న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు.
మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు.
స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
Comments
Please login to add a commentAdd a comment