Derek OBrien
-
ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా పీఎం మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ. కేంద్ర ప్రభుత్వ నిధులతో మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15 తేదీన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాల సంబంధించి ఓటర్లకు ఫోన్ సందేశం పంపారని మండిపడ్డారు. బీజేపీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెడుతోందని దుయ్యబట్టారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని.. బీజేపీ ప్రభుత్వ ధనంతో ఓటర్లకు ఫోన్లో సందేశాలు పంపింది. మోదీకి అనకూలంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలకు పాల్పడి మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు’అని డెరెక్ ఓబ్రియన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానిమోదీ, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అందించిన లేఖలో డెరెక్ కోరారు. ఈ సందేశాలు పంపడాకి అయ్యే ఖర్చును కూడా బీజేపీ, నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చులో భాగం చేయాలని డెరెక్ ఓబ్రియన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే డెరెక్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. డెరెక్ ఈసీ, సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన అవి అసత్య ఆరోపణలని మండిపడింది. ఇలా చేయటం వల్ల టీఎంసీ వాళ్లు బెంగాల్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఎద్దేవా చేసింది. మోదీ పేరుతో పంపిన వాట్సాప్ సందేశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. -
Derek O'Brien: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై కేంద్ర ప్రభుత్వం విమర్మలు గుప్పించారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం వల్ల పార్లమెంట్ భవనం.. లోతైన ఒక చికటి గదిలా మారిందని అన్నారు. 2001లో పార్లమెంట్ భద్రత వైఫల్యం చోటుచేసుకున్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి లోక్‌సభలో, హోం మంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. అదే విధంగా అప్పటి ప్రభుత్వం మూడు రోజుల పాటు సూదీర్ఘంగా చర్చ జరిగిపిందని లెలిపారు. కానీ.. 2023లో చోటు చేసుకున్న పార్లమెంట్ అలజడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మౌనం వీడలేదని మండిపడ్డారు. అదీకాక, ఈ ఘటనపై చర్చ జరగాలని కోరినందుకు ఏకంగా ఉభయ సభలల్లో 146 మంది ఎంపీని సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. దీంతో పార్లమెంట్ భవనం లోతైన చీకటి గదిగా మారిందని అన్నారు. 2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha 2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min Parliament turned into a deep, dark chamber — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023 డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపల, మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల రంగు గొట్టాలతో పొగ విడుదల చేసి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిక్షాలు పట్టుబట్టగా.. లోక్ సభలో 100, రాజ్య సభలో 46 మంది సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. -
రాజ్యసభలో హైడ్రామా.. డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్.. ఆపై ఉపసంహరణ
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన ధన్‌ఖడ్.. ఒబ్రియాన్ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయెల్‌పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్‌క్లిక్ వెబ్‌పోర్టల్‌కు నిధులందాయంటూ గోయెల్ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు ఈ మేరకు నోటీసు అందజేశారు. -
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
Venkaiah Naidu: వెంకయ్య భావోద్వేగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ‘‘రాజకీయాల నుండి రిటైర్ అయ్యానని, కానీ ప్రజా జీవితంలో అలసిపోలేదని మీరు తరచుగా చెబుతుంటారు. మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయి’’ అని వెంకయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య పదవీ కాలం 10న ముగియనుంది. ఇదిలా ఉంటే, వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు. ఆత్మకథ రాయండి వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు. చదవండి: (పాలిటిక్స్‌లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు!) -
టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్ ఫాగ్ యాప్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. టెక్ ఫాగ్ యాప్ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు. చదవండి: గోవా బీజేపీకి షాక్ ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్ ఆనందర్ శర్మను డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్ ఫాగ్’ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని జేమ్స్‌బాండ్ 007తో పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ.. జేమ్స్ బాండ్ వేషధారణలో ఉన్నట్లు ఓ మీమ్‌ను క్రియేట్ చేసి ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. మోదీ బాండ్ పోస్‌లో ఉన్న మీమ్‌లో.. ‘నన్ను జేమ్స్ 007 అని పిలుస్తారు. 0 అభివృద్ది, 0 ఆర్థిక వృద్ధి, 7 ఏళ్ల ఆర్థిక విధ్వంసం’ అని వివరిస్తూ తీవ్రంగా విమర్శించారు. టీఎంసీ ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏం అభివృద్ది జరగలేదని పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులకు ఇబ్బందిగా మారుతోందని దుయ్యబట్టారు. ఆయన షేర్ చేసినా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. -
మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి
కలకత్తా: ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బీజేపీకి బైబై చెప్పేసి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా శనివారం టీఎంసీ గూటికి చేరారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ సాదర స్వాగతం పలికారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు:హోంమంత్రి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31వ తేదీన ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. చదవండి: పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఇటీవల కేంద్రమంత్రివర్గంలోకి తనను తీసుకోకపోవడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. వాటితోపాటు మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది. Today, in the presence of National General Secretary @abhishekaitc and RS MP @derekobrienmp, former Union Minister and sitting MP @SuPriyoBabul joined the Trinamool family. We take this opportunity to extend a very warm welcome to him! pic.twitter.com/6OEeEz5OGj — All India Trinamool Congress (@AITCofficial) September 18, 2021 -
మోదీజీ.. మా గోడు వినండి
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్, రైతులపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారూ మా గోడు వినండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మూడు నిముషాలు ఉన్న ఒక వీడియోని ఆదివారం విడుదల చేశారు. రాజ్యసభ టీవీలో ప్రసారమైన దృశ్యాలు, విపక్ష నేతల వ్యాఖ్యలతో ఈ వీడియోను రూపొందించారు. ఇందులో సభ్యులు పెగసస్, రైతు సమస్యలపై చర్చకు పట్టుపట్టే దృశ్యాలు, వారు సభలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పెగసస్, రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ డిమాండ్లు ఏమిటో ప్రజలకు చేరడానికే సరికొత్త పంథాలో ఈ వీడియో విడుదల చేశామని ఒబ్రియాన్ ఈ సందర్భంగా చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ పెగసస్, రైతులు, స్పైవేర్ అన్న మాటలు ప్రతిధ్వనించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.‘‘ప్రధాని మోదీకి వణుకు పుడుతున్నట్టుంది. పార్లమెంటులో అడిగే ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు. చర్చకు విపక్ష సభ్యులం సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ సభ్యులు అడ్డం పడుతున్నారు. ఫలితంగా నిజానిజాలేంటో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోతోంది’’అని ఖర్గే ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, శివసేన, ఎస్పీ, టీఆర్ఎస్, ఆప్, డీఎంకే, వామపక్షాల సభ్యులు ఈ వీడియోలో ఉన్నారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఈ వీడియోలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా డిమాండ్ చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించి అయినా పెగసస్‌పై చర్చ జరిపి తీరాలన్నారు. పార్లమెంటరీ కమిటీలోనూ బీజేపీయే అడ్డుపడుతోంది: శశిథరూర్ ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ పెగసస్ చర్చకు బీజేపీ సభ్యులే అడ్డం పడుతున్నారని కాంగ్రెస్ నేత, కమిటీ చైర్మన్ శశిథరూర్ తెలిపారు. గత జూలై 28న జరిగిన సమావేశంలో బీజేపీ పథకం ప్రకారం కోరం లేకుండా చేసి చర్చ జరగనివ్వలేదన్నారు. సమావేశానికి హాజరైనప్పటికీ కొందరు సభ్యులు రిజిస్టర్లో సంతకాలు చేయలేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమేనని మండిపడ్డారు. -
'మీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి'
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేసి గెలిపించాలని తృణముల్ కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలను కోరింది. తాజాగా తృణముల్ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం ఢిల్లీలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదాకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. అంతేగాక ఈ ఎన్నికల్లో ఒక్క కేజ్రీవాల్‌నే కాకుండా ఆప్ అభ్యర్థులందరికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ' ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయండి.. ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదానను గెలిపించండి.. అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అభ్యర్థులందరిని గెలిపించండి' అంటూ డెరెక్ ఒబ్రెయిన్ వీడియా ద్వారా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్న సంగతి తెలిసిందే.(‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’) Vote for @AamAadmiParty Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi WATCH pic.twitter.com/KcgHbPpkB7 — Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) January 30, 2020 -
నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ
న్యూఢిల్లీ: ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. కోల్‌కతాలో టెన్నిస్ ప్రాక్టీస్‌కు వెళ్లి తిరిగి వస్తున్నా. నిక్కర్, టీ షర్ట్ వేసుకుని ఉన్నా. ఇంటికి వెళ్లేందుకు చాలా రద్దీగా ఉన్న బస్ ఎక్కాను. ఎవరో తెలీదు. కానీ నన్ను ఆ రద్దీలో నన్ను లైంగికంగా వేధించారు. కొన్నేళ్ల తరువాత ఒక సందర్భంలో మా ఇంట్లో చెప్పాను’.. ఈ వ్యాఖ్యలు చేసింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రఖ్యాత క్విజ్ మాస్టర్ డెరెక్ ఓ బ్రెయిన్. పోక్సో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్ట సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ బాధాకర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలపై దారుణంగా లైంగిక నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా ప్రతిపాదన ఉన్న ఈ బిల్లుకు డెరెక్ మద్దతు తెలిపారు. మిగతా పార్టీల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. బిల్లులోని సవరణలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. లోక్‌సభకు బిల్లు పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్ కేసుల విచారణకు 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. -
మా వ్యవహారాల్లో మీ జోక్యం వద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గట్టిగా కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధులను తాము నిర్వహించకునే స్వేచ్ఛ ఇవ్వాలిన విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించని విషయం తెలిసిందే. ఈసమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా తమ విధులను నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల చెలరేగిన రాజకీయ హింసతోపాటు వైద్యుల సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో టీఎంసీ ఈ వ్యాఖ్యలు చేసింది. నిజమైన సమాఖ్య వ్యవస్థలో, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఒబ్రెయిన్ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి 10 రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికల సంస్కరణ చేపట్టాల్సిన అవసరముందుని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలని పేర్కొన్నారు. -
వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు?
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు తాము ఇదే విషయాన్ని ఆయనతో చెప్పామన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు వంద రూపాయల నోట్లను అధికంగా ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. రూ. 500 నోట్లను మళ్లీ ఎందుకు కొత్తగా తీసుకొచ్చారని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దుతో అందరూ సంతోషంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని, ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 2 శాతం మందే నల్లధనం కలిగివున్నారని, నోట్ల రద్దుతో 98 శాతం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 90 శాతం మంది ప్రజలు డెబిట్ కార్డును డబ్బులు డ్రా చేసేందుకే ఉపయోగిస్తారని, కోనుగోళ్ల కోసం వాడడం లేదని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సరే, మరి ఎన్నికల సంస్కరణలు ఎప్పుడని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తారా అని అడిగారు. -
'అతడు చాలా ప్రమాదకారి'
న్యూఢిల్లీ: ఎన్కౌంటర్ లో హతమైన హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని చాలా ప్రమాదకరమైన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ అన్నారు. బుర్హాన్ వాని మృతి తర్వాత జమ్మూకశ్మీర్ తలెత్తిన హింసాత్మక ఘటనలపై రాజ్యసభలో బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా డెరెక్ ఓబ్రీన్ మాట్లాడుతూ... 'బుర్హాన్ వాని వీధుల్లో కంటే ఇంటర్నెట్ లో చాలా ప్రమాదకరం. అతడు బతికివుండగా కంటే చనిపోయాక ఇంకా ఎక్కువ ముప్పుగా మారాడు. కశ్మీర్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాల'ని అన్నారు. సైన్యాన్ని వినియోగించకుండా కశ్మీర్ ప్రజల హృదయాలు గెలుచుకోవాలని జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ సూచించారు. పెల్లెట్ తుపాకులు ప్రయోగించడం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. -
'రేపిస్ట్‌లను కాల్చిచంపేవాడిని'
న్యూఢిల్లీ: 'నిర్భయ స్థానంలో నా కూతురే ఉండి ఉంటే ఆ ఘాతుకానికి పాల్పడినవారిని కాల్చి చంపేవాడిని' అని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఆవేశపడ్డారు. ఆ వాఖ్యను బీజేపీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్ తప్పుబడ్తూ.. అది సమాజంలోకి తప్పుడు సందేశం పంపిస్తుందన్నారు. నేరాలకు పాల్పడే పిల్లల్లో చాలామంది పేదరికం, అవిద్య నేపథ్యం నుంచి వచ్చినవారేనని కహకషన్ పర్వీన్(జేడీయూ) పేర్కొన్నారు. 'నేరాలకు పాల్పడుతున్న పిల్లల సామాజిక, ఆర్థిక నేపథ్యంపై సమగ్ర అధ్యయనం అవసరం. బాల నేరస్తుల కేంద్రాలు నేరస్తుల తయారీ కేంద్రాలుగా మారాయి' అని కే కేశవరావు(టీఆర్ఎస్) పేర్కొన్నారు. బాల నేరస్తుల సవరణ బిల్లు చట్టంగా మారకముందు జరిగిన నేరాలకు.. ఇందులోని నిబంధనలు వర్తించబోవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
మమత.. 'ఛిట్ ఫండ్ మంత్రి' : బీజేపీ
న్యూఢిల్లీ: అభ్యంతకర పదజాలంతో ప్రధాని, ఆర్థిక మంత్రులపై విరుచుకుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమ పార్టీ నాయకులతో కేంద్రంపై విమర్శలు చేయిస్తున్న మమతా బెనర్జీని 'ఛిట్ ఫండ్ మంత్రి' అని బీజేపీ వర్ణించింది. శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం, బర్ద్వాన్ పేలుళ్ల కేసులో కేంద్రం సాగిస్తున్న దర్యాప్తు తీరును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ ఇటీవల బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నాయకులను విమర్శించేందుకు మమత, ఆమె పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేయడంలో మమత, ఇతర పార్టీ నాయకులను డెరెన్ ఓబ్రిక్ మించిపోయారని అన్నారు. -
'ఆ ఎంపీని బహిష్కరించాల్సిందే'
కోల్ కతా: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్టీయ జనతాదళ్ పార్టీ(ఆర్ఎల్డీ)నేత అమర్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు అపార నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ఆమె.. ఆ ఎంపీని పార్టీ నుంచి బయటకు పంపకపోతే రాబోవు రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని విమర్శించారు. ఆర్ఎల్డీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ఆ ఎంపీపై తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు. ' మహిళా నేతగా ఉన్న ఆమె సాటి మహిళలపై ఆరోపణలు చేసిన తపస్ పాల్ చర్యలు చేపట్టాలి. తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించడమే ఇందుకు మార్గం' అని అమర్ సింగ్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం సరైన పద్దతి కాదన్నారు. 'అతనొక మానసిక వికలాంగుడు. చాలా చెడు వ్యక్తి. పాల్ నుంచి ఒక్క క్షమాపణ ఆశించడం సరికాదు. పార్టీ బహిష్కరణ ఒక్కటే తగిన చర్య'అని ఆయన స్పష్టం చేశారు.ఇకనైనా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. -
పాల్ బేషరతు క్షమాపణకు ఒకే
కోల్‌కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని పేర్కొంది. బేషరతు క్షమాపణలు చెబుతూ తపస్ పాల్ రాసిన లేఖ విచారం వ్యక్తపరిచేలా ఉందని, ఈ వివాదం ముగిసిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ పేర్కొన్నారు. పార్టీ మాత్రమే కాకుండా బెంగాల్ ప్రజలకు, బెంగాల్ మహిళలకు, తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. -
టీ-బిల్లును వ్యతిరేకిస్తాం: తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము దేశ సమగ్రత కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్‌ను విభజించే చేసే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు కోల్‌కతా వచ్చే అవకాశముందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో విభజన బిల్లుపై ఆయన చర్చలు జరపనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మమతా బెనర్జీని కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని ఆమెను కోరారు. -
'మీ స్థానాన్ని అవమానించకండి'
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినంగా సందర్భంగా ఈ డిమాండ్ చేసింది. 'ఐక్యరాజ్యసమితి ఈ రోజు మానవ హక్కుల దినం పాటిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఇంకా బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సర్, దయచేసి మీ స్థానాన్ని అవమానించకండి' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినాన్ని పాటిస్తే గంగూలీ పదవి నుంచి వైదొలగుతారని, తన కార్యాలయానికి అపప్రద రాకుండా చూసుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అయిన ఓబ్రిన్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతానని చెప్పారు.