పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్‌ఏఎమ్ ఒక సీటు, ఆర్‌ఎల్‌ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి.
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment