బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు.
మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment