ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో దోషులుగా నిర్థారించింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.