
ప్రతీకాత్మకచిత్రం
దూరం పెట్టిందని యువతిపై ఘోరం..
సాక్షి, ముంబై : తనను దూరం పెట్టిన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై కోపం పెంచుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన 23 ఏళ్ల యువకుడికి కోర్టు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు రూ 25.000 జరిమానా విధించింది. 2012లో ఓ డ్యాన్స్ అకాడమీలో నిందితుడు, బాధితురాలు ఇన్‌స్ర్టక్టర్లుగా పనిచేస్తున్న క్రమంలో సన్నిహితమయ్యారు. పలు డ్యాన్స్ ప్రదర్శనల్లో కలిసి పాల్గొనడంతో స్నేహితులయ్యారు. 2013లో నిందితుడు మద్యానికి బానిసయ్యాడని గ్రహించిన బాధితురాలు అతడిని దూరం పెట్టింది.
అయితే ఇద్దరూ డ్యాన్స్ అకాడమీలో కలిసిపనిచేస్తుండటంతో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఈ క్రమంలో అదేఏడాది జులై 21న డ్యాన్స్ క్లాస్ ఉందనే సాకుతో నిందితుడు బాధితురాలిని డ్యాన్స్ అకాడమీకి రప్పించాడు. నిందితురాలు అక్కడికి వచ్చిన సందర్భంలో క్లాస్‌లో స్టూడెంట్స్ లేకపోవడంతో వారంతా లంచ్‌కు వెళ్లారని చెబుతూ తలుపులు మూసివేసి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె నగ్నచిత్రాలను సైతం చిత్రీకరించిన నిందితుడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.