న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు.
మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్‌బెంగాల్‌లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్‌ను రంగంలోకి దింపింది.
ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది.
Modi's guarantee has zero warranty!
— Congress (@INCIndia) March 31, 2024
Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions.
After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out.
What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS
ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా
Comments
Please login to add a commentAdd a comment