించుకుంటేనే? ఏ పార్టీకైనా, నాయకుడుకైనా ఉనికి, భవిష్యత్తు వుంటాయి.-మాశర్మ -మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది. -
పవన్కున్నాయ్.. ప్రత్యేక కారణాలు
సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం: హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతించలేదన్న కారణ0తో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా పార్టీ సమావేశాలను వాయిదా వేసుకుంటారా? కానే కాదు. దాని వెనుక సొంత పార్టీ కారణాలు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక కూడా టీడీపీ–జనసేన కూటమి గొడవలు, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. అవి బయటపడకుండా హెలికాప్టర్ లాండింగ్‌కు అనుకూలంగా లేదన్న అధికారుల సూచనను రాజకీయం చేసేసి, అన్ని సమావేశాల్ని మంగళగిరికి మార్చేసుకున్నారు పవన్. ఇదీ అసలు కారణం జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు పార్టీ ల నాయకుల మధ్య ఉప్పు– నిప్పుగా ఉంది. ఈ కారణంతోనే ఇటీవలి కాలంలో పవన్ జిల్లా పర్యటనలకు వెళ్లడం లేదు. వారాహి యాత్రా ఆగిపోయింది. చివరాఖరికి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఉపక్రమించారు. బుధవారం నుంచి ఈనెల 17 వరకు మూడు రోజులు భీమవరంలోనే మకాం ఉండి భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో జరిగే జనసేన, టీడీపీ ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ వర్గాల మధ్య బొత్తిగా పొసగడంలేదు. టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. వీరి గ్రూపు రాజకీయాలు పవన్ పర్యటనకు చేటుచేస్తాయని జనసేన నేతలు భావించినట్టు సమాచారం. దీనికి తోడు పెళ్లిళ్ల ముహూర్తాల కారణంగా పవన్ మకాం చేసేందుకు భీమవరం పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్‌లు, సమావేశాలకు ఫంక్షన్ హాళ్లు దొరకలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పర్యటన వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వంపై నెపం వేసి.. టీడీపీ–జనసేన కూటమిలో విభేదాలు, వసతి దొరకలేదన్న కారణాన్ని బయటకు చెప్పలేక, హెలిప్యాడ్‌కు ప్రత్యామ్నాయం చూడాలన్న అధికారుల సూచనను రాజకీయం చేసి, పబ్బం గడిపేసుకుంటున్నారు పవన్. హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతులివ్వడంలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లేసి కార్యక్రమాలను మంగళగిరికి మార్చేసుకున్నారు. వాస్తవానికి పట్టణంలోని విష్ణు కళాశాలల వద్ద ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను జనసేన నాయకులు ఎంచుకున్నారు. ఈ హెలీప్యాడ్ వినియోగించి చాలా కాలమైంది. ఆ ప్రాంతంలో కొత్తగా భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మించడం, చెట్లు పెరిగిపోవడంతో ల్యాండింగ్‌కు సురక్షితం కాదని అనుమతి ఇవ్వలేదని ఆర్ అండ్ బీ ఈఈ ఎస్ లోకేశ్వరరావు తెలిపారు. గత నెలలో సీఎం జగన్ భీమవరం పర్యటన సందర్భంగా విష్ణు కళాశాల హెలీప్యాడ్ అనుకూలంగా ఉండదని భావించడం వల్లే పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. పవన్ హెలికాప్టర్ కోసం కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని జనసేన నేతలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు ఉండి సమీపంలోని ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయినా, అసలు కారణాలను కప్పిపుచ్చుతూ, పవన్‌కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు మంజూరు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా బుధవారం (14వ తేదీ) నుంచి జరగాల్సిన పర్యటన వాయిదా వేసుకున్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాలు జరగనున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఒక వంకేనని, అసలు కారణం టీడీపీ, జనసేన మధ్య విభేదాలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదారు నెలల క్రితం బాబు అరెస్టు సమయంలో తన హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అప్పట్లో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చి, మధ్యలో రోడ్డుపైనే పడుకొని హడావుడి చేసిన పవన్.. ఇప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు రాలేరని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి కార్యాలయం నుంచి 150 కి.మీ. లోపే ఉన్న భీమవరానికి రోడ్డు మార్గంలో రావడం సులువైన పని అయినప్పటికీ, హెలికాప్టర్‌కు అడ్డంకుల పేరుతో పర్యటననే వాయిదా వేసుకోవడం విచిత్రంగానే ఉందని జనసేన నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
వారం గడిచింది.. అయినా బాబు నోట మాటెందుకు రావట్లేదు?
అన్నీ తల కిందులవుతున్నాయి. బీజేపీతో పొత్తు అంటూనే నిర్ణయం పెండింగ్‌లో పెట్టారు. అటు సీఎం జగన్ ఎలక్షన్ డ్రైవ్ స్పీడ్ పెంచారు. YSRCP అభ్యర్దుల పైనా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఇన్‌ఛార్జ్‌ల లిస్టు ప్రకటిస్తున్నారు. ఇటు బాబు కూటమిలో మాత్రం సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. జనసేన, బీజేపీతో పొత్తుతో సీన్ మార్చాలనే చంద్రబాబు వ్యూహాలు తిరగబడుతున్నాయి. సీట్లు, సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే కూటమి ఓట్లలో స్పష్టంగా చీలికలు కనిపిస్తున్నాయి. ఒక్క పొత్తు కోసం చంద్రబాబు అడుగు ముందుకు వేస్తే అనేక నష్టాలు వెంటాడుతున్నాయన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్లలో మొదలయ్యాయి. అసలు YSRCP వ్యతిరేక ఓటు చీలకూడదన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మూల సిద్దాంతానికే బీటలు వారుతున్నాయి. ఈ పరిస్థితికి విశ్లేషకులు చెబుతున్న ఓ 10 కారణాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అయితే ఇప్పటివరకూ టీడీపీ, జనసేన సీట్లు ఖరారు కాలేదు. టికెట్లు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవరికి వారు ప్రకటనలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఒకరికి ఇస్తే మరొకరు తిరుగుబాటు చేస్తామన్న బహిరంగ ప్రకటనలొస్తున్నాయి. ఈ రెండు పార్టీలే తగువులాడుకుంటుంటే.. వీరిద్దరికి ఇప్పుడు బీజేపీ తోడైతే మరింత క్లిష్ఠ పరిస్థితి. టీడీపీ కోసం పని చేస్తున్న అన్ని సర్వే సంస్థలు ఈ కూటమికి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి. కానీ, ఓడకుండా ఉండాలంటే బీజేపీ పొత్తు తప్పదని చంద్రబాబు వాదిస్తున్నాడు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుగనక ఖరారయితే.. 175లో కచ్చితంగా 75 సీట్లను టీడీపీ వదులుకోవాల్సిందే. వదులుకోవాల్సిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జెండా మోసిన తమ్ముళ్లు... తమకు టికెట్లు దక్కుతాయన్న భ్రమల్లో ఉన్నారు. తమకు టికెట్ నిరాకరిస్తే.. వీరంతా ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించే పరిస్థితి లేదు. చివరి నిమిషం వరకు సీట్లు తేల్చకుండా ఆఖర్లో టికెట్ ప్రకటించినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు ధీటుగా మూడు పార్టీల కూటమి తమ అభ్యర్దులను నిలబెట్టటం సాధ్యం కాదని తేలిపోతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించింది సామాజిక సమీకరణాలే అని పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ అనుసరిస్తోన్న సామాజిక వ్యూహాన్ని ఈ కూటమి అనుసరించడం అసాధ్యం. మూడు పార్టీల నుంచి అగ్రవర్ణాలే ముందు వరసలో ఉన్నారు. వీరందరికి టికెట్లిచ్చి పెద్ద సంఖ్యలో పోటీలో నిలబెడితే.. ఏం జరుగుతుందో.. సులభంగా అంచనా వేయవచ్చు మైనార్టీ ఓట్ బ్యాంక్ కూటమికి పూర్తిగా దూరం కానుంది. 2014లో మైనార్టీలకు టీడీపీ ఒక్క సీటు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మైనార్టీలు టిడిపి వైపు నిలబడే అవకాశాలు లేవు. పట్టణ ఓట్లపై చంద్రబాబు ఆశలున్నాయి. అయితే శ్రీకాకుళం నుంచి కుప్పం పట్టణం దాకా.. ఏ పట్టణంలోనూ టిడిపి స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు. పైగా అర్బన్ ఓటర్లలో ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ప్రధాని మోదీ పైన ఆదరణ ఉందని వీరు చెప్పుకుంటున్నారు కానీ అగ్ర వర్ణాల్లోని ఆ రెండు వర్గాల వారు చంద్రబాబును వ్యతిరేకించే వారే. మోదీని నాడు వ్యక్తిగతంగా దూషించి నేడు అవసరం కోసం తిరిగి మోదీతో జత కట్టడాన్ని వారు సహించలేకపోతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక వర్గాల ఓట్లపై చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఉద్యోగ, కార్మిక వర్గాలకు ప్రతినిధులుగా ఉండే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవటానికి సిద్దపడుతున్నాయి. దీంతో, ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు. షర్మిలను తీసుకొచ్చి ట్విస్ట్ ఇద్దామన్న చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టేలా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు వైఎస్సార్సీపీ నుంచి ఏ పార్టీకి వెళ్లే అవకాశం ఉండదు. ఎల్లో మీడియా చెబుతున్నట్టు ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉన్నా.. అది కూడా చీలుతుంది కదా. పైగా తెలంగాణలో విశ్వసనీయత కోల్పోయిన షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది అంచనా వేయడం కష్టం. 2019లో టిడిపి ఓడిన వెంటనే చంద్రబాబు కోటరీగా వ్యవహరించిన నేతలు నాడు బీజేపీలో చేరారు. బీజేపీ, టిడిపి పొత్తులో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. పొత్తు ఖాయమయితే మళ్లీ వారే బీజేపీ అభ్యర్దులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. ఇది నిజంగా టిడిపి కోసం పని చేసేన వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. వారి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి క్యాడర్ పని చేసే అవకాశాలు కనిపించటం లేదు. పొత్తు ఖాయం చేసుకోవాలంటే బీజేపీ ప్రధానంగా ఒక షరతు విధిస్తోంది. అధికారంలోకి రావటానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 88 టీడీపీ సొంతంగా సాధించే పరిస్థితి ఉండకూడదు. ఇందుకోసం బీజేపీ 4-2-1 ఫార్ములా తెచ్చింది. అంటే తెలుగుదేశం ఏకపక్షంగా ముందుకెళ్లే అవకాశం ఎంతమాత్రంగా లేదన్నమాట. ఈ లెక్క ప్రకారం ప్రతీ పార్లమెంట్ పరిధిలో టీడీపీ 4, బీజేపీ -2, జనసేన -1 స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదన చేసారు ఫలితంగా 75 సీట్లు తమ రెండు పార్టీలకు దక్కేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. కూటమి అధికారంలోకి రావాలన్నా తమ మద్దతుతోనే ముందుకెళ్లే పరిస్థితులు ఉండాలనేది బీజేపీ నిర్దేశించిన వ్యూహం. ఇది చంద్రబాబు & కో కు మింగుడు పడటం లేదు. కూటమితో అధికారంలో వస్తామని కేడర్‌కు చంద్రబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు కారణాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ తెలిసినవే. ఏ పొత్తులనయితే బాబు నమ్ముకున్నాడో.. అవే పొత్తులు బాబు పునాదులను కంపించేలా చేస్తున్నాయని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. :: బెజవాడ బ్రహ్మయ్య -
Pak: పాకిస్థాన్‌లో పవర్ షేరింగ్ !
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రధాన పార్టీలైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), బిలావల్ బుట్టోకు చెందిన పీపీపీ పార్టీలు ప్రధాని పదవిని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ విషయంపైనే ఇరు పార్టీల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం ఐదేళ్లలో ఒక పార్టీ మూడేళ్లు, మరో పార్టీ రెండేళ్లు ప్రధాని పదవి పంచుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో అత్యధిక సీట్లు సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్ ఈ పాకిస్థాన్ పార్టీని అధికారం నుంచి దూరం చేయడానికి మిగిలిన ప్రధాన పార్టీలన్నీ ఏకమై సంకీర్ణం ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదీ చదవండి.. న్యూయార్క్‌లో కాల్పులు.. ఒకరి మృతి -
Pak: పాకిస్థాన్‌లో సంకీర్ణం.. ఆయనే ప్రధాని !
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వచ్చే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), ముత్తహిదా ఖ్వామీ మూమెంట్(ఎమ్‌క్యూఎమ్)పార్టీలకు అధ్యక్ష, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు పలు మంత్రి పదవులిచ్చేందుకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్(పీఎంల్-ఎన్)అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆదివారం పీపీపీ, ఎంక్యూఎం పార్టీ నేతలతో నవాజ్ షరీఫ్ జరిపిన చర్చలు విజయవంతమైనట్లు సమాచారం. ప్రధాని పదవిని మాత్రం పీఎంఎల్(ఎన్) తీసుకోనుంది. ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)ను తప్ప మిగిలిన పార్టీలన్నింటినీ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్‌షరీఫ్ ఆహ్వానించారు. ఈసారి మిలిటరీ కూడా నవాజ్ షరీఫ్కే మద్దతు పలుకుతోందని సమాచారం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ ఎన్‌కు 76 సీట్లు రాగా బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీకి 54 సీట్లు,ఎంక్యూఎం పార్టీకి 17 సీట్లు వచ్చాయి. ఇక ఇమమ్రాన్ఖాన్కు చెందిన పీటిఐ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది. ఇదీ చదవండి.. జర్నలిస్టుపై ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన -
టీడీపీ, జనసేన నేతల మధ్య పొత్తు కుంపట్లు
-
"ఛీ..పో..చంద్రబాబు.." కాళ్లు మొక్కినా కనికరించలేదు
-
వెన్నుపోట్లు తప్ప వెన్నెముక లేని నాయకుడు
-
మీరెలా చెబితే అలా..!
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పుట్ట గతులుండవని తేలిపోవడంతో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ బలమూ సరిపోకపోవడంతో బీజేపీ కాళ్లపై పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు. బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనతో సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తానని చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకే ఈ భేటీ ఉంటుందని ప్రచారం జరిగినా, రాత్రి 11.30 గంటలకు అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు, బీజేపీకి అందించే సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిధ్దపడతాననే హామీ ఇ చ్చి నట్లుగా చెబుతున్నారు. హోటల్లో రహస్య భేటీ కాగా ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు నేరుగా పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్తారని అందరూ భావించారు. అయితే, బాబు అక్కడికి కాకుండా లీ మెరిడియన్ హోటల్‌కు వెళ్లారు. ఆయన వెంట ఉన్న ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణంరాజు, ఇతర నేతలు హోటల్ లాబీల్లోనే ఉండిపోయారు. బాబు ఒక్కరే హోటల్లోకి వెళ్లారు. గంటన్నర తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు హోట్ల్లో ఎవరితో అంత రహస్యంగా భేటీ అయ్యారో టీడీపీ ఎంపీలు, ఇతర నేతలకు కూడా తెలియలేదు. హోటల్ నుంచి గల్లా ఇంటికి వెళ్లారు. అక్కడ బాబుతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు. ముందే రాయబారం నడిపిన సీఎం రమేశ్, కంభంపాటి కాగా అమిత్‌షాతో చంద్రబాబు భేటీ, పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్రావు ముందుగానే రాయబారం నడిపారు. వారు మంగళవారమే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభించే అంశాలపై వివరణ ఇచ్చారు. పొత్తు కుదిరిన పక్షంలో ఎలాంటి షరతులకైనా బాబు సిధ్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో బాబుతో భేటీకి బీజేపీ అగ్రనేతలు అంగీకరించినట్లు సమాచారం. పొత్తులతో ప్రయోజనం ఏమిటి? ఈ చర్చల్లో పొత్తుతో బీజేపీకి లాభించే అంశాలు, ఓట్ల బదిలీ అవకాశాలు, జనసేన పార్టీ బలాబలాలు వంటి అంశాలపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో పొత్తులతో ఒనగూరే ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నలనే నేతలు లేవనెత్తినట్లు సమాచారం. కచ్చితంగా పొత్తు అవసరమైతే బీజేపీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరని, 10 నుంచి 15 స్థానాల వరకైతే అభ్యంతరం ఉండబోదని బాబు చెప్పినట్లుగా తెలిసింది. లోక్‌సభ స్థానాల్లో 5 లేదా 6 బీజేపీకి ఇచ్చేందుకు బాబు సిద్ధపడినట్లు తెలిసింది. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా తాను సిద్ధమని బాబు అన్నట్లు సమాచారం. రెండు పార్టీలకు సమాన లబ్ధి చేకూరే పక్షంలోనే పొత్తులు ఉంటాయని బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్‌తో కూడా చర్చించిన అనంతరం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కబురు చేస్తామని వారు బాబుకు చెప్పినట్లు సమాచారం. -
జనసేన నేతల నిలదీత.. తలదించుకున్న నాగబాబు!
సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం. -
బాబు సమక్షంలో.. కాబోయే సీఎం పవన్ అన్నందుకు..!
చిత్తూరు, సాక్షి: సీట్ల పంపకం తేలడం మాటేమోగానీ.. టీడీపీ-జనసేన కొట్లాటలు మాత్రం రోజుకో చోట బయటపడతున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో.. అదీ ఆయన సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం గమనార్హం. గంగాధర(జీడీ) నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరిమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చంద్రబాబు సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. అందుకు కారణం ఏంటో తెలుసా?.. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ కొంతమంది జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారట. టీడీపీ కార్యకర్తలు అది భరించలేకే.. ఇలా డిష్యుం డిష్యుంకి దిగారు. -
మనం ఎందుకు పట్టించుకోం?
భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్ కుమార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్‌లతో లిబరల్స్ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్ కుమార్ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను. 2013 నుండి, నితీశ్ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్ యాదవ్‌తో, జనతాదళ్‌తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది. ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్ ఇలా అన్నారు: ‘‘మర్ జానా కబూల్ హై, ఉన్ కే సాథ్ జానా హమ్కో కభీ కబూల్ నహీ హై. యే అచ్ఛీ తరహ్ జాన్ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్‌ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్‌లు ఇక చాలు. నితీశ్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’ సరే, నితీశ్ కుమార్ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్‌ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్‌కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం. ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు. భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్ కుమార్ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్‌లో లిబరల్స్ అనేవాళ్లు కన్జర్వేటివ్ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్‌లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్‌కుమార్‌లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
పవన్‌ను నిలదీసేందుకు సిద్ధం!
ఎన్టీఆర్, సాక్షి: పొత్తు సంగతి ఏమోగానీ జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల పంపకంపై ఎటూ తేల్చకుండానే.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరోవైపు జనసేనాని తన పోటీ విషయంలోనే కాదు.. సీట్ల విషయంలోనూ స్పష్టత లేకుండా పోయారు. ఈ పరిణామాల నడుమ.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పదిహేను స్థానాల్లో కూడా పోటీ చేస్తామో? లేదో? అనే ఆందోళనలో ఉన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు ఫలితం ఇదేనా అని పవన్‌ను నిలదీసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు. పొత్తు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని చిత్రమైన పరిణామాలకు ఏపీ కేంద్రంగా మారింది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి కూడా పోటీ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని బాబుపై అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తూ.. ఆ జట్టును వీడేది లేదంటూ పాత పాటే పాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు పవన్ అపాయింట్మెంట్ ఇస్తుండడం.. తమ టికెట్లకు ఎసరు పెట్టొద్దన్న వాళ్ల(మాగంటి బాబు, వేదవ్యాస్, జలీల్ఖాన్లాంటి వాళ్లు) విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్తుండడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పోటీకి అనుకూలంగా మొదటి నుంచి భావిస్తున్న సీటు.. విజయవాడ వెస్ట్. అయితే దాని కోసం టీడీపీ నేతలు తన్నుకున్నంత పని చేస్తుండడం.. ఆ పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండడం.. వెరసి ఆ సీటు వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు. విజయవాడ వెస్ట్‌కు తెలుగు దేశంలో మామూలు పోటీ లేదు. ఒకవైపు బుద్ధా వెంకన్న ఆ సీటును చంద్రబాబు తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించుకున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాలకే ఆ టికెట్ కేటాయించాలంటూ జలీల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. తమ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ దక్కుతుందని ధీమా ప్రకటించారు. బుద్దాకు కౌంటర్‌గా ఇవాళ(శుక్రవారం) వన్‌టౌన్‌లో బలప్రదర్శన పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీల పర్వం చూస్తున్న జనసేనలో టెన్షన్ పెరిగిపోతోంది. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన వెంకట మహేష్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలాకాలం నుంచి బరిలో తానే నిలవబోయేదని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఈ విషయంపై పవన్‌ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ యాత్రలు.. మరోవైపు.. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. విజయవాడ వెస్ట్‌లోనే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురు కావొచ్చని జనసేన నేతలు ఒక అంచనాకి వచ్చారు. జనసేనకు కాస్తో కూస్తో బలం, పేరు ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు, బలనిరూపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీ యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్రకు సిద్ధం కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలం చూపించుకోవాలని జనసేన తాపత్రయపడుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఇకనైనా ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాలని.. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవాలని.. టీడీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయించే దిశగా పవన్‌పై ఒత్తిడి పెంచేందుకు జనసేన నేతలు ‘సిద్ధం’ అవుతున్నారు. -
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
టీడీపీ-జనసేన కూటమిపై అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
ప్చ్.. చిన్నమ్మ! పవన్ చెవిలో పువ్వు!!
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుందా?. ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోందా?. టీడీపీతో పొత్తుగా వెళ్లాలన్న చంద్రబాబు వదిన, బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రయత్నాలకు అధిష్టానం చెక్ పెట్టింది!. అదే సమయంలో టీడీపీతో పొత్తు కోసం వెంప్లరాడుతున్న జనసేననూ దూరం పెట్టేయాలని నిర్ణయించుకుందా?. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం తథ్యం. అలాంటప్పుడు మునిగిపోయే నావతో ప్రయాణం ఎందుకు? అనే కంక్లూజన్‌కి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోత్తు కోసం వెంపర్లాడుతున్న పురందేశ్వరికి సమాధానం స్పష్టంగా తేల్చి చెప్పింది. అందుకే 175 నియోజకవర్గాలకు పోటీ నేపథ్యంతో పురందేశ్వరి సన్నాహక సమావేశాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎన్నికల ప్రణాళిక గురించి ఆమె చర్చించనున్నారు. అదే సమయంలో జనసేనాని చేస్తున్న మధ్యవర్తిత్వ రాజకీయాలపైనా బీజేపీ అనాసక్తితో ఉంది. పోయి పోయి జనాలు తిరస్కరిస్తున్న చంద్రబాబుతో కలమని పవన్ కోరుతుండడం.. అదే సమయంలో సీట్ల పంపకం దాకా వెళ్లడాన్ని సైతం బీజేపీ కేంద్ర అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పవన్‌ను పక్కకు పెట్టేయాలని డిసైడ్ అయిపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించడం.. అందుకే స్పష్టమైన సంకేతాలు పంపినట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఎవరితో పొత్తుగా వెళ్లకపోతేనే ఏపీ జనాల్లో కాస్తైనా విలువ ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది. గత రెండు రోజులగా క్లస్టర్ల వారీగా బీజేపీ అగ్రనాయకత్వం సమీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల సన్నద్దతపై జాతీయ సహసంఘటన ప్రదాన కార్యదర్శి శివప్రకాష్ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరు దిశగా బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. -
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..!
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..! -
పొత్తులపై స్పందించిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. మండపేట, అరకుకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటికీ జనసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరన్నారు. ‘‘జనసేనకు 50 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి. 20-30 సీట్లు ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుంది. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టేనని మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కాగా, యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ గతంలో కూడా లేఖ ద్వారా చురకలంటించారాయన. -
టీడీపీలో అయోమయం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. పార్టీ టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోలేక తల బొప్పి కట్టిపోతోంది. జనసేనతో పొత్తుపై పార్టీ నేతలంతా పెదవి విరుస్తుండటంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమ టికెట్ సంగతి తేలిస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఎక్కడికక్కడ నేతలు తెగేసి చెబుతుండటంతో తండ్రీ కొడుకులకు నిద్ర కరువైంది. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పాతాళానికి కుంగిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతోంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పూర్తిగా అయోమయం నెలకొంది. పలుచోట్ల పార్టీకి ఇన్‌ఛార్జిలు లేకపోవడాన్ని బట్టే ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతోంది. నాయకులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదే బాటలో మరికొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ.. బీజేపీతో కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తుండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. తమ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఏ స్థానంలో తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ క్యాడర్ అయోమయంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పలుచోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా ముందు తమ సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. గాల్లో గంటా శ్రీనివాసరావు సీటు సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంటా వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన తంటాలు పడుతున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం కూడా టీడీపీపై రగిలిపోతోంది. పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతోంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అయ్యన్న అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా.. మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తితో రగిలి పోతున్నారు. తన సీటు జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన.. అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి చూస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్‌లు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో టీడీపీకి హెచ్చరికలు కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతుండగా, చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చు పెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దేవినేని ఉమకు సీటు లేదు ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన తనను మోసం చేశారని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది. సీటు లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పని చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంత, కర్నూలు జిల్లాల్లోనూ అదే తీరు ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎవరికి సీటిచ్చినా రెండో వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. దీంతో పరిటాల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనను నమ్మించి పని చేయించుకుని ఇప్పుడు మాట మారిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడులో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను నియమించడంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంది. బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలూరు సీటు ఇవ్వకపోతే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారు. డోన్ అభ్యర్థిగా చంద్రబాబు.. ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా, కేఈ ప్రభాకర్ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు. అదే జరిగితే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.