convict
-
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్‌కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.2021లో దోషి దినేష్‌కుమార్‌కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. -
TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు. -
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్‌లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని దోషులను కోరింది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తుచేసింది. "అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర (మహారాష్ట్ర) ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుంది." అని తీర్పు వెలువరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs — ANI Digital (@ani_digital) January 8, 2024 గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..
న్యూఢిల్లీ: ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై మృగంలా మారి 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఓ కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది. అభశుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వరుస అత్యాచారాలకు పాల్పడిన ఈ కామాంధుడి పేరు రవీందర్ కుమార్. వయసు 32 ఏళ్లు. 2008 నుంచి 2015 మధ్య మొత్తం 30 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిపై అత్యాచారాలు చేసి హతమార్చాడు. 2015లో ఇతడు అరెస్టయ్యాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను ఇతను లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి డబ్బులు, చాక్లెట్టు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని వారిని దారుణంగా హత్య చేసేవాడు. గుడిసెల్లో నివసించే పేదలు, కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నింద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు. నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకునేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను రవీందర్ అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన ప్రదేశాలకు కూడా పోలీసులను తీసుకెళ్లాడు. 2015లో ఇతడ్ని విశ్రాంత ఏసీపీ జగ్మీందర్ సింగ్ దహియా అరెస్టు చేశారు. మద్యం తాగినా, డ్రగ్స్ తీసుకున్నా రవీందర్ మృగంలా మారి స్వీయ నియంత్రణ కోల్పోయేవాడని తెలిపారు. చంపిన తర్వాత మృతదేహాలను కూడా వదిలేవాడు కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోలోనే కాదు బదాయూ, హథ్రాస్, అలీగఢ్‌లోనూ రవీందర్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. పోలీసుల కంట పడొద్దని కాలినడకన, అడవుల ద్వారానే ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవాడు. ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని ఒక్క కేసులో మాత్రమే కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం -
డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో రూ.41 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు(రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. 1996లో మాన్హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ రచయిత్రి ఇ. జీన్ కారెల్ ఆరోపించారు. ఆపై తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్‌పై భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ తీవ్ర విమర్శలు.. కాగా.. ఈ తీర్పుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ఇది తను ఎప్పటికీ వెంటాడుతుందని అన్నారు. లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈమేరకు తన 'ట్రూత్ సోషల్' ఖాతా వేదికగా తెలిపారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు..
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తర్ అన్సారీని దోషిగా తేల్చింది ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. అతనికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. 2005లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు అన్సారీ సోదరులు. వీరిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 2001 ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ఈ ఏడాది జనవరిలోనే ముఖ్తర్పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు అనంతరం రాయ్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్లు అంతమయ్యారని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు! -
ప్రేమకు తలొగ్గిన కోర్టు..లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు హత్యకేసు దోషికి పెరోల్
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి. 'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది. అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్‌కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ -
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు.. రాకేష్‌రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈనెల 9న శిక్షను ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసిన రాకేష్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. నాలుగేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 11 మంది నిందితులపై కేసు కొట్టివేసింది న్యాయస్థానం. రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాంను హత్యచేసినట్లు నిర్ధరించి అతడ్ని దోషిగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ -
హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. యూపీ కోర్టు కీలక తీర్పు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్‌కుష్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు. చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్.. -
లక్షద్వీప్ ఎంపీపై వేటు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది . ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
యాసిడ్ దాడి: ప్రేమోన్మాది కాస్త సన్యాసి అవతారంలో..
బెంగళూరు: ప్రేమ పేరుతో ఓ యువతిని విపరీతంగా వేధించిన వ్యక్తి.. చివరకు ఆమెపై పక్కా ప్లాన్‌తో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మరి చేసిన నేరానికి పోలీసులు దొరకబడతారు కదా!. అందుకే.. చిక్కకుండా ఉండేందుకు భలే స్కెచ్ వేశాడు. సన్యాసి అవతారం ఎత్తి పొరుగు రాష్ట్రంలో ఓ ఆశ్రమంలో సేదతీరుతుండగా.. వెంటాడి మరీ పట్టేసుకున్నాయి ఖాకీలు. ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు హెగ్గానహళ్ళి, సంజీవిని నగర్‌కు చెందిన నగేష్ అనే వ్యక్తి.. మాగడి రోడ్లో తన ఆఫీస్ బయట నిల్చున్న బాధితురాలి(25)పై యాసిడ్ పోశాడు. బాధితురాలి బంధువుల ఇంట్లోనే నగేష్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ ఏడేళ్ల పరిచయం ఉంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ నగేష్ బలవంతం చేయగా.. ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. దాడి అనంతరం అతను పారిపోగా.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు నగేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. పక్కా స్కెచ్.. నగేష్ యాసిడ్ దాడి ఏదో క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దాడికి ముందు రోజు తన దగ్గరి బంధువులతో ‘నేను రేపు టీవీల్లో కనిపిస్తా’ అంటూ హింట్ కూడా ఇచ్చాడట. అంతేకాదు దాడికి ముందే తాను నడిపిస్తున్న బట్టల దుకాణాన్ని, అందులోని ఇతర సామాన్లను అమ్మేశాడు నగేష్. ఆ డబ్బుతో పాటే దాడి తర్వాత పారిపోయాడు. అయితే పారిపోయే క్రమంలో అతను చేసిన మరో పని.. సెల్‌ఫోన్‌ను ఉపయోగించకపోవడం. పోలీసులు ట్రేస్ చేస్తారనే ఉద్దేశంతో.. తన దగ్గరున్న రెండు ఫోన్లను, సిమ్ కార్డులను హోస్కోటే హైవేలో పడేసి వెళ్లిపోయాడు. పైగా ఆ ఫోన్లను ఫార్మట్ చేసి మరీ పడేశాడు. పది టీంలతో వెతుకులాట.. నగేష్ ఫొటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. అతని కోసం పది బృందాలతో గాలింపు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోపు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు టీంలను పంపించారు. ఈలోపు తిరువణ్ణమలై దగ్గర ఓ ఆశ్రమంలో నగేష్ పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిచూసేసరికి.. తనకిప్పుడు దేని మీద ఆశ లేదని, అన్ని బంధాలను తెంచుకుని ఇక్కడికి వచ్చి సన్యాసిగా బతుకుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ, పోలీసులు ఊరుకుంటారా? పదహారు రోజుల తర్వాత మొత్తానికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు మొత్తానికి. చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్!! -
కలలో దేవుడు: మర్మాంగాన్ని కోసుకున్న ఖైదీ
భోపాల్: జైలులో ఉన్న ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. తనకు దేవుడు చెప్పాడంటూ మర్మాంగాన్ని కోసుకున్న విచిత్ర ఘటన గ్వాలియర్ జైలులో చోటు చేసుకుంది. విష్ణు సింగ్ రాజ్వత్ అనే వ్యక్తి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మంగళవారం నాడు అతను తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. దీనిపై అతడు జైలు అధికారులతో మాట్లాడుతూ.. రాత్రి తనకు కలలో శివుడు ప్రత్యక్షమై, తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడని, అందుకే ఈ పని చేశానని తెలిపాడు. చెంచాను పదునుగా మార్చి దానితోనే మర్మాంగాన్ని కత్తిరించి శివలింగం వద్ద ఉంచినట్లు పేర్కొన్నాడు. (మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ) దీనికి తాను ఏమాత్రం చింతించట్లేదన్నాడు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు మాట్లాడుతూ.. "ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాం. ప్రస్థుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది" అని తెలిపాడు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అతను ఏడాదిన్నర క్రితం ఓ పోలీసును చంపిన కేసులో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) -
నిర్భయ కేసు : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార కేసులో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. 2012 సామూహిక హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్) ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది. చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా? -
నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా?
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 2) విచారించనుంది. తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా శుక్రవారం సుప్రీం కోర్టులో నివారణ పిటిషన్ దాఖలుచేసిన సంగతి విదితమే. న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్. ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదిలావుండగా డెత్ వారెంట్ అమలుపై స్టే కోరుతూ దోషి అక్షయ్ కుమార్ సింగ్ దరఖాస్తుపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ కోర్టు శనివారం తీహార్ జైలు అధికారులను కోరింది. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా సోమవారం ఈ విషయాన్నివిచారించనున్నారు. పవన్ గుప్తా తాజా క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణ గురైన తర్వాత కూడా అతను రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురైనా కూడా, దాన్ని సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చు. దీంతో పాటు దోషులను విడిగా ఉరితీయాలని ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మార్చి 5 న విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి నిర్భయను దారుణంగా సామూహిక హత్యాచారం చేసిన దోషులందరూ మృత్యుభయంతో, న్యాయ వ్యవస్తలో ఉన్న అన్ని అవకాశాలను తమకనుకూలంగా మలుచుకుంటూ శిక్షనుంచి తప్పించుకునేందుకు అనేకపన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించు కున్నారు. దోషుల వరుస పిటీషన్లతో నిర్భయ దోషులకు ఇప్పటికే రెండుసార్లు శిక్ష వాయిదాపడింది. మొదట జనవరి 22 న ఉరి తీయవలసి ఉండగా, ఆ తరువాత ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీయాల్సి ఉంది. మరోవైపు దోషులకుఉరిశిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి, తన కుమార్తెకు న్యాయం జరగడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. (నిర్భయకు న్యాయం జరగకుంటే..) చదవండి : మార్చి 3న ఉరితీయండి -
నిర్భయ దోషుల ఉరిశిక్ష పై నేడు హైకోర్టు ఆదేశం
-
నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..!
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్‌కుమార్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఏపీ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తన క్లైంట్ పవన్‌కుమార్ నిర్భయ ఘటన జరిగిన సమయంలో (2012, డిసెంబర్ 16) మైనారిటీ (జువైనల్) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కుమార్‌ను జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఏపీ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు చూపకుండా పిటిషన్ వేయడం.. విచారణ సమయంలో గైర్హాజరు కావవడంపై మండిపడింది. కోర్టుకు నివేదించిన సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్‌కుమార్ జువైనల్ కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే లాయర్ ఏపీ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. ఇక నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్, తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. -
దోషి భార్య తరపున రబ్రీ ప్రచారం
పట్నా : మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో దోషి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా తేలిన రాజ్‌వల్లభ్ యాదవ్ భార్య తరపున నవాడా లోక్‌సభ నియోజకవర్గంలో బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. నవాడాలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రబ్రీదేవి రాజ్‌వల్లభ్ యాదవ్‌ను అక్రమంగా లైంగిక దాడి కేసులో దోషిగా ఇరికించారని, ఆయన భార్య విభాదేవిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాదవుల ప్రతిష్టను దిగజార్చేందుకు పాలకులు రాజ్‌వల్లభ్ యాదవ్‌ను కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆయన భార్య విభాదేవిని నవాడా ఓటర్లు గెలిపించాలని కోరారు. గత ఏడాది డిసెంబర్లో పట్నా కోర్టు రాజ్‌వల్లభ్ యాదవ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం కింద యాదవ్‌తో పాటు మరో నలుగురికి మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష విధించింది. నవాడా ఎంఎల్ఏ రాజ్‌వల్లభ్ యాదవ్ 2016 ఫిభ్రవరి 6న బిహార్ షరీఫ్‌లోని తన నివాసంలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా చేర్చడంతో యాదవ్‌ను ఆర్జేడీ అదే ఏడాది ఫిబ్రవరి 14న ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. -
సమాజం నా కుటుంబాన్ని వెలి వేసింది...
ముంబై : ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను...కానీ కొందరు మాత్రం పదే పదే నా గతాన్ని గుర్తు చేస్తూ వారి నేరాలకు నన్ను బాధ్యుడ్ని చేయాలిని చూస్తున్నారు...ఎందుకంటే ఇదివరకే నేను ‘గ్యాంగ్ రేప్’ కేసులో నేరస్తుడిగా శిక్ష అనుభవించాను కాబట్టి...’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ‘శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్’ నేరస్తుల్లో ఒకడైన ఆకాశ్ జాధవ్. 2013లో శక్తిమిల్స్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ నేరంలో మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడు ఏళ్ల శిక్ష అనుభవించాడు ఆకాశ్. మహాలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్న ఆకాశ్ జాధవ్ 2013, జులై 31న తన స్నేహితులతో కలిసి ఓ పద్దేనిమిదేళ్ల యువతిపై శక్తి మిల్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆకాశ్ వయసు 17 సంవత్సరాలు. దాంతో ముంబై జువైనల్ జస్టిస్ బోర్డు ఆకాశ్‌తో పాటు గ్యాంగ్ రేప్లో పాల్గొన్న మరో మైనర్ నేరస్తుడిని మూడేళ్ల పాటు ‘నాశిక్ బోర్స్టల్’ పాఠశాలకు పంపించింది. 2017, జులైలో వీరిద్దరు తమ శిక్షాకాలం ముగించుకుని బయటకు వచ్చారు. ఆకాశ్ నేరం చేసేముందు వరకూ అతని కుటుంబం మహలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తుండేది. కానీ ఆకాశ్ మీదం నేరం రుజువై, అతడు జువైనల్ హోమ్‌కు వెళ్లిన తర్వాత అతని కుటుంబం ఆ ప్రాంతంలో ఉండలేక కనైర్మార్గ్ ప్రాంతానికి వెళ్లారు. జువైనల్ హోం నుంచి బయటకు వచ్చిన ఆకాశ్ మాత్రం తాను గతంలో నివసించిన మహాలక్ష్మి ప్రాంతంలోని ‘సాత్ రస్తా’లోనే నివాసం ఉండాలని భావించి అక్కడే ఉంటున్నాడు. అక్కడ ఆకాశ్‌కు వ్యతిరేకంగా ఉండే మరి కొందరు ఆకాశ్ గతాన్ని గుర్తు చేస్తూ సూటిపోటి మాటలనడమే కాక...ఆ ప్రాంతంలో ఏ చిన్న నేరం జరిగిన ఆకాశ్‌ను అనుమానిస్తూ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా గతంలో ఆకాశ్ గ్యాంగ్‌రేప్ కేసులో జువైనల్ హోం కు వెళ్లి వచ్చాడు కాబట్టి ఈ నేరాలు కూడా చేసి ఉంటాడనే ఉద్ధేశంతో అతని మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 2017, జులై నుంచి 2018, మార్చ్ వరకూ ఆకాశ్ మీద హత్యాయత్నం, కిడ్నాప్, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి పలు నేరాలతో సంబంధం ఉన్నట్లుగా 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటి గురించి ఆకాశ్ ‘నా శత్రువులు కావాలనే నా మీద ఇలాంటి నేరారోపణలు చేస్తున్నారు. వారు పదేపదే నా గతాన్ని గుర్తు చేస్తూ నన్ను గేలి చేస్తున్నారు. నా మీద ఇంతకు ముందే రేప్ కేస్ ఉండటం వల్ల పోలీసులు కూడా వారి మాటలను నమ్ముతున్నార’న్నాడు. అంతేకాక ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటుంటే నా శత్రువులు మాత్రం నన్ను బాధపెడుతునే ఉన్నారు. వారు నా మీద అసత్య ఆరోపణలు చేస్తుండటంతో నేను వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే ఒకరిని చితకబాదాన’న్నాడు. ‘సమాజం, ఈ ప్రపంచం...నన్నువెలి వేసినా నా కుటుంబం మాత్రం నాకు అండగా ఉంది. నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించాను...కాని సమాజం మాత్రం నా కుటుంబాన్ని, నన్ను ఇంకా శిక్షిస్తూనే ఉంది. నా చెల్లికి పెళ్లి కావడంలేదు. సమాజం నా కుటుంబాన్ని వెలివేసిం’దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
రాజీవ్ హత్య కేసు: నళినీ పిటిషన్ తిరస్కరణ
చెన్నై: మాజీ ప్రధాని రాజీమ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న నళిని తన ముందస్తు విడుదల కోరుతు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని నళిని పిటిషన్లో పేర్కొంది. ఆమె అభ్యర్ధనను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శశిధరన్, ఆర్. సుబ్రహ్మణ్యన్‌ల బెంచ్ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. రాజీవ్ గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, నళిని ఎలాంటి పిటిషన్ దాఖలు చేసిన స్వీకరించవద్దని 2017 నవంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళిని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయమూర్తి రాజీవ్ శక్దేర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్‌గాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం.’అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘మోదీని లేపేస్తా’... ఆడియో క్లిప్ వైరల్
కోయంబత్తూర్ ; ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి రావటంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు మహ్మద్ రఫిక్.. 1998 కోయంబత్తూర్ పేలుళ్ల కేసు దోషి కావటం విశేషం. ఆడియో క్లిప్‌లో ఏముందంటే... సుమారు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఆ ఆడియో టేపులో రఫిక్-ప్రకాశ్ అనే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌కు నడుమ మధ్య సంభాషణ జరిగింది. వాహనాలు.. ఆర్థిక లావాదేవీల గురించి ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న తరుణంలో హఠాత్తుగా రఫిక్ మోదీ ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘అద్వానీ పర్యటన సందర్భంగా 1998లో బాంబులు పేల్చింది మేమే. ఇప్పుడు ప్రధాని మోదీని లేపేయాలని నిర్ణయించాం. నాపై బోలెడన్ని కేసులు ఉన్నాయి. వందకు పైగా వాహనాలను నేను ధ్వంసం చేశా’ అంటూ రఫిక్ మాట్లాడాడు. ఎలా బయటకు వచ్చిందో తెలీదుగానీ.. ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రఫిక్‌ను అతని స్వస్థలం కునియాముత్తూరులో అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు(కోవై) పేలుళ్ల కేసు నేపథ్యం... 1998లో బీజేపీ నేత ఎల్ కే అద్వానీ పర్యటన సందర్భంగా నిషేధిత అల్ ఉమ్మా సంస్థకు చెందిన కుంజు మహ్మద్.. అతని అనుచరులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 58 మంది మరణించగా.. సభకు ఆలస్యంగా రావటంతో అద్వానీ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. తమిళనాడు ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో రఫిక్ కూడా ఒకడు. మహ్మద్ రఫిక్ (ఫైల్ ఫోటో) -
‘లవ్ జిహాద్’ హంతకుడితో రథయాత్ర
జోధ్‌పూర్ : దేశమంతా శ్రీరామ నవమి రోజు రామున్ని పూజిస్తుంటే, కొంతమంది మాత్రం ఓ నేరస్థుడ్ని రామునిలా కొలుస్తూ వేడుకను జరుపుకున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన లవ్ జిహాద్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్రజుల్ అనే వ్యక్తిని దారుణంగా హత మార్చిన శంభు లాల్ ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్నాడు. (మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!) అయితే ఓ వ్యక్తిని శంభు లాల్ వేషధారణతో రథంపై కూర్చోబెట్టి జోధ్‌పూర్‌లో శివసేన ర్యాలీ నిర్వహించింది. సదరు వ్యక్తి చేతిలో అఫ్రజుల్‌ని చంపడానికి వినియోగించిన గోడ్డలిని కూడా ఉంచడంతో పాటు, దారి పొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై ‘హిందు మిత్రులారా మేల్కొండి. మీ ఆడబిడ్డలను కాపాడుకోండి. దేశానికి లవ్ జిహాద్ నుంచి విముక్తి కల్పించండి’ అని రాసి ఉంది. శంభు లాల్‌కు మద్ధతు తెలిపేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత హరి సింగ్ పన్వార్ తెలిపారు. ‘హిందుత్వంపై అతని నిబద్ధత నాలో స్ఫూర్తిని రగిల్చింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయటం ఈ యాత్ర ఉద్దేశం కాదు’ అని పన్వార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంతో జోధ్‌పూర్ డీసీపీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నామని.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.