life imprisonment
-
దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు
-
సంజయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవితఖైదు పడింది. స్థానిక సీల్దా కోర్డు సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. దోషిగా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను, సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఆ కోవకు వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ అభిప్రాయపడ్డారు. 2024 ఆగస్ట్ 9న బోధనాస్పత్రి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేయడం తెలిసిందే. కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ను ఈ కేసులో దోషిగా జడ్జి శనివారం నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64 (అత్యాచారం), 66 (మరణానికి కారణమవడం), 103 (1) (హత్య) కింద దోషిగా తేల్చారు. సోమవారం మధ్యాహ్నం శిక్ష ఖరారు చే శారు. నిందితుడు, బాధితురాలి కుటుంబం, సీబీఐ ల వాదనలు విన్నమీదట తీర్పు వెలువరించారు. సంజయ్ బతికినంతకాలం జైళ్లోనే గడపాలని పే ర్కొన్నారు. అతనికి రూ.50,000 జరిమానా కూడా విధించారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘బాధితురాలు విధి నిర్వహణలో చనిపోయినందున రూ.10 లక్షలు, అత్యాచారానికి గురైనందుకు రూ.7 లక్షలు ఆమె కుటుంబానికి పరిహారమివ్వాలి’’ అని పేర్కొన్నారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వీలుంది.అప్పీలు చేస్తాం: బాధిత కుటుంబం జీవితఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దోషికి ఉరిశిక్ష వేయాల్సిందే. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తాం. నేరంలో ఇతర భాగస్వాములను వదిలేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? వైద్యురాలు విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది. దీనివెనక పెద్ద కుట్ర దాగుంది’’ అని జూనియర్ వైద్యురాలి తండ్రి అన్నారు. ‘‘నష్టపరిహారం మాకు వద్దు. మిగతా నేరస్తులూ బోనెక్కేదాకా పోరాడతాం’’ అన్నారు. వైద్యురాలి తల్లి కోర్టుకు రాలేదు. తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మీరంతా వెళ్లిపొండి’’ అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహించారు. ‘‘ఘటన జరిగినప్పుడు సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో కచ్చితంగా ఇతరుల పాత్ర ఉంది. వాళ్లనూ చట్టం ముందు నిలబెట్టాలి’’ అని వైద్యురాలి అక్కలు డిమాండ్ చేశారు.వైద్యుల తీవ్ర అసంతృప్తి పని ప్రదేశాల్లో తమ భద్రత గాల్లో దీపమని చాటిచెప్పిన ఈ ఉదంతంలో దోషికి ఉరిశిక్ష పడక పోవడం దారుణమంటూ ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ఒక్కని పని కాదు. వ్యవస్థీకృత నేరమిది. ఈ కుట్రలో చాలామంది పాత్ర ఉంది. పరిహారం ప్రకటించేసి జీవితఖైదు విధించడం అసంబద్ధం. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం’’ అని సీనియర్ వైద్యుడు రాజీవ్ పాండే అన్నారు. మా వాళ్లయితే ఉరి వేయించేవాళ్లు: మమత తామైతే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కచ్చి తంగా ఉరిశిక్ష వేయించేవాళ్లమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘మేమంతా దోషికి ఉరిశిక్షే కోరుకున్నాం. కేసును సీబీఐ మా నుంచి బలవంతంగా లాక్కుంది. సమగ్రంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. గట్టిగా వాదించలేదు. కోల్‌కతా పోలీసులైతే సమగ్రంగా దర్యాప్తు చేసేవాళ్లు’’ అన్నారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు అసలు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, వెనకుండి సహకరించిన మమతను విచారించాలి’’ అని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన మర్నాడు సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. విచారణ నత్తనడకన సాగుతోందని, బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను, ఇతరలను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీచేసింది. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవిత ఖైదు
బీజింగ్: క్లాస్‌మేట్‌ను దారుణంగా చంపిన నేరానికి గాను ఇద్దరు టీనేజర్లకు చైనా న్యాయస్థానం కఠిన జైలు శిక్షలు విధించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మరో టీనేజర్‌ను కరెక్షన్ సెంటర్‌కు పంపించింది. హెబీ ప్రావిన్స్‌లోని హండన్‌లో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన చైనాలో సంచలనం కలిగించింది. బాధితుడు, దోషుల వయస్సు 13 ఏళ్లు. అందుకే అధికారులు వీరిని క్లుప్తంగా ఇంటి పేర్లతో వెల్లడించారు. క్లాస్మేట్ వాంగ్‌ను కొంతకాలంగా ఝాంగ్, లి, మా అనే బాలురు వేధిస్తున్నారు. వాంగ్‌ను చంపాలని ఝాంగ్ పథకం వేశాడు. దాని ప్రకారం మార్చి 3న నగరం శివార్లలోని పాడుబడ్డ గ్రీన్ హౌస్‌కు అతడిని తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారం మిగతా ఇద్దరూ అక్కడికి వచ్చారు. వాంగ్‌ను ఝాంగ్ పారతో కొట్టడం మొదలుపెట్టగా అతడికి లి సహకరించాడు. ఇది చూడలేక మా అక్కడికి నుంచి వెళ్లిపోయాడు. దెబ్బలతో చనిపోయిన వాంగ్‌ను ఇద్దరూ కలిసి అక్కడున్న గుంతలో పూడ్చి వేశారు. మార్చి 10న పోలీసులు ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇది చాలా హేయమైన, క్రూరమైన చర్యగా అభివరి్ణంచింది. నేరానికి ప్రధాన సూత్రధారి ఝాంగ్‌కు జీవిత ఖైదును, అతడికి సహకరించిన లి కి 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మూడో బాలుడు మా ను పరివర్తన విద్యాకేంద్రానికి పంపించాలని తీర్పు వెలువరించింది. అయితే, వీరిని ఈ నేరానికి పురిగొలి్పన అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు. కోర్టు తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కఠిన శిక్షల భయం లేనందునే పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ నలుగురి తల్లిదండ్రులు నగరానికి పనుల నిమిత్తం వెళ్లిపోగా, అమ్మమ్మతాతల వద్ద ఉంటూ అల్లరిచిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు. 2020 నాటి గణాంకాల ప్రకారం ఇలా ‘వదిలివేయబడిన బాలలు’దేశంలో 6.70 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. -
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): బాలికతో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పోతురాజు మీరయ్యకు జీవిత ఖైదు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు మనుబోలు మండలం పిడూరుమిట్ట గ్రామానికి చెందిన పోతురాజు మీరయ్య చిల్లర అంగడి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన బాలిక అంగడికి వెళ్తున్నప్పుడు మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. బాధిత బాలిక 2022 జనవరి పన్నెండో తేదీన మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోతురాజు మీరయ్యను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీïÙటు దాఖలు చేశారు. విచారణలో మీరయ్య నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఉపాధి పేరిట బంగ్లాదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు నిర్థారించింది.2019లో పాతబస్తీలోని చత్రినాక ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా.. ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఒక బంగ్లాదేశ్ మహిళతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్‌పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.బైక్ నడుపుతున్న భానుప్రకాష్‌రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్‌రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్‌రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్‌రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్‌రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్‌రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్‌కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్‌కుమార్‌లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం. -
దేశ వ్యతిరేక పోస్టులకు జీవితఖైదు!
లక్నో: సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అలాగే ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. యూపీ డిజిటల్ మీడియా పాలసీ–2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికింద దేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్టు చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మూడేళ్ల నుంచి జీవితఖైదు విధించే ఆస్కారం కలి ్పంచారు. ఇదివరకు దేశ వ్యతిరేక పోస్టులైతే ఐటీ చట్టం సెక్షన్ 66ఇ, 66ఎఫ్‌ల కింద నేరంగా చూసేవారు. అసభ్య, పరువునష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ పరువునష్టం అభియోగాలు నమో దు చేస్తారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పంచే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు (వారి ఫాలోవర్స్, స్కబ్‌్రస్కయిబర్స్‌ను బట్టి) ఎక్స్‌లో అయితే రూ. 5 లక్షలు, ఫేస్బుక్లో రూ. 4 లక్షలు, ఇన్‌స్ట్రాగామ్‌లో 3 లక్షలు గరిష్టంగా యూపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. యూట్యూబ్‌లో అయితే ఫాలోవర్లను బట్టి కేటగిరీలు విభజించి, రూ. 8 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇవి నెలవారీ చెల్లింపులు. ఎవరైనా అభ్యంతరక కంటెంట్‌ను పెడితే ఆయా సంస్థలపై కూడా చర్యలుంటాయి. -
భర్తకు జీవిత ఖైదు సరైందే
సాక్షి, హైదరాబాద్: భార్య హత్య కేసులో భర్తకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడం సరైందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘మృతిరాలితో అప్పీలెంట్ (భాస్కర్)కు వివాహం జరిగి నాలుగు నెలలే అయ్యింది. ఆమె మంటల్లో కాలిపోతున్నప్పుడు గదిలో నిందితుడు ఉన్నాడని సాకు‡్ష్యలు చెబుతున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అతను ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భర్తకు వ్యతిరేకంగా మృతురాలు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందనడానికి ఎలాంటి కారణాలు లేవు. ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదు’ అని హైకోర్టు తీర్పునిచ్చింది. 2012లో జరిగిన హత్య కేసులో అప్పీలెంట్‌కు జీవిత ఖైదు సరైందేనని 2015లో తేల్చిచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్‌కు మృతురాలితో 2012, ఏప్రిల్ 25న వివాహం జరిగింది. వివాహం తర్వాత నెల పాటు దంపతులు భార్య తల్లిగారింట్లోనే ఉన్నారు. 2012, జూలై 15న రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించారు. అయితే తనకు పీడకలలు వస్తున్నాయని, తల్లి వద్ద నిద్రిస్తానని భాస్కర్‌ను కోరింది. అందుకు నిరాకరించి దుర్భాషలాడుతూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రిలో మృతురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భాస్కర్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది.బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉంది... 2015, ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పెద్దింటి భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జితేందర్‌రావు వీరమల్ల వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతురాలి తల్లి కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునేముందు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని డాక్టరు ధ్రువీకరించారని పేర్కొంది. మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ అప్పీలును కొట్టివేసింది. -
లవ్ జిహాద్‌కు జీవిత ఖైదు: అసోం
గువాహటి: హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న ‘లవ్ జిహాద్’ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని బీజేపీ పాలిత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. ‘‘ఎన్నికల వాగ్దానాలనే నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్‌తో సంబంధమున్న వారికి జీవితఖైదు తప్పదు. ఇకపై అసోంంలో పుట్టిన వారినే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది’’ అన్నారు. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది . -
దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్ అంధూరే, శరద్ కలాస్కర్లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్ 2013 ఆగస్ట్ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్ ఆస్పత్రిలో చనిపోయారు. -
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్‌ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్‌పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్‌ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది. -
TS: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు
జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. కాశీంపూర్‌కు చెందిన వడ్ల నర్సమ్మ తన కొడుకుతో కలిసి జహీరాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె బంధువులైన వడ్ల వీరన్న కూతురి పెళ్లి కుదిరింది. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు వెళ్లి ఆ పెళ్లిని ఆపించారు. జహీరాబాద్‌లో ఉంటున్న నర్సమ్మ ఉద్దేశ పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయించి తన కూతురి పెళ్లిని ఆపించిందని వీరన్న కక్ష పెంచుకున్నాడు. పింఛన్ డబ్బు కోసమని 2016 మార్చి 25న ఆమె జహీరాబాద్ నుంచి కాశీంపూర్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఇదే అదనుగా భావించి బంధువులైన వడ్ల ప్రభు(40), వడ్ల ప్రశాంత్(19), వడ్ల వెంకట్(19), వడ్ల సంతోష్(19), వడ్ల రేఖ(28), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ(42), వడ్ల శ్రీకాంత్(17)తో కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నర్సమ్మ కుమారుడు వడ్ల పాండు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సదానాగరాజు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితులకు పై శిక్ష విధించింది. జరిమాన చెల్లించడంలో విఫలమైతే ఒక సంవత్సరం సాధారణ శిక్షతో పాటు రూ. 500 జరిమాన చెల్లించాలని న్యాయమూర్తి సుదర్శన్ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన చిరాగ్పల్లి, జహీరాబాద్ పోలీసులను ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు. -
భార్యను 17సార్లు కత్తితో పొడిచి, కారుతో తొక్కించి..
వాషింగ్టన్: భార్యను దారుణంగా చంపిన కేరళ వాసికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ, మెరిన్ జోయ్(26) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. జోయ్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. విభేదాల కారణంగా భార్య తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాథ్యూ అక్కసుతో ఉన్నాడు. 2020లో ఆమె కారును అడ్డగించి, కత్తితో 17సార్లు పొడిచాడు. ఆపై కారుతో ఆమెను తొక్కుకుంటూ తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. అక్కడ తన స్నేహితులతో భార్యను కారుతో తొక్కుకుంటూ వచ్చిన విషయాన్ని తెలిపాడు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మెరిన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త అమానుషత్వంపై అధికారులకు వాంగ్మూలమిచ్చింది. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. దీంతో, పోలీసులు మా«థ్యూను అదుపులోకి తీసుకున్నారు. -
ఏలూరు యాసిడ్ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. దాడి జరిగిందిలా.. మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు. గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్‌కు, ఆ తరువాత మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్ 21న మృతి చెందింది. సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్ïÙట్ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్‌కుమార్ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శ్రీవాణిబాయ్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ దుర్గాప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
బాబుపై ఉన్నవి తీవ్ర ఆరోపణలు.. పదేళ్ల జైలు ఖాయం!
ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో, టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..? ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. ఈ కేసులో నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్‌ను విచారించే అవకాశం ఉందా? ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు సైతం లోకేశ్ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా? చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్ ఇన్వాయిస్లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..? ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్‌లో చార్జిషీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్‌కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా? గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు..ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు. తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్ 153 సీ, సెక్షన్ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్డిక్షన్ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..? గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్‌గా రాదు. అక్కడ జ్యుడీషియల్ పవర్స్ ఉండే జ్యుడీషియల్ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్‌లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్ పవర్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో సీరియస్ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్వాయిస్లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్‌కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా.. నా పీఎస్‌ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్ శ్రీనివాస్ ద్వారా తమను వేధించడంతోనే డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి. డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్‌లో పేమెంట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది. -ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్ రాంబాబు -
CBN IT Notices: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు!
సాక్షి, హైదరాబాద్ : ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో, టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..? ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. ఈ కేసులో నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్‌ను విచారించే అవకాశం ఉందా? ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు సైతం లోకేశ్ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా? చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్ ఇన్వాయిస్లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..? ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్‌లో చార్జిషీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్‌కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా? గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు.. ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు. తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్స్టాన్సియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్ 153 సీ, సెక్షన్ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్డిక్షన్ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..? గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్‌గా రాదు. అక్కడ జ్యుడీషియల్ పవర్స్ ఉండే జ్యుడీషియల్ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్‌లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్ పవర్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో సీరియస్ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్వాయిస్లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్‌కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా.. నా పీఎస్‌ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్ శ్రీనివాస్ ద్వారా తమను వేధించడంతోనే డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి. డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్‌లో పేమెంట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది. :::ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్ రాంబాబు -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
విజయవాడ స్పోర్ట్స్: దివ్యాంగ బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు (జీ వి త ఖైదు) జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సీవీఆర్ ఫ్లై ఓవర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తా ను పని చేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకువెళ్లింది. ఆమె పని చేస్తుండగా, కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు. కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెదుకుతుండగా, సమీపంలోనే ఓ షాపు వెనుక ముళ్లపొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతుండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడి నది డ్రైవర్ రమేష్ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్ విజయవాడ వన్‌టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీ సు విచారణలో తేలింది. దిశా ఏసీపీ వీవీ నాయు డు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు. దిశా, సీఎంఎస్ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితు రాలి తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్ కు మరణించే వరకు జైలు శిక్షతోపాటు రూ.30 వేలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమా నా రూ.30వేలు, మరో రూ. 50వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించేలా ట్రయిల్ నిర్వహించిన పోలీసులను సీపీ టీకే రాణా అభినందించారు. -
జంట హత్యల కేసు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1995లో జరిగిన జంట హత్యల కేసుల్లో లోక్‌సభ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్(70)కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసును గతంలో ఎన్నడూ చూడలేదన్న ధర్మాసనం.. ఈ కేసులో నిందితుడు ప్రభునాథ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేందుకు ప్రభునాథ్ సింగ్ ప్రయత్నాలు చేశాడని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవ్యవస్థ తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయంది. ఇద్దరి హత్యతోపాటు మరో మహిళపై హత్యాయత్నం కేసుల్లో ఆగస్ట్ 18వ తేదీన ప్రభునాథ్ సింగ్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించింది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ కారులో వచ్చిన సింగ్ ఆరా తీశాడు. వేరే పార్టీకి ఓటేశామంటూ రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ మరికొందరు సమాధానమిచ్చారు. ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న రైఫిల్‌తో వారిపైకి కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై చప్రా పోలీస్‌స్టేషన్‌లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ సొంతింట్లో హత్యకు గురైన కేసులో సింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో ఉన్నాడు. -
బావను చంపిన మరదలికి జీవితఖైదు
జగిత్యాలక్రైం: తన సోదరితో కలిసి భర్తను హత్య చేసి బావిలో పడేసిన కేసులో భార్యతోపాటు ఆమె సోదరికి కోర్టు జీవితఖైదు విధించింది. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున జరిమానా విధించింది. ఈమేరకు జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన గుంటి గంగమల్లయ్య(52) మొదటి భార్య మృతి చెందడంతో రెండోభార్య దేవను వివాహం చేసుకున్నాడు. ఆమెకు మనోజ్ (12) కుమారుడు సంతానం. ఆస్తికోసం దేవ తన భర్తతో పలుమార్లు గొడవ పడింది. ఆస్తి పంచివ్వడం లేదని ఆగ్రహం పెంచుకుంది. ఈక్రమంలో 2018 మార్చి 13న గంగమల్లయ్య సోదరి గ్రామం కథలాపూర్ మండలం తక్కళ్లపల్లిలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈక్రమంలో గ్రామ శివారులోరెండో భార్య దేవతోపాటు, ఆమె చెల్లెలు ఆదె రజిత కలిసి గంగమల్లయ్య తలపై సుత్తెతో కొట్టి చంపేశారు. మృతదేహం కాళ్లు, చేతులను చీరతో కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు. అయితే, మృతుడి మొదటి భార్య కుమారుడు గుంటి గంగమహేందర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సతీశ్‌చందర్‌రావు పలువురు సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు, రూ.6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..?
లండన్: వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఎఫ్ఆర్ఓ హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు మడకం తుల, పొడియం నాగకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. జీవితఖైదుతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఏడు నెలల్లోపే ఈ విచారణ పూర్తి చేసి శిక్ష విధించడం గమనార్హం. ఏం జరిగిందంటే... జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ పరిధి ఎర్రబోడులో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆ భూములను అటవీ అధికారులు స్వా«దీనం చేసుకుని ప్లాంటేషన్ చేశారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 22న గొత్తికోయలు ఆ భూముల్లో పశువులు మేపుతుండగా ప్లాంటేషన్ వాచర్ భూక్యా రాములు, బేస్ వాచర్ ప్రసాద్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని వారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దృష్టికి తేగా ఆయన రావికంపాడు సెక్షన్ అధికారి తేజావత్ రామారావుతో అక్కడికి వెళ్లారు. ఈ భూముల్లో పశువులు మేపొద్దని చెబుతూ.. వీడియో తీస్తుండగా గొత్తికోయలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మడకం తుల, పొడియం నాగ వేట కొడవళ్లతో ఎఫ్ఆర్ఓ మెడపై నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఖమ్మం తరలిస్తుండగానే మృతిచెందారు. ఈ ఘటనపై నాటి చండ్రుగొండ ఎస్ఐ విజయలక్ష్మి, సీఐ వసంత్‌కుమార్ కేసు నమోదు చేయగా, 24 మంది సాక్షులను విచారించిన జడ్జి.. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, అటవీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కీచక మారుతండ్రికి రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ఓ మారుతండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలు స్తూ రెండు జీవితఖైదులు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్రావు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అక్కడ భర్తను విడిచిపెట్టి ఐదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న ఓ మహిళ పరిచ యం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వారు వివాహం చేసుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో ఓ వ్యవసాయదారుని వద్ద జీతానికి పనిచేస్తున్నారు. అయితే గతేడాది పెద్ద బాలి క కాలికి గాయం కావడంతో గోవింద్రావు 2022 అక్టోబర్ 20న అదే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం బాలికను నేరుగా ఇంటికి తీసుకురాకుండా మెంట్రాజ్‌పల్లి వెళ్లే దారిలోని పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిన బాలిక అపస్మారకస్థితిలో ఉండటంతో ఏం జరిగిందో చెప్పాలని బాలిక తల్లి నిలదీసింది. దీంతో గోవింద్రావు అసలు విషయం చెప్పడంతో బాలికను తల్లి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి న నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. న్యాయ విచారణలో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల కింద గోవింద్రావుపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ అత్యాచారం నేరానికిగాను జీవిత ఖైదు, దాడి చేసి బాధితురాలి మృతికి కారణమైనందున హత్యా నేరానికిగాను మరో జీవితఖైదును జడ్జి విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తీర్పులో సూచించారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు
లక్నో: ముప్పై ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ నేత సోదరుడి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్– రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్ట్ 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటిగేటు వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీశ్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతోపాటు రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు లాయర్ ఒకరు చెప్పారు. బందా జైలులో ఉన్న అన్సారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల్లో 61కి పైగా క్రిమినల్ కేసులను అన్సారీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆరు కేసుల్లో దోషిగా తేలింది. ఒక కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో ఘాజీపూర్ కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీలోని మౌసదర్ స్థానం నుంచి అయిదు పర్యాయాలు అన్సారీ ఎమ్మెల్యే అయ్యాడు. 2022 ఎన్నికల్లో ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. -
ఖైదీ హనీమూన్‌కి పెరోల్
శివాజీనగర: హత్య కేసులో జైలు శిక్షకు గురైన ఓ కోలారు జిల్లావాసికి కోర్టు జీవితఖైదు విధించడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఏప్రిల్ 5న కోర్టు ఆదేశంతో పెరోల్ (సెలవు) పొంది ఏప్రిల్ 11న పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీకి సెలవు ముగిసింది. అయితే ఆ సమయం చాలదని, హనీమూన్‌కి 60 రోజులు సెలవు కావాలని హైకోర్టులో పిటిషన్వేశాడు. జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ అర్జీని విచారించింది. అతనికి పెరోల్‌ను మంజూరు చేస్తూ షరతులను కూడా విధించింది. ప్రతి ఆదివారం ఒకసారి నేరం జరిగిన పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. -
టీడీపీ నేత వినోద్ జైన్‌కు జీవిత కాల శిక్ష.. బాలిక తాత, తల్లి స్పందన ఇదే..
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిచింది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది. వినోద్‌కుమార్ జైన్‌కు సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’తో బాలిక తాత మాచాలరావు, తల్లి మాధురి మాట్లాడారు. ‘‘ పాపకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ లోటస్ అపార్ట్మెంట్లో అడుగు పెట్టాం. టీడీపీ నేత వినోద్ జైన్ నా మనమరాల్ని అత్యంత దారుణంగా చిత్ర హింసలకు గురి చేశాడు. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో పాప అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల శిక్ష పడటం చాలా సంతోషంగా ఉంది. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించడు. చట్టం, న్యాయం గెలిచింది. పైనున్న పాప ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష ‘‘రాజకీయంగా ఉన్న పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వినోద్‌కుమార్ జైన్ ప్రయత్నించాడు. కేసులో త్వరగా ట్రయల్స్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. కేసులో వేగవంతమైన విచారణ జరిపినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సీఎం చొరవతోనే ఈ కేసు వేగంగా ముందుకు కదిలింది. నిందితుడికి శిక్ష పడాలని ర్యాలీలు చేసిన విద్యార్థులకు, స్థానికులకు, లాయర్లకు కృతజ్ఞతలు. నిందితుడికి శిక్ష పడాలని పోరాటం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు’’ అని వారు పేర్కొన్నారు. చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను -
టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష
సాక్షి, విజయవాడ: బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన వినోద్‌జైన్.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. స్పెషల్ పీపీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘‘లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు. సూసైడ్ నోట్లో వినోద్ జైన్ వేధింపులను బాలిక స్పష్టంగా రాసింది. రెండు పేజీల లేఖలో నిందితుడి అకృత్యాలను వెల్లడించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు.’’ అని పేర్కొన్నారు. చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను ‘‘2021 ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్‌గా వినోద్ జైన్ పోటీ చేసి ఓడిపోయారు.సమాజంలో పెద్ద మనిషిగా తిరుగుతూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.పోలీసులు కేసును ఛాలా సిరియస్ గా తీసుకున్నారు.సైన్టిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడికి శిక్ష పడింది’’ అని నాగిరెడ్డి అన్నారు. -
యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు జైలు శిక్ష
-
లైంగిక దాడి కేసు.. యువకుడికి జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 19, 20వ తేదీల్లో 22 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి కేసులో దారా శ్రీకాంత్ (ఏ–1) అనే యువకుడికి జీవిత ఖైదు.. రూ.7 వేల జరిమానా, చెన్నా బాబూరావు (ఏ–2), జరాంగుల పవన్ కళ్యాణ్ (ఏ–3) అనే యువకులకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఐ.శైలజాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ‘దిశ’ చొరవ కారణంగా సరిగ్గా ఏడాదిలోనే దోషులకు శిక్ష పడటం గమనార్హం. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో నిందితులు శ్రీకాంత్, బాబురావులు ఆస్పత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు. మూడో నిందితుడు పవన్‌కల్యాణ్.. బాబురావుకు స్నేహితుడు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాధిత యువతిని శ్రీకాంత్ ప్రేమించానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి 19వ తేదీ రాత్రి శ్రీకాంత్ పని చేసే ఆస్పత్రికి వచ్చింది. ఆ రాత్రి ఆస్పత్రిలోని ఓ గదిలో ఆ యువతిపై శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 20వ తేదీ ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన బాబురావు, పవన్కల్యాన్లు యువతిపై అత్యాచారం చేశారు. అయితే 19వ తేదీ రాత్రి తన కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని ఓ గదిలో యువతి ఉందన్న విషయం తెలుసుకుని ఆమె తల్లి, బంధువులు 20వ తేదీ రాత్రి 8 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో గదిలో యువతితో పాటు పవన్‌కల్యాణ్ ఉన్నాడు. వీరిని చూసి అతను అక్కడ నుంచి పారిపోవడంతో యువతిని ఇంటికి తీసుకెళ్లారు. 22వ తేదీన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చకచకా.. మెరుగైన దర్యాప్తు కోసం కేసును నున్న పోలీస్ స్టేషన్ నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బదిలీ చేశారు. ఏప్రిల్ 22వ తేదీనే కేసు నమోదు చేసి, అదే రోజు నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సెప్టెంబర్‌లో కేసు ట్రయిల్ ప్రారంభమైంది. విచారణ అధికారి, దిశ ఏసీపీ వి.వి.నాయుడు, ఎస్ఐ రేవతి, కోర్టు మానిటరింగ్‌సెల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో త్వరగా ట్రయిల్ పూర్తయింది. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. ఈ కేసులో 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. బాధితురాలి తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చద్రగిరి విష్ణువర్ధన్ కోర్టుకు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే కేసు త్వరగా ట్రయిల్ పూర్తి చేసుకుందని ఏపీపీ విష్ణువర్ధన్ తెలిపారు. దిశ పోలీసులు సమర్థవంతంగా తగిన సాక్ష్యాధారాలను సేకరించడంతో ఏడాదిలోనే తీర్పు వచ్చిందన్నారు. కాగా, అప్పట్లోనే బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కును అందజేయడంతో పాటు అన్ని విధాలా అండగా నిలిచింది. -
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
జీవీకే హంతకులకు యావజ్జీవం
నెల్లూరు(అర్బన్): గుడుగుంట విజయ్‌కుమార్.. డాక్టర్ జీవీకేగా జిల్లా ప్రజలకు సుపరిచితుడు. ఓ వైపు వైద్యుడిగా పేద ప్రజలకు సేవలందిస్తూనే మరో వైపు సామాజిక ఉద్యమాలు నడిపారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కన్వీనర్‌గా.. సారా వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్‌గా పనిచేశారు. అక్షరాస్యత ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మంచి వ్యక్తిగా ప్రజల్లో పేరు సంపాదించారు. అయితే కుటుంబసభ్యులే ఆయన పాలిట శాపంగా మారారు. ఆస్తి కోసం కట్టుకున్న భార్య, కన్న బిడ్డ కిరాయి హంతకులతో కలిసి సభ్య సమాజం తలదించుకునేలా ఆయన్ను హత్య చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి శుక్రవారం ఈ కేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం పలు కుటుంబాలను వీధులపాలు చేసింది. కాగా ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో ఒకే దఫా ఐదుగురికి యావజ్జీవ శిక్షలు పడిన సంఘటనల్లేవు. ప్రేమ ఏమైంది? డాక్టర్ విజయ్‌కుమార్, కావలికి చెందిన ఉషారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ విద్యావంతులే. మొదట్లో ఒకరికొకరు తోడు అన్న చందంగా ఉన్నారు. అనేక ఉద్యమాల్లో కలిసి చురుగ్గా పనిచేసిన వారే. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఒకరు సుందరయ్య, మరొకరు కుమార్తె లెనీనా. అయితే వారి మధ్య ఏమైందో కానీ అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. భార్యాభర్తలకు పొసగలేదు. బిడ్డలు చిన్న వయసులో ఉండగానే విజయ్‌కుమార్ తన తల్లితో కలిసి వేదాయపాళెంలో ఉండేవారు. భర్తపై ఉషారాణి పగ పెంచుకుంది. బిడ్డలు సైతం తండ్రిపై కోపంగా ఉండేలా చేసింది. నగదు పంపించినా.. పిల్లలు పెద్దవారయ్యారు. వారు తల్లి వద్దే ఉన్నప్పటికీ చదువులకు విజయ్‌కుమార్ నగదు పంపించేవారు. విజయ్‌కుమార్ రెడ్‌క్రాస్ కార్యాలయం పక్కన ఐదంతస్తుల అధునాతన హాస్పిటల్‌ను నిర్మించారు. రోగుల సంఖ్య పెరిగింది. సంపాదిస్తున్న సొమ్ముంతా తన కుటుంబానికి ఇవ్వడం లేదని భార్య లోలోపల రగిలిపోసాగింది. అప్పుడప్పుడు కుమారుడు తండ్రి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకునేవాడు. ప్రాణం మీదకు తెచ్చిన ఆస్తి పోలీసుల చార్జిషీట్ మేరకు విజయ్‌కుమార్ నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశ ఉషారాణికి కలిగింది. ఈ నేపథ్యంలో ఆమె తన బిడ్డను రెచ్చగొట్టింది. తండ్రి సంపాదించిన ఆస్తి వేరే వారికి ఖర్చు పెడుతున్నాడని అతడిలో విషం నింపింది. ఆస్తి దక్కాలంటే ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని నూరిపోసింది. భర్తను వదిలించుకోవాలన్న ఉషారాణికి కుమారుడు తోడయ్యాడు. ఈ క్రమంలో ఆమె తన మాట వినే న్యాయవాది కునిశెట్టి శ్రీధర్‌తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో న్యాయవాది కిరాయి హంతకులైన గంగరాజు, పోలురాజుతో కలిసి విజయ్‌కుమార్ హత్యకు పథకం వేశారు. 2015 సంవత్సరం మే 28 అర్ధరాత్రి తర్వాత వేదాయపాళెంలో విజయ్‌కుమార్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆయన నిద్రిస్తుండగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆర్థిక సంబంధాలుగా.. ఆధునిక సమాజంలో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని విజయ్‌కుమార్ హత్య ద్వారా మరోమారు నిరూపితమైంది. ఆస్తి కోసం హత్య చేసి తమ నిండు జీవితాలను జైలుపాలు చేసుకున్నారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయనేందుకు విజయ్‌కుమార్ వ్యవహారం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. బెడిసికొట్టిన ప్లాన్ విజయ్‌కుమార్‌ను హత్య చేసిన తర్వాత నిందితులంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత విజయ్‌కుమార్ మరణ వార్త అందరికీ తెలిసింది. ఉషారాణి ఏమీ తెలియనట్లు భర్త మృతదేహాన్ని బొల్లినేని ఆస్పత్రికి తరలించింది. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మరణించినట్లు పేర్కొనగా మృతదేహాన్ని బాలాజీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ఇంతలో విజయ్‌కుమార్ మిత్రులు కొంతమందితో కలిసి ఆత్మకూరుకు చెందిన న్యాయవాది శేషారెడ్డి అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించి మెడ వద్ద గొంతు నులిమినట్లు ఉండడంతో హత్యగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యగా తేలింది. పోలీసులు విచారించగా కట్టుకున్న భార్య, కన్న బిడ్డ, ఒక న్యాయవాది, మరో ఇద్దరు కిరాయి హంతకులు కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు చార్జిషీట్లు వేసి కోర్టులో దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది. ఈ కేసులో శిక్షపడిన నిందితుడు కునిశెట్టి శ్రీధర్ బార్ అసోసియేషన్ ప్రస్తుత కార్యదర్శిగా ఉన్నారు. -
కాకినాడ: ప్రేమోన్మాదికి జీవిత ఖైదు
సాక్షి, కాకినాడ జిల్లా: యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి కాకినాడ కోర్టు.. జీవిత ఖైదు, జరినామా విధించింది. కాకినాడ రూరల్ కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21)ను గుబ్బల వెంకట సూర్యనారాయణ కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 8న బైక్‌పై వస్తున్న దేవికను వెంబడించి కాండ్రేగుల-కూరాడ మార్గ మధ్యలో కత్తితో దాడి చేసి అతి కిరాతంగా హత్యకు పాల్పడ్డాడు. సీఎం జగన్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 138 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. దేవికా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. -
కాకినాడ : ప్రేమోన్మాదికి జీవిత ఖైదు
-
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
నేరానికి శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: నేరాల కట్టడితోపాటు నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయడానికి రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేసుల నమోదుతో సరిపెట్టకుండా నేరాన్ని రుజువు చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ‘కన్విక్షన్ బేస్ పోలీసింగ్’ విధానం మంచి ఫలితాలనిస్తోంది. ఈ విధానం కింద కేసుల నమోదుతోపాటు నేర నిరూపణ వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఇందుకోసం పోలీస్ స్టేషన్ స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) నుంచి జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ వరకు స్వీయ పర్యవేక్షణ (రివ్యూ) బాధ్యతలు అప్పగించారు. వీటిలో బాలికలు, మహిళలపై జరిగిన నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఏడాది జూన్ నుంచి అమలులోకి తెచ్చిన ఈ విధానంతో కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా 90 పోక్సో కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగారు. ఇందులో 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం ఓ రికార్డు. మరొక నేరస్తుడికి చనిపోయే వరకు శిక్ష విధించగా, 11 మందికి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు శిక్షలు, తొమ్మిది మందికి 10 నుంచి 15 ఏళ్లలోపు శిక్షలు పడ్డాయి. పోలీసు శాఖలో సమూల మార్పులు గతంలో కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా నేరాల విచారణ జరిగేది. దీనివల్ల కేసుల దర్యాప్తు, సాక్ష్యాల నమోదు తదితర విషయాల్లో తీవ్ర జాప్యం జరిగేది. అతి తక్కువ కేసుల్లోనే శిక్షలు పడేవి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నిరూపణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో సమూల మార్పులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని తెచ్చారు. దీని కింద రోజువారీగా కేసుల నమోదుతోపాటు దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాయిదాలు, సాక్ష్యాలను ప్రవేశపెట్టడం, నేర నిరూపణకు చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ పక్కా కార్యాచరణ చేపట్టింది. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ అయిదు ప్రధాన కేసులను రోజువారీగా స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో కేసు విచారణ పురోగతిని సమీక్షిస్తున్నారు. నేరస్తులు తప్పించుకోకుండా చేయడంతోపాటు బలమైన సాక్ష్యాలను పెట్టడం, సాక్షులకు రక్షణపై దృష్టి పెట్టారు. తద్వారా త్వరితగతిన నేర నిరూపణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి. నేర నిరూపణకు ప్రాధాన్యం రాష్ట్రంలో కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకు ప్రత్యేక దృష్టి సారించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పక్కా కార్యాచరణ చేపట్టాం. ప్రధానంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో శిక్షలు పడేలా దృష్టి పెట్టాం. గతంలో ‘కోర్టు మానిటరింగ్ సిస్టం’తో కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికే పరిమితమయ్యేవారు. దీని వల్ల శిక్షల శాతం పెరగలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ సిస్టమ్‌ను ప్రక్షాళన చేసి కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్‌లో సమూల మార్పులు తెస్తున్నాం. నేరం జరిగితే కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు వేసి బాధ్యత తీరిందని సరిపెట్టుకోకుండా నేర నిరూపణ వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించేలా చేశాం. దీనిపై రోజువారీగా జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిచడంతో ఆరు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
యువతిని కిడ్నాప్ చేసి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి..
గుంటూరు లీగల్: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాలు.. బాపట్ల మండలంలోని పూండ్లలో ఒకే ఇంటిలో ఉత్తరం వైపు పోర్షన్లో బాధితురాలి కుటుంబం, దక్షిణం వైపు పోర్షన్లో నిందితుడి కుటుంబం నివాసం ఉంటున్నారు. బాధితురాలు కాలేజికి వెళ్లి వచ్చే సమయంలో నిందితుడి ఆమెను రోజూ అనుసరించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. బాధితురాలిని కూడా తనను ప్రేమించమని బెదిరించాడు. వేధింపుల విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నేపథ్యంలో నిందితుడు, బాధితురాలి తల్లిదండ్రులకు మధ్య వివాదం జరిగింది. దీంతో తల్లిదండ్రులు కూతురిని నూజివీడులోని బంధువుల ఇంటికి పంపారు. పెళ్లి సంబంధం కుదుర్చుకుని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో నిందితుడి ఆమెపై అసత్య ప్రచారం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో బాధితురాలు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు గుంటూరులో హాస్టల్లో చేరింది. 2014 ఆగస్టు 11న సొంతూరు వెళ్లింది. రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు బాపట్ల రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ ట్విస్ట్.. బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి.. పోలీసులు విచారణ అనంతరం కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. నిందితుడు చండిక శ్రీనివాస్ వర్మపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. రూ.15 వేలు బాధితురాలికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామలా కేసు వాదించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే?
చిత్తూరు అర్బన్: భార్యను హత్య చేసిన కేసులో నగరికి చెందిన శరవణ (26)కు జీవితఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి శాంతి గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల కథనం మేరకు.. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో ఉంటున్న పులివర్తి నాని ఇంట్లో నగరి ప్రాంతంలోని నెత్తంకు చెందిన శరవణ సెక్యూరిటీ, వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు. 2017లో లక్ష్మీనగర్ కాలనీకు చెందిన సత్యను శరవణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బిడ్డ పుట్టి, అనారోగ్యంతో కొన్నాళ్లకే చనిపోయింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శరవణ నిత్యం ఆమెను హింసించేవాడు. 2019 జనవరిలో తన అక్క ఊరికి వెళదామని సత్యను తీసుకుని శరవణ పిచ్చాటూరు మండలం వెంగళత్తూరుకు వెళ్లాడు. జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్క ఇంట్లోని బాత్రూమ్లో సత్యను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. దీనిపై మృతురాలి తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిచ్చాటూరు పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను, కేసు దర్యాప్తు అధికారులను విచారించిన అనంతరం శరవణకు జీవితఖైదు, రూ.1500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...! -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్ సాయిబాబాకు భారీ షాక్ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషి(సాయిబాబా) మీద నమోదు అయిన అభియోగాలు.. సమాజం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. శనివారం ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్.. ఆయన జీవితఖైదును కొట్టేస్తూ తక్షణమే విడుదల చేయాలంటూ మహారాష్ట్ర హోం శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై స్టే విధించాలంటూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. దీంతో.. ఈ వ్యవహారంపై మరో అత్యవసర అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో.. శనివారం మహారాష్ట్ర పిటిషన్‌పై ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. బాంబే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దోషి విడుదల ఆదేశాలు ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కొన్ని కీలక విషయాలను విస్మరించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వైద్యపరమైన కారణాల దృష్ట్యా గృహనిర్భంధం కోసం సాయిబాబా చేసుకున్న అభ్యర్థనను సైతం.. నేర తీవ్రత దృష్ట్యా తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. సాయిబాబాతో పాటు సహ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. విడుదలపై స్టే ఇస్తూ.. రికార్డుల్లోని సాక్ష్యాలను సవివరంగా విశ్లేషించిన తర్వాత నిందితులు దోషులుగా నిర్ధారించబడినందున.. బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 390 కింద అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. వీల్ చైర్‌కి పరిమితమైన ఈ మాజీ ప్రొఫెసర్.. మావోయిస్టులతో సంబంధాల కేసులో 2014 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జీవిత ఖైదు పడడంతో.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా సుప్రీం కోర్టు స్టే నేపథ్యంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
162 మంది ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ఆరిలోవ (విశాఖ తూర్పు)/కడప అర్బన్/బుక్కరాయసముద్రం/ఒంగోలు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి పలువురు ఖైదీలు సోమవారం విడుదలయ్యారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, ఒంగోలు కారాగారాల నుంచి 162 మంది విడుదలై స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. విడుదలైన వారిని వారి బంధువులు సంతోషంగా తమవెంట తీసుకెళ్లారు. వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. వీరిలో 175 మంది జీవితఖైదీలు, 20 మంది ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ఈ 195 మందిలో 13 మంది మహిళలున్నారు. కొన్ని కారణాలవల్ల కొందరు సోమవారం విడుదల కాలేదు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 66 మంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 66 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 48 మంది జీవితఖైదు పడినవారు, ఏడుగురు పదేళ్లలోపు శిక్ష పడినవారు ఉన్నారు. ఇక్కడి మహిళా జైలు నుంచి 11 మంది విడుదలకు అర్హులు కాగా.. ఎనిమిది మంది విడుదలయ్యారు. ఒకరు ముందే బెయిల్‌పై విడుదలకాగా, ఇద్దరిని విశాఖపట్నం జైలుకు మార్చడంతో అక్కడ నుంచి విడుదలయ్యారు. వీరందరికీ జీయర్ ట్రస్ట్ వారు దుస్తులు, న్యాయవాది రవితేజ స్వీట్‌బాక్సులు పంచారు. ► విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి 41 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారిలో 34 మంది జీవిత ఖైదీలు, ఏడుగురు ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ► వైఎస్సార్ జిల్లా కడప కేంద్ర కారాగారం నుంచి 33 మంది విడుదలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. విడుదలైన ఖైదీలను వారి బంధువులు టెంకాయలు, హారతితో దిష్టితీసి తమవెంట తీసుకెళ్లారు. ► అనంతపురం జిల్లాలో 15 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇక్కడి రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 14 మంది ఖైదీలను, జిల్లా జైలు నుంచి ఒకరిని ప్రభుత్వం విడుదల చేసింది. ► ఒంగోలు జిల్లా జైలు నుంచి ఏడుగురు జీవితఖైదీలు విడుదలయ్యారు. -
పోక్సో కేసులో దోషికి యావజ్జీవ ఖైదు, జరిమానా
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2018లో బాలిక (13)పై లైంగికదాడి చేసిన నేరానికి ఆరెం చెన్నయ్య (40)కు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలులోని పోక్సోకోర్టు ప్రత్యేక జడ్జి సోమశేఖర్ మంగళవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో ఇంటివద్దనున్న ఆ బాలికను చెన్నయ్య బలవంతంగా సమీపంలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఇంటి యజమాని రావడం, బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నయ్యపై పోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో చెన్నయ్యకు జీవితకాలం జైలుశిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలు మైనర్ కావడంతో ఆమెకు వైద్యఖర్చులు, పునరావాసం కోసం రూ.5 లక్షలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సూచించారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి వాదించారు. -
హత్య కేసులో నిందితునికి జీవితఖైదు
విశాఖ లీగల్: యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ నగరంలోని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి లాలం శ్రీధర్ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పడాల నాగరాజు(42) ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చట్టుబంద గ్రామానికి చెందిన వాడు. వృత్తి వ్యవసాయం. మృతుడు కె.మల్లేశ్వరరావు (28) కూడా అదే గ్రామానికి చెందినవాడు. నేరం జరగడానికి 6 నెలల ముందు నాగరాజు కూలి పనుల నిమిత్తం చెన్నై వెళ్లాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రేడియో, ఇంట్లోని కొన్ని వస్తువులు కనిపించలేదు. వాటిని మల్లేశ్వరరావు దొంగలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. 2015 జూన్ 3న రాత్రి మల్లేశ్వరరావు లోతభీమయ్యకు చెందిన జీడి మామిడితోటలోని పూరిపాకలో నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా నాగరాజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద కర్రతో మల్లేశ్వరరావుపై దాడి చేసి తల, భుజం, ముక్కుపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న మల్లేశ్వరరావును అతని బంధువులు నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 4న మరణించాడు. మృతుని తండ్రి కొయ్యూరి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీస్ ఇన్స్పెక్టర్ జి.సోమశేఖర్, నర్సీపట్నం ఉప పోలీస్ సూపరింటెండెంట్ బి.సత్య ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యా నేరంతోపాటు, గిరిజన చట్టం 3(2)(5) కింద కూడా నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి రెండు నేరాల్లో యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అయితే 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. (చదవండి: ఇక బంద్! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం) -
యాసిన్ మాలిక్ తీర్పుపై విమర్శా?.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్‌కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు. చదవండి: Yasin Malik: యాసిన్‌కు మరణశిక్ష ఎందుకు వేయలేదు! -
Terror Funding Case: యాసిన్ మాలిక్‌కు యావజ్జీవం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56)కు పటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మాలిక్ ఇటీవలే తన నేరాన్ని అంగీకరించడం తెలిసిందే. అతనికి మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద మాలిక్‌పై కేసులు నమోదయ్యాయి. అతనికి యావజ్జీవంతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ రూ.11 లక్షల జరిమానా కూడా విధించారు. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ మాలిక్‌పై ఎన్ఐఏ తొలి కేసు నమోదు చేసింది. కోర్టును మాలిక్ క్షమాభిక్ష కోరలేదని అతని లాయర్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే ఉరి తీయండనే కోరాడన్నారు. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పీఓకేలో శిక్షణ.. భారత్‌లో ధ్వంస రచన నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ 1966 ఏప్రిల్ 3న శ్రీనగర్‌లోని మైసుమాలో పుట్టాడు. 1980ల నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశాడు. 1988లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆయుధాల వాడకం, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. జేకేఎల్‌ఎఫ్‌లో చేరి చురుగ్గా పనిచేశాడు. 1990 ఆగస్టులో ఎన్కౌంటర్లో పోలీసులకు దొరికిపోయాడు. 1994 మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు. కశ్మీర్ విముక్తికి శాంతియుత ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించాడు. జేకేఎల్ఎఫ్ చైర్మన్‌గా ఎదిగాడు. కొన్నాళ్లు హురియత్ కాన్ఫరెన్స్‌లోనూ çపనిచేశాడు. కశ్మీర్లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ 1999లో ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టయ్యాడు. 2002లో విడుదలయ్యాడు. 2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ములిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పదేళ్ల కుమార్తె రజియా ఉంది. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి పాకిస్తాన్లో నివసిస్తోంది. యాసిన్ మాలిక్ 2013 ఫిబ్రవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌తో కలిసి వేదిక పంచుకున్నాడు. 2017 నాటి టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో మాలిక్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్‌లో హింసాకాండకు సంబంధించి అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్‌ను 1989లో కిడ్నాప్ చేసిన కేసులో కూడా విచారణను ఎదుర్కొన్నాడు. 1990లో శ్రీనగర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. -
విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): విదేశీ పర్యటనకు వచ్చిన వనితపై లైంగిక దాడికి యత్నించిన మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్‌అబీద్‌లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సుమ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. లిథువేనియా దేశానికి చెందిన ఓ విదేశీ వనిత శ్రీలంకకు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 7న చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్ దిగి పొమ్మన్నారు. బస్సులో ఉన్న సాయికుమార్ గమనించి ఆమెకు నగదు సాయం చేసి బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను బద్దవోలు వెంకన్నపాలెంలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తన స్నేహితుడు అబీద్‌తో కలిసి విదేశీ వనితను సైదాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి యత్నించారు. ఆమె తప్పించుకుని రోడ్డుపై వెళ్తున్న స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించి కేసును దిశ పోలీసులకు అప్పగించారు. విదేశీ వనిత కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసింది. దర్యాప్తు అనంతరం 10 రోజుల్లో కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేసింది. కేసుపై ప్రత్యేక దృష్టి సారించి 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాధుప్రసాద్ కేసు వాదించారు. జిల్లాలో అతి తక్కువ రోజుల్లో కేసు విచారణ చేసి తీర్పు వెలువరించడం గమనార్హం. -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష
భువనేశ్వర్: బ్రజ్‌రాజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. రెండేళ్ల క్రితం తల్లీ, బిడ్డలపై ఓ మోటార్ వాహనం ఎక్కించి, వారిని అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటనలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మాజీ ఎమ్మెల్యేని దోషిగా పరిగణిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇదే కేసులో డ్రైవర్ వర్ధన్ టోప్నోని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించి, విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. 2000లో యువతి కల్పన దాస్‌కి బీహార్‌కి చెందిన సునీల్ శ్రీవాస్తవ్‌తోతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా, అనివార్య కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కల్పన దాస్‌తో మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెతో అక్రమ సంబంధం ఏర్పడి, అది బలపడింది. కొన్నాళ్లకు ఆమె తనని పెళ్లి చేసుకుని, ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరడంతో తల్లీపిల్లలను చంపాలని అనుప్ సాయె భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంటానని, ఆమెని నమ్మించాడు. తల్లీబిడ్డలను తీసుకుని, హమిర్పూర్ అడవులకు వెళ్లాడు. అక్కడ వారిపై నుంచి ఓ వాహనం ఎక్కించి, దారుణంగా చంపేశారు. 2016 మే 7వ తేదీన ఈ ఘటనపై చక్రధర నగర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరి 12వ తేదీన మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్ -
ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు
వరంగల్: రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువతి హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడికి బుధవారం జిల్లా కోర్టు జీవిత ఖైదీగా శిక్ష విధించింది. సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధాదేవి తీర్పును వెలువరించారు. కాజిపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహీద్ లష్కర్, సింగారంకు చెందిన మునిగాల హారతి హనుమకొండలోని ఓ కళాశాలలో 2016లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివారు. ఆసమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొంత కాలం ప్రేమ సాఫీగానే సాగింది. షాహిద్ డిగ్రీ ఫెయిలయ్యాడు. కాజీపేటలోని తన తండ్రికి చెందిన మటన్ షాపులో చేదోడుగా ఉండేవాడు. హారతిని కలిసేందుకు ఆమె అక్క నివాసం ఉంటున్న హనుమకొండలోని రాంనగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో షాహిద్‌తో హారతి సన్నిహితంగా ఉండడం లేదని, వేరే యువకుడితో సాన్నిహిత్యంగా ఉంటోందనే నెపంతో హారతిని హత్య చేసేందుకు షాహిద్ ప్రణాళిక రూపొందించుకున్నాడు. 2020 జనవరి 10న షాహిద్ తన గదికి రమ్మని హారతిని పిలిచాడు. ఆమె రాగానే.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షాహిద్ హారతిపై అత్యాచారం చేసి కత్తితో గొంతుకోశాడు. కాజీపేట, విష్ణుపురి కాలనీలోని తన ఇంటికెళ్లి రక్తం అంటిన దుస్తులను మార్చుకున్నాడు. సుబేదారి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షులను విచారించి నిందితున్ని జైలుకు పంపించారు. అధికారులకు అభినందనలు బాధితురాలు తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.అజయ్‌కుమార్ 29 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధ దేవి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డిని, కోర్టు కానిస్టేబుల్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్‌కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్దార్, ప్రాసెస్ హోంగార్డు శ్రీధర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
కుక్కను చంపాడని మనిషిని చంపారు
పటాన్చెరు టౌన్: భర్తను హత్య చేసి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రెండవ అడిషన ల్ కోర్టు ముగ్గురికి జీవితఖైదు విధించింది. ఒక్కొ క్కరు రూ.5 వేల జరిమానా చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2014లో పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రామచంద్రా పురానికి చెందిన ఉప్పు ప్రశాంత్ రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసం ఉండేవాడు. ప్రశాంత్ ఇంటి పక్కనే శ్రీనివాస్ నివాసం ఉండేవాడు. కాగా ప్రశాంత్ ఒక కుక్కను పెంచుకున్నాడు. అది శ్రీనివాస్ ఇంటికి వెళ్లడంతో.. వాళ్లు కొట్టి చంపారు. దీంతో ప్రశాంత్, శ్రీనివాస్‌ల మధ్య గొడవ జరిగిం ది. దీంతో బొంబాయి కాలనీకి చెందిన మ్యాతరి ప్రకాష్, నక్కోల వినోద్‌లతో కలసి 2014 జూలైలో శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశాడు. ఘటనలో శ్రీని వాస్ చనిపోగా, అతడి భార్య రేణుక గాయపడింది. హత్య, హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశా రు. అప్పటినుంచి కేసుకు సంబంధించిన వాదన లు కోర్టులో నడుస్తున్నాయి. శుక్రవారం అడిషనల్ పీపీ మహ్మద్ మహబూబ్ వాదనలు విన్న జిల్లా రెండవ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి అనిత నిందితులకు జీవితఖైదు విధించారు. -
అత్యాచారం కేసులో... ఒకే రోజులో తీర్పు
అరారియా: అత్యాచార బాధితులకి న్యాయం జరగాలంటే కోర్టుల్లో ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే రోజులు ఇక ముందు ఉండవని ఆశ కలిగేలా బిహార్ కోర్టు మెరుపువేగంతో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి పోక్సో కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బిహార్‌లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు. బాధితురాలి భవిష్య™Œ కోసం పరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది. జూలై 22న ఈ అత్యాచార ఘటన జరగ్గా, ఆ మర్నాడు ఎఫ్ఐఆర్ దాఖలైంది. అరారియా మహిళా పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేప్ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల యాదవ్ తెలిపారు. 2018 ఆగస్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కోర్టు ఒక అత్యాచారం కేసులో మూడు రోజుల్లో తీర్పు ఇచ్చి రికార్డుకెక్కిందని ఇప్పుడు బిహార్ కోర్టు దానిని తిరగరాసిందన్నారు. -
జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సిందే
ముంబై: ‘మరణశిక్ష అనేది దోషులకు పశ్చాత్తాపం నుంచి వెంటనే విముక్తి పొందేలా చేస్తుంది. జీవితఖైదు విధిస్తేనే వారు జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోతారు’ అంటూ సామూ హిక అత్యాచార కేసు దోషుల మరణశిక్ష నుంచి జీవితఖైదుకు తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘ రేప్ అనేది అత్యంత హేయమైన చర్య. బాధితురాలు శారీరకంగానే కాదు మానసికం గానూ అత్యంత వేదనకు గురవుతారు. మహిళ గౌరవాన్ని కించపరుస్తూ, అత్యంత తీవ్రస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిన ఈ దోషులెవరూ జీవితకాలంలో ఎన్నడూ సమాజంలోకి తిరిగి వెళ్లలేరు. జీవితాంతం తమ ఘోరమైన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షే సరైంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్ట్ 22న సెంట్రల్ ముంబైలోని నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై ఐదుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఐదుగురుకీ మరణశిక్ష విధిస్తూ ఏడేళ్ల క్రితమే ట్రయల్ కోర్టు శిక్ష ఖరారుచేసింది. వీరిలో విజయ్ జాధవ్, మొహమ్మద్ ఖాసిం బెంగాలీ షేక్, మొహమ్మద్ అన్సారీ మరణశిక్షను సవాల్ చేస్తూ 2014 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ సాధనా జాధవ్, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌ల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ‘ దోషులకు మరణశిక్ష సరిపోదు. అంతకు మించిన శిక్ష విధించాలి. జీవితాంతం వీరు పశ్చాత్తాపంతో కుంగిపోవాలనే ఉద్దేశంతోనే, కింది కోర్టు ఖరారుచేసిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ‘ ఏ నేరానికి ఏ శిక్ష అనే విధానంలో.. ఇలాంటి దారుణమైన ఘటనల్లో మరణశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించాలనే ఒక నియమంగా పెట్టాలి’ అని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ‘సంచలనం రేపిన ఈ కేసులో ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు చెప్పడం కుదరదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం
అనంతపురం లీగల్/ పెద్దవడుగూరు: వివాహితపై అత్యాచారం కేసులో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ అనే యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై 2014 జూన్ రెండో తేదీన ముప్పాలగుత్తి వైపు వస్తున్నారు. అదే సమయంలో కదరగుట్టపల్లికి చెందిన మహిళ పశువులకు గడ్డి కోసం పొలంలోకి వెళ్తుండగా అటకాయించారు. ఆమెను సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. జరిగిన ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను బయట పెడతామని బెదిరించి.. అక్కడి నుంచి ఉడాయించారు. వీడియో వైరల్‌తో వెలుగులోకి.. అత్యాచార వీడియోను ఆ యువకులు నల్లబోతుల శివకృష్ణ మూర్తి, బోయ రామాంజనేయులుకు పంపారు. అలా ఒకరి నుంచి ఒకరికి వీడియో వెళ్లి.. విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 07–06–2014న ఐదుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు మేజిస్ట్రేట్ ఆదేశించారు. 14–07–2014న మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్తుండగా చూసిన సాక్షులు, బాధితురాలు ఏడుస్తూ తిరిగొస్తుండగా చూసిన వారి సాక్ష్యాలతో కేసు బలపడింది. నిందితుల మొబైల్ ఫోన్లలోని వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన చోట ఆధారాలను సేకరించారు. కేసు విచారణలో ఉండగానే నల్లబోతుల శివకృష్ణమూర్తి అలియాస్ రామకృష్ణ, బోయ రామాంజనేయులు అలియాస్ రాంబాబు అనారోగ్యంతో చనిపోయారు. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌లకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.సునీత మంగళవారం తీర్పు చెప్పారు. ముద్దాయిలు చెల్లించే జరిమానా మొత్తం బాధితురాలికి చెందాలని తీర్పులో పేర్కొన్నారు. -
డేరా బాబాకు జీవిత ఖైదు
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో అదే సంస్థ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రామ్ రహీమ్ సింగ్, కృషాన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్‌దిల్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ హెచ్.పి.ఎస్.వర్మ తెలిపారు. రామ్ రహీమ్ సింగ్‌కు రూ.31 లక్షలు, సబ్‌దిల్‌కు రూ.1.50 లక్షలు, జస్బీర్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, కృషాన్లాల్కు రూ.1.25 లక్షలు, అవతార్ సింగ్‌కు రూ.75 వేల జరిమానా న్యాయస్థానం విధించింది. దోషుల నుంచి జరిమానా సొమ్ము వసూలు చేసి, బాధిత కుటుంబానికి అందజేయాలని అధికారులను ఆదేశించింది. రామ్ రహీమ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న డేరా సచ్ఛా సౌదా అనుచరుడైన రంజిత్ సింగ్ అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేశాడు. హరియాణా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియాన్ గ్రామంలో 2002 జూలై 10న రంజిత్ సింగ్‌కు కాల్చి చంపారు. డేరా సచ్ఛా సౌదా ప్రధాన ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వివరిస్తూ ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉందన్న అనుమానంతో అతడిని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. రంజిత్ సింగ్‌ను అంతం చేసేందుకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కుట్ర పన్నినట్లు సీబీఐ తన చార్జిషీట్లో వెల్లడించింది. డేరా బాబా ప్రస్తుతం సునారియా జైలులో ఉన్నాడు. -
ప్రాణ స్నేహితురాలి హత్య.. ఇరవై ఏళ్లకు పాపం పండింది
American Tycoon Robert Durst Conviction: ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్ వ్యాపారదిగ్గజం రాబర్ట్ ఎలన్ డర్స్ట్కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. చివరకు ఇప్పుడు డర్స్ట్ పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడు. స్నేహితురాలు సుసాన్ బర్మన్తో సహా ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోవడం(మిస్సింగ్.. హత్య చేశాడనే ఆరోపణలు) వెనుక రాబర్ట్ ప్రమేయం ఉందని లాస్ ఏంజెల్స్ న్యాయస్థానం బలంగా నమ్మింది. పెరోల్‌కు కూడా ఆస్కారం లేకుండా తక్షణ శిక్షను అమలు చేసింది. అమెరికన్ రియల్ ఎస్టేట్ దిగ్గజం రాబర్ట్ డర్స్ట్కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. హెబీవో డాక్యుమెంటరీ ‘ది జింక్స్’ ద్వారా ఆయన జీవితం ప్రపంచానికి పరిచయమే!. ఈ డాక్యుమెంటరీలో ఆయన విలాసవంతమైన జీవితం, హత్యలు, ఆరోపణల ప్రస్తావన ఉంది. 2000 సంవత్సరంలో ప్రాణ స్నేహితురాలు సుసాన్ బర్మన్ హత్యకు కారణమనే ప్రధాన ఆరోపణ ఆయనపై ఉంది. ఈ ఆరోపణలు నిజమని నమ్మిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ.. 78 ఏళ్ల డర్స్ట్కి గురువారం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 1982లో డర్స్ట్ మొదటి భార్య క్యాథీ మోక్కార్మాక్ డర్స్ట్ కనిపించకుండా పోయింది. ఆమెను తానే హత్య చేశానని ప్రాణ స్నేహితురాలు సుసాన్ బర్మాన్‌తో డర్స్ట్ చెప్పాడు. ఆపై ఈ వ్యవహారానికి సంబంధించి అసలు నిజం పోలీసులకు చెబుతుందనే భయంతో సుసాన్ బర్మాన్ను బర్స్ట్ తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు, ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాదు 2001 టెక్సాస్ గాల్వెస్టన్లో పొరుగింటి వ్యక్తి మోరిస్ బ్లాక్‌ను హత్య చేసిన ఆరోపణలు రాబర్ట్ బర్స్ట్ మీదా ఉంది. కానీ, ఆత్మరక్షణ కోసమే ఆ హత్య చేసినట్లు ఆ టైంలో రాబర్ట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో మూడు హత్యలకు సంబంధించిన కేసులు డర్స్ట్పై నమోదు అయ్యాయి. డర్స్ట్కు మరణశిక్ష విధించే ఆస్కారం ఉన్నప్పటికీ.. సాక్ష్యులపై అగాయిత్యాలకు పాల్పడితే అక్కడి చట్టాల ప్రకారం జీవిత ఖైదు విధిస్తారు. ఈ క్రమంలో భార్య మిస్సింగ్ కేసు, పొరుగింటి వ్యక్తి హత్య కేసు కంటే సుసాన్ కేసుకు సంబంధించి కేసునే పరిగణనలోకి తీసుకుని డర్స్ట్కి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. వృద్ధాప్యం, పైగా అనారోగ్యంతో ఉన్నాకూడా కోర్టు కనికరం చూపించలేదు. రాబర్ట్ బర్స్ట్‌ను వీలైఛైర్లోనే ఉంచి.. 38 గంటలపాటు విచారణ చేపట్టింది న్యాయస్థానం. చివరగా.. తాను ఏ పాపం చేయలేదని స్వయంగా రాబర్ట్ బర్స్ట్ గంటకు పైగా వాదనలు వినిపించడం విశేషం. న్యూయార్క్ నగరానికి చెందిన రాబర్ట్ ఎలన్ డర్స్ట్.. వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అతని మొత్తం ఆస్తి విలువ 8.1 బిలియన్ డాలర్లకుపైనే. ఇక మూడు హత్యల ఆరోపణలపై ఇప్పుడు జీవిత ఖైదు అనుభవించబోతున్నాడు. -
ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి అతడికి హాని తలపెట్టడం, చంపుతానంటూ బెదిరించడం వంటివి చేయకుండా మంచిగానే చూసుకున్నందున భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 364ఏ ప్రకారం జీవిత కాల జైలు శిక్ష విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2 లక్షలివ్వాలంటూ అతడి తండ్రిని డిమాండ్ చేసినందుకు గాను తనకు జీవిత కాల జైలుశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణకు చెందిన అహ్మద్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. డబ్బు కోసం కిడ్నాప్ నేరం(సెక్షన్ 364ఏ) కింద మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. అవి..ఎవరైనా వ్యక్తిని నిర్బంధంలో ఉంచుకోవడం, ఆ వ్యక్తిని చంపుతాననీ గానీ, హాని తలపెడతానని గానీ బెదిరించడం, కిడ్నాపర్ ప్రవర్తన వల్ల ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వం, ఏదైనా ప్రభుత్వ సంస్థ డబ్బు చెల్లించకుంటే బాధితుడికి హాని లేదా ప్రాణహాని కలగవచ్చుననే భయానికి తగు కారణం ఉండటం’అని పేర్కొంది. అయితే, ఇందులో మొదటి అంశం మినహా మిగతా రెండింటికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ధర్మాసనం ఈ శిక్షను నిలిపివేసింది. ఈ–పాస్‌లు తాత్కాలికమే సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో రాజధాని హైదరాబాద్‌కు వెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఈ–పాస్ తప్పనిసరి చేయడం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ–పాస్‌ల ప్రక్రియ తాత్కాలికమేననీ, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ చెల్లుబాటు కూడా ముగిసిపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చదవండి: వైరల్: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం.. చట్టాలు మేమెలా రూపొందిస్తాం: సుప్రీంకోర్టు -
లైంగిక దాడి: యువకుడికి ఉరిశిక్ష.. మెలికపెట్టి మరో తీర్పు
సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెట్టి తీర్పు ఇచ్చింది. కోయంబత్తూరు కుడిమలూరులో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం కావడం రెండేళ్ల క్రితం కలకలం రేపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ అదృశ్యమైందో అక్కడే ఆ బాలిక మృత దేహంగా తేలింది. ఆ బాలికపై లైంగికదాడి జరిగినట్టు విచారణలో తేలింది. ఈ కిరాతకానికి ఆ ఇంటి పక్కనే ఉన్న సంతోష్‌కుమార్(34) అనే యువకుడు పాల్పడినట్టు తేలింది. అతడ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కోయంబత్తూరు కోర్టు తొలుత కేసును విచారించి తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరి శిక్ష విధించడమే కాకుండా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ధ్రువీకరణకు హైకోర్టుకు కింది కోర్టు నుంచి పంపించారు. అదే సమయంలో సంతోష్‌కుమార్ అప్పీలు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తులు పీఎన్ ప్రకాష్, శివజ్ఞానం బెంచ్ విచారిస్తూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో బుధవారం తీర్పు వెలువరించింది. ఉరి రద్దు.. నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన శిక్షను హైకోర్టు ధ్రువీకరించింది. పోక్సో చట్టంలో అరెస్టులను ధ్రువీకరిస్తూ, నిందితుడికి రూ. లక్ష జరిమానా విధించింది. అయితే, ఇటీవల కాలంగా కొన్ని కేసుల తీర్పుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను గుర్తు చేస్తూ, నిందితుడికి విధించిన ఉరి శిక్షను రద్దు చేశారు. ఈ శిక్షను యావజ్జీవంగా మార్చారు. యావజ్జీవ కాలం ముగిసినా, 25 సంవత్సరాల వరకు విడుదల చేసేందుకు వీలు లేదని తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది. అలాగే శిక్ష తగ్గింపునకు సైతం ఆస్కారం లేదని, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. కింది కోర్టు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ మొత్తాన్ని చెల్లించకుంటే, తక్షణం అందజేయాలని ఆదేశిస్తూ గడువును కోర్టు కేటాయించింది. చదవండి: అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య -
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...
మామిడికుదురు (తూర్పుగోదావరి): భక్తి ముసుగులో నేరాలు చేయడం అతని నైజం. దుర్గమ్మ కథ పేరుతో అమాయక మహిళలకు వల వేయడం వెన్నతో పెట్టిన విద్య. ఈ మోసపు వైఖరితో ఐదుగురు మహిళల జీవితాలను నాశనం చేశాడీ కరడు గట్టిన నేరస్తుడు. కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మీనారాయణ గ్రామాల్లో వెంకన్నబాబు, కనకదుర్గమ్మ కథలు చెబుతూ మహిళలను లోబరచుకునేవాడు. మాయమాటలు చెప్పి, జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. తర్వాత వారిని అతి క్రూరంగా హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకునేవాడు. అంతటితో కథ ముగిసిపోలేదు. మహిళల శవాలు కనిపించకుండా ఇసుక తిన్నెల్లో పూడ్చి పెట్టేవాడు. గతంలో ఈ నిందితుడిని పోలీసులు రిమాండుకు తరలిస్తుండగా వారి కళ్లు గప్పి తప్పించుకుని మళ్లీ చిక్కాడు. ఐదు నేరాలకు గాను నగరం స్టేషన్లో నమోదైన భాగ్యవతి హత్య కేసులో లక్ష్మీనారాయణకు గురువారం జీవిత ఖైదు పడింది. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి సీఎస్ మూర్తి ఈ మేరకు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లకు తమకు తగిన న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఇవీ సంఘటనలు ►2012 మే నెలలో కొవ్వూరు రూరల్ మండలం మద్దూరిలంకకు చెందిన ఆకుల నాగమణిని చంపేశాడు. ►2014లో యానాంకు చెందిన సత్యవతిని కూడా చంపి పాతిపెట్టేశాడు. ►2014లో దంగేరుకు చెందిన ఒక వివాహితను దారుణంగా హత్య చేశాడు. ►2015లో మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన బద్రి సత్యవతి అలియాస్ బుజ్జి ప్రాణాలు తీశాడు. ►2017 జనవరిలో నగరం పోలీస్ స్టేషన్లో మామిడికుదురుకు చెందిన చేవూరి భాగ్యవతిని హతమార్చాడు. చదవండి: ఫోన్ మాట్లాడొద్దన్న మామ, భవనంపై నుంచి దూకిన యువతి గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. -
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవితకాల కఠిన కారాగారశిక్షతో సహా మూడు శిక్షలు, జరిమానాలు విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా, పోక్సో కోర్టు జడ్జి శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. తెలంగాణ కు చెందిన బెలిదే వేణుగోపాల్ గుంటూరులోని ఒక హోటల్లో పనులు చేస్తూ రైలుపేటలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పక్కింట్లో ఉంటున్న నేపాల్ దంపతుల ఐదేళ్ల కుమార్తెను వేణుగోపాల్ కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు 2019 డిసెంబర్ 18న ఐపీసీ సెక్షన్లు 363, 366, 323, 376 (ఏబీ), పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో దిశ చట్టానికి రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఈ కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ సుప్రజ, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వారంలో పూర్తిచేసి 10 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన జడ్జి.. బాలిక కిడ్నాప్, కొట్టడం, లైంగికదాడి ఇలా మూడు నేరాలకు మూడు రకాల శిక్షలను విధించారు. కిడ్నాప్‌నకు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.500 జరిమానా, బాలికను కొట్టినందుకు ఒక సంవత్సరం సాధారణ జైలు, లైంగికదాడికి జీవితకాల కఠిన కారాగారశిక్ష, రూ.2,500 జరిమానా విధించారు. -
కూతురి హత్య.. తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, జగిత్యాల : కన్న కూతురుకు వివాహం చేయడం.. ఆమెకు వరకట్నం ఇవ్వడం భారంగా భావించిన తండ్రి, సవతి తల్లి, సవతి తల్లి సోదరుడు సదరు యువతిని హత్య చేసిన ఘటనలో ముగురికీ జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్లకు చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డికి పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ప్రేమలతతో వివాహమైంది. వీరికి కూతురు మాన్యశ్రీ జన్మించింది. ఆ తర్వాత భా ర్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాన్యశ్రీ వివాహానికి ఎంత ఖర్చయినా తానే భరిస్తానని సత్యనారాయణరెడ్డి ఒప్పంద పత్రం రాసిచ్చాడు. కూతురుకి వివాహ వయసు రావడంతో అతను గ్రామంలో ఉన్న తన 20 గుంటల భూమిని విక్రయించాడు. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూస్తుండగా హైదరాబాద్ నుంచి మంచి సంబంధం వచ్చింది. మగ పెళ్లివారు రూ.25 లక్షల వరకట్నం అడిగారని మాన్యశ్రీ తన తండ్రి సత్యనారాయణరెడ్డికి 07.09. 2015న ఫోన్లో తెలిపింది. మరుసటి రోజు అతను కూతురుకు ఫోన్ చేసి, 20న వెన్గుమట్లకు రావాలని చెప్పడంతో కరీంనగర్ నుంచి వెళ్లింది. అదే రోజు రాత్రి తండ్రి సత్యనారాయణరెడ్డి, సవతి తల్లి లత, సవతి తల్లి సోదరుడు కళ్లెం రాజులు పథకం ప్రకారం మాన్యశ్రీని గొంతు నుమిలి హత్య చేశారు. మృతురాలి తల్లి ప్రేమలత గొల్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి జి.సుదర్శన్ ముగ్గురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అప్పటి గొల్లపల్లి ఎస్సై రమేశ్, ధర్మపురి సీఐ వెంకటరమణ, 18 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీపీ శ్రీవాణి, గొల్లపల్లి కోర్టు కానిస్టేబుల్ కిరణ్‌కుమార్‌లను ఎస్పీ సింధూశర్మ అభినందించారు. -
కొడుకును తప్పించేందుకు ఓ తల్లి సాహసం
న్యూఢిల్లీ : కొడుకు రాజైనా, పేదయినా, చివరకు నేరస్థుడైనా అతనిపై తల్లికి ప్రేముంటుందని అంటారు. ఈ నిజాన్ని మరోసారి నిర్ధారించింది ఉక్రెయిన్‌లోని దక్షిణ జపోరిజియా ప్రాంతంలో నివసిస్తున్న ఓ తల్లి ఉదంతం. హత్య కేసులో నేరం రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కొడుకును జైలు నుంచి తప్పించేందుకు ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. జైలు పక్కన పది అడుగుల లోతులో ఏకంగా 35 అడుగుల పొడవైన సొరంగాన్ని ఒంటరిగా తవ్వింది. అది కూడా సాధారణ చేతి పరికరాలు, పనిముట్లను ఉపయోగించి ఆ పని చేసింది. ఆ తల్లి ముందస్తు వ్యూహంతో జైలుకు సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. జైలుకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో సొరంగం తవ్వకానికి స్థలాన్ని ఎంపిక చేసుకుంది. పగలు చేస్తే జనం దష్టిలో పడతాననే ఉద్దేశంతో ఆమె కేవలం రాత్రి పూటే మూడు వారాల పాటు కష్టపడి పది అడుగుల లోతు నుంచి జైలు ప్రహారీ గోడల లోపలి వరకు సొరంగ మార్గాన్ని తవ్వింది. అలా తవ్వడం ద్వారా వచ్చిన దాదాపు మూడు టన్నుల మట్టిని సమీపంలో ఉన్న నిరుపయోగ చెత్తకుండిలో పారవేసింది. ఆమె వద్ద రెండు చక్రాలు కలిగిన చెత్తను మోసుకుపోయే ఇనుప లాగుడు బండి ఉందని, దానిలో తట్టా, పార వేసుకొని జైలుకు సమీపంలో అప్పుడప్పుడు కనిపించిందని జైలు సెక్యూరిటీ గార్డు తెలిపారు. మూడు వారాల అనంతరం ఆమె సొరంగ మార్గాన్ని తవ్వుతూ జైలు సెక్యూరిటీ గార్డులకే పట్టుబడింది. అంతకుముందు ఐదు కిలోమీటర్ల దూరంలోని మైకలోవ్ ప్రాంతంలో తల్లి కొడుకులు నివసించేవారట. కొడుకు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి జైలుకు రావడంతో ఆ తల్లి ఈ సాహసానికి ఒడిగట్టింది. ఆమె పేరునుగానీ, ఆమె కొడుకు పేరునుగానీ వెల్లడించేందుకు ఉక్రెయిన్ జైలు అధికారులు నిరాకరించారు. ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఆ మాతమూర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. కొడుకు కోసం ఆ తల్లి చేసిన సాహసాన్ని వారు మెచ్చుకున్నారు. -
11 మంది పోలీసులకు జీవిత ఖైదు
మధుర: రాజస్తాన్‌లోని డీగ్ ప్రాంతంలో భరత్పూర్ రాజవంశానికి చెందిన రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులను 35 ఏళ్ళక్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుర జిల్లా జడ్జి సాధనారాణి ఠాకూర్ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో డీగ్ డీఎస్పీ కాన్‌సింగ్(82), స్థానిక పోలీసు స్టేషన్ ఇన్చార్జ్, ఎస్ఐ వీరేంద్ర సింగ్ (78) ఉన్నారు. వీరేంద్ర సింగ్ నాయకత్వంలోని పోలీసు బృందం ఫిబ్రవరి 21, 1985న రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులు సుమేర్ సింగ్, హరిసింగ్‌లను హతమార్చారు. ఇతర పోలీసు అధికారులైన ఏఎస్ఐ రవిశంకర్, కానిస్టేబుల్స్ సుక్రామ్, జీవన్‌రామ్, జగ్మోహన్, భన్వర్‌సింగ్, హరిసింగ్, ఛత్తార్ సింగ్, షేర్ సింగ్, దయారాం, రవిశేఖర్‌లకు ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. వీరంతా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే. ఆనాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజామాన్ సింగ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వైపు జీపులో దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల ఘటన జరిగిన మరునాడే రాజామాన్ సింగ్, అతని అనుచరులను పోలీసులు డీగ్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. -
అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం
సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ►తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ►ఫ్యాక్షన్ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్షావలిని పోలీసు అధికారులు అభినందించారు. చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం -
'మూఢనమ్మకానికి 12 మందికి జీవిత ఖైదు'
సాక్షి, బొబ్బిలి: మూఢ నమ్మకంతో వారు రాక్షసంగా ప్రవర్తించారు. మూర్ఖంగా వ్యవహరించినందుకు మూల్యం చెల్లించుకున్నారు. చేతబడి ఉందన్న అనుమానంతో ఇద్దరిని అతి దారుణంగా హతమార్చారు. న్యాయమూర్తి సంచలన తీర్పుతో వారంతా ఇప్పుడు జీవిత ఖైదీలుగా మారారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ఎస్ పెద్దవలస పంచాయతీలోని కేకే వలస గ్రామానికి చెందిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బొబ్బిలిలోని రెండో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి బి శ్రీనివాసరావు శుక్రవారం ఇచ్చిన తీర్పు ఇక్కడ కలకలం సృష్టించింది. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం... కేకే వలసలో నివాసం ఉంటున్న జన్ని శ్రీను కాలికి దెబ్బతగిలి అనారోగ్యంపాలై 2016 జనవరి ఎనిమిదో తేదీన మృతి చెందాడు. ఆయన మృతికి గ్రామంలో ఉన్న గొల్లూరి పండు, సీతమ్మల చేతబడే కారణమని గ్రామస్తులంతా మరునాడే పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించారు. ఆ రోజు ఏమీ తేలకపోవడంతో మరోసారి అదే నెల 12న మళ్లీ పంచాయితీ నిర్వహిద్దామని పెద్దలు చెప్పారు. దీనిని పట్టించుకోని గ్రామానికి చెందిన 13 మంది వ్యక్తులు జనవరి తొమ్మిదో తేదీ సాయంత్రం పండు, సీతమ్మలను రాళ్లతో కొడుతూ, తన్నుకుంటూ సమీపంలోని చిట్టిగెడ్డ వరకూ ఈడ్చుకుపోయారు. హత్యకు గురైన దంపతులు పండు, సీతమ్మ (ఫైల్) అక్కడ వారికి కొనప్రాణం ఉండగానే దహనం చేశారు. అదేరోజు రాత్రి భస్మాలను, మిగిలిన ఎముకలను కనిపించకుండా గెడ్డలోనే పారబోశారు. అనంతరం దంపతులను దహనం చేసిన చోట కడిగేసి సాక్ష్యాలను మిగల్చకుండా చేశారు. దంపతుల మరణంపై అనుమానం ఉన్న వారి రెండో కుమార్తె సూరమ్మ మక్కువ పోలీసు స్టేషన్లో 13న ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులకు తాము ముగ్గురు కుమార్తెలమనీ, తల్లిదండ్రులను సజీవంగా దహనం చేశారనీ, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే సాలూరు సీఐ జి.రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లడం, ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించడంతో పలు విషయాలను గుర్తించారు. పండు, సీతమ్మల హత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన 13మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. సంఘటన వెలుగు చూసిన తరువాత ఏఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా చిట్టిగెడ్డకు వెళ్లి పరిశీలన చేశారు. అనంతరం పలుమార్లు పార్వతీపురం, బొబ్బిలి కోర్టులో కేసు విచారణకు వచ్చింది. గ్రామంలో ఓ వ్యక్తి ఈ హత్యోదంతాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. పోలీసులు దానినే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు. పార్వతీపురం, బొబ్బిలి కోర్టులలో పలుమార్లు ఈ వీడియోను న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించారు. బొబ్బిలిలో తుదితీర్పు... పలుమార్లు విచారణ అనంతరం చివరగా శుక్రవారం నాడు బొబ్బిలి రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు ఐపీసీ సెక్షన్ 302, 204, 506(2), 120(బి), రెడ్‌విత్ 149 ప్రకారం 12 మంది నిందితులను నేరస్తులుగా పరిగణిస్తూ బతికి ఉన్నంత కాలం కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు. అలాగే ఒక్కొక్కరికీ రూ.2,600 జరిమానా విధించారు. ఫిర్యాదు దారయిన గొల్లూరి పండు, సీతమ్మల కుమార్తెకు రూ.5లక్షల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సలహా సంఘానికి సిఫార్సు చేశారు. నిందితుల్లోని ఒకరయిన గొల్లూరి అర్జున ఈ నేరం చేయకూడదని మిగతా వారిని వారించినట్టు రుజువు కావడంతో అతనిని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు వారితో మీరు చేసిన ఈ నేరానికి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధించొచ్చనీ వ్యాఖ్యానించారు. దీనిపై మీ మనోగతమేంటని న్యాయమూర్తి అడగ్గా నిందితులెవరూ మాట్లాడలేకపోయారు. దీంతో న్యాయమూర్తి నిందితులకు శిక్షను ఖరారు చేశారు. నేరస్థులు వీరే! గొల్లూరి పండు, సీతమ్మల హత్యోదంతానికి కారణమయిన నేరస్తులుగా గ్రామానికి చెందిన పాలిక వెంకట రావు, జన్ని గంగరాజు, జన్ని గోవింద, పాలిక చంద్రరావు, జన్ని ధర్మారావు, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాశిరావు, జన్ని ముకుంద, పాలిక జగ్గులు అలియాస్ జగ్గు, జన్ని అప్పలస్వామి, పాలిక మల్లన్నలను నేరస్థులుగా గుర్తిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. బొబ్బిలిలో తుది తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టుకు పలు వాహనాల్లో 13 మంది నిందితుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే 12 మంది నేరస్తుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఒక్క సారి ఘొల్లుమన్నారు. వీరిని పోలీసులు కాసేపు నేరస్థులతో మాట్లాడించేందుకు అవకాశమిచ్చిన వెంటనే తిరిగి కోర్టు బయటకు పంపేశారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీసు బలగాలతో వీరిని తరలించారు. కాగా హతులు గొల్లూరి పండు, సత్తెమ్మలకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో పెద్దకుమార్తె చోడిపల్లి రాధ, రెండో కుమార్తె సూరమ్మ, మూడో కుమార్తె గొల్లూరు నరసమ్మలతో పాటు వారి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయమూర్తి తీర్పు తమ కుటుంబానికి న్యాయం చేసిందని, జడ్జి తీర్పుపై సంతోషం ప్రకటించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎస్పీ అభినందన సాక్ష్యాలను సమయానుకూలంగా ప్రవేశపెట్టడంతో పాటు కేసును విచారించేందుకు సహకరించడం, నేరస్తులకు శిక్ష పడేలా వ్యవహరించిన అప్పటి సీఐ జి.రామకృష్ణ, కోర్టు లైజెనింగ్ అధికారి ఎస్.షణ్ముఖ రావు, కోర్టు కానిస్టేబుల్ మురళి, పీపీలు అద్దేపల్లి నారాయణ రావు, రఘురాంలను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అభినందించారు. -
సెంగార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడిపై కాస్త కరుణ చూపాలన్న సెంగార్ తరఫు లాయర్ వాదనలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ సెంగార్ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీశారని, ఈ కేసు తీవ్రతను తగ్గించి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని, అందుకే వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీబీఐని ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఢిల్లీ మహిళా కమిషన్ పర్యవేక్షణలో ఏడాదిపాటు అద్దె ఇంట్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నెలకు రూ.15 వేల అద్దెను యూపీ సర్కారే భరించాలని స్పష్టం చేశారు. బాధితురాలి సాక్ష్యానికి మించింది లేదు: న్యాయమూర్తి సమాజంలో పలుకుబడి కలిగి, శక్తిమంతమైన ఒక వ్యక్తిపై బాధితురాలు చెప్పిన మాటలకు మించిన సాక్ష్యం మరేదీ ఉండదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చెప్పారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఆమె కూడా సెంగార్ బాధితురాలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పు వెలువరించిన సమయంలో దోషి సెంగార్ కోర్టు హాలులోనే ఉన్నారు. న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఆయన ఒక్కసారిగా భోరుమని విలపించారు. తన కుమార్తె, సోదరిని పట్టుకొని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మైనర్లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉరి శిక్ష విధించాల్సింది : బాధితురాలి సోదరి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని బాధితురాలి సోదరి అన్నారు. అప్పుడే తమ జీవితాలు భద్రంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. ‘సెంగార్‌కు ఉరిశిక్ష విధిస్తే మాకు న్యాయం జరిగేది. అతను జైల్లో ఉన్నప్పటికీ అనుక్షణం భయపడ్డాం. సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగిన సమాయానికి పోక్సో సవరణలు చేపట్టలేదు. దీంతో సెంగార్ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్.. ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించు కోలేదు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేíసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది. -
17 రోజుల్లోనే జీవిత ఖైదు
జైపూర్: చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 17 రోజుల్లోనే తీర్పు ప్రకటించి రాజస్తాన్‌లోని ఒక పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) ప్రత్యేక కోర్టు చరిత్ర సృష్టించింది. చురు జిల్లాలో నవంబర్ 30వ తేదీన 21 ఏళ్ల దయారాం మేఘ్వాల్ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మర్నాడే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7వ తేదీన చార్జిïషీటు దాఖలు చేశారు. డిసెంబర్ 17న దయారాంకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంటే, 17 రోజుల్లోనే పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు.. అన్నీ ముగిశాయి. ‘పోలీసులు చురుగ్గా పనిచేశారు. సకాలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. బాధిత బాలిక వాంగ్మూలం కీలక పాత్ర పోషించింది. కోర్టు రోజువారీ విచారణ జరిపింది. దాంతో త్వరితగతిన తీర్పు సాధ్యమైంది’ అని చురు జిల్లా ఎస్పీ తేజస్విని గౌతమ్ వివరించారు. దోషి దయారాం తండ్రికి కూడా గతంలో ఒక రేప్ కేసులో జైలు శిక్ష విధించారు. -
కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, సంగారెడ్డి/ వర్గల్: కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో మొదటి అదనపు జడ్జి పాపిరెడ్డి తీర్పు నిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన భీమగాళ్ల బాబు (40) కూతుర్తెన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2018 అక్టోబర్ 12న భర్తపై ముత్తమ్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో బాబుకు కోర్టు జీవితఖైదు, జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్, ఇతర పోలీసులను సిద్దిపేట సీపీ అభినందించారు. -
లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు
ఒంగోలు: ఆస్తి వివాదం నేపథ్యంలో ఆరేళ్ల క్రితం ఓ మహిళపై లైంగిక దాడి జరిపి హతమార్చిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం అదనపు జిల్లా జడ్జి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భూచేపల్లి నాగరత్నమ్మ, రావూరి మంగమ్మ అక్కాచెల్లెళ్లు. భూచేపల్లి నాగరత్నమ్మ చీమకుర్తి మండలం దేవరపల్లిలో ఉంటోంది. వారి మధ్య ఆస్తి వివాదాలు నెలకొనగా.. మంగమ్మ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనికి నాగరత్నమ్మే కారణమని భావించిన మంగమ్మ సోదరిని హతమార్చేందుకు ప్లాన్ చేసింది. భర్త చనిపోయినందున ఆలయంలో నిద్ర చేయడానికి తోడు రావాలని సోదరి నాగరత్నమ్మను కోరింది. ఆమె వెంట వెళ్లిన నాగరత్నమ్మపై పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద నాగదాసరి వెంకటయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏడుగురు కలిసి ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నాగరత్నమ్మ సోదరి రావూరి మంగమ్మ, మీసాల నాగేంద్రం అలియాస్ నాగిరెడ్డి, మందగలం బాబు, నాగదాసరి వెంకటయ్యలతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో నలుగురు కడప జిల్లాకు చెందిన వారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మార్కాపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణ శుక్రవారం తీర్పును వెలువరిస్తూ.. నాగరత్నమ్మపై అత్యాచారం చేసిన నాగదాసరి వెంకటయ్యకు పదేళ్ల జైలు శిక్షతోపాటు ఆమెను హతమార్చినందుకు జీవిత ఖైదు విధించారు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మంగమ్మ, మీసాల నాగేంద్రం , మందగలం బాబుకు జీవిత ఖైదు విధించారు. మిగిలిన ముగ్గురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. -
కొడుకుని చంపిన తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, ఒంగోలు సెంట్రల్: కొడుకును చంపిన కేసులో ఓ తండ్రికి యావజ్జీవ జైలు శిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు. సంతమాగులూరు మండలం వెలల్లచెరువుకు చెందిన కొశ్చిరి బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కుమారులతో కలిసి నివసిస్తుంటాడు. పెద్ద కొడుకు కొశ్చిరి సంపత్‌కుమార్ గుంటూరులో ఎల్ఇడీ టీవీలను శుభకార్యాలకు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో 2018వ సంవత్సరం జనవరి 13న బ్రహ్మనాయుడు ఇంట్లో దాచిపెట్టిన రూ.5000 కనిపించడంలేదని, తన కొడుకు సంపత్‌ను అడిగి, గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఊరిలోని అంగన్ వాడీ కేంద్రం పక్కనే ఉన్న బెంచీపై నిద్రపోతున్న సంపత్‌ను రోకలిబండతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని నిందితుడు గుంటూరులో ఉన్న తన బంధువు రాజేష్‌కు సమాచారం అందించడంతో రాజేష్ నిందితుడి చిన్న కొడుకు సందీప్ కుమార్‌కు సమాచారం అందించడంచాడు. దీంతో సందీప్ పోలీసులకు ఫిర్మాదు చేయడంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. శివరామకృష్ణ ప్రసాద్ నిందితుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ వాదనలను వినిపించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ యావజ్జీవజైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, దామెర వరంగల్ : మద్యానికి బానిసై తరచూ వేధింపుపులకు గురి చేస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనే భావనతో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నేరంపై మహిళకు జీవిత కారాగారశిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.శైలజ సంచలన తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముగంటి బాలకిషన్ కథనం ప్రకారం కేసు, తీర్పు వివరాలిలా ఉన్నాయి బెల్ట్‌షాపు నడుపుతూ మద్యానికి బానిసై... వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఎరుబాటి మల్హల్రావు, లలితకు 2002లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంతో ఆకాష్, నక్షత్ర జన్మించారు. ఓ పక్క వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూనే బెల్టు షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగించే మల్హల్ రావు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మల్హల్రావు మద్యానికి బానిపై భార్యను తరచూ వేధించేవాడు. ఈక్రమంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా మార్పు రాలేదు. 2015 జూలై 6న రాత్రి భార్యాభర్తలు గొడవపడుతుండగా.. ఎప్పుడూ జరిగేదనే భావనతో మల్హల్రావు తండ్రి మోతయ్య రైస్‌మిల్లులో పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి వెనుక వూపు వెళ్లి చూడగా ఆయన కుమారుడు కాలిపోయి పడి ఉన్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతూ మోతయ్య ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం అంగీకారం.. ఆత్మకూరు పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో మల్హల్రావు భార్య లలిత పోలీసులకు లొంగిపోయింది. తరచూ తాగిన మైకంలో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండడంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2015 జూలై 6న రాత్రి 7 గంటలకు గొడవ పడి బయటకు వెళ్లిన హల్‌హల్‌రావు తిరిగి ఇంటికి రాలేదు. అయితే, అర్ధరాత్రి 12 గంటలకు లలిత బయటకు రాగా.. తాగిన మైకంలో ఇంటి వెనుక పడి ఉన్న భర్త కనిపించాడు. ఈ మేరకు ఇంట్లోని పెట్రోల్ తీసుకొచ్చి ఆయనపై పోసి నిప్పంటించి సజీవంగా కాల్చి చంపింది. అయితే, తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉండడంతో మల్హల్రావు ఎలాంటి కేకలు, అరుపులు చేయకుండా మంటల్లో కాలిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లలితపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. కేసును సీఎం ఎంరవికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ రమేషబాబు పర్యవేక్షించారు. 31 మంది సాక్షులను కానిస్టేబుల్ డి.వెంకటనారాయణ కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు
సాక్షి,ముంబై : టెకీ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో బాంబేహైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో దోషులుగా తేలిన వారి ఉరిశిక్ష అమలు ఆలస్యమైన కారణంగా దోషుల శిక్షను 35 ఏళ్ల కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. తమకు విధించిన మరణశిక్షను అమలు చేయడంలో తీవ్రజాప్యం జరిగిందని, ఇది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ఈ నేపథ్యంలో తమకు విధించిన శిక్షను మార్చాలని కోరుతూ దోషులు పురుషోత్తమ్ బొరాటే, ప్రదీప్ కోకడే కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన బొంబాయి హైకోర్టు ఇద్దరికీ 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 12 ఏళ్ల నాటి ఈ కేసు వివరాలు : నవంబర్ 1, 2007 టెక్ దిగ్గజం విప్రోకు చెందిన బీపీవో కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళా ఉద్యోగి, విధుల నిమిత్తం క్యాబ్‌లో వెళ్తుండగా, ఆమెను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం, అతని అనుచరుడు ప్రదీప్ కలిసి అత్యాచారం చేసి అతిదారుణంగా చంపేసారు. కనీసం గుర్తుపట్టలేని విధంగా ముఖాన్ని ఛిద్రం చేసి, పొదల్లో విసిరిపారేశారు. ఈ కేసులో వీరిని అరెస్టు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సెషన్సు కోర్టులో విచారణ అనంతరం 2012 మార్చిలో వీరికి కోర్టు మరణ శిక్ష విధించగా, బాంబే హైకోర్టు, అనంతరం 2015 మే లో సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్ధించాయి. అలాగే దోషులు పెట్టుకున్న క్షమాపణ పిటిషన్‌ను 2016లో మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చగా, 2017లో రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జూన్ 24 ను వీరికి శిక్ష అమలు చేయాల్సిందిగా 2019 ఏప్రిల్10 న వారెంట్ జారీ చేసింది . అయితే ఇక్కడే ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఉరిశిక్షను అమలు చేయడంలో 1,509 రోజులు (50 నెలలకు మించి) ఆలస్యం జరిగిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించి, ఏడు సంవత్సరాల పాటు పూణేలోని యరవాడ సెంట్రల్ జైలులో తమని అక్రమంగా నిర్బంధించారంటూ దోషులు ఈ ఏడాది మే నెలలో కోర్టును ఆశ్రయించారు. తమకు ఉరిశిక్షనుంచి మినహాయింపునించి, శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాల్సిందిగా కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరిశిక్ష షెడ్యూల్ ప్రకారం జరగకూడదని హైకోర్టు జూన్ 21 ఆదేశించింది. ఉరిశిక్షలపై స్టే విధించిన అనంతరం వీరి వాదనలను పరిశీలించిన జస్టిస్ భూషణ్, జస్టిస్ స్వాప్నా జోషితో కూడిన బెంచ్ శిక్షను అమలు జాప్యంతోపాటు, ఇప్పటివరకు వారు జైలులో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, శిక్షను 35 సంవత్సరాల కారాగార శిక్షగా మారుస్తూ తాజా తీర్పును వెలువరించింది. -
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
గుజరాత్ బీజేపీ మాజీ ఎంపీకి షాక్
అహ్మదాబాద్ : ఆర్టీఐ కార్యకర్త సంచలన హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకికి అహ్మదాబాద్ సీబీఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సోలంకితో పాటు ఈ కేసులో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గత శనివారం సోలంకి తోపాటు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు గురువారం వీరికి శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే వీరికి 59,25,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ సొమ్ములో రూ.11 లక్షలు ఆర్టీఐ కార్యకర్త కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. ముఖ్యంగా భార్యకు రూ. 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఆర్టీఐలో పిల్ దాఖలు చేసిన నెలరోజుల్లోనే ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్య గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో సోలంకి, మరికొంతమందితో కలిసి అమిత్‌ను దారుణంగా హత్య గావించారన్న సీబీఐ వాదనలను కోర్టు విశ్వసించింది. దీంతో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకకూర్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ జీవిత ఖైదు శిక్షను విధించారు. మరోవైపు తన కుమారుడు అమిత్ జేత్వా హత్య పై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న తండ్రి భిఖిభాయ్ జేత్వా ఈ తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజా తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందన్నారు. చదవండి : సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్ -
లైంగికదాడి కేసులో జీవితఖైదు
సాక్షి, కరీంనగర్ : ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసిన కేసులో లింగంపల్లి కిషన్(42)కు జీవితఖైదుతోపాటు రూ.లక్షా 50వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం) ఎస్.శ్రీనివాస్‌రెడ్డి సంచనల తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన లింగంపల్లి కిషన్‌కు ఎల్కే బ్రిక్స్ ఇండస్ట్రీ ఉంది. అతడి వద్ద ఇటుక తయారీ పని కోసం ఓరిస్సా రాష్ట్రం బారాగౌడ్ జిల్లా బాయిడ్‌పల్లి గ్రామానికి చెందిన బలరాం సాహూ (55) భార్య, కూతురుతోపాటు వచ్చాడు. వారితో పాటు ఒరిస్సాకు చెందిన దాదాపు 50మంది కిషన్ ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. బట్టీల వద్దే తాత్కాళిక గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. 2014 మార్చి 16న రాత్రి సాహూ అతడి భార్య గుడిసెలో నిద్రిస్తుండగా, కూతురు (16) బయట నిద్రిస్తోంది. అక్కడికి వచ్చిన కిషన్ బయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా తన ఆఫీస్‌కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. 2014 ఏప్రిల్ 14న ఇలాగే బయట నిద్రిస్తున్న మరో ఇద్దరు బాలికల(14), (11)ను ఆఫీస్‌కు తీసుకెళ్లి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈవిషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెళ్లి కిషన్‌ను నిలదీయగా, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో వారు ఒరిస్సాలోని బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు అక్కడి స్వచ్ఛంద సంఘాల వారితో కలిసివచ్చి 2014 ఏప్రిల్ 19న బాధితులతో చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై రియాజ్‌పాషా లింగంపల్లి కిషన్‌పై ఐపీసీ బాలబాలికలపై లైంగిక వేధింపుల నిరోధర చట్టం, బాల కార్మిక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ టి.సత్యనారాయణ కేసు దర్యాప్తును ఏపీపీ వి.వెంకటేశ్వర్లు విచారించారు. 21మంది సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి సోమవారం నేరస్తుడైన కిషన్‌కు జీవితఖైదు, రూ.లక్షా 50వేలు జరిమానా విధించారు. జరిమానా డబ్బును బాధితులు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. తీర్పు నఖలు కాపీని జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు పంపించాలని, సంస్థ ద్వారా ప్రభుత్వం నుంచి బాధితులకు పరిహారం అందేలా చూడాలని తీర్పులో పేర్కొన్నారు. కిషన్ నడిపిస్తున్న ఇటుకబట్టి పరిశ్రమకు గ్రామపంచాయతీ, కార్మికశాఖ అనుమతులు లేవని సమాచారం. -
హరేన్ను కాల్చి చంపింది అస్ఘరే..
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసు విచారణలో కీలకమలుపు చోటుచేసుకుంది. మహ్మద్ అస్ఘర్ అలీ హంతకుడని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి 2011లో గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన శిక్షల్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2003 మార్చి 26న జరిగిన ఈ హత్యకేసులో అస్ఘర్ అలీతోపాటు మరో 11 మందికి అహ్మదాబాద్ పోటా కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను సమర్థించింది. దీంతో పీడీ యాక్ట్ కింద నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్అలీ గుజరాత్ జైలుకు వెళ్లడం తప్పనిసరైంది. హరేన్పాండ్యపై తుపాకీ ఎక్కుపెట్టి, కాల్చి చంపింది అస్ఘర్ అలీనే అని అప్పట్లో సీబీఐ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులోనూ అస్ఘర్ నిందితుడిగా ఉన్నాడు. నల్లగొండకు చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, ఛోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాద చర్యలపట్ల ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ముస్లిం ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాద శిక్షణాశిబిరాల్లో తుపాకులు కాల్చడం, ఆర్డీఎక్స్ బాంబులను పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి నల్లగొండకు చెందిన మహ్మద్ అబ్దుల్ బారిసహా మరికొందరితో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. హత్య కేసుల్లోని నిందితుడిని తప్పించి... బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణహత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్యగౌడ్, అదే ఏడాది ఫిబ్రవరి 2న మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్ హత్య కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌ను కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్ఘర్‌ను మిగిలిన కేసుల విచారణ నిమిత్తం పోలీసులు తరచూ నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో అస్ఘర్, బారి తదితరులు 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి మీర్జా ఫయాజ్ను తప్పించారు. కశ్మీర్‌కు పంపించి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేలా సంబంధాలు కల్పించాడు. జైలు నుంచి తప్పించుకున్న మీర్జా కొన్నిరోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. నాంపల్లి వద్ద పట్టుబడి... 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారి సహా పదిమంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి వద్ద నుంచి 3 కిలోల ఆర్డీఎక్స్, 3 హ్యాండ్ గ్రనేడ్లు, రెండు పిస్టళ్లు, 40 రౌండ్ల తూటాలు స్వాదీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కేసును విచారిస్తుండగా మీర్జా ఎస్కేప్‌లో అస్ఘర్ పాత్ర కీలకమనే విషయం వెలుగులోకి వచ్చింది. హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్‌ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చి 26న హరేన్ తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లిన అస్ఘర్ ఐదురౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అస్ఘర్ తదితరులను పట్టు కుంది. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చింది. అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టు లో వీగిపోవడంతో వాళ్లు బయటపడ్డారు. హైకోర్టు తీర్పు ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.