న్యూఢిల్లీ: ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. కోల్‌కతాలో టెన్నిస్ ప్రాక్టీస్‌కు వెళ్లి తిరిగి వస్తున్నా. నిక్కర్, టీ షర్ట్ వేసుకుని ఉన్నా. ఇంటికి వెళ్లేందుకు చాలా రద్దీగా ఉన్న బస్ ఎక్కాను. ఎవరో తెలీదు. కానీ నన్ను ఆ రద్దీలో నన్ను లైంగికంగా వేధించారు. కొన్నేళ్ల తరువాత ఒక సందర్భంలో మా ఇంట్లో చెప్పాను’.. ఈ వ్యాఖ్యలు చేసింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రఖ్యాత క్విజ్ మాస్టర్ డెరెక్ ఓ బ్రెయిన్. పోక్సో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్ట సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ బాధాకర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలపై దారుణంగా లైంగిక నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా ప్రతిపాదన ఉన్న ఈ బిల్లుకు డెరెక్ మద్దతు తెలిపారు. మిగతా పార్టీల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. బిల్లులోని సవరణలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.
లోక్‌సభకు బిల్లు
పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్ కేసుల విచారణకు 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment