pocso act
-
లైంగికదాడి బాధితులకు వైద్యం నిరాకరణ నేరమే
న్యూఢిల్లీ: లైంగిక హింస, యాసిడ్ దాడి వంటి కేసుల బాధితులకు వైద్యం అందించే విషయమై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయా కేసుల బాధితులకు వైద్యం నిరాకరించడమే నేరమేనని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో గుర్తింపు పత్రాలు తేవాలంటూ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పట్టుబట్టడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇటువంటి బాధితులకు ఉచితంగా వైద్య సాయం అందించాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంది. లేనట్లయితే బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఆస్పత్రులతోపాటు వైద్య చికిత్సలు అందించే అన్ని రకాల కేంద్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని వివరించింది. ఆయా కేసుల బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే కాదు, అవసరమైన ఇతర నిర్థారణ పరీక్షలు, ఆస్పత్రిలో చేర్చుకోవడం, ఔట్ పేషెంట్‌గా వైద్యం అందించడం, సర్జరీ, భౌతిక, మానసిక కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటి సేవలను కూడా అందించాలని తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని వైద్యులు, పరిపాలన సిబ్బంది, అధికారులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వంటి అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగికదాడి మైనర్ బాధితులు, ఇతరులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని కోరింది. -
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
ప్రముఖ నిర్మాతపై పోక్సో కేసు.. ఎందుకంటే?
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడింది. బాలీవుడ్లో ప్రముఖ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న గంధీ బాత్ సీజన్-6కు సంబంధించిన ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో యాక్ట్ కింద ఆమెతో పాటు తల్లి శోభా కపూర్ పేరు కూడా చేర్చారు.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో గంధీ బాత్ సీజన్- 6 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2021 మధ్య ప్రసారం చేశారు. బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సంస్థకు వీరిద్దరు యజమానులు కావడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. మైనర్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు చూపారని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద ఎపిసోడ్ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం కావడం లేదు.కాగా.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఏడాది లవ్, సెక్స్ ఔర్ ధోఖా- 2 మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. -
బాలికపై అత్యాచార యత్నం
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. -
చైల్డ్ పోర్న్ చూసినా, వీడియోలున్నా... తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల బారి నుంచి బాలలకు భద్రత కలి్పంచే పోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రమే నేరమన్న వాదన సరికాదని స్పష్టం చేసింది. ‘‘ఆ వీడియోలను కలిగి ఉండటం, డౌన్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్లో గానీ ఇతరత్రా గానీ వాటిని చూడటం కూడా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కచ్చితంగా నేరమే. ఇవి ‘ఆరంభ నేరం’ కిందకే వస్తాయి’’ అని పోక్సో చట్టం సెక్షన్ 15లోని 1, 2, 3 సబ్ సెక్షన్లను, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బిని ఉటంకిస్తూ పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఘోర తప్పిదంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా ధర్మాసనం అభివరి్ణంచింది. తన మొబైల్లో చైల్డ్ పోర్నో వీడియోలున్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోíÙగా పేర్కొంటూ జనవరి 11న హైకోర్టు ఇచి్చన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువళ్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. ‘‘బాలలపై లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరమైన అంశం. సమాజంలో లోతుల దాకా వేళ్లూనుకుపోయిన ఈ పెను జాఢ్యం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్త సమస్య’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది. దీని నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘‘న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దు. దానికి బదులు సదరు నేరాలను మరింత నిర్దుష్టంగా పేర్కొనేలా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఈఏఎం)’ అని మాత్రమే వాడాలి’’ అని అన్ని కోర్టులనూ ఆదేశించింది. పోక్సో చట్టానికి ఈ మేరకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. ఆలోపుగా కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని పేర్కొంది. బాలలపై లైంగిక వేధింపుల సమస్యను రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదంటూ న్యాయ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. తీర్పులో ముఖ్యాంశాలు → చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెను ముప్పు. బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. ఫలితంగా జరగరానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎన్నటికీ చెరిగిపోని గాయం చేస్తుంది. → విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సరైన ప్రవర్తన వంటివాటిలపై అవగాహన కలిగించాలి. → విద్యార్థులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయిల్లోనూ లైంగిక విద్య, అవగాహన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. → చట్టపరమైన పర్యవసానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేలా చేయవచ్చు. → నేరానికి సంబంధించి బాలల నుంచి సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు, విచారణ తదితర ప్రక్రియ వీలైనంత సున్నితంగా జరిగేలా చూడాలి. తద్వారా వారి మనసులు మరింత గాయపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.లైంగిక విద్య అత్యవసరం బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్డీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరఫున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు. ‘‘లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది!’’ అని పేర్కొన్నారు. ‘‘సెక్స్, సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే గాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తారు. వాటివల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది. తల్లిదండ్రులు, పెద్దల్లోనే గాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండటం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్సువల్ కంటెంట్‌కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఎలాంటి నియంత్రణా, వడపోతా లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే గాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరా లకు పురిగొల్పుతోంది’’ అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ‘‘కను క ఈ విషయమై ముందు పెద్దలను చైతన్యవంతులను చేయడం చాలా ముఖ్యం. సమగ్ర లైంగిక విద్య, అవగాహన బాల లకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చేయాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ, వ్యాప్తి, లైంగిక హింస వంటివాటి చట్టపరమైన పరిణామాలను కూడా అర్థం చేసుకుంటారు. కనుక వాటికి దూరంగా ఉంటారు. పరిశోధనల్లో రుజువైన వాస్తవాలివి. మన దేశంలో సమగ్ర లైంగిక విద్య అవసరం చాలా ఉందని అవి తేల్చాయి’’ అని పేర్కొంది. -
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
టీకమ్గఢ్: మధ్యప్రదేశ్‌లోని టీకమ్గఢ్లో పొలం పనికి వెళ్లిన 13 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఖర్గపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచెర్ గ్రామంలో ఆగస్ట్ 15వ తేదీన దారుణం చోటుచేసుకుంది. అయితే, బాధిత బాలిక కుటుంబీకులు గురువారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి కృష్ణ గౌర్‌కి విషయం తెలపడంతో వెలుగులోకి వచి్చంది. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, సలీం ఖాన్, లాలూ ఖాన్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత(బీఎన్ఎస్)తోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ రోహిత్ కష్వానీ చెప్పారు. ‘బాధిత బాలిక తండ్రి ఢిల్లీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, గ్రామంలో తల్లి తన పిల్లలతో ఉంటోంది. ఆగస్ట్ 15న పొలం పనికి వెళ్లిన బాలికను నిందితులు తమ పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు’అని ఖర్గపూర్ స్టేషన్ ఇన్చార్జి మనోజ్ ద్వివేది తెలిపారు. బాధిత కుటుంబీకులు రేప్ విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయారనే విషయమై దర్యాప్తు చేపట్టామన్నారు. -
కోల్‌కతా ఘటనపై ప్రధానికి మమతా లేఖ.. కేంద్రం ఘాటు రిప్లై
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి సోమవారం లేఖ రాశారు.మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో ఇప్పటికీ చాలా వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని,మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని విమర్శలు గుప్పించారు. ‘కోల్‌కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తల్లిదండ్రులకు నా సంతాపం. గత నెలలో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అడ్డుకుంటున్నాం. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయానికొస్తే.. ఈ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 2019లో కేంద్రం పథకం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 30 జూన్ 2024 నాటికి, 409 ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా 752 ఎఫ్టీఎస్సీలు పని చేస్తున్నాయి. వీటి కింద 2,53,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరం పపొందాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం 123 ఎఫ్టీఎస్సీల కేటాయింపు జరిగింది. ఇందులో 20 ప్రత్యేక పోక్సో కోర్టులు 103 ఎఫ్టీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి కూడా 2023 జూన్ వరకు పనియలేదు. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు’ అని మండిపడ్డారుకాగా దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపిస్తూ గతవారం మమతా బెనర్జీ ప్రధానినరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇది సమాజం విశ్వాసాన్ని, మనస్సాక్షిని కదిలిస్తుందని అన్నారు.మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించడం మన కర్తవ్యం. ఇటువంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రంచ ట్టం తీసుకుకురావాలి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
ఆ వివరాలు బహిర్గతం చేస్తే.. రెండేళ్లు జైలు!
ఇటీవల కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్‌లో అత్యంత అమానుషంగా హత్యాచారానికి గురైన మహిళా డాక్టర్ ఘటన పై దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తున్నారు. ఎంతోమంది నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు మాత్రమే కాకుండా సమాజం కూడా ఇటువంటి ఘటనలపై స్పందించడం చాలా అవసరం. అయితే ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు బాధితురాలి గుర్తింపు బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్షన్ 72, భారతీయ న్యాయ సంహిత (228 ఏ, ఐ.పీ.సీ) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి వివరాలను బహిర్గతం చేసిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.కోల్‌కతా హత్యాచార బాధితురాలి ఫోటోలు, పేరు, ఇతర వివరాలు అన్నీ సామాజిక మాధ్యమాలలో చాలామంది బహిర్గతం చేస్తున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఇటీవల ఒక న్యాయవాదుల సంఘం నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సైతం బాధితురాలి పేరుని బ్యానర్లలో ముద్రించి మరీ ప్రదర్శించడం, అందులో చాలామంది మహిళా న్యాయవాదులు కూడా ఉండడం బాధాకరం. అది కోర్టు ధిక్కరణ కూడా. ఈనెల 16వ తేదీన కలకత్తా హైకోర్టు బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడానికి వీలులేదు అని స్పష్టం చేసింది. 20న సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో సైతం బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడంపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా ఎవరూ చేయడానికి వీల్లేదని ఆదేశించారు. పోక్సో చట్టం సైతం బాధిత–బాలుర వివరాలను గోప్యంగా ఉంచాలి అని చెబుతుంది. సంచలనం సృష్టించిన ‘కఠువా గ్యాంగ్ రేప్ – హత్య’ కేసులో ఆ నిబంధనను అతిక్రమించిన పలు మీడియా సంస్థల మీద కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు వార్తలను ఉపసంహరించుకోవాలి అని ఆదేశిస్తూ భారీ జరిమానాలు కూడా విధించింది. లైంగిక దాడికి గురైన బాధితురాలు లిఖిత పూర్వకంగా తన అంగీకారాన్ని తెలిపితే తప్ప, బాధితురాలి వివరాలను బహిర్గతం చేయకూడదు. బాధితురాలు ఒకవేళ మరణించినా లేదా ఆమెకు మతిస్థిమితం లేకున్నా కూడా ఆమె వివరాలు బహిర్గతం చేయడానికి వీలు లేదు. ప్రత్యేక కారణాలు చూపిస్తూ, కుటుంబ సభ్యులు న్యాయస్థానం ముందు దరఖాస్తు చేస్తే, కేవలం కోర్టు మాత్రమే అలాంటి అనుమతిని ఇవ్వాలి అని చట్టం చెబుతోంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది -
యువతుల లైంగిక కోరికలపై హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే విధంగా యువతులు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ హైకోర్టు చేసిన అభ్యంతరకమైన వ్యాఖ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్టోబర్ 18 2023న హైకోర్టు తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భగా న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడి దర్మాసనం లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం కింద(పోక్సో) కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టులు తీర్పులు ఎలా ఇవ్వాలనే దానిపై కూడా జస్టిస్ ఓకా.. ఆదేశాలు జారీ చేశామన్నారు.ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 8న హైకోర్టు ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ.. అత్యంత అభ్యంతరకరమైన, పూర్తిగా అసంబద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది కాగా గతంలో .. యవ్వనంలో ఉన్న బాలికలు రెండు నిమిషాల లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంట వ్యాఖ్యానించింది. లైంగిక ఆనందం కోసం లోంగిపోతే సమాజం దష్టిలో నష్టపోయేది యువతులనేని పేర్కొంది. లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి అప్పీల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.జనవరి 4న ఈ కేసును విచారిస్తున్నప్పుడు, హైకోర్టు తీర్పులోని కొన్ని పేరాగ్రాఫ్‌లు "సమస్యాత్మకమైనవి" అని మరియు అలాంటి తీర్పులు వ్రాయడం "పూర్తిగా తప్పు" అని అత్యున్నత న్యాయస్థానం గమనించింది.గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన ఉత్తర్వుల్లో, హైకోర్టు చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావిస్తూ, “ప్రథమంగా, ఈ పరిశీలనలు ఆర్టికల్ 21 (జీవించే హక్కు) కింద హామీ ఇవ్వబడిన యుక్తవయస్సులోని యువకుల హక్కులను పూర్తిగా ఉల్లంఘించేవిగా ఉన్నాయి. మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) భారత రాజ్యాంగం." -
బాలికపై కౌన్సిలర్ అఘాయిత్యం..
బోధన్ /ఎడపల్లి(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్ట ణంలోని శక్కర్ నగర్ 3వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ అదే వార్డుకు చెందిన ఓ మైనర్ బాలిక (16)పై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఎడపల్లిలో స్థానిక యువకులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా.. బాలిక తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మందులు తీసుకురావడానికి సోమవారం సాయంత్రం బోధన్ నుంచి ఆటోలో నిజామాబాద్‌కు వెళుతుండగా గమనించిన కౌన్సిలర్ కారులో వెంబడించాడు.ఎడపల్లి మండలం మంగల్ పాడ్ రోడ్డు వద్ద ఆటోను ఆపి కారులో వెళ్దామని చెప్పడంతో తెలిసిన వ్యక్తి కావడంతో ఆ బాలిక కౌన్సిలర్ వెంట వెళ్లింది. కారును నిజామాబాద్‌కు కాకుండా ఎడపల్లి నుంచి కూర్నపల్లి వెళ్లే దారిలోకి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి బాలికను తీసు కొచ్చిన నిందితుడు ఓ వైన్స్ వద్ద కారు ఆపి మద్యం సేవిస్తుండగా.. కారులో ఉన్న బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు అనుమానంతో కౌన్సిలర్‌ను ఏమైందని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పక పోవడంతో యువకులు బాలికను అడగడంతో విషయం చెప్పింది. యువకులు ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. అనంతరం ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని బోధన్‌లోని సీఐ కార్యాలయానికి తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.అర్ధరాత్రి ఉద్రిక్తత..బాలికపై అఘాయిత్యం ఘటన తెలియడంతో స్థానిక మైనారిటీ నాయకులు, యువకులు అర్ధ రాత్రి పెద్ద ఎత్తున బోధన్‌లోని సీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సుమారు గంట అనంతరం యువకులు ఆందోళన విరమించారు. అసెంబ్లీ ఎన్ని కల ముందు నిందితుడి తమ్ముడు సైతం అదే వార్డుకు చెంది న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో చట్టం కింద రిమాండ్‌కు వెళ్లాడు. ఆ ఘటనలో తమ్ముడిని రక్షించే ఉద్దేశంతో బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి నట్లు తెలియడంతో రాధాకృష్ణ పై పోలీసులు పోక్సో కేసు న మోదుచేసి రిమాండ్‌కు తరలించారు. టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాధాకృష్ణను అప్పటి ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. -
బాలల భద్రత తక్షణ కర్తవ్యం
ఎన్ని చట్టాలు వచ్చినా పిల్లలపై ఘోరాలు కొనసాగుతూ ఉండడం బాధాకరం. జూన్ నెలలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్‌మిల్ దగ్గర ఆరేళ్ల బాలిక, మియాపూర్ నడిగడ్డ తండా వద్ద 12 ఏళ్ల బాలిక లైంగిక హింస, హత్యలకు గురవ్వడం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వలస వెళ్ళిన నిరు పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలు సామజిక మాధ్యమాల మద్దతుకు కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకూ ఒక బాలల పరిరరక్షక విధానం లేదు. సమగ్ర విధానం రూపొందించి, రాష్ట్రంలోని అన్ని సంస్థలలో అమలు పరిచేట్లు చూడటం బాలలపై లైంగిక నేరాలనుంచి రక్షణ (పోక్సో) చట్టం – 2012, నిబంధన 3 (5) ప్రకారం తప్పనిసరి. పోక్సో చట్టం ప్రకారం బాల స్నేహ పూర్వక ప్రత్యేక న్యాయస్థానాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సంస్థ పరిధిలో బాలలపై నేరం జరిగినా, జరిగే అవకాశం ఉన్నా ఆ సంస్థ అధిపతి లేక యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఈ బాధ్యత నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలుశిక్ష విధించ వచ్చు. పోక్సో చట్టం నిబంధన 3 (4) ప్రకారం బాలలు సందర్శించే అన్ని సంస్థలు, పాఠశాలలు, క్రెష్‌లలో సిబ్బంది, ఉపాధ్యాయులకు ఏమైనా నేర చరిత్ర ఉన్నదా అని పోలీసు శాఖచే వారి నేపథ్య తనిఖీ క్రమబద్ధంగా చేయడం తప్పనిసరి. చట్ట పరమైన రక్షణ, పోక్సో చట్టం కింద పడేశిక్షల తీవ్రత గురించి అవగాహన పెంచితే నేరాలు తగ్గవచ్చు. 18 ఏళ్ళ లోపు బాలలపై లైంగిక హింస చేస్తే 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ నేరం బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల సిబ్బంది, వసతి గృహ సిబ్బంది చేస్తే మరణ శిక్షకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోక్సో చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితంగా విచారణ పూర్తి చేసి బాలలపై లైంగిక దాడి చేసిన నేరస్థులకు మరణ శిక్షలు విధించాయి.ఆంధ్రప్రదేశ్ 2019లో ‘దిశ’ హత్యకు ప్రతిస్పందనగా ‘దిశ చట్టం’ (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019), మహారాష్ట్ర ‘శక్తి క్రిమినల్ చట్టాల (మహారాష్ట్ర సవరణ) చట్టం 2020’ అమలు చేసే ప్రయత్నం చేశాయి. ఈ చట్టాల ప్రకారం బాలలు, మహిళలపై జరిగిన నేరాల పరిశోధన, న్యాయ విచారణ త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి అనుమతి రానందున ఈ రెండు చట్టాలు అమలు లోకి రాలేదు. నారాయణపేట జిల్లాలో జూన్ 13న సంజీవ్ అనే వ్యక్తిపై ప్రాణాంతక దాడి జరుగుతున్న సమయంలో 100 నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలిసింది. తెలంగాణలో ‘112 ఇండియా’, ‘దిశ’ వంటి ఎమర్జెన్సీ యాప్‌లను వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ దిశ యాప్ 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రవేశపెట్టిన టీ–సేఫ్ యాప్ ప్రయాణాల్లో అత్యవసర సాయం కోసం, హెల్ప్ లైన్ 100 డయల్ చేసేందుకు పని చేస్తుంది. కానీ 112 ఇండియా, దిశ వంటి యాప్‌లలో పోలీసులతో పాటు ఇతరులకు కూడా తక్షణ సమాచారం చేరవేసే అవకాశం ఉంది. ఫోన్ గట్టిగా ఊపడం ద్వారా కూడా తక్షణ సందేశం పంపవచ్చు. మొబైలు ఫోన్ హ్యాండ్ సెట్ ప్యానిక్ బటన్, జీపీఎస్ నిబంధనలు– 2016 ప్రకారం... ఫీచర్ ఫోన్లో 5 లేక 9 నంబర్‌ను స్మార్ట్ ఫోన్లో అయితే ఆన్–ఆఫ్ మీట 3 సార్లు నొక్కితే పోలీసు అత్యవసర హెల్ప్ లైన్‌కు సందేశం వెళ్ళాలి. ఈ విషయంపై ప్రజలలో అవగాహన అవసరం. ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తిపాస్తులు బాలలు. వారిని కాపాడటం కోసం అన్ని మార్గాలూ వెదకాలి. శ్రీనివాస్ మాధవ్ వ్యాసకర్త ఆర్టీఐ కార్యకర్త ‘ 9247 159 343 -
‘నాపై పోక్సో కేసు కొట్టేయండి’.. హైకోర్టుకు మాజీ సీఎం యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో తనపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ ఓ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు.జూన్ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటల పాటు విచారించారు. పోక్స్ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం స్పందిస్తూ ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ ఆయన అన్నారు.తాజాగా,ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఆ రెండు పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణకు రానున్నాయి.అనూహ్యంగా గురువారం సాయంత్రం సీఐడీ యడ్యురప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తనపై నమోదు చేసిన పోక్స్ కేసును కొట్టి వేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
లైంగిక వేధింపుల కేసు : యడ్యూరప్పకు ఎదురు దెబ్బ!
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్‌ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసుఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్‌లో పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసుకేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.ఆయన మాజీ సీఎం తొందరపడొద్దుజూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.ఎక్కడ విచారించాలోఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
‘డీఎన్ఏ’నా మజాకా!
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షులు ఎదురు తిరగవచ్చు.. కానీ ఆధారాలు మాత్రం ఎప్పటికీ నిజమే చెబుతాయి’ నేర దర్యాప్తులో కీలకమైన ఈ ప్రాథమికాంశం మరోసారి నిరూపితమైంది. లంగర్‌హౌస్ పరిధిలో సోదరిపై అత్యాచారం చేసిన కామాంధుడికి పోక్సో న్యాయస్థానం మంగళవారం జీవితఖైదు విధించిన విషయం విదితమే. ఇందులో బాలిక తల్లి సాక్ష్యం చెప్పకున్నా... తమ కుమార్తెను చెప్పనీయకున్నా... డీఎన్ఏ నివేదికలు మాత్రం నేరం నిరూపించాయి. వీటితో పాటు డాక్టర్ వాంగ్మూలం ఆధారంగా పోక్సో న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించిన అప్పటి ఆసిఫ్‌నగర్, ప్రస్తుత సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్జీ శివమారుతిని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో పాటు మహిళా భద్రత విభాగం అదనపు డీజీ షికా గోయల్ అభినందించారు. దారుణానికి ఒడిగట్టిన సోదరుడు.. లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె కొన్ని నెలల వయసులో ఉండగానే భర్తకు దూరమైంది. ఈమె కుమారుడు బైక్ మెకానిక్. ఏడో తరగతి చదువుతున్న సోదరిపై ఇతని కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దాదాపు ఏడాది పాటు ఈ దారుణం కొనసాగించాడు. 2021 మే 20న బాలికలో వస్తున్న మార్పులు గమనించిన ఆమె తల్లి లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని తేల్చారు. దీంతో బాలికను తీసుకుని నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తల్లి అబార్షన్ చేయాల్సిందిగా కోరింది. కోర్టు ఉత్తర్వులు లేనిదే ఆ పని చేయలేమని వైద్యులు చెప్పడంతో బాధితురాలి తల్లి లంగర్‌హౌస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన నాటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ.. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును అప్పటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జ్ట్ దాఖలు చేశారు. దీనికి ముందే బాలిక–ఆమె సోదరుడి నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించి, సారూప్యంగా వచ్చిన ఆ నివేదికను అభియోగపత్రాలకు జత చేశారు. ఈ కేసు పోక్సో కోర్టులో విచారణలో ఉండగా సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి ఎదురు తిరిగింది. పోలీసులకు వ్యతిరకంగా సాక్ష్యం చెప్పింది. కేసు విచారణలో ఉండగానే బాలిక తల్లి తన కుమారుడికి (నిందితుడు) వివాహం చేసింది. పోలీసుల సమన్లు అందుకోకుండా చాలా రోజులు బాలిక వారికి కనిపించకుండా దూరంగా ఉంచింది. ఆ రెండింటి ఆధారంగానే జీవిత ఖైదు... ఘోరం చోటు చేసుకున్న నాటి నుంచి దాదాపు ఏడాది పాటు భరోసా కేంద్రం అధికారులు బాలిక ఆలనాపాలనా చూసుకున్నారు. డీసీపీ డి.కవిత ఈ కేసును క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఆమె తల్లి మాత్రం తన కుమారుడిని రక్షించడం కోసం బాలిక సాక్ష్యం చెప్పకుండా ప్రయతి్నంచింది. ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనిపెట్టిన అధికారులు సమన్లు ఇవ్వడంతో ఆమె తల్లి పోక్సో కోర్టుకు తీసుకువచి్చంది. పోలీసుల అభియోగాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించింది. అయినప్పటికీ పోలీసులతో పాటు భరోసా కేంద్రం అధికారులు సైతం ఈ కేసు విచారణను కొనసాగించారు. బాలిక– ఆమె సోదరుడి నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌తో వాంగ్మూలం ఇప్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది. -
యడియూరప్పపై పోక్సో కేసు
సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. పోలీసులు డాలర్స్ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్ మోహన్ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్ కమిషనర్ దయానందతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
రాజస్తాన్‌లో అమానుషం
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు. తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
విశాఖ పొక్సో కోర్టు సంచలన తీర్పు
విశాఖ: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధించి సంచలన తీర్పునిచ్చింది విశాఖ పోక్సో కోర్టు. 2020లో మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రరావు అనే కసాయి తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి బంధువులు 2020, అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా విశాఖ పోక్సో కోర్టులో విచారణ జరిగింది. మూడేళ్లపాటు జరిగిన విచారణానంతరం ఈరోజు ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రామచంద్రరావుకు జీవితఖైదును విధించడంతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరగడంతో స్పెషల్ పొక్సో కోర్టు ప్రాసిక్యూటర్ కరణం కృష్ణకి కన్నీటితో కృతఙ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబసభ్యులు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం -
ఢిల్లీలో ప్రభుత్వాధికారి నిర్వాకం.. స్నేహితుడి కుమార్తెను..
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి.. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్‌సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
ఆ మైనర్ అమాయకురాలేం కాదు
ముంబై: గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఒక అబ్బాయితో శారీరక బంధం కొనసాగిస్తున్న ఈ మైనర్ బాలిక అమాయకురాలేం కాదని బాంబే హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ సమ్మతి శృంగారంతోనే ఈ టీనేజీ అమ్మాయి గర్భం దాల్చింది. నిజంగా∙ఈ 17 ఏళ్ల బాలికకు గర్భం ఇష్టంలేదని భావిస్తే గర్భంవచ్చిందని నిర్ధారించుకున్న వెంటనే గర్భవిచ్ఛిత్తి కోసం దరఖాస్తు చేసుకొని ఉండాల్సింది’ అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ 26వ తేదీన వెలువర్చిన ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. ‘ఈమెకు ఈ నెలాఖరుకల్లా 18 ఏళ్లు నిండుతాయి. కొన్ని నెలలుగా ‘ఫ్రెండ్’తో అమ్మాయి శారీరక బంధం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వయంగా తనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని పరీక్షించుకుంది. సంబంధిత కేసు వివరాలు పరిశీలిస్తే బాధిత మైనర్ అమాయకురాలేం కాదని అర్థమవుతోంది’ అని జస్టిస్ రవీంద్ర, జస్టిస్ వైజీ ఖోబ్రగడేల బెంచ్ అభిప్రాయపడింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్(పోక్సో) చట్ట నిబంధనల ప్రకారం చూస్తే తాను చైల్డ్నని, గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలంటూ తల్లి ద్వారా ఈ అమ్మాయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చట్టం’ ప్రకారం 20 వారాలుదాటిన సందర్భాల్లో గర్భవిచ్ఛిత్తికి అనుమతి తప్పనిసరి. ప్రాణానికి హాని, తల్లి లేదా బిడ్డ ఆరోగ్యం విషమంగా మారొచ్చనే సందర్భాల్లోనే గర్భవిచ్ఛిత్తికి అనుమతిని ఇస్తారు. ‘ మరో 15 వారాల్లో డెలివరీ అనగా ఇప్పుడు గర్భవిచ్ఛిత్తి చేసినా బిడ్డ ప్రాణాలతోనే జన్మిస్తుంది. కానీ బ్రతికే అవకాశాలు తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో అబార్షన్‌కు అనుమతి ఇవ్వబోం. పుట్టాక ఎవరికైనా దత్తత ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి..
పాట్నా: పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వీడియో బయటకు రావంతో.. బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు. తప్పుడు రాగం.. ట్యూషన్ చెప్పడానికి వచ్చి తనను లైంగికంగా వేధించారని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యూజిక్ టీచర్ కిషన్ సింగ్ చౌరాసియా పై పోక్సో చట్టం, ఏసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ జంట పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి.. -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
బాల్యవివాహాలను అరికట్టాలి!
నారాయణపేట: బాల్యవివాహాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు దేవయ్య అన్నారు. బుధవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బాలల హక్కుల పరిరక్షణ అంశాలపై ఓరియంటేషన్ కమ్ సెన్సిటిజషన్ ప్రోగ్రాం ఆన్చైల్డ్ రైట్స్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పోక్సో కేసుల విషయంలో ఎంతో సున్నితంగా ఉండాలన్నారు. పోక్సో కేసులపై సీరియస్‌గా ఉంటుందని పీఎస్‌లలో వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేయాలన్నారు. జిల్లా మ్యాపింగ్ తీసుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సక్సెస్ స్టోరీపై పిల్లలకు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ హాస్టళ్లను చక్కగా నిర్వహించాలని ఎస్సీ అధికారికి ఆదేశించారు. అదేవిధంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ దేశ భవిష్యత్ గర్వపడేలా అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం ద్వారా కేసులు నమోదు చేసి చార్జీషీట్ వేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. షీటీమ్స్ ద్వారా కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్శ్యామల మాట్లాడుతూ సీడబ్ల్యూసీ కమిటీ పరిధిలో 675 కేసులు నమోదైనట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ వేణుగోపాల్ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడానికి 24గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ సహాయంతో 300 మంది పిల్లలను గుర్తించి, వారిని గురుకుల పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ప్రోగ్రాం, షీటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ మాట్లాడూతూ బాలబాలికల ఆరోగ్య పరిస్థితులను తన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లాలోని 704 అంగన్వాడీ కేంద్రాల్లో 50,276 మందిలో బాలికలు 24,823 , బాలురు 25,453 ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో నార్మల్ డెలవరీలలో మొదటిస్థానంలో ఉందని డీఎంహెచ్ఓ అన్నారు. టీఎస్సీపీసీఆర్ కమిటీ సభ్యులు దేవయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు. -
ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు..
బెంగుళూరు: పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీన్నీ సద్వినియోగం చేసుకునేవారు కంటే దుర్వినియోగం చేసేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని బాంబే హైకోర్టు సీరియస్ అయ్యిన విషయం తెలిసిందే. అంతలోనే కర్ణాటక తుంకూరు జిల్లాలోని ఓ పాఠశాల అధ్యాపకునిపై హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు చిక్కనాయకనహళ్లి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడెకెరె ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు హెచ్.ఎస్.రవి విద్యార్థులకు ఎక్కువగా హోంవర్క్ ఇస్తూ వేధిస్తున్నారని, హోంవర్క్ చేయకపోతే కఠినంగా శిక్షిస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని, వారిని ఇంతగా వేధిస్తున్నందుకు అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హోంవర్కు ఎక్కువగా ఇచ్చి పిల్లలను వేధిస్తున్నందుకు గాను సదరు లెక్కల మాస్టారుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అసలే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని బాంబే హైకోర్టు ఇటీవల మొట్టికాయలు మొట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటు కల్పించుకుని ఈ చట్టంలో తగిన సవరణలు చెయ్యాలని కోరుతూ ఒక కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు గురించి తెలిస్తే బాంబే హైకోర్టు ఇంకెంత సీరియస్ అవుతుందో మరి. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
బీజేపీ నేత కొడుకు ఘాతుకం.. ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధాతియా జిల్లాలో దారుణం జరిగింది. అధికార బీజేపీ పార్టీ ప్రతినిధి కుమారుడు స్నేహితులతో కలిసి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మైనర్ చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. అవమానభారంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ హోం శాఖమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ధాతియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్యకు పాలపడిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, భారీ సంఖ్యలో స్థానికులు ఉన్నవ్ పోలీసు స్టేషన్ వద్ద గుమికూడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా స్పందిస్తూ.. ఒకవేళ ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో బీజేపీ నాయకుడి కుమారుడి పేరు చెబితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో.. బీజేపీ లీడర్ కొడుకు తన స్నేహితులతో కలిసి మొత్తం నలుగురు తనను, తన సోదరిని తీసుకుని ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, అక్కపై సామూహికంగా అత్యాచారం చేసి తనపై కూడా లైంగిక దడి చేశారని తెలిపింది. సంఘటన అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకోగా తన సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంది. ధాతియా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుకి చేరువలో ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు. ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపింది బాంబే హైకోర్టు. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి ఓ యువకుడికి విముక్తి కలిగించింది. హైకోర్టు ఏం చెప్పింది? ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి ఒకరు, 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్ న్యాయ వ్యవస్థకు భారంగా మారింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో బాధితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయి. యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది. పోక్సో చట్టం ఉద్దేశ్యమేంటీ? మైనర్లను లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్‌గా పరిగణించాలని సూచించింది. చట్టం దుర్వినియోగం అవుతోందా? కౌమార దశలో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని పేర్కొంది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. మగవాళ్లకే చిక్కులా? చట్టం దృష్టిలో మైనర్ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. అదే సమయంలో యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చిపెడుతోంది. ఇటీవల 17.5 ఏళ్ల వయసున్న ఓ బాలిక విషయంలో ఇలాగే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చూసిన ఘటనలో జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ఇది కూడా చదవండి: పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. -
హాస్టల్ విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం
మచిలీపట్నం (కోనేరు సెంటర్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో బాలికను పిలిచి.. ఆపై మద్యం తాగించి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం మత్తులో ఉన్న ఆమెను ద్విచక్ర వాహనంపై వసతి గృహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘోరం బయటికి పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక మచిలీపట్నంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల సతీష్ అనే టీడీపీ కార్యకర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దింపాడు. నాలుగు నెలలుగా యువతిని కళాశాలకు వెళ్లే సమయాల్లో కలుస్తుండటంతో పాటు ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాగా.. ఈ నెల 18వ తేదీన సతీష్ ఆ బాలికకు ఫోన్ చేసి ఓసారి కలవాలని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. ఆదివారం భోజనం చేసిన అనంతరం సదరు యువతి హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా బయటికి వెళ్లింది. సతీష్ ఆమెను నగరంలోని విజయ రాఘవ లాడ్జికి తీసుకురమ్మని తన స్నేహితుడైన కళ్యాణ్‌కు బైక్ ఇచ్చి పంపాడు. సతీష్ చెప్పిన విధంగా కళ్యాణ్ రామానాయుడుపేట సెంటర్లో యువతిని బండి ఎక్కించుకుని లాడ్జి వద్ద దింపాడు. యువతి సతీష్ ఉన్న రూంలోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. దీంతో యువతి స్పృహ కోల్పోగా.. సతీష్ ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బైక్‌పై హాస్టల్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువతి ప్రవర్తన వింతగా ఉండటం గమనించిన హాస్టల్ వార్డెన్ ఇతర సిబ్బంది సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించటంతో వార్డెన్ యువతిని మందలించింది. మద్యం మత్తు వీడిన అనంతరం విషయం తెలుసుకున్న యువతి సతీష్ తనకు బలవంతంగా తాగించి ఆపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్ మచిలీపట్నం ఎస్సై వి.వెంకటేశ్వరరావు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కాగా, సతీష్ స్నేహితులైన కళ్యాణ్, మణికంఠ ఆ బాలికను అర్ధనగ్నంగా సెల్ఫోన్లలో వీడియోలు తీసినట్టు తెలుసుకున్న పోలీసులు వారిపైనా చర్యలకు ఉపక్రమించనున్నారు. సమాచారం అందుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సాహిద్బాబు వసతి గృహానికి చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన క్రమంలో అందుకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ మల్లేశ్వరిని సస్పెండ్ చేసినట్టు డీడీ తెలిపారు. -
ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి
మనోజ్ బాజ్‌పాయ్ నటించిన తాజా హిందీ చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వంలో జీ స్టూడియోస్, వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, ఆసిఫ్ షేక్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో, ప్రస్తుతం థియేటర్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జూన్ 7 నుంచి వీక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన లాయర్ సోలంకి పాత్ర సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అందుకే బాగా కనెక్ట్ అవుతున్నారు. కథపరంగా విలన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఓ పదహారేళ్ల అమ్మాయి అనుభవిస్తున్న బాధ, ఆమె తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సోలంకిల కోణంలోనే చూపించే ప్రయత్నం చేశాం. న్యాయవ్యవస్థకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాం. ఫోక్సో చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్లీ తెలుగులో సినిమా చేస్తాను’’ అన్నారు. -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
పోక్సో నిందితుడికి బెయిల్.. దేశంలోనే ఇలా తొలిసారి?
ముంబై: పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి(45).. అదీ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు కాకముందే బెయిల్ మంజూరు చేసింది ఓ న్యాయస్థానం. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన కోర్టుగా నిలిచింది ముంబై సెషన్ కోర్టు. ముంబై వకోలా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. తన మూడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ జనవరి చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు పొరుగింట్లోకి తరచూ వెళ్తుందని, ఈ క్రమంలో తన కూతురిపై పొరుగింట్లో ఉండే వ్యక్తి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. 20 రోజుల తర్వాత విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆమె, తర్వాత మరో రెండు రోజులు ఆగి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో చట్టం ప్రకారం నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ, ఛార్జ్‌షీట్ ఇంకా ఫైల్ చేయలేదు. సాధారణంగా ఛార్జ్‌షీట్ ఫైల్ అయ్యాకే.. బెయిల్ విషయంలో కోర్టును ఆశ్రయించొచ్చు. ఈ లోపు నిందితుడు బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించాడు. తన(నిందితుడు) క్లయింట్ ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని, ఘటన జరిగినట్లు చెప్తున్న రోజున ఆఫీస్‌లోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నిందితుడి తరపు న్యాయవాది. అంతేకాదు.. రెండు ఇళ్ల మధ్య ఉన్న పైప్‌లైన్ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన క్లయింట్‌ను బద్నాం చేసే ఉద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు వాదించాడాయన. మరోవైపు.. ప్రాసిక్యూషన్ నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఈ పోక్సో కేసులో ఛార్జ్‌షీట్ కూడా ఇంకా ఫైల్ కాలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. నిందితుడు, బాధిత కుటుంబం పొరుగింట్లోనే ఉంటాడు గనుక అతని నుంచి వాళ్లకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉండొచ్చని, కేసును ప్రభావితం చేయొచ్చని వాదించారు. అయితే.. కోర్టు మాత్రం నిందితుడి తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. -
కీచక తండ్రికి మరణించే దాకా జైలుశిక్ష
బంజారాహిల్స్: కన్నకూతురికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి ఆమె నిద్రపోయాక కొంతకాలంపాటు అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి న్యాయస్థానం మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చింది. కుటుంబ పెద్ద జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 2003లో వివాహమైన ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. సొంత జిల్లాలోని బంధువుల ఇంట్లో కొడుకు 8వ తరగతి చదువుతుండగా కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటూ 9వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. 2021 జూలై 16న కూతురు తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోగా ఆందోళన చెందిన తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కూతురిని నిలదీయగా తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి నిద్రపోయాక అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. నిద్రలోంచి లేచి చూసుకుంటే తన ఒంటిపై బట్టలుండేవి కావని, ఒళ్లంతా నొప్పులు ఉండేవని వివరించింది. ఓసారి మద్యం మత్తులో ఇంటికొచ్చి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయానని రోదించింది. ఈ ఉదంతంపై బాధితు రాలి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు వెంకటరమణను అరెస్టుచేసి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరమణపై పక్కా ఆధారాలు సమర్పించారు. వాదనలు విన్న జడ్జి అనిత శుక్రవారం వెంకటరమణను దోషిగా తేల్చి అతనికి మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
తెనాలిలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు. పోక్సో నేరాలను తీవ్రమైనవిగా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సంకల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కోర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మరో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ చేస్తారని చెప్పారు. -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!
సాక్షి, హైదరాబాద్: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. తెలిసినోళ్లే తోడేళ్లు.. ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. పోకిరీల భరతం.. విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్ఐఆర్లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్ఆర్లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 137 మందిపై ఎఫ్ఆర్లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్‌లో 82 మందిపై ఎఫ్ఆర్లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ
న్యూఢిల్లీ: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం(పోక్సో)పై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు. ‘ పిల్లలపై లైంగిక అకృత్యాల అంశం సమాజంలో పెనుసమస్యగా తయారైంది. చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ. ఈ సంస్కృతి మారాలి. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవం. ఆ చిన్నారులకు సత్వర న్యాయం సాధ్యపడాలన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలన్నా న్యాయవ్యవస్థతో కార్యనిర్వాహక వ్యవస్థలు చేతులు కలిపాల్సిందే. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ముఖ్యం. పిల్లలను ఎవరైనా తాకినప్పుడు అందులో తప్పుడు ఉద్దేశం ఉందా లేదా అనేది కనిపెట్టే ‘తెలివి’ని పిల్లలకు బోధించాలి. లైంగిక వేధింపుల బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు.. కుటుంబపరువు పోతుందని మౌనంగా ఉంటున్నారు. ఇలా మౌనంవహిస్తే బాధిత చిన్నారి వర్ణనాతీత వేదన తీరేదెలా? చిన్నారికి న్యాయం దక్కేదెలా ? ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థాయికి వారిలో ధైర్యం, అవగాహన పెంచాలి. ఇది రాష్ట్రాలు, సమాజంలో సంబంధిత వర్గాల సమిష్టి బాధ్యత’ అని అన్నారు. ‘ కొన్ని రకాల కేసులు న్యాయస్థానాల్లో చూస్తుంటాం. మైనర్లు సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. పోక్సో చట్టంలోని 18 ఏళ్లలోపు వయసు పరిమితి కారణంగా అది నేరమే. 16 ఏళ్లు.. 18 ఏళ్లు.. అనే దానిపై ఎలా తీర్పు ఇవ్వాలనే అంశంలో జడ్జీలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రతిరోజూ ఎన్నో కోర్టుల్లో తలెత్తుతోంది. దీనికి పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి -
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దీని కోసం ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై సంబంధిత శాఖలు, న్యాయాదికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే మహిళలు, పిల్లలకు భద్రత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. పోక్సో చట్టం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్ర పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డా. షమీమ్ అక్తర్, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ రాధారాణి, జస్టిస్ నందా, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్ రావు, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమలాదేవి, సుజన ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు
ముంబై: మైనర్ బాలికను ‘ఐటమ్’ అని పిలిచినందుకు ఓ యువకుడికి ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్ధేశ్యంతో మాత్రమే అమ్మాయిని ఐటమ్ అని కామెంట్ చేయడం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్‌ను 2015లో ఓ వ్యక్తి టీజ్ చేసిన కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2015 జూలై 14న విద్యార్థిని స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ’ఏయ్ ఐటమ్.. ఎక్కడికి వెళ్తున్నవ్’ అంటూ స్థానికంగా నివాసముండే 25 ఏళ్ల యువకుడు కామెంట్ చేశాడు. దీంతో బాలిక తనను వేధించవద్దని కోరగా.. మరింత రెచ్చిపోయిన వ్యక్తి ఆమె జుట్టుపట్టుకొని లాగి దుర్భాషలాడాడు. బైక్‌పై వెంబడించాడు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్‌లైన్ 100కు కాల్ చేసి జరిగింది చెప్పింది. పోలీసులు వచ్చేలోపు పోకిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 354, 354(డీ), 506, 504 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది. దీనిపై ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. అబ్బాయిలు ఉద్ధేశపూర్వకంగా అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే ఈ పదం(ఐటమ్) ఉపయోగిస్తారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే అన్సారీ పేర్కొన్నారు. మైనర్ బాలికపై వేధింపుల కేసు కాబట్టి నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని తెలిపారు. అమ్మాయిని అలా అల్లడి వెనక నిందితుడి ఉద్ధేశ్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. రోడ్డు సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నేరాలను కఠినంగా శిక్షించాలని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: విద్యార్థులతో ఆడిపాడిన చిన్నారి.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో... -
మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై టీచర్ వేధింపులు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై 52 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చందన్నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అభయ్ తెలిపారు. బాధితురాలి తండ్రి, చిన్నాన్నను కొట్టినందుకు ఉపాధ్యాయుడి ఇద్దరు కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. బాలిక గత నెలలో మదర్సాలో చేరింది. పాఠాలు చెప్పే నెపంతో ఉపాధ్యాయుడు ఆమెను అసభ్యంగా తాకేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిలదీసేందుకు వెళ్లిన బాలిక తండ్రి, చిన్నాన్నను నిందితుడి కుమారులు కొట్టారు. -
Hyderabad: కూతురితో అసభ్య ప్రవర్తన..హెడ్ కానిస్టేబుల్‌పై కేసు
సాక్షి, బంజారాహిల్స్: వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్‌పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏపీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డి(41) యూసుఫ్ గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఓ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురు(17) బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఏడాది క్రితం తనకు పెళ్లి కాలేదని నమ్మించి బాధితురాలి తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె ఇంటిని తన పేరుతో రాయించుకున్నాడు. ఆమె కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!! -
ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..
సాక్షి, చెన్నై: చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై సబ్ ఇన్స్పెక్టర్ కన్నుపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలి ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. సుమారు ఏడేళ్లుగా బాలికకు ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు అయింది. ఆమెకు మరొకరితో వివాహమైంది. కానీ తన తల్లి ఇంటికి వస్తున్న సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. అతని వేధింపులను సహించలేక ప్రియురాలు, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికను 13 ఏళ్ల నుంచి బెదిరింపులు లైంగికంగా వేధించినట్లు, ప్రస్తుతం వేరొకరితో వివాహం అయినప్పటికీ లైంగిక వేధింపులకు పాల్పతుండడంతో సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్‌లోడ్ చేస్తూ.. -
అనంతపురంలో ప్రారంభమైన పోక్సో కోర్టు
అనంతపురం క్రైం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో బాలలపై లైంగిక నేరాల కేసులను విచారించే పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు శనివారం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ బి.శ్యాంసుందర్ తదితరులు హాజరయ్యారు. కోర్టు హాల్, చైల్డ్ ఫ్రెండ్లీ రూం, స్టాఫ్ రూం, న్యాయమూర్తి చాంబర్, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలోనే ఇన్చార్జ్ న్యాయమూర్తి రాజ్యలక్ష్మి మూడు కేసులకు సంబంధించి వడ్డే శ్రీరాములు (అనంతపురం), ఈశ్వరయ్య (గోరంట్ల), మధు(యల్లనూరు)లను విచారించి ఆ కేసులను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు మాట్లాడుతూ.. పోక్సో కేసులు నమోదైనంతగా శిక్షలు పడడం లేదని, బాలల హక్కుల కమిషన్ అందుకు తగుచొరవ తీసుకుని దోషులకు శిక్ష పడేలా చూస్తుందని అన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా జడ్జి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్, అనంతపురం జిల్లా అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎం.లక్ష్మిదేవి, జీ సీతారాం, అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో దోషికి యావజ్జీవ ఖైదు, జరిమానా
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2018లో బాలిక (13)పై లైంగికదాడి చేసిన నేరానికి ఆరెం చెన్నయ్య (40)కు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలులోని పోక్సోకోర్టు ప్రత్యేక జడ్జి సోమశేఖర్ మంగళవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో ఇంటివద్దనున్న ఆ బాలికను చెన్నయ్య బలవంతంగా సమీపంలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఇంటి యజమాని రావడం, బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నయ్యపై పోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో చెన్నయ్యకు జీవితకాలం జైలుశిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలు మైనర్ కావడంతో ఆమెకు వైద్యఖర్చులు, పునరావాసం కోసం రూ.5 లక్షలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సూచించారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి వాదించారు. -
లైంగిక దాడికి యత్నించిన యువకునికి 3 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధిస్తూ విశాఖలోని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడుకి చెందిన నిందితుడు ఏడిద క్రాంతి (33) విశాఖలోని బుచ్చిరాజుపాలెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఓ సమోసా తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలు (10) ఎన్ఏడీ దగ్గర గాంధీనగర్ పోలీస్ కాలనీ నివాసి. నిందితుడు పనిచేసే ప్రాంతంలో బాలిక స్నేహితులతో సైకిల్ తొక్కేది. బాలిక కదలికలను కనిపెట్టిన నిందితుడు 2020 అక్టోబర్ 26న ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని రైల్వేట్రాక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సైకిల్‌పై వెళుతున్న బాలికను తాకుతూ లైంగిక దాడికి యత్నించగా భయకంపితురాలైన ఆమె కేకలు వేసింది. పక్కనే ఉన్న ఓ యువకుడు వచ్చి బాలికను రక్షించాడు. నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా నిందితుడికి శిక్ష విధించారు. -
గూగుల్‌లో ఈ 3 విషయాలు వెతకొద్దు.. సెర్చ్ చేశారంటే జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం డిజిటల్ మయమైంది. అదీ ఇదీ అని కాకుండా ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తాం. గూగుల్, యూట్యూబ్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ బింగ్, బైడూ, యాండెక్స్ వంటి సెర్చ్ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్ తల్లివైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! కాలం మారింది.. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అవేంటో చూద్దాం! 1. చైల్డ్ పోర్నోగ్రఫీ చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త! చదవండి👉🏼 గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు.. 2. బాంబుల తయారీ బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 3. అబార్షన్ అబార్షన్ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. చదవండి👉🏻 చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి -
చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు
బాలీవుడ్ ప్రుముఖ డైరెక్టర్, నటుడు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. మైనర్ పిల్లలపై అభ్యంతకర సన్నివేశాలను తెరకెక్కించారనే ఆరోపణలపై ముంబై మహిమ్ పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంతో డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాలు.. ఇటీవల మహేశ్ మంజ్రేకర్ రూపొందించిన మరాఠి చిత్రంలో చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి. చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్ ఈ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్ కోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఇందులో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్స్ చట్టాన్ని ఉల్లంఘించమేనని ఆమె పిటిషన్లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్షన్లతో పాటు పోక్సో సెక్షన్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని సమాచారం. -
స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్ ఇచ్చి..
సాక్షి, కాకినాడ: యువతికి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేసిన నయవంచకుడికి పదేళ్ల జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మారేడుమిల్లి చర్చివీధికి చెందిన సురబోయిన పవన్‌కుమార్ తన స్నేహితుడి సోదరితో పరిచయం పెంచుకున్నాడు. ఆ నర్సింగ్ చదవడానికి 2015లో కాకినాడకు వచ్చింది. దీంతో పవన్‌కుమార్ తరచూ కాకినాడ వచ్చి మాయమాటలు చెప్పి వంచించాడు. ఆ యువతి 2015లో గర్భం దాల్చగా దాని విచ్ఛిత్తికి టాబ్లెట్లు ఇచ్చాడు. చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..) ఆరు నెలల తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. కాగా 2016లో పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయగా అతడు నిరాకరించాడు. దీంతో 2016లో మారేడుమిల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా లైంగికదాడికి పాల్పడినందుకు ఐపీసీ 376 పాటు ఐపీసీ 417, 313, 315, 506, పోక్సో చట్టం కింద కేసును ఎస్సై డి.రాంబాబు నమోదు చేశారు. కోర్టు విచారణలో పవన్‌కుమార్ నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఏపీపీ ఎండీ అక్బర్ ఆజం ప్రాసిక్యూషన్ నిర్వహించారు. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్‌డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
కూతురుపై అత్యాచారం.. తల్లిదండ్రుల దగ్గరకు వీడియో చేరడంతో..
జైపూర్: రాజస్థాన్‌లో అమానవీయకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కన.. ఉండే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుకుంటుంది. బాలిక ఇంటిపక్కన ఒక వ్యక్తి.. డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో.. ఈనెల (నవంబరు20) బాలికను పనుందని ఒకసారి ఇంటికి రావాలని పిలిచాడు. పాపం.. ఒకే కాలనీలో ఉండేవాడు.. తెలిసిన వారే అని బాలిక అమాయకంగా అతగాడి ఇంటికి వెళ్లింది. అప్పుడు ఆ దుర్మార్గుడు .. బాలిక ఇంట్లోకి రాగానే వెంటనే తలుపులు వేసేశాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా.. చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ బాలిక షాక్‌తో ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. ఆ కామాంధుడు మాత్రం వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలికను చూసి కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత .. వీడియో ఉదంతాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అత్యాచారం కేసులో... ఒకే రోజులో తీర్పు
అరారియా: అత్యాచార బాధితులకి న్యాయం జరగాలంటే కోర్టుల్లో ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే రోజులు ఇక ముందు ఉండవని ఆశ కలిగేలా బిహార్ కోర్టు మెరుపువేగంతో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి పోక్సో కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బిహార్‌లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు. బాధితురాలి భవిష్య™Œ కోసం పరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది. జూలై 22న ఈ అత్యాచార ఘటన జరగ్గా, ఆ మర్నాడు ఎఫ్ఐఆర్ దాఖలైంది. అరారియా మహిళా పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేప్ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల యాదవ్ తెలిపారు. 2018 ఆగస్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కోర్టు ఒక అత్యాచారం కేసులో మూడు రోజుల్లో తీర్పు ఇచ్చి రికార్డుకెక్కిందని ఇప్పుడు బిహార్ కోర్టు దానిని తిరగరాసిందన్నారు. -
మైనర్ కూతురిపై కన్నేసిన తండ్రి..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చిరాగ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గత జూన్, ఆగస్టునెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఢిల్లీలోని చిరాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడు సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఒక మైనర్ కూతురు ఉంది. ఈ క్రమంలో ఆ కామాంధుడి కళ్లు అభం శుభం తెలియని కూతురుపై పడ్డాయి. కన్న తల్లి ఇంట్లో లేనప్పుడు కూతురుపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో ఆమెను తల్లి ఆసుపత్రకి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. కాగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: టిక్‌టాక్ (ఫన్ బకెట్) భార్గవ్‌కు మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..) -
దారుణం: మైనర్ బాలికపై తండ్రితోపాటు 28 మంది..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన తండ్రి మరికొంతమందితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని 17 ఏళ్ల బాలిక మంగళవారం బయటపెట్టింది. అఘాయిత్యం చేసిన వారిలో బీఎస్పీ, ఎస్పీ, జిల్లా ప్రెసిడెంట్ కూడా ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆరో తరగతి నుంచి తనపై లైంగికదాడి జరుగుతోందని, విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని వాపోయింది. కాగా, బాలిక ఫిర్యాదును స్వీకరించిన లలిత్పూర్ పోలీసులు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించామని లలిత్పూర్ ఎస్పీ తెలిపారు. (చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు) ఇదిలాఉండగా.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నిందితుల్లో ఒకరైన సమాజ్‌వాది పార్టీ నేత తిలక్ యాదవ్ మీడియాతో అన్నారు. అసత్య ఆరోపణలతో తమ కాపురంలో చిచ్చుపెడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. నిష్పక్షపాత విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్‌కు గురువారం మెమొరాండం ఇస్తానని తిలక్ యాదవ్ చెప్పుకొచ్చారు. (చదవండి: రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిని చంపేశాడు) -
Hyderabad: మూడేళ్ల క్రితం లైంగికదాడి, కామాంధునికి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె వయసున్న బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో కామాంధుడు ఎడ్ల రమేశ్ (45) బతికున్నంత కాలం జైలు జీవితం గడపాలని చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ (పోక్సో) కేసుల విచారణ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అలాగే రూ.20 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి బి.సురేశ్ తీర్పులో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయస్సు 11 సంవత్సరాల 6 నెలలని, ఈ నేపథ్యంలో బాధితుల పరిహార పథకం కింద రూ.7 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థను ఆదేశించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని జాతీయ బ్యాంకులో బాలిక పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఈ డబ్బును బాలిక మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన 20 శాతం డబ్బును బాలికకు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా ముట్టుకుంటే చెప్పేయ్
International Day of the Girl Child 2021: చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు.. ఈ వార్తలు విన్నప్పుడల్లా రగిలిపోతుంటాం. ‘అయ్యో చిట్టితల్లి’ అని కొందరు బాధపడిపోతుంటే.. ‘ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాల’ని డిమాండ్లు చేస్తుంటారు మరికొందరు. ఇంకొందరి వల్ల రకరకాల వాదనలు-చర్చలు తెర మీదకూ వస్తుంటాయి కూడా. సైదాబాద్ ఘటన అయితేనేం, లవ్‌స్టోరి సినిమాలో చూపించినట్లు అయితేనేం.. రియల్ నుంచి రీల్ లైఫ్ దాకా అంతటా ఈ ఇష్యూ తీవ్రతను తెలియజేశాయి. బయటికి వచ్చేవి కొన్నే. అసలేం జరుగుతుందో అర్థంకాక, ఎవరికి ఎలా చెప్పాలో తెలియక పిల్లలు కుంగిపోతున్నారు. ఈ తరుణంలో ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. ► అక్టోబర్ 11.. అంటే ఇవాళ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’.. అమ్మాయిల హక్కులు, భద్రత, విద్యావకాశాలు.. పై దృష్టిసారించాలని చాటిచెప్పే రోజు . ► వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ వుమెన్.. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’ నిర్వహణకు నాంది వేసింది. బీజింగ్ కాన్ఫరెన్స్-1995లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ► 2012 అక్టోబర్ 11 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ► లింగ వివక్షను దూరం చేస్తూ.. అమ్మాయిలకు భవిష్యత్ అవకాశాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి? పోటీ ప్రపంచంలో ఎలా రాటుదేలాలో అవగాహన కల్పించాలని చెబుతుంది ఈ రోజు. శారీరక కోరికలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు.. ఇతరుల శరీరాన్ని ముట్టుకోవడం ద్వారా వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారు కొందరు. పిల్లలను చెడు ఆలోచనలతో తాకడం కూడా ఈ కోవకే చెందింది. చూసేవాళ్లకు ఇది మాములుగానే అనిపించొచ్చు. కాస్త ఎదిగిన పిల్లలకు తాకే వ్యక్తుల మనస్తతత్వం తేలికగానే అర్థమైపోతుంది. కానీ, చిన్న వయసులో అది అర్థం కాకపోవచ్చు. ఇంట్లో వాళ్ల లాగే ప్రేమతో వాళ్లు ముట్టుకుంటున్నారనుకుంటారు. అందుకే అనురాగంతో తాకటం, కోరికలతో తాకటం మధ్య తేడాల్ని పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖచ్ఛితంగా తెలుసుకోవాలి ‘తన తండ్రి భుజాల మీద చేయి వేసినప్పుడు కలిగే స్పర్శ తన రక్షణ కోరుతుంది. కానీ, ఎవరైనా దురుద్దేశంతో తాకినప్పుడు ఆ స్పర్శ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఒక్కోసారి సొంతవాళ్ల నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావొచ్చు!. బెదిరించో, భయపెట్టో పదేపదే అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. అందుకే గుడ్‌టచ్, బ్యాడ్టచ్ల మధ్య తేడాల్ని పిల్లలకు చెప్పాలి. తమను తాము రక్షించుకోవడానికి పిల్లలకూ అవకాశం కల్పించాలి. అదే టైంలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ.. వాళ్లకు అలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురవుతున్నాయా? అని తెలుసుకోవడంతో పాటు వాళ్లలో ధైర్యమూ నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ► పిల్లలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌ల మధ్య తేడాను తెలియజేయాలి ► అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి ► మొహమాటం అనిపిస్తే తల్లిదండ్రులూ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ► తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే.. చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది ► టీచర్లు సైతం పిల్లల మానసిక పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలి.. అవసరమైతే ఇందుకోసం శిక్షణ తీసుకోవాలి International Girl Child Day.. ఈ ఇయర్ థీమ్ ‘డిజిటల్ జనరేషన్.. అవర్ జనరేషన్’. ♦ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది.. అదీ 25 ఏళ్లలోపు ఇంటర్నెట్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు. వీళ్లలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉంది. జెండర్-డిజిటల్ డివైడ్‌ను సూచించేదిగా ఉన్నాయి ఈ గణాంకాలు. అందుకే సాంకేతికంగా అమ్మాయిలు రాణించాలని, అందుకు అవసరమైన తోడ్పాడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చాటి చెప్పడం ఈ ఏడాది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ థీమ్. పేరెంట్స్ బ్రెయిన్‌వాష్ లైంగిక వేధింపులకు గురయ్యే బాలికను త్వరగా గుర్తించొచ్చు. మానసికంగా వాళ్లలో మార్పులొస్తాయి. ఇంట్లోవాళ్లతోనే కాదు.. సొసైటీతోనూ డిటాచ్మెంట్ కోసం ప్రయత్నిస్తారు. నిద్రలో కలవరపాటుకు గురవుతుంటారు. సరిగా తినకపోవడం, భయాందోళనలు పెరిగిపోవడం గమనించొచ్చు. అందుకే పిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోనూ తమ శరీర భాగాల్ని ఎవరైనా తాకడం చేస్తే.. వారు భయాందోళనకు గురికాకుండా గట్టిగా తిరస్కరించాలి. తమకు నమ్మకస్తులైన పెద్దవారెవరైనా దగ్గరలో ఉంటే విషయాన్ని వివరించాలి. లేదా తల్లిదండ్రులకైనా ఆ విషయం చెప్పాలి. అలాగనుక జరిగితే నేరస్తుడు తప్పించుకోలేడు. మరిన్ని అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి ఇదంతా పిల్లలకు చెప్పాల్సింది ఎవరు? ఇంకెవరు తల్లిదండ్రులు, ఇంట్లోవాళ్లు, టీచర్లే. వేధింపులకు గురైన పిల్లలకు మానసిక వైద్యుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాలి. గతాన్ని మరచిపోయి వారి జీవితంలో చీకట్లను పారదోలాలి. ఈరోజుల్లో పిల్లలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి రాగానే.. ‘న్యాయం’ పేరిట బాధితురాలి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేస్తున్నారు కొందరు. అయితే పోక్సో చట్టం ప్రకారం.. పేర్లతో సహా వాళ్ల ఐడెంటిటీకి సంబంధించి ఎలాంటి వివరాల్ని ప్రదర్శించినా అది నేరమే అవుతుంది! దేశంలో ఫస్ట్ టైం.. స్కూల్ దశలోనే పిల్లలకు ‘గుడ్ టచ్- బ్యాడ్ టచ్’ పేరిట అవగాహన కల్పించేందుకు (బొమ్మల పాఠాల రూపంలో) గుజరాత్‌లోని వడోదర పోలీసులు నడుం బిగించారు. మూడేళ్ల క్రితం అప్పటి సిటీ డీసీపీ సరోజ్‌కుమారి, డిపార్ట్మెంట్లో పని చేసే 12 మంది మహిళా పోలీసులతో ‘సమాజ్ స్పర్శ్ కీ’ (ఎస్ఎస్కే)అనే గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి దేశంలో ఈ తరహా పాఠాలు పిల్లలకు చెప్పే కార్యక్రమం ఇదే మొదటిది! అలా మూడేళ్లుగా వీళ్ల కృషి కొనసాగుతోంది. - సాక్షి, వెబ్ స్పెషల్ -
మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష
జైపూర్: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రాజస్తాన్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై కమలేశ్ మీనా (25) సెప్టెంబర్ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటన తర్వాతి ఉదయమే నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. చలాన్ నమోదైన అయిదు పని దినాల్లో జైపూర్ మెట్రోపాలిటన్ సిటీ పోక్సో 3వ నంబర్ కోర్ట్ తీర్పు ప్రకటించింది. దోషిగా తేలిన కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిం చింది. జరిగిన ఘటన తీవ్రమైనది కావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు జైపూర్ డిప్యూటీ కమిషనర్ హరేంద్ర కుమార్ చెప్పారు. -
‘స్కిన్ టు స్కిన్’ కాకపోయినా నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్ టు స్కిన్) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని ఈ సెక్షన్ చెబుతోంది. -
మైనర్‌పై లైంగికదాడికి యత్నం: ‘దిశ’తో అరగంటలో నిందితుడు అరెస్ట్
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించిన కామాంధుడు బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి దిశ హెల్ప్‌లైన్ నంబర్ (112)కు ఫోన్ చేయడంతో పోలీసులు అరగంటలోనే ఆ ప్రబుద్ధుడిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. సీఐ అంకబాబు వెల్లడించిన వివరాల మేరకు.. బందరు మండలం నవీన్‌మిట్టల్ కాలనీకి చెందిన తాడిశెట్టి సాయిబాబు అనే యువకుడు తాపీ పనులు చేస్తుంటాడు. బుధవారం నగరంలోని నారాయణపురంలో నివాసం ఉంటున్న సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గురువారం ఉదయం బంధువుల ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ ఇంట్లోకి చొరబడి నిద్రలో ఉన్న బాలిక (11)పై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు పెట్టడంతో కంగారుపడిన సాయిబాబు చుట్టుపక్కల జనం వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడు. మునిసిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసే తల్లి విధులు ముగించుకుని ఇంటికి రాగానే బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం తల్లి దిశ హెల్ప్‌లైన్ నంబర్ (112)కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే చిలకలపూడి సీఐ అంకబాబు సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడే ఇళ్ల మధ్య తిరుగుతున్న సాయిబాబును అరగంటలో పట్టుకుని అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. -
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. మళ్లీ మళ్లీ అదే తీరు!
‘కరీంనగర్ కార్ఖానగడ్డలోని ఓ ప్రయివేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న విద్యార్థిని పారిపోయి ఇంటికి చేరింది. తరువాత కూడా పలుమార్లు అదేతీరున వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. వారు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ జరిగి.. నిందితుడికి ఐదేళ్ల కఠినకారాగార శిక్ష పడింది.’ ‘ఎల్ఎండీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమపేరుతో మోసం చేశాడు. బాలిక ఫిర్యాదుతో ఎల్ఎండీ పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోక్సో కోర్టు నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.’ సాక్షి, కరీంనగర్: పసిమొగ్గలపై కామాంధుల పైశాచికత్వం పెరిగిపోతోంది. వావివరుసలు, బంధాలను మరిచిపోయి కామాంధులు చిన్నారులను కాటేస్తున్నారు. కన్నకూతురు పైనే అత్యాచారం చేసి తండి అన్న పదానికే కలంకం తీసుకొచ్చే ఘటనలు జిల్లాలో చాలా జరిగాయి. పాఠాలు చెప్పి భవిష్యత్తును బంగారుమయం చేయాల్సిన మాస్టార్లు కీచకులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. బాలికలను మృగాళ్ల నుంచి రక్షించేందుకు సర్కారు చట్టాలు తీసుకొచి్చంది. చిన్నారులపై లైంగికవేధింపుల నిరోధక చట్టం(పోక్సో) ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తుండగా.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2017– 2021 కాలంలో 272 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. చదవండి: tsrtc చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్ అండగా పోక్సో చట్టం ► చిన్నారులపై లైంగిక దాడులు జరిగినప్పుడు కొందరు అవమానభారంతో బయటపడేందుకు సాహసించటం లేదు. ఇలాంటి సందర్భాల్లో అండగా నిలిచే చట్టాలున్నాయి. ఇలాంటి ఘటనలపై పోక్సో చట్టం ఉపయోగించి పోలీసులు కేసు నమోదు చేస్తారు. ► 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే అత్యాచారాలు, అత్యాచారయత్నాలపై పోక్సోచట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ చట్టంలో అత్యాచారం, వేధింపులకు పాల్పడిన ఘటనల్లో కనీసం మూడేళ్లకు తగ్గని జైలు శిక్ష, అత్యధికంగా జీవితఖైదు, దీనికి తోడుగా అవరసమైతే జరిమానా కూడా విధిస్తారు. చదవండి: తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం: బండి సంజయ్ ►ఇంతటి కఠినమైన చట్టం ఏర్పాటయినప్పటకి కేసుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఆరేళ్ల వ్యవధిలో 247 పోక్సో కేసులు నమోదు కాగా.. అత్యధికంగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ►జిల్లాలోని లైంగిక దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలోనో... లేదా బాధితులు చనిపోయినప్పుడో బహిర్గతమవుతున్నాయి. పరువుపోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలు దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసినవారై ఉండటం, పోలీసులకు ఫిర్యాదు చేస్తే బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న అనుమానంతో మరికొందరు ఫిర్యాదు చేయడం లేదు. పోక్సో కేసులను విచారించి సత్వరంగా బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. పోక్సో కేసుల విచారణకు గతంలో ఐజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సులు, శిక్షణలు అందించారు. పోక్సోచట్టం ప్రకారం బాధితులు మైనర్లు కావడంతో యూనిఫాంలో ఉంటే భయబ్రాంతులకు గురవుతారు కాబట్టి.. సివిల్ డ్రెస్‌లోనే విచారణ జరిపి కావాల్సిన సమాచారాన్ని మైనర్ల నుంచి రాబట్టుతున్నారు. దీంతో కేసువిచారణ త్వరగా పూర్తవుతోంది. పోక్సోకు ప్రత్యేక కోర్టు కరీంనగర్లో పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్చౌహాన్ చేతుల మీదుగా జిల్లాకోర్టు సముదాయంలో ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పోక్సో కోర్టుకు సతీశ్‌కుమార్ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. బాలికలు కోర్టుకు వచ్చేందుకు ప్రత్యేకంగా దారిని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోక్సో కేసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. కరోనా సమయంలో కోర్టులు సరిగా నడవకపోవడంతో కొంత నెమ్మదించినప్పటికి మళ్లీ పుంజుకుంది. కమిషనరేట్‌వ్యాప్తంగా ఐదేళ్లనుంచి 196 కేసులు నడుస్తుండగా ఇందులో 08 కేసులకు శిక్షలు పడ్డాయి. వేగంగా దర్యాప్తు మహిళలు, యువతులు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరగకుండా కమిషనరేట్‌వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇబ్బందుల్లో హ్యాక్ఐ యాప్, డయల్ 100, వాట్సాఫ్ల ద్వారా ఫిర్యాదు చేసినా వేగంగా స్పందిస్తున్నాం. వీటిపై పోలీసులు, షీటీంకు చెందిన వారితో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫోక్సో కేసుల విచారణకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందించి దర్యాప్తు వేగంగా జరిపి సరైన అధారాలతో కోర్టుల్లో ప్రవేశ పెడుతూ నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – వి.సత్యనారాయణ, కరీంనగర్ సీపీ -
మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి!
చెన్నై: మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్‌కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి -
ఖమ్మం: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
ఖమ్మం లీగల్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్ సోమవారం తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్‌నగర్ ఎస్టీ కాలనీకి చెందిన పింగళి గణేష్ (చింటు) కిరాణా దుకాణానికి 2020 నవంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు నాలుగేళ్ల బాలిక వెళ్లింది. (చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..) ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో బాలికకు చింటు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కడుపునొప్పితో ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చింటూను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనలు విన్నాక నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..
సాక్షి,పశ్చిమగోదావరి: పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న బాలికను ద్వారకాతిరుమలకు రప్పించాడు. అనంతరం ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బస్టాండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. తనకు పెళ్లైందని, ఇంటికి వెళ్లిపోమని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, స్థానిక పోలీస్టేషన్లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రొఫైల్ పెడితే.. రూ.25 వేలు మాయం -
అత్యాచారానికి కేరళ హైకోర్టు సరికొత్త నిర్వచనం
తిరువనంతపురం: అమ్మాయిని పురుషుడి అవయవంతో ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుంది అని కేరళ హైకోర్టు పేర్కొంది. అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై గురువారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టులో నిందితుడు తాను లైంగిక దాడికి పాల్పడలేదని.. కేవలం తన జననాంగంతో టచ్ చేశానని.. అది లైంగిక దాడికి కింద ఎలా వస్తుందని కోర్టుకు తెలిపాడు. అతడి వాదనను విన్న న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం అత్యాచారంపై ఓ వివరణ ఇచ్చింది. సెక్షన్ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం (రేప్) చేసినట్టేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం బాధితురాలి వయసును ఆమె తరఫు న్యాయవాది నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. నిందితుడికి మాత్రం జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ జియాద్ రహ్మన్‌తో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. -
అమ్మాయి మైనర్.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు!
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో మైనర్ బాలికకు రెండుసార్లు వివాహమైనది. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘అజిత్ (21) అనే వ్యక్తి, ఓ మైనర్ బాలిక(17) తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా.. బాలిక మైనర్(17) అని, ఈ ఏడాది జనవరిలో కమరాజ్ (34)ను వివాహం చేసుకున్నట్లు తెలిసింది. కాగా కామరాజ్‌తో బాలిక వివాహానికి నిరాకరించినట్లు, పై చదువుకుంటానని తెలిపింది.’’ అని పోనమ్మల్ పరిధిలోని మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ భవానీ తెలిపారు. అయితే కామరాజ్‌తో కలిసి బాలిక సొంత గ్రామం కోవిల్పాలయంకు వెళుతుండగా.. అజిత్ ఆమెను అపహరించినట్లు తెలిసింది. ఇక కామరాజ్‌తో బాలికకు ఇదివరకే వివాహం జరిగినట్లు బాలిక తల్లిదండ్రులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కమరాజ్, అతని తల్లిదండ్రులు, అజిత్, బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్, కమరాజ్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పీటర్ పాన్ సిండ్రోమ్: అత్యాచార నిందితుడికి బెయిల్
సాక్షి, ముంబై: 'పీటర్ పాన్ సిండ్రోమ్'తో బాధపడుతున్నందును తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరిన లాయర్ అభ్యర్థన మేరకు ముంబై కోర్టు పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన 23 ఏళ్ల వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలినే వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుడి తరఫున లాయర్ మాట్లాడుతూ.. ‘‘నిందితుడికి, బాధితురాలికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలుసు. కాకపోతే అతడు పేదవాడు కావడం, పీటర్ పాన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నందున వారి వివాహానికి బాధితురాలి కుటుంబం అంగీకరించలేదు. అతనిపై కక్ష్య కట్టి ఇలా కేసు నమోదు చేశారు. కానీ బాధితురాలికి అతడంటే ఇష్టం. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె తన ఇష్టపూర్తిగానే అతడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు కావాలనే అతడి మీద కిడ్నాప్ కేసు పెట్టారు’’ అని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు సదరు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులో బాలికకు వారి బంధం గురించి పూర్తిగా తెలుసని.. ఆమె స్వచ్ఛందంగానే అతడితో కలిసి ఉంటుందని పేర్కొంది. పైగా నిందితుడికి ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని, అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కోర్టు తెలిపింది. పీటర్ పాన్ సిండ్రోమ్... పీటర్ పాన్ అనేది నెవర్-నెవర్ ల్యాండ్ అనే పౌరాణిక ప్రదేశం నుంచి వచ్చిన కల్పిత పాత్ర. ఇక్కడ పిల్లలు ఎప్పటికీ పెరగరు. ఈ సిండ్రోమ్ ఉన్నవారు మానసికంగా సరిగా ఎదగరు. పరిపక్వత కలిగి ఉండరు.. యుక్త వయసు వారి మాదిరిగా బాధ్యతలను స్వీకరించలేరు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మానసిక రుగ్మతగా గుర్తించలేదు. -
లైంగిక వేధింపులు: శివశంకర్ బాబా శిష్యురాలి అరెస్టు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): విద్యార్థినులపై లైంగిక వేధిపుల కేసులో అరెస్టయిన శివశంకర్ బాబా ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన స్కూల్లోనే చదువుకుని ప్రియ శిష్యురాలిగా మారిన సుస్మితను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శివశంకర్ బాబాను రిమాండ్ నిమిత్తం చెంగల్పట్టు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాల్సి రావడంతో శనివారం ఉదయాన్నే చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బాబా నేతృత్వంలోని సుశీల్సూరి స్కూళ్లో చిన్న తనం నుంచి చదువుకుని, అక్కడే స్వామి సేవకు అంకితమైన సుస్మిత అనే ప్రియ శిష్యురాల్ని సీబీసీఐడీ శనివారం అరెస్టు చేసింది. తన ఆరు నెలల బిడ్డతో పాటు ఆమెను విచారణకు తీసుకెళ్లారు. హాస్టల్లో విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసి బాబా వద్దకు తీసుకెళ్లడంలో సుస్మిత కీలకంగా వ్యవహరించిన సమాచారంతోనే అరెస్టు చేసినట్టు సీబీసీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. కరుణ, నీరజ అనే మరో ఇద్దరు శిష్యురాళ్ల వద్ద విచారణ సాగుతోంది. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లలో ఒకరైన భారతీ విదేశాల్లో ఉన్నట్టు, దీప ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు విచారణ తేలింది. చదవండి: పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి.. -
కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం
సాక్షి, చెన్నై: కీచక బాబా కోసం విద్యార్థినులను మభ్యపెట్టినట్లు తేలడంతో ఇద్దరు మహిళా టీచర్లపై పోక్సో చట్టంతో పాటు తొమ్మిది సెక్షన్ల కింద మంగళవారం కేసులు నమోదు చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థినులను భారతి, దీప అనే టీచర్లు బలవంతంగా బాబా ఆశ్రమంలోని గదిలోకి తీసుకెళ్లే వారని విచారణలో తేలింది. మరికొందరు టీచర్ల హస్తం కూడా ఉందన్న సమాచారంతో విచారణ వేగం చేశారు. చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కంలోని సుశీల్‌హరి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు హోరెత్తడంతో సీబీసీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఆయన ఝార్కండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం రావడంతో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి విచారించింది. బాబా జాడ కానరాలేదు. విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సీబీసీఐడీ గుర్తించింది. ఆయన విమానాశ్రయాలకు మంగళవారం లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. రూ. 700 కోట్ల ఆస్తులు బాబా వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. అందులో తనకు రూ.700 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు స్వయంగా శివశంకర్ బాబా మహిళలతో ముచ్చటించారు. బాలికలు, వితంతువులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చదవండి: తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్? -
మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్
గతంలో టిక్‌టాక్ యాప్ ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ పిచ్చిలో జనాలు మునిగిపోయారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు దానికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే గత ఏడాది దేశ భద్రత కారణాల రీత్యా కేంద్రం మన దేశంలో చైనాకు చెందిన అనేక యాప్ లను బ్యాన్ చేసింది. అందులో ఇది ఒకటి. దీంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్‌టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాకుండా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. అయితే, టిక్‌టాక్ ద్వారా వచ్చిన ఫేమస్ అడ్డుపెట్టుకొని కొద్దీ మంది చెడు పనులు కూడా చేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భం దాల్చిన కేసులో ఒక టిక్‌టాక్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అంబిలి అకా విఘ్నేష్ కృష్ణను అరెస్టు చేసి పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విగ్నేష్ కృష్ణకు గత ఏడాది 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడప్పుడు వారు బయట కలుసకునేవారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. విఘ్నేష్ కృష్ణ విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు ప్లాన్ లో భాగంగా పాస్ పోర్ట్ సిద్దంగా ఉందని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. తన తండ్రి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాస్‌పోర్ట్ విషయం గురించి విఘ్నేష్ కృష్ణకు తెలియజేశాడు. అతని తండ్రిని అనుసరిస్తున్న పోలీసులు విఘ్నేష్ కృష్ణను పట్టుకున్నారు. విచారణ తరువాత అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి
సాక్షి, రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రాయికల్ మండలంలోని అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయం వారంరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత వ్యవహార శైలి ఇదీ అంటూ పేరు ప్రస్తావించకుండా మరోనేత ఫేస్బుక్, వాట్సప్‌లో మెసేజ్ పెడుతున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతోపాటు జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి సోషల్ మీడియా వార్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. బాలిక ఫొటో వాట్సప్‌లో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు -
విద్యార్థినికి అబార్షన్.. యువకుడికి యావజ్జీవం
టీ.నగర్: విద్యార్థినికి అబార్షన్ చేయించిన యువకుడికి కోర్టు జంట యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పుదుక్కోట్టై సత్యమంగళం పసుంపొన్‌నగర్‌కు చెందిన సురేష్ (32). ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అనేకసార్లు లైంగికదాడి చేశాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం సురేష్ ఆమెకు మాత్రలు కొని ఇచ్చాడు. దీంతో ఆమెకు అబార్షన్ కావడంతో ఆరోగ్యం క్షీణించింది. విద్యార్థిని తల్లిదండ్రులు 9 మార్చి 2019న పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద సురేష్‌ను అరెస్టు చేశారు. పుదుక్కోట్టై మహిళా కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సత్య సురేష్‌కు లైంగికదాడి నేరానికి ఒక యావజ్జీవశిక్ష, గర్భవిచ్ఛిత్తికి మరో యావజ్జీవశిక్ష అంటూ జంట యావజ్జీవశిక్షను న్యాయమూర్తి ఖరారు చేశారు. చదవండి: వైరల్: రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించారు -
తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్?
కూతురి మీద తల్లి ‘గృహహింస’ కేసు పెట్టింది. ఆ కేసు కింది కోర్టు నుంచి బాంబే హైకోర్టుకు వచ్చింది. కూతురి లాయర్, తల్లి లాయర్ ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. కూతురి లాయర్ వాదన ముగిసింది. తల్లి లాయర్ మొదలు పెట్టాడు. వాదిస్తూ వాదిస్తూ చప్పున.. ‘‘ఆ అమ్మాయికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అనేశాడు! వెంటనే జడ్జిగారు అతడిని స్టాప్ చేశారు. పాయింట్లోకి రమ్మన్నారు. ‘‘అది ఆమె వ్యక్తిగత విషయం. ఈ కేసుకు సంబంధం లేనిది’’ అన్నారు. ఆ మధ్య బాంబే హై కోర్టులోనే నివ్వెరపోయే తీర్పులు కొన్ని వచ్చాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు స్త్రీ జాతికి గౌరవాన్ని నిలబెడుతూ ఈ మాట! ఏప్రిల్ 19 న తీర్పు రాబోతోంది. తీర్పు ఎలా వచ్చినా ఈ మాట మాత్రం మొత్తం సమాజమే శిరసావహించవలసిన తీర్పు! ‘మంచివాడు కాదు’ అనే మాటకు అనేక అర్థాలుంటాయి. ‘మంచిది కాదు’ అనే మాటకు మాత్రం ఒకటే అర్థం. మగాళ్లతో మాట్లాడుతుందని! ఒక స్త్రీని కించపరచడానికి, అవమానించడానికి, ఆత్మస్థయిర్యాన్ని నీరు కార్చడానికి, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి పురుషుల దగ్గరుండే మారణాయుధం లాంటి దారుణమైన మాట.. ‘మంచిది కాదు’! మంచిది కాదు అని అనడం అంటే ఆ స్త్రీ ఎంత పనైనా చేయగలిగిన మనిషి అని నిందించడం. ఆమెను తలెత్తుకోలేకుండా చెయ్యడానికి, ఆమె తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు సమాజం ఇలాంటి ‘స్లట్ షేమింగ్’కి దిగుతుంది. స్లట్ షేమింగ్ అంటే ఆడమనిషి క్యారెక్టర్‌పై బురదచల్లడం. బాంబే హైకోర్టుకు గతవారం ఓ కేసు వచ్చింది. కింది కోర్టు నుంచి వచ్చిన కేసు అది. కూతురు తనను గృహహింస పెడుతోందని ఒక తల్లి కేసు వేసింది. వాళ్లిద్దరూ ముంబైలోనే ఉంటారు. కేసు నడుస్తున్న సమయంలో కూతురుకి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలో అవకాశం వచ్చింది. కేసు తన విదేశీ విద్యకు అడ్డంకి అవుతుందని కింది కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు మొదలయ్యాయి. కూతురు తన క్లయింట్‌ని తల్లి అని కూడా చూడకుండా ఆమెను నిరాదరించడం కూడా గృహ హింసేనని తల్లి లాయర్ వాదించారు. తల్లి తన క్లయింట్‌ని కూతురు అని చూడకుండా తన స్వార్థం కోసం ఆమె భవిష్యత్తుని నాశనం చేసేందుకు గృహహింస కేసు పెట్టిందని కూతురి లాయర్ కెన్నీ థక్కర్ వాదించారు. ఈ లాయర్ మహిళ. తల్లి తరఫు లాయర్ పురుషుడు. వాదనల క్రమంలో ఆ పురుష లాయర్.. ‘‘కూతురు మంచిది కాదు కాబట్టే, తల్లి కేసు పెట్టింది. ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని ఆరోపించారు! వాదనలు వింటున్న జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పితాలే ఒక్కసారిగా అతడి మాటలకు నివ్వెరపోయారు. జస్టిస్ మనీష్ పితాలే వెంటనే స్పందిస్తూ.. అతడికి అడ్డుకున్నారు. కేసుకు సంబంధం లేని విషయం మాట్లాడొద్దని వారించారు. ‘అది ఆమె వ్యక్తిగత విషయం’ అని అన్నారు. ఆమెకు ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్నది అసలు ఆర్గ్యుమెంటే కాదని స్పష్టంగా చెప్పారు. తీర్పు ఏప్రిల్ 19 కు వాయిదా పడింది. ‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసులు ఇటీవల బాంబే హైకోర్టుకు వచ్చినప్పుడు ఆ కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పోక్సో పరిధిలోకి రాని నేరం అంటూ నిందితులకు బెయిల్ ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసింది. ఇప్పుడీ తాజా కేసులో జడ్జిలు.. ‘చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అన్నది ఆర్గ్యుమెంట్‌కు సంబంధం లేని పాయింట్’ అని వ్యాఖ్యానించడం ప్రశంసనీయం అవుతోంది. -
నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
పెనుమూరు(చిత్తూరు జిల్లా): ముక్కపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పెనుమూరు మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. పెనుమూరు మండలం దాసరాపల్లెకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పక్కనే ఉన్న మరో చిన్నారితో ఆడుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మూత్ర విసర్జన ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు పరిశీలించి విచారించగా ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలుడు చేసిన అఘాయిత్యం వెలుగుజూసింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించుకుని, అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని శనివారం మాట్లాడుకుందామని సర్దిచెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకంతా ఆ ఇంట్లో వారంతా ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై దిశ, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. -
దారుణం: కూతురు, మనుమరాలిపై లైంగికదాడి చేసి..
ముంబై: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు పెళ్లైన తర్వాత కూడా వేధింపులకు గురిచేశాడు. అంతటితో అతడి క్రూర వాంఛ తీరలేదు. మైనర్ అయిన మనుమరాలిపై ఆ మృగాడి కన్నుపడింది. ఆమెపై కూడా అతడి అకృత్యాలు కొనసాగాయి. అయితే, బాలిక ఈ విషయాన్ని తల్లితో చెప్పడంతో, ఇక ఆమె సహించలేకపోయింది. తనతో పాటు తన బిడ్డను కూడా వేధిస్తున్న ఆ దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సోచట్టం కింద అతడిపై కేసు నమోదు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు జీవిత ఖైదుతో పాటు 75 వేల రూపాయాల జరిమానా విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడి(65) కుటుంబం ముంబైలో నివసిస్తోంది. అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. తండ్రీకొడుకులు పెయింట్లు వేస్తూ జీవనోపాధి పొందుతుండగా, తల్లీకూతుళ్లు నాలుగిళ్లలో పనిచేస్తూ వారికి చేదోడువాదోడుగా ఉండేవారు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమానిలో దాగున్న కామ ప్రకోపం నిద్రలేచింది. దీంతో, పదిహేనేళ్ల వయసులో ఉన్న కూతురిపై తరచుగా అత్యాచారానికి పాల్పడుతుండేవాడు. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత కూడా వేధించసాగాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, ఆమె పిల్లలను చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు మిన్నకుండిపోయింది. అయితే, తన కూతురిపై కూడా తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది. 2017 నాటికి సంబంధించిన ఈ కేసును విచారించిన ముంబై పోక్సో ప్రత్యేక కోర్టు.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అదే విధంగా కూతురికి రూ.50 వేలు, మనుమరాలికి రూ. 25 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రేఖా ఎన్ పంఢారే తీర్పు వెలువరించారు. చదవండి: ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు.. -
పెళ్లైన 10 రోజులకే నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష
తిరువొత్తియూరు: ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలో ఉన్న పుదుపేట ప్రాంతం పక్రి మఠం గ్రామానికి చెందిన యువకుడు విఘ్నేష్ (25). ఇతను 2018వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటనపై కేసు విచారణ వేలూరు సత్‌వాచ్చారి శాంతిభద్రతలు కోర్టు ప్రాంగణంలో వున్న ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసుకు విచారణ గురువారం రాగా న్యాయమూర్తి సెల్వం కేసును పరిశీలించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను విఘ్నేష్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముద్దాయి విఘ్నేష్‌కు పది రోజుల ముందే వివాహం కావడం గమనార్హం. చదవండి: చిన్నారిపై వృద్ధ జంట వికృత చేష్టలు.. ఊయలలో ఆడించి -
చిన్నారిపై వృద్ధ జంట వికృత చేష్టలు.. ఊయలలో ఆడించి
ముంబై: ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసులో ప్రత్యేక పోక్సో న్యాయస్థానం వృద్ధ దంపతులకు శిక్ష ఖరారు చేసింది. పదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు.. పోక్సో కోర్టు న్యాయమూర్తి రేఖా పంఢారే గురువారం తీర్పునిచ్చారు. వివరాలు.. ముంబైలోని గిర్గాన్ ప్రాంతంలో నివసించే భార్యభర్తలు తమ అపార్టుమెంటులో నివసించే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబరు 4, 2013న ఈ అమానుష ఘటనకు ఒడిగట్టారు. పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలితో ఆడుకునేందుకు చిన్నారి బయటకు రాగా, ఆమెను తన ఇంట్లోకి తీసుకువెళ్లిన నిందితుడు(87) ఊయలలో కూర్చోబెట్టి కాసేపు ఆడించాడు. ఆ తర్వాత తన భార్య(80)ను పిలిచి, ఇద్దరూ కలిసి చిన్నారి దుస్తులు విప్పి వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిన్నారి ఏడుస్తూ వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించగా, చెంపలపై కొడుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే, రాత్రి నిద్రపోయే సమయంలో చిన్నారి వింతగా ప్రవర్తించడంతో ఆమె తల్లి పరీక్షించి చూడగా, చిన్నారి శరీర భాగాల్లో గాయాలు కనిపించాయి. దీంతో తన భర్తకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం బయటపడింది. దాదా, దాదీ అంటూ పిలిచే ఆ పసిపాపపై వృద్ధ జంటే అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లితో పాటు మరికొంత మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బామ్మాతాతయ్యల్లా చిన్నారిని రక్షించాల్సిన వాళ్లే ఈ దురాగతానికి పాల్పడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చదవండి: దారుణం: 4 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం -
పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించింది. ఉద్యోగం నుంచి సస్పెండ్ కాకుండా ఉండాలన్నా.. జైలుకు వెళ్లకుండా ఉండాలన్న బాధితురాలిని వివాహం చేసుకోవాలని సూచించింది. నిందితుడు మోహిత్ సుభాష్ చవాన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నీవు పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశావ్. ఇందుకు గాను నీమీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఒకవేళ నీవు బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే.. మేం నీకు సాయం చేయగలం. లేదంటే నీవు జైలుకెళ్తావ్.. అప్పుడు ఆటోమెటిగ్గా నీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని కోర్టు నిందితుడికి తెలిపింది. దీనిపై చవాన్ స్పందిస్తూ.. ‘‘గతంలో నేను బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాను. కానీ ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతం నేను తనను పెళ్లి చేసుకోలేను.. ఎందుకంటే ఇప్పుడు నాకు వివాహం అయ్యింది’’ అని కోర్టుకు తెలిపాడు. నిందితుడు చవాన్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం చవాన్ మైనర్ స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దాంతో అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు చవాన్‌ని అరెస్ట్ చేస్తే.. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దాంతో అతడు అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ.. హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చవాన్ బెయిల్ పిటిషన్ సందర్బంగా కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటే.. జైలుకెళ్లాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇక ఈ విషయంలో కోర్టు బలవంతం ఏం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బాధితురాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రెగ్యూలర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలని కోర్టు సూచించింది. చవాన్‌కి నాలుగు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. చదవండి: ఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు -
ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు..
ముంబై: సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కారు ముగ్గురు యువకులు. అశ్లీల ప్రాంక్ వీడియోలు చిత్రీకరిస్తూ కోట్లు ఆర్జించారు. దీనిపై కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేష్ గుప్త(29), జితేంద్ర గుప్త(25), కుమార్ సవ్(23) యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ అందించేవారు. దీంతోపాటు సొంతంగా 17యూట్యూబ్ ఛానళ్లను నడిపేవారు. ఇవన్నీ కూడా పోర్న్‌కు సంబంధించినవే. ఈ ఛానళ్లకు 20 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాగా, ఒక మహిళతోపాటు, ముగ్గురు మైనర్ బాలికలు ప్రాంక్ వీడియో చేస్తే కావల్సినంత డబ్బులిస్తామని ఆఫర్ చేశారు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించి, వారి ప్రైవేట్‌పార్ట్స్‌ను తాకాలని చూశారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితురాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 మొబైల్ ఫోన్లు, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోక్సో, అశ్లీల నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులు లాక్ డౌన్ సమయంలో 300ల వరకు అశ్లీల వీడియోలు వారి యూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేసి రూ.2కోట్ల వరకు ఆర్జించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ముఖేష్ విద్యార్థులకు చదువు చెప్పేవాడని, అతని దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఈ వీడియోలతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’ -
నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ..
ముంబై: లైంగిక దాడి కేసులో వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద తీర్పులు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా దేవ్‌శ్రీ త్రివేది మాట్లాడుతూ.. ‘‘అన్యాయాన్ని నేను సంహించలేను. గనేడివాలా తీర్పు వల్ల ఓ మైనర్ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి చేరుకున్నట్లు రిపోర్ట్ అందింది. ఆ తర్వాత మరో 12 చోట్లకు కండోమ్ ప్యాకెట్లు పంపాను అని తెలిపింది. ‘‘ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. ఇక జస్టిస్ గనేడివాలా లాంటి వారి వాల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. అప్పుడు అత్యాచారాలు స్త్రీల దుస్తుల మీదుగానే జరుగుతాయి’’ అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాలికలపై లైంగిక దాడుల కేసులో జస్టిస్ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘నేరుగా బాలిక శరీరాన్ని తాకుకుండా జరిగే లైంగిక దాడి పోక్సో కిందకు రాదని’’.. ‘బాలిక చేతిని పట్టుకుని అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన లైంగిక దాడిగా పరగణించలేం’’ అంటూ సంచలన తీర్పులు వెల్లడించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చదవండి: చర్మాన్ని చర్మం తాకలేదు గనుక.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
యువకుడి మోసం.. మైనర్ బాలిక ప్రసవం
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్): బాలికను లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై నాగిరెడ్డిపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చి ఇటీవలే పాపకు జన్మనిచ్చింది. కాగా ఆ బాలిక తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో వరుసకు అక్క అయిన మహిళనే సంరక్షణ బాధ్యత చూస్తోంది. సదరు బాలిక గర్భిణిగా ఉన్న సమయంలో యువకుడు వారికి మాయ మాటలు చెబుతూ వచ్చాడు. అయితే ఆమె ప్రసవించడంతో ఈ విషయం బంధువులకు తెలిసింది. దీంతో వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. చదవండి: దోశ పిండి నీ లాగే ఉందంటూ.. -
మైనర్ బాలికలకు రక్షణనివ్వని ‘పోక్సో’
దేశంలో 18 ఏళ్ళ లోపు బాలికల సంరక్షణ కోసం 2012లో పోక్సో ప్రత్యేక చట్టం ఏర్పడింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని శిక్షలు సరిపోనందు వల్ల ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫె న్సెస్ యాక్ట్ రూపొందిం చింది. కేసు తీవ్రతను బట్టి నేరస్తుడికి జీవిత ఖైదు, మరణశిక్ష కూడా విధించ వచ్చు. అయితే పోక్సో ప్రకారం శిక్ష పడ్డవారు పై కోర్టుకు వెళ్లగా వారి నేరాలను ఐపీసీ కింద జమకట్టి శిక్షలను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. జనవరిలో బొంబాయి హైకోర్టులోని నాగపూర్ బెంచి అడిషనల్ జడ్జి పుష్ప వీరేంద్ర గణేదివాలా పోక్సో చట్టం ప్రకారం శిక్షించిన కేసుల్లో సరైన ఆధారాలు లేవని, అవి ఐపీసీ కిందికి వస్తాయని శిక్షలు తగ్గిస్తూ తీర్పిచ్చారు. లోపలికి వస్తే జామపండు ఇస్తా నని పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి తీసు కెళ్ళి ఆమె ఛాతీపై నొక్కడంతో బాలిక భయపడి అరవ డంతో దొరికిపోయాడు. ఆయనకు పోక్సో చట్టంలో కనిష్టమైన 3 ఏళ్ల శిక్ష పడింది. పై కోర్టుకు అప్పీలుతో అదే కేసు జడ్జి పుష్ప ముందుకు వచ్చింది. చర్మానికి చర్మం తాకితేనే, అంటే రెండు శరీరాల పరస్పర స్పర్శ అయినట్లు రుజువైతేనే అది పోక్సో చట్టం,సెక్షన్ 7 కింద నేరమవుతుందని, అలాంటిదేదీ లేనందువల్ల ఈ నేరం ఐపీసీ సెక్షన్ 354 కిందికి వస్తుందని చెప్పి శిక్షను ఏడాదికి మార్చారు. యాభై ఏళ్ల మగమనిషి అయిదేళ్ల బాలిక చేయిని గట్టిగా అదిమి పట్టుకొని మరో చేత్తో ప్యాంట్ జిప్ తెరిచాడు. బాలిక అరవడంతో ఆమె తల్లి వచ్చి బాలి కను విడిపించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు విచారణలో అతడు మర్మాంగాన్ని బయటికి తీసింది తాను చూశానని తల్లి వివరించింది. సెషన్సు కోర్టు ఈ కేసును పోక్సో సెక్షన్ 10కి చెందిన నేరంగా స్వీకరించి ముద్దాయికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25,000 జరిమానా లేదా మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అప్పీలుపై తన దగ్గరికి వచ్చిన ఈ కేసును జడ్జి పుష్ప విచారించారు. బాలికపై లైంగిక దాడి అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకటికొకటి తాకినట్లు రుజువులుండాలని, ఈ నేరానికి పోక్సో చట్టం 8, 10, 12 సెక్షన్లు వర్తించవని శిక్షను మూడేళ్లకు పరిమితం చేశారు. అయితే జడ్జి పుష్ప తీర్పుల పట్ల ప్రజల నిరసనను పరిశీలించిన సుప్రీంకోర్టు జనవరి 27న వీటిపై స్టే ఇచ్చింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సైతం ఈ తీర్పులు రాబోయే కాలంలో ప్రమాదకరంగా మారు తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అడిషనల్ హోదాలో ఉన్న జడ్జి పుష్పను అదే పదవిలో శాశ్వతంగా నియమించాలని జనవరి 20న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని 27న వాపసు తీసుకుంది. ఆమెపై ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని, ఆమె న్యాయవాదిగా ఇలాంటి కేసులతో వ్యవహరించి ఉండకపోవచ్చునని, మరింత శిక్షణ, అవగాహన అవసరమున్నందువల్ల ఇలా చేయవలసి వచ్చిందని సుప్రీం వివరణ ఇచ్చింది. అయితే జడ్జి పుష్ప గణేదివాలా విద్యాధికురాలు. చదువులో గోల్డ్ మెడలిస్ట్. న్యాయశాస్త్ర బోధకురాలు. ప్రాక్టీసులో ఉన్నప్పుడు పలు బ్యాంకులకు ప్యానెల్ అడ్వొకేట్‌గా ఉన్నారు. 2007 నుండి జడ్జిగా ఉంటూ పలు కీలక తీర్పులిచ్చారు. ఖైదీలకు పెరోల్ మంజూరు వారికున్న పరిమిత హక్కు అని, అది అధికారుల నిర్ణయంపై ఆధారపడే విషయం కాదని 2019లో తీర్పి చ్చారు. కరోనా సోకిన గర్భిణిని డెలివరీకి హాస్పిటల్లో చేర్చుకోని విషయం తెలుసుకొని ఆమెకు వైద్య సదు పాయాలు అందించమని ఆదేశించారు. ముంబై ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఎన్నో పెండింగు కేసులను పరి ష్కరించారు. ఈ నేపథ్యం గల న్యాయమూర్తి ఇలాంటి తీర్పులివ్వడానికి కారణం పోక్సో చట్టంలోని లొసుగు లేననే వాదన ఒకటుంది. ఆ చట్టంలో అత్యా చారానికి శిక్ష ఉంది గానీ, ప్రయత్నానికి ఎలాంటి వివరణ లేదని అంటున్నారు. అందువల్ల వీటిని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించే అవకాశం కూడా ఉంది. పోక్సో చట్టానికి తూట్లు పొడిచే విధంగా మరిన్ని తీర్పులు రాకముందే పకడ్బందీ సవరణలు చేయాలి. బి. నర్సన్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94401 28169 -
బుగ్గలు గిల్లడం నేరం కాదు: పోక్సో కోర్టు
ముంబై: పోక్సో (‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎటువంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ పిల్లల చెంపను తాకడం నేరం కాదని తెలిపింది. బుగ్గలు గిల్లుతూ 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న 28 ఏళ్ల టెక్నీషియన్‌ను మంగళవారం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేసు ఏంటంటే.. చిన్నారి తల్లి చెప్పిన దాని ప్రకారం.. ఫ్రిజ్ పనిచేయడం లేదనే కంప్లైంట్ మేరకు నిందితుడు 2017లో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి ఫ్రిజ్‌ని చెక్ చేసి.. అవసరమైన స్పేర్ పార్ట్స్ తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి బుగ్గలు గిల్లాడు. దీన్ని అభ్యంతరకరంగా భావించిన తల్లి అతడిని వారించి కిచెన్‌లోకి వెళ్లింది. ఇక ఆమె వంట గదిలో పనిలో ఉండగా.. టెక్నిషియన్ వచ్చి.. ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. భయంతో బిగుసుకుపోయిన సదరు మహిళ అతడిని పక్కకు తోసి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అతడు వదలలేదు. దాంతో ఆమె సూపర్వైజర్ని పిలిచింది. అతడు వచ్చి టెక్నిషియన్‌ని బటయకు గెంటే ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సదరు టెక్నిషియన్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు టెక్నిషియన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అతడికి లైంగిక వేధింపుల నేరం కింద ఏడాది జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే చిన్నారిపై లైంగిక వేధింపులు ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. దురుద్దేశం లేకుండా చిన్నారి బుగ్గలు గిల్లడం నేరం కాదని వెల్లడించింది. "నిందితుడిపై ఆరోపణల నేపథ్యంలో సహేతుకమైన అనుమానాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్దే. ఇక చిన్నారి తల్లి సాక్ష్యాలను పరిశీలిస్తే, నిందితుడి బహిరంగ చర్యలు బాధితురాలిపై లైంగిక వేధింపులు, ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నిరూపించలేకపోతున్నాయి’’ అని కోర్టు అభిప్రాయపడింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కాక కొద్ది రోజుల క్రితం నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు చదవండి: మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్ -
మైనర్‌పై ఐదు నెలలుగా.. 17 మంది
బెంగళూరు: ఓ మైనర్ బాలికను అపహరించి.. అత్యాచారం చేయడమే కాక లైంగిక హింసకు పాల్పడ్డ ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదు నెలలుగా మృగాళ్లు బాలికపై అకృత్యానికి ఒడిగడుతున్నారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బాధితురాలి బంధువు ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక చిక్ మంగుళూరుకు చెందిన బాధితురాలి తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి ఆమె తన బంధువుతో కలిసి నివసిస్తూ.. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ సంస్థలో పని చేసేది. ఈ క్రమంలో బాలికకు గిరీష్ అనే బస్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలి గురించి పూర్తిగా తెలుసుకున్న గిరీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక దీని గురించి తన ఆంటీకి చెప్పింది. తోడుగా నిలబడాల్సిన ఆమె.. బాలికని బెదిరించి మరి కొందరి వద్దకు పంపింది. ఇక బస్ డ్రైవర్ గిరీష్ బాలికతో ఉన్న సంబంధం గురించి బయట చెప్తానని బెదిరించి స్మాల్ అభి అనే వ్యక్తి వద్దకు బాధితురాలిని పంపాడు. (చదవండి: ఆ దారుణం వెనుక ముగ్గురు మహిళలు) అభి బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టడమే కాక వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి పలుమార్లు ఆమెపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి స్నేహితులు కూడా బాలికను అత్యాచారం చేశారు. ఇలా దాదాపు 17 మంది రాక్షసులు గత ఐదునెలలుగా బాధితురాలిపై రాక్షసకాండ కొనసాగిస్తున్నారు. దీని గురించి తెలియడంతో జిల్లా డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో స్మాల్ అభి, గిరీష్, వికాస్, మణికంట, సంపత్, అశ్వత్‌గౌడ, రాజేష్, అమిత్, సంతోష్, దీక్షిత్, సంతోష్, నిరంజన్, నారాయణ గౌడ, అభి గౌడ, యోగీష్, మైనర్ అత్త, ఎంజీఆర్ క్రషర్ యజమానిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. భారత శిక్షాస్మృతిలోని 201, 370 (అక్రమ రవాణా), 376 (3), 376 (ఎన్) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం, బాల కార్మిక సవరణ చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: బాలికకు గర్భం.. నిందితుడికి బెయిలు) ఇక ఈ దారుణంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య.. బీజేపీ ఎంపీ శోభా కరండ్లజే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఎఫ్ఐఆర్లో పేరున్న కొందరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉంది.. అందుకే వీరు మౌనంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. -
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
వివాదాస్పద తీర్పు: రంగంలోకి ఠాక్రే
సాక్షి, ముంబై : వస్త్రాల మీద నుంచి బాలిక ఛాతిభాగంలో తాకడం నేరం కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదమవుతోన్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ జస్టిస్ పుష్ప గనేడివాలా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శివసేన నేతృత్వంలోని మహావికాష్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సీతారం కుంటే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు గనుక పోక్సో చట్టం కింద దానిని లైంగికదాడిగా పరిగణించలేమంటూ జస్టిస్ పుష్ఫ ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేస్తున్నామన్నారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. (వివాదాస్పద తీర్పు: కొలీజియం కీలక నిర్ణయం) బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా హైకోర్టులో పలువురు సీనియర్ న్యాయవాదులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పోక్సో ( లైంగిక పరమైన దాడుల నుంచి చిన్నారుల రక్షణ) చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉందని, దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల లేఖపై స్పందించిన సీఎం ఉద్ధవ్ న్యాయనిపుణులతో చర్చించి స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. (బాలిక ఛాతిపై తాకడం నేరంకాదు : హైకోర్టు) బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
పోక్సో చట్టంపై తీర్పులు: ఎవరీ జస్టిస్ పుష్ప గనేడివాలా?
న్యూఢిల్లీ/ముంబై: ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్ పుష్ప గనేడివాలా. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక నేరంగా పరిగణించలేమనడం సహా.. ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్ తెరచినా ఈ చట్టం కింద అదేమీ నేరం కాదని ఆమె ఇచ్చిన తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ పోక్సో చట్టం నుంచి నిందితులకు విముక్తి కలిగించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. జనవరి 15, జనవరి 19 నాటి తీర్పులతో సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా నేపథ్యం, ఆమె కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గమనిద్దాం.(చదవండి: జిప్ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు) ►మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల పరాఠ్వాడాలో 1969లో జస్టిస్ పుష్ప జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టా పుచ్చుకున్నారు. 2007లో తొలిసారిగా జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టు, నాగ్‌పూర్ జిల్లా, ఫ్యామిలీ కోర్టు జడ్జిగా పనిచేశారు. ►అనంతరం నాగ్‌పూర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ►ఇక 2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైనప్పటికీ, న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. అయితే 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారు కావడంతో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం లభించింది. ►పెరోల్‌కు సంబంధించి ఖైదీలకు ఉన్న పరిమిత హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనంలో జస్టిస్ పీఎన్ దేశ్‌ముఖ్, జస్టిస్ మనీష్ పితాలేతో పాటు జస్టిస్ పుష్ప గనేడివాలా కూడా ఉన్నారు. పెరోల్ అనేది కేవలం అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్( ప్రభుత్వ నిర్ణయం) కాదంటూ, దానికి సంబంధించిన ప్రొవిజన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్ల నిబంధనలకు సంబంధించి ప్రిజన్ రూల్స్-1959లోని రూల్ 19(2), ప్రిజన్స్ యాక్ట్-1894లోని సెక్షన్ 59(5)లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు సరికావని పేర్కొంది. ►2019లో హత్యానేరంలో దోషులకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రెండు కేసుల్లో తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ►2020లో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నాగ్‌పూర్‌లో కరోనా పేషంట్లకు సరిపడా బెడ్లు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించిన ధర్మాసనంలో కూడా ఆమె కూడా ఉన్నారు. ►వీటితో పాటు మరికొన్ని కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ పుష్ప గనేడివాలా జనవరి 15, 2021, జనవరి 2021 నాటి పోక్సో చట్టం కింద అరెస్టైన నిందితులకు పోక్సో చట్టం కింద శిక్ష పడదని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు. -
బాలికకు గర్భం.. నిందితుడికి బెయిలు
ముంబై: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం ఎంతమేరకు వారికి ఉపయోగపడుతోందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక దానిని లైంగిక వేధింపులుగా పరిగణించి నిందితుడిని శిక్షించలేమని బాంబే హైకోర్టు పన్నెండేళ్ల బాలిక విషయం లో జనవరి 19న ఇచ్చిన తీర్పు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేసులోనూ పోక్సో చట్టంపై అదే నాగ్‌పూర్ ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల బాలిక(మైనర్) చేతులు పట్టుకోవడం, ప్యాంటు విప్పడం వంటి వాటిని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. (చదవండి: జిప్ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు ) ఈ క్రమంలో ముంబై కోర్టు పదహారేళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన విధానం విస్మయం కలిగిస్తోంది. వివరాలు.. 25 ఏళ్ల వివాహితుడు, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, నిందితుడు బెదిరించడంతో ఆమె ఎవరికీ విషయాన్ని చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత బాధితురాలి శరీరంలో మార్పులు గమనించిన ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా గర్భవతి అని చెప్పారు. దీంతో నిందితుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడిని శిక్షించాలని కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. బెయిలు నిరాకరించింది. అయితే కేసు నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నిందితుడు ఆమె తల్లిదండ్రులకు రాయబారం పంపాడు. ఇందుకు వారు అంగీకరించడం సహా, అతడి విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని నిందితుడు కోర్టు ఎదుట చెప్పాడు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని న్యాయస్థానానికి తెలిపాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది. అయితే పోలీసులు మాత్రం అతడికి బెయిలు ఇవ్వొద్దని గట్టిగా వాదించారు. మొదటి భార్య రెండో వివాహానికి అంగీకరించినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని, పెళ్లి పేరిట శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. కానీ నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం.. అతడి కమ్యూనిటీలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేందుకు అవకాశం ఉందని, బెయిలు నిరాకరించాల్సిన అవసరం లేదంటూ తన వాదనలు వినిపించారు. దీంతో అతడికి జైలు నుంచి విముక్తి లభించింది. -
జిప్ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు
ముంబై: పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్న వేళ జస్టిస్ పుష్ప గనేడివాలా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మైనర్ బాలిక చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్ తెరిచి ఉండటం వంటి చర్యలు పోక్సో చట్టం కింద నేరాలుగా పరిగణించబడవని పేర్కొన్నారు. అయితే భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్ కింద వీటిని లైంగిక వేధింపులుగా పరగణించవచ్చన్నారు. యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో జస్టిస్ పుష్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కేసు ఏమిటంటే.. తమ చిన్నారి పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి తన కూతురిని పక్కకు తీసుకువెళ్లి, తన చేతులు పట్టుకుని, ఆ తర్వాత అతడి ప్యాంటు విప్పేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సెషన్స్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించింది. (చదవండి: శరీరాన్ని శరీరం తాకలేదు గనుక..) ఈ నేపథ్యంలో కేసు బాంబే హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన నాగపూర్ ధర్మాసనం.. నిందితుడి చర్యను లైంగిక దాడి అనలేమని, కాబట్టి ఐపీసీ సెక్షన్ 354A (1) (i) ప్రకారం మాత్రమే శిక్షకు అర్హుడని పేర్కొంది. కాగా ఈ సెక్షన్ ద్వారా నిందితుడికి మూడేళ్లపాటు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా జనవరి 19 నాటి తీర్పులో జస్టిస్ పుష్ప ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే) -
వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు. (వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు) కేసు పూర్వపరాలు.. 39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు. (చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..) ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి కూడా ఆధారాలు లేవు. పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్ బార్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. -
వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు
సాక్షి, ముంబై : బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలిక ఛాతిభాగంలో తాకాడని, అంతేకాకుండా బాలిక శరీరంలోని పలు భాగాలపై చేయివేశాడని ఆరోపిస్తూ హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోక్సో చట్టం (లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల రక్షణ) కింద శిక్షించాలని పిటిషనర్ కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన పుప్ప గనిడేవాలతో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ.. ‘పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులంటే నిందితుడు బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ఉండాలి. లేకపోతే ఉద్దేశపూర్వకంగా బాలిక ప్రైవేటు భాగాలను తాకాలి. శారీరకంగా వేధింపులకు గురిచేసి ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో నిందితుడిని పోక్సో చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ తాజా కేసులో నిందితుడు కేవలం బాలికను డ్రెస్‌పై నుంచి మాత్రమే తగిలాడు. లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాకుండా డ్రస్‌లోపల చేతులు పెట్టి ఎలాంటి భాగాలనూ తాకలేదు. శరీరం-శరీరం తాకినంత మాత్రాన పోక్సో చట్టం ప్రకారం నేరంగా భావించలేం. దానిని ఐపీసీ 354, 342 (మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అవమానించడం) వంటి సెక్షన్ల కింద నేరంగా పరిగణించి విచారణ జరపవచ్చు’ అంటూ న్యాయమూర్తి పుష్ప వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల బాలిక ఛాతిని డ్రస్‌పై నుంచి తాకినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా పోక్సో చట్టం నింద నమోదైయ్యే కేసుల్లో ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ముంబై హైకోర్టు తీర్పును సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో న్యాయస్థానం ఈ విధమైన తీర్పును ఇవ్వడం సరైనది కాదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లైంగిక వేధింపుల కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీనటి తాప్సి పన్ను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పులు విన్న తరువాత తనకు మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇలాంటి తీర్పుల గురించి తెలిసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు’ అంటూ తాప్సి రాసుకొచ్చారు. ఈ మేరకు జూన్ పాల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఓ ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేశారు. ఈ తీర్పుపై గాయని చిన్మయి మరింత ఘాటగా స్పందించారు. జూన్ పాల్ ట్వీట్‌నే షేర్ చేసిన చిన్మయి.. ‘మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది. అద్భుతంగా ఉంది కదా.. ఈ దేశం లైగింగ వేధింపులకు పాల్పడే వారికోసమే. వారి కోసం వారే ఏర్పాటు చేసుకున్నది’ అంటూ చిన్మయి తన ట్వీట్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. This is the law we women face. Awesome no? This country is for molesters, by the molesters :) https://t.co/QoFic2YM9E — Chinmayi Sripaada (@Chinmayi) January 24, 2021 -
17 ఏళ్ల బాలికపై 44మంది అత్యాచారం
తిరువనంతపురం : ఓ టీనేజీ బాలిక(17)పై మూడేళ్లుగా 44మంది అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కేరళలోని మలప్పురంలో చోటుచేసుకుంది. నిర్భయ కేంద్రంలో కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో బాధితురాలు ఈ విషయాలను వెల్లడించింది. తనకు 13 ఏళ్లు ఉన్నప్పటినుంచి లైంగికదాడికి గురవుతున్నానని, గత మూడేళ్లుగా బంధువులు సైతం తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని తెలిపింది. 13-14ఏళ్లు ఉన్నప్పుడు తాను పలుసార్లు లైంగిక వేధింపులకు గురయినట్లు, ఆ సమయంలోనే తనను చైల్డ్ హోంకు తరలించినట్లు పేర్కొంది. ఒక సంవత్సరం అనంతరం తన తల్లి వద్దకు వెళ్లడానికి అధికారులు అనుమతించగా, అక్కడ కూడా బంధువుల చేతిలో అత్యాచారానికి గురయినట్లు వివరించింది. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోగా.. పాలక్కడ్‌లో అధికారులు గుర్తించి గతేడాది డిసెంబర్లో నిర్భయ కేంద్రానికి తరలించారు. (రిపోర్టర్ బ్యాగులో రూ.50 లక్షలు ) ఈ నేపథ్యంలో అక్కడ కౌన్సిలింగ్ సెషన్లలో బాలిక తన గోడును వెళ్లగక్కింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు 44మందిపై కేసు నమోదు చేయగా, వారిలో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసినట్లు మలప్పురం ఎస్పీ మహ్మద్ హనీఫా పేర్కొన్నారు. 2015 నుంచి బాలిక తన తల్లితో కలిసి మలప్పురంలోని చిన్న కాలనీలో నివసించేదని, తల్లి రోజూవారి కూలీ పనిలకు వెళ్తుండేది. దీంతో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలోనే పొరుగింటి వారు లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కొంద కేసు నమోదు చేశామని, అతి త్వరలోనే మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. (ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం ) -
చిన్నారిపై హత్యాచారం: సంచలన తీర్పు
లక్నో : రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ఘజియాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం నిందితులకు మరణశిక్ష విధించింది. విచారణ అనంతరం కేవలం 29 రోజుల రికార్డు సమయంలోనే సంచలన తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం..అక్టోబర్19న ఘజియాబాద్ కవి నగర్ ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురయ్యింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక తండ్రికి సన్నిహితుడైన చందన్ అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. (కొడుకును చంపించడానికి రూ.3 లక్షల సుపారీ ) ఈ మేరకు డిసెంబర్29నే చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. తీర్పు వెలువరించే రోజు సైతం పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాదారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ తీర్పు నిచ్చారు. కాగా ఇది ఓ సంచలన నిర్ణయమని, రికార్డు సమయంలోనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పురావడం ఓ మైలురాయి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ అన్నారు. (పోకిరీ చేతిలో వ్యక్తి హతం) -
పోక్సో చట్టం కింద అరెస్ట్, బెయిల్ మంజూరు!
చెన్నై: పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన ఒక వ్యక్తికి మద్రాస్ కోర్టుకు చెందిన మధురై బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్ల బాధితురాలిని తనకు చట్టప్రకారం పెళ్లి వయసు వచ్చిన తరువాత వివాహం చేసుకుంటానని ఒప్పుకోవడంతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే కారణంగా అతనిపై పోక్సో చట్టంలోని వివిధ సెకక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాధితురాలిని అక్టోబర్ 10, 2021 నాటికి వివాహం చేసుకోవాలని కోర్టు ఆ వ్యక్తిని ఆదేశించింది. పెళ్లి అనంతరం ఆ రిజిస్ట్రేషన పత్రాలను తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో అందించాలని, అలా చేయని పక్షంలో పోలీసులు ఏక్షణమైన అరెస్ట్ చేయవచ్చని పేర్కొంది. భాదితులరాలు, నిందితుడు ప్రేమించుకుంటున్నారని, ఇష్టంతో వారిద్దరు దగ్గరయ్యారని కోర్టుకు తెలిపారు. ఆ కారణంగానే ఆమె గర్భవతి అయ్యిందని కోర్టుకు తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం నిందితుడికి ఉందని చట్టం ప్రకారం 18 ఏళ్లు దాటిన తరువాత ఆమెను వివాహం చేసుకుంటాడని కోర్డు విచారణలో భాగంగా తెలిపారు. నిందితుడు 50 రోజులకు పైగా జైలులో ఉన్నాడని, అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. చదవండి: మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ -
చదువుల తల్లిని చిదిమేసిన మేనమామలు
కర్నూలు జిల్లాకు చెందిన 8వ తరగతి బాలికపై సొంత మేనమామలు ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అని తేలింది. పోక్సో చట్టం కింద అన్నదమ్ములు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఈ బాలికను తమ సంరక్షణలో ఉంచుకుని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెలలో ఆమె విజయవాడలోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ బాలిక సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం వల్లే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడానికి పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్‌వల్ అఫెన్సెస్) చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వేస్తే రాష్ట్రం రెండడుగులు ముందుకేసింది. చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, అక్రమ రవాణా, నీలి చిత్రాల్లో వాడుకోవడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పోక్సో చట్టానికి సవరణలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దోషులకు కఠిన శిక్షలు పడేలా, బాధితులకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా వెన్నంటి ఉంటోంది. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ చర్యల కారణంగా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలుగుతున్నారు. కొత్త చట్టం మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. పోక్సో కొత్త నిబంధనల ప్రత్యేకతలు స్కూళ్లు, క్రెష్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది గత చరిత్రపై పోలీస్ నివేదికలు తెప్పించుకోవాలి. బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. పిల్లలతో పని చేసే సంస్థలు, వ్యక్తులు, పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. తమను తాము రక్షించుకునేలా పిల్లలకు అవగాహన కలిగించాలి. బాధితుల గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు సిఫారసు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణ ఉచిత వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్యం కోసం కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించాలి. బాధితుల చదువుకు ఆటంకం కలగకూడదు. దోషుల నుంచి బెదిరింపులు రాకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో సంచలన తీర్పు విజయవాడ రూరల్‌లో ఒక బాలికపై 2017లో అత్యాచారానికి పాల్పడిన నిందితునికి విజయవాడ స్పెషల్ కోర్టు విచారణ జరిపి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రక్షణ కల్పించాల్సిన అధికారులు, సమీప బంధువులు తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. రాష్ట్రంలో విప్లవాత్మక చర్యలు ఈ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రుల్లో 13 దిశ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. పోలీసులు ఈ కేసుల సమాచారాన్ని ఐదుగురు సభ్యులుగల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఇవ్వడంతో వారు పిల్లల సంరక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ కోర్టులో ఈ కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతున్నారు. కోర్టుల్లో అందరికీ కనపడేలా కాకుండా న్యాయవాది, న్యాయమూర్తి, టైపిస్టులు మినహా ఎవరూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విధాలా ఆదుకుంటున్నాం అత్యాచారానికి గురైన బాలికల విషయంలో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. పలు కేసులను సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని రెండు సంఘటనలకు బాధిత బాలికలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించారు. ప్రభుత్వం ఇటువంటి కేసుల్లో బాధితులకు రూ.లక్ష అందజేస్తోంది. దోషులకు కఠిన శిక్షలు పడేలా పోలీస్, ఐసీడీఎస్ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పోక్సో చట్టానికి సవరణల తర్వాత బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. - తానేటి వనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం దోషులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తున్నాం. పోక్సో చట్టం అమలు పరిచే అధికారులకు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యులు, న్యాయవాదులు బాధితులతో సున్నితంగా వ్యవహరించేలా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లోని పిల్లలందరికీ ఈ చట్టం గురించి తెలియజెపుతున్నాం. - కృతికా శుక్లా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ -
వారి గత చరిత్రపై పోలీసు నివేదిక తప్పనిసరి
సాక్షి, అమరావతి: పిల్లలతో కలిసి పనిచేసే వారు, పిల్లలకు వసతి కల్పించే సంస్థలు, పాఠశాలలు, క్రీడా అకాడమీల సిబ్బంది గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి అని మహిళాభివృద్ధి, బాలల, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే నిబంధనల(పోక్సో)పై జిల్లాస్థాయి అధికారులతో బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, పోలీస్ అధికారులు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, ప్రొబెషన్ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృతికా శుక్లా మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ► పోక్సో చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. ► గుంటూరులో బాలల కోసం చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేశారు. ► దిశ పోలీస్ స్టేషన్లు పోక్సో చట్టం అమలు కోసం కూడా పని చేస్తున్నాయి. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, సీఐడీ ఏఐజీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ : ఆడపిల్లల రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పనిచేయనున్నాయి. కాగా మహిళ రక్షణ కొరకు ఏపీ సర్కార్ ఇదివరకే దిశ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. -
ల్యాప్‌టాప్‌లో కుమార్తె అభ్యంతరకర ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయి వాడిగా మారాడు. కూతురి అభ్యంతకర ఫోటోలను ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసి.. వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు. తండ్రి నిజస్వరూపం తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నాచారం ప్రాంతంలో రెస్టారెంట్ ఓనర్‌గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు రెండో భార్య కుమార్తె అభ్యంతరకర ఫోటోలను తీసి తన ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్‌టాప్ తీసి చూడగా తండ్రి బాగోతం బయటపడింది. కన్నతండ్రి ల్యాప్‌టాప్‌లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది. (భార్య అందంగా లేదని.. గొంతు నొక్కి) దీని గురించి బాధితురాలు తల్లికి తెలిపింది. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతడికి కరోనా సోకడంతో మందలించి విడిచిపెట్టారు. కోలుకోవడంతో ప్రస్తుతం నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు. -
బాలిక హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
విజయవాడ లీగల్: విజయవాడ శివారులో బాలికపై లైంగికదాడి చేయడంతోపాటు హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్షతోపాటు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. సెక్షన్ 376 కింద బతికి ఉన్నంతవరకు జీవిత ఖైదు, పోక్సో చట్టం సెక్షన్ 201 కింద ఏడేళ్లు, సెక్షన్ 6 కింద 20 ఏళ్లు, సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించారు. ఈ కేసు వివరాలిలా.. ► విజయవాడలోని గొల్లపూడి శివారు నల్లకుంటలో మొవ్వ ఏసుపాదం, రమణ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ద్వారక (7) అనే కుమార్తె ఉంది. ఇదే ప్రాంతంలో నిందితుడు బార్లపూడి పెంటయ్య అలియాస్ ప్రకాశ్ (37) తన భార్యతో కలసి ఉంటున్నాడు. ► గతేడాది నవంబర్ 10న నిందితుడి భార్య నూజివీడులో చదువుతున్న తన పిల్లలను చూసేందుకు వెళ్లింది. బాలిక తల్లి పనికి వెళ్లగా తండ్రి అనిల్ ఇంటిలోనే ఉన్నాడు. బాలిక టీవీ చూసేందుకు తమ ఇంటి పక్కనే ఉన్న పెంటయ్య ఇంటికి వెళ్లింది. ► మద్యం మత్తులో ఉన్న పెంటయ్య బాలికపై లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసి గోనె సంచిలో పెట్టి ఇంట్లోనే దాచాడు. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు అన్ని చోట్లా వాకబు చేశారు. వారితోపాటు పెంటయ్య కూడా వెతికాడు. ► ఇంటికి తిరిగొచ్చిన నిందితుడి భార్య గోనె సంచిని చూసి అనుమానం వ్యక్తం చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ► దీంతో ద్వారక తండ్రి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ► నిందితుడి భార్య కోర్టులో సాక్ష్యం చెప్తూ తన భర్తకు ఉరిశిక్ష వేయాలని కోరడం విశేషం. -
విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
-
స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. గొల్లపూడిలోని నల్లకుంటలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. (14 ఏళ్ల ఆ బాలికకు మానసిక పరిపక్వత ఉంది..) -
మైనర్ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి
లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం ప్రకారం అరెస్టైన ఓ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. 14 ఏళ్ల బాలిక గతంలో వ్యవహరించిన తీరు ఆమె మానసిక పరిపక్వత కలిగి ఉందన్న విషయాలను స్పష్టం చేస్తోందంటూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబై: ‘‘ఈ కేసు విచారణలో భాగంగా బాధితురాలికి లైంగిక చర్యల స్వభావం, అందుకు దారి తీసే పరిస్థితులు, తదనంతర పరిణామాలను అర్థం చేసుకోగల మానసిక పరిపక్వత ఉందని భావిస్తున్నాను. ఇవన్నీ తెలిసే ఆమె ఇందుకు అంగీకరించినట్లు భావించాల్సి వస్తోంది’’అంటూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ షిండే సోమవారం(జూలై 13) కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెయిలు మంజూరు చేస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గతంలో బాధితురాలు వ్యవహరించిన తీరు చూస్తుంటే పరస్పర అంగీకారంతోనే లైంగిక చర్య జరిగి ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి నిందితుడికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. బాధితురాలు సవతి తల్లితో పాటు ముంబైలో నివసించేంది. ఆమె పెట్టే చిత్రహింసలు భరించలేక గొడవ పెట్టుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జూన్ 14, 2019న తన కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి సవతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధితురాలు దిక్కుతోచక రోడ్ల వెంబడి తిరిగింది. అనంతరం ముంబై సబ్అర్బన్ రైలులో రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ముంబైకి తిరిగివచ్చింది. ఈ క్రమంలో తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు జూలై 10, 2019లో పోలీసులు వివాహితుడైన ధ్యానేశ్వర్ నవ్‌ఘరే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ధ్యానేశ్వర్‌కు బెయిలు మంజూరు చేస్తున్న సందర్భంగా ఈ విషయాలను ప్రస్తావించిన జస్టిస్ షిండే.. మైనర్ అయిన బాధితురాలికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల మానసిక పరిపక్వత ఉందని భావిస్తున్నానన్నారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ తన పేరు, మతం మార్చుకుంది. అంతేకాదు సొంతంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. చెన్నై నుంచి ఇద్దరు అపరిచిత వ్యక్తులతో ముంబైకి తిరిగి వచ్చింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత హుసేన్ అనే వ్యక్తిని కలిసింది. అతడితో ఆమెకు లైంగికపరమైన సంబంధం ఉంది. ఈ వ్యవహారాన్ని గమనించిన కొంతమంది బాటసారులు ఆమెను ములుంద్ పోలీస్ స్టేషన్లో అప్పగించగా.. మరో అపరిచిత వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా పేర్కొంటూ అతడితో పాటు వెళ్లిపోయింది. ఇవన్నీ గమనిస్తుంటే బాధితురాలి అంగీకారంతోనే లైంగిక చర్య జరిగి ఉందనే భావన స్ఫురిస్తోంది’’అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ. 30 వేల వ్యక్తిగత పూచీకత్తు మీద ధ్యానేశ్వర్‌కు బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనూ అత్యాచార బాధితురాలి ప్రియుడిగా భావిస్తున్న 25 ఏళ్ల వ్యక్తికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. మైనర్ అయిన బాలిక తన ఇష్టప్రకారమే అతడితో వెళ్లాలని చెప్పడంతో జస్టిస్ షిండే అప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
తండ్రి స్నేహితుడి ఘాతుకం
చేవెళ్ల: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం ఇంటికి వెళ్లాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఖానాపూర్‌లో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి(55), బాధితురాలి తండ్రితో కలిసి స్థానికంగా కూలీ పనులు చేస్తుంటాడు. ఒకే గ్రామం కావటంతో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. అయితే, బుధవారం మద్యం మత్తులో ఉన్న జనార్దన్‌రెడ్డి బాలిక తండ్రి కోసం ఇంటికి వెళ్లాడు. ‘మీ నాన్న లేడా అని బాలికను ప్రశ్నించాడు. ఇంట్లో ఎవరులేరని, అమ్మానాన్న పనిమీద బయటకు వెళ్లార’ని బాలిక అతడికి చెప్పింది. దీంతో బాలిక ఒంటరిగా ఉందని గమనించిన జనార్దన్‌రెడ్డి ఆమె చేయి పట్టుకొని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రం ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి పోలీసులకు పిర్యాదు చేశారు. సీఐ బాలకృష్ణ నిందితుడు జనార్దన్‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
దారుణం: 9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు...!
చెన్నై: సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 14 సంవత్సరాల బాలుడు అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించడంతో కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక మూడవ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదవండి: జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై అభం శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేసిన బాలుడు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెతోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపంతో బాలిక తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు గ్రామంలోకి వచ్చిన బాలుడు తోటలో బాలిక అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు బాలికను ఎమ్‌జీఎమ్‌జీహెచ్ ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. చదవండి: అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు -
తెరపైకి రిషితేశ్వరీ కేసు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల తరువాత రిషితేశ్వరీ ఆత్మహత్య కేసు మళ్లీ తెర మీదకి వచ్చింది. ర్యాగింగ్ కారణంగా వేధింపులు ఎదుర్కొవడంతో ఆర్టిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ర్యాగింగ్ ఎదుర్కొనే సమయానికి రిషితేశ్వరీ మైనరే కాబట్టి తిరిగి ఈ కేసుపై విచారణ జరిపి పోక్సోచట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసులకోవాలని పోక్సోకోర్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రిషితేశ్వరీ మేజర్ కావడంతో గతంలో విచారణకు పోక్సో న్యాయస్థానం అంగీకరింలేదు. అయితే పోక్సోచట్టం తీరును హైకోర్టు తప్పుబట్టింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) వేధింపులు ఎదుర్కున్న సమయంలో ఆమె మైనరే కాబట్టి ఈ కేసు ఫోక్సో చట్టం కిందకే వస్తుందని, ఫోక్సో చట్టం కిందే నిందుతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలోని హాస్టల్ గదిలో రిషితేశ్వరీ సీనియర్ల ర్యాంగింగ్ కారణంగా ఆత్మహత్యకి పాల్పడింది. రిషితేశ్వరీ పై చరణ్ నాయక్, ఎన్.శ్రీనివాస్, నాగలక్ష్మి వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో వారిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై రిషితేశ్వరీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న కారణంగా పోలీసులు కాలేజీ ప్రిన్సిపాల్ బాబురావుపైనా కూడా కేసు నమోదు చేశారు. దీనిపై 2016 జనవరి 7న పోక్సోకోర్టు విచారణ చేపట్టింది. (‘టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’) -
బాలిక గొంతుకోసిన యువకుడు
పెద్దవడుగూరు: బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడు ఆమె ప్రతిఘటించడంతో కత్తిపీటతో గొంతు కోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలివీ.. గుత్తిలో 10వ తరగతి చదువుతున్న బాధిత బాలిక లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూ ఉపాధి హామీ పనులకు వెళ్లిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు (18) అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. కొద్దిరోజులుగా వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులకు చెబుతానని యువకుడ్ని హెచ్చరించింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు శుక్రవారం ఉదయం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించటంతో పక్కనే ఉన్న కత్తిపీటతో ఆమె గొంతు కోస్తుండగా.. స్థానికులు చేరుకోవడంతో పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అతడిని గ్రామ శివార్లలో అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
కీచక టీచర్: అశ్లీల వీడియోలు చూపిస్తూ
సాక్షి, విశాఖపట్నం: విద్యాబుద్ధులు బోధించే టీచర్లే పెడదోవ పడుతున్నారు. క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మంచీచెడూ వ్యత్యాసాలు తెలిసిన వాళ్లే తప్పుదారి పడుతున్నారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాల్సిన వారి దగ్గరే పిల్లలకు కనీస రక్షణ కరువైన దుస్థితి ఏర్పడుతోంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెస్తున్న టీచర్ల ఉదంతం రోజుకొకటి వెలుగు చూడటం కలకలం రేపుతోంది. (కీచక హెచ్ఎంను చితకబాదిన తల్లిదండ్రులు) తాజాగా శుక్రవారం అనకాపల్లిలో మరో కీచక టీచర్ బయటపడ్డాడు. ఉడ్‌పేట ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన విద్యార్థినులకు సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో ఓ బాధిత విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.(విద్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న హెచ్ఎం) చదవండి: మాస్టారు నీచత్వం -
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
-
చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష
చిత్తూరు అర్బన్: ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేసు వివరాలను ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.లోకనాథరెడ్డి, మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వచ్చింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికపై మదనపల్లెలోని బసినికొండకు చెందిన మహ్మద్ రఫీ (25) కన్ను పడింది. లారీడ్రైవర్ అయిన రఫీ ఆమెకు ఐస్‌క్రీమ్ ఆశ చూపించి కల్యాణమండపంలో ఉన్న బాత్రూమ్కు తీసుకెళ్లాడు. పాప అరవకుండా గట్టిగా నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత చిన్నారనే కనికరం కూడా లేకుండా గొంతునులిమి చంపేశాడు. మృతదేహం కన్పించకుండా కల్యాణ మండపం పక్కన పడేసి వెళ్లిపోయాడు. రాత్రంతా పాప కోసం గాలించిన తల్లిదండ్రులు మరుసటిరోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు కల్యాణ మండపం ప్రహరీ పక్కనున్న ఓ గుంతలో పాప మృతదేహం లభించింది. అక్కడి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని రూపొందించి సమీప ప్రాంతాల్లోని ప్రజలను విచారించగా రఫీ ఘాతుకం బట్టబయలయ్యింది. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పరారీలో ఉన్న రఫీని పట్టుకుంది. నవంబర్ 16వ తేదీన పోలీసులు అతన్ని అరెస్టు చేసి మదనపల్లె జూనియర్ మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడని, ఆ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జువైనల్ హోమ్‌లో కూడా ఉన్నట్లు విచారణలో గుర్తించారు. వివరాలు వెల్లడిస్తున్న ఏపీపీ, డీఎస్పీ 72 పేజీల తీర్పు... - న్యాయమూర్తి మొత్తం 72 పేజీలలో తన తీర్పు వెలువరించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 (జే) (4) రెడ్‌విత్ సెక్షన్ 6 ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. - మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 376–ఏ, 376–ఏబీ ప్రకారం, పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డందుకు పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎం) రెడ్‌విత్ సెక్షన్ 6 ప్రకారం జీవితఖైదు, రూ.1,000 జరిమానా విధించారు. - హత్యానేరానికి గానూ ఐపీసీ 302 ప్రకారం యావజ్జీవ కఠినకారాగార శిక్ష విధించారు. - మృతదేహం దొరక్కుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినందుకు ఐపీసీ 201 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. - ఈ దారుణ నేరానికి పాల్పడినందుకు తుదిగా ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ అప్పటికే తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చిన్నారి హత్యకేసు విచారణ చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు పోలీసులు 17 రోజుల్లోనే అన్ని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో నేరాభియోగపత్రాన్ని (చార్జిషీట్) దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్ 12వ తేదీన విచారణ ప్రారంభించిన పోక్సో కోర్టు.. నిందితుడు అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి తీర్పునిచ్చింది. హేయమైన నేరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్యచేయడం హేయమైన, నీచమైన నేరంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. రఫీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. అంతేగాకుండా రూ.3 వేల జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 9 నెలల జైలు శిక్ష అనుభవించాలని 72 పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. తీర్పు ప్రతులను హైకోర్టుకు పంపుతామని, ఉరిశిక్ష తేదీని హైకోర్టు ఖరారు చేస్తుందని న్యాయమూర్తి వెంకట హరినాథ్ తెలిపారు. తనపై భార్య, తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని తీర్పుకు ముందు రఫీ వేడుకున్నా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. పోక్సో చట్టం కింద మొదటి మరణ శిక్ష: హోం మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద పడిన మొదటి మరణ శిక్ష ఇది అని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. ‘చిత్తూరు సెషన్స్ కోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఐదు సంవత్సరాల బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో అరెస్టయిన నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది..’ అంటూ ట్వీట్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసి, నిందితుడికి ఉరి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు చేసిన కృషిని ప్రశంసిస్తూ హోం మంత్రి మరో ట్వీట్ చేశారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పని చేశారు: డీజీపీ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో అభినందించారు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం కల్పించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టం అమలులోకి రావడానికి ముందే కేసు నమోదు, దర్యాప్తు, విచారణలో పోలీసులు తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. చిత్తూరు ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్డీపీఓ కె.రవిమనోహరాచారి, పోలీస్ సిబ్బందిని డీజీపీ అభినందించారు. -
ప్రేమిస్తావా.. యాసిడ్ పోయాలా!
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రేమిస్తావా లేక యాసిడ్ పోయాలా అంటూ ఓ యువకుడు నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను నిత్యం వేధించడంతో పాటు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను జలాల్పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు తనను ప్రేమించాలని నిత్యం వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రవి బుధవారం రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు వచ్చి రవిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు రవిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రవి ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
హద్దులు దాటిన ప్రేమ.. పెళ్లి కాకుండానే
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : తొందరపాటు నిర్ణయాలతో ఆ ప్రేమికులు పెళ్లి చేసుకోకనే ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి యువతి గర్భం దాల్చింది. పెద్దలకు చెప్పకుండా, అనుమానం రాకుండా చూసుకున్న యువతికి ఏడవ నెలలోనే పురిటినొప్పులు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకముందే తానే కారణమంటూ ఓ యువకుడు పోలీసులను కలిసి ఒప్పుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఉరవకొండ పట్టణానికి చెందిన యువతి, యువకుడి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలా శారీరకంగానూ కలుస్తుండటంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఇంట్లో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది. రోజురోజుకూ ఆమె శరీరంలో మార్పులు వస్తున్నా తల్లిదండ్రులూ గమనించలేకపోయారు. ఏడు నెలల గర్భంతో ఉన్న యువతికి నొప్పులు రావడంతో తల్లి అనుమానం వచ్చి గట్టిగా మందలించింది. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఆ యువతి మగబిడ్డను ప్రసవించింది. విషయం తెలియగానే యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువతిని ప్రేమించింది తానేనని ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బాధిత యువతి నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు. (కూతురు క్యారెక్టర్‌ను అనుమానించి..) ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు తలుపుల: ప్రేమ పేరుతో కొందరు యువకులు బాలికల వెంటపడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలిసినా మందలించినా వినకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తలుపుల మండలం కొత్తపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు సమీప గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అలా రోజూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో కలుసుకునేవారు. రెండు రోజుల కిందట మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత శనివారం రాత్రి గ్రామ సమీపంలోని వదిలేసి వెళ్లిపోయాడు. బాలికను మోసం చేసి తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్‌కుమార్‌రెడ్డిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ మధు ఆదివారం తెలిపారు. (ఆ తప్పటడుగే యువతి ప్రాణం తీసింది) యువకుడిపై పోక్సో కేసు అనంతపురం న్యూసిటీ: తొమ్మిదో తరగతి అమ్మాయిని వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురంలోని సాయినగర్ 5వ క్రాస్‌లో ఉంటున్న ఎ.హుస్సేన్ జీసస్నగర్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వారం రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు. బాలిక ఎక్కడికి వెళ్లినా ప్రేమించాలంటూ వెంటబడుతున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ ఎం.శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య గుత్తి: ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి 1వ బ్లాక్ వార్డు వలంటీర్ రమా భార్గవి (23), ఇదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ ఇమామ్ హుసేన్(మసి) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇమామ్ హుసేన్‌కు పది రోజుల కిందట మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమాభార్గవి మదనపడుతుండేది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో తాను జీవించడం వ్యర్థమని భావించి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటి తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి రమాభార్గవిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమా భార్గవి మృతికి వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు. -
‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ
గుమ్మఘట్ట: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ మారుమూల గ్రామాల్లో సైతం సకాలంలో సేవలను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ బాలిక అర్ధరాత్రి వేళ దిశ యాప్ ద్వారా రక్షణ పొందింది. స్థానిక ఎస్ఐ తిప్పయ్యనాయక్ తెలిపిన పూర్తి వివరాల మేరకు.. గుమ్మఘట్ట మండలంలోని 75–వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఊరు ఊరంతా ఉత్సవంలో పాల్గొంది. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడారు. ఓ 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తోండడంతో రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలో ఉన్న ఇంటికి వెళ్లసాగింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్ (21) అనే యువకుడు వెంటపడ్డాడు. కోరిక తీర్చాలని చెయ్యి పట్టుకున్నాడు. అమ్మాయి చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టింది. వెంటనే తక్షణ సాయం కోసం ‘దిశ యాప్’కు మెసేజ్ చేసింది. ఆ లోపు అటువైపు ఇంటికి వెళ్తున్న బాలిక చిన్నాన్న ఈ ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు. విజయవాడ ‘దిశ’ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితురాలి సమాచారం అందింది. అక్కడి నుంచి రాయదుర్గం రూరల్ సీఐ పి.రాజ, ఎస్ఐ తిప్పయ్యనాయక్‌లను ఎస్పీ అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మారుమూల గ్రామాల్లోని యువతులు కూడా ‘దిశ యాప్’ గురించి తెలుసుకోవడం వల్లే నిందితున్ని వెంటనే పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. -
బాలికతో వివాహం.. ఆపై వేధింపులు
రసూల్‌పురా: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆపై సహజీవనం చేశాడు. అనంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో ఓ యువకుణ్ని కార్ఖాన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మధుకర్‌స్వామి కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అనీల్ (21) కొంతకాలంగా నగరంలోని మారేడుపల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారానికి చెందిన ఓ బాలికతో (ప్రస్తుతం మేజర్) ఫేస్బుక్లో గత ఏడాది మార్చిలో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఏడాది మే నెలలో ఓ ఆలయంలో వివాహం చేసుకుని సహజీవనం చేశాడు. కొద్దికాలంగా ఆమెను వేధిస్తుండటంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కార్ఖాన పోలీసులు మారేడుపల్లిలో ఉంటున్న అనీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకున్న సమయంలో బాధితురాలు మైనర్ అని తేలడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కీచక గురువు..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించాడు. విద్యార్థులను మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడగా వారు కుటుంబ సభ్యులకు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. ఆదిలాబాద్ పట్టణంలోని రైతుబజార్ ఎదుట గల క్రీసెంట్ కళాశాల ప్రిన్సిపల్ రఫీ విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బాధిత విద్యార్థినులు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కళాశాల ఎదుట సైతం ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులు, వారి బంధువులను సముదాయించారు. విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కళాశాలకు రానివ్వకుండా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని నెలరోజులుగా కళాశాలకు రానివ్వకుండా ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తరచుగా ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురును మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతోపాటు అదే కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వేధింపులకు పాల్పడుతున్నారని, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారని వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు.. ఇటీవల మహిళలపై అత్యాచారం, హత్యలు చోటుచేసుకుంటున్న సందర్భంలో సరస్వతీ నిలయాల్లోనూ విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. ఆదిలాబాద్ పట్టణంలోని క్రీసెంట్ కళాశాల ప్రిన్సిపల్ రఫీపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు, విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు సెక్షన్ 354, 12పోక్సో కేసులను నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళన.. విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్, కళాశాల కరస్పాండెంట్ బిలాల్, అతని సోదరుడు జలాల్పై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్రీసెంట్ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థినులను వేధించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
కీచక ఉపాధ్యాయుడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలం తాడమళ్ల హైస్కూల్ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై 2012 పోక్స్ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
దారుణం : తాగి వచ్చి సొంత కూతురుపైనే..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో శనివారం దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నీముచ్‌కు చెందిన ఒక వ్యక్తి తన 8 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్ హెల్ప్‌లైన్ సర్వీస్‌కు ఫోన్ చేసి సమాచారమందించినట్లు పోలీసులు వెల్లడించారు. 'అతను నిత్యం తాగి వచ్చి తన కూతురును చితకబాదేవాడు. శనివారం కూడా తాగి వచ్చి కూతురుపై అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. మేము అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో పాప ఒక్కతే ఉందని' జిల్లా ఎస్పీ రాకేష్ మోహన్ శుక్లా పేర్కొన్నారు. వెంటనే బాధితురాలిని మెడికల్ పరీక్ష నిర్వహణకు ఆసుపత్రికి తరలించగా సదరు బాలిక లైంగిక దాడికి గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సత్వర విచారణ జరిపేందుకు జిల్లా సెషన్స్ జడ్జి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ : నగరంలోని పోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కాగా, 2017లో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పోక్సో యాక్ట్ కింద కృష్ణారావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న తరుణంలో పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సాక్షి, మహేశ్వరం: కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నా యి. తాజాగా ఓ దుర్మార్గుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సోమవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా పొరుగింటికి చెందిన మోడి చందు(21) ఆమె వద్దకు వచ్చాడు. మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశాడు. అనంతరం అతడు ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా బాలిక తల్లి గమనించి యువకుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. కూతురిని పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అదే రోజు రాత్రి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్ననాయక్ తెలిపారు. -
ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా,నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉన్న జిల్లాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేసింది. -
శీలానికి వెల కట్టారు..
సాక్షి, అమరావతి : అమ్మాయి జీవితం నాశనమైందన్న బాధ వారిలో ఏకోశానా లేదు. అందుకు కారణమైన వారిని శిక్షించాలన్న కసి తల్లిదండ్రుల్లో కనిపించలేదు. ప్రేమ పేరుతో మోసగించి.. వేధించిన నిందితుడి వర్గీయులు, బాధితురాలు ఒకే సామాజిక వర్గానికి వారు కావడంతో ‘డబ్బు’ తో కేసు రాజీ కుదుర్చుకున్నారు. ఇరు కుటుంబాలు ఉన్నతస్థాయికి చెందినవి కావడం .. పరువుపోతుందని భావించడంతో వారంతా షరతులతో రాజీకి సిద్ధపడ్డారు. భవిష్యత్‌లో నిందితులు తమ కుటుంబం జోలికి రాకుండా షరతులు రూపొందించుకున్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహం పేరిట లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు.. అందుకు కారణమైన ప్రధాన సూత్రధారి అయిన అతడి స్నేహితుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. పోలీసులపై ఒతిళ్లు రావడంతో వారు కూడా ‘సామాజిక న్యాయం’ చేసేశారు. ఇటీవల నగరంలో సంచలనం రేకెత్తించిన లైంగిక వేధింపుల కేసును ఇరువర్గాలు అటకెక్కించేసిన తీరు నగరంలో చర్చనీయాంశమైంది. యువతి నయవంచనకు గురైందిలా.. సరిగ్గా నెల రోజుల కిందట ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి వచ్చింది. తన కుమార్తెపై ఓ యువకుడి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో మాచవరం ప్రాం తంలో ఉన్న ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లిన యువతికి అతని స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ యువకుడిని నమ్మింది. ఇద్దరూ హద్దులు దాటేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత ఆ యువకుడు చదువు నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గతంలో తాము తీసుకున్న నగ్న చిత్రాలను ఆ యువకుడు సూర్యారావుపేటలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్లో షేర్ చేశాడు. తన స్నేహితుడు పంపిన ఫోటోలను చూపి యువతిని ఆ యువకుడు బెదిరించడం ప్రారంభించాడు. చివరకు అతడి బెదిరింపులకు ఆ యువతి భయపడి అతడికి లొంగిపోయింది. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించసాగాడు. ఆఖరకు డబ్బులు సైతం డిమాండ్ చేసి దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసుకున్నాడు. అయినా ఆ యువకుడి బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి గత నెలలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులోకి టీడీపీ నేతలు కొందరు రంగప్రవేశం చేసి కేసును నీరుగార్చేందుకు యత్నించారు. చివరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని మాచవరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజీతో కేసు నీరుగార్చారు.. ఈ కేసులో అసలు సూత్రధారి ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని తెలిసిన పోలీసులు అతడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తొలుత తాము చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి ఎంతో జాగ్రత్తపడ్డ టీడీపీ నేతలు ‘సామాజిక వర్గం’ కార్డును ఉపయోగించారు. పంచాయతీ టీడీపీ అధినేత వద్ద పెట్టినట్లు సమాచారం. నిందితుడిని రక్షించే యత్నం.. వాస్తవానికి ఆస్ట్రేలియాకు విద్యాభ్యాసం కోసం వెళ్లిన నిందితుడిని పోలీసులు ఇక్కడికి రప్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ కేసు పెట్టిన బాధితులు, నిందితుల వర్గీయులతో రాజీకి రావడంతో లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తమ కుమారుడి భవిష్యత్ అంథకారం కాకూడదన్న నిర్ణయానికి వచ్చిన నిందితుడి తల్లిదండ్రులు బాధితురాలి కుటుంబసభ్యులు అడిగినంతా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దానికి అంగీకరించిన యువతి కుటుంబసభ్యులు షరతులపెట్టి డబ్బు తీసుకోవడమే కాకుండా వారి తో అగ్రిమెంటు సైతం రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా నుంచి రప్పిస్తాం.. లైంగిక దాడి కేసులో నిందితులను వదిలే ప్రసక్తే ఉండదు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడిని రప్పించే యత్నాలు చేస్తున్నాం. కేసులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావివ్వం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, సీపీ -
అత్యాచార నిందితుడి అరెస్టు
సాక్షి యాలాల(హైదరాబాద్) : జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదుతో పాటు అత్యాచార కేసును నమోదు చేసినట్లు చెప్పారు. యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డితో కలిసి విశ్వనాథ్‌పూర్ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన అనంతరం జరిగిన పరిణామాలను బాధితురాలి తల్లిని అడిగి తెలుసుకున్నారు. సమాజానికి చీడగా మారిన ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మతిస్థితిమితం లేని బాలికపై నక్కల శేఖర్ అత్యాచారం చేసిన ఘటనతో గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని పలువురు గ్రామస్తులు పోలీసుల ఎదుట వాపోయారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఇంటి వద్ద మారణా యుధాలతో సంచరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ నిందితుడి కుటుంబసభ్యులు దౌర్జన్యానికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. నిందితుడికి కోర్టులో కఠినశిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. త్వరలో గ్రామంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిందితుడు శేఖర్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట సర్పంచ్ సత్యమ్మ, వైస్ ఎంపీపీ పసుల రమేశ్ ఉన్నారు. -
కన్న కూతుళ్లపై అత్యాచారం;గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన తల్లి
లక్నో : సమాజంలో నైతిక విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తన మన తేడా లేకుండా కొందరు మానవ మృగాలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి కన్న కూతురుపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది కేవలం ఒక్కరోజు, రెండు రోజులు జరిగిన ఘటన కాదు. ఏకంగా 15 సంవత్సరాలపాటు కొనసాగింది. దీనికితోడు బాధితురాలి తల్లి కూడా భర్తకే మద్దతు తెలపడం మరింత ఘోరం. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాలు.. లక్నోకు చెందిన ఓ యువతి(21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు(6) పై కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన సోదరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చింది. ఇంట్లో జరుగుతుందంతా తల్లికి తెలిసినప్పటికీ నోరు మెదపకపోవడంతో పాటు తండ్రికి సహకరిస్తూ తనకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది. దీంతో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో)2012 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు. ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నపుంసకులుగా మార్చాలి: కిరణ్ ఖేర్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్ఎల్పీ సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సూచించారు. -
దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..
సాక్షి, పామూరు(ప్రకాశం) : తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బుధవారం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలిక తమ గ్రామానికి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వాగుకు బహిర్భూమికి వెళ్లింది. ఈ సందర్భంలో బాలికకు అన్న వరసయ్యే అయ్యే యువకుడు జడ సునీల్ మాట్లాడాలంటూ బాలికను సమీపంలోని తెల్లరాయి క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోగా బాలిక వారించింది. అనంతరం యువకుడు గ్రామానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులు కొడవటికంటి బాబు, శేషం భానుప్రసాద్‌లకు ఫోన్ చేసి పిలిపించాడు. ముగ్గురూ ఆమెను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడంతో ఆమె ఇంట్లో కూడా విషయం చెప్పలేదు. రోజూ యథావిధిగా పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మరలా 30వ తేదీ మంగళవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో అటకాయించారు. తమతో రావాలని, లేదంటే విషయం గ్రామంలో చెబుతామని బెదిరించారు. భయపడుతూ వడివడిగా పాఠశాలకు వెళ్లిన బాలికి ఇంటికి తిరిగి వచ్చాక విషయం తల్లితో చెప్పింది. బందువులతో కలిసి తల్లి బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఎస్సై అంబటి చంద్రశేఖర్ నిందితులు ముగ్గురిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి కోరింది. నిందితుడు బాలికకు పరిచయస్తుడేనా..? నిందితుల్లో శేషం భానుప్రసాద్‌కు వివాహితుడు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు బేల్దారీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కాగా జడ సునీల్‌తో బాలిక కొన్ని మాసాలుగా సన్నిహితంగా ఉంటున్నట్టు గ్రామస్తులు, చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఘటనపై సోమ, మంగళవారాల్లో గ్రామంలో రాజీ యత్నాలు జరిగినట్లు, ఘాతుకానికి పాల్పడ్డ వారిలో ఒకరిని వివాహానికి ఒప్పించే యత్నాలు చేయగా అవి బెడిసి కొట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. -
జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర నిధులతో ఏర్పాటయ్యే ఈ కోర్టులు ప్రత్యేకంగా పోక్సో కేసులను మాత్రమే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి అవగాహన కల్పించేలా, అలాంటి నేరాలు శిక్షార్హమని తెలిపేలా ఒక చిన్న వీడియోను అన్ని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు చూపాలని ఆదేశించింది. అన్ని టీవీ చానళ్లలోనూ తప్పనిసరిగా ఆ క్లిప్పింగ్‌ను చూపాలని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ నంబరును పొందుపర్చాలని పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకుంటోం దని సీనియర్ న్యాయవాది గిరి పేర్కొనడంపై స్పందిస్తూ.. ప్రతీ జిల్లాలో పోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. పోక్సో కేసుల నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. జడ్జీల నియామకం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బంది, చిన్నారులకు అనుకూలంగా ఉండే కోర్టు భవనాల్లో మౌలిక వసతులు.. ఇవన్నీ కేంద్ర నిధుల ద్వారానే జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. -
‘ఆ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు’
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులపై లైంగిక దాడుల కేసుల సత్వర విచారణకు పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వందకు పైగా పెండింగ్ కేసులున్న ప్రతి జిల్లాలో ఈ తరహా కోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టులు పనిచేయడం ప్రారంభించేందుకు 60 రోజుల డెడ్‌లైన్‌ను నిర్దేశించింది. ఇలాంటి కోర్టుల ఏర్పాటుకు కోసం కేంద్రం తగినన్ని నిధులను కేటాయించాలని సూచించింది. న్యాయమూర్తులు, సిబ్బంది, ప్రత్యేక ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టాలని కోరింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది. చిన్నారులపై లైంగిక దాడికి సంబంధించి దాదాపు 1.5 లక్షలకు పైగా కేసుల విచారణకు ప్రస్తుతం కేవలం 670 పోక్సో కోర్టులే ఉన్నాయని అమికస్ క్యూరీ గిరి, సుప్రీం కోర్టు రిజిస్ర్టీ నివేదిక సమర్పించిన మీదట కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఒక న్యాయమూర్తి రోజుకు సగటున 224 కేసులను పర్యవేక్షిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఏడాదిలోపు పోక్సో కేసులు పరిష్కారం కావాలంటే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న సిబ్బందికి మూడు రెట్లు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. కాగా చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్షను ఖరారు చేస్తూ రాజ్యసభ బుధవారం పోక్సో చట్ట సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. -
‘హర్నాథ్ జీ.. పద్ధతిగా మాట్లాడండి’
న్యూఢిల్లీ : పోక్సో చట్టం-2019 బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీకి చెందిన ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ హర్‌నాథ్‌సింగ్ యాదవ్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ‘లైంగిక దాడులు ఎక్కడ జరుగుతున్నాయి.. ఈ లైంగిక నేరస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించుకుంటే సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. మనం సమాజానికి ఏం అందిస్తున్నామో.. దాన్నే తిరిగి పొందుతున్నాం’ అన్నారు. ‘ఓసారి నా స్నేహితుడు నా వద్దకు వచ్చి పోర్నోగ్రపీ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను పాప్‌కార్న్ గురించి విన్నాను. కానీ పోర్న్ గురించి ఎప్పుడూ వినలేద’న్నారు హర్నాథ్ సింగ్. ఇక సోషల్ మీడియా, మీడియా ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో ఆయన ఓ ఉదాహరణ ద్వారా చెప్పారు. ‘పిల్లలకు సత్య హరిశ్చంద్రుడి సినిమా చూపిస్తే.. మంచి మనిషిగా మారడం ఎలాగో వాళ్లకి తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకు ‘మున్నీ బద్నాం హూయి’, ‘చిక్నీ ఛమేలీ’ వంటి పాటలు చూపిస్తున్నాం. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి సత్యహరిశ్చంద్ర, ఈ సినిమా పాటల్లో ఏవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి’ అంటూ హరినాథ్ కాసేపు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఆయనకు స్ట్రాంగ్ క్లాస్ తీసుకున్నారు. హర్నాథ్ మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్న స్మృతి.. సభలో మాట్లాడే పద్దతి ఇది కాదన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘హర్నాథ్ జీ.. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆందోళన వ్యక్తం చేయాలనకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా.. పద్ధతిగా మాట్లాడండి. ఈ సభను దేశం మొత్తం చూస్తోంది. ఇక్కడ సభలో ఎంతో మంది మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు మీ సమస్యను చెప్పాలనుకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి’ అంటూ స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ
న్యూఢిల్లీ: ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. కోల్‌కతాలో టెన్నిస్ ప్రాక్టీస్‌కు వెళ్లి తిరిగి వస్తున్నా. నిక్కర్, టీ షర్ట్ వేసుకుని ఉన్నా. ఇంటికి వెళ్లేందుకు చాలా రద్దీగా ఉన్న బస్ ఎక్కాను. ఎవరో తెలీదు. కానీ నన్ను ఆ రద్దీలో నన్ను లైంగికంగా వేధించారు. కొన్నేళ్ల తరువాత ఒక సందర్భంలో మా ఇంట్లో చెప్పాను’.. ఈ వ్యాఖ్యలు చేసింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రఖ్యాత క్విజ్ మాస్టర్ డెరెక్ ఓ బ్రెయిన్. పోక్సో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్ట సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ బాధాకర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలపై దారుణంగా లైంగిక నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా ప్రతిపాదన ఉన్న ఈ బిల్లుకు డెరెక్ మద్దతు తెలిపారు. మిగతా పార్టీల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. బిల్లులోని సవరణలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. లోక్‌సభకు బిల్లు పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్ కేసుల విచారణకు 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. -
ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్ కోర్టు ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు వీలుగా సంబంధిత కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. చిన్నారులను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో లైంగిక దాడి తీవ్రతను నమోదు చేయరాదు. అది దర్యాప్తు జరిగిన తరువాత నిర్ధారించే బాధ్యతను న్యాయస్థానానికి వదిలిపెట్టాలి. ఎందుకంటే ముందే దాడి తీవ్రతను తక్కువగా చూపితే తరువాత దర్యాప్తులో వాస్తవాలు వెల్లడై తీవ్రమైన దాడిగా వెలుగులోకి రావొచ్చు. ప్రత్యేక కోర్టులను డిజిటలైజ్ చేయడం ద్వారా విచారణ వేగవంతమవుతుంది. న్యాయం త్వరగా అందుతుంది. ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక క్రిమినల్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఏసీబీ కోర్టు, సీబీఐ స్పెషల్ కోర్టు తరహాలో చిన్నారుల లైంగిక దాడుదల నుంచి రక్షించేందుకు పోక్సో కోర్టు ఉండాలి. ఢిల్లీ వంటి నగరాల్లో పెరుగుతున్న నేరాల దృష్ట్యా చిన్నారులపై దాడులను అరికట్టేందకు కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. అనేక కేసులు పెండింగ్‌లో ఉండడం కూడా కలవరపెడుతోంది. వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..’ అని పేర్కొన్నారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మూడు ముఖ్యమైన సూచనలు చేశారు. లైంగిక అత్యాచారాలకు సంబంధించి ఫలానా చర్యలు మాత్రమే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం వర్గీకరించడం తగదని అన్నారు. నేర తీవ్రతను గుర్తించే బాధ్యతను ఆయా కేసులను విచారించే న్యాయ స్థానాల విచక్షణకు వదిలేయాలని సూచించారు. అలాగే ఈ తరహా కేసులను విచారించే ప్రత్యేక న్యాయ స్థానాలను అధునీకరించి, డిజిటలైజ్ చేయడం వలన బాధితులకు సత్వర న్యాయం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెబుతూ విజయసాయి రెడ్డి ప్రస్తావించిన అంశాలపై స్పందించారు. అత్యాచార నేర స్వభావాన్ని వర్గీకరించవలసిన ఆవశ్యకతను ఆమె వివరిస్తూ బిల్లులో పొందుపరిచిన అంశాలను సమర్ధించారు. -
చెల్లెలిపై అన్న లైంగికదాడి
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : మైనర్ చెల్లెలిపై అన్న లైంగికదాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ వెంకటరమణ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య, ఆమె కుమారుడు ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్నారు. రెండో భార్య, ఆమె కుమార్తె(మైనర్ బాలిక) కొత్తచెరువులో ఉంటున్నారు. కుటుంబ యజమాని తన రెండో భార్యను తీసుకుని బెంగళూరుకు వలస వెళ్లాడు. మైనర్ బాలిక ప్రతి రోజూ ధర్మవరం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేసి రాత్రికి కొత్తచెరువుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం మొదటి భార్య కుమారుడు తన తల్లి ఊళ్లో లేకపోవడంతో బట్టల దుకాణం నుంచి కొత్తచెరువుకు వెళ్లేందుకు రహదారిపై ఉన్న చెల్లెలు(మైనర్ బాలిక)ను తన వెంట ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి బాధిత బాలిక పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతనికి ఇదివరకే వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య విడిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
సాక్షి,నిజామాబాద్: జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. శ్రావణ్ అనే యువకుడు చిన్నారి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సరదగా జెట్ స్కై రైడ్‌కు వెళ్లిన బాలికపై...
సాక్షి, ముంబై : సరదాగా గడపడానికి విహార యాత్రకు వెళ్లిన తల్లీ కూతుళ్లకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన మహిళ తన ఏడేళ్ల కుమార్తెతో మాల్ధీవులకు సరదాగా గడిపేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారు జెట్ స్కై రైడ్‌కి వెళ్లాలనుకున్నారు. అయితే స్కైరైడ్‌కి ఒకేసారి ఇద్దరు వెళ్లాడానికి వీలు లేకపోవడంతో ఆ మహిళ తన కుమార్తెను డ్రైవర్ వెంట పంపించింది. రైడింగ్‌లో బాలిక ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ తన వక్రబుద్ది చూపించి, బాలికను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత జెట్ నుంచి తిరిగి వస్తున్న బాలిక ఆందోళనగా కనిపించడంతో తల్లి అనుమానించింది. దీంతో మహిళ కుమార్తెను ప్రశ్నించగా ‘జెట్ స్కై డ్రైవర్ తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని’ బాలిక తెలిపింది. డ్రైవర్ నిర్వాకంపై వారు మాల్దీవుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు బాలిక తల్లికి తెలిపారు. అయితే ఆరోజే వారు తిరిగి ముంబై రావాల్సి ఉండటంతో వైద్య పరీక్షలు ముంబైలో నిర్వహిస్తానని పోలీసులకు చెప్పి ఫిర్యాదు పత్రాన్ని తిసుకుని తిరిగి ముంబైకి బయలుదేరారు. మాల్దీవుల నుంచి ఇంటికి చేరుకున్న మహిళ శనివారం ఉదయం జూహులోని కూపర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తన కుమార్తెను తీసుకుని వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లాక వారిని గంటల కొద్ది వేచిఉంచారని, పరీక్షల కోసం అటు ఇటు తిప్పి చివరకు మైనర్ బాలికకి వైద్య పరీక్షలు చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని వారితో చెప్పినట్లు బాలిక తల్లి తెలిపింది. తన వద్ద మాల్దీవ్ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం ఉన్నప్పటికి ఆస్పత్రి వారు మహిళా కానిస్టేబుల్ లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని బుకాయించినట్లు ఆమె తెలిపింది. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురై ఆస్పత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల బాధిత బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. -
32 రోజుల్లోనే ‘మరణ శిక్ష’ తీర్పు
భోపాల్: మైనర్ బాలికను రేప్ చేసి చంపిన కేసుతో పాటు మరో లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో దోషికి మధ్యప్రదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. గత నెల 8న విష్ణు బమోరా(32), ఓ బాలికను (12) రేప్ చేసి చంపేశాడు. ఈ బాలికతో పాటు మరో ఎనిమిదేళ్ల బాలికపై అసహజ లైంగిక దాడి చేసినందుకు పోలీసులు పోక్సో, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద భోపాల్‌లో ప్రత్యేక జడ్జి కుముదిని పటేల్ ఈ కేసును విచారించారు. 30 మంది చెప్పిన సాక్ష్యాలను, ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన డీఎన్ఏ రిపోర్టులను పరిశీలించారు. వీటితో పాటు పోలీసులు గత నెల 12న 108 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ మూడు, ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరణ శిక్షను విధించారని రాష్ట్ర న్యాయ శాఖ అధికార ప్రతినిధి సుధా విజయ్ సింగ్ భదోరియా తెలిపారు. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని తెలిపారు. -
మేకవన్నె మృగాడు
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. ఎక్కడో ఒక చోట నిత్యమూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు, విద్యా బుద్దలు నేర్పించే గురువులు, వయస్సుతో సంబంధం లేకుండా అకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కుపచ్చలారని బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఏటా జిల్లాలో సగటున 50 వరకు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుధవారం రాత్రి అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలలో ఐదేళ్ల బాలికపై స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన నగర వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నా.. క్షేత్రస్థాయిలో నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం వ్యవస్థ పతనావస్థకు అద్దం పడుతోంది. – అనంతపురం సెంట్రల్ నేరాల నియంత్రణకు కఠినమైన చట్టాలు అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జూన్ 20న భారతదేశం గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 సంవత్సరాలలోపు ఏ వ్యకిపైనైనా లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది. • పిల్లలపై లైంగిక అత్యాచారం చేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, అపరాధ రుసుము లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు. (ఇటీవల రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుపై ఆమోదం తెలిపారు. ) • పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులకు గురిచేస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, అశ్లీల దృశ్యాలకు, సాహిత్యానికి వాడుకుంటే ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము విధించవచ్చు. • నిపుణులకు, ప్రత్యేక అధ్యాపకులు, అనువాదకులు, వ్యాఖ్యాతలకు ఉండాల్సిన అనుభవం, అర్హతలను పొందుపరిచారు. అలాగే బాలల అత్యవసర వైద్య చికిత్స, ఆదరణ, రక్షణకు కావాల్సిన ఏర్పాట్ల గురించి, లైంగిక దాడి బాధితులైన పిల్లలకు కు ఇచ్చే నష్టపరిహారం పొందుపరిచారు. • సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న మహిళా పోలీసు అధికారి, బాధిత పిల్లలు తెలిపే విషయాలను, ప్రామాణిక న్యాయసాక్ష్యంలాగా లిఖితపూర్వకంగా భద్రపరుస్తారు. పిల్లలను పోలీసు స్టేషన్లో రాత్రి వేళల్లో ఏ కారణంగానూ ఉంచరాదు. పిల్లల నుంచి విషయాలను లిఖిత పూర్వకంగా సేకరించేటప్పుడు పోలీసు అధికారి యూనిఫాంలో ఉండరాదు. పిల్లలు ఏ మాటలతో విషయాన్ని వివరిస్తారో, అదే రీతిలో దానిని రికార్డు చేయాలి. • పిల్లల అవసరం మేరకు చెప్పిన మాటలను అనువదించడానికి సహకారం కల్పించాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులై అశక్తతకు గురైనవారైతే, వారికి ప్రత్యేక శిక్షకులు, లేదా వారిని అర్థం చేసుకునేలా చెప్పేవారి సహకారాన్ని తీసుకోవాలి. • వైద్య పరిశీలన/విచారణ సమయంలో పిల్లల తల్లి/తండ్రి కానీ, వారికి నమ్మకం కలిగిన వ్యక్తి సమక్షంలో జరపాలి. బాలిక పరిశీలన/విచారణ మహిళా డాక్టర్లు చేయాలి. • విచారణ, పరిశోధన, సాక్షి రికార్డింగ్, నేరాలను నిషేధించేటప్పుడు బాలల స్నేహ పద్ధతులను ఈ చట్టం, నిబంధనలను అందిస్తుంది. న్యాయవిచారణ జరిగే సమయంలో బాలలకు తరచూ విరామం కలిగించాలి. పిల్లలను విచారణ జరిపేటప్పుడు, మళ్లీ మళ్లీ సాక్ష్యమివ్వడానికి పిలవరాదు. పిల్లల విచారణ అనేది దాడి చేసే మాదిరిగా ఉండరాదు. వారి ప్రతిష్టకు అవమానం కలిగించేటట్లు ఉండరాదు. విచారణ అందరి సమక్షంలో కాకుండా గోప్యంగా జరపాలి. • పలు అంశాలు (బాధితురాలు గర్భవతి అయితే, లైంగిక వ్యాధులు ప్రబలితే వైద్య చికిత్సకు అవసరమైన డబ్బును బట్టి మొదలగునవి) పరిగణలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు విచారణ త్వరగా జరపాలనే ఉద్దేశ్యంతో బాలల విచారణ, విషయాలను భద్రపరిచే చర్యను 30 రోజలలోపు చేయాలి. ప్రత్యేక కోర్టు న్యాయ విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలి. • ఫిర్యాదు అందిన తక్షణమే ప్రత్యేక బాలల పోలీసు బృందం (ఎన్.జె.పి.యు) రంగంలో దిగి బాధితుల సహాయం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఆదరణ, రక్షణ కల్పించే షెల్టర్ హోం కానీ, అస్పత్రికి కానీ తరలించాలి. ఫిర్యాదు వచ్చిన తరువాత స్థానిక పోలీసు లేదా ఏస్జేపీయూ ‘బాలల సంక్షేమ సమితి’ ఎదుట 24 గంటలలోపు నివేదికను ప్రవేశపెట్టాలి. • ఈ చట్టం, నిబంధనల సదుపాయాలను జాతీయ లేదా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లు పర్యవేక్షణ చేస్తాయి. పిల్లలు సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అన్ని అసమానతల నుంచి వారిని కాపాడాలని అనుకుంటారు. రోజు వారి పనుల్లో భాగంగా చాలా మంది వ్యక్తులతో పిల్లలు సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారిలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. వారిలో ఉన్న నైజాన్ని పిల్లలు పసిగట్టగలగాలి. తద్వారా వారు ఏదైనా విచిత్రమైన పరిస్థితి లేదా వ్యక్తి తారసపడితే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇందులో భాగంగానే పిల్లలకు మంచి స్పర్శ.. చెడు స్పర్శ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. రండి, పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేందుకు చేతులు కలపండి. మంచి, చెడు స్పర్శల గురించి పిల్లలకు నేర్పండి. – సాక్షి, అనంతపురం తల్లిదండ్రులు దేని కోసం చూడాలి? పిల్లలను పెంచేటప్పుడు అప్రమత్తత అవసరం. పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టగలగాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి. వాటి సంరక్షణపై జాగ్రత్తలు వివరించాలి. చొరబాటుదారుల నుంచి వాటిని ఎలా రక్షించుకోవాలో చైతన్య పరచాలి. విందులు.. వినోదాలు అంటూ ఆహ్వానించే అపరిచితులకు ‘నో’ చెప్పమనే స్థాయికి వారిని ఎదగనివ్వాలి. శరీరంలోని వ్యక్తిగత ప్రాంతాలను తాకితే తమకు అందుబాటులో ఉన్న వారిని వెంటనే అప్రమత్తం చేయగలిగేలా తీర్చిదిద్దాలి. గట్టిగా అరవడమో.. లేదా తిరగబడి పోరాటం చేసేలా సిద్ధపరచాలి. ► మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించే చిట్కాలు లైంగిక విషయాలను పిల్లలకు తెలిసిన ఉదాహరణలతో వివరించండి. ► పిల్లలతో ముభావంగానో, టెక్నికల్గానో ఉండరాదు. ప్రశ్నించబడుతున్నట్లు వారు భావించేలా ఉండరాదు. తీవ్రమైన చర్చను వెంటనే కత్తిరించాలి. సున్నితమైన, ప్రశాంతమైన స్వరాన్ని ఉపయోగించండి. ► పిల్లలలకు తల్లిదండ్రులకు మధ్య నమ్మకమనే దృఢమైన బంధం ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకుని నచ్చచెప్పగలగాలి. మీరు వారి కోసం ఉన్నారని భావనను వారికి తెలియజేయాలి. ► చెడు స్పర్శ గురించి చాలా చిన్న పిల్లలకు బోధించేటప్పుడు పాటించాల్సిన సాధారణ నియమం ఇది. లోదుస్తులతో కప్పబడిన వారి శరీరంలోని ఏదైనా భాగాలు వారి ప్రైవేట్ ప్రాంతం అని వివరించండి, అది వారు తప్ప మరెవరూ తాకకూడదు, చూడకూడదు అనే విషయంపై పూర్తి అవగాహన కల్పించాలి. వారి శరీరాలపై ఎక్కడైనా తాకితే వారు అసౌకర్యంగా భావిస్తే మీకు తెలియజేయాలని పట్టుబట్టండి. ► మంచి స్పర్శ గొప్పగా అనిపిస్తుంది ఇది ఒక బంధం. చెడు స్పర్శ అసౌకర్యం, ఒత్తిడిని పెంచుతుంది. ► మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలకు నేర్పించేందుకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు సాధారణంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క చిత్ర ప్రాతినిధ్యాలతో ఉంటాయి. దాని నుంచి వారు వారి శరీరాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ► పిల్లలు ప్రాథమిక వివరణ కంటే దృశ్యమాన కథనాలకు అనుకూలంగా ఉంటారు. మీరు వారితో చిన్న ఆటలను ఆడవచ్చు, అక్కడ వారు సహాయం కోసం అరవడం లేదా ఎవరైనా వారిని వేధిస్తుంటే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం చేయవచ్చు. ► ఎవరైనా మీ ప్రైవేట్ భాగాలను కారణం లేకుండా తాకినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని తాకి, ఎవరికీ చెప్పవద్దని చెబితే , ఇవన్నీ చెడ్డ స్పర్శకు సంకేతాలు. ► పిల్లలతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. వారు పగటిపూట చేసిన పనిని వివరిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారు మీతో ఏదైనా పంచుకోవచ్చుననే భరోసా ఇవ్వగలగాలి. మా పని ఇంకా పూర్తి కాలేదనో, గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడం సరికాదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొంటే ఏమి చేయాలో నేర్పించాలి. నిందితులను వదిలే ప్రసక్తే లేదు ఆడపిల్లలపై అత్యాచార యత్నాలు, అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. క్రూరులను వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. అనంతపురంలో గురువారం జరిగిన ఘటన చాలా దారుణమైనది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తా. – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం చావు తప్పదన్న భయం ఉండాలి ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. కొన్ని నెలలు జైలులో ఉండి బయటకు వస్తామనే భావన వారిలో ఏ మాత్రం రానివ్వరాదు. తప్పు చేస్తే మరణశిక్ష పడుతుందనే భయం ఉండాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ఎలా శిక్షించారో.. ఆ తరహా శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అనంతపురం ఘటనను ఖండిస్తున్నా. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల కఠిన చర్యలు తప్పవు బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నాయి. లైం గిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం మారిన చట్టం ప్రకారం ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. జిల్లాలో బాలికల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. – బూసారపు సత్యయేసుబాబు, ఎస్పీ మార్పు రావాలి మానవత్వానికి, మృగత్వానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. మానవత్వాన్ని గెలిపించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఆడపిల్లలను తనను తాను రక్షించుకునే విధంగా తయారు చేయాలి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజం కూడా ఇలాంటి వారిని బహిష్కరించాలని కోరుతున్నా. – కె. చౌడేశ్వరి, అదనపు ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం అమ్మాయిల ర క్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ము ఖ్యంగా ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం. అయినా నేరాలు జరుగుతుండడం బాధాకరం. ప్రస్తుత బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి వారి చదువుకు సహకరిస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ దురదృష్టకరం భగవంతుడితో స మానమైన ప సిమొగ్గల్ని చిదిమేస్తున్న నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ప రిస్థితులు పునరావృతం కావు. ఏదేమైనా పిల్లల భద్రత పరమైన అంశాల్లో తల్లిదండ్రుల్లో జాగ్రత్తతో ఉండడం మంచిది. విపరీత ప్రవర్తన గల వారికి ప్రత్యేకమైన కౌన్సెలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి. – ప్రొఫెసర్ ప్రశాంతి, డైరెక్టర్ , జేఎన్టీయూఏ గల్ఫ్ చట్టాలు రావాలి గల్ఫ్ దేశాల్లో అమలు చేసే కఠిన చట్టాలు ఇక్కడ కూడా అమలు కావాలి. అప్పుడే నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉం టుంది. నరరూప రాక్షసుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్బడే వారికి తక్షణమే శిక్ష పడేలా వ్యవస్థలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కృష్ణకుమారి, జియాగ్రఫీ, ఎస్కేయూ అనంతపురం ఒకరిని ఉరి తీయాలి చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని ఊహించుకుంటుంటేనే ప్రాణం పోయినట్లైంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఒకరిని నడి రోడ్డులో ఉరి తీయాలి. అప్పుడే అంతా సెట్ అవుతారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ప్రజలే శిక్షించేలా అవకాశం కల్పించాలి. నడిరోడ్డుపై రాళ్లు, కట్టలతో కొట్టి చంపాలి. – మృదుల, నర్సింగ్ విద్యార్థిని, అనంతపురం ఉరిశిక్షే సరైంది తప్పులు బహిరంగంగా చేస్తూ..శిక్ష మాత్రం రహస్యంగా అనుభవిస్తున్నారు. దీని ద్వారా తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, బాలికలు, అమ్మాయిలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు నరరూప రాక్షసులు కూతుళ్లు, మనవరాళ్ల వయసున్న వారి పట్ల పాశవికంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైంది. బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ ఉషశ్రీనాగ్, హౌస్‌సర్జన్, సర్వజనాస్పత్రి, అనంతపురం -
పసిమొగ్గపై పైశాచికం
పట్టుమని ఐదేళ్లు లేవు.. బడిబాటకు సిద్ధమవుతోంది. పలకాబలపం పట్టి అక్షరాలతో ఆడుకునే వేళ.. తెల్లారితే సరస్వతీమాత ఒడిలో అఆలు దిద్దాలి.. అమ్మానాన్న ఎవరి పనుల్లో వాళ్లు.. నానమ్మ పొరుగింట్లో.. అదను చూసుకుని ఇంట్లోకి చొరబడిందో మానవ మృగం.. ఆ పసిమొగ్గ వణికిపోయింది. ఎముకలు విరిగిపోయేంత బాధ.. అరిచేందుకూ వీల్లేకపోయింది. ఆ మృగాడి కామవాంఛ తీరింది. కడుపులో నొప్పి.. జననాంగంలో రక్తం.. అప్పుడే విధుల నుంచి ఇంటికి చేరుకున్న తల్లి.. గారాల బిడ్డకు ఏమైందోనని పరుగున ఆసుపత్రికి చేరుకుంది. జరిగిన ఘోరం తెలిసి కుప్పకూలింది. సమాజం సిగ్గుతో తలదించుకుంది. సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓ మానవమృగం పంజా విసిరింది. అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికను చిదిమేసేంది. బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట నగరంలోని ఎర్రనేల కొట్టాలలో నివాసం ఉంటోంది. వీరికి నలుగురు ఆడపిల్లలు సంతానం. పెద్దపాప వయస్సు(8), రెండో పాప (5), మూడో పాప (3) మరో చిన్నారికి (10 నెలలు). కుటుంబ పోషణకోసం భర్త ఆటో తోలుతుండగా.. భార్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి ఇంటి పక్కనే కరియన్న అలియాస్ కిరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. దంపతులిద్దరూ ఎవరిపనులకు వారు వెళ్లగానే పిల్లలు వారి నానమ్మ వద్ద ఉండేవారు. బుధవారం వృద్ధురాలు వ్యక్తిగత పనిపై కాసేపు బయటకు వెళ్లగా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇది గమనించిన కిరణ్.. ఇంట్లోకి చొరబడి ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి అరవకుండా నోరు నొక్కేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. బాధతో చిన్నారి చాలా సేపు ఏడుస్తున్నా.. వృద్ధురాలు విషయం తెలుసుకోలేకపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన చిన్నారి తల్లి.. ఏడుస్తున్న పాపను ఆరా తీసింది. కడుపులో నొప్పి అని చెప్పడం, జననాంగం వద్ద రక్తం వస్తున్నట్లు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరిశీలన అనంతరం జరిగిన విషయం తెలుసుకుని భర్తతో కలిసి వెళ్లి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో యాక్టు ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ జైపాల్‌రెడ్డి నిందితునికి కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితున్ని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలమద్దిలేటి విలేకరులకు వివరించారు. నిందితునిపై పోక్సోయాక్టు కింద కేసు నమో దు చేసినట్లు వివరించారు. నిందితునిది అండేపల్లి బాలికపై లైంగిక దాడి చేసిన కిరణ్ది కంబదూరు మండలం అండేపల్లి గ్రామం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. తొలుత ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవలే డ్రైవర్ ఉద్యోగం మానేశాడు. ఇటీవల ఓ కుల సంఘం నాయకునిగా చలామణి అవుతూ కాలనీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నారికి ప్రత్యేక చికిత్స లైంగిక దాడికి గురైన చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య చికిత్సలను అందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేయించారు. పాప విషయాలను గోప్యంగా ఉంచారు. ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవి ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. నలుగురు ఆడసంతానం కావడంతో కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి విద్యాభ్యాసానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
‘మైనర్ మృగాడి’కి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హాకా భవన్‌లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు గురువారం దేశంలోనే అత్యంత అరుదైన, సంచలనాత్మకమైన తీర్పు నిచ్చింది. చిన్నారులపై లైంగిక దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన పోక్సో యాక్ట్ కింద ఓ చిన్నారిపై అత్యాచారం జరిగిన కేసులో, నేరం చేసిన మరో బాలుడికి జీవితఖైదు విధించింది. ఈ తరహా కేసులో ఇలాంటి తీర్పు రావడం దేశంలోనే ఇది తొలిసారి అని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు. సంచలనం సృష్టించిన కేసు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పరిధిలో పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, అసహజ లైంగిక దాడికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన కేసులో నేరం చేసిన బాలుడిని దోషిగా నిర్ధారించిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు గురువారం అతడికి కఠిన శిక్ష విధించింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఐదు సెక్షన్ల కింద రెండు జీవిత ఖైదులు, రెండు పదేళ్ల కఠిన కారాగార శిక్షలు, మరో ఏడేళ్ల శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కుంచాల సునీత సంచలనాత్మక తీర్పు వెలువరించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో (కాంకరెంట్లీ) అమలవుతాయని పేర్కొన్నారు. 2017 జూలైలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండేళ్లలోపే తీర్పు వెలువరించడం విశేషం. బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కుమారుడు (10) అదే ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదివేవాడు. 2017 జూన్ 26న బార్కాస్ బజార్ ప్రాంతంలో మేళా వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించిన కుటుంబసభ్యులు బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మరో బాలుడు అతడిని బార్కాస్ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం పాఠశాల గ్రిల్స్ తొలగించి భవనంపైకి తీసుకెళ్లి చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాలుడు తనకు నొప్పిగా ఉందని, ఈ విషయం తన తండ్రికి చెప్తాననడంతో ఆ బాలుడు భయపడ్డాడు. ఘటన వెలుగులోకి రాకుండా ఉండేందుకు చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుని, అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసే ఉద్దేశంతో అక్కడి నుంచి తరలించేందుకు కాళ్లు, చేతులు కట్టేశాడు. అందుకు వీలు పడకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇలా మృతదేహాన్ని మరో చోటికి మార్చేందుకు రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఈ ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడుబడిన ఆ ప్రాంతానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాలుడి మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కాస్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 1.28 గంటలకు ఓ యువకుడు చిన్నారిని తీసుకెళుతున్నట్లు కనిపించింది. దీన్ని చూసిన బాలుడి తండ్రి ఆ మైనర్ తన ఇంటి పక్కనే ఉండే బాలుడిగా గుర్తించాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... తొలుత తనకేమీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడంతో నేరం అంగీకరించాడు. ఈ కేసులో చాంద్రాయణగుట్ట పోలీసులు హాకా భవన్‌లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. న్యాయస్థానం పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 6 కింద నేరం చేసిన బాలుడికి జీవితఖైదు, హత్యా నేరం కింద మరో జీవితఖైదు, కిడ్నాప్ నేరం కింద, అసహజ లైంగికదాడి కింద పదేళ్ళ చొప్పున, ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించడంతో ఏడేళ్ళ శిక్ష విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని స్పష్టం చేసింది. ప్రవీణ్, శ్రీనివాసరెడ్డిలకు ఇంతకంటే కఠినశిక్షలు బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మైనర్లపై అత్యాచారం జరిపి, హత్య చేసి తన బావిలోనే పూడ్చిన సైకో శ్రీనివాసరెడ్డి, ఇటీవల వరంగల్‌లోని కుమార్‌పల్లిలో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి పాశవికంగా హత్య చేసిన ప్రవీణ్‌లకు ఇంతకుమించిన శిక్షలు పడతాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
బాలికపై అకృత్యం; పబ్లిక్ టాయిలెట్లో..
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు ఆమె శవాన్ని పబ్లిక్ టాయిలెట్లో పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ముంబైలోని నెహ్రూ నగర్ విలే పార్లే రైల్వేస్టేషను సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషనుకు చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ..‘ నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనపడకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు జుహు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెహ్రూ నగర్‌లోని ఓ పబ్లిక్ టాయిలెట్లో బాలిక శవం లభించడంతో అక్కడికి చేరుకున్నాం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్ కేసులతో పాటుగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. -
నీకిదే సరైన శిక్ష.. రోజంతా ఇక్కడే కూర్చో..!!
సాక్షి, ముంబై : పన్నెండేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ముంబై క్రిమినల్ కోర్టు అనూహ్యమైన శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద రూ.30 వేల జరిమానాతోపాటు రోజంతా కోర్టు రూమ్‌లోనే కూర్చోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో అతి తక్కువ శిక్షాకాలం కలిగిన కేసుల్లో ఇదొకటి కావడం విశేషం. వివరాలు.. ఎదురింట్లో ఉండే బాలికతో అరవింద్ కబ్‌దేవ్ కామత్ (29) అనే వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. నగ్నంగా నిల్చుని కిటీకీలోనుంచి ఆమెకు సైగలు చేశాడు. ఈ ఘటన 2015లో జరగగా గోవాదేవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన ముంబై న్యాయస్థానం .. ‘కోర్టు ఉదయించేవరకు ఇక్కడే కూర్చో. వచ్చిపోయేవాళ్లంతా నీఘనకార్యం గురించి ముచ్చటించాలి’ అని వ్యాఖ్యానించింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం) లోని సెక్షన్ 12 కింద కామత్‌ను దోషిగా తేలుస్తూ.. ఒక రోజు ‘కోర్టు శిక్ష’,తో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. -
ప్రసవించిన విద్యార్థిని మృతి
తిరువొత్తియూరు: విద్యార్థిని గర్భిణిని చేసి ఆమె మృతికి కారణమైన యువకుడిని పోలీసులు శనివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా ఊతంకరై పుదూర్ భూగునైకి చెందిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. తాత, అవ్వ వద్ద ఉంటున్న విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన తమిళరసన్ (27) విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో గర్భిణి అయిన బాలికను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినికి శస్త్ర చికిత్సద్వారా కడుపులో ఉన్న మృతశిశువును తొలగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం విద్యార్థిని మృతి చెందింది. దీనిపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థిని గర్భిణీ చేసి ఆమె మృతికి కారణమైన తమిళరసన్‌ను పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేశారు. -
కామాంధులకు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ఐటీ మంత్రి రవిశంకర్ మీడియాకు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించినట్లు తెలిపారు. ఈ మూడు సవరణలు లైంగికనేరాల నిరోధానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేలా సెక్షన్ 14, 15ను సవరించారు. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► దేశంలోని కొబ్బరి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.7,750 ఉండగా, తాజా పెంపుతో అది రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీంతో దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది. ► ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు–2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
వారికి కచ్చితంగా మరణశిక్ష పడుతుంది!
న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్ష విధించేలా పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడే నేరగాళ్లకు మరణశిక్ష విధించడమే సరైందని పేర్కొన్నారు. ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేసినట్లు తెలిపారు. పిల్లలను మేజర్లుగా చిత్రీకరించేందుకు హార్మోన్లు ఎక్కించడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడే వ్యక్తులకు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. Union Law Minister, Ravi Shankar Prasad: Cabinet has approved death penalty in aggravated sexual offences under the Protection of Children from Sexual Offences (POCSO) Act. pic.twitter.com/E1JB8xCOOq — ANI (@ANI) December 28, 2018 కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. -
ఆ మైనర్ యువకుడే కావాలంటూ రచ్చ.. మహిళ అరెస్ట్!
ముంబై : మైనర్ యువకుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ.. అతనితో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్‌ను పెళ్లి చేసుకుంది. తనతో కలసి ఉండనివ్వాలని ఆ మైనర్ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది. అయితే ఈ విషయంపై ఆ మైనర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్ చేశారు. -
లైంగిక దాడి కేసులో యువకుడికి జీవిత ఖైదు
సాక్షి, ముంబై : తనను దూరం పెట్టిన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై కోపం పెంచుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన 23 ఏళ్ల యువకుడికి కోర్టు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు రూ 25.000 జరిమానా విధించింది. 2012లో ఓ డ్యాన్స్ అకాడమీలో నిందితుడు, బాధితురాలు ఇన్స్ర్టక్టర్లుగా పనిచేస్తున్న క్రమంలో సన్నిహితమయ్యారు. పలు డ్యాన్స్ ప్రదర్శనల్లో కలిసి పాల్గొనడంతో స్నేహితులయ్యారు. 2013లో నిందితుడు మద్యానికి బానిసయ్యాడని గ్రహించిన బాధితురాలు అతడిని దూరం పెట్టింది. అయితే ఇద్దరూ డ్యాన్స్ అకాడమీలో కలిసిపనిచేస్తుండటంతో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఈ క్రమంలో అదేఏడాది జులై 21న డ్యాన్స్ క్లాస్ ఉందనే సాకుతో నిందితుడు బాధితురాలిని డ్యాన్స్ అకాడమీకి రప్పించాడు. నిందితురాలు అక్కడికి వచ్చిన సందర్భంలో క్లాస్‌లో స్టూడెంట్స్ లేకపోవడంతో వారంతా లంచ్‌కు వెళ్లారని చెబుతూ తలుపులు మూసివేసి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె నగ్నచిత్రాలను సైతం చిత్రీకరించిన నిందితుడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అత్యాచారం చేసి జైలుకి, వెంటనే బెయిల్‌పై వచ్చి పెళ్లి
బెంగళూరు : ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, జైలుకెళ్లాడు. రెండు రోజుల్లోనే బెయిల్‌పై వచ్చిన పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. మళ్లీ పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు, బాధితురాలి సోదరినే. కోర్టు సైతం నిందితుడికి బెయిల్ మంజూరు చేసి, వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనంతా కర్నాటకలోని చిక్కబల్లపుర్లో జరిగింది. జిల్లాలోని గౌరిబిదనూర్ తాలుకాలోని గోటకానపుర గ్రామానికి చెందిన శివన్న అనే వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో అతను పీకల్లోతు మత్తులో ఉన్నాడు. ఫుల్‌గా డ్రింక్ చేసిన శివన్న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆ గ్రామం నుంచి పారిపోయాడు. గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో, అదే రోజులు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోస్కో) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నేడు అతను పెళ్లి. పెళ్లి కూడా అదే గ్రామానికి చెందిన బాధితురాలి సోదరినే చేసుకుంటున్నాడు. నిందితుడు అభ్యర్థన మేరకు అతనికి కోర్టు బెయిల్ ఇచ్చింది. చిక్కబల్లపుర్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్‌హెచ్ కోర్రడి అతనికి బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. శనివారం నిందితుడి పెళ్లి ఉన్నట్టు పోలీసు అధికారులు ధృవీకరించారు. ‘పోస్కో కేసుల్లో బెయిల్ ఇవ్వడం అసాధారణం. కానీ బెంగళూరులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చట్టం మెజిస్ట్రేట్ చేతుల్లో ఉంటుందని జడ్జీలు చెప్పారు. అయితే మైనర్ సంబంధిత కేసుల్లో నిందితుడికి అసలు బెయిల్ ఇవ్వకూడదని చట్టం ఉంది’ అని గ్లోబల్ కన్సర్న్స్ ఇండియా డైరెక్టర్ బ్రిండా అడిగే చెప్పారు. నిందితుడికి రెండు రోజుల్లోనే బెయిల్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చెలరేగుతున్నాయి. -
కీచక గురువుపై పోక్సో కేసు నమోదు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరు నగరానికి చెందిన ఒక మైనర్ బాలికను నమ్మించి లోబరుచుకుని గర్భవతిని చేసిన సంఘటనకు సంబంధించి బాలిక తల్లి ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కె.రామారావు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న కె.రాంబాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన కుమార్తెను బెదిరించడంతో ఈ విషయం బయటకు తెలియకుండా దాచి పెట్టిందని తెలిపారు. రెండు రోజుల క్రితం కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా గర్భవతిగా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు రాంబాబు ను బాలికకు సంబంధించిన బంధువులు, మరి కొందరు మంగళవారం రాత్రి తీవ్ర స్థాయిలో కొట్టి నగ్నంగా నగర వీధుల్లో నడిపించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడు రాంబాబును వారి నుండి విడిపించి స్టేషన్‌కు తరలించారు. రాంబాబును తీవ్రస్థాయిలో కొట్టడంతో శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్య పరీక్షల్లో తేలింది. రాంబాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. -
వాళ్లు సమాజానికి ప్రమాదకరం
చెన్నై: సింగిల్ పేరెంటింగ్ సమాజానికి అంత శ్రేయస్కారం కాదని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కిరుబకరన్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు తల్లి,తండ్రి ఇద్దరి ఆప్యాయత కావాలని, కానీ సింగిల్ పేరెంటింగ్‌తో వారు ఒకరి ఆప్యాయతకు దూరమవుతున్నారని తెలిపారు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 16,2015న పిల్లలపై అఘాత్యాలకు పాల్పడే నిందితులను పోక్సో చట్టం కింద శిక్షించాలని కోర్టు ఇచ్చిన తీర్పును మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదని గిరిజా రాఘవన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరగడానికి మహిళా, శిశు సంక్షేమశాఖల విభజన జరగక పోవడమే కారణమన్నారు. ఈ శాఖను మహిళా అభివృద్ధి, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలుగా విభజించేలా కేంద్రప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు సూచించారు. ఇక పిల్లలపై జరిగే అఘాత్యాలన్నీ పోక్సో చట్టం కిందకు వస్తాయని తెలిసేలా అన్ని రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్భయ నిధులను రాష్ట్రాలకు కేటాయించడంపై ఓ గైడ్లైన్ కూడా రూపోందించాలన్నారు. -
‘టీచర్ కూడా పట్టించుకోలేదు.. చనిపోదామనుకున్నా’
న్యూఢిల్లీ : ఓ మైనర్ బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ముగ్గురు మైనర్లపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పొక్సో చట్టం) కింద కేసు నమోదయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలో నాల్గో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడిని.. అదే పాఠశాలలో చదువుతున్న మరో ముగ్గురు మైనర్ విద్యార్థులు స్కూల్ బస్సులో లైంగిక వేధింపులకు గురి చేశారు. అయితే బాధిత బాలుడు ఈ విషయం గురించి ఓసారి ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో బాలున్ని వేధింపులకు గురి చేస్తున్న మిగతా విద్యార్ధులు మరింత రెచ్చిపోయారు. అప్పటికే పలుమార్లు బాలున్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. వారి చేష్టలతో విసిగిపోయిన బాలుడు ఆత్మాహత్యాయత్నం చేశాడు. సమాయానికి తల్లిదండ్రులు చూడటంతో ఆ పసివాన్ని కాపాడారు. అనంతరం తల్లిదండ్రులు బాలున్ని సముదాయించి ఏం జరిగిందని అడగ్గా.. పాఠశాలలో, మిగతా విద్యార్ధులు తనతో ప్రవర్తిస్తోన్న తీరు గురించి చెప్పాడు. టీచర్లకు చెప్పినా వారు ఎటువంటి చర్య తీసుకోవడం లేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తమ కొడుకును వేధించిన విద్యార్ధులపై ఫిర్యాదు చేశారు. పొక్సో యాక్ట్ కింద ముగ్గురు బాలుర మీద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
తల్లికి ఘోరం చెబితే.. తాయత్తు కట్టించింది!
మొహాలీ/పంజాబ్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తోబుట్టువే కామంతో కళ్లుమూసుకుపోయి మృగాడిలా ప్రవర్తించాడు. సొంత చెల్లెలిపైనే లైంగిక అకృత్యాలకు పాల్పడి మానవత్వానికే మచ్చ తెచ్చాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఇక్కడికి వలస వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటున్న పదకొండేళ్ల చిన్నారి (మూడో తరగతి)పై తన అన్నయ్య (22) పలుమార్లు అత్యాచారం చేశాడు. లైంగిక దాడి జరిగిన మొదటి రోజే చిన్నారి ఈ విషయం తన తల్లికి చెప్పింది. కొడుకే కూతురుని ఇలా చేయడమేంటని ఆ తల్లి నమ్మలేదు. బిడ్డకు గాలి సోకిందని భూత వైద్యునితో తాయత్తు కట్టించింది. అయితే, చెల్లెలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఆ యువకుడు తల్లి కంటబడడంతో అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందనీ, ఎవరితో చెప్పొద్దొని కూతురికి తల్లి సర్ది చెప్పింది. అవగాహనతో బట్టబయలు.. అయితే చిన్నారి చదువుతున్న స్కూల్లో అసహజ స్పర్శలు, లైంగిక పరమైన వేధింపులపై అవగాహన తరగతులు నిర్వహించారు. దీంతో బాధితురాలు తన సోదరుడు చేసిన పనిని స్నేహితురాళ్లకు చెప్పింది. ఆ విషయం టీచర్ల దృష్టికి రావడంతో ఘటన వెలుగుచూసింది. వారు చైల్డ్‌లైన్ సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడనీ ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, పదకొండు మంది తోబుట్టువుల్లో బాధితురాలు చివరి సంతానం. -
రాష్ట్రంలో ముగ్గురిపై లైంగికదాడులు
అల్లవరం (అమలాపురం)/దెందులూరు/అగనంపూడి (గాజువాక): 30 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై సొంత బాబాయి కుమారుడు, వరుసకు తమ్ముడైన 19 ఏళ్ల మానవ మృగం గత కొంతకాలంగా లైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేశాడు. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామ శివారు ఎలువుల్లంకలో చోటు చేసుకుంది. పరువు పోతుందనుకున్న తల్లిదండ్రులు పెద్దలను ఆశ్రయించగా బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పి న్యాయానికి సమాధి కట్టారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా కుమార్తె శరీరంలో మార్పులు గమనించిన కుటుంబీకులు ఆమెను నిలదీయగా అతికష్టం మీద వరుసకు తమ్ముడైనవాడు ఈ పని చేశాడని చెప్పింది. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తండ్రి అల్లవరం పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజులు క్రితమే ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని పెద్దలు ఓ రాజకీయ నాయకుడి నివాసంలో పంచాయతీ పెట్టారు. అత్యాచారం చేసిన మానవ మృగానికి ఇచ్చి ఆ బాధితురాలికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు తప్పు చేసిన యువకుడు కూడా ఒప్పుకున్నాడు. అంతలోనే వరుసకు అక్క.. అదీ ఒకే ఇంటి పేరుతో ఉన్నవారికి పెళ్లి ఎలా చేస్తారని, ఇలా అయితే ఇరు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడతామని పెద్దల ఎదుట తెగేసి చెప్పడంతో పెళ్లి ఆలోచనకు స్వస్తి పలికారు. దీంతో చేసిన తప్పునకు రూ.2 లక్షలు వెలకట్టి వదిలేశారు. యువతి గర్భం దాల్చి ఏడు నెలలు మించిపోవడంతో ప్రసవం చేయించేందుకు కుటుంబీకులు సిద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగేళ్ల బధిర బాలికపై అత్యాచారం అభంశుభం తెలియని నాలుగేళ్ల బధిర బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దారుణమైన ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఈ చిన్నారి మాట్లాడలేదు. బాలిక తల్లిదండ్రులు బ్యాంకు పనిపై మంగళవారం గోపన్నపాలెం వెళ్లారు. వీరి ఇంట్లో ఒక గదిలో అద్దెకు ఉంటున్న బూరాడా రాంబాబు అనే వ్యక్తి చిన్నారిని సమీపంలోని పొలంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి ఏడుస్తూ ఉండటం, రక్తస్రావం కావడం గమనించి స్థానికులు ప్రశ్నించగా జరిగిన అకృత్యాన్ని సైగల ద్వారా తెలియజేసింది. దీంతో గ్రామస్తులు రాంబాబును చితకబాది చిన్నారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దెందులూరు ఏఎస్ఐ పి. కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో బాలికపై లైంగికదాడి విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు పిల్లల గల వ్యక్తి అఘాయిత్యం చేసిన సంఘటనలో స్థానికులు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 57వ వార్డు మంగళపాలెం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త చనిపోవడంతో తన 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటోంది. కాగా, మహిళ పింఛన్ తీసుకోవడానికి సోమవారం సీలేరు వెళ్లింది. తనకు పరిచయం ఉన్న అగనంపూడి దిబ్బపాలేనికి చెందిన బలిరెడ్డి నాగేంద్రకుమార్‌కు ఫోన్ చేసి తన కుమార్తె ఒంటరిగా ఉందని, వెళ్లి చూసి రావాలని చెప్పడంతో అతడు రాత్రి 9 గంటల సమయంలో మహిళ ఇంటికి వెళ్లి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ, కేకలు వేసుకుంటూ రోడ్డుమీదికి పరుగులు తీయడంతో స్థానికులు పారిపోతున్న నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, ఇంట్లో గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని ఫోక్సా చట్టం, అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నాగేంద్రకుమార్ స్నేహితులమంటూ ఐదుగురు వ్యక్తులు కాలనీలోకి వచ్చి బెదిరించడంతోపాటు వీరంగం సృష్టించడంతో స్థానికులు చేరుకొనేసరికి పరుగులు తీశారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
మతం పేరిట మహిళలను అలా.. ఎలా?
ఖత్నా ఆచారం.. మహిళా జననాంగ విరూపణం (FGM)పై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతం పేరిట మహిళలను భౌతికంగా హింసించటం ఖచ్ఛితంగా నేరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఖత్నాకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగ్గా.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: ‘మత సంప్రదాయం పేరిట మహిళల మర్మాంగాలను తాకటం ఏంటి? వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం ఏంటి?.. ఇది ముమ్మాటికీ వారిని భౌతికంగా హింసించటమే. మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుంది. పోక్సో చట్టం ప్రకారం ఆడపిల్లలపై ఈ ఆచారం ప్రయోగించటం లైంగిక నేరం కిందకి వస్తుంది. ఇది ముమ్మాటికీ తీవ్రమైన నేరమే’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. వాదనలు సాగాయిలా... ఖత్నా పేరిట మహిళలపై హింస కొనసాగుతోందని పిటిషనర్ సునీతా తివారీ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఈ వాదనలతో బెంచ్ ఏకీభవించింది. ఆపై దావూదీ బోహ్రా(ఖత్నాను పాటిస్తున్న ముస్లిం సమాజం) తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారని, దీనికి రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా ఉందని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్, నిఖా హలాల, బహుభార్యత్వం(పాలీగమీ) అంశాల రాజ్యాంగ బద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేయాలని’ సింఘ్వీ బెంచ్‌ను కోరారు. సింఘ్వీ వాదనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తప్పబట్టారు. ‘మగవాళ్లలో సున్తీ ప్రక్రియ కొన్ని ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయన్న వాదన ఉంది. కానీ, మహిళల విషయానికొస్తే ఇది చాలా తీవ్రమైన అంశం. వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కుల ప్రకారం ఇది ఖచ్ఛితంగా నిషేధించాల్సిన అంశం. అంతర్జాతీయ సమాజం ఈ ఆచారాన్ని ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, 27 ఆఫ్రికన్ దేశాలు ఖత్నాను నిషేధించాయి కూడా’ అని బెంచ్‌కు ఏజీ విన్నవించారు. ఇరువర్గాల వాదనలను విన్న బెంచ్.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఖత్నా గురించి... సాధారణంగా ఇస్లాంలో సున్తీ పురుషులకు చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో మహిళలపై కూడా ఈ ఆచారాన్ని అమలు చేస్తున్నారు. అదే ఖత్నా.. దీనినే స్త్రీ సున్తీ మరియు స్త్రీ జననేంద్రియ కట్టడం అని కూడా పిలుస్తారు. ఇది బాహ్య మహిళ జననేంద్రియాల యొక్క మొత్తం లేదా అన్నింటిని తొలగించే ప్రక్రియ(మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం). ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు. ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా దీన్ని వ్యవహరిస్తున్నారు. భారత్ విషయానికొస్తే... బొహ్రా ముస్లిం సమాజం (దావూదీ బొహ్రా, సులైమానీ బొహ్రా)లో ఇది సర్వ సాధారణం.గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బొహ్రా ముస్లింలు ఎక్కువ. దేశంలో వీరి జనాభా దాదాపు 10 లక్షల దాకా ఉంటుంది. అయితే దావూదీ బొహ్రా ముస్లింలు దేశంలోని విద్యావంతమైన ముస్లిం సమాజాల్లో ఒకటి. అయినప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తుండటం గమనార్హం. తొలుత పరిశుద్ధత పేరిట వాదనను వినిపించిన ఆ వర్గం.. ఆ తర్వాత క్లైటోరిస్ ఉండడం వల్ల అమ్మాయిల్లో లైంగికవాంఛ పెరుగుతుందని, అందుకే దీనిని ఆచరిస్తున్నామని చెబుతుండటం గమనార్హం. అయితే ఆడపిల్లల్ని శారీరకంగా హింసించే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతుండగా.. గతేడాది సునీతా తివారీ అనే ఉద్యమవేత్త సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఐరాస నిషేధం... మరోవైపు ''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పరిగణించింది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై 194 దేశాలు(భారత్ సహా) సంతకం చేశాయి. ఆ తర్వాత కొన్ని దేశాలు ఎఫ్‌జీఎంను నిషేధిస్తూ చట్టాలు చేసుకోగా.. భారత్ మాత్రం చట్టం చేయలేదు. ఎఫ్‌జీఎంను నిర్మూలించేందుకు, దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతి యేటా ఫిబ్రవరి 6ను 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం'గా జరుపుకోవాలని ఐరాస ప్రకటించింది కూడా.