'అతడు చాలా ప్రమాదకారి' | Burhan Wani was more dangerous on internet than on streets: Derek O'Brien | Sakshi
Sakshi News home page

'అతడు చాలా ప్రమాదకారి'

Published Wed, Aug 10 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

'అతడు చాలా ప్రమాదకారి'

'అతడు చాలా ప్రమాదకారి'

న్యూఢిల్లీ: ఎన్కౌంటర్ లో హతమైన హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని చాలా ప్రమాదకరమైన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ అన్నారు. బుర్హాన్ వాని మృతి తర్వాత జమ్మూకశ్మీర్ తలెత్తిన హింసాత్మక  ఘటనలపై రాజ్యసభలో బుధవారం చర్చించారు.

ఈ సందర్భంగా డెరెక్ ఓబ్రీన్ మాట్లాడుతూ... 'బుర్హాన్ వాని వీధుల్లో కంటే ఇంటర్నెట్ లో చాలా ప్రమాదకరం. అతడు బతికివుండగా కంటే చనిపోయాక ఇంకా ఎక్కువ ముప్పుగా మారాడు. కశ్మీర్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాల'ని అన్నారు.

సైన్యాన్ని వినియోగించకుండా కశ్మీర్ ప్రజల హృదయాలు గెలుచుకోవాలని జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ సూచించారు. పెల్లెట్ తుపాకులు ప్రయోగించడం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement