ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు | AP Government Sanctioned Special Courts | Sakshi
Sakshi News home page

ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు

Published Thu, Sep 26 2019 8:15 PM | Last Updated on Thu, Sep 26 2019 8:35 PM

AP Government Sanctioned Special Courts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా,నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో  వీటిని ఏర్పాటు చేయనున్నారు. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వ‌రిత‌గ‌తిన విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉన్న జిల్లాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement