DU professor
-
సాయిబాబాకు జీవితఖైదు.. హైకోర్టులో సవాల్!
గడ్చిరోలి కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని భార్య ప్రకటన హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన భార్య వసంత తెలిపారు. విచారణ సందర్భంగా తమ వాదనలను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు. తీర్పును చూస్తే.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
-
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో దోషులుగా నిర్థారించింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. -
'కూంబింగ్ పేరుతో భయపెడుతున్నారు'
న్యూఢిల్లీ: పోలీసులు అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చూస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ప్రజాసంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవోబీ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూంబింగ్ పేరుతో గిరిజనులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.