Derek O Brien
-
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్‌బెంగాల్‌లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్‌ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా పీఎం మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ. కేంద్ర ప్రభుత్వ నిధులతో మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15 తేదీన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాల సంబంధించి ఓటర్లకు ఫోన్ సందేశం పంపారని మండిపడ్డారు. బీజేపీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెడుతోందని దుయ్యబట్టారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని.. బీజేపీ ప్రభుత్వ ధనంతో ఓటర్లకు ఫోన్లో సందేశాలు పంపింది. మోదీకి అనకూలంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలకు పాల్పడి మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు’అని డెరెక్ ఓబ్రియన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానిమోదీ, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అందించిన లేఖలో డెరెక్ కోరారు. ఈ సందేశాలు పంపడాకి అయ్యే ఖర్చును కూడా బీజేపీ, నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చులో భాగం చేయాలని డెరెక్ ఓబ్రియన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే డెరెక్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. డెరెక్ ఈసీ, సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన అవి అసత్య ఆరోపణలని మండిపడింది. ఇలా చేయటం వల్ల టీఎంసీ వాళ్లు బెంగాల్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఎద్దేవా చేసింది. మోదీ పేరుతో పంపిన వాట్సాప్ సందేశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. -
కేంద్రానిది ఆర్థిక ఉగ్రవాదం: టీఎంసీ
కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ అధికార పార్టీ టీఎంసీ విరుచుకుపడింది. కేంద్రం ఆర్థిక సమాఖ్య ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ ఆదివారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. తామిచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను బెంగాల్ ప్రభుత్వం అందజేయలేదంటూ కేంద్రం చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అధికారంలో ఉన్నందునే రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తోందని ఎంపీ ఒబ్రియాన్ అన్నారు. కాగ్ నివేదికలోని అంశాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ వ్యతిరేక ప్రచారానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందని పేర్కొన్నారు. -
Parliament : టీఎంసీ ఎంపీ సస్పెండ్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో బుధవారం చోటచేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి ఆమిత్ షా స్పందించాలని రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు పట్టుబాట్టారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభలో ‘వికృతమైన ప్రవర్తన’కు గాను ఎంపీ డెరెక్‌ను ఈ పార్లమెంట్ శీతాకాల సమాశాలకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు. అమిత్ షా జవాబు ఇవ్వాలని.. ఆందోళన చేపట్టిన డెరెక్ ఓబ్రెయిన్ వెంటనే రాజ్యసభను వదిలి వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీ డెరెక్... రాజ్యసభ చైర్‌ను ధిక్కరించారని, సభ నియమ నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. సిగ్గు పడాల్సిన ఘటన అని ఆయన్ను సెస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఈ సస్పెన్షన్ వేటు.. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతోందని తెలిపారు. Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" pic.twitter.com/A3MVk0Top9 — ANI (@ANI) December 14, 2023 మరోవైపు.. పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు విధించారు. లోక్‌సభలో పార్లమెంట్ భద్రత వైఫల్యంతో సిబ్బంది.. ప్రతిబంధకాలు విధించింది. పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ, పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార ఏర్పాటు చేశారు. సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని పార్లమెంట్ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: Parliament: నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ -
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
అమిత్ షాపై దారుణంగా ట్రోల్స్
బెంగాల్ టీఎంసీ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కొద్దిరోజులుగా బెంగాల్‌లోని టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేసి టీఎంసీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేయడంతో అమిత్ షాను ‘ఇండియాలోనే అతిపెద్ద పప్పు’ అని అన్నారు. అభిషేక్.. అమిత్ షాను కామెంట్ చేసిన అనంతరమే.. దేశంలోనే అతిపెద్ద పప్పు అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను టీఎంసీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అభిషేక్ బెనర్జీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అమిత్‌షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ తన కొడుకు బీసీసీఐ కార్యదర్శి జై షాకి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. “మాకింగ్ అనేది కమ్యూనికేట్ చేయడంలో అత్యంత శక్తివంతమైన రూపం. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య నుంచి ప్రారంభమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అది టీ-షర్టులపైకి వచ్చింది” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. కాగా, టీ షర్టులు తెలుపు, పసుపు, బ్లాక్ రంగుల్లో వస్తున్నాయని వీటిని ఆన్లైన్ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. టీ షర్టు ధరను రూ. 300గా నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. You cannot give someone a title just because you feel like it. The person must truly deserve it! Listen to the many reasons why this gentleman has truly EARNED the title #IndiasBiggestPappuAmitShah VIDEO 👇 pic.twitter.com/vGHsyAjR5Z — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 5, 2022 -
వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వెంకయ్యకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020, సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదించినప్పుడు రాజ్యసభ చైర్మన్ స్థానంలో వెంకయ్య లేరని డెరెక్ ఓబ్రెయిన్ గుర్తు చేశారు. ‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దీనికి సమాధానం ఇస్తార’ని ఆయన చమత్కరించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సెప్టెంబర్ 2013న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వెంకయ్య నాయుడు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గురించి కూడా ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలోనే సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై 2013లో ఎగువ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తాను రాజ్యసభ చైర్మన్ ఉన్న సమయంలో మాత్రం పెగాసస్‌పై చర్చకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘మార్చి 1, 2013న, మీరు సభలో 5-6 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్‌పై జోక్యం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పెగాసస్ అంశాన్ని సభలో చర్చించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేద’ని అన్నారు. కాగా, వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియడంతో నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 6న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్కర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. (క్లిక్: ఇది ఉద్వేగభరితమైన క్షణం.. ప్రధాని మోదీ) -
కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా?
సాక్షి, న్యూఢిల్లీ: పీపీఎఫ్, ఎన్ఎస్సీలాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నిర్టయాన్ని వెనక్కి తీసుకుంది. వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర స్పష్టం చేసింది. ఈ మేరకు వడ్డీరేటు తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. 2020-2021 చివరి త్రైమాసికం రేట్లే యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అయితే పొరబాటున వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులిచ్చామన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భయంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే దేశీయ మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్‌తో ఆడుకుంటోందంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్లో మండిపడ్డారు. నిజంగానే పొరబాటున తగ్గింపు ఆదేశాలిచ్చారా..లేక ఎన్నికల జిమ్మిక్కా అంటూ సీతారామన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. అటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేక సర్కస్ చేస్తున్నారా అంటూ మరో కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆర్థికమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన కేంద్రం సమీక్షిస్తుంది. ఈనేపథ్యంలోనే వడ్డీ రేట్లను 40-110 బేసిస్ పాయింట్ల మధ్య కోత విధించినట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఈ కోత లేనట్టే. దీని ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతంగా యథాతథంగా అమలుకానుంది. Egg on face again🤪 Because MO-SHA too busy throwing petals from trucks and cracking April Fool jokes of false promises at election rallies. https://t.co/SVb0dWrqQU — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) April 1, 2021 Really @nsitharaman “oversight” in issuing the order to decrease interest rates on GOI schemes or election driven “hindsight” in withdrawing it? https://t.co/Duimt8daZu — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 1, 2021 Madam FM, Are u running a ‘Circus’ or a ‘Govt’? One can imagine the functioning of economy when such duly approved order affecting crores of people can be issued by an ‘oversight’. Who is the competent authority referred in order? You have no moral right to continue as FM. pic.twitter.com/czRv5MY7O8 — Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021 -
2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’!
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్ని నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం గాలించాయి. చాలా మంది నాయకులు తాము ఆ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే మోదీతో తలపడటం అంటే ప్రకటనలు చేసినంత సులభం కాదు. ఆ విషయం విపక్షాలకు, జనాలకు బాగానే అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగాల్లో ఎన్నికల దంగల్ నడుస్తోది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బెంగాల్లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాజాగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చన్నారు. ఇండియా టూడే కాన్క్లేవ్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందిచారు. ఈ సందర్భంగా డెరెక్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు, మహిళ ప్రధానిగా రావాలని ఎదరుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అంటూ పరోక్షంగా దీదీనే 2024 ప్రధాని అభ్యర్థి అని వెల్లడించారు. మోదీ, మమతల మధ్య అదే తేడా ఇక మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్. ‘‘అసలు వారిద్దరిని ఎలా పోలుస్తాం. రాజకీయ వాతావరణంలో గౌరవనీయులైన ప్రధానిని ఇలా పోల్చడం కరెక్ట్ కాదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు.. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కూడా విమర్శించారు. పార్లమెంట్లో టీఎంసీ లేవనెత్తిన పలు అంశాలపై బీజేపీ ఇంత వరకు సమాధానం చెప్పలేదని డెరెక్ ఓ బ్రెయిన్ మండిపడ్డారు. ‘‘బీజేపీ.. బెంగాల్లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. అరుణ్ జైట్లీ ఉంటే ఇలా జరగనిచ్చేవారు కారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్ జింఖానా బ్యాచ్. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..! -
హథ్రాస్ : టీఎంసీ ఎంపీలపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ హథ్రాస్ సామూహిక హత్యాచార ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దళిత యువతి హత్యాచార ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు శుక్రవారం నిరసనకు దిగాయి. ఈ క్రమంలో యూపీలోని బాధిత యువతి కుటుంబానికి కలుసుకునేందుకు టీఎంసీ ఎంపీలు బయలుదేరారు. వారిని అనుమంతించే ప్రసక్తే లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృణమూల్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ముఖ్యంగా డెరెక్ ఓ బ్రియన్, కాకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమా మొండల్‌హావ్‌తో సహా తృణమూల్ ఎంపీల ప్రతినిధి బృందాన్ని హత్రాస్‌లోకి ప్రవేశించకుండా శుక్రవారం నిలిపివేశారు. ఈ తోపులాటలో ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కింద పడిపోడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను పోలీసులు అక్రమంగా అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎంపీలు మండిపడుతున్నారు. మరోవైపు బాధితురాలి కుటుంబం అనుమతిలేకుండా రాత్రికి రాత్రికే బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా గురువారం స్వీకరించింది. అక్టోబర్ 12 న తదుపరి విచారణకు రాష్ట్ర, జిల్లా అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది. కాగా హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గురువారం యూపీ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్నితొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఢిల్లీ నగంలో 144 సెక్షన్ విధించింది. ఇండియా గేట్ సమీపంలో ప్రదర్శనలు, అయిదుగురికి మించి అనుమతిచేదిలేదని పోలీసు ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. ये SDM प्रेम प्रकाश मीणा है, ये अफसरी कम और गुंडागर्दी ज्यादा करते हैं... देखिए कैसे TMC सांसद @derekobrienmp को धक्का मार रहे हैं, आज तक की संवाददाता @chitraaum के साथ भी बदतमीजी की, फिर हमारे चैनल की संवाददाता @PragyaLive के साथ भी बतमीजी से बात की, गुंडई पे उतारू है प्रशासन। pic.twitter.com/nz4UxP01oL — Devvesh Pandey | देवेश पांडेय | دیویش پانڈے۔ (@iamdevv23) October 2, 2020 -
రాజ్యసభలో గందరగోళం
-
పెద్దల సభలో పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. (రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు) దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు వ్యయసాయ బిల్లులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ గాయని కనికాకపూర్ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా పాకాయి. కనికా కపూర్ తనకు కోవిడ్-19 (కరోనా) పాజిటివ్ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా, కనికాతో కలిసిన, సన్నిహిత మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలను పరిశీలిస్తే..కనికాకపూర్ ఏర్పాటు చేసిన పార్టీకి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన సన్నిహిత బంధువులు హజరయ్యారు. దీంతో కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుసుకున్నఎంపీ దుష్యంత్ సింగ్ సెల్ఫ్ హోం క్వారంటైన్ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇంటికే పరిమితమైనట్టు ఆయన తల్లి వసుంధరా రాజే కూడా ట్విటర్లో ప్రకటించారు. మరోవైపు తాజాగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న దుష్యంత్ లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆయన సమీపంలోనే కూర్చునే టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ప్రభుత్వం మనందరినీ ప్రమాదంలో పడేస్తోంది. స్వీయ నిర్బంధం అవసరమని స్వయంగా ప్రధాని చెప్పారు, కానీ పార్లమెంటు కొనసాగుతోందని ఆయన విమర్శించారు. దుష్యంత్ పక్కన రెండున్నర గంటలు నేను కూర్చున్నాను. మరో ఇద్దరు ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్‌లొ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు దుష్యంత్ సింగ్ దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్‌ను కూడా కలిసారన్న అంచనాలు మరింత కలకలం రేపుతున్నాయి. వీరితోపాటు పార్లమెంటు ఆవరణలో పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్నారు. కాగా కనికా కపూర్ మార్చి 15 న లండన్ నుంచి లక్నోకు చేరుకున్న తర్వాత తన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి పలువురు రాజకీయనాయకులు, సామాజిక వేత్తలు దాదాపు 100 మంది హాజరయ్యారు. దీంతో కనికా కపూర్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. While in Lucknow, I attended a dinner with my son Dushyant & his in-laws. Kanika, who has unfortunately tested positive for #Covid19 was also a guest. As a matter of abundant caution, my son & I have immediately self-quarantined and we’re taking all necessary precautions. — Vasundhara Raje (@VasundharaBJP) March 20, 2020 -
షా.. 72గంటల్లో క్షమాపణలు చెప్పు!!
కోల్కత్తా : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ సంస్కృతిని హేళన చేసి మాట్లాడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమపై చేసిన అసత్య ఆరోపణలకు 72 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీఎంసీ హెచ్చరించింది. శనివారం అమిత్ షా కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా మాయో రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తన పర్యటనను అడ్డుకునేందుకు టీఎంసీ నేతలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని, తన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం కాకుండా అడ్డుకున్నారని అమిత్ ఆరోపించారు. అమిత్ షా ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది. దీనిపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. అమిత్ షా పర్యటనను ప్లాప్ షోగా వర్ణించారు. తన పర్యటన విఫలం కావడం మూలంగానే తమ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీవీలను బ్లాక్ చేయాల్సిన అవసరం తమకు లేదని, అమిత్ షాకు బెంగాల్ సంస్కృతి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమపై చేసిన ఆరోపణలకు 72 గంటల్లో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
మార్ఫింగ్ ఫొటోతో రచ్చరచ్చ!
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు. ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
'లెక్చర్ దంచొద్దు'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజ్యసభలో వరుసగా రెండో రోజు అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు బుధవారం సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వీరికి మద్దతు తెలపడంతో సభలో గందరగోళం రేగింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని, దీన్ని కోర్టు చూసుకుంటుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. తమకు లెక్చర్ ఇవ్వడం మానుకోవాలని నఖ్వీకి తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ సూచించారు. ఈ కేసును ఈడీ చీఫ్ మూసేశారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి కొత్తగా మరొకరిని ఈడీ చీఫ్ గా నియమించి కేసు విచారణను మళ్లీ ప్రారంభించిందని ఆజాద్ ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.